కాంగ్రెస్‌కు పేరు రావొద్దని ప్రాజెక్టుల పేర్లు మార్చి..: మంత్రి ఉత్తమ్‌ | Minister Uttam Comments On Sitarama project At Jalasoudha | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పేరు రావొద్దని ప్రాజెక్టుల పేర్లు మార్చి.. ఖర్చు పెంచారు: మంత్రి ఉత్తమ్‌

Published Tue, Aug 13 2024 6:03 PM | Last Updated on Tue, Aug 13 2024 6:58 PM

Minister Uttam Comments On Sitarama project At Jalasoudha

సాక్షి, హైదరాబాద్‌: సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.  2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. జలసౌధ వేదికగా మంగళవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

అంనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. పదేళ్ళలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి.. నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సీతారామ ప్రాజెక్టుకురూ. 7,436 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోయారని అన్నారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు.

‘సీతారామ ప్రాజెక్టు స్థానంలో వైఎస్సార్ హాయాంలో రాజీవ్ సాగర్, ఇంధిరా సాగర్‌ల నిర్మాణం చేపట్టాం. కానీ కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, రాజీవ్, ఇంధిరా సాగర్‌లు కలిపి సీతారామ ప్రాజెక్టు అని బీఆర్ఎస్ నామకరణం చేసింది. రాజీవ్, ఇంధిరా సాగర్‌లు రూ. 3500 కోట్ల తో పూర్తయ్యేవి.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రూ. 18 వేల కోట్లకు పెంచింది. 

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, ఆయకట్టు పెరగలేదు. రాజీవ్ ,ఇంధిరా సాగర్ లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 వేల కోట్లు ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు పెడితే రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రీ డిజైనింగ్ పేరుతో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగింది. 

90 శాతం పనులు పూర్తయ్యాయని హరీష్ రావు అనడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్‌ పాలనలో కేవలం 39 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సీడబ్ల్యూసీ పర్మిషన్ మేమే తీసుకొచ్చామని హరీష్ రావు చెప్తున్నారు. కానీ ఇంతవరకు సిడబ్ల్యుసి పర్మిషన్ రాలేదు. రాజీవ్, ఇంధిరా సాగర్‌లను  మార్చి సితారామ ప్రాజెక్టు చేపట్టడమే తప్పుడు నిర్ణయం’ అని  మంత్రి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement