సాక్షి, హైదరాబాద్: కమిషన్ల కోసమే ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో కట్టారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడానికి 1లక్ష 47 వేల కోట్లు కావాలన్నారు. కాళేశ్వరంలో 25 వేల కోట్ల పనులు ఎలాంటి డీపీఆర్ లేకుండా పనులు అలాట్ చేశారని దుయ్యబట్టారు.
బీఆర్‌ఎస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మిక్కులు చేస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు మేడిగడ్డపై నిజాలు చెప్పకుండా.. తప్పులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్లన మేడిగడ్డ పూర్తిగా నాశనం అయ్యింది. బీఆర్‌ఎస్ ఉచిత సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డను ఎన్‌డీఎస్‌ఏకు అప్పగించామని, నివేదిక ఆధారంగా భవిష్యత్ చర్యలు ఉంటాయని ఉత్తమ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామన్న ఉత్తమ్.. ఇంత అవినీతి చేసి కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment