సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌డీఏలో బీఆర్‌ఎస్‌ను చేర్చుకొలేదు. ఎటుకాని బీఆర్‌ఎస్‌ను పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం. ఉన్న బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు.. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.
కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారు?. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడుతుంది. బీఆర్‌ఎస్ కేఆర్‌ఎంబీపై మాట్లాడుతుంది. మాకు రాముడు, మోదీ ఉన్నారు. రజాకార్లు, ఎంఐఎం పార్టీలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైపు ఉన్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ. దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్‌లో కూడా గెలుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: పని చేయలేని వాళ్లు తప్పుకోండి
Comments
Please login to add a commentAdd a comment