pump house
-
కాంగ్రెస్‌కు పేరు రావొద్దని ప్రాజెక్టుల పేర్లు మార్చి..: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. జలసౌధ వేదికగా మంగళవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. పదేళ్ళలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి.. నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టుకురూ. 7,436 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోయారని అన్నారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు.‘సీతారామ ప్రాజెక్టు స్థానంలో వైఎస్సార్ హాయాంలో రాజీవ్ సాగర్, ఇంధిరా సాగర్ల నిర్మాణం చేపట్టాం. కానీ కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, రాజీవ్, ఇంధిరా సాగర్లు కలిపి సీతారామ ప్రాజెక్టు అని బీఆర్ఎస్ నామకరణం చేసింది. రాజీవ్, ఇంధిరా సాగర్లు రూ. 3500 కోట్ల తో పూర్తయ్యేవి.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రూ. 18 వేల కోట్లకు పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, ఆయకట్టు పెరగలేదు. రాజీవ్ ,ఇంధిరా సాగర్ లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 వేల కోట్లు ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు పెడితే రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రీ డిజైనింగ్ పేరుతో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగింది. 90 శాతం పనులు పూర్తయ్యాయని హరీష్ రావు అనడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ పాలనలో కేవలం 39 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సీడబ్ల్యూసీ పర్మిషన్ మేమే తీసుకొచ్చామని హరీష్ రావు చెప్తున్నారు. కానీ ఇంతవరకు సిడబ్ల్యుసి పర్మిషన్ రాలేదు. రాజీవ్, ఇంధిరా సాగర్లను మార్చి సితారామ ప్రాజెక్టు చేపట్టడమే తప్పుడు నిర్ణయం’ అని మంత్రి మండిపడ్డారు. -
నీట మునిగిన సుంకిశాల పంప్‌హౌస్
సాక్షి, హైదరబాద్ /పెద్దవూర : సుంకిశాల వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నీటమునిగింది. సొరంగంలోకి నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్‌వాల్ ఒక్క సారిగా కుప్పకూలడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన ఉదయం 6.30 గంటలకు జరిగినా అధికారులు బయటకు పొక్కనీయలేదు. కృష్ణానదికి వరద వస్తుందని అంచనా వేయకపోవడంతోనే...డెడ్ స్టోరేజీలో ఉన్న నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద నీరు ఇప్పట్లో రాదనే ఆలోచనతోనే రెండోదశ సొరంగం పూర్తిస్థాయిలో ఓపెన్ చేసి పనులు చేపట్టినట్టు తెలిసింది. ఇంజినీర్ల అంచనాలోపంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. సాగర్ జలాశయానికి లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరు తున్న ఈ సమయంలో సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకుండా ఉండాల్సిందని నిపుణులు పేర్కొంటున్నారు. సొరంగంలోకి నీరు రాకుండా ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్, సొరంగంలో చేప డుతున్న బ్లాస్టింగ్‌కు దెబ్బతినడంతో పగుళ్లు వచ్చి వరద తాకిడికి ఒక్కసారిగా కూలిపోయిందంటు న్నారు. మరోవైపు రెండోదశ టన్నెల్లో రక్షణ గోడ వెనుక గేటు అమర్చిన అధికారులు పంప్‌హౌస్ స్లాబ్ పూర్తయిన తర్వాత దాని నుంచి గేటుకు టైబీమ్స్ నిర్మించాల్సి ఉందని, ఆ పనులు పూర్త యిన తర్వాత సొరంగాన్ని ఓపెన్ చేస్తే ఈ ప్రమా దం జరిగేది కాదని మరికొందరు అంటున్నారు. ఘటనపై గోప్యత ఎందుకు?ఘటన జరిగి వారంరోజులు గడిచినా విషయం బయటకు పొక్కకుండా అధికారులు ఎందుకు గోప్యత పాటించారనే ప్రశ్న తలెత్తుతోంది. మూడు షిఫ్టుల వారీగా కూలీలచే పనులు చేయించాల్సి ఉన్నా, రెండు షిఫ్టుల్లోనే పనులు చేపడుతున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఒక షిఫ్టు, సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు మరో షిఫ్టు చేయిస్తున్నారు. షిఫ్టు మారే సమయంలో కూలీలు అంతా బయటకు వెళుతున్న వేళ నీటి ఉధృతికి రక్షణ గోడ కూలిపోయి, గేట్లు అమర్చేందుకు సుమారు 40 అడుగులకుపైగా ఎత్తులో చేపట్టిన నిర్మాణం అంతా కూలిపోయింది. దీంతో మరో షిఫ్టులో పనికి రావాల్సిన కూలీలు ఇది చూస్తూ భయంతో కేకలు వేసినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. పనుల నాణ్యతపై అనుమానాలుపనులు పూర్తికాకముందే కాంక్రీట్ పిల్లర్లతో కూడిన నిర్మాణం పేకమేడలా కూలిపోయింది. అదే నిర్మాణం పూర్తయి మోటార్లు బిగించిన తర్వాత కూలిపోతే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. జలాశయ నీటిమట్టం 450 అడుగుల లోతుకు సమాన లోతులో తీసిన బావిచుట్టూ పెద్దరాయి ఉంది. నిర్మాణం చేసే సమయంలో కింది నుంచి పక్కనున్న రాయికి రంధ్రాలు చేసి కడ్డీలతో పిల్లర్లను జాయింట్ చేస్తూ నిర్మిస్తున్నారు. అయినా పనుల్లో నాణ్యత లేకపోవడంతోనే అంత ఎత్తులో ఉన్న నిర్మాణం వరద తాకిడికి కుప్పకూలిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారమైతే పనులు పూర్తయ్యేవి : ప్రాజెక్టు మేనేజర్ వారం రోజులైతే పనులు పూర్తయ్యేవని ప్రాజెక్టు మేనేజర్ నర్సిరెడ్డి తెలిపారు. జలాశయంలో నాలుగైదు మీటర్ల లోతు నీటిమట్టం తగ్గగానే రక్షణగోడ నిర్మించి పంప్‌హౌస్‌లో చేరిన నీటిని తొలగించే పనులు చేపడతామని చెప్పారు. విచారణకు కమిటీ ఏర్పాటు రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జలమండలిస్థాయిలో ఉన్నత ఇంజినీర్లతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారు. కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ ప్రాజెక్టు ఉద్దేశం..నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీలో ఉన్నా జంట నగరాలకు భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు 2022 మే 14వ తేదీన నాటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2035 నాటికి 47.71 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065నాటికి 67.71 టీఎంసీలు, సరిగ్గా 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనాతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్‌ను ఎమర్జెన్సీ పంపింగ్ అనే సమస్య లేకుండా నిర్మిస్తున్నారు.. సుంకిశాల పాపం బీఆర్ఎస్దే: భట్టి విక్రమార్క‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంసహా కృష్ణా ప్రాజెక్టును వదల్లేదు. మేడిగడ్డ మాదిరే సుంకిశాలను మార్చేసింది. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం మింట్ కాంపౌండ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. జూలై 2023న టన్నెల్ సైడ్‌వాల్ పూర్తి చేసింది. ఇప్పటివరకు కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అని అనుకున్నాం. మిగిలినవి బాగా ఉన్నాయని భావించాం. తీరా సుంకిశాలను చూస్తే అన్నీ నాసిరకమైనవేనని అర్థమైంది. వారు గోదావరిని మాత్రమే కాదు కృష్ణాను కూడా వదిలిపెట్టలేదు. సుంకిశాల పాపం పూర్తిగా నాటి బీఆర్ఎస్దే. సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. దోషులు ఎవరో త్వరలోనే తేలుస్తాం’ అని డిప్యూటీ సీఎం అన్నారు.సుంకిశాల అవసరం లేదని ఆనాడే కేటీఆర్‌కు చెప్పా : గుత్తా హైదరాబాద్ జంట నగరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన 1.5 టీఎంసీ సామర్థ్యం కలిగిన సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని తాను ఆనాడే అనధికారికంగా కేటీఆర్‌కు చెప్పానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. -
తప్పిన పెను ప్రమాదం.. ‘సుంకిశాల’లో అసలేం జరిగింది?
సాక్షి, నల్గొండ జిల్లా: సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కొన్ని క్షణాలు ముందైనా, ఆలస్యం అయినా భారీగా ప్రాణ నష్టం జరిగేది.పంప్ హౌస్‌లో షిఫ్ట్‌కు 115 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరిన సమయంలో హైదరాబాద్‌కు తాగునీటిని అందించడానికి సుంకిశాల పథకం చేపట్టారు. పథకంలో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు చేస్తున్నారు. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా.. సాగర్ నిండటంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కూలింది. దీంతో సొరంగం పూర్తిగా మునిగిపోయింది. నీటిలోనే క్రేన్, టిప్పర్లు, ఇతర సాంకేతిక సామాగ్రి మునిగిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నెల ఒకటినే రక్షణ గోడ కూలినా అధిక యంత్రాంగం గోప్యంగా ఉంచారు. ఆగష్టు ఒకటిన ఉదయం ఆరుగంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జలమండలి అధికారులు నీళ్లు నములుతున్నారు.అసలు అక్కడ ఏం జరగలేదన్నట్లు కప్పిపుచ్చుకునే ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. తిరిగి పనులు ప్రారంభం కావాలంటే వచ్చే వేసవి వరకు ఆగాల్సిందే. -
జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు కాళేశ్వరం పంపహౌస్ ఇంజినీర్లు
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రఘోష్ కమిషన్ కోరింది. రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్ల ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పంపహౌస్ ఇంజినీర్లను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్‌హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా అన్నిడాక్యుమెంట్లు అప్పగించాలని స్పష్టం చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి రిపోర్టులను కోరింది. మరోవైపు, పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌కు తమ ప్రతినిధిని పంపించి అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా కమిషన్ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు కమిషన్ ఇవ్వనుంది. -
అధ్వానంగా ఎత్తిపోతల పథకం
నడిగూడెం: మండల కేంద్రం సమీపాన ఉన్న సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న ఎల్–34 ఎత్తిపోతల పథకం అధ్వానంగా మారింది. మోటార్లు పని చేయడం లేదు. పైపులైన్లు దెబ్బతిన్నాయి. మేజర్, మైనర్ కాల్వలు పలుచోట్ల పూడి, కంప చెట్లమయంగా మారాయి. దీంతో చివరి భూములకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. ఈ పథకం కింద నడిగూడెం పరిధిలో దాదాపు 100 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది నీటి పారుదల శాఖ కింద అత్యవసర మరమ్మతుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు చేసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పనులు చేపట్టలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
రాత్రి వేళల్లోనే మోటార్లు రన్!
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో గత నెలలోనే ట్రయల్ రన్లు పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులు బుధవారం అర్ధరాత్రి రెండు మోటార్లతో ఎత్తిపోతలను పునఃప్రారంభించారు. గురువారం రెండో రోజు రాత్రి 9 గంటల నుంచి రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లక్ష్మీపంపుహౌస్లో 1, 2, 3 వరుస క్రమంలోని మోటార్లతో 6,600 క్యూసెక్కులు, పెద్దపల్లి జిల్లాలోని సరస్వతీ పంపుహౌస్‌లో 2 మోటార్లతో 6 వేల క్యూసెక్కులు, పార్వతీ బ్యారేజీలో రెండు మోటార్లతో 5,800 క్యూసెక్కులు తరలిస్తున్నట్లు ఈఎన్సీ తెలిపారు. కాగా, రాత్రే మోటార్లు నడిపిస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుందని.. డిమాండ్ కూడా తక్కువగా ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రోజూ రాత్రి పూటనే మోటార్లు నడిపించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు ఈఎన్సీ తెలిపారు. ప్రస్తుతం గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 9 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీల సామర్థ్యానికి 13.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతీ బ్యారేజీలో 10.87 టీఎంసీ సామర్థ్యానికి 9.20 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడానికి రాత్రిపూట అనుకూలంగా ఉండడంతో రాత్రి 9 గంటల నుంచి 10 మధ్య అరగంటకు ఒక్క మోటార్‌ను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. వారి వెంట ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్, ఏఈఈలు భరత్, వంశీరెడ్డి, రాజేంద్రప్రసాద్‌లు ఉన్నారు. -
లక్ష్మీ పంపుహౌస్‌లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత
కాళేశ్వరం: భారీ వర్షాలు, గోదావరి వరదతో నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్లు పైకి తేలాయి. నిజానికి పంపుహౌస్ నీట మునిగినప్పటి నుంచీ మీడియాను, బయటి వ్యక్తులెవరినీ అనుమతించ డం లేదు. పరి స్థితి ఏమిటన్న ది గోప్యంగా ఉంచారు. అయి తే మోటార్లు, పంపులు నీటి లోంచి బయటికి తేలిన, దెబ్బతిన్న వీడి యోలు గురువారం బయటికి వచ్చాయి. అధికారులు ఈ నెల 6వ తేదీ నాటికి నీటిని తోడేసే పని పూర్తయిందని, బురద తొలగింపు, క్లీనింగ్ పనులు చేస్తున్నారని తెలిసింది. అతి భారీ వరదతో.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత నెల 14న గోదావరి, ప్రాణ హిత నదులు ఉగ్రరూపం దాల్చి.. కాళేశ్వరం వద్ద 16.90 మీటర్ల ఎత్తులో, 28.90 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం నమోదైన విషయం తెలిసిందే. దీనితో అప్రోచ్ కెనాల్ నుంచి వచ్చిన వరద హెడ్ రెగ్యులేటరీ గేట్ల లీకేజీ కారణంగా ఒక్కసారిగా ఫోర్‌బేకు చేరింది. ఈ ఒత్తిడికి ఫోర్‌బే రిజర్వాయర్‌కు, పంపుహౌస్‌కు మధ్య ఉన్న బ్రెస్ట్ వాల్ (రక్షణ గోడ) కూలిపోయి మోటార్లు, పంపులపై పడింది. అదే సమయంలో పైన బరువులు ఎత్తేందుకు అమర్చిన 220 టన్నుల బరువైన రెండు ఈఓటీ క్రేన్లు, రెండు లిఫ్ట్‌లు, రెండు ఫుట్‌పాత్ ఐరన్ నిచ్చెనలు విరిగిపడ్డాయి. దీంతో ఆరు మోటార్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఈ మోటార్లను విదేశాల నుంచి ఆయా సంస్థల ఇంజనీర్లు వచ్చి పరిశీలించాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్ల స్థానంలో కొత్తవి అమర్చాలని.. మిగతా వాటికి మరమ్మతులు అవసరమని రాష్ట్ర ఇంజనీర్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక వరదలు తగ్గుముఖం పడితే రక్షణ గోడ నిర్మాణానికి అనువుగా ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారని.. రక్షణ గోడను పంపుహౌస్ పొడవునా నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. -
Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్‌లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్‌లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్‌లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్‌కుమార్ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎవరూ సరిగా అంచనా వేయలేదు వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. -
హైదరాబాద్‌కు నీటి కొరత.. పంప్‌హౌస్‌లకు ముంపు ముప్పు
సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి తరలించేందుకు అందుబాటులో ఉన్న పంప్‌హౌస్‌లకు ముంపు ముప్పు పొంచి ఉంది. రాజధానికి సుమారు 110 కి.మీ దూరంలో.. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి కృష్ణా జలాలు, గ్రేటర్‌కు సుమారు 185 కి.మీ దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి జలాలను గ్రేటర్ నగరానికి తరలిస్తున్నారు. ఈ జలాలను తరలించేందుకు మార్గమధ్యలో పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలు సుమారు 20 వరకు ఉన్నాయి. వీటి వద్ద తరచూ సాంకేతిక సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతుండడం గమనార్హం. తాజాగా గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్న మల్లారం పంప్‌హౌస్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో 9 పంపులు నీట మునిగాయి. రెండు రోజులపాటు నగర తాగునీటి సరఫరాకు ఇక్కట్లు తప్పలేదు. ఈ నేపథ్యంలో పలు పంపుహౌస్‌లకు ముంపు కష్టాలు వెంటాడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: పాము కాటు విషపూరితమైనదా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ముందు జాగ్రత్త చర్యలే కీలకం.. ► గ్రేటర్ సిటీకి మంజీరా, సింగూరు జలాలను పరిమితంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో జంట జలాశయాలు, కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ఈ జలాశయాల నుంచి నిత్యం జలమండలి 430 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సేకరించి శుద్ధి చేసి నగరవ్యాప్తంగా సుమారు పది లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. ► ఈ నీటిని సిటీకి తరలించేందుకు జలమండలి భగీరథ ప్రయత్నాలే చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించేందుకు పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. నీటిని పంపింగ్ చేసేందుకు ప్రత్యేక విద్యుత్ ఫీడర్లున్నాయి. పంప్‌హౌస్‌లలో తరచూ మోటార్లు మొరాయించడం, ప్రత్యేక ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ సరఫరా ఆకస్మికంగా నిలిచిపోతోంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. చదవండి: అసత్య ప్రచారం, బెదిరింపులు: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు ► తరచూ సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పక్షంలో.. సిటీలో సుమారు 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫీడర్లు, మోటార్లు, పంప్‌హౌస్‌ల నిర్వహణను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ► తాజాగా మల్లారం పంప్‌హౌస్ నీట మునిగేందుకు సమీపంలో ఉన్న పల్లె చెరువు వరద నీరే కారణమవడంతో పంప్‌హౌస్ చుట్టూ పెద్ద పరిమాణంలో ప్రహరీ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇదే తరహాలో భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు జలాశయాలు, ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాల చుట్టూ ఎత్తైన, పటిష్టమైన ప్రహరీలు నిర్మించాల్సి ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచిస్తున్నారు. కొనసాగుతున్న మరమ్మతులు.. గ్రేటక్కు గోదావరి జలాలను తరలించే మల్లారం పంప్ హౌస్ నీట మునగడంతో జలమండలి అధికారులు మరమ్మతులు ముమ్మరం చేశారు. నీట మునిగిన 9 పంపుల్లో బుధవారం నాలుగింటికి మరమ్మతులు చేపట్టి నీటిని పంపింగ్ చేశామని..మరో 5 పంపులకు మరమ్మతులను గురువారం నాటికి పూర్తి చేస్తామని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి జలాల లభ్యత తగ్గిన కారణంగా సింగూరు, మంజీరా, జంట జలాశయాల నుంచి నగర అవసరాలకు అదనంగా తాగునీటిని సేకరిస్తున్నామని.. కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. -
డీఎస్ఎస్ ఆధారంగా ‘కాళేశ్వరం’ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లు, జలాశయాలు, కాలువలను సమర్థవంతంగా నిర్వహించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడానికి ప్రభుత్వం సంకల్పించిందని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డెసిషన్ సపోర్టు సిస్టం (డీఎస్ఎస్)పై బుధవారం జలసౌధలో ఒక రోజు వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ ప్రాజెక్టు నిర్వహణ కోసం సమగ్ర సమాచారం ఈ సపోర్ట్ సిస్టమ్‌లో అందుబాటులో ఉం టుందని, ఆ సమాచారం ఆధారంగా పంప్‌హౌస్‌లు, జలాశయాలు, కాలువల నిర్వహణ సాధ్యం అవుతుందని తెలిపారు. జలాశయాల్లో ఎంత నీరు ఉన్నది, ఆయకట్టుకు ఎంతనీరు అవసరం, భూగర్భ జలాల పరిస్థితి, వర్షపాతం, నదుల ద్వారా ఎంత పరిమాణంలో నీరు వస్తోంది.. తదితర సమస్త సమాచారం ఈ సిస్టమ్ ద్వారా అందుబాటు లోకి రానుందని వివరించారు. ఈ అత్యాధునిక వ్యవస్థను తయారు చేయడానికి వాసర్ ల్యాబ్స్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఈ సిస్టమ్‌కు అవసరమయ్యే సాఫ్ట్వేర్లను, మొబైల్యాప్ లను తయారు చేయడంతోపాటు ఐదేళ్లు వారే నిర్వహిస్తారని, సాగునీటి శాఖ ఇంజనీర్లకు ఈ సాఫ్ట్వేర్ నిర్వహణ, వినియోగంపై శిక్షణ కూడా ఇస్తారని ఈఎన్సీ పేర్కొన్నారు. బుధవారం నుంచి మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారని, ఈ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వినియోగంలో ఉందని వెల్లడించారు. ఈ వ్యవస్థ కాళేశ్వరం లాంటి అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజనీర్లకు ఎంతో తోడ్పాటునందిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ తన కార్యాలయం నుంచే ఈ సపోర్ట్ సిస్టమ్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంజనీర్లకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. -
‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు షురూ
కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో బుధవారం రాత్రి ఆరు మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. మే 11వ తేదీన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో మోటార్లను నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్ బే వరకు నీరు నిల్వ అయింది. వరద కూడా పెరుగుతుం డటంతో లక్ష్మీ పంపుహౌస్‌లోని 11 మోటార్లలోని ఆరు మోటార్లను ఆన్ చేయగా.. 12 పంపుల ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీరు ఎత్తిపోస్తోంది. ఈ నీరు 13.41 కిలోమీటర్ల దూరంలోని అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలుతోంది. రాత్రిలోగా మిగిలిన మోటార్లను ఒకేసారి నడిపించనున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో మోటార్లు ఆన్ చేయడం ఇదే ప్రథమం కావడంతో ఎస్ఈ, డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పంపుహౌస్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ కాంతులతో జిగేల్ కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్ల ద్వారా నీరు డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి. దీంతో సిస్టర్న్‌కు రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో నీరు రంగు రంగులుగా మారి జిగేల్‌మంటోంది. -
‘పవర్’కు పంప్‌హౌస్‌లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని చెప్పారు. అవసరమైతే వెయ్యి కొత్త పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. నీటి పారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్ రిసో ర్సెస్ డిపార్ట్మెంట్)గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఎత్తిపోతల పథకాల అన్ని పంప్‌హౌస్‌ల నిర్వహణను విద్యుత్ శాఖకు అప్పగించా లని సీఎం కీలక సూచన చేశారు. జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థితికి తగ్గట్టుగా జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదాను సీఎంకు అందిం చారు. ఈ ముసాయిదాపై సీఎం చర్చించారు. మొత్తంగా గోదావరి నుంచి ప్రతిరోజూ 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు లిఫ్టు చేసి, రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సీఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచిం చారు. ముసాయిదాకు కొన్ని మార్పులు చెప్పారు. అధికారులు మరోసారి వర్క్‌షాపు నిర్వహించుకుని సూచించిన మార్పులకు అనుగుణంగా పునర్వ్యవసీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్ సీలు మురళీధర్‌రావు, నాగేందర్రావు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, హరేరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, పలువురు సీఈలు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. ►ఎంతో వ్యయంతో, ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అలా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. దీనికి తగ్గట్టుగా జల వనరుల శాఖ సంసిద్ధం కావాలి. ►జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలి. ఇఇలు, డిఇల పరిధిలను ఖరారు చేయాలి. ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్ డ్యాములు, సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి. ►సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో ఖచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున, సీఈ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కావాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి. ►పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఈఎన్సి నుంచి లష్కరు వరకు ఎంతమంది సిబ్బంది కావాలి? ప్రస్తుత ఎంతమంది ఉన్నారు? అనే విషయాల్లో వాస్తవిక అంచనాలు వేయాలి. ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఈఎన్సిలు ఉండాలనే విషయం నిర్ధారించాలి. ఈఎస్‌సి జనరల్, ఈఎస్‌సి అడ్మినిస్ట్రేషన్, ఈఎస్‌సి ఆపరేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ►ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఇలా ప్రతీచోటా ఖచ్చితంగా ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలి. దానికి అనుగుణంగానే నిర్వహణ జరగాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలి. ►అన్ని పంప్ హౌజుల నిర్వహణ బాధ్యత విద్యుత్ శాఖకు అప్పగించాలి ►ఉపాధి హామీ పథకం ద్వారా సాగునీటి రంగంలో ఏఏ పనులు చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాలి. ►ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్టు హౌజులు నిర్మించాలి. సీఈలకు తమ పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలి. -
‘సీతారామ’ పంపులకు మోక్షం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల సద్వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేయాల్సిన పంపులు, మోటార్ల రాకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చైనా నుంచి రావాల్సిన ఈ మోటార్లు, పంపులు ప్రస్తుత కరోనా సడలింపుల నేపథ్యంలో అక్కడి నుంచి కదిలాయి. వీటి షిప్పింగ్ ఇప్పటికే మొదలవగా, ఆగస్టు నాటికి అవి రాష్ట్రానికి చేరుతాయని ప్రాజెక్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మార్చి నాటికి వీటి ఏర్పాటును పూర్తి చేయనున్నారు. ఇప్పటికే 9 నెలలు ఆలస్యం... సీతారామ ఎత్తిపోతలను ఈ వర్షాకాలానికి ముందే సిద్ధం చేసేలా ప్రభుత్వం ముందునుంచీ ప్రణాళికలు రచించింది. అయితే పనులు వేగిరం అయిన సమయంలోనే మార్చి నుంచి కరోనా ప్రభావం పడటం, చైనా నుంచి రావాల్సిన మిషినరీ రాకపోవడంతో పెను ప్రభావం చూపింది. ప్రాజెక్టు మూడో పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేయదలిచిన 30 మెగావాట్ల మూడు పంపులు, మోటార్లు, 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మరో ఐదు పంపులు చైనాలోని షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి కొన్ని మరికొన్ని బీజింగ్, వూహాన్ నుంచి రావాల్సి ఉంది. ఈ పంపులు, మోటార్లు మార్చి నెలలోగానే రాష్ట్రానికి రావా ల్సి ఉన్నా ఫిబ్రవరి నెలాఖరు నుంచే షాంఘై, వూçహాన్‌లో లాక్డౌన్ నేపథ్యంలో పోర్టు ల ద్వారా వీటి తరలింపు నిలిచిపోయింది. మార్చి నెలలోనే ఈ పంపుల పరిశీలనకు ఇంజనీర్ల బృందం చైనా వెళ్లాల్సి ఉన్నా, వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాటిని పరీక్షించకుండానే రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మూడో పంప్‌హౌస్‌లోని మోటార్లు ఒక్కటీ సిద్ధం కాలేదు. అయితే ఇటీవల చైనాలో కొంత పరిస్థితి మెరుగవడంతో ఈ మోటార్ల తరలింపు ప్రక్రియ మొదలైందని, ఆగస్టు నాటికి రాష్ట్రానికి చేరతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పంప్‌హౌస్ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీకి చెప్పగా, అక్కడ ఆమోదం లభించింది. ఇక మొదటి పంప్‌హౌస్‌లో 6 మోటార్లకు మూడు సిద్ధమయ్యాయి. మరొకటి వారం పది రోజుల్లో పూర్తి కానుండగా, మిగతావి మరో నెల పట్టే అవకాశం ఉంది. అయితే వీటికి డ్రైరన్ నిర్వహించే దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. ఇక్కడి పనులన్నీ డిసెంబర్‌నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు అధికారులు ఎస్ఎల్ఎస్సీ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇక రెండో పంప్‌హౌస్‌లోనూ 6 మోటార్లు ఉండగా, ఇక్కడ రెండు సిద్ధమయ్యాయి. ఈ పనులు డిసెంబర్ నాటికే పూర్తికానున్నాయి. కార్మికులు లేక నెమ్మదించిన పనులు ఈ రెండు పంప్‌హౌస్‌ల పరిధిలో పనిచేస్తున్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో ఫిట్టింగ్, కాంక్రీట్, వెల్డింగ్, షట్టరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులన్నీ నెమ్మదించాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వలసకార్మికులను ఇప్పుడు తిరిగి రప్పించేలా ఏజెన్సీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
బాహుబలులన్నీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని గాయత్రి (ప్యాకేజీ–8) పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్ల న్నింటికీ పరీక్షలు పూర్తయ్యాయి. నిర్ణీత రెండు టీఎంసీల మేర గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా గాయత్రి పంపింగ్ కేంద్రం సిద్ధమైంది. అతితక్కువ సమయం లో పంపింగ్ కేంద్రాన్ని నిర్మించ డంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కొత్త రికార్డు సృష్టించింది. ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, దాని దిగువన గాయత్రి పంప్‌హౌస్‌లో మోటార్ల సామర్థ్యం మరో 15 మెగావాట్ల మేర ఎక్కువగా అంటే 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా 7 మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఒక్కో మోటారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులుగా ఉంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొదటి పంప్‌హౌస్‌కు ఈ ఏడాది ఆగస్టు 11న మొదటి మోటార్‌ను ప్రారంభిం చగా, అదేనెల 14న రెండు, 20న మూడు, 31న నాలుగు, సెప్టెంబర్ 18న ఐదు, అక్టోబర్ 19న ఆరు మోటార్లను ప్రారంభించారు. శనివారం మిగిలిన ఏడో మోటార్‌ను ఈఎన్ సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథ కాల సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మోటార్ దిగ్విజయంగా నడవడంతో ఇక్కడ నూటికి నూరు శాతం మోటార్లన్నీ సిద్ధమైనట్లయింది. నెలాఖరుకు పూర్తి స్థాయిలో.. ఇక ఇప్పటికే లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి(అన్నారం)లలో మోటార్లు వెట్రన్లు పూర్తి చేసుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్ సంస్థే పూర్తి చేసింది. ఇక సుందిళ్ల (పార్వతి)లో తొమ్మిది మోటార్లలో ఎనిమిది మాత్రమే సిద్ధమయ్యాయి. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో మరో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించాల్సి ఉండగా, దానికి నెలాఖరున పూర్తి చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే తొలిదశలో కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లే. -
బాహుబలి మూడో మోటార్ వెట్‌రన్
రామడుగు (చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపూర్ గ్రామ గాయత్రి పంపు హౌస్‌లోని బాహుబలి మూడో విద్యుత్ మోటారుకు శనివారం సాయంత్రం అధికారులు వెట్‌రన్ నిర్వహించారు. సాయంత్రం 6.18 గంటలకు మోటార్‌ను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోశారు.పంపుహౌస్‌లో ఏడు బాహుబలి విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేయగా..ఇప్పటికే 1, 2, 4, 5, 6 మోటార్లను వెట్‌రన్ విజయవంతంగా చేశారు. తాజా మరో మోటారు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించారు.దీంతో ఆరు మోటార్ల వెట్‌రన్ పూర్తయింది.చివరి మోటారు వెట్‌రన్‌కు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ పాల్గొన్నారు. -
కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కన్నెపల్లి పంపుహౌస్‌లో మళ్లీ 2 మోటార్లను అధికారులు ప్రారంభించారు. 4 రోజులుగా ఆటోమోడ్ పద్ధతిలోకి మార్చడానికి మోటార్లకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం 3, 4 నంబర్ల మోటార్లు డెలివరీ సిస్టంలో నీటిని ఎత్తిపోశాయి. కన్నెపల్లిలో 2, 7, 8 మోటార్లకు కూడా వెట్‌రన్ నిర్వహిస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్ల ను మూసివేశారు. 4 రోజుల క్రితం వరద ఉధృతి పెరగడంతో ఇంజనీరింగ్ అధికారులు 8 గేట్లు ఎత్తారు. వరద ఉధృతి తగ్గుతుండడంతో రెండేసి చొప్పున గేట్లు మూస్తూ వచ్చారు. బ్యారేజీ వద్ద 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 7 టీఎంసీలు నిల్వ ఉంది. అన్నారం బ్యారేజీలో 4 రోజులుగా మోటార్లు నిలిపివేశారు. ఆదివారం కన్నెపల్లిలో 2 మోటార్లు నడపడంతో మళ్లీ గ్రావిటీ కాల్వ నుంచి నీటిని తరలించారు. దీంతో అన్నారం బ్యారేజీలోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 5.8 టీఎంసీల నీరునిల్వ ఉంది. -
నెక్ట్స్.. బాహుబలే
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ పరిశీలనకు శ్రీకారం చుట్టిన రాష్ట్రప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రామడుగు పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అత్యంత పెద్దవైన బాహుబలి మోటార్లకు వెట్‌రన్ నిర్వహించే పనుల జోరుపెంచింది. జూన్ మొదటి వారంలో రామడుగు పంప్‌హౌస్‌లోని 139 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే బాహుబలి మోటార్లకు వెట్‌రన్ నిర్వహించి పరిశీలన చేయాలని ఇంజనీర్లు ఇప్పటికే షెడ్యూల్ నిర్ణయించారు. అయితే దానికన్నా ముందే.. ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏడింట్లో ఐదు సిద్ధం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లకు వెట్‌రన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఒక పంప్ వెట్‌రన్ విజయవంతం కావడంతో గురువారం మరో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించారు. ఇదీ విజయవంతం కావడంతో సాయంత్రం మొదటి, రెండో మోటార్లకు కలిపి ఒకేసారి వెట్‌రన్ నిర్వహించారు. మిగతా మోటార్లకు ఇదే విధంగా పరిశీలన చేయనున్నారు. తొలిరెండు రోజులపాటు చేపట్టిన ప్రక్రియ సజావుగా సాగడంతో ఇంజనీర్లు ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనుల పూర్తి, ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్ల వెట్‌రన్ పనులపై దృష్టి పెట్టారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులు, రైతులు సాధారణంగా 5 హెచ్‌పీ మోటార్లను వినియోగిస్తారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌లో ఉపయోగించే ఒక్కో మోటారు సుమారు 37వేల హెచ్‌పీ మోటార్లతో సమానం. ఏడు మోటార్లు ఉండే ఒక్కో పంప్‌హౌస్ ఏకంగా 2.60 లక్షల హెచ్‌పీ మోటార్లతో సమానంగా ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. మరో రెండింటిని మే నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. సిద్ధమైన 400కేవీ సబ్‌స్టేషన్ వీటికి కరెంట్‌ను సరఫరా చేసేందు కు 400 కేవీ విద్యుత్ సబ్ స్టేసన్ ఇప్పటికే సిద్ధమైంది. అయితే మోటార్లకు వెట్‌రన్ నిర్వహించాలంటే అంతకు ముందు ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కి.మీ. జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. టన్నెల్ తవ్వకపు పనులు ఇప్ప టికే పూర్తి కాగా కేవలం 840 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులు వచ్చే నెల్లో పూర్తి కానున్నాయి. ఈ పనులు ముగిసిన వెంటనే జూన్ మొదటి వారంలో నంది మేడారం రిజర్వాయర్‌లో చేరిన నీటితో ప్యాకేజీ–8లోని సర్జ్‌పూల్‌ని నింపనున్నారు. 2కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న సర్జ్‌పూల్‌లో లీకే జీలు పరిశీలించిన అనంతరం జూన్‌లో మోటార్ల వెట్‌రన్ నిర్వ హించేందుకు అధికారులు సన్నా హాలు చేస్తు న్నారు. భూగర్భంలో 330 మీటర్ల దిగువన నిర్మించిన ఈ పంప్‌హౌస్‌లో మోటా ర్లను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నెల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గురువారం ప్యాకేజీ–8లో మోటార్ల ఏర్పాటు పనులను ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు పరిశీలించారు. మే నెలాఖరు కల్లా టన్నెల్ సహా మిగతా నిర్మాణ పనులను పూర్తి చేసి జూన్ మొదటి వారానికి వెట్ రన్‌కు అంతా సిద్ధం చేయాలని ఇంజనీర్లకు ఆదేశా లిచ్చారు. ఈ మోటార్ల ద్వారా నీరు మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు చేర నుంది. మిడ్‌మానేరు కింద కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించే పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. -
ఆగస్టు 10న మోటార్ల డ్రైరన్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మి స్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్ మోటార్లకు డ్రైరన్ (బిగించిన మోటార్ల పనితీరు పరిశీలన) ఆగస్టు 10న నిర్వహించనున్నా రు. దీనిని పరిశీలించేందుకు మంత్రి హరీశ్‌రావు వస్తారని సమాచారం. ఆగస్టు చివరికల్లా స్టార్టర్లు, రోటార్లు బిగించి మోటార్ల ద్వారా నీటిని తరలించనున్నారు. రూ.2,826 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనుల్లో మొత్తం 11 శక్తివంతమైన మోటార్లను బిగించనున్నా రు. వాటిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా 13.2 కి.మీ. దూరంలోని అన్నారం బ్యా రేజీ వరకు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలిస్తారు. వేగవంతంగా మోటార్ల బిగింపు ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ నెలలో 10 రోజుల పాటు వర్షాల కారణంగా పనులు నిలిచిపోవడంతో మోటార్ల బిగింపు ఆలస్యమైంది. ఇప్పటికే ఫిన్లాండ్, ఆస్ట్రియా దేశాల నుంచి స్టార్టర్, రోటార్లు పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. ఒక్కో మోటారుకు 40 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఆగస్టు 10 వరకు రెండు లేదా 3 మోటార్లను బిగించి డ్రైరన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పంప్‌హౌస్‌లో డ్రాప్ట్‌ట్యూబ్, సైప్రల్ కేసింగ్ ఎరక్షన్ పూర్తయిందని, ఇంపెల్లర్, షాఫ్ట్ బిగింపు పనులు జరుగుతున్నాయని ఇంజనీర్లు తెలిపారు. స్టార్టర్లు, రోటార్లు బిగిస్తే మొదటి మోటార్ బిగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. కన్నెపల్లిలో రూ.220 కోట్ల వ్యయంతో 220/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో సబ్‌స్టేషన్ ఎరక్షన్ పూర్తి అవుతుందని ఇంజనీర్లు తెలిపారు. -
పోతారం పంప్‌హౌస్ ప్రారంభం
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండల పరిధిలోని పోతారం పంప్‌హౌస్‌ను చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోక, నీరులేక మూలకు పడ్డ పోతారం చెరువుకు నీరు ఇవ్వడం టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పతనమన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు గురించి, ఈ ప్రాంత ప్రజల బాధను సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగానే,, వారు పోతారం పూర్తి చేయాలని అధికారులకు ఆదే«శాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌వారు టీఆర్ఎస్ చేసే మంచి పనులకు ఎప్పుడూ అడ్డుపడుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సింగిల్‌విండో చైర్మన్ పునుగోటి కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్, బొట్ల ప్రసాద్, కుంట కృష్ణవేణి, సమిరిశెట్టి విమల పాల్గొన్నారు. -
పంప్‌హౌస్‌లను పరిశీలించిన ‘నేహాల్’
మంథని/రామగుండం: నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్ చిన్నారి నేహాల్ శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి, కాళే శ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని డివిజన్లో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్‌లను సందర్శించారు. తన తల్లిదండ్రులు రజని–హనుమంతరావు, ఇంజనీరింగ్ అధికారులకు కలసి వచ్చిన నేహాల్ తొలుత గోలివాడలో పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ‘‘ఎల్లం ప్రాజెక్టు ఇదే నా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించారు కదా.? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయికి ఆధారం. దీని కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది కదా’అంటూ టక..టక వివరాలు చెప్పారు. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్ చూశాడు. మధ్యమానేరు నీటినిల్వ సామర్థ్యం ఎంతా? అని అని తల్లి రజని ప్రశ్నించగా 32 టీఎంసీలు అని వివరించాడు. సుందిళ్ల బ్యారేజీ కాంట్రాక్ట్ పనులు ఎవరు దక్కించుకున్నారని అడగ్గా నవయుగ కంపెనీ అని చెప్పాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విన్నదానికంటే ఇక్కడి వచ్చిచూస్తే షాక్ గురయ్యానని.. తాతయ్య కేసీఆర్ డిజైన్ చేసినట్లు కోటి ఎకరాల కు సాగునీరు అందడం ఖాయమన్నారు. చిన్నారి వెంట లైజనింగ్ ఆఫీసర్ ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు బండ విష్ణుప్రసాద్, నరేశ్ తదితరులున్నారు. -
పంప్‌హౌస్‌లో సెక్యూరిటీ గార్డు గల్లంతు
నందికొట్కూరు: హంద్రీనీవా పంప్‌హౌస్–2లో సెక్యూరిటీ గార్డు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నందికొట్కూరు పట్టణానికి నాగేంద్ర అలియాస్ ఏసేపు(26) హంద్రీనీవా–2లో రెండేళ్ల నుంచి సెక్యూరిటీగార్డు పని చేస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు అడ్డాకుల నాగేశ్వరరావు, పుల్లమ్మ మృతి చెందారు. ఆదివారం..యువకుడు పంప్‌హౌస్‌లో గల్లంతు కావడంతో హెచ్ఎన్ఎస్ఎస్(హంద్రీనీవా సుజల స్రవంతి) సిబ్బంది, ఎస్ఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని ఉదయం వరకూ ఏమీ తేల్చలేమని ఎస్ఐ తెలిపారు. -
భూములిచ్చి అడుక్కతినమంటారా..!
కన్నేపల్లిలో పంప్‌హౌస్ సర్వేను అడ్డుకున్న రైతులు కాళేశ్వరం: .మహదేవపూర్ మండలం కన్నేపల్లి గ్రామంలో మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన ప్రధానపంప్హౌస్ నిర్మాణం కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే చేయగా.. రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు, అధికారులకు స్వల్వ వాగ్వాదం నెలకొంది. ప్రాజెక్టులకు తమ భూములిచ్చి అడుక్కతినమంటారా.. అంటూ అధికారులను నిలదీశారు సర్వేనంబర్ 74లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రైతుల నుంచి 48ఎకరాల అసైన్డ్ భూమిని భూసేకరణ కింద తీసుకున్నారన్నారు. మళ్లీ అదే సర్వే నంబర్లో పంప్‌హౌస్ నిర్మాణం కోసం 76ఎకరాల భూమిని మంగళ, బుధవారాల్లో సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో వారు వెనుదిరిగివెళ్లారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ మనోహర్ కరీంనగర్ నుంచి కన్నేపల్లికి చేరుకున్నారు. భూనిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు 48ఎకరాల్లో వివరాలు తప్పుల తడకగా సర్వే చేశారని, రీసర్వే చేయాలని రైతులు పట్టుబట్టారు. ఆయన స్పందించి అధికారులతో రీ సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని రైతులు కోరారు. అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.3లక్షల2వేలు అందిస్తామని మనోహర్ చెప్పగా.. రైతులు ససేమీరా అంటూ వెనుదిరిగారు. తహసీల్దార్ జయంత్, ఇరిగేషన్ అధికారులు ఓంకార్‌సింగ్, ప్రకాశ్, వెంకటరమణ, రిటైర్డ్ తహసీల్దార్ రవీందర్, ఆర్ఐ కృష్ణ, సర్వేయర్ వసియోద్దీన్, మెగా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్, ఉపసర్పంచి మల్లారెడ్డి, మాజీ సర్పంచి చిన్న మల్లారెడ్డి ఉన్నారు. -
జఠిలం
♦ తాగునీటికి తాండూరు జనం విలవిల ♦ ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలో నీటి ఎద్దడి ♦ రెండు మూడు రోజులకోసారి సరఫరా ♦ చేతిపంపుల వద్ద మహిళల పాట్లు కాగ్నా ఎండిపోయింది. పంపుహౌస్‌ల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. ఎన్నడూ లేనంతగా విపత్కర పరిస్థితులు ఈసారి నెలకొన్నాయి. తాండూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. బిందెడు నీటి కోసం చేతిపంపుల వద్ద మహిళలు యుద్ధాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు నీటి కోసం పరుగులు తీస్తున్నారు. ప్రతి బొట్టును జాగ్రత్తగా వాడుకుంటున్నా.. కుటుంబానికి సరిపడా నీళ్లు అందడం లేదు. ఇక చేతి పంపుల వద్ద భారీ క్యూలు నిత్యకృత్యం. మున్సిపాలిటీ అధికారులు రెండు బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నందున మరికొన్ని బోర్లు వేసి అదనపు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. - తాండూరు కాగ్నా నదిలో భూగర్భజలాలు అడుగంటంతో రెండు పంప్‌హౌస్‌లో నీటి మట్టాలు తగ్గాయి. దాంతో ప్రస్తుతం రోజుకు 2.5 ఎంఎల్డీ నీటినే సరఫరా చేస్తున్నారు. రూ.25 లక్షల కరువు నిధుల నుంచి తాండూరులోని లారీ పార్కింగ్, అంబేద్కర్ పార్కు వద్ద బోర్లు వేశారు. నీళ్లు పడ్డాయి. రెండు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కానీ అందరికీ తాగునీరు అందని పరిస్థితి. తాండూరు : కరువు ధాటికి కాగ్నా ఖాళీ అయిపోయింది. భూగర్భజలాలు ఇంకిపోయాయి.. పంపుహౌస్‌ల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. ఎన్నడూ లేనంతంగా విపత్కర పరిస్థితులు నెలకొనడంతో తాండూరు పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. రెండు, మూడు రోజులకోసారి తాగునీటి సరఫరాతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. చేతిపంపుల వద్ద మహిళలు గంటల తరబడి నిరీక్షిస్తూ పాట్లు పడుతున్నారు. చిన్నపిల్లలు, మగవారు సైతం చేతిపంపుల నుంచి బిందెలతో నీళ్లు మోస్తుండడం నీటి ఎద్దడి తీవ్రతకు నిదర్శనం. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఆదేశాలతో అధికారులు రెండు చోట్ల బోర్లు వేశారు. రెండు ట్యాంకర్ల ద్వారా అత్యవసరమైన వార్డుల్లో నీటి సరఫరా చేస్తున్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉండడంతో మరికొన్ని బోర్లు వేసి, అదనపు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చేతింపులపై ఆధారం.. తాండూరు పట్టణంలోని చేతిపంపులపైనే జనాలు ఆధారపడ్డారు. 260 చేతిపంపులు ఉండగా 30 శాతం పని చేయడం లేదు. కొన్ని చోట్ల అధికారులు చేతిపంపులకు ఫ్లషింగ్ చేశారు. చేతిపంపుల వద్ద బిందె నీటి కోసం మహిళలతో పాటు చిన్న పిల్లలు, మగ వారుసైతం వద్దకు బిందెలతో పరుగులు తీస్తున్నారు. పట్టణంలోని హమాలీబస్తీ, గాంధీనగర్, ఇందిరానగర్, శాంతినగర్, గొల్లచెరువు తదితర ప్రాంతాల్లో చేతిపంపులను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 2.5 ఎంఎల్‌డీలే సరఫరా తాండూరు పట్టణంలో మొత్తం 31 వార్డుల్లో 65 వేలకు పైగా జనాభా ఉంది. మొత్తం 7 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కాగ్నా నది ఆధారంగా తాండూరువాసులకు రోజుకు సుమారు 6.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీరు సరఫరా జరిగేది. నదిలో భూగర్భజలాలు అడుగంటంతో రెండు పంప్‌హౌస్‌లో నీటి మట్టాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం రోజుకు 2.5 ఎంఎల్డీ మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. దీంతో తాగునీటికి కటకట ఏర్పడింది. రెండు, మూడు రోజులకొకసారి నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి. అదీ అరకొరగానే. చేతిపంపుల వద్ద నిరీక్షణ చేతిపంపుపైనే నీళ్ల కోసం ఆధారపడ్డాం. గంటలపాటు నీటి కోసం పడిగాపులు పడుతున్నాం. నల్లా నుంచి నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. పార్కు వద్ద ఉన్న చేతిపంపు పాడైంది. రెండో చేతిపంపు సరిగా పని చేయడం లేదు. అధికారులు మా ప్రాంతంలో బోరు వేసి సమస్య పరిష్కరించాలి. - నర్మదా, హమాలీబస్తీ మరికొన్ని చోట్ల బోర్లు వేయాలి రెండు బోర్లు వేశాం. ఇంకా రెండు చోట్ల బోర్లు వేయనున్నాం. ఆయా బోర్లను రిజర్వాయర్లకు అనుసంధానం చేసి నీళ్లు అందిస్తున్నాం. అత్యవసరమైన ప్రాంతాల్లో చేతిపంపులను బాగు చేశాం. కాగ్నా ఎండిపోవడంతో తాండూరులో నీటి ఎద్దడి తీవ్రమైంది. ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. నల్లాకు మోటారు బిగించరాదు. - సత్యనారాయణ, పురపాలక కమిషనర్ బోర్లు వేసినా.. నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టారు. రూ.25 లక్షల కరువు నిధుల్లో తాండూరు పట్టణంలోని లారీ పార్కింగ్, అంబేద్కర్ పార్కు వద్ద బోర్లు వేశారు. నీళ్లు కూడా పడ్డాయి. రిజర్వాయర్లకు అనుసంధానం చేసి నీటి సరఫరా చేస్తున్నారు. రెండు ట్యాంకర్ల ద్వారా వార్డుల్లో నీటి సరఫరా చేస్తున్నా అందరికీ పూర్తిస్థాయిలో తాగునీరు అందని పరిస్థితి. -
ఎత్తిపోతల ప్రారంభమెన్నడో?
న్యాల్కల్,న్యూస్‌లైన్: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. పథకం పనులు పూర్తయి 15 సంవత్సరాలు దాటింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వినియోగంలోకి రావడం లేదని రైతలు ఆరోపిస్తున్నారు.పథకంలో వినియోగించిన సామగ్రి తుప్పుపడుతోంది. మరికొంత సామగ్రి దొంగల పాలవుతోంది.రైతులు ఈ పథకం కోసం ఎదురుచూసి దానిని మరచిపోయారు. పథకం పూర్తయి వినియోగంలోకి వస్తుందనే ఆశ వారిలో నశించిపోయింది. పథకం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మాజీ మంత్రి గీతారెడ్డి ఆదేశించినా అధికారుల్లో చలనం రాలేదంటే వారి పని తీరుకు అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సొమ్ము ఖర్చయినా ఆశయం మాత్రం నెరవేరడం లేదు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ శివారులో మంజీరా నది తీరంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.అందులో భాగంగా 1993లో అప్పటి నారాయణఖేడ్ శాసన సభ్యుడు కిష్టారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు.పథకం నిర్మాణం కోసం నాబార్డు కింద రూ. 1.30కోట్లు మంజూరు చే యించారు. పథకం పనులు ప్రారంభించే సమయంలో శాసన సభకు ఎన్నిలు రావడం, రాష్ట్రంలో ప్రభుత్వ మారడంతో పనులు ప్రారంభం కా లేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత జరిన ఎన్నికల్లో తిరిగి కిష్టారెడ్డి శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు.1999లో ఎమ్మె ల్యే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నిధులు సరి పోక పోవడంతో పనులు నిలిచిపోయాయి. నాబార్డు ఆర్ఐడీఎఫ్ పేజ్-3లో రూ.88.80లక్షలు మంజూరు చేయించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయించారు.ఈపథకం ద్వారా 21మంది ఎస్సీలకు సంబంధించిన 49.36హెక్టార్లు,31మంది బీసీలకు చెందిన 114.03హెక్టార్లు,ఇతర వర్గాలకు చెందిన 331.01హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలనేది పథకం ఉద్దేశం. పంపుహౌస్ ఏర్పాటు ఈపథకం ద్వారా పొలాలకు నీరందించేందుకు మం జీర నది తీరంలో పంపుహౌస్‌ను ఏర్పాటు చేశారు.అం దుకు అవసరమయ్యే విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లును కూడా ఏర్పాటు చేశారు.పంపుహౌస్ నుంచి పొలాలకు పైపులైన్ వేశారు. ఇవన్నీ ఏర్పాటు చేసిన అధికారులు దానిని ప్రారంభించడం మరిచారు.అప్పట్లో పనులు కూడా నాసిరకంగా జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.ఎత్తి పోతల పథకానికి విద్యుత్ సరఫరా చాలా రోజులుగా నిలిచిపోయిందని రైతులు తెలిపారు.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోవడం వలన ఈసమస్య ఉత్పన్నమయిందన్నారు. 15ఏళ్లు దాటినా ప్రారంభం కాని పథకం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి 15ఏళ్లు దాటినా ఇప్పటికి ప్రారంభం కాలేదు.దీంతో పథకం నిరూపయోగం గా మారింది. పథకం వినియోగంలోకి వస్తే బీడు భూములు సాగవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎప్పుడు ఫలి స్తాయో? పంపుహౌస్ నుంచి పంట పొలాలకు నీరందించేందు గ్రామ సమీపంలో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి కాల్వల ద్వారా నీరందించాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల అధిక శాతం నీరు భూమిలోకి ఇంకిపోవడం వల్ల పంట పొలాలకు నీరు సక్రమంగా అందించాడానికి అవకాశం లేకపోవడంతో పంట పొలాలల వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అందుకోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.నాలుగేళ్ల క్రితం పైప్‌లైన్ కోసం రూ:42లక్షలు మంజూరయ్యాయి.పైప్‌లైన్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి.సంబంధిత కాంట్రాక్టర్ పనులను పూర్తి చేసినప్పటికి సంప్హోస్ నుంచి వచ్చే మెయిన్ పైప్‌లైన్ పలు ప్రాంతాల్లో లీకేజీవుతుంది. దీంతో నీరు పంట పోలాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని పనులు త్వరిగతిన పూర్తి చేయించి పథకాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామ రైతులు కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు పథకం గురించి పట్టించుకోవడం లేదు.పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.మెయిన్‌లైన్ నుంచి పొలాలకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీ పలు ప్రాంతాల్లో లీకేజీ అవుతోంది. ప్రతి ఏడాది పొలం పనులు ప్రారంభమయ్యే ముందు వచ్చి పనులు చేస్తామంటారు.అప్పుడు రైతులు ఒప్పుకోరు. ఇప్పుడేమోరారు. పనులు పూర్తి చేయరు. ప్రతి ఏడాది ఈదే విధంగా జరుగుతోంది. కలెక్టర్ ఈసారైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలి. -మేత్రి శరణప్ప, రైతు,అమీరాబాద్ గ్రామం త్వరలో పథకం వినియోగంలోకి.. పనులలు పూర్తయ్యాయి.టెస్టింగ్ చేయాల్సిఉంది.అది పూర్తి కాగానే పథకం వినియోగంలోకి వస్తుంది. -సౌరాజ్,ఏపీఎస్ఐడీసీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్