సాక్షి, సూర్యాపేట జిల్లా: దేశంలోనే ఎక్కువ ధాన్యం పడించిన రాష్ట్రం తెలంగాణ అని.. 159 మెట్రిక్ టన్నులు దిగుబడి సాధించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, పాలకవర్గం సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పద్మావతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దు.. 26 నుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న మంత్రి.. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రిగా ప్రజలకు హామీ ఇస్తున్నా.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తనదేనంటూ స్పష్టం చేశారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. ఈ నెల 26 తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల రూపాయలు అందజేస్తాం. కోదాడ పట్టణం మీదుగా రైల్వే లైన్ రావటం కోసం మా సాయశక్తుల ప్రయత్నిస్తాం. జనవరి 26 న భూమిలేని రైతు కూలీలకు కూడా సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తాం’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ దొంగ దీక్ష.. ప్రజలు తిప్పి కొట్టాలి: మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, 1967 లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇది. రాష్ట్రంలో కీలకమైన పాత్ర ఉత్తమ్‌కి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం.. ప్రతి సంక్షేమ పథకం అమలుకు గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిటంటూ తమ్మల మండిపడ్డారు. ఎన్నికల హామీలో ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేస్తున్నామన్నారు. గోదావరి జలాలు పాలేరుకి వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని తమ్మల కోరారు. బీఆర్ఎస్ పార్టీ దొంగ దీక్షకి సిద్ధమౌతుంది. ప్రజలు దీక్షను తిప్పి కొట్టాలి’’ అంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: టీపీసీసీ సెర్చ్ ఆపరేషన్!
Comments
Please login to add a commentAdd a comment