సాక్షి, హైదరాబాద్: జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రఘోష్ కమిషన్ కోరింది. రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్ల ఇవ్వాలని ఆదేశించింది.
సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పంపహౌస్ ఇంజినీర్లను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్‌హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.
కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా అన్నిడాక్యుమెంట్లు అప్పగించాలని స్పష్టం చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నుంచి రిపోర్టులను కోరింది. మరోవైపు, పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌కు తమ ప్రతినిధిని పంపించి అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా కమిషన్ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు కమిషన్ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment