Commission
-
కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడిగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 23న హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. ఈ దఫా మిగిలిన విచారణతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలోఅధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లలతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ కమిషన్ ఎక్కడ..?
-
కాళేశ్వరం కమిషన్ ముందుకు.. ఆ మూడు సంస్థల ప్రతినిధులు
-
అవి ఇంజనీర్లకు వదిలేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలతో మీకు సంబంధం లేదు. వాటిని ఇంజనీర్లకు వదిలేయండి..’అంటూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ‘మేడిగడ్డ బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌కు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలి. అది సాధ్యం కూడా..’అని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐడీసీ) మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్‌రావు చెబుతుండగా.. జస్టిస్ ఘోష్ ఆయ న్ను మధ్యలోనే అడ్డుకున్నారు. ‘అంతే చాలు..టెక్నికల్ అంశాలతో మీకు సంబంధం లేదు..’అని అన్నారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కమిషన్ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు గత ప్రభుత్వం తరఫున ప్రకాశ్‌రావు ‘సాక్షి’గా హాజరై సమాధానాలిచ్చారు. రాజకీయాలు చేయొద్దు తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారు? అని కమిషన్ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా..‘రికార్డుల్లో ఏం ఉందో అదే అంతిమం. దానిని ఎవరూ మార్చలేరు..’అని కమిషన్ స్పష్టం చేసింది. ప్రజల సాగునీటి డిమాండ్లను నెరవేర్చడానికి 200 టీఎంసీలు అవసరం కాగా, తుమ్మిడిహెట్టి వద్ద తగిన నీటి లభ్యత లేకపోవడంతోనే బరాజ్‌ను తరలించాల్సి వచ్చిందని ఆ తర్వాత ప్రకాశ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 165 టీఎంసీల జలాల లభ్యతే ఉందని కేంద్ర జలసంఘం పేర్కొందని, అందులోనూ ఇతర రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోగా తెలంగాణకు 102 టీఎంసీలే మిగులుతాయని చెప్పారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలు పలు జలాశయాలను నిర్మించి నీటిని తరలించుకుంటుండడంతో గత 50 ఏళ్లుగా తెలంగాణకు వచ్చే ప్రవాహాలు తగ్గిపోయాయన్నారు. సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రకాశ్‌రావు చెప్పగా.. రాజకీయాలు చేయవద్దని, ఉద్యమంతో తమకు ఏం సంబంధం అంటూ కమిషన్ అభ్యంతరం తెలిపింది. రిటైర్డు ఇంజనీర్లు వద్దన్నా .. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌తో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించడమే ఉత్తమమని, దీనిని ఎలాగైనా సాధ్యం చేయాలని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015 ఏప్రిల్‌లో సిఫారసు చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది.ప్రతిపాదిత మేడిగడ్డ బరాజ్ అనవసరమని, అధిక వ్యయంతో కూడినది కావడంతో పాటు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని కమిటీ చెప్పిందని తెలిపింది. దీనిపై ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా, టీఎస్ఐడీసీ చైర్మన్‌గా నాటికి మీరు నియామకం కానందున మీ సమాధా నం అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. నీటి లభ్యత లేకపోవడంతో పాటు ముంపును తగ్గించడం కోసం తుమ్మిడిహెట్టికి బదులుగా వెన్‌గంగా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో వార్ధా బరాజ్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
ఇవాల్టీ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం
-
అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా అంజూ
చండీగఢ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లకు చోటు దక్కింది. తాజా ఎన్నికల్లో మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ‘డబుల్ ఒలింపియన్’ మాజీ లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి... ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుంది. ఈ కమిషన్‌లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్‌ఛేజ్), సునీతా రాణి (రన్నింగ్) చోటు దక్కించుకున్నారు. పురుషుల విభాగం నుంచి ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూతో పాటు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్ ఛేజ్) ఉన్నారు. గత కమిషన్‌లో నలుగురు మహిళలు ఉండగా... ఇప్పుడు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఆ సంఖ్యను 6 చేశారు. బహదూర్ సింగ్ గతంలో సుదీర్ఘ కాలం ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. బిజీ షెడ్యూల్ కారణంగా కమిషన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేనని చెప్పినప్పటికీ... ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ నీరజ్ చోప్రాతో చర్చించి అతడిని కమిషన్‌లో భాగం చేసింది. 2012 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన అదిలె సుమరివాలా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న సుమరివాలాకు.. ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ సమావేశాలకు హజరయ్యే అధికారాలు ఉన్నాయి. డోపింగ్ ఉదంతాల వల్ల దేశ అథ్లెటిక్స్ ప్రభ మసకబారకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. దీని కోసం అథ్లెట్ల శిక్షణకు సంబంధించిన వివరాలను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పర్యవేక్షించనుంది. -
కమీషన్ ఇవ్వకపోతే పింఛన్ తీసేస్తాం.. వృద్ధుల పింఛన్లపై కక్కుర్తి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్దుల పెన్షన్లపై కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఒక్కో పెన్షన్ నుంచి రూ.300 వసూళ్లు చేస్తున్నారు. జమ్మలమడుగు 16వ వార్డులో సచివాలయం సిబ్బంది చేతివాటం బయటపడింది. కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ తీసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. లంచం ఎందుకివ్వాలంటూ పింఛన్‌దారులు ప్రశ్నించినా కూడా సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తున్నారు. వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసి లంచాలంటూ పెన్షన్ దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కూటమి అధికారం చేపట్టి ఆరునెలలైనా ఇప్పటివరకు ఒక్క పింఛన్‌ను కూడా చంద్రబాబు సర్కారు మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కోత విధిస్తోంది. ఫలితంగా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ పడి భంగపడ్డామని విలపిస్తున్నారు.ఇదీ చదవండి: రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఓటేయని వారందరినీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకూ నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులిప్పిస్తున్నారు. -
కాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్.. హాజరుకానున్న మాజీ సీఎస్
-
అహోబిలేషుడి లడ్డూకు కమీషన్ పోటు
ఆళ్లగడ్డ: టీడీపీ నేత కమీషన్ బాగోతం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానంలో లక్ష్మీనరసింహ స్వామి లడ్డూ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఎగువ, దిగువ క్షేత్రాల్లో లడ్డూ కౌంటర్లు వారం రోజులుగా మూత పడటంతో భక్తులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నాయకుడే కారణమని తెలుస్తోంది. ప్రసాదాల తయారీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారిని కమీషన్ కోసం ఆ నాయకుడు ఒత్తిడి చేశాడు. ఇందులో తనకు పెద్దగా ఏమీ మిగలదని, కమిషన్ ఇవ్వబోనని ఆ వ్యాపారి చెప్పడంతో సరుకుల సరఫరాను ఆపేయించారు. దీంతో టీడీపీ నాయకుడు, కొందరు దేవస్థాన నిర్వాహకులకు కలిపి 20 శాతం కమీషన్ ఇచ్చేటట్లు బాపట్లకు చెందిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని సరుకుల సరఫరా బాధ్యతను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా సరుకులు రాక పోవడంతో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. దీంతో విక్రయాలు లేక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదంలోనూ కమీషన్ల కక్కుర్తి ఏమిటని వాపోతున్నారు. -
కమీషన్ల కోసం కపట నాటకం!
సాక్షిప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో కమీషన్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగిపోతోందని కూటమి సారథులు చెబుతోన్న మాటలకు, వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇసుక, మద్యం దందా.. దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులతో రెచ్చిపోతుండటాన్ని సుపరిపాలనగా చెప్పుకుంటున్నారు. అన్నింట్లోనూ కమీషన్ల కక్కుర్తితో జేబులు నింపుకుంటోన్న పెద్దలు ఇప్పుడు రైస్ మిల్లర్ల పొట్ట కొట్టేందుకు తగ్గేదేలే అంటున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల విడుదల కోసం కమీషన్ ఇస్తేకానీ విడుదల చేయనని ఓ మంత్రి బీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో కొంత మంది వసూళ్ల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. డిసెంబర్ మొదటి వారం నాటికి సదరు మంత్రి అడిగిన మేరకు వసూళ్లు పూర్తి చేసి అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. గత నెలలో కాకినాడ కేంద్రంగా జరిగిన రైస్ మిల్లింగ్ రంగ ప్రముఖల భేటీలో ఈ మేరకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సాగింది. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం నాలుగైదు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సీఎంఆర్ బకాయిల కింద రూ.200 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడతగా విడుదలైన బకాయిలకు గత నెలలో కుదిరిన ఒప్పందం మేరకు 8 శాతం కమీషన్ వసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు కమీషన్‌గా రూ.16 కోట్లు వసూలు చేస్తున్నారు. బకాయిలు వచ్చాయని సంతోíÙంచాలో.. భారీగా కమీషన్ ఇవ్వాల్సి వచ్చినందుకు ఏడవాలో అర్థం కావడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ అసలు సంగతి.. » ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి వ్యవసాయ సీజన్లో కోటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు అనుమతిస్తుంటుంది. ఇది ఏ ప్రభుత్వంలో అయినా సీజన్‌కు ముందు జరిగేదే. ప్రభుత్వం ఇచ్చే కోటా ప్రకారం మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని తిరిగి అప్పగించడం పరిపాటి. అలా ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చిన రాష్ట్రంలోని మిల్లర్లకు ప్రభుత్వం సుమారు రూ.1,600 కోట్లు బకాయి పడింది. » సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయకత్వాన ప్రభుత్వం గద్దె నెక్కడంతో సీఎంఆర్ బకాయిల విడుదల కోసం మిల్లర్లు కూటమిలోని పెద్దల వద్ద లాబీయింగ్ చేశారు. బకాయిలు రూ.200 కోట్లు వంతున దశల వారీగా విడుదల చేయాలని పలువురు ప్రతిపాదించారు. » ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్ లక్ష్యం 37 లక్షల టన్నులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 20 లక్షల టన్నులు స్థానిక అవసరాలకు వినియోగిస్తే మిగిలిన 60 లక్షల టన్నులు కస్టమ్‡ మిల్లింగ్‌కు ఇవ్వాలని మిల్లర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. » రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,300 మిల్లులపై ఆధార పడ్డ వేలాది మంది లారీ, జట్టు, ప్యాకింగ్ కారి్మకులకు ఉపాధి లభిస్తుందని మిల్లర్లు కోరుతున్నారు. ఈ అంశంతో పాటు రైస్ మిల్లుల రాష్ట్ర కార్యవర్గంలో మార్పులపై ఆ రంగ ప్రముఖులు ఇటీవల కాకినాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిలు మొత్తంగా సుమారు రూ.1600 కోట్ల విషయం చర్చకు వచ్చింది. ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్‌లో ధాన్యం సేకరణ జరగాలంటే బకాయిలు విడుదల చేయాల్సిందేనని మిల్లర్లు పట్టుబట్టారు. మొత్తం బకాయిలు ఇప్పటికిప్పుడు ఒకేసారి విడుదల చేసే పరిస్థితులు లేవని తేల్చారు. రూ.200 కోట్ల వంతున విడుదల చేయించేందుకు ఒక మంత్రి తరఫున కొందరు నాటి సమావేశంలో వకాల్తా పుచ్చుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. » మొదటి విడత విడుదల అనుకున్నట్టు జరగాలంటే విడుదల చేసే బకాయి మొత్తంలో 10 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబట్టారు. బకాయిలు పెరిగి పోయి మిల్లుల నిర్వహణ సవాల్‌గా మారిందని అభ్యంతరం వ్యక్తం కావడంతో చివరకు 8 శాతానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. గత ప్రభుత్వంలో ఎవరికీ చిల్లి గవ్వ కమీషన్ ఇవ్వలేదని కొందరు విబేధించినా, చివరకు వారు కూడా మెజార్టీ నిర్ణయాన్ని కాదనలేకపోయారని తెలిసింది. పథకం ప్రకారం ఎగుమతులపై విష ప్రచారం » ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం విదేశాలకు తరలి పోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో గగ్గోలు పెడుతూ కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బ తీశారని మిల్లింగ్ రంగంలో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడచిన ఐదేళ్లలో కోటి 47 లక్షల 55 వేల 837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు ప్రాధాన్యతను గుర్తించకుండా కమీషన్ కోసమే ఇంత చౌక బారుగా వ్యవహరిస్తారా? అని విస్తుపోతున్నారు. » రెండు తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మిల్లర్లే లక్ష్యంగా కూటమి నేతలు రైస్ మిల్లులు, గోడౌన్లపై వరుస దాడులు చేయించారు. తాము చెప్పినదంతా నిజమేనని ప్రజలను నమ్మించేందుకు పీడీఎస్ బియ్యంగా సుమారు 48 వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సీజ్ చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజులు కాకినాడలో మకాం వేసి.. మిల్లులు, గోడౌన్లపై దాడులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇంతా చేసి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారనే విమర్శలొచ్చాయి. సీజ్ చేసిన బియ్యంలో పీడీఎస్ లేదనే నిర్ధారణతో 70 శాతం బియ్యాన్ని దశల వారీగా విడుదల చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీజ్ చేసిన మిగిలిన బియ్యంపై 6ఎ కేసులకే పరిమితమయ్యారు. కూటమి పెద్దల ఇంత హడావుడి వెనుక మిల్లర్లను దారికి తెచ్చుకోవడమేనని తేలిపోయిందని జనం విస్తుపోతున్నారు. -
మరోసారి కాళేశ్వరంపై విచారణ
-
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను లగచర్ల దాడి కేసు బాధితలు శనివారం కలిశారు. పోలీసుల దాడిపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదన్నారు. రైతుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామమని కమిషన్ ఛైర్మన్ తెలిపారు. దోషులను కమిషన్ వదిలిపెట్టదని.. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.కాగా, కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. -
12 నుంచి ఐఏఎస్‌ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్‌లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నంచింది. మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్‌కుమార్, ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్‌కుమార్, వికాస్‌రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తదితరులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కమిషన్ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్ ముగించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి నివేదిక! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావులను విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల లో వారికి కమిషన్ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్ డిసెంబర్ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంకా గడువు పొడిగించని సర్కారు! వాస్తవానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్‌కు వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. -
కులగణనకు డెడికేషన్ కమిషన్.. ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్
హైదరాబాద్, సాక్షి: కులగణన కోసం తెలంగాణ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం గడువు విధించింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించినట్టు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.చదవండి: క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా -
దోపిడీకి పక్కాడీల్!
-
హా‘హాకా’రాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యాపారికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కిరాణా సామాను సరఫరా పనులను ‘హాకా’ పేరుతో అధిక ధరలకు కొనుగోళ్ల కమిటీ కట్టబెట్టింది. ఆ తరువాత అవే రేట్లతో ‘హాకా’ పేరుతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిరాణా సామాను సరఫరా పనులను నామినేషన్‌పై జిల్లా యంత్రాంగం కట్టబెట్టింది. ఇలా మొత్తంలో 200 విద్యాసంస్థల్లో కిరాణా సామాను సరఫరాను అధిక ధరలకు ఇచ్చేసింది. ఈ తతంగంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించాడు. అధిక ధరలతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ‘హాకా’ పేరుతో సదరు వ్యాపారే రూ.కోట్ల విలువైన పనులను దక్కించుకున్నట్లు, ‘హాకా’ కేవలం 2 శాతం కమీషన్‌పై ఈ పనులను సదరు వ్యాపారికి అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మైనారిటీ గురుకులాల్లో స్టేషనరీ, బూట్లు, ఫరి్నచర్, ఎస్సీ గురుకులాల్లో బ్లాంకెట్లు, వైద్య, ఆరోగ్య శాఖలో సామగ్రి సరఫరా పనులను కూడా ‘హాకా’ పేరుతో తీసుకొని, 2 శాతం కమీషన్‌పై ఇతరులకు అప్పగించారన్న ఆరోపణలున్నాయి.‘హాకా’కే ఇవ్వాలనుకుంటే టెండర్లు ఎందుకు?ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ ద్వారానే విద్యా సంస్థలకు కిరాణా సామాను, ఇతరత్రా పరికరాలు, వివిధ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వంటివి సరఫరా చేయాలని ప్రభుత్వం అనుకుంటే టెండర్లు పిలువడం ఎందుకు? ‘హాకా’కే నేరుగా ఇచ్చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే చర్చ సాగుతోంది. పైగా టెండర్లు పిలిచినప్పుడు వాటిలో ప్రైవేట్ వ్యాపారులు పాల్గొనేలా చేసి, అధిక ధరకు ‘హాకా’ దక్కించుకుంటోందని, మళ్లీ కమీషన్లపై ప్రైవేట్ సంస్థలకు అప్పగించి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘హాకా’కు సరఫరా చేసే సామర్థ్యమే లేదన్న చర్చ సాగుతున్న తరుణంలో ఈ పనులను పొందిన కాంట్రాక్టర్లు, సంస్థలు నాసిరకం కిరాణా సామాను, వస్తువులను సరఫరా చేస్తే దానికి బాధ్యులెవరు? 2 శాతం కమీషన్‌తో ఆ పనులను పొందిన వ్యాపారులు, సంస్థలు బాధ్యత వహిస్తాయా? ‘హాకా’ బాధ్యత వహిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వ్యాపారుల దందాతో నాణ్యత గాలికి..ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పనులను ‘హాకా’నే కాంట్రాక్టుకు తీసుకొని వ్యాపారం చేయొచ్చు.. కానీ అలా చేయడం లేదు. ‘హాకా’ పేరుతో కాంట్రాక్టు తీసుకుంటూ ఇతర వ్యాపారులకు కమీషన్‌పై పనులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో ‘హాకా’ పేరుతో వ్యాపారులే అధిక ధరలకు టెండర్లు దాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని సంస్థ కనీసం పరిశీలన చేయడం లేదు. పైగా ఈ తతంగంలో అందులోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ పనులను పొందిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వస్తువుల నాణ్యతను పాటిస్తున్నారా? లేదా చూసే వారు లేకుండాపోయారు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ పేరుతో వ్యాపారులు దర్జాగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 200 విద్యాసంస్థల్లో దాదాపు రూ.కోట్ల విలువైన పనులను ‘హాకా’ పేరుతో టెండర్లలో అధిక ధరకు కోట్ చేసి వ్యాపారులు దక్కించుకొని ప్రభుత్వ ఖాజానాకు గండికొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నా స్పందించడం లేదు. మూలాలను మరిచిన ‘హాకా’.. రైతుల సంక్షేమానికి పనిచేస్తూ.. రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ఏర్పడిందే హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ సొసైటీ (హాకా). గతంలో వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులు ఎరువులు, విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయే వారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసేందుకు, ఎరువులు, విత్తనాలను సరఫరా చేసేందుకు, తద్వారా రైతు సంక్షేమానికి పాటు పడేందుకు ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘హాకా’ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత జిల్లాల్లోనూ తన కార్యాలయాలను విస్తరించి రైతులు నష్టపోయకుండా చూసేది. అలాంటి సంస్థ ఇప్పుడు తన ముఖ్య లక్ష్యాన్ని వదిలేసి గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులతోపాటు ఆహారానికి సంబంధించిన ఇతర సంస్థల్లోనూ వ్యాపారం చేసే వెసులుబాటు ‘హాకా’కు ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రధానమైన రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న చర్చ సాగుతోంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు పొంది 2 శాతం కమీషన్‌తో ఇతర వ్యాపారులకు ఆయా కాంట్రాక్టులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. పూర్తిగా కమీషన్ వ్యాపార దృక్పథంతోనే ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి. -
kaleshwaram commission: ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం.. కమిషన్ ముందుకు తెలంగాణ రీసెర్చ్ అధికారులు హాజరయ్యారు. అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి వింత సమాధానాలు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ ఆమె చెప్పిన సమాధానాలకు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ షాక్ అయ్యారు. శ్రీదేవి పని చేసిన పిరియడ్‌లో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని కమిషన్ ఛైర్మన్ అడ్డగా.. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ శ్రీదేవి సమాధానాలు చెప్పింది.2017 నుంచి 2020 వరకు కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో పనిచేసిన శ్రీదేవి.. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? ఫ్లడస్ ఎప్పుడు వచ్చాయి అనే ప్రశ్నలకు తనకు గుర్తుకు లేదంటూ దాటవేసేందుకు యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్‌గా ఆమె పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కాగా, మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అంటూ రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు కమిషన్‌కు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణాలు మొదలైనట్లు కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని కమిషన్‌కు ఇంజనీర్లు తెలిపారు.ఇదీ చదవండి: ‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు’వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కమిషన్ ముందు చెప్పిన రీసెర్చ్ ఇంజనీర్లు.. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్‌కి సంబంధం లేదని రీసెర్చ్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు బ్యారేజీలలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్.. రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది.అన్నారం గ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా?. మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించగానిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక వైపు నిర్మాణం జరుగుతుండగానే... మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. -
కాళేశ్వరం కమిషన్ విచారణ రేపటి నుంచి ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపటి(శుక్రవారం) నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది. రేపటి నుంచి 25 మందికి పైగా కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్, కమిషన్‌కు కావాల్సిన సమాచారం ఇస్తానని ఆయా టీమ్స్ చెప్పాయి. కమిషన్ అడిగిన లాయర్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది.ఇక.. ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ చేరుకున్నారు. ఘోష్‌తో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ భేటీ అయ్యారు.రేపటి నుంచి ఎవరిని విచారణ చేయాలి అనే అంశం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై చర్చించారు. ఇప్పటికే మొదలైన ఓపెన్ కోర్టు విచారణ. గత 20 నుంచి ఐదు రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సీఈఓ అధికారులను జస్టిస్ గోష్ విచారించారు. -
తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: విద్యారంగంలో మార్పులు, బలోపేతంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది.చైర్మన్, సభ్యులు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపకల్పనకు ఈ కమిషన్ పనిచేయనుంది.కాగా, తెలంగాణలోని మల్టి జోన్-1,2 పరిధిలో నాయబ్ తహసీల్దార్లకు.. తహసీల్దార్‌గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టి జోన్ 1-2 కలిపి 76 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. -
TG: కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా శనివారం(ఆగస్టు31) జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో ముఖ్య అధికారులుగా పనిచేసిన వారిని విచారించింది. తాజాగా గడువు పొడిగించడంతో విచారణ పూర్తయిన తర్వాతే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది. -
బరాజ్‌లు ఎందుకు ఫెయిలయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిజైన్లకు సాంకేతిక అనుమతులిచ్చాక మళ్లీ అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను ఎందుకు మార్చారు? మారిన ప్రదేశాలకు అనుగుణంగా డిజైన్లలో మార్పులు చేశారా?’అని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, రిటైరైన ఇంజనీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భా గంగా కమిషన్ మంగళవారం పలువురు ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అన్నారం బరాజ్ డిజైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఈఈ కె. నరేందర్‌ను ప్రశ్నించగా డిజైన్లను ఏఈఈలు తయారు చేస్తే.. వాటికి డీఈఈ, ఆపై ఈఈ అనుమతిస్తారని ఆయన తెలిపారు. భూభౌగోళిక, సైట్ సర్వే ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్లను సిద్ధం చేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్‌కు ఎదురు ప్రశ్నలు వేయగా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజైన్లలో లోపాల్లేవు: బస్వరాజ్, ఎస్ఈ, కాళేశ్వరం మేడిగడ్డ బరాజ్ డిజైన్లలో లోపాల్లేవని.. ఐఎస్ కోడ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) నిబంధనలకు లోబడి ఎల్ అండ్ టీ ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా తయా రు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ హెచ్.బస్వరాజ్ తెలిపారు. డిజైన్లు ప్రమాణాలకు లోబడి ఉన్నాయని నిర్ధారించాకే ఆమోదించామన్నారు. బరాజ్ నిర్మిత స్థలాన్ని పరిశీలించలేదని.. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని ఓ ప్రశ్నకు బస్వరాజ్ బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను మార్చినప్పటికీ ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే మేడిగడ్డను కట్టారని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బరాజ్ కుంగిందని సీడీవో ఎస్ఈ ఎం. సత్యనారాయణరెడ్డి వివరించారు. బరాజ్‌లను నీటి మళ్లింపు కోసం కట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిల్వ చేయడంతోనే విఫలమైనట్లు సీడీఓ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ దయాకర్‌రెడ్డి ఇంతకుముందు కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో కమిషన్ దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేశారు. దీంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రామగుండం ఈఎన్సీ ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు చేశామని సీడీవో మాజీ ఎస్ఈ రాజశేఖర్ అన్నారు. అన్యాయాన్ని సరిచేయడానికే రీ ఇంజనీరింగ్పీసీ ఘోష్ కమిషన్‌కు తెలిపిన వి.ప్రకాశ్సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ ను పునర్నిర్మించేందుకు.. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను నాటి సీఎం కేసీఆర్ చేపట్టారని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్ తెలిపా రు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు మంగళవారం అఫిడవిట్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలనలో గోదావరి పరీవాహక ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతుల ఆత్మహత్యలు సహా వివిధ ఘటనల్లో 50 వేల మంది చనిపోయా రని కమిషన్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలుకాగా రీ ఇంజనీరింగ్ ద్వారా 37 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత గురించి కేంద్ర జలసంఘం రాసిన లేఖల్లోని వాస్తవాలను కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘు వక్రీకరించారని ఆధారాలతో సహా వివరించినట్లు ప్రకాశ్ చెప్పారు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ సాధ్యం కాదన్నారు. -
కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
-
కాళేశ్వరం విచారణలో దూకుడు పెంచిన కమిషన్..
-
‘విద్యుత్’ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి.లోకూర్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్థానంలో ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమరి్పంచడానికి ప్రభుత్వం జస్టిస్ లోకూర్‌కు 3 నెలల గడువును విధించింది.జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గౌహతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. కాగా, నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించడంతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడంపై పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మూడు నిర్ణయాల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై విచారణ జరిపి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నిర్ధారించాలని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పుడు ఇదే మార్గదర్శకాలు జస్టిస్ లోకూర్ కమిషన్‌కు కూడా వరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాల్లో పాత్ర ఉన్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఇంధన శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులకు జస్టిస్ నరసింహా రెడ్డి గతంలో నోటీసులు జారీ చేసి వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని స్వీకరించారు.విచారణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసి నివేదికను సైతం రూపొందించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ సందర్భంలో జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వాŠయ్‌ఖ్యలను కారణంగా చూపుతూ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, జూలై 1న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచి్చంది.హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని ఈ నెల 16న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను నియమించడంతో విద్యుత్ నిర్ణయాలపై విచారణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. -
పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్
-
‘పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘పవర్ కమిషన్ చైర్మన్ మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెంటనే జడ్జిని ఎవరిని నియమిస్తారో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియజేయాలి. విచారణ న్యాయబద్ధంగా జరగడం లేదు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలి. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలయాపన మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. చదవండి: TG: పవర్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ -
TG: పవర్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్‌గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్‌తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
కాళేశ్వరం విచారణలో స్పీడ్ పెంచిన కమిషన్
-
తుది దశకు చేరిన పవర్ కమిషన్ విచారణ
-
కాళేశ్వరం స్కాం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు కాళేశ్వరం పంపహౌస్ ఇంజినీర్లు
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రఘోష్ కమిషన్ కోరింది. రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్ల ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పంపహౌస్ ఇంజినీర్లను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్‌హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా అన్నిడాక్యుమెంట్లు అప్పగించాలని స్పష్టం చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి రిపోర్టులను కోరింది. మరోవైపు, పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌కు తమ ప్రతినిధిని పంపించి అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా కమిషన్ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు కమిషన్ ఇవ్వనుంది. -
‘పవర్ కమిషన్’ లీకులు ఇవ్వడమేంటి: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్‌పై నింద వేద్దామనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ ఒక్కరే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాసుకోలేదని, అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కూడా సంతకం చేశారన్నారు.తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని చెప్పారు. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్‌కు తన వాదనను మెయిల్ రూపంలో పంపించిన అనంతరం శనివారం(జూన్29) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాల మధ్య లంచాలకు ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా అని ప్రశ్నించారు. విచారణ కమిషన్ మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపాను. ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 2017 నాటికి 17 పవర్ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. అన్నీ అనుకూలంగా వున్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సింగరేణి బొగ్గు ఉండటం వల్ల విదేశీ బొగ్గుకు మేం ఒప్పుకోలేదు’అని చెప్పారు. -
పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’’ అని చెప్పారు.‘‘జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను వేసింది. నిన్న కేసిఆర్ వివరణ కోరారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. కమిషన్ పాత్ర పైన కూడా మాట్లాడారు. వాదన వినకుండా విచారణ కాకముందే తీర్పు ఇచ్చేలా ఉన్నాయని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని కేసిఆర్ సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు.’’ అని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసిఆర్‌కు ఆ హక్కు ఉంది. 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసిఆర్ పట్ల నర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తున్నాడు. ఇది తప్పు’’ అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
పవర్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై చర్చ
-
కాళేశ్వరం కమిషన్‌ను కలిసిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ అధికారులన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం శనివారం కలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అక్కడే ఉండాలని కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్‌కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ సమర్పించింది. మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పడింది.సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించి పనిలోపడ్డ కాళేశ్వరం కమిషన్.. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యచరణను ప్రారంభించనుంది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవడానికి కమిషన్ కసరత్తు చేస్తోంది. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే కమిషన్ మరోసారి అందరిని క్రాస్ ఎగ్జామినింగ్ చేయనుంది. -
పరువు నష్టం కేసులో సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్
బెంగళూరు: ప్రజా ప్రతినిధుల కోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివుకుమార్‌లకు ఊరట లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి వీళ్లిద్దరికి ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గత బీజేపీ ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ పేర్కొంటూ పూర్తి పేజీ ప్రకటన ప్రచురించింది. వివిధ పనుల కోసం గత సర్కార్ అవినీతి రేటు కార్డులు నిర్ణయించిందంటూ ఆరోపిస్తూ పోస్టర్లను కూడా ముద్రించింది.అయితే అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సిద్దరామయ్య, శివకుమార్‌తోపాటు రాహుల్ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నేడు విచారణ సందర్భంగాసిద్ధరామయ్య, శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అనంతరం సిద్దరామయ్య,, శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
కారణాలు చూపకుండా పరిధి విభజన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మూడు జిల్లా వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022 నాటి సర్క్యులర్‌ను పక్కన పెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చన్న న్యాయస్థానం.. ఆ నిర్ణయం మాత్రం పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరిధి మార్పు ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన వివరణ ఉండాలని పేర్కొంది. జిల్లా కమిషన్ల న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతి పత్రానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిపై 2022లో జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో రాసిన లేఖను సవాల్‌చేస్తూ న్యాయవాది రాఘవేంద్రసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పి. శ్యామ్ కోసీ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్చు చెప్పింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్–1లో కేసులు ఎక్కువగా ఉండగా మిగిలిన రెండు కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి మేరకు కేసుల విభజన బాధ్యతను కమిషన్–1కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. కేసుల విభజనలో వివక్ష చూపుతున్నారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని వివరిస్తూ విభజన చేయవచ్చని, న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతిపై నిర్ణయం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. తగిన కారణాలు చూపకుండా... దానిపై వివరణ లేకుండా విభజన చేయడం సరికాదని స్పష్టం చేసింది. -
ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్.. ఇకపై క్యాబ్‌ల మాదిరిగానే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ర్యాపిడో సరికొత్త పోటీకి తెరలేపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో రాపిడో క్యాబ్‌లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లకు దాని జీరో-కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్‌ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్లను సులభతరం చేస్తున్న ర్యాపిడో ఆఫ్‌లైన్ ఆటో డ్రైవర్లనూ తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో కోఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సాస్ ప్లాట్‌ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందన్నారు. ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు సాస్ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. -
కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్!
దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్‌ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని భర్తీ చేసే నేషనల్ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్‌లో చైర్‌పర్సన్‌తోపాటు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిష్ట్రేషన్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
కాంగ్రెస్ అంటే కోత, అవినీతి, కమీషన్: మంత్రి అమిత్ షా
కర్నాల్(హరియాణా): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీని ఆయన కోత, కమీషన్, అవినీతి(కట్, కమీషన్, కరప్షన్) పార్టీగా పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని 27 పార్టీల నేతలు స్వలాభం కోసమే చేతులు కలిపారని ఆరోపించారు. తమ బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని చెప్పారు. గురువారం హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేశంలో శాంతి భద్రతలను మెరుగుపర్చిందని, అవినీతిని, బంధుప్రీతిని నిర్మూలించిందని చెప్పారు. -
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కమీషన్ టన్నుకు 700 నుండి 1400 రూపాయలకు పెంపుదల చేసింది. కమీషన్ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.245 కోట్ల భారం పడనుంది. డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. 17 వేలకు పైగా రేషన్ డీలర్ల కుటుంబాకు లబ్ధి కలుగనుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్‌తో.. తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
50 శాతం కమిషన్ అంశంపై ప్రియాంక గాంధీపై కేసు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ఎంపీ కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్‌లపై కేసు నమోదైంది. అవినీతి అరోపణలపై నకిలీ లేఖను సోషల్ మీడియాలో జ్ఞానేంద్ర అవస్తీ పేరిట ప్రచారం చేస్తున్నారని బీజేపీ లీగల్ సెల్ కన్వినర్ నిమేశ్ పతాక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమిషన్‌ను ప్రభుత్వం రాబడుతుందని ట్వీట్టర్(ఎక్స్) వేదికగా వాద్రా ఆరోపణలు చేశారు. కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు వెళ్లడం లేదని కాంట్రాక్టర్లు హైకోర్టు సీజేకి లేఖ రాశారంటూ పోస్టు చేశారు. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోనూ ఇలాగే కమిషన్ లేనిదే పనిజగట్లేదని ఆరోపణలు చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్‌లు, అరుణ్ యాదవ్‌లు పోస్టు చేశారు. मध्य प्रदेश में ठेकेदारों के संघ ने हाईकोर्ट के मुख्य न्यायाधीश को पत्र लिखकर शिकायत की है कि प्रदेश में 50% कमीशन देने पर ही भुगतान मिलता है। कर्नाटक में भ्रष्ट BJP सरकार 40% कमीशन की वसूली करती थी। मध्य प्रदेश में BJP भ्रष्टाचार का अपना ही रिकॉर्ड तोड़कर आगे निकल गई है।… pic.twitter.com/LVemnZQ9b6 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 11, 2023 వీరిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్, అరుణ్ యాదవ్‌లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రియాంక గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో ఎంతో కాలం లబ్ది పొందలేని చెప్పారు. సీఎం శివరాజ్ సింగ్ కూడా ఈ అంశంపై స్పందించారు. వారి మాటల్లో నిజం లేదని చెప్పారు. ప్రియాంక గాంధీ పోస్టుకు సంబంధించిన వ్యక్తులపై గ్వాలియర్‌లోనూ కేసులు నమోదయ్యాయని అన్నారు. मध्यप्रदेश में कांग्रेस मुद्दा विहीन होकर घृणित मानसिकता के साथ राजनीति कर रही है। प्रदेश कांग्रेस के नेताओं ने पहले राहुल गांधी जी से झूठ बुलवाया अब प्रियंका गांधी जी से झूठा ट्वीट करवाया। प्रियंका जी आपने जो ट्वीट किये हैं उसके प्रमाण दो अन्यथा हमारे पास कार्यवाही के सारे… pic.twitter.com/j9FfajhA9c — Dr Narottam Mishra (@drnarottammisra) August 12, 2023 ఇదీ చదవండి: ఎన్డీయేలోకి శరద్ పవార్..? తాజా భేటీ ఎందుకు..? -
రేషన్ డీలర్లపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రేషన్ డీలర్లపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బియ్యం పంపిణీకి గాను వారికిచ్చే కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.900 నుంచి రూ.1,400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీలర్లు డిమాండ్ చేస్తున్న మరో 13 అంశాలపై కూడా సానుకూలంగా స్పందించింది. రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రభుత్వానికి, రేషన్ డీలర్లకు ఆమోదయోగ్యమైన విధంగా కమీషన్‌ను పెంచడంతో పాటు మరో 13 డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్‌షిప్‌ను మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడన్నల బీమా తరహాలో రేషన్ డీలర్లకు రూ.5 లక్షల బీమా వర్తింప చేయడం, ప్రతి డీలర్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంపు తదితర 13 అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.200 గా ఉన్న డీలర్ల కమీషన్‌ను దశలవారీగా పెంచుతూ రూ.1400కు చేర్చినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీర్ఘకాల డిమాండ్లకు పరిష్కారం రాష్ట్రంలోని పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యానికి సంబంధించి ప్రస్తుతం డీలర్లకు మెట్రిక్ టన్నుకు రూ.900 చొప్పున కమీషన్ అందుతోంది. దీనిని పెంచాలని గత కొంతకాలంగా డీలర్లు ఆందోళన చేస్తున్నారు. గత నెలలో సమ్మెలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే మంత్రి గంగుల ఇచ్చిన హామీ మేరకు గత నెలలో బియ్యం పంపిణీ చేసిన డీలర్లు, ఈ నెలలో తమ సమస్యలు పరిష్కారమైతేనే బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈనెల 5 నుంచి ప్రారంభం కావలసిన బియ్యం పంపిణీని 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మంత్రులు హరీశ్, గంగులతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 17,227 మంది డీలర్లకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో మొత్తం 90.05 లక్షల ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వాటిలో 35.56 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులు కాగా మిగతా 54.5 లక్షల కార్డులు కేంద్రం మంజూరు చేసినవి. ఈ కార్డులకు గాను 2.82 కోట్ల మంది లబ్ది దారులకు ప్రతినెలా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వంపై రూ.138.73 కోట్ల భారం డీలర్ల కమీషన్‌ను రూ.1,400కు పెంచడం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.138.73 కోట్ల భారం పడనుంది. కమీషన్ మొన్నటివరకు రూ.700 ఉండగా రెండు నెలల క్రితం కేంద్రంతో జరిగిన సర్దుబాటు వల్ల రూ.200 పెంచి రూ.900 కమీషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.700 ఉన్నప్పుడు రూ.45.36 కోట్ల కేంద్రం వాటా పోగా, రాష్ట్రం వాటా రూ.106.33 కోట్లతో డీలర్లకు మొత్తం రూ.151.69 కోట్లు ఏటా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం కమీషన్‌ను రూ.1,400కు పెంచడంతో ఏటా మొత్తం రూ.303.38 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో కేంద్రం వాటా రూ.58.32 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.245.06 కోట్లకు పెరిగింది. అంటే రూ.138.73 కోట్ల అదనపు భారం పడుతోందన్నమాట. డీలర్లకు మరికొన్ని ప్రభుత్వ వరాలు ♦ ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వే బ్రిడ్జిల ఏర్పాటు ♦ డీలర్షిప్ రెన్యువల్‌ను ఐదేళ్ల కాలపరిమితికి పెంచడం ♦ డీలర్ మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు రూ.10 వేల తక్షణ సాయం ♦ 1.5 క్వింటాళ్ల వేరియేషన్ (తేడా)ను కేసుల పరిధి నుంచి తీసివేయడం ♦ హైదరాబాద్‌లో రేషన్ భవన్ నిర్మాణానికి భూ కేటాయింపు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డీలర్లు కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేషన్ డీలర్లు కృతజ్ఞతలు తెలిపారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
భూమికి డేంజర్ బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
భూమి ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు, వాటికి కారణాలు తదితరాలపై 40 మంది ప్రముఖ అంతర్జాతీయ ప్రకృతి, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఎర్త్ కమిషన్ బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన ఆందోళనకర అంశాలతో కూడిన నివేదిక జర్నల్ నేచర్‌లో పబ్లిషైంది. మానవ ఆధిపత్య యుగం (ఆంత్రోపొసీన్) క్రమంగా భూమి తాలూకు కీలక వ్యవస్థల స్థిరత్వాన్ని సమూలంగా కదిలించి వేస్తోందని హెచ్చరించింది. నివేదికలో వెల్లడించిన అంశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి... మితిమీరిన వనరుల దోపిడీ. లెక్కలేని నిర్లక్ష్యం. ఇంకా అనేకానేక స్వయంకృతాపరాధాలతో భూమిని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. పుట్టింది మొదలు గిట్టి మట్టిలో కలిసేదాకా నిత్యం సకలం సమకూర్చే ఆధారాన్నే మొదలంటా నరికేసుకుంటున్నాం. భావి తరాలనే గాక భూమిపై ఉన్న సకల జీవరాశులనూ పెను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్, కరువు, పెను వరదల వంటి ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనను ఇకనైనా చెవిన పెట్టకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేందుకు ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. ఫలితంగా భూమికి డేంజర్ బెల్స్ చెవులు బద్దలయ్యే స్థాయిలో మోగుతున్నాయని సైంటిస్టులు తాజాగా తేల్చారు. భూమి తాలూకు ఎనిమిది రకాల భద్రతా పరిమితుల్లో ఏకంగా ఏడింటిని ఎప్పుడో దాటేశామని వారు వెల్లడించారు... ప్రతి ఖండంలోనూ.. సమతుల్యత పూర్తిగా దెబ్బ తిని అతి సమస్యాత్మకంగా మారిన పలు ప్రాంతాలను అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ఎక్కడపడితే అక్కడ ఇలాంటి హాట్స్పాట్లు ఉండటం కలవరపరిచే అంశమేనని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులే సమస్యకు ప్రధాన కారణమని తేలింది. ‘‘ముఖ్యంగా ఆసియాలో పర్వత ప్రాంతాలతో సమాహారమైన హై మౌంటేన్ క్రయోస్పియర్ శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతోంది. హిమానీ నదాల కరుగుదల మొదలుకుని జరగకూడని ప్రతికూల పరిణామాలన్నీ భయపెట్టే వేగంతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అతి త్వరగా ఆ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా పెను కుదుపులకు లోనవడం ఖాయం’’ అని సహ అధ్యయనకర్త ప్రొఫెసర్ క్రిస్టీ ఎబి హెచ్చరించారు. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే... భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీలను కీలకంగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. వీటిలో మూడు కంటే ఎక్కువ సూచీలు ఆమోదిత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 7 సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్టు ఎర్త్ కమిషన్ అధ్యయనం తేల్చడం అందరినీ భయపెడుతోంది... ఏం చేయాలి ► పర్యావరణపరంగా సురక్షిత స్థాయిని భూమి ఎప్పుడో దాటేసింది. రోజురోజుకూ మరింత ప్రమాదం దిశగా వెళ్తోంది. ► భూమిపై వాసయోగ్యతను నిర్ధారించే జీవ భౌతిక వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే పని తక్షణం మొదలు పెట్టాలి. ► అప్పుడు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి కీలక వనరుల లోటును భూమి తనంత తానుగా భర్తీ చేసుకోగలదు. ‘‘భూమికి గనక మనిషికి చేసినట్టే ఇప్పటికిప్పుడు వార్షిక హెల్త్ చెకప్ చేయిస్తే ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందంటూ రిపోర్టు వస్తుంది. కీలక అవయవాలన్నీ దాదాపుగా మూలకు పడుతున్నాయని తేలుతుంది’’ – క్రిస్టీ ఎబి, సహ అధ్యయనకర్త, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ‘‘భూ స్థిరత్వాన్ని ఆమోదనీయ స్థాయికి తీసుకొచ్చేందుకు దేశాలన్నీ కలసికట్టుగా తక్షణం ఓ భారీ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భూమి ఏమాత్రమూ ఆవాసయోగ్యం కాకుండా పోయేందుకు ఇంకెంతో కాలం పట్టదు!’’ – ప్రొఫెసర్ జొయీతా గుప్తా, అధ్యయనంలో కీలక భాగస్వామి డేంజర్ హాట్ స్పాట్స్‌కు నిలయాలు ► తూర్పు యూరప్ ► దక్షిణాసియా మధ్యప్రాచ్యం ► ఆగ్నేయాసియా ► ఆఫ్రికాలో పలు ప్రాంతాలు ► బ్రెజిల్లో చాలా ప్రాంతాలు ► అమెరికాలో పలు ప్రాంతాలు ► మెక్సికో చైనా కొసమెరుపు: సూచనల మాటెలా ఉన్నా కీలకమైన అన్ని మౌలిక సూచికలూ పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయి. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వనరుల భర్తీ దేవుడెరుగు, భూమి తాలూకు వాసయోగ్యతకే, మరోలా చెప్పాలంటే జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నది సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్న మాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐరాస స్టాటిస్టికల్ కమిషన్‌కు భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంకాల విభాగం యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్‌కు రెండు దశాబ్దాల తర్వాత భారత్ ఎన్నికైంది. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌లో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గింది. యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ భారత్ యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్ మెంబర్‌గా, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్‌గా, ప్రోగ్రామ్ కో ఆర్డినేటింగ్ బోర్డ్ ఆఫ్ జాయింట్ యూఎన్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్‌గా ఎన్నికైంది. -
వివక్ష లేదు.. ‘నవరత్నాల పథకాలు’ యాడ్స్‌పై మంత్రి వేణు క్లారిటీ
సాక్షి, అమరావతి: నవరత్నాల పథకాల యాడ్స్‌పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడా వివక్ష లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.128 కోట్ల ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. ‘‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారు. సర్కులేషన్ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారు’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్‌కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారు. గత ప్రభుత్వం యాడ్స్ ఇవ్వటంలో పూర్తిగా పక్షపాత ధోరణి అవలంబించింది. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారు. ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశాం’’ అని మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్ -
జాతీయ మహిళా కమిషన్ ముందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
-
జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్
చెన్నై: తమిళనాడు దివగంత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆర్మగస్వామి కమిషన్ని ఏర్పాటు చేయడం, ఐదేళ్ల తదనంతరం కమిషన్ 600 పేజీల నివేదికను స్టాలిన్‌కి సమర్పిచడం జరిగింది. ఐతే ఆ నివేదిక తోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆ కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్(జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధకృష్ణన్ , మాజీ ఆరోగ్య మంత్రి సి విజయ భాస్కర్లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తుకు అభ్యర్థించింది. అంతేగాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగాని ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టింది కమిషన్. అలాగే జయలలిత డిసెంబర్ 4, 2016న మధ్యాహ్నాం 3.50 నిమిషాలకు గుండెపోటుకు గురైన తర్వాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్నీ సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్లు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె చనిపోయింది డిసెంబర్ 4, 2016 అయితే ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5, 2016గా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ 2018లో రాష్రంలోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుని తప్పుపట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకుడి ఘటన సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది. (చదవండి: : ఐదేళ్లకు.. ‘అమ్మ’ మరణంపై కమిషన్ విచారణ పూర్తి -
తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (ఫొటోలు)
-
జయలలిత మృతి: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు
సాక్షి, చైన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత మృతిపై ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక కీలకంగా మారింది. కాగా, జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి తన నివేదికను సీఎం స్టాలిన్‌కు అందజేశారు. 600 పేజీలతో కమిషన్ రిపోర్టును తయారు చేసింది. ఇక, కమిషన్ ఏర్పాటైన ఐదేళ్ల తర్వాత నివేదిక అందించడం విశేషం. అయితే, 2016 సెప్టెంబర్ 22వ తేదీన జయలతిత ఆసుపత్రిలో చేరారు. 2016, డిసెంబర్ 5వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో మాజీ జడ్జీ జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కమిషన్.. ఐదేళ్ల కాలంలో జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. కమిషన్ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు, విధుల్లో ఉన్న చెన్నై పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. అయితే, విచారణలో భాగంగా ఆర్ముగ స్వామి కమిషన్ సుమారు రెండు వందల మందిని ప్రశ్నించింది. ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి బిగ్ షాక్ -
నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్పీఎస్) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమలకు డైరెక్ట్ రెమిట్ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీవోపీలకు వచ్చే నెల నుంచి రూ.15-10,000 వరకు కమీషన్ లభిస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధన కింద ఎన్పీఎస్ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఫీజుల రూపంలో నష్టపోయే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు) సంస్థలకు పరిహారాన్ని ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన పౌరులు ఎన్పీఎస్ చందాదారులుగా ఉంటారు. అయితే ఎన్పీఎస్కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తలను పీవోపీలుగా పేర్కొంటారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు పీవోపీల కిందకు వస్తాయి. ఎన్పీఎస్ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పీవోపీలకు తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. -
శాంతి కమిషన్‌లో మోదీ పేరు... ప్రతిపాదించిన మెక్సికో
ప్రపంచ శాంతి కోసం ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించేలా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన అత్యున్నత కమిషన్ని రూపొందించనున్నారు. ఐతే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్‌లో భారత ప్రధాని పేరుని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాను రాత పూర్వకంగా ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి అందజేస్తానని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేలా ఐదేళ్ల సంధి కాలానికి ఒక ఒప్పందం కుదుర్చునేలా ప్రతిపాదన సమర్పించడం ఈ కమిషన్ లక్ష్యం. ఈ అత్యున్నత కమిషన్‌లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తోపాటు భారత ప్రధాని మోదీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఆ ముగ్గురు నాయకులు ప్రతి చోట యుద్ధాన్ని ఆపేసేలా ఒక ప్రతిపాదనను అందజేయడమే కాకుండా ఐదేళ్ల యుద్ధాన్ని నిలిపేసేలా ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఉద్రిక్తతలు తలెత్తకుండా శాంతిగా ఉంటాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదిక చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ మెక్సికో అధ్యక్షుడు.. రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు. ఈ మూడు దేశాలు తాము ప్రతిపాదిస్తున్న మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ప్రతిపాదిత సంధి తైవాన్, ఇజ్రాయోల్, పాలస్తీనా వంటి దేశాలతో కూడా ఒప్పందం చేసుకునేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. అదీగాక ఈ ఒక్క ఏడాదిలోనే ఎన్నో ఘర్ణణలతో కూడిన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ఎంతోమంది ప్రజలు చనిపోవడం, నిరాశ్రయులవ్వడం జరిగిందని చెప్పారు. (చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!) -
జూలై 4 నుంచి రేషన్ డీలర్ల నిరసనబాట
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్–వన్ కమీషన్’ విధానంలో ప్రతి క్వింటాల్‌కు కమీషన్‌ను రూ.250 నుంచి రూ.300కు పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 4న మండల కేంద్రాల్లో, జూలై 11న జిల్లా కేంద్రాల్లో, జూలై 18న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానుల్లో ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్ట్ 2న దేశవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది డీలర్లతో ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజు పేర్కొన్నారు. (క్లిక్: జూన్ 26న జాతీయ లోక్ అదాలత్) -
పెట్రో డీలర్ల ఆందోళన
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కమీషన్ పెంచాలని కోరుతూ ‘పెట్రో’డీలర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘నో పర్చేజ్ డే’పాటించి నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇంధన కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా రాష్ట్రంలోని డీలర్లంతా సంఘీభావాన్ని ప్రకటించారు. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయినప్పటికీ, డీలర్ల కమీషన్ మాత్రం పెంచలేదని, ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో తాము చెల్లించిన మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పెట్రోల్, డీజీల్ డీలర్ల సంఘం పిలుపు మేరకు హైదరాబాద్, సూర్యాపేట, రామగుండం, వరంగల్‌లలో ఉన్న మూడు చమురు కంపెనీలకు చెందిన 7 పెట్రోల్, డీజిల్ డిపోల నుంచి వాహనాలు బయటకు వెళ్లకుండా ఆందోళన దిగారు. ఈ సందర్భంగా కుషాయిగూడలో ఎనిమిది మంది డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలి వేశారు. ఈ ఆందోళనల కారణంగా రాష్ట్రంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కాగా, ఆర్నెల్లకోసారి డీలర్ల కమీషన్‌ను సవరించాల్సి ఉండగా, 2017 నుంచి దాని గురించి పట్టించుకోలేదని రాష్ట్ర పెట్రో డీలర్ల సంఘం అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని తప్పుపట్టడం లేదని, తాము చెల్లించిన మొత్తాన్ని రీయంబర్స్మెంట్ చేయాలని చమురు కంపెనీలను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
చటాన్ పల్లి మిస్టరీ..!
-
పోలీసులది కట్టుకథ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు..!!
-
దిశ ఎన్ కౌంటర్ తర్వాత హత్యచారాలు ఆగాయా ?? పోలీసులకు గుణపాఠం
-
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం
-
చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జయలలిత మరణం కేసులో చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం తన వాదన చెప్పారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకు న్న పరిణామాల గురించి తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది పన్నీరు సెల్వమే. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని నినాదించారు. నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. చివరకు చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో సీఎంగా గద్దెనెక్కిన ఆమె ప్రతినిధి పళనిస్వామికి దగ్గరయ్యారు. అధికారాన్ని పంచుకు న్న ఈ ఇద్దరు అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించారు. అలాగే, అమ్మ మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ కమిషన్ గతంలో 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు, తాజాగా పరుగులు తీయక తప్పలేదు. గంటలపాటూ విచారణ సోమవారం 3 గంటల పాటుగా ఆర్ముగ స్వామి కమిషన్ పన్నీరును విచారించింది. 78 ప్రశ్నలు సంధించగా, కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మిగిలిన వాటికి దాట వేశారు. ప్రధానంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, సీఎస్ రామ్మోహన్రావు కనుసన్నల్లోనే చికిత్స వ్యవహారాలు సాగినట్లుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చడం చర్చకు దారి తీశాయి. మంగళవారం 6 గంటలు పా టు విచారణ జరిగింది. 120 ప్రశ్నల్ని పన్నీరు ముందు కమిషన్ వర్గాలు ఉంచగా, మరో 34 ప్రశ్నల్ని క్రాస్ ఎగ్జామిన్‌లో శశికళ తరపున న్యాయవాది రాజ చెందూ ర్ పాండియన్ సంధించారు. అలాగే, అపోలో ఆస్పత్రి తరపున 11 ప్రశ్నలు పన్నీరు ముందుంచారు. చిన్నమ్మకు అనుకూలంగా.. గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించిన పన్నీరు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. జయలలిత మరణం విషయంలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానం లేదు అని పేర్కొనడం గమనార్హం. అయితే, ప్రజలు, కేడర్ అనుమానాలు వ్యక్తం చేశాయని, వారి ప్రతినిధిగా తాను కమిషన్ ఏర్పాటుకు పట్టుబట్టినట్టు పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇక, జయలలితకు వ్యతిరేకంగా శశికళ, ఆమె కుటుంబీకులు ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, చిన్నమ్మ అంటే వ్యక్తిగతంగా తనకు మర్యాద, అభిమానం ఉందని క్రాస్ ఎగ్జామిన్ సమయంలో పన్నీరు ఇచ్చిన సమాధానాలు అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర అంశాల గురించి తనకు తెలియదని పన్నీరు పేర్కొన్న దృష్ట్యా, ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్, అపోలో యాజమాన్యాన్ని మరో మారు విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. సంతృప్తికరంగా విచారణ విచారణ అనంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, విచారణ సంతృప్తికరంగా జరిగిందన్నారు. ‘వాస్తవాలు’ తెలియజేశానన్నారు. చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ, కుట్రలు జరగలేదని, అనుమానం లేదన్న సమాధానాలను పన్నీరు వెల్లడించినట్లు చెప్పారు. -
‘అమ్మకు ఆ సలహా ఇచ్చింది నేనే.. కానీ’
సాక్షి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలితను విదేశాలకు తీసుకెళ్లి వైద్యం అందించాలన్న సలహాను తొలుత ఇచ్చింది తానేనని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. దివంగత సీఎం జయలలిత మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఆర్ముగ స్వామి కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరయ్యారు. విచారణ వేగవంతం జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా ఈ విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు సోమవారం జరిగిన విచారణకు వచ్చారు. కాగా మంగళవారం కూడా రావాలని కమిషన్ వర్గాలు ఆయన్ని ఆదేశించాయి. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళతో పాటుగా సుదీర్ఘ కాలం పోయేస్ గార్డెన్లో ఉన్న ఆమె వదినమ్మ ఇలవరసి సైతం విచారణకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోండి.. నగదు రివార్డు పొందండి: స్టాలిన్ ) సీసీ కెమెరాల్ని తొలగించమని ఆదేశించ లేదు పన్నీరు సెల్వం కమిషన్ ముందు ఉంచిన వాదనలు, వాంగ్ములం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అపోలో ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు తొలగించాలని తాను ఆదేశించ లేదని ఆయన స్పష్టం చేశారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునని, అయితే, ఆమెకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలియదని వెల్లడించారు. దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్‌ను ఏవిధంగా విదేశాలకు తీసుకెళ్లి వైద్య చికిత్స అందించడం జరిగిందో, అదే తరహాలో అమ్మను కూడా విదేశాలకు తీసుకెళ్దామని అప్పటి ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, మరో మంత్రి తంగమణితో పాటుగా పలువురి దృష్టికి తీసుకెళ్లానని, అయితే, ఎవరూ స్పందించ లేదని పేర్కొన్నారు. అయితే, అపోలో వర్గాలు మాత్రం అమ్మ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంటూ వచ్చారని వివరించారు. అలాగే, విదేశాలకు తరలింపు విషయంలో తాను నిర్లక్ష్యం వహించినట్టుగా మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక, పలు ప్రశ్నలకు తెలియదు అని, తన దృష్టికి రాలేదని, తనతో ఎవరూ చర్చించలేదని, సలహా కూడా తీసుకోలేదని పన్నీరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఇలవరసి ఒకటి రెండు సార్లు తాను.. అపోలో ఆస్పత్రిలో అద్దాల నుంచి జయలలితను చూశానని వాంగ్ములం ఇచ్చినట్లు సమాచారం. -
East Godavari: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగవకాశాలు
కాకినాడ సిటీ(తూర్పుగోదావరి): జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ పోస్టులకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,500 రెమ్యూనరేషన్ ఉంటుందన్నారు. చదవండి: పార్క్ చేసి ఉన్న బైక్‌పై డబ్బుల బ్యాగ్.. తర్వాత ఏం జరిగిందంటే.. జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి ఇంటర్మీడియెట్, స్టెనోగ్రాఫీ లోయర్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. టైపిస్ట్ పోస్టుకి ఇంటర్మీడియట్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి ఇంటర్మీడియెట్, టైపు, హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 42 ఏళ్ల వయసు మించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధ్యక్షుడు, జిల్లా వినియోగదారుల కమిషన్, కోర్టు కాంపౌండ్, కాకినాడలో అందజేయాలన్నారు. -
దిశ ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్
సాక్షి, హైదరాబాద్/ షాద్‌నగర్/ శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచా రం కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ హైదరాబాద్‌కు వచ్చింది. కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, సభ్యులు బాంబే హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ బి.కార్తికేయన్లు ఆదివారం చటాన్‌పల్లిలోని దిశ ఎన్కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. త్రిసభ్య కమిటీతో పాటు ‘దిశ’హత్యాచారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) చైర్మన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, విచారణాధికారి (ఐఓ) జె.సురేందర్‌రెడ్డి, శంషాబా ద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, కమిషన్ తరుఫు న్యాయవాదు లు, కమిషన్ సెక్రటరీ కూడా ‘దిశ’సంఘటనా స్థలికి సంబంధించిన ప్రైవేట్ గెస్ట్‌హౌస్, తొండుపల్లి గేటు, చటాన్‌పల్లి ప్రాంతాలను సుమారు 6 గంటలపాటు సందర్శించారు. తొలుత నలుగురు నిందితులను దర్యాప్తు నిమిత్తం ఉంచిన ప్రైవేట్ గెస్ట్ హౌస్‌ను బృందం సందర్శించింది. ఆ తర్వాత ‘దిశ’ఘటనకు కారణమైన తొండుపల్లి గేటును పరిశీలించింది. దిశ స్కూటర్‌ను ఎక్కడ పార్క్ చేసింది? నిందితులు లారీని ఎక్కడ నిలిపి ఉంచారు? వంటి వివరాలపై డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రహరీలోకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు బృందం అక్కడే గడిపింది. కాగా, తొండుపల్లి గేటు సమీపంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి త్రిసభ్య కమిటీని కలిశారు. తమకు కూడా ఒకరోజు సమయమివ్వాలని శ్రీధర్‌రెడ్డి కోరగా.. ‘మీ సమస్యలన్నీ మాకు తెలుసని.. మీకు న్యాయం జరుగుతుంది’అని కమిషన్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుల తరఫున విచారణ వద్దు... సిర్పుర్కర్ కమిషన్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సంద ర్శించి, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించింది. ‘దిశ’కేసు సమయం లో స్టేషన్లో రికార్డ్ల నిర్వహణ, విలేకరుల సమావేశం నిర్వహించిన సమావేశం గది, స్టేషన్‌లోని ఇతరత్రా ప్రాంతాలను పర్యవేక్షించింది. ఇదిలా ఉండగా.. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిటీ ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందని, నిందితుల తరుఫున విచారణ చేయడమేంటని ప్రశ్నిస్తూ షాద్‌నగర్ పీఎస్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ‘కమిషన్ గో బ్యాక్’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నేతలు స్టేషన్ ముందు బైఠాయించారు. చటాన్‌పల్లిలో ప్రతీ అంశం పరిశీలన.. షాద్‌నగర్ పీఎస్ నుంచి కమిటీ నేరుగా చటాన్‌పల్లికి చేరుకుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సుమారు గంటసేపు క్షుణ్నంగా పరిశీలించింది. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకొచ్చిన బస్ ఎక్కడ నిలిపారు? దిశ వస్తువులను ఎక్కడ పాతి పె ట్టారు? నిందితులు ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఆ సమయంలో పోలీసులు నిల్చున్న చోటు, ఎదురు కాల్పుల్లో నిందితుల మృతదేహాలు పడి ఉన్న దూరం.. వంటి ప్రతీ అంశంలోనూ కమిషన్ క్షుణ్నంగా వివరాలు సేకరించింది. ‘దిశ’ను దహనం చేసిన ప్రాంతాన్ని సాధ్యమైనంత దగ్గరికి వెళ్లి పరిశీలించింది. కాగా, ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ జరిగి డిసెంబర్ 6తో రెండేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2లోపు సుప్రీంకోర్ట్‌కు కమిషన్ నివేదికను సమర్పించే అవకాశముంది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే అర్థం తెలియదు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్ రెండో రోజు మంగళవారం జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ‘దిశ’నిందితులు మహ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులో ఆరీఫ్ మినహా మిగిలిన ముగ్గురు జువెనైల్స్ అనే విషయం తనకి తెలియదని కమిషన్ ముందు సజ్జనార్ వాంగ్మూలం ఇచ్చారు. అలాగే 2019, డిసెంబర్ 5 రాత్రి సమయంలో నిందితులను రవి గెస్ట్ హౌస్‌లో విచారించమని తాను చెప్పలేదని.. సురక్షిత ప్రదేశంలో మాత్రమే నిందితులను ఉంచాలని సూచించానని వివరించారు. కేసు దర్యాప్తులో ఉండటం, దిశ వస్తువుల రికవరీ ఉన్నందునే చర్లపల్లి జైలు నుంచి నిందితులను తీసుకెళ్లామని చెప్పారు. ఆ సమయంలో ముద్దాయిలకు సీన్ రీ–కన్స్ట్రక్షన్ సమాచారం ఇవ్వలేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును సాధారణ నేరంగా ఎలా పరిగణించారని, పైగా కేసు విచారణలో ‘మార్నింగ్ బ్రీఫింగ్’కే పరిమితం అయ్యానని అనడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరం జరిగిన ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉంటూ ఎస్ఓటీ బృందాల ఏర్పాటు, విచారణ, ఎస్కార్ట్ పోలీసులకు ఆయుధాలు, సమాచార సేకరణ, అరెస్ట్.. ఇలా ప్రతీదీ మీ కంటే కిందిస్థాయి అధికారి(డీసీపీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి)కే తెలుసని చెప్పడం సరైందికాదని అసహనం వ్యక్తం చేసింది. (చదవండి: పొగాకు వినియోగంలో వారే అధికం.. షాకింగ్ విషయాలు వెల్లడి) కమిషన్ ప్రశ్నలలో ప్రధానమైనవి.. కమిషన్: నిందితులను అరెస్ట్ చేసిన విధానం గురించి శంషాబాద్ డీసీపీ మీకు చెప్పారా? సజ్జనార్: లేదు, చెప్పలేదు. కమిషన్: స్టేషన్ల స్థాయి ఆయుధాల జారీ, తనిఖీలో అంతిమ బాధ్యత పోలీస్ కమిషనర్‌కి ఉండదా? సజ్జనార్: సైబరాబాద్‌లో ఆయుధాలు, మందుగుం డు సామగ్రి విభాగంతో పాటు ఇతర విభాగాలు కూడా ఉంటాయి. ప్రతి దానికి డీసీపీ ర్యాంక్ అధి కారి ఉంటాడు. కమిషనర్ లా అండ్ ఆర్డర్, పరిపాలన, విధానపరమైన నిర్ణయాలకే పరిమితం అవుతాడు. ఆయుధాల జారీ, తనిఖీలలో ఏమైనా సమ స్యలు తలెత్తితే అది సీపీ దృష్టికి వస్తుంది అంతే. కమిషన్: నిందితుల నేరాంగీకారం (కన్ఫెషన్ స్టేట్మెంట్) ఎప్పుడు రికార్డ్ చేశారు? సజ్జనార్: మహ్మద్ ఆరీఫ్ నేరాంగీకార రికార్డ్‌ను సాయంత్రం 5:20గం. నుంచి 6:30గం.ల మధ్య, శివ నేరాంగీకార రికార్డ్ 6:45 గం.కు జరిగింది. కమిషన్: ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించే ముందు ఆరీఫ్ నేరాంగీకార రికార్డ్‌ను చదివారా? సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ బ్రీఫింగ్ చేశారు. కమిషన్: నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు త రలించకుండా ప్రెస్మీట్లో వివరాలెలా చెప్పారు? సజ్జనార్: ప్రాథమిక సమాచారాన్ని ప్రజలకు తెలి పేందుకే డీసీపీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించాం. కమిషన్: ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యమెందుకు? సజ్జనార్: 2019, సెప్టెంబర్ 6న ఉదయం 6:20 గం.కు ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించా రని శంషాబాద్ డీసీపీ తెలిపారు. కానీ, 2గం. ఆలస్యంగా 8:30గం.కు శంషాబాద్‌లో ఎఫ్ఐఆర్ నమో దుచేశారు. ఇలా ఎందుకయ్యిందో తెలియదు. కమిషన్: నిందితుల మరణ సమాచారాన్ని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయంత్రం 5:30 గంటలకు చెప్పారు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: చటాన్‌పల్లిలోని సంఘటనా స్థలానికి మీరు ఎప్పుడు వెళ్లారు? ఎంత సేపు ఉన్నారు? సజ్జనార్: 2019, డిసెంబర్ 6న వెళ్లా. గంటన్నరసేపు ఉన్నా. ఆసమయంలో షాద్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) శ్రీధర్ ఇన్చార్జిగా ఉన్నాడు. కమిషన్: మృతదేహాలపోస్ట్మార్టంపై సూచించారా? సజ్జనార్: లేదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు లేఖ రాశాను అంతే. కమిషన్: ‘దిశ’కనబడటంలేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సజ్జనార్: నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాం. విచారణ పూర్తయిందో.. లేదో.. తెలియదు. కమిషన్: ఏసీపీ.. నిందితుల మృతదేహాల నుంచి డీఎన్ఏ సేకరించిన విషయం మీకు తెలుసా? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: సంఘటన స్థలంలో ప్రెస్‌మీట్ కోసం టేబుల్, కుర్చీలు, మైక్ ఎవరు ఏర్పాటు చేశారు? సజ్జనార్: రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన కదా గుర్తులేదు. కమిషన్: మీరు సంఘటన స్థలానికి వెళ్లకముందే అక్కడ టెంట్ వేసి ఉందా? సజ్జనార్: లేదు, మధ్యాహ్నం సమయంలో చూశా. సంఘటన స్థలం నుంచి 100–200 అడుగుల దూరంలో ఏర్పాటు చేశారు. 2 రోజుల్లో కలిపి సజ్జనార్‌ను 5 గంటల 16 నిమిషాల పాటు కమిషన్ విచారణ చేసింది. మొత్తం 160 ప్రశ్నలను త్రిసభ్య కమిటీ అడిగింది. ఎన్కౌంటర్ అంటే ఏంటో నాకు తెలియదు! ‘మిమ్మల్ని ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’అని 2019, డిసెంబర్ 6న పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఖండించారా?’అని త్రిసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. లేదు అని సజ్జనార్ సమాధానం ఇచ్చారు. అంటే మీరు ఇలా సంబోధించడాన్ని ఒప్పుకుంటున్నారా? అని అడగగా.. లేదు అన్నారు. ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’అంటే ఏంటని మళ్లీ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ఏమో దానర్థం ఏంటో నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. కాల్‌డేటా రికార్డ్స్ నోడల్ ఆఫీసర్ల విచారణ.. సజ్జనార్ విచారణ అనంతరం.. దిశ కేసులో పాల్గొన్న పోలీసులు, నిందితుల కాల్ డేటా, టవర్స్ వివరాలు, లొకేషన్స్ గురించి సంబంధిత నెట్వర్క్ అధికారులను కమిషన్ విచారించింది. బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ ఇంజనీర్ ఎన్. శ్రీనివాసులు, రిలయెన్స్ జియో నోడల్ ఆఫీసర్ జితేందర్, వొడా ఫోన్–ఐడియా ప్రత్యామ్నాయ నోడల్ ఆఫీసర్ పీ. జయలక్ష్మి, భారతీ ఎయిర్టెల్ చీఫ్ నోడల్ ఆఫీసర్ వీ.వెంకటనారాయనన్‌ను కమిషన్ తరుఫు న్యాయ వాది విరూపాక్ష దత్తాత్రేయ గౌడ విచారించారు. ప్రెస్మీట్లో తప్పులు చెప్పా.. చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలో 2019, డిసెంబర్ 6న మధ్యాహ్నం 3 గంటలకు వీసీ సజ్జనార్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. కేసు వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ నాలుగు భాషల్లో వివరించారు. దిశ వస్తువులు ఫోన్, పవర్ బ్యాంక్‌లు పొదల వెనకాల దొరికాయని తెలిపారు. అలాగే అదే ప్రెస్మీట్లో సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు వినియోగించిన తుపాకుల సేఫ్టీ లాక్స్ ఓపెన్ చేసి ఉన్నాయా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఎస్ ఉన్నాయని చెప్పారు. అలాగే బాధితురాలు, నిందితుల డీఎన్ఏ రిపోర్టులు వచ్చాయని చెప్పారు. వీటిపై కమిషన్ ఇవన్నీ ప్రెస్మీట్లో ఎలా తప్పుగా చెప్పారని ప్రశ్నించింది. ఆ సమయంలో చాలా మంది జనాలు గుమిగూడి ఉన్నారని, పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే సడెన్‌గా తప్పుగా చెప్పేశానని కమిషన్‌కు సమాధానం ఇచ్చారు. సంఘటనా స్థలంలో మృతదేహాల పంచనామాలు జరుగుతున్నాయి? వస్తువుల రికవరీ జరుగుతోంది? ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో ప్రెస్‌మీట్ నిర్వహించడం అత్యవసరమని ఎలా అనుకున్నారని త్రిసభ్య కమిటీ అసహనం వ్యక్తం చేసింది. (చదవండి: Nalgonda: 4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు) -
సీజ్ చేసిన.. తుపాకులెలా వాడారు?
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు సోమవారం హాజరయ్యారు. త్రిసభ్య కమిటీ తరఫున న్యాయవాది కే. పరమేశ్వర్ విచారించారు. త్రిసభ్య కమిటీ సజ్జనార్‌ను అడిగిన ప్రశ్నలలో ప్రధానమైనవి.. కమిషన్: నందిగామ, ఆమన్‌గల్ పోలీస్స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ)లు వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ 2019, డిసెంబర్ 3న సీజ్ చేశారని రిమార్క్స్ కాలమ్‌లో నమోదు చేశారు. కానీ, డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో ఇదే పిస్టల్‌ను వినియోగించారని తేలింది. ఇదెలా సాధ్యమైంది.? సజ్జనార్: తనిఖీ చేశాక సమాధానం ఇస్తా. కమిషన్: నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది 2019, నవంబర్ 29 రాత్రి 10 గం.కు అయితే.. మీరెలా 3 గంటల ముందే (7 గం.) మీడియాకు నేరం జరిగిన తీరును వివరించారు? సజ్జనార్: 2019, నవంబర్ 29న శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ సమస్యలపై స్టడీ ఉంటే వెళ్లా. అక్కడ్నుంచి క్యాంప్ ఆఫీస్‌కు వస్తుంటే శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. డీసీపీ కార్యాలయానికి రావాలన్నది ఫోన్ సారాంశం. అక్కడికి వెళ్లిన నాకు నిందితుల అరెస్ట్ గురించి డీసీపీ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు చెప్పమన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు మీడియాకు వివరాలను తెలియజేశా. నేను ప్రత్యేకంగా ఈ కేసును పర్యవేక్షించలేదు. మార్నింగ్ బ్రీఫింగ్లో పాల్గొనేవాడిని. ‘దిశ’కేసుపై ఏర్పాటు చేసిన 9 బృందాలకు శంషాబాద్ డీసీపీ నేతృత్వం వహించారు. కమిషన్: నిందితుల కస్టడీ విచారణకు ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించారా? సజ్జనార్: నిందితుల కస్టడీ విచారణ సమయంలో అదనపు బలగాలు కావాలని 2019, డిసెంబర్ 2న డీసీపీ అభ్యర్థిస్తే.. అదనపు డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులను అపాయింట్ చేశా. నిందితుల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆ విభాగాన్ని ఆదేశించా. డీసీపీ అభ్యర్థన మేరకే ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఆయుధాలు కేటాయించాం. కమిషన్: ఆ 9 ఎంఎం పిస్టల్ ఎవరిది? సజ్జనార్: ఎన్కౌంటర్లో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ నందిగామ సబ్ఇన్స్పెక్టర్ నర్సింహకు జారీచేశారు. కానీ, ఆ సమయంలో నందిగామ పీఎస్‌కు వెంకటేశ్వర్లు ఎస్ఐగా పోస్టింగయ్యారు. దీంతో ఆ పిస్టల్ వెంకటేశ్వర్లు చేతికి వెళ్లింది. కమిషన్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ)ను ఎలా ఎంపిక చేస్తారు? వీళ్లు సీపీకి రిపోర్ట్ చేస్తారా? సజ్జనార్: సివిల్ ఫోర్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన పోలీసులను ఎస్ఓటీలో నియమిస్తారు. సందర్భాన్ని బట్టి సీపీకి, స్థానిక స్టేషన్లలో రిపోర్ట్ చేస్తుంటారు. కమిషన్: సైబరాబాద్ సీపీ పరిధిలోనూ ప్రత్యేక ఆయుధాల నమోదు రిజిస్టర్ ఉంటుందా? సజ్జనార్: ఉంటుంది. ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లానే సైబరాబాద్ సీపీలో ఆర్మ్స్ రిజర్వ్ వింగ్ కూడా ఉంటుంది. కమిషన్: నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్ గురించి సైబరాబాద్ సీపీ రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల నమోదు ప్రక్రియకు ప్రత్యేకంగా సీఏఆర్ వింగ్ ఉంది. కొన్ని సందర్భాల్లో సీఏఆర్ నేరుగా స్టేషన్లకు ఆయుధాలను జారీ చేస్తుంది. కమిషన్: నందిగామ, ఆమన్‌గల్ స్టేషన్లకు కేటాయించిన ఆయుధాలను చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేశారు? ఎలాంటి నిర్ధిష్టమైన విధుల కోసం ఆయుధాలను కేటాయించారు? ఆయా వివరాలను రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల జారీ, తనిఖీ అంశాలను పర్యవేక్షించడానికి అదనపు డీసీపీ, సీఏఆర్ నేతృత్యంలో ప్రత్యేక వింగ్ ఉంది. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో షాద్‌నగర్ ఏసీపీ వీ. సురేందర్‌తో సమావేశమయ్యారా? సజ్జనార్: కాలేదు. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో శంషాబాద్ డీసీపీ కాన్ఫరెన్స్ హాల్లో మీరు సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా 9 బృందాలను ఏర్పాటు చేశారు. దీనిపై మీరేమంటారు? సజ్జనార్: లేదు, ఇది జరిగింది 2019, నవంబర్ 30న. కమిషన్: అంటే.. ఈ ఎంట్రీ తప్పంటారా? సజ్జనార్: దీనికి సురేందరే సమాధానం చెప్పాలి. కమిషన్: ఎస్కార్ట్ పోలీసులకు 6 పొడవైన ఆయుధాలను కేటాయించే ముందు వాటి అవసరం ఏముందని ప్రశ్నించారా? సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ కోరితేనే జారీచేశా. కమిషన్: గతంలో మీరెప్పుడైనా అత్యాచారం, హత్య కేసుల్లో ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఇలాంటి ఆయుధాలను జారీ చేశారా? సజ్జనార్: ఒకసారి తనిఖీ చేసుకొని సమాధానమిస్తా. కోర్టుకు హాజరుకాకుండానే కస్టడీకి అనుమతి.. ‘దిశ’నిందితులు మహ్మద్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు కోర్టులో హాజరుపరచలేదని అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ షాద్‌నగర్ పీ.శ్యాంప్రసాద్.. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల భౌతిక హాజరు అత్యవసరమని తనకు అనిపించలేదని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 2న మధ్యాహ్నం సమయంలో పోలీసులు నిందితుల కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని, అదే రోజు సాయంత్రం అనుమతి ఇచ్చామని తెలిపారు. అలాగే నిందితుల పంచనామాలు, సాకుల స్టేట్మెంట్లు కూడా తనకు సమర్పించలేదని, తహసీల్దార్‌కు సమర్పించారని స్పష్టం చేశారు. తహసీల్దార్ రిమాండ్ రిపోర్ట్‌ను అనుసరించే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చానని వివరించారు. కాగా.. ఈ కేసులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిందితులను 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. పోలీసులు 15 రోజులు కస్టడీలో ఉంచుకున్నారన్నారు. చర్లపల్లి జైలర్ నిందితుల సంతకాలను అటాచ్ చేశాడు కాబట్టి.. తాను ఆ సంతకాలను నిర్ధారించుకోలేదని కమిషన్‌కు తెలిపారు. నిందితుల తరఫు నుంచి తనకి ఎలాంటి న్యాయపరమైన సలహా లేదా కస్టడీని వ్యతిరేకిస్తూ దరఖాస్తు అందలేదని వెల్లడించారు. -
‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో సాక్షుల నుంచి విచిత్ర సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్స్ట్రక్షన్కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ ఓ పంచ్ సాక్షిని శుకవ్రారం విచారించింది. నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, కేసు పూర్తిగా సందర్భానుసారాలపై ఆధారపడి ఉన్నప్పుడు.. అలాంటి పంచనామాకు ఎలాంటి అపఖ్యాతి లేని వ్యక్తులను పంచ్ విట్నెస్గా తీసుకెళతారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: కేటీఆర్ అలాగే ‘దిశ’ కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్కు.. షాద్‌నగర్ ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్‌ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్‌ను విచారించింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు. రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం ఉదయం అబ్దుల్ రహుఫ్‌ను విచారించి.. మధ్యాహ్నం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వొకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. ‘దిశ’ ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్న ఐపీఎస్ సజ్జనార్
-
వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల బాగోతం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖ కమిషన్ చేపట్టిన పాఠశాలల తనిఖీల్లో జూనియర్ కాలేజీలు నారాయణ, శ్రీ చైతన్యల అధిక ఫీజుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్ నాలుగు బృందాలు బుధవారం తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, డాక్టర్ ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ సంక్రాంతికి 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఫీజులు కట్టించుకున్నారంటూ విద్యార్థులు అధికారులతో ఎదుట వాపోయారు. టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్రూమ్ కేటాయించారని తెలిపారు. ఇంటర్ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, బాత్రూమ్ కుళాయిలు లేకపోవటంతో కమిషన్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నారాయణ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని, జీవో 51ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని వెల్లడించారు. నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్ సభ్యులు సీఏవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదని, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారని మండిపడ్డారు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మౌలిక వసతులు కూడా సరిగా లేని కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయన్న ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. -
ఇక ఊరుకోరు.. రూ.కోటి జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరుకుంది. రానున్నది శీతకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేస్తూ కొత్త ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫర్ ఢిల్లీ-ఎన్సీఆర్ పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నూతన నిబంధనల ప్రకారం కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించనున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారితో పాటు పర్యావరణ కాలుష్యానికి పాల్పడేవారిపై కేసు నమోదు చేసే అధికారం కమిషన్‌కి ఉంది. అంతేకాక హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఈ కమిషన్ పరిధిలోకి చేర్చుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: రాష్ట్రపతి భవన్ వద్ద తొమ్మిదేళ్ల బాలిక నిరసన) 18 మంది సభ్యులు.. మూడేళ్ల పదవి కాలం 18 మంది సభ్యులతో ఏర్పడనున్న ఈ కమిషన్‌కి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇక 18 మంది సభ్యుల్లో పది మంది అధికారులు, బ్యూరోక్రాట్లు ఉండగా, మరికొందరు నిపుణులు, కార్యకర్తలు ఉండనున్నారు. వీరిని పర్యావరణ మంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పాటు మరో ముగ్గురు మంత్రులు, క్యాబినేట్ కార్యదర్శి మూడేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. ఈ కమిషన్ వాయు నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు దానికి సంబంధించిన చట్టాలను అమలు చేస్తుంది. అలానే కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఉప సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ఆర్డినెన్స్‌లో పేర్నొన్నది. పంట వ్యర్థాల దహనం, కాలుష్యానికి సంబసంధించిన అన్ని ఇతర అంశాలను కమిషన్ పరిశీలిస్తుంది. ఇక తన వార్షిక నివేదికలను కమిషన్ పార్లమెంటుకు సమర్పించనుంది. (చదవండి: ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం) కమిషన్‌కు విస్తృత అధికారాలు.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, దాని ఏజెన్సీలు, కమిషన్ ఆదేశాల మధ్య సంఘర్షణ విషయాలలో దీనికే ఎక్కువ అధికారాలుండటం విశేషం. ఈ కమిషన్‌కు విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి. ఏదైనా ప్రాంగణాన్ని పరిశీలించడానికి, కాలుష్య యూనిట్లను మూసివేయడానికి.. విద్యుత్తు, నీటి సరఫరాను డిస్కనెక్ట్ చేయడానికి ఆర్డర్లు జారీ చేసే అధికారం కమిషన్‌కు ఉంటుంది. కమిషన్ ఏదైనా ఉత్తర్వు, ఆదేశాన్ని ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 కోట్ల రూపాయల జరిమానా విధించవచ్చు. కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా వచ్చే అన్ని విజ్ఞప్తులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మాత్రమే ఉంటాయి. సంబంధిత ఆదేశాలపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయడానికి లేదా ఫిర్యాదు చేయడానికి ఇతర సంస్థలకు అధికారం ఉండదు. -
మహిళా సైనికాధికారుల కమిషన్ గడువు మరో నెల పెంపు
న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారులకు ప్రత్యేకంగా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు తీర్పు మరో నెల రోజుల గడువునిచ్చింది. గత తీర్పులో ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో నిర్ణయం తుది దశలో ఉందనీ, కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే మిగిలి ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాల్లోని ప్రతి విషయాన్నీ తు.చ.తప్పకుండా పాటిస్తామని కేంద్రం పేర్కొంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. లింగ వివక్షను నిర్మూలించేందుకు మహిళాసైనికాధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల లోపు పర్మనెంట్ కమిషన్ ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. -
క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్
బెంగళూర్ : ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కమీషన్ రూపంలో ఓలా, ఊబర్లు అధికంగా గుంజేస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు వాపోతున్న క్రమంలో వారికి ఊరట ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో రైడ్‌కు క్యాబ్ ఆపరేటర్లు ప్రస్తుతం 20 శాతం కమీషన్ వసూలు చేస్తుండగా దాన్ని 10 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఇదే తొలిసారి. మరోవైపు క్యాబ్ ఆపరేటర్ల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లెవీని విధించవచ్చని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. నూతన మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు రానున్న వారంలో ముసాయిదాను విడుదల చేస్తామని రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. -
ఈ ఏడాది 13.5 శాతం వాటా లక్ష్యం
హైదరాబాద్: భారత ఎయిర్ కండీషనర్ల మార్కెట్లో బ్లూ స్టార్‌కు ప్రస్తుతం 12.8 శాతం వాటా ఉంది. 2019–20లో 13.5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నామని కంపెనీ జేఎండీ బి.త్యాగరాజన్ మంగళవారం వెల్లడించారు. నూతన శ్రేణి ఏసీలను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రూమ్ ఏసీల విక్రయాలు అన్ని బ్రాండ్లు కలిపి 2018–19లో 55 లక్షల యూనిట్లు నమోదు కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే బ్లూ స్టార్ వృద్ధి రేటు 15 శాతం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో బ్లూ స్టార్ ప్లాంటు 2021–22లో సిద్ధం కానుంది. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 200 నుంచి 250కి చేర్చనున్నాం’ అని వివరించారు. -
గోవుల కమిషన్‌కు ఆమోదం
న్యూఢిల్లీ: ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధి కోసం కొత్తగా ఓ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఏర్పాటయ్యే ఈ కొత్త కమిషన్ ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధికి సబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుందనీ, దీని ద్వారా దేశీయ జాతులకు చెందిన పశుసంపద పెరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు. రైతులు, మహిళల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్ మౌలిక నిధి (ఏఎంఐఎఫ్)ను రూ. 2 వేల కోట్లతో సృష్టించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. నాబార్డ్ ద్వారా సృష్టించే ఈ నిధి గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, క్రమబద్ధీకరించిన హోల్‌సేల్ మార్కెట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది. సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణకు ఆమోదం సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 10 లక్షల వరకు జరిమానా లేదా ఈ రెండూ కలిపి విధించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా హరియాణాలో ఉన్న ఎన్ఐఎఫ్టీఈఎం, తమిళనాడు తంజావూరులోని ఐఐఎఫ్‌పీటీలకు జాతీయ విద్యా సంస్థల హోదా లభిస్తుంది. ప్రసార భారతికి వచ్చే మూడేళ్లలో వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల కోసం రూ. 1,054 కోట్లను కేటాయించనున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో సవరించిన ఆఫీస్ మెమొరాండం (ఓఎం)కు ఆమోదం తెలిపింది. -
పింఛనులో కాకినాడ జమ్మభూమి కమిటీ కనిషన్
-
ఓబీసీ ఉప వర్గీకరణకు దేశవ్యాప్త సర్వే
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీలు) జనాభా అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వే చేపట్టాలని జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి కమిషన్ నిర్ణయించింది. నమ్మకమైన ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఈ సర్వేకు రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ఓబీసీల కేంద్ర జాబితాలో 2,600కు పైగా కులాలున్నాయి. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓబీసీ జన గణన చేపట్టలేదు. ఓబీసీ కులాల జనాభాపై కచ్చితమైన లెక్క తేలాలంటే జాతీయ స్థాయి సర్వే తప్పనిసరి. పది లక్షలకు పైగా కుటుంబాల్లో జరిపే ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నాం. 2011 సామాజిక–ఆర్థిక జనగణనకు కేటాయించిన బడ్జెట్‌ను బట్టి ఓబీసీ సర్వేకు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని కమిషన్ తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి సమానంగా దక్కేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించే ఉద్దేశంతో కేంద్రం 2017లో జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర బీసీ కమిషన్ల, వివిధ కుల సంఘాలు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపింది. -
‘భగీరథ’లో సీఎంకు 6% వాటా
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కమిషన్ భగీరథలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాటా ఆరు శాతం. ప్రాజెక్టు మొత్తం ఖర్చులో ఆరు శాతం కమిషన్ తీసుకుని ఆయన కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. రాష్ట్రంలో సగటున కోటి ఇళ్లు ఉంటే నాలుగున్నరేళ్లలో కనీసం లక్ష ఇళ్లకు కూడా భగీరథ నీళ్లు ఇవ్వలేదు. కమిషన్ డబ్బుతోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ చలవే. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని కేసీఆర్ బహిరంగం గానే చెప్పారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిం ది 33 శాతం ఓట్లే. కేసీఆర్‌ను 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. దళితుడిని సీఎం చేస్తామన్న మొదటి హామీతోనే ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టారు. ప్రజా స్వామ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించే జర్నలిస్టులు సహా అన్ని వర్గాలను మోసగించి రాజకీయ విలువలకు పాతరేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను కాపీ కొట్టి చవకబారుతనాన్ని చాటుకున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడిగా కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు’ అని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఓటేస్తే ప్రజల ఉనికికే ప్రమాదమని, ఆ పార్టీకి మళ్లీ ఓటేస్తే రాష్ట్రంలో బతకడమే కష్టమవుతుందన్నారు. మళ్లీ అధికారం తమదేనని చెప్పుకున్న కేసీఆర్‌కు మహాకూటమి అంటే వణుకు పుడుతోందన్నారు. కేసీఆర్ తాగి సోయి లేకుండా సోని యాపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు అమ్ముకునే సమయంలో తాను సైన్యం లో దేశ సరిహద్దులో భద్రతా దళంలో ఉన్నానని, ఆయన బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకున్నాఎంఐఎం మద్దతివ్వడమా? తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తాన ని చెప్పిన కేసీఆర్... వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాలను మోసం చేశారని ఉత్తమ్ ఆరోపిం చారు. ఎంఐఎం అహంకారంతో మాట్లాడుతోందని, టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిస్తోందో ఆ పార్టీ స్పష్టం చేయాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వనందుకు టీఆర్ఎస్కు ఆ పార్టీ మద్దతు పలుకుతోందా? అని ప్రశ్నించారు. సూట్‌కేసులు తప్ప ఏమీ గుర్తుకు రావు తెలంగాణ రాష్ట్రం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడుతాయని సోనియా భావించారని, కానీ వారిని కేసీఆర్ పాతాళంలోకి నెట్టేసినందుకే ఆమె కడుపు తరుక్కుపోయిందని, ఆమెను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. ప్రతి దాంట్లో కమిషన్ తీసుకునే కేసీఆర్‌కు సూట్‌కేసులు తప్ప మరే విషయాలు గుర్తుకు రావన్నారు. ఓటమి భయంతో సోయి తప్పి ఆయన మాట్లాడుతున్నారన్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌లాగా తాను బ్రోకర్లా బతకలేదని, దేశ భద్రతా దళంలో ప్రాణాలకు తెగించి యుద్ధ విమానాలు నడిపానన్నారు. విభజన హామీలపై గళమెత్తరేం? టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి చేయలేదని, గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగానే రాష్ట్రంలో కరెంటు వస్తోందన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే చోట ముందుగా పనులు చేపట్టి భారీగా నిధులు ధుర్వినియోగం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్‌లా మార్చారని, సాగునీళ్లు ఇవ్వకుండా వచ్చిన వాళ్లందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆహా, ఓహో అనిపిస్తున్నారన్నారు. విభజన హామీలపై గళమెత్తే సాహసం కేసీఆర్ చేయరని, మోదీ పేరు చెబితేనే కేసీఆర్ లాగు తడుస్తుందన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ అమలును కేసీఆర్ అటకెక్కించారన్నారు. గెలిచినా ఓడినా నాదే బాధ్యత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్‌ను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించారు. డిసెంబర్ 11 తర్వాత అన్ని వ్యవహారాలు సచివాలయం నుంచే నిర్వహిస్తారా అని అడిగారు. ఉత్తమ్ స్పందిస్తూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా నాదే బాధ్యత. డిసెంబర్ 11 తర్వాత గాంధీభవన్‌కు రాను’అని అన్నారు. ఉత్తమ్‌కుమార్ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉత్తమ్ సచివాలయానికే వెళ్తారు కదా! అని వారు అనుకున్నారు. జర్నలిస్టుల ఇళ్లపై కోర్టు కేసుల్లేవు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని, డబుల్, ట్రిబుల్ బెడ్రూంల ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి కేసుల్లేవని, ఒక సొసైటీకి సంబంధించిన కేసు మాత్రమే సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. అందులో అన్ని వర్గాలు ఉన్నాయని, అది జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించిన కేసు కాదన్నారు. డిసెంబర్ 12న ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జర్నలిస్టులకు 18 వేల ఇళ్లు, స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు విద్య, వైద్య పథకా లు అమలు చేస్తామన్నారు. తన భార్య పద్మావతి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతోనే అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తన కుటుంబమన్నారు. తమ జీవితం ప్రజాసేవకే అంకితం చేశామన్నారు. -
.. ఇది క్షమార్హం కాదు!!
ఆగ్రహోదగ్రులైన జనాన్ని చల్లార్చడానికి విచారణ కమిషన్లు మత్తు మందుగా పనికొస్తాయని విఖ్యాత న్యాయ కోవిదుడు స్వర్గీయ జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ కమిషన్లకు నేతృత్వం వహించేవారిని ఎంపిక చేయటం మొదలుకొని జరిగే మొత్తం ప్రక్రియంతా సంశయాత్మక క్రీడ అని కూడా ఆయన చెప్పారు. ఏం చేయడానికైనా సిద్ధపడే రిటైర్డ్ న్యాయమూర్తుల దురాశను ఆయన చెరిగిపారేశారు. మూడేళ్లక్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్ర వరంలో తొక్కిసలాట జరిగి 29 నిండు ప్రాణాలు బలైన ఉదంతంపై నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదిక చూస్తే జస్టిస్ కృష్ణయ్యర్ అభిప్రాయాలు అక్షర సత్యాలని అర్ధమవుతుంది. సాధారణంగా కమిషన్లు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వాలు చాలా విష యాలు చెబుతాయి. జరిగిన ఉదంతానికి దారితీసిన పరిస్థితులేమిటో, వాటికి బాధ్యులెవరో, భవి ష్యత్తులో ఈ మాదిరి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి తీసుకోదగిన చర్యలేమిటో సూచించటం తదితరాలు అందులో ఉంటాయి. మూడేళ్లపాటు సాగిన విచారణలోఎందరో పాల్గొని అనేక అంశాలను జస్టిస్ సోమయాజులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాటి ప్రమాదంలో గాయాలపాలైనవారితో, మరణించినవారి కుటుంబసభ్యులతో అఫిడవిట్లు దాఖలు చేయించారు. ఏం జరిగుంటే ఈ విషాదాన్ని నివారించటం సాధ్యమయ్యేదో సవివరంగా చెప్పారు. పుష్కరాలకు భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నామంటూ వందల కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం తగిన సంఖ్యలో అంబులెన్స్‌ల మాట అటుంచి, కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడాన్ని ఎత్తిచూ పారు. పైగా నిబంధనలు అతిక్రమించి ఘటనాస్థలికి సమీపంలో పలు వీఐపీ వాహనాలు, ఇతర వాహనాలు పార్క్ చేసిన తీరును వెల్లడించారు. ఊరునిండా పద్మవ్యూహాన్ని తలపించేలా బారికేడ్లు పెట్టి ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిని కల్పించిన వైనాన్ని వెల్లడించారు. వీటన్నిటికీ ఆధారాలుగా వీడియోలు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్‌లు కమిషన్‌కు సమర్పించారు. వాదనలన్నీ విని, వీరందరూ సమర్పించిన నివేదికలను పరిశీలించి చివరాఖరికి జస్టిస్ సోమయాజులు కమిషన్ తేల్చిందేమిటన్నది చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి... పుష్కర ఏర్పాట్లతో, నిర్వహణతో, ఆనాటి ఘటనతో ఏమాత్రం సంబంధంలేని వారిపై బురదజల్లడానికి కమిషన్ చూపించిన ఉత్సాహం దిగ్భ్రమగొలుపుతుంది. పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు కారణాలేమిటో అక్కడ విధులు నిర్వహించిన హోంగార్డు స్థాయి ఉద్యోగి సైతం చెప్పగలడు. రాజమహేంద్రవరం పరిసరాల్లో దాదాపు 30 ఘాట్లు ఏర్పాటు చేశామని, ఎన్ని లక్షలమందైనా సునాయాసంగా స్నానాలు చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఒక్క పుష్కరఘాట్ మినహా ఇతర ఘాట్లలో వాస్తవానికి అలాంటి పరిస్థితే ఉంది. ఉన్నవాటిలో పుష్కరఘాట్ చిన్నది. అయినా అక్కడ మాత్రమే ఇంత భారీయెత్తున జనం ఎందుకు గుమిగూడారన్న అంశంపై కమిషన్ దృష్టి సారించి ఉంటే ఎన్నో అంశాలు వెలుగు లోకొచ్చేవి. వేకువజామున 6.26 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉన్నదని, ఆ సమయంలో స్నానం చేస్తే ఏడేడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ పోతాయని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం భారీయెత్తున ప్రచారం చేసింది. ఆ ముహూర్తానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు తమ తమ కుటుంబాలతో స్నానానికి తయారయ్యారు. చేస్తే చేశారు... వీరంతా వీఐపీల కోసం కేటాయించిన విశాలమైన సరస్వతి ఘాట్‌ను కాదని, వైశాల్యంలో చిన్నదిగా ఉండే ఈ పుష్కరఘాట్‌కు పొలోమంటూ ఎందుకు పోవాల్సివచ్చిందో కమిషన్ అడగలేదు. ప్రభు త్వంవైపు నుంచి ఎవరూ చెప్పలేదు. సందేహాలే విజ్ఞానానికి బాటలు పరుస్తాయంటారు. కమిషన్‌కు ఈ విషయంలో సందేహం రాకపోవడం వల్ల అనేక అంశాలు మరుగునపడ్డాయి. పుష్కర సంరం భాన్ని, ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా స్నానం చేస్తున్న దృశ్యాలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీకరించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఆ దృశ్యాల్లో జనసందోహం భారీయెత్తున కనబడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబాన్ని పుష్కరఘాట్‌కు తీసుకొచ్చారు. గోదావరి స్టేషన్లో దిగేవారు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే భక్తులు వేర్వేరు‡ఘాట్లకు పోతే ఇక్కడ జనం తక్కువవుతారన్న ఆలోచనతో పోలీసులు, ఇతర సిబ్బంది సాయంతో అందరినీ పుష్కర ఘాట్‌కు మళ్లించారు. ఆ విధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తెల్లారుజామున 4.30 మొదలుకొని 8 గంటల సమయం వరకూ ఆ ఘాట్ వెలుపల పడిగాపులు పడ్డారు. ఇంతమంది భక్త జనం కెమెరా ఫ్రేంలో అద్భుతంగా కనబడి ఉండొచ్చుగానీ, అది వారందరికీ శాపంగా మారింది. బాబు అక్కడినుంచి నిష్క్రమించగానే, అంతవరకూ అక్కడున్న బందోబస్తు మాయమైంది. ఆ ఘాట్కున్న ఒకే ఒక ప్రవేశద్వారాన్ని తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో గాయ పడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా సమీపంలో ఎక్కడా మంచినీరు లేని తీరును చాలామంది మీడియాకు ఆ వెంటనే వివరించారు. అలా నీళ్లు అందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యేదని చెప్పారు. ఆ దరిదాపుల్లో అంబులెన్స్‌ల జాడలేదని, చేతులపై మోసుకెళ్లామని వివరించారు. పైగా సీసీ టీవీ ఫుటేజ్గానీ, నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ కోసం తీసిన వీడియోగానీ కమిషన్ ముందుకు రానేలేదు. మూడేళ్ల తర్వాత సమర్పించిన నివేదికలో ఇలాంటి కీలకమైన అంశాలు లేవు సరిగదా పంచాంగకర్తలు మొదలుకొని ప్రతిపక్షాల వరకూ టోకున అందరినీ ‘దోషుల్ని’ చేసిన వైనం, ప్రజలనూ, మీడియాను బాధ్యులను చేసిన తీరు విస్మయపరుస్తుంది. తనకనుకూలంగా అన్ని వ్యవస్థలనూ దిగజార్చటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆఖరికి విచారణ కమిషన్లపై జనంలో కొద్దో గొప్పో ఉండే విశ్వసనీయతను కూడా దారుణంగా దెబ్బతీశారని నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఇది క్షమార్హం కాదు. -
వీఐపీ ఘాట్‌లో ఉండాల్సిన సీఎం.. : శివస్వామి
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు కారణాలు వివరిస్తూ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తప్పుపట్టారు. భక్తుల మూఢనమ్మకాలు, పంచాంగ కర్తలు, స్వామిజీలు, మీడియా వల్లే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగిందంటూ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ వ్యవహారాన్ని దాచేందుకే.. పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారన్న శివస్వామి.. పుష్కరాల్లో బోయపాటి శ్రీను డాక్యుమెంటరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయినా పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్‌లో ఉండాల్సిన ముఖ్యమంత్రి సామాన్యులు స్నానం చేసే ఘాట్‌లో ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘటనను స్వామిజీలు, మీడియాపైకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలదే తప్పు అన్నట్లుగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని స్వామిజీల తరపున ఖండిస్తున్నామన్నారు. కాగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. -
రేషన్ డీలర్ల కమీషన్ పెంపు
సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.20గా ఉన్న కమీషన్ రూ.70కి పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో 2015 అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.91 కోట్ల రేషన్ కార్డులకు ఐదు కేజీల బియ్యం చొప్పున ఇస్తున్నారు. అయితే అప్పట్నుంచి డీలర్లకు కమీషన్ కింద క్వింటాల్‌కు రూ.70 ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు రూ.500 కోట్లవరకూ ఉన్న బకాయిలను డీలర్లకు చెల్లించనున్నట్లు చెప్పారు. రేషన్ డీలర్ల సమస్యల అధ్యయనంపై మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలతో సీఎం కేసీఆర్ ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం ఈటల మాట్లాడుతూ..డీలర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికీ నాలుగు సమావేశాలు నిర్వహించామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నారు. డీలర్లు లేని రేషన్ షాపులకు డీలర్లను భర్తీ చేస్తామని, కొత్త గ్రామపంచాయతీలన్నింటికీ రేషన్ షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జీపీఎస్ సిస్టమ్ ద్వారా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేసి లీకేజీలు అరికట్టగలిగామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా అక్రమాలకు ముకుతాడు వేశామన్నారు. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కొంతమందికి రేషన్ అందడంలేదని విజ్ఞప్తులు రావడంతో వేలిముద్రలతో పాటు, కంటి ఐరిష్ ద్వారా లేదంటే మాన్యువల్‌గా బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీలర్ల సంఘం హర్షం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పనిచేసిన మంత్రి ఈటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీలర్లు ఎర్రమంజిల్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.