హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ర్యాపిడో సరికొత్త పోటీకి తెరలేపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది.
గత ఏడాది డిసెంబర్‌లో రాపిడో క్యాబ్‌లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్‌లకు దాని జీరో-కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్‌ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.
ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్‌లను సులభతరం చేస్తున్న ర్యాపిడో ఆఫ్‌లైన్ ఆటో డ్రైవర్లనూ తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో కోఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సాస్ ప్లాట్‌ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందన్నారు.
ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు సాస్ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment