సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్.. సీఆర్‌కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కనమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్‌ఎస్ చెప్పేవనీ అసత్యాలేనని ఉత్తమ్ అన్నారు.
జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది.. దానికి కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కి లేదు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు’’ అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment