auto drivers
-
జగన్ ను కాదని మీకు ఓటేసినందుకు బాగా బుద్ధి చెప్పారు.. చంద్రబాబుపై ఆటో డ్రైవర్లు ఫైర్
-
ఆటోల్లో అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఖాకీ చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఉదయం 9.30కు చేరుకున్న నేతలు ఖాకీ చొక్కాలు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బండారి లక్ష్మారెడ్డి స్వయంగా ఆటోలు నడిపారు.మార్గంమధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన వాహనాన్ని ఆపి నిరసన తీరు బాగుంది అంటూ వీడియో తీసుకున్నారు. కాగా బీఆర్ఎస్ జెండాలతో కూడిన ఆటోలతో పలువురు ఆటో కార్మికులు కేటీఆర్ నడుపుతున్న ఆటోను అనుసరిస్తూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద ఆటోలను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ సభకు వచ్చారు. అంతకుముందు ఆదర్శనగర్ క్వార్టర్స్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలేమయ్యాయి? ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వానికి ఇచ్చినా స్పందించడం లేదు. కాంగ్రెస్ ఇచి్చన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు ఆటో డ్రైవర్ల సమస్యలతో కూడిన జాబితాను కేటీఆర్‌కు అందజేశారు. ఇలావుండగా ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచి్చంది. అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ సందర్భంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సభ విరామ సమయంలో హరీశ్‌రావు నేతృత్వంలో లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్‌రెడ్డి కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ, అదానీ..సీఎం భాయ్..భాయ్’అంటూ నినదించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని, అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సభా హక్కుల ఉల్లంఘనపై చర్చకు అనుమతించండి శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా.. మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ తరఫున మంత్రి శ్రీధర్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఆరోపించింది. ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. మూసీ డీపీఆర్, ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అంశంలో మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది. శాసనమండలి నియమావళి 168 (ఏ) కింద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుపై తామిచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి వినతిపత్రం సమరి్పంచింది. -
Meetho Sakshi: ఫ్రీ బస్సు.. మా ఆటోలన్ని ఖాళీ.. జర మా గోడు వినండి..
-
జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
Hyderabad: నడిరోడ్డుపై హంగామా
చార్మినార్ : చార్మినార్ ఆర్టీసి బస్టాప్ రోడ్డులో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆదివారం సాయంత్రం హంగామా చేశారు. గంజాయి మత్తులో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎవరు.. ఎవరిని.. ఎందుకు.. కొడుతున్నారో వారికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొంత మంది వాహన దారులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిని సైతం నెట్టివేస్తు దుర్భాషలాడారు. కనిపించని పోలీసులు... ఇంత జరుగుతున్నా...సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడం గమనార్హం. అసలే వీకెండ్ అయిన ఆదివారం కావడంతో సహజంగానే సాధారణ రోజుల కన్నా..ఆదివారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. గతంలో తొలగించిన చారి్మనార్ ఆర్టీసి బస్టాండ్ భవనం ఎదురుగా ఉన్న ప్యారిస్ కేఫ్ రోడ్డులో ఈ గలాటా జరిగింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం విధినిర్వాహణలో కనిపించ లేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చారి్మనార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ల సరిహద్దులో జరిగింది. అయితే సంఘటన జరిగిన ప్రదేశం మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
సార్.. గిరాకీల్లేవ్!
కరీంనగర్ టౌన్: ‘సార్ మూడు నెలలుగా గిరాకీల్లేవు. ఫైనాన్స్ తెచ్చి ఆటో నడుపుతున్నాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. గిరాకీ అంతంత మాత్రమే వస్తోంది. బడి పిల్లలను తీసుకెళ్తుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఎండాకాలం సెలవులొస్తున్నాయి. ఇక ఆ గిరాకీ కూడా ఉండదు. అప్పుల బాధ దేవుడెరుగు.. ఎట్లా బతకాలో అర్థం అయిత లేదు’అంటూ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎదుట కరీంనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు మొర పెట్టుకున్నారు. బండి సంజయ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు. వారితో కలసి చాయ్ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్సూరెన్స్ చెల్లించే పరిస్థితి లేదన్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. రాబోయే రెండు నెలలపాటు స్కూళ్లు కూడా ఉండవని, ఇల్లు గడవడం కష్టమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బండి మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే అయినా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని వెల్లడించారు. -
వీఐపీల డ్రైవర్స్‌కు ఫిట్నెస్ టెస్ట్ చేస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్‌కు ఫిట్నెస్ టెస్ట్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మంత్రి పొన్నం మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. ‘మహాలక్ష్మి కింద కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొడితే.. పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. గతంలో రెగ్యులర్‌గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే.. ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉంది. ఆటోవాళ్లకు రూ. 12 వేల హామీ ఇచ్చాం.. నెరవేరుస్తాం. ఆటోలు కొనుగోలు పెరిగింది, ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారు?. ... కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తాం. బిహార్‌లో 2.5 లక్షల మంది అధికారులను కేటాయించి ఒకొక్కరికి 150 ఇల్లు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి.. అధికారులను నియమిస్తాం. నోడల్ ఆఫీసర్‌గా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఉంటుంది. కవితకు సీబీఐ నోటీసులు వాయిదాల పద్ధతిలో వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, అందుకే మళ్లీ కొత్త డ్రామా’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్.. ఇకపై క్యాబ్‌ల మాదిరిగానే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ర్యాపిడో సరికొత్త పోటీకి తెరలేపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో రాపిడో క్యాబ్‌లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లకు దాని జీరో-కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్‌ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్లను సులభతరం చేస్తున్న ర్యాపిడో ఆఫ్‌లైన్ ఆటో డ్రైవర్లనూ తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో కోఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సాస్ ప్లాట్‌ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందన్నారు. ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు సాస్ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. -
ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టి తెచ్చే లక్ష్యంతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. సుమారు 20కి పైగా ఆటోల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, సబిత, సునీత లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి తదితరులు అసెంబ్లీకి వచ్చారు. ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పబ్లిక్ గార్డెన్స్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలను లోపలికి అనుమతించేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కునే క్రమంలో కేపీ వివేకానందతో జరిగిన తోపులాటలో కారు అద్దం పగిలింది. ఆటో కార్మి కుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు, ఎమ్మెల్సీలు శాసనమండలికి కాలినడకన చేరుకున్నారు. నల్ల కండువాలతో శాసనమండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఆటోవాలాల పొట్టగొడతారా?
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశం శుక్రవారం శాసనసభలో అధికార కాంగ్రెస్– ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలకు కారణమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం ఉదయం చర్చ ప్రారంభమైంది. చర్చను కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం ప్రారంభించిన అనంతరం యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ ఇద్దరూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రసంగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరుణంలో బీఆర్ఎస్ పక్షాన పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ప్రజా పాలన అంటూ ఘనంగా చెప్పుకొని చివరకు 30 మోసాలు, 60 అబద్ధాలు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం సాగిందని ఆయన విమర్శించారు. ప్రజాభవన్‌లో మంత్రుల జాడెక్కడ.. ఆరు నిమిషాలు కూడా లేని సీఎం ప్రజాభవన్‌లో స్వయంగా తానే విన్నపాలు వింటానని ముఖ్యమంత్రి పేర్కొన్నా ఇప్పటివరకు ఆరు నిమిషాలకు మించి ఉండలేకపోయారని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. మంత్రులు ఉంటామన్నా వారి జాడ కూడా లేదని, ఉన్నతాధికారులు వస్తారని చెప్పినా వారూ కనిపించటం లేదని, చివరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే విన్నపాలు నమోదు చేసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో డ్రాప్ బాక్సులు పెట్టి అభ్యర్థనలను వాటిల్లో వేయమనేలా ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ, ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలినన్ని బస్సులు లేకుండా మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదనీ, చాలినన్ని బస్సులు, ట్రిప్పులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పథకంతో ఆటోవాలాలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో మంత్రి శ్రీధర్‌బాబు కలగజేసుకుని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణపథకాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పేద ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, దీనికి బడ్జెట్లో నిధులు ప్రతిపాదిస్తామని పునరుద్ఘాటించారు. తాము మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకించటం లేదని, బస్సుల సంఖ్య పెంచాలనీ, ఆటోడ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేలు చొప్పున సాయం అందించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బెంజికార్లు దిగని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆటోడ్రైవర్లను రెచ్చగొడుతున్నారు: కాంగ్రెస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని, ఆర్టీసీ ఉద్యోగులను నాటి ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని గాలికొదిలేసిందని, ఇప్పుడేమో ఆటోడ్రైవర్లను ఆత్మహత్యలవైపు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. బెంజ్ కార్లు దిగని ఈ ఫ్యూడల్స్ ఇప్పుడు ఆటోల్లో ప్రయాణిస్తూ వారిని అవమానిస్తున్నారని విమర్శించారు. తమ బంధువైన రిటైర్డ్ ఆర్టీసీ ఈడీని ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు కొనసాగించి సంస్థను భ్రషు్టపట్టించిన చరిత్ర గత ప్రభుత్వానిదని ఆరోపించారు. పేద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటాన్ని గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆటోడ్రైవర్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మరో మంత్రి సీతక్క విమర్శించారు. కవితపై ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆరోపణలు.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, యాదాద్రి అభివృద్ధి పేరిట యాడాను ఏర్పాటు చేసి వందల కోట్ల నిధులను దుర్వీనియోగం చేశారని, సగం నిధులు ఎమ్మెల్సీ కవిత, నాటి మంత్రి జగదీశ్‌రెడ్డికి ముట్టాయని ఆరోపించా రు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి వచ్చారు. వారిపై స్పీకర్ ఆగ్ర హం వ్యక్తం చేయటంతో తిరిగి తమ స్థానాల వద్దకు చేరుకున్నారు. సభలో లేని వారి గురించి సభ్యుడు మాట్లాడిన అభ్యంతరకర మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంతరెడ్డి కోరగా, పరిశీలించి నిర్ణ యం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. -
బస్సులో బల్మూరి.. ఆటోలో కౌశిక్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు వినూత్న రీతిలో అసెంబ్లీకి రావడం ఆసక్తిని కలిగించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్నే ఈ ఇద్దరు ఎంచుకోవడం విశేషం. ఇటీవలే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన బల్మూరి వెంకట్ నాంపల్లిలో ఆర్టీసీ బస్ ఎక్కి అసెంబ్లీ గేట్ వరకు వచ్చారు. ఈ సందర్బంగా బస్‌లో మహిళా ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఉచిత ప్రయాణం అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందంటూ ఆయన ఆటోలో అసెంబ్లీ గేటు వద్దకు వచ్చారు. అయితే ఆటోకు పాస్ లేకపోవడంతో పోలీసు అధికారులు ఆటోను అసెంబ్లీలోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఆటో దిగి కాలినడకన అసెంబ్లీలోకి వచ్చారు. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ తగ్గి ఇప్పటివరకు 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, సుమారు ఆరు లక్షల ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
కిరాయిలు ఇవ్వకుంటే ఎలా బాబూ!
హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు సభకు ఆటోల్లో ప్రజలను తరలించిన డ్రైవర్లకు కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. టీడీపీ నేతల తీరును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బాకురులో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. బాకూరు, ఉప్ప, చీకుమద్దుల, అండిభ, పంచాయతీల పరిధిలోని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. గతల నెల 20న అరకులో జరిగిన ‘రా కదలి రా’ సభకు జనాలను తరలించేందుకు ఒక్కొక్క ఆటోకు రూ.2,500 ఇస్తామని నేతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే, ముందుగా కొంతమందికి మాత్రమే రూ.500 అడ్వాన్స్ ఇచ్చారని, మరికొందరికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఒకేసారి ఇస్తామంటూ ఆటోలను సభకు తరలించారని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. బాకురు, అండిభ యూనియన్ల పరిధిలో సుమారు 60 ఆటోలు, ఉప్ప ప్రాంత యూనియన్ నుంచి సుమారు 50 ఆటోలను మొత్తం 110 ఆటోల్లో ప్రజలను సభకు తీసుకువెళ్లామని వాపోయారు. సభ జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తమకు కిరాయిలు చెల్లించకుండా టీడీపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. సభ జరిగే రోజు తమ ప్రాంతంలో సంత ఉంటుందని చంద్రబాబు సభకు వెళ్లకుండా అక్కడే టికెట్ సరీ్వసు చేసుకుంటే సుమారు రూ.3వేల వరకు సంపాదించుకుని ఉండేవారమని వారు లబోదిబోమంటున్నారు. కిరాయిలు ఇవ్వకపోతే ఓట్ల కోసం తమ గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఊరుకునేది లేదు.. రోజు మా కుటుంబ పోషణ నిమిత్తం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కిరాయి డబ్బులు ఇస్తామని చంద్రబాబు సభకు తీసుకువెళ్లారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నారు. కిరాయి డబ్బులు చెల్లించకపోతే ఊరుకొనేది లేదు. – దూసురు వెంకట రమణ,ఆటో యూనియన్ అధ్యక్షుడు, అండిభ, హుకుంపేట మండలం మా పొట్ట కొడితే ఎలా? నాది పేద కుటుంబం. అమ్మా నాన్న కూలి చేస్తేనే తప్ప కడుపు నిండదు. రోజు ఎంతో కష్టపడితే గాని నాలుగు వేళ్లు నోటికి వెళ్లవు. ఆటో ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. సభలకు జనాలను తరలించేటప్పుడు అడ్వాన్సులు అడిగితే అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామంటూ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. – సంతోష్, ఆటో డ్రైవర్, చట్రాయిపుట్టు -
టీడీపీ మేనిఫెస్టో మాకు గొడ్డలిపెట్టుగా మారింది: ఆటో డ్రైవర్లు
-
4న ఆటో డ్రైవర్ల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’పథకంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా బస్స్టాండ్లు, బస్ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ నెల 4న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ‘మహా ధర్నా’నిర్వహిస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి దెబ్బతిన్న ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రతీనెల రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్, జి.రాంబాబు యాదవ్, వేముల మారయ్య తెలంగాణభవన్‌లో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 9వ తేదీ నుంచి అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఆటో, టాటా మ్యాజిక్, ఓలా, ఉబర్, సెవెన్ సీటర్ వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు డ్రైవర్ల స్థితిగతులను ఆధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కార్మిక విభాగం నేతలు వెల్లడించారు. -
ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నామని ఆటో డ్రైవర్ల ఆందోళన
-
హైదరాబాద్‌లోని బస్‌భవన్ వద్ద ఆటోడ్రైవర్ల ఆందోళన
-
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతాం:మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బస్సు భవన్ ముట్టడికి మంగళవారం ఉదయం భారతీయ మజ్దూర్ సింఘ్(బీఎంఎస్) ఆటో కార్మికులు యత్నించారు. పలు డిమాండ్ల సాధనతో నిరసన ప్రదర్శన చేపట్టారు వాళ్లు. ఈ క్రమంలో బస్‌భవన్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. అయితే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో.. తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చింది. ఈ క్రమంలో పథకానికి వ్యతిరేకంగా పలు జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు వాళ్లు. అలాగే.. ఓలా, ఉబర్ రాపిడోలతో ఇబ్బందులు పడుతున్నామని.. వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో కార్మికులు. -
'ఆర్టీసీ ఫుల్.. ఆటో నిల్' ఇదేమి ఖర్మరా మాకు! : ఆటో డ్రైవర్లు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికుల్లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో.. కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు గిరాకీలు దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజీవ్ రహదారిలోని మొగ్ధుంపూర్ స్టేజీ వద్ద ఆటోలున్నా.. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటో డ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్కమొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఫ్రీ బస్సు ప్రయాణం..ఆటో డ్రైవర్ల కష్టాలు
-
ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్ మాటామంతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికులతో మాటామంతి జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపాదించినదంతా డీజీల్, పెట్రోల్‌కే సరిపోతుందని ఆటోడ్రైవర్లు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్ విజ్ఞప్తి చేశారు. గిగ్‌వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్ అమలు చేస్తున్నామని, ప్రతి ట్రాన్సాక్షన్లో కొంత మొత్తాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నామని రాహుల్ తెలిపారు. చదవండి: కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా? -
అందరివాడు.. ఈ ఆటోవాలా
మదనపల్లె సిటీ: ఆటోజానీ, ఆటో రాజా.. ఇలా రకరకాల పేర్లతో కొందరు హీరోలు సినిమాల్లో ఆటో డ్రైవర్ల పాత్రలో అభిమానులను మెప్పించారు. అయితే నిజ జీవితంలో ఆటో డ్రైవర్ పఠాన్ బాబు సామాన్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి ప్రయాణ అవసరాలను తీరుస్తూ అందరివాడిగా నిలుస్తున్నాడు. ►మదనపల్లె పట్టణం సైదాపేటకు చెందిన పఠాన్‌బాబు దాదాపు 35 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ ప్యాసింజర్లను ఆటోల్లో తీసుకెళ్తున్నపుడు గర్భిణులు, బాలింతలు, ఇతర ప్రయాణికులు పడే బాధలు చూసి చలించిపోయాడు. అప్పటి నుంచి తాను సంపాదించిన దాంట్లో కొంత మేరకై నా పేదల కోసం వెచ్చించాలనే తపనతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా దివ్యాంగులు, గర్భిణులను ఉచితంగా ఆటోలో తీసుకెళ్తున్నారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఐదేళ్లుగా తన ఆటోలో శుద్ధజల క్యాన్ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రయాణికులే కాకుండా బెంగుళూరు బస్టాండులో ఆటో కార్మికులు ఈ మినరల్ వాటర్ తాగుతున్నారు. ఈయన సేవలను గుర్తించిన పలువురు అభినందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఆటోలో పార్టీ జెండా గుర్తులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఫొటోలు పెట్టుకున్నాడు. సేవలోనే సంతృప్తి వైఎస్సార్ పార్టీ అంటే ఎనలేని అభిమానం. సమాజ సేవ చేయడంలోనే సంతృప్తి కలుగుతోంది. రోజూ సంపాదనలో కొంత మేరకు ఖర్చు చేస్తా. ఆటో డ్రైవర్లు అంటే మంచి భావన కలిగే విధంగా చేయాలన్నదే ధ్యేయం. ఎంతో మంది గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళుతున్నా. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తా. – పఠాన్‌బాబు, ఆటో డ్రైవర్, మదనపల్లె -
డ్రైవర్ల విజయోత్సవం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో శనివారం విజయోత్సవం నిర్వహించారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా ఐదోసారి ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతాపూర్వకంగా ర్యాలీ నిర్వహించారు. గొల్లపూడి పంచాయతీ పరిధిలోని వన్ సెంటర్, సాయిపురం కాలనీ, పంచాయతీ కార్యాలయం, పటమట బజార్ వంటి ముఖ్యకూడళ్ల మీదుగా ఆటోల ర్యాలీ సాగింది. దాదాపు 250 ఆటోలలో వచ్చి న ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, క్యాబ్ డైవర్లు సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కొనియాడుతూ పాడిన పాటలతో ఆయా కూడళ్లు మార్మోగాయి. ‘సంక్షేమ సారథి జగనన్న.. మళ్లీ మీరే ముఖ్యమంత్రిగా రావాలి’ అంటూ డ్రైవరన్నలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా.. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే తమకు ఏటా ఆర్థిక సహాయం అందించారని డ్రైవరన్నలు కొనియాడారు. సీఎం జగనన్న నాయకత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాటినుంచి ఇప్పటివరకు ఒకొక్కరికి రూ.50 వేల చొప్పున లబ్ధి చేకూరిందన్నారు. నవరత్నాల పేరిట అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో ఒక్కొక్కరికీ రూ.లక్షల లబ్ధి చేకూరిందని, సీఎం జగన్ తమ కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ర్యాలీలో ఏఎంసీ చైర్మన్ కారంపూడి సురే‹Ù, గంగవరపు శివాజీ, ధూళిపాళ చిన్ని, కోమటి రామమోహన్‌రావు, సహకార బ్యాంక్ చైర్మన్ బొర్రా వెంకట్రావు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్లకు రూ.3.36 లక్షల జరిమానాలు
కర్ణాటక: ఆటో డ్రైవర్లపై పదే పదే ఫిర్యాదులు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. ఈనెల 14నుంచి 23వరకు మొత్తం 670 కేసులు నమోదు చేసి వారినుంచి రూ.3.36 లక్షల జరిమానా వసూలు చేశారు. అధిక చార్జీల వసూళ్లకు సంబంధించి ఈశాన్య ఉప విభాగంలో 141 మంది డ్రైవర్లపై కేసు నమోదు చేసి రూ.72వేలు, ఉత్తర ఉప విభాగంలో 213 మందిపై కేసులు నమోదు చేసి రూ.1.06లక్షల జరిమానా వసూలు చేశారు. అదేవిధంగా ప్రయాణికులు చెప్పిన చోటుకు రాని డ్రైవర్లకు కూడా జరిమానా విధించారు. 95 మందిపై కేసులు నమోదు చేసి రూ.47,500, ఉత్తర ఉప విభాగంలో 221 మందిపై కేసులు నమోదు చేసి రూ.1.10 లక్షల జరిమానా విధించారు. -
ఉదయం అర్చకత్వం ఆ తర్వాత కాయకష్టం..
సాక్షి, హైదరాబాద్: అంతగా ఆదాయం లేని చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రారంభించిన ధూపదీపనైవేద్య పథకం గందరగోళంగా మారింది. దేవాల యంలో పూజాదికాలకు కావాల్సిన వస్తువులు(పడితరం) కొనేందుకు రూ.2 వేలు, ఆలయ అర్చకుడి కుటుంబ పోషణకు రూ.4 వేలు.. వెరసి రూ.6 వేలు ప్రతినెలా చెల్లించాల్సి ఉండగా, నిధుల లేమి సాకుతో ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేయటం లేదు. పెద్ద దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందుతున్నాయి. ఆ దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసేసుకుంటోంది. కానీ చిన్న దేవాలయాలకు అంతగా ఆదాయం లేకపోవటంతో ధూప దీప నైవేద్య పథకం నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతేడాది కొన్ని నెలల పాటు వేతనం ఇవ్వక, ఆ దేవాలయాలు, వాటి అర్చకుల కుటుంబాలను ఆగమాగం చేసి న అధికారులు ఆ తర్వాత ఎట్టకేలకు కొద్ది నెలలు సక్రమంగానే విడుదల చేశారు. మళ్లీ డిసెంబరు నుంచి నిధులు విడుదల చేయటం లేదు. నాలుగు నెలలు వరసగా ఆగిపోగా, గత నెల ఒక నెల మొత్తం విడుదల చేశారు. మిగతావి అలాగే పెండింగులో ఉన్నాయి. ఆటో తోలుతున్న ఈ వ్యక్తి పేరు పురాణం దివాకర శర్మ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన స్థానిక శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయ అర్చకులు. ధూప దీప నైవేద్య పథకం కింద ఆయన ఈ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. కానీ ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నాలుగు నెలలుగా స్తంభించిన ఆ మొత్తంలో అతి కష్టమ్మీద ఒక నెల వేతనం మాత్రమే తాజాగా విడుదలైంది. గతేడాది కూడా ఇలాగే కొన్ని నెలలు నిలిచిపోయింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉదయం దేవాలయం మూసేసిన తర్వాత ఇదిగో ఇలా అద్దె ఆటో తీసుకుని నడుపుకొంటున్నారు. ఒక్కో సారి రాత్రి దేవాలయం మూసేసిన తర్వాత గ్రామీణులకు కోలాటంలో శిక్షణ ఇస్తూ వారిచ్చిన ఫీజు తీసుకుని రోజులు గడుపుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ హయాంలో పథకం ప్రారంభం మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆదాయం లేని దేవాలయాల్లో నిత్య పూజలకు ఆటంకం కలగొద్దన్న సదాశయంతో 2007లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్చకులకు గౌరవ వేతనం రూ 1500, పూజా సామగ్రికి రూ.1000 చొప్పున విడుదల చేసేవారు. 1750 దేవాలయాల్లో ఈ పథకం అమలవుతుండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2018లో 3645 ఆలయాలకు విస్తరింపజేస్తూ చెల్లించే మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. దేవాలయాల సంఖ్య, వేతన మొత్తం పెరిగినా.. నిధుల విడుదల మాత్రం సక్రమంగా లేకపోవడంతో సమస్యలు ఎదురువుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు సంబంధించి ప్రతినెలా రూ. 2,18,70000 మొత్తం విడుదల కావాల్సి ఉండగా, నిధుల సమస్య పేరుతో ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని దేవాదాయ శాఖకు అందించటం లేదు. ఎన్ని ఇబ్బందులో.. ఓ దేవాలయ నిర్వహణకు నెలకు రూ.2 వేల నిధులు ఏమాత్రం సరిపోవటం లేదు. ఇక పూజారి కుటుంబ పోషణకు రూ.4 వేలు కూడా చాలటం లేదు. అయినా సరిపుచ్చుకుందామంటే ఆ నిధులు క్రమం తప్పకుండా అందటం లేదు. ధూపదీపనైవేద్యం అర్చకుల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. వీరు పూర్తిగా ఆలయంపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో ఆలయానికి దాతలు అడపాదడపా ఇచ్చే సాయం కూడా ప్రస్తుతం తగ్గిపోయిందనేది అర్చకుల మాట. దీంతో గత్యంతరం లేక చాలా మంది అర్చకులు ఇతర పనులు చేసుకుంటున్నారు. కొందరు ఆటో నడుపుతుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులు, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. కూలీ పనులకు వెళ్తున్నాం ‘‘నేను కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గావ్ ఆలయంలో ధూపదీపనైవేద్య పథకం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఆ రూపంలో రావాల్సిన గౌరవ వేతనం సరిగా రావటం లేదు. ఆ వచ్చే మొత్తం కూడా కుటుంబ పోషణకు సరిపోక నా భార్యతో కలిసి మిగతా సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు, ఇతరుల పొలాల్లో పనులకు కూలీలుగా వెళ్తున్నాం.’’ – సంగాయప్ప అర్చకుడు నిధులు పెంచాలి, క్రమం తప్పకుండా ఇవ్వాలి ‘‘గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నిత్య పూజలు చేస్తూ పూజాదికాల్లో ఉంటున్న ధూపదీపనైవేద్య పథకం అర్చకుల పరిస్థితి దారు ణంగా మారింది. ఆ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధరల పట్టికను అనుసరించి పెంచాల్సి ఉంది. ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి’’ – వాసుదేవ శర్మ,ధూపదీపనైవేద్య పథకం అర్చకుల రాష్ట్ర అధ్యక్షులు -
Hyderabad: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకలలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లు, డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) విస్తృత తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. క్యాబ్‌లు, ట్యాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు సరైన యూనిఫాం, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ సూచించారు. ప్రయాణికులు రైడ్ బుక్ చేస్తే ఆపరేటర్లు నిరాకరించకూడదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాహన చట్టం–1988 సెక్షన్ 178 కింద ఉల్లంఘన కిందకే వస్తుందని, ఆయా డ్రైవర్‌కు ఈ–చలానా రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు చార్జీలు వసూలు చేసినా ప్రయాణికులు వాహనం, సమయం, స్థలం తదితర వివరాలతో 94906 17346 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయాలని సూచించారు. (క్లిక్ చేయండి: న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షల్లేవ్ ) -
ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ, దూసుకుపోతున్న ఆ యాప్
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే ఓలా, ఉబెర్, ర్యాపిడో ఊహించని దెబ్బపడింది. అధిక చార్జీలు, వ్యవహార తీరుతో తీవ్ర విమర్శల పాలై, అక్కడి సర్కార్ ఆగ్రహానికి గురైన దిగ్గజాలకు అనూహ్యంగా మరో షాక్ తగిలింది. బెంగుళూరు ఆటో రిక్షా డ్రైవర్లు సొంతంగా ఒక యాప్‌ను రూపొందించుకున్నారు. లాంచింగ్‌కు ముందే 'నమ్మ యాత్రి' అప్లికేషన్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) నవంబర్ 1న తన నమ్మయాత్రి సేవలను షురూ చేయనుంది. అయితే ఈ యాప్ ఇప్పటికే 10,000 డౌన్లోడ్స్ సాధించింది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేలా చార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఫీజు ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. ప్రత్యర్థులకు సమానమైన ఇంటర్ఫేస్తో 'సరసమైన ధరల' వద్ద సేవలను అందిస్తుండటం విశేషం. దీంతో ఈ యాప్ చాల బావుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌పై సోషల్ మీడియాలో రివ్యూలు వెల్లువెత్తాయి. పికప్, డ్రాప్ లొకేషన్లను సెట్ చేసిన తర్వాత, సమీపంలోని డ్రైవర్లు చార్జీని కోట్ చేస్తారు. సాధారణంగా పికప్ , డ్రాపింగ్ ప్లేస్ దూరాన్ని బట్టి అదనంగా 10-30 రూపాయల వరకు అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ వసూలు చేయనుంది చిన్మయ్ ధుమాల్ అనే దీనిపై ట్వీట్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై ఓలా, ఉబెర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.దీనిపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసిసి సంగతి తెలిసిందే. Bangalore Auto Rickshaw Drivers launched their own application called 'Namma Yatri' to tackle unfair comission charges of Ola/Uber. - ₹30 fixed platform fees - No cancellation charges - Currently, Cash Only The app is beautiful and responsive. Bangalore is built different! pic.twitter.com/8J7OZIXcA1 — Chinmay Dhumal (@ChinmayDhumal) October 27, 2022 -
YSR Vahana Mitra: థాంక్యూ జగనన్న.. మీ ఆలోచనకు మా సలాం (ఫొటోలు)
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. కాకినాడలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ
-
జగనన్నరాక..ఓరేంజ్ లో డ్రైవరన్నల జోష్
-
వైఎస్సార్ వాహనమిత్ర: మూడేళ్ల కంటే మిన్నగా..
సాక్షి, అమరావతి: అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. గత మూడేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుండటం విశేషం. వాహనాల మరమ్మతులు, బీమా ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ప్రకటించారు. 2022–23కు గాను అర్హత గల డ్రైవర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. గతంలో లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి రవాణా శాఖకు పంపించారు. ఈ ఏడాది మొత్తం 2,61,516 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ నెల 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. బడుగు, బలహీన వర్గాల లబ్ధిదారులే సింహభాగం సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సహాయం జమ కానుంది. వైఎస్సార్ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల్లో మొదటి స్థానంలో బీసీలు ఉండగా.. రెండో స్థానంలో ఎస్సీలు ఉన్నారు. 2022–23కు గాను మొత్తం లబ్ధిదారులు 2,61,516 మంది ఎంపిక కాగా.. వారిలో బీసీ లబ్ధిదారులు 1,44,164 మంది (55 శాతం) ఉన్నారు. తరువాత స్థానంలో ఎస్సీలు 63,594 మంది, ఎస్టీలు 10,472 మంది ఉన్నారు. నాలుగేళ్లలో రూ.1,025.96కోట్లు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మూడుసార్లు (2019–20, 2020–21, 2021–22) వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేశారు. 2022–23కు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్టు అవుతుంది. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ పథకాన్ని అందిస్తోంది. కరోనా పరిస్థితులతో రెండేళ్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా పేదలైన డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించింది. -
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. మూడు రోజులుగా..
సాక్షి, హైదరాబాద్: పరిచయం ఉన్న ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. చివరకు ఆ బాలిక చాదర్ఘట్ వద్ద ఉందని సమాచారం అందుకున్న పోలీసులు తనకి చికిత్స అందించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చుదువుతున్న ఓ మైనర్ బాలిక కాలేజ్ కోసం ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతుకుతుండగా మూడు రోజుల తర్వాత, సుల్తాన్ బజార్లో చాదర్‌ఘాట్‌లో ఆటో డ్రైవర్ వద్ద దొరికింది. బాలిక ఫిర్యాదు ప్రకారం.. నిందితులలో ఓ వ్యక్తి బాలికకు తెలియడంతో ఆమెకు మాయ మాటలు చెప్పి తనని తీసుకెళ్లినట్లు తెలిపింది. మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు వ్యక్తులు తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో నలుగురు ఆటో డ్రైవర్లు కాగా, ఒకరు కార్పెంటర్ని పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లి పేరుతో లైంగిక దాడి -
లైంగిక దాడి కేసు: ముగ్గురు ఆటో డ్రైవర్ల రిమాండ్
రాజేంద్రనగర్: ఇంటి వద్ద దింపుతామని ఆటోలో తీసుకువెళ్ళి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఆటోతో పాటు బాధితురాలి సెల్‌ఫోన్, రోల్డ్ గోల్డ్ చైన్, పర్సును స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. పురానాపూల్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల వివాహిత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండటంతో హైదర్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వచ్చి కల్లు తాగి ఇంటికి తిరిగి వెళ్ళేది. ఇందులో భాగంగానే ఈ నెల 13న హైదర్‌గూడ కంపౌండ్‌కు వచ్చింది. ఇదే సమయంలో కూకట్పల్లి వివేక్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింగ్‌రావు(32), జగద్గిరిగుట్టకు చెందిన నరేష్(31), బాలానగర్‌కు చెందిన ప్రసాద్(35) లు వచ్చారు. ఈ ముగ్గురూ మహిళతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు. తాము కూడా ఆటోలో పురానాపూల్ వైపు వెళ్తున్నామని ఇంటి వద్ద దించేస్తామని నమ్మించారు. అత్తాపూర్ మీదుగా తిరిగి రాజేంద్రనగర్ వైపు ఆటోను మళ్లించడంతో ఆ మహిళ ఎక్కడకు తీసుకువెళ్తున్నారని అడగడంతో హోటల్లో బిర్యానీ తిని వెళదామని తెలిపారు. హిమాయత్‌సాగర్ లార్డ్స్ కళాశాల వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి సెల్‌ఫోన్, మెడలోని రోల్డ్ గోల్డ్ చైన్, పర్సును తీసుకోని ఆటోలో పరారయ్యారు. అర్ధరాత్రి సమయంలో స్థానికుల సహాయంతో బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్లు కంపౌండ్‌తో పాటు ప్రధాన రహదారులు, హోటల్, హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఆటో నెంబర్‌ను గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు. -
మరో దారుణం: హైదరాబాద్లోయువతిపై ఆటో డ్రైవర్ల అఘాయిత్యం
సాక్షి హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రి కేంద్రంగా సామూహిక అత్యాచారం జరిగిందంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు ఇంకా కొలిక్కిరాకముందే.. ఈ చిక్కుముడి ఇంకా వీడకముందే దక్షిణ మండలంలోని సంతోష్‌నగర్ పోలీసులకు మరో సవాల్ ఎదురైంది. ఆటోలో ఎక్కిన తనకు మత్తుమందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల వ్యవధిలో నమోదైన రెండో కేసు కావడంతో నగర పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి డీసీపీ గజరావ్ భూపాల్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు... ► పిసల్‌బండ ప్రాంతానికి చెందిన యువతి సంతోష్‌నగర్‌లో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్లో పని చేస్తోంది. ప్రతి రోజూ తన విధులు ముగిసిన తర్వాత అక్కడ నుంచి పిసల్‌బండకు ఆటోలో వెళుతూంటుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు సంతోష్‌నగర్ వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో ఆమెతో పాటు ఓ మహిళ, ఇద్దరు యువకులు ఉన్నారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మహిళ దిగిపోగా.. డ్రైవర్‌తో పాటు ఇద్దరు యువకులు ఆటోలోనే ఉన్నారు. ఆ సమయంలో తనపై మత్తు మందు ప్రయోగించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ► బుధవారం ఉదయం తనకు మెలకువ వచ్చే సమయానికి షాహిన్‌నగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నానని, తనపై ఆ ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. ‘బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా కేసు నమోదు చేశాం. సంతోష్‌నగర్ నుంచి షాహిన్‌నగర్ వరకు ఉన్న మార్గాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నాం. వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. (చదవండి: ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్) -
మూడు లీటర్ల పెట్రోలు, డీజిల్ ఫ్రీ: డీలర్లు గగ్గోలు
తిరువనంతపురం: దేశంలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు అటు వాహనదారులకు, ఇటు రవాణా సంస్థలకు, ఆటో డ్రైవర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆటోడ్రైవర్లకు బంపర్ ఆఫర్ లభించింది. కేరళలోని ఓ పెట్రోల్ స్టేషన్ వద్ద మూడు లీటర్ల పెట్రోలును ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది. కర్ణాటక-కేరళ సరిహద్దులోని ఎన్మకాజే గ్రామ పంచాయతీలోని పెర్లాలోని ఫ్యూయల్ స్టేషన్ యజమాని ఆటోవాలాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. 311 మందికి మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్‌ను ఉచితంగా అందజేశారు. ఈ విషయాన్ని పెట్రోలు పంపు యజమాని అబ్దుల్లా మధుమోల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన గ్రామంలో కేవలం 100ఆటోలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ, చాలా దూర ప్రాంతాలనుంచి వచ్చి తమ ఉచిత ఆఫర్‌ను వినియోగించుకున్నారన్నారు. అంతేకాదు ఆ ఉచిత ఆఫర్‌ను నిలిపివేయాల్సిందిగా ఇతర డీలర్లు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే అందరూ ఈ విధంగా ఎంతో కొంత సాయం చేయాలని వారికి చెప్పారని, వారి బెదిరింపులు తన సాయాన్ని అడ్డుకోలేవని వెల్లడించారు. రెండు రోజులపాటు, లక్ష రూపాయల విలువైన ఇంధనాన్ని అందించినట్టు మధుమోల్ వివరించారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ వేళ ఇబ్బందుల్లో ఉన్న ఆటోడ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశం తప్ప బిజినెస్ ప్రమోషన్ కోసం కాదని ఆయన స్పష్టం చేయడం విశేషం. మరోవైపు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఆటో డ్రైవర్లు క్యూ కట్టారు. ఈ ఆఫర్‌పై వారంతా హర్షం వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఇలాంటి ఆపర్ ఎపుడూ చూడలేదంటూ మురిసిపోయారు. Shocking ! Pressure from dealers' association to stop my charity work, their claim is it affects other pumps. My counter attack - let all pumps do small charities, you can't stop me. https://t.co/dNzLLqpixb — ABDULLA MADUMOOLE ಅಬ್ದುಲ್ಲ ಮಾದುಮೂಲೆ (@AMadumool) June 14, 2021 -
Telangana: ఆర్టీసీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3వ తేదీ నుంచి రోజుకు సగటు 10 వేల మందికి టీకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టీకా పంపిణీపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేసిన సూచనలకు అనుగుణంగా సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్లు ఇవ్వాలని సూచించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులతో హరీశ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ టీకా డోసులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వచ్చే అంచనాలను సైతం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలు,ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, వైద్యవిద్య సంచాలకుడు రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య విభాగ సంచాలకుడు శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటి వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి స్థలాన్ని తనఖా పెట్టిన మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట : అందరి జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఆటో కార్మికులనూ కుదేలుచేసింది. కుటుంబపోషణకు దాతల సాయం కోసం ఎదురుచూసే పరిస్థితిలోకి నెట్టేసింది. వారి కుటుంబాల దయనీయస్థితిని పరిశీలించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. వారికి జీవితాలపై భరోసా కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయించి ఆర్థికంగా అండగా నిలిచారు. ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేనందున మూలధనం కోసం మంత్రి తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.45 లక్షలు అప్పు తీసుకొని సంఘంలో జమచేయించారు. సంఘాన్ని గురువారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, లైసెన్స్, జత యూనిఫాం అందించనున్నారు. చదవండి: మ్యారేజ్ బ్యూరో: ఇక్కడ వ్యవసాయం చేసే వారికే పెళ్లిళ్లు.. మంత్రి మాటతో ఏకతాటిపైకి.. కరోనా తదనంతరం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జిల్లావ్యాప్తంగా గల 855 మంది ఆటో కార్మికులు మంత్రి సూచనతో.. సహకార పరప తి సంఘంగా ఏర్పడాలనే అభిప్రాయానికొచ్చా రు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆటో కార్మికుల సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం విధివిధానాలపై అధికారులను కలవగా.. పరపతి సంఘం ఏర్పాటు, రుణాల మంజూరుకు మూలధనం అవసరమని చెప్పా రు. దీంతో సభ్యులు ఒక్కొక్కరు తమ వాటాధనంగా రూ.1,110 చొప్పున రూ. 8,55,000 జమ చేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులకు రూ.55 వేలు వినియోగించారు. అయితే మిగిలిన మొత్తం మూలధనంగా సరిపోదని తెలిసి దిగాలుపడ్డారు. మంత్రి ఇంటి స్థలం తనఖా పెట్టి.. ఆటోడ్రైవర్లంతా మంత్రి హరీశ్‌రావును కలిసి విషయం చెప్పారు. స్పందించిన మంత్రి.. ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేదని గుర్తించారు. వెంటనే సిద్దిపేట పట్టణం రంగధాంపల్లిలో గల తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.45 లక్షలు అప్పు తీసుకొని పరపతి సంఘంలో జమచేయించారు. ఇలా మొత్తం రూ.53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది. దీంతోపాటు తన మిత్రుల సహకారంతో 666 మంది ఆటోకార్మికులకు రూ. 2లక్షల చొప్పున బీమా కోసం ప్రీమియం కూడా చెల్లించారు. సిద్దిపేట డీటీవోతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పించారు. సంఘం నిర్వహణకు ప్రణాళిక పరపతి సంఘం నిర్వహణకు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, రిటైర్డ్ పోలీస్ అధికారి, డాక్టర్, అకౌంటెంట్‌తో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. నెలవారీ పొదుపు, రుణాల మంజూరు వంటివి ఇది చూసుకుంటుంది. సభ్యుల ఇళ్లలో ఎవరైనా చనిపోయినా, పెళ్లయినా సంఘం నుంచి రూ. 5వేలు అందిస్తారు. సభ్యులకు నైతిక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబపోషణ, పిల్లల చదువులు, ఆటోల్లో ప్రయాణించే వారితో మర్యాదగా నడుచుకోవడం మొదలైన అంశాలపై ప్రతీ నెలా శిక్షణనిస్తారు. భరోసా కల్పించేందుకే.. కరోనా కాలంలో ఆటోడ్రైవర్లు పడిన ఇబ్బందులు, కుటుంబాల పరిస్థితి విన్నాక వారికి ఆర్థిక, సామాజికంగా భరోసా కల్పించాలని అనుకున్నాం. పరపతి సంఘం ఏర్పాటుచేస్తే తక్కువ వడ్డీ, సులభ వాయిదాలకు రుణాలు వస్తాయి. బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, మూలధనాన్ని వారు సమకూర్చుకోలేని పరిస్థితి. అందుకే నాకు తోచిన, చేతనైన సాయం చేశాను. ఈ సాయంతో ఆటోవాలాలు నిలదొక్కుకుంటే చాలు. – తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జీవితాల్లో మార్పులు తేవాలని.. ఆటో కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వారి జీవితాల్లో మార్పునకు సంఘం ద్వారా కృషి చేస్తాం. సిద్దిపేట ఆటో కార్మికులంటే ఆదర్శంగా నిలవాలనేది మా ఆలోచన. సంఘం ఏర్పాటుకు మంత్రి హరీశ్‌రావు చేసిన త్యాగం మరువలేం. – పాల సాయిరాం, సంఘం అధ్యక్షుడు చేసిన కష్టం అప్పులకే పోయేది ఆటో నడిస్తేనే కుటుంబాలు గడుస్తాయి. రిపేర్, కొత్త ఆటోలు కొనుగోలు, ఇంటి ఖర్చులకు అధిక వడ్డీలకు అప్పులు చేసేవాళ్లం. రోజువారీ సంపాదన అప్పులు తీర్చేందుకే సరిపోయేది. మంత్రి హరీశ్‌రావు ఆర్థిక చేయూతతో మా జీవితాలు నిలబడ్డాయి. – ఎండీ ఉమర్, పరపతి సంఘం సభ్యుడు -
ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులకు నిరసన
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులకు నిరసనగా ఆటో డ్రైవర్లు గురువారం ఖైరతాబాద్‌లోని కుషాల్ టవర్స్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రైవేటు ఫైనాన్సర్లలో దోపిడీ అరికట్టాలంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు నెలలుగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఫైనాన్సర్లు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. వేలకు వేలు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఓ ఆటో డ్రైవర్‌పై ఫైనాన్సర్లు దాడి చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఫైనాన్సర్లపై పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. లైసెన్స్ లేని ప్రైవేట్ ఫైనాన్సర్లు దోపిడీ దందా చేస్తున్నారని మండిపడ్డారు. -
ఆటో.. ఎటో..!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ దెబ్బకు వేలాది మంది ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కొందరు సొంత ఊళ్లకు వెళ్లారు. కానీ అక్కడ కూడా పనుల్లేక తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కరోనా కారణంగా ఆటో ఫైనాన్షియర్లకు చెల్లించాల్సిన ఈఎంఐలు వాయిదా పడ్డాయి. దీంతో కిస్తీ వసూళ్ల కోసం వారు ఇప్పుడు ఆటోడ్రైవర్లపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. కొద్దిపాటి అప్పు ఉన్నా ఆటోలను గుంజుకెళుతున్నారు. గ్రేటర్లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 లక్షల మంది ఆటో సేవలను వినియోగించుకుంటారు. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఎల్బీనగర్, ఉప్పల్, మెహదీపట్నం నగరంలో ప్రధానమైన కూడళ్లు. ఇవికాక చిన్నాపెద్ద ఆస్పత్రులు ఆటోడ్రైవర్లకు ఆదాయ మార్గాలు. కానీ కోవిడ్ కారణంగా ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది. బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లకు కూడా బ్రేకులు పడ్డాయి. దీంతో రైలు దిగి, బస్సు దిగి ఆటో ఎక్కేవారు లేరు. ఇక ఆస్పత్రులకు వెళ్లేవారు కూడా వీలైనంత వరకు సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. కోవిడ్ వైరస్ దృష్ట్యా ఆటోలు, క్యాబ్‌లు వినియోగించేందుకు జనం భయం పడుతున్నారు. రవాణారంగంలో ఉన్న అన్ని వర్గాలపైనా ఇది ముప్పేట దాడిగా మారింది. ఈ క్రమం ఆటోడ్రైవర్లు మరింత అతలాకుతలమయ్యారు. చివరకు స్కూళ్లు, కాలేజీలు, తదితర విద్యాసంస్థలు కూడా మూసి ఉండడంతో గత విద్యాసంవత్సరంలో విద్యార్థుల తరలింపు కోసం ఆటోలు నడిపినవారు కూడా ఇప్పుడు ఎలాంటి ఆదాయమార్గం లేక విలవిలాడుతున్నారు. ‘సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ వరకు ఒకప్పుడు మంచి గిరాకీ ఉండేది. రోజుకు రూ.800 నుంచి రూ.1000 వరకు కూడా సంపాదించుకున్నాం. ఇప్పుడు రాత్రింబవళ్లు వేచి ఉన్నా రూ.200 కంటే ఎక్కువ రావడం లేదు. ఇంటి కిరాయిలు, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. దీనికి తోడు కిస్తీ కట్టాలని ఫైనాన్స్ ఇచ్చినవారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ’’ అడిక్మెట్కు చెందిన శంకర్ ఆవేదన ఇది. ముందు నుయ్యి..వెనుక గొయ్యి... ‘‘ బండి బయటకు తీయాలంటే కూడా భయమేస్తుంది. చాలామంది ప్రయాణికులు ఆటోల వల్ల, డ్రైవర్ల వల్ల కరోనా వస్తుందేమోననుకుంటున్నారు. కానీ ప్రయాణికుల వల్ల వస్తుందేమోనని మేం భయపడుతున్నాం. అయినా సరే మరో గత్యంతరం లేక బండి నడుపుతున్నాం. లేకపోతే ఇంటిల్లిపాది పస్తులుండాల్సి వస్తుంది.’’ ఈసీఐఎల్‌కు చెందిన రాములు ఆందోళన ఇది. కరోనా కారణంగా గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తమను ఫైనాన్షియర్లు కాల్చుకుతింటున్నారని, ఆటోలను స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా బస్సులు బంద్ అయితే ఆటోలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఆటోలు వినియోగించేందుకు కూడా జనం వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు రోజురోజకు పెరుగుతున్న వైరస్ ఉధృతి వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. షాపింగ్ సెంటర్లు, మార్కెట్లు వెలవెలపోతున్నాయి. దీంతో ఆటోవాలాలు సైతం దివాలా తీశారు. ఫైనాన్షియర్ల వేధింపులు ఆపాలి కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్ వడ్డీవ్యాపారులు తమ ఆగడాలను ఆపడం లేదు. వసూళ్లను నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పినా అదేపనిగా వేధిస్తున్నారు. దౌర్జన్యంగా ఆటోలను జఫ్తు చేసుకుంటున్నారు. ఈ దాడులను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఏ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి ఈ పరిస్థితి ఇలాగే ఉంటే బతకడం కష్టం. ప్రభుత్వం ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాలు పంపిణీ చేసినట్టుగానే ఇప్పుడు కూడా ప్రతి ఆటోడ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయంతోపాటు, నిత్యావసర వస్తువులు ఇవ్వాలి.– భాస్కర్, సికింద్రాబాద్ ‘ ఇంట్లో ఉంటే బతకలేం. రోడ్డెక్కితే గిరాకీ లేదు. బండి బయటకు తీస్తే చాలు వాయిదాలు చెల్లించాలనివేధింపులు.....’ సీతాఫల్‌మండికి చెందిన ఆటోడ్రైవర్ వెంకటేష్ ఆవేదన ఇది. సొంత ఊళ్లోనూ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. సాగు చేసుకొనేందుకు భూమి లేదు. ఉన్న పాత ఇల్లు ఒకటీ ఈ మధ్యే కూలిపోయింది. ప్రైవేట్ ఫైనాన్షియర్ వద్ద రుణప్రాతిపదికపైన తీసుకున్న ఆటో తప్ప మరోజీవనాధారం లేదు. కరోనాకు ముందు ఆ ఆటోపైనే కుటుంబాన్ని పోషించాడు. ఇద్దరు కూతుళ్లలో ఒక అమ్మాయి పెళ్లి చేశాడు. కానీఅకస్మాత్తుగా వచ్చిన కరోనా వైరస్ వెంకటేష్ కుటుంబాన్ని కష్టాలసుడి గుండంలోకి నెట్టింది. రాత్రింబవళ్లు పడిగాపులు కాసినా పట్టుమని పదిమంది కూడా ఆటో ఎక్కడం లేదు. ఇది ఒక్క వెంకటేష్ కథ మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లో జీవనం కొనసాగిస్తున్నఅనేక మంది ఆటోడ్రైవర్ల దుస్థితి. -
అందరికీ మంచి జరగాలి
-
మీ అన్నగా, తమ్ముడిగా సాయం
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న వారందరికీ ఒక అన్నగా, తమ్ముడిగా ఆర్థిక సాయం చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ గల వారికి గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రెండవ ఏడాది రూ.10 వేల చొప్పున నగదును జమ చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.262.49 కోట్లు జమ అయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది కొత్తగా 37,756 మంది ఈ పథకంలో లబ్ధిదారులయ్యారు. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు నడిపేవారిని ఉద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. అందరికీ మంచి జరగాలి ► గత ఏడాది అక్టోబర్ 4న వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించాం. అయితే ఈ ఏడాది కోవిడ్‌తో లాక్డౌన్ వల్ల బతకడం కష్టమైంది. ఆటోలు, ట్యాక్సీలు తిరగక ఆ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి కాబట్టి వారికి మేలు చేయడం కోసం ఈ ఏడాది జూన్ 4నే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ► ఎక్కడైనా, ఎవరికైనా అర్హత ఉండి ఈ పథకంలో లబ్ధి కలగకపోతే ఆందోళన చెందొద్దు. నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైతే చాలు పథకం వర్తింప చేయాలని స్పష్టం చేశాం. అవినీతికి తావు లేకుండా ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. ► ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాల్లో లేదా స్పందన యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే స్పందన హెల్ప్‌లైన్ నంబరు 1902కు కాల్ చేయాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటే వచ్చే నెల 4వ తేదీన ఆర్థిక సహాయం చేస్తాం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఆలోచించాను.. అమలు చేశాను.. ► పాదయాత్ర సందర్భంగా 2018 మే నెలలో ఏలూరులో మాట ఇచ్చాను. ప్రతి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇన్సూరెన్సు కట్టాలి. అది కడితేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ప్రీమియం ఎక్కువ కావడంతో డ్రైవర్లు ఇబ్బంది పడే వారు. ఎఫ్‌సీ లేకపోతే రోజుకు రూ.50 జరిమానా విధించే వారు. ► అప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో డ్రైవర్లు వచ్చి నన్ను కలిశారు. ఎఫ్‌సీ కోసం ఒకేసారి దాదాపు రూ.10 వేలు ఖర్చు చేయాలి. లేదంటే రోజుకు రూ.50 ఫైన్ ఎలా కడతారని ఆలోచించాను. ఏలూరు సభలో మాట ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక అమలు చేశాను. ఈ సారి మళ్లీ మీ తమ్ముడిగా, అన్నగా సహాయం చేస్తున్నాను. పాత బాకీల కింద జమ చేసుకోరు ► గత ఏడాది ఆటోలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్ల ఖాతాలో నగదు వేస్తున్నప్పుడు, దాన్ని పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేశాం. అప్పుడు దాదాపు రూ.236 కోట్లు ఖర్చు చేశాం. ► ఈసారి రూ.262 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. గత ఏడాది కంటే ఈసారి 37,756 మంది కొత్త లబ్ధిదారులు చేరారు. డబ్బులు అందిన సంతోషంతో అనంతపురానికి చెందిన రామలక్ష్మి క్యాలెండర్ ప్రకారం సేవలు ► అన్ని వర్గాలకు సేవలందించే విధంగా క్యాలెండర్ ప్రకటించాం. అందులో భాగంగా ఇవాళ (గురువారం) ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ► ఈ నెల 10వ తేదీన రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు సహాయం అందిస్తాం. ఆ తర్వాత 17న నేతన్న నేస్తం, 24న కాపు నేస్తం, 29న ఎంఎస్ఎంఈలకు రెండో విడత లబ్ధి కలిగిస్తాం. అన్ని వర్గాల వారికి న్యాయం ► పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిది. ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఎస్సీలు 61,390 మంది, ఎస్టీలు 10,049 మంది, బీసీలు 1,17,096 మంది, ఈబీసీలు 14,590 మంది, మైనారిటీలు 28,118 మంది, కాపులు 29,643 మంది, బ్రాహ్మణులు 581 మంది, క్రైస్తవులు 1,026 మంది ఉన్నారు. ► అందరూ కలిపి మొత్తం 2,62,493 మందికి ఈ ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో లబ్ధి చేకూరుస్తున్నాం. గత ఏడాది లబ్ధి పొందలేకపోయిన వారికీ.. ► గత ఏడాది 8,600 మంది మైనారిటీ కార్పొరేషన్ లబ్ధిదారులు, మరో 3,600 మంది బ్యాంక్ ఖాతాల వివరాలు సక్రమంగా లేకపోవడంతో వారికి ఆర్థిక సహాయం అందలేదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. అందువల్ల ఆ 12,200 మందికి గత ఏడాది మొత్తంతో పాటు ఈ ఏడాది సొమ్ము కూడా శుక్రవారం సాయంత్రంలోగా జమ చేస్తామని చెప్పారు. ► వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో గత ఏడాది 2,36,334 మందికి లబ్ధి చేకూర్చగా, వారిలో 11,595 మంది వాహనాలు అమ్ముకున్నారని ఆయన వెల్లడించారు. దీంతో వారు అనర్హులు కాగా, 2,24,739 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ►ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 849 మంది అనర్హులుగా తేలారని చెప్పారు. మిగిలిన 37,756 మందిని అర్హులుగా గుర్తించామని, దీంతో ఈ ఏడాది మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,62,493 కు చేరిందన్నారు. ►కార్యక్రమం ప్రారంభంలో వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, సీఎస్ నీలం సాహ్ని, రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీ మేలు మరవలేం నేను ఎంఏ చదివాను. ఉపాధి కోసం ఆటో తోలుతున్నా. ఇంత వరకూ నేను ఎప్పుడూ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందలేదు. తొలిసారి మీ ప్రభుత్వంలో గవర్నమెంటు సొమ్ము పది వేలు తిన్నాను సార్. గతంలో ఇన్సూరెన్స్, ఫిటినెస్ వంటి వాటి కోసం ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ ఖర్చులు మీరిచ్చిన డబ్బులతో పెట్టగలగుతున్నాం. ఆటో డ్రైవర్లకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇన్సూరెన్స్ కోసం బయట రూ.7,300 చెల్లిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా చేయిస్తే ఇంకా తక్కువ మొత్తంతోనే వీలవుతుంది. తక్కువ వడ్డీకి రుణాలిప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని వర్గాల వారికి మీరు చేస్తున్న మేలు మరచిపోము. – భాగ్యలక్ష్మి, మహిళా ఆటో డ్రైవర్, అనంతపురం. -
ఆందోళనలో ఆటోవాలా
లాక్‌డౌన్‌తో ఆటో ఇంటికే పరిమితమైంది. దీంతో బతుకు బండిని లాగలేక ఆటో డ్రైవర్లు ఆగమవుతున్నారు. రోజూ ఎంతో కొంత ఆదాయం వస్తే గాని పూటగడవని స్థితిలో కరోనా వచ్చి వారి కుటుంబాలను ఆగం చేసింది. బండి ఫైనాన్స్ కట్టాల్సిన సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి లేక వారి బతుకు చిత్రం పూర్తిగా మారిపోయింది. డబ్బులు లేక ఏ పని దొరక్క పూట గడవని స్థితికి చేరుకున్నారు. ఈ మహమ్మారి నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో.. ఎప్పుడు ఆటోలు రోడ్డెక్కి బతుకులు బాగుపడతాయోననిఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో 2435 ఆటోలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజ రవాణాలో ప్రభుత్వ బస్సుల తరువాత అంతటి స్థానం ఆటోలు అక్రమించాయి. దీంతో పాటుగా పట్టణాలో ఒక చోటు నుంచి మరోచోటుకు ఈ ఆటోల ప్రయాణాలే కీలకంగా ఉంటాయి. దీంతో ఆటోల వినియోగం అధికంగా ఉంటుంది. అనేక మంది నిరుద్యోగ యువత ఈ ఆటో నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అనేక మంది యువత రోజు వారి పనులు చేసుకుంటూ సాయంత్రం నుంచి ఉదయం వరకు ఆటోలు నడుపుతూ తమ జీవనం సాగిస్తున్నారు. పూట పూటకు గండమే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌తో వీరి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజూ బండి రోడ్కెక్కితే కాని పూట గడవని పరిస్థితిలో ఆటోవాలాలు ఉన్నారు. కరోనాతో ఆటో నడపక వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పాడింది. దీనికి తోడు వారు తీసుకున్న అప్పులతో అనేక మంది ఆటోవాలల బతుకు చిధ్రం అవుతోంది. నిరుద్యోగ యువకుల కడుపు నింపుతున్న ఆటో ప్రస్తుతం కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటోవాలాలు వేడుకుంటున్నారు. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఆటోవాలాలు రోజువారీ ఫైనాన్స్ తీసుకొని, ఇతరుల వద్ద వడ్డీలకు రుణం తీసుకొని ఆటోలు ఖరీధు చేస్తారు. వారు రోజు ఆటో నడుపగా వచ్చిన డబ్బుతో రోజువారీ ఫైనాన్స్ కట్టి మిగిలిన డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కానీ నెల రోజులుగా ఆటోలు రోడ్లపై తిరుగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. తాము తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని, ఈ లాక్డౌన్లో కుటుంబం గడవడమే కష్టంగా మారిందని ఆటోవాలా ఆందోళన చెందుతున్నాడు. ఆదుకోవాలి నేను ప్రతీ రోజు సిద్దిపేట పట్టణంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ లాక్‌డౌన్‌తో నెల రోజులుగా ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ ఆటో నడిపితేనే కుటుంబం గడుస్తది.. కానీ నేడు కుటుంబాన్ని నడపటం భారంగా మారింది. ప్రభుత్వం మా ఆటోవాలాలను ఆదుకోవాలి.– పల్లె అనిల్ గౌడ్, మిట్టపల్లి, ఆటో డ్రైవర్ ఇబ్బందులు పడుతున్నాం ప్రతి రోజూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సమయంలో కరోనా ఆర్థికంగా దెబ్బతీసింది. ఆటో నడిపితేనే నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తాయి. కానీ ఈ లాక్‌డౌన్‌తో పరిస్థితి దయనీయంగా మారింది. డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి.– మల్లేశం, చందాపూర్, ఆటో డ్రైవర్ -
కిస్తీలు కట్టాల్సిందే!
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో మూడు నెలలపాటు బ్యాంకు లోన్లు కట్టకున్నా చర్యలేమీ ఉండవని స్వయంగా ఆర్బీఐ ప్రకటించినా.. కిస్తీలు కట్టాల్సిందేనని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు వెంటపడుతున్నాయి. రుణగ్రహీతలపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో లోన్లు తీసుకున్నవారు అయోమయానికి గురవుతున్నారు. ఈయన పేరు భరత్‌గౌడ్. ఆరు నెలల క్రితం ఓ ఫైనాన్స్ కంపెనీ ద్వారా బైకును కొనుగోలు చేశాడు. ప్రతి నెల ఐదో తేదీన కిస్తీని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులకు ఆర్బీఐ మూడు నెలలపాటు మినహాయింపు ఇవ్వడంతో కొంత ఊరట చెందాడు. అయితే ఈఎంఐ చెల్లించకపోతే వడ్డీతోపాటు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని సదరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారని భరత్ పేర్కొంటున్నాడు. దీంతో చేసేదేమీలేక ఈఎంఐ చెల్లించాడు. రామారెడ్డి: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మూడు నెలలపాటు ఈఎంఐలపై మారటోరియం విధించింది. జిల్లాలో 47 వేల వరకు ఆటోలు, కార్లు, మరో 40 వేల వరకు బైక్‌లను వివిధ ఫైనాన్స్ సంస్థలనుంచి రుణాలు పొంది కొనుగోలు చేశారు. ఆర్బీఐ నిర్ణయంతో జూన్ వరకు ఈఎంఐలు చెల్లించాల్సిన బాధ తప్పిందని రుణగ్రహీతలు కాస్త ఊరట చెందారు. అయితే కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. ఈఎంఐలు కట్టాల్సిందే అంటున్నాయి. ఈఎంఐకి సరిపడా డబ్బు బ్యాంకు ఖాతాలో ఉంచాలని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతుండడంతో రుణగ్రహీతలు ఆందోళన చెందుతున్నారు. ఒత్తిడి తెస్తున్న ప్రైవేటు ఫైనాన్స్‌లు.. బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ల ద్వారా జిల్లాలో అనేక మంది ఆటోలు, కార్లు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. అయితే లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందిపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయంతో వారు ఎంతో ఊరట చెందారు. అయితే కొన్ని ఫైనాన్స్ కంపెనీలు మాత్రం ఈఎంఐలను చెల్లించాల్సిందేనని వాహదారులకు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నారు. ఈఎంఐకి సరిపడా డబ్బులను బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచకపోతే చెక్‌బౌన్స్‌కు సంబంధించి జరిమానా చెల్లించాల్సి వస్తుందని, వడ్డీ కూడా పడుతుందని చెబుతున్నారు. ఆటోవాలాల పరిస్థితి దారుణం... రోజంతా ఆటో నడిస్తే డిజిల్ ఖర్చులు ఇతర ఖర్చులుపోను రోజూ రూ. 300 నుంచి రూ. 500 వరకు మిగులుతాయి. వీటిని పోగుచేసి ఈఎంఐ చెల్లిస్తుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో వారికి ఉపాధి కరువైంది. ఆటోలు రోడ్డెక్కడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కిస్తీలు ఎలా కట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిస్తీలు ఎట్ల కట్టాలి లోన్ తీసుకుని ఆటో కొనుక్కున్నాను. ప్రస్తుతం అంతా బంద్ ఉంది. ఆటోలు నడవడం లేదు. లోన్ కిస్తీ ఎట్ల కట్టాలో తెలుస్తలేదు. అధికారులు స్పందించి, కిస్తీలను వాయిదా వేయించాలి.–వెంకట్‌గౌడ్,ఆటో డ్రైవర్, యాడారం రూ. 1,600 ఫైన్ పడుతుందంటున్నరు ఫైనాన్స్ తీసుకుని ఆటోను కొనుగోలు చేశాను. లాక్‌డౌన్‌తో పనిలేకుండాపోయింది. ఫైనాన్స్ సంస్థ వారు ఫోన్ చేసి కిస్తీ కట్టాలంటున్నరు. లేకపోతే నెలకు రూ. 1,600 వరకు ఫైన్ పడుతుందంటున్నరు. ఏం చేయాలో తోచడం లేదు. – సురేశ్, ఆటో డ్రైవర్, రామారెడ్డి -
ప్యాసింజర్ల వేషంలో ఆటోవాలాలకు షాక్
సాక్షి,బెంగళూరు: బెంగళూరులో ఆటో డ్రైవర్లకు పోలీసులు గట్టి షాకిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న5,200 మందికి పైగా డ్రైవర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, జరిమానా విధించారు. ప్యాసింజర్లలా నటించి మరీ వారిపై నిఘా పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. నగరంలోని 7 మండలాల్లోని డ్రైవర్లనుంచి రూ.8,06,200 జరిమానా వసూలు చేశారు. ఆటో డ్రైవర్లపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో కొన్ని జోన్లలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బీఆర్ రవికాంత్ గౌడ తెలిపారు. నగరంలోని ఇతర మండలాల్లో కూడా త్వరలో ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. పదిమంది ఆటో డ్రైవర్లలో ఇద్దరు మాత్రమే మీటర్‌పై 4-5 కిలోమీటర్ల దూరానికి వెళ్లడానికి అంగీకరించినట్టు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. యూనిఫాం ధరించకపోవడం, సరియైన పత్రాలు లేకపోవడంతోపాటు, కొన్ని ఏరియాలకు వెళ్లడానికి నిరాకరించడం, ఎక్కువ ఛార్జీలు డిమాండ్ చేయడం, మీటర్ చార్జీల కంటే ఎక్కువ వసూలు లాంటి ఆరోపణలపై పలువురు ఆటో డ్రైవర్లు బుక్ అయ్యారు. నేరస్థులుగా తేలిన వారికి భారీ జరిమానా విధించారు. అలాగే కొన్ని ఆటోలను సీజ్ చేశారు. కొంతమంది ఆటో డ్రైవర్లు అధికంగా ఛార్జ్ చేస్తున్నందున, అన్ని ఆటో డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తోందని బెంగళూరులోని ఆదర్ష్ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు నారాయణ్ స్వామి తెలిపారు. దీంతో ప్రజలు ఆటోలకు బదులుగా ఉబెర్/ఓలా క్యాబ్‌లవైపు మొగ్గు చూపుతున్నారనీ, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఇలాంటి డ్రైవ్ చేపట్టిన బెంగళూరు పోలీసులు 6800 కేసులను నమోదు చేశారు. అలాగే జరిమానాగా రూ. 72 లక్షలను వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
పాలకొల్లులో ఆటోడ్రవర్ల ర్యాలీ
-
ఉరవకొండలో ఆటో కార్మికుల సంబరాలు
సాక్షి, అనంతపురం: ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుని..వారికి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండలో సోమవారం విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆర్థిక సాయం అందించిన సీఎం జగన్‌కు ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా హామీలను గాలికొదిలేయకుండా ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నాలుగు నెలల్లోనే నెరవేర్చి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారన్నారు. (చదవండి: నేను విన్నాను.. నేను చేశాను : సీఎం జగన్) -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర’గా నామకరణం చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు అందించే రూ.10 వేలు వాహన బీమా, ఫిట్నెస్, మరమ్మతులకు ఉపయోగపడతాయన్నారు. బుధవారం అర్ధరాత్రితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిం దని.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్ని గ్రామ/వార్డు వలంటీర్లకు పంపించామని ఇప్పటి వరకు 74 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులపై పరిశీలన జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో అందిన దరఖాస్తుల్ని ఎంపీడీవోలు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు 45,223 దరఖాస్తుల్ని ఆమోదించారన్నారు. 17,230 దరఖా స్తులకు కలెక్టర్లు మంజూరు అనుమతులిచ్చారని వివరించారు. అధికంగా విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అక్టోబర్ 5న అర్హులైన డ్రైవర్లకు నగదు చెల్లింపుల రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారని చెప్పారు. -
‘ఆర్థిక సాయానికి 25లోగా దరఖాస్తు చేసుకోండి’
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందజేయనున్న రూ.10 వేలు ఆర్థిక సాయానికి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరూ ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం వెల్లడించారు. సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్న సంగతి తెలిసిందే. భార్య, భర్తను ఓ యూనిట్‌గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా.. మేజర్లు అయితే చాలు.. వారిని మరో యూనిట్‌గా పరిగణిస్తారు. వారు కూడా ఆర్థిక సాయం పొందడానికి అర్హులేనని రవాణాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. (చదవండి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు) వర్షాలు తగ్గిన తర్వాత 160 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపడుతామని తెలిపారు. 86 వేల దరఖాస్తులు ఆన్లైన్లో.. 40 వేల దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో అందాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో లైసెన్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, ట్యాక్సీలు నడుపుకునే వారు కూడా ఈ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చని కృష్ణబాబు వెల్లడించారు. అక్టోబర్ 4 నుంచి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ అవుతుందని చెప్పారు. (వచ్చే నెల 4 నుంచి ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు) -
ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయానికి.. భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. మొదటి రోజు 7,559 మంది వాహన యజమానులు కమ్ డ్రైవర్లు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటోడ్రైవర్ల ఆర్థిక స్థితిగతులను చూసి చలించిపోయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బీమా, ఫిట్నెస్, మరమ్మత్తుల కోసం ఏడాదికి రూ.10 వేలు అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారుచేశారు. అంతేకాక.. అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణా మంత్రి, అధికారులతో ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సాయంపై కాలపరిమితి నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి పథకానికి దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని, ఇదే నెల 25న దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేదీగా ఖరారు చేశారు. 30లోగా గ్రామ/వార్డు వలంటీర్లు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 1లోగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని అందిస్తారు. అక్టోబర్ 4 నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీంతో రవాణా శాఖ అధికారులు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దరఖాస్తులను రవాణా శాఖ వెబ్సైట్ (www. aptransport. org), అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు/ఆర్టీవోలు/ఎంవీఐ కార్యాలయాలతో పాటు మీసేవ, సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకునేందుకు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం పొందేందుకు దరఖాస్తుదారులకు గ్రామ/వార్డు వలంటీర్లకు సహకారం అందిస్తారు. 25లోగా రిజిస్ట్రేషన్ అయిన వాటికే వర్తింపు ఇదిలా ఉంటే.. గ్రామ/వార్డు వలంటీర్లు దరఖాస్తుదారుడి నుంచి ఆధార్, తెల్ల రేషన్ కార్డులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ, అకౌంట్ వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, మైనార్టీ అయితే) జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం యజమాని వద్ద వాహనం ఉందో లేదో చూడాలి. ఆ తర్వాత దరఖాస్తులను ఎంపీడీవో/సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్ కమిషనర్/బిల్ కలెక్టర్లకు పంపిస్తారు. కాగా, సొంత ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 25లోగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓనర్ కమ్ డ్రైవర్‌గా ఉండే వారికి ఈ పథకం వర్తిస్తుందని రవాణా శాఖ పేర్కొంది. వాహనం భార్య పేరున ఉండి భర్త వాహనం నడుపుతుంటే సాయం భార్యకు వర్తిస్తుందని తెలిపింది. అన్ని రవాణా కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు కాగా, ఈ పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రతి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేసినట్లు రవాణశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో రవాణా కమిషనర్ కార్యాలయంలోని సంయుక్త రవాణా కమిషనర్ (ఐటీ) నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటుచేశామన్నారు. ఎంతమంది అర్హులున్నప్పటికీ వారందరికీ ఈ ఆర్థికసాయం వర్తింపజేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చినట్లు ఆయన చెప్పారు. -
రూ.10 వేల సాయం.. 12నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
సాక్షి, అమరావతి: సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలని అనుకున్నామన్నారు. కానీ మార్గదర్శకాలు సరళతరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లేనిపోని నిబంధనలతో పథకాన్ని నిరాకరించే విధంగా, విసుగు తెప్పించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మార్గదర్శకాలను సరళీకరిస్తున్నామన్నారు. మార్గదర్శకాలన్నింటిని మీడియా ద్వారా వెల్లడించిన తర్వాత ఈ నెల 12న ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతామని కృష్ణబాబు తెలిపారు. -
రూ. పది వేల సాయానికి అర్హతలివే..
-
రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ
సాక్షి, అమరావతి: ఆటో రిక్షాలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. నేటి (మంగళవారం) నుంచి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్సైట్ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్ ఎన్కంబర్డ్) ఖాతాను తెరవాలి. ఈ ఖాతాను తెరిచేందుకు లబ్ధిదారుడికి గ్రామ/వార్డు వలంటీర్ సాయపడతాడు. ఒక వ్యక్తికి, ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం/మున్సిపాలిటీలు/నగర కార్పొరేషన్లకు వెళతాయి. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అనంతరం కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్ఎంఎస్ డేటాబేస్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాల ఆధారంగా రవాణా శాఖ కమిషనర్ లబ్ధిదారులకు సమగ్ర బిల్లు అందించేందుకు అనుమతిస్తారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు. కాగా, దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్ల పరిశీలన కోసం రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రూ. పది వేల సాయానికి అర్హతలివే.. - ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్ సొంతదై ఉండి, సొంతగా నడుపుకోవాలి. - ఆటో రిక్షా/లైట్ మోటారు వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. - సంబంధిత వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పన్నుల రశీదులు) సరిగా ఉండాలి. - అర్హుడు దారిద్య్ర రేఖకు దిగువన/తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. - దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి. -
ఆటోలపై పోలీస్ పంజా..
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్) : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో అక్రమ దందాలకు, అసాంఘిక కార్యకలపాలకు చరమగీతం పాడేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు అక్రమార్కులపై రామగుండం కొత్వాల్ కొరడ ఝలిపిస్తున్నారు. ఇదే క్రమంలో కమిషనర్ సత్యనారాయణ ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆటోలపై ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో సుమారు 10 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కొందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటోలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. మరి కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి ప్రయాణికులను టార్గెట్ చేసి దాడికి పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. దీంతో పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెండు జిల్లాల పోలీస్ అధికారులకు గురువారం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆటోల్లో అదనపు సీట్ల తొలగింపు ఆటోడ్రైవర్ సీటు పక్కన అదనపు సీట్లు ఏర్పాటు చేసి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదనపు సీటు కలిగి ఉండి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండగా పట్టుబడిన ఆటోలకు మొదటి సారి రూ. 1000 జరిమానా విధించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. మరో సారి అదే తప్పు చేసి పట్టుబడితే రూ. 2 వేలు జరిమానాతో పాటు ఆటో సీజ్ చేసి 10 రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతారు. మూడో సారి అలానే జరిగితే క్రిమినల్ కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తారు. ఓనర్లు లైసెన్స్ లేని డ్రైవర్లకు ఆటోలు నడపడానికి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నుంచి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిపై, ఆటో యజమానులపై కేసులు నమోదు చేయనున్నారు. ఆరుగురిని మించి తరలించరాదు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలో ఆరుగురు కంటే ఎక్కువ విద్యార్థులను తరలించరాదు. కానీ చాలా ఆటోల్లో 10కి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్నారు. దీని వల్ల ప్ర మాదం జరిగే అవకాశాలు ఎ క్కువ. అంతే కాకుండా పొరపాటున ఏదైన ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం సంభవిస్తుంది. ఇక నుంచి ఆరుగురి కంటే ఎక్కువ స్కూల్ విద్యార్థులను ఆటోలో తరలిస్తే డ్రైవర్లతో పాటు పాఠశాల యాజమాన్యాలపై సైతం కేసులు నమోదు చేస్తారు. అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆటొలో ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేసి మా యలో పడేసి దాడులకు పాల్పడుతున్నారు. ప్ర యాణికుల వద్ద అధిక కిరాయి వసూలు చేసిన వారిపై సైతం చర్యలు తీసుకోనున్నారు. పట్ట ణాల్లో బ్లూ కోట్ పోలీసులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. కొందరు పోలీసులు ఎవరికి తెలియకుండా మఫ్టిలో ఉంటూ నిఘా పెట్టనున్నారు. రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఆటోలు నడిపినా, పార్కింగ్ చేసినా, మూల మలుపుల వద్ద ఆటోలు నిలిపినా కఠిన చర్యలు తప్పవు. కాలం చెల్లిన ఆటోలపై నజర్ కమిషనరేట్ పరి«ధిలో కాలం చెల్లిన ఆటోలపై పోలీసులు దృష్టి సారించారు. ఫిట్నెస్ లేని ఆటోలను సీజ్ చేయడం జరుగుతోంది. కాలం ముగిసిన వాహనాలు నడుపడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతోంది. కాలం చెల్లిన వాహనాలు రోడ్డుపై కనిపిస్తే డ్రైవర్లు, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. -
ఆటో డ్రైవర్ల చేతిలో ‘ఆర్టీసీ’ బిస్స!
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం’అన్న నినాదాన్ని నమ్మడం వల్లే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సువైపు మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు ఆర్టీసీలో పెరిగిపోతున్న అద్దె బస్సులడ్రైవర్లు ఈ పరిస్థితిని మార్చేస్తున్నారు. వీరిలో కొందరు అత్యంత నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అన్ని బస్సులూ ఆర్టీసీ బస్సులు కాదనే విషయం తెలియక అవి భద్రమే అనే ధీమాతో ఎక్కేస్తున్నారు. వారికి తెలియని విషయమేంటంటే తాము ప్రయాణిస్తున్న బస్సు బిస్స (స్టీరింగ్) ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్ల చేతుల్లో ఉందని..! – సాక్షి, హైదరాబాద్ గత్యంతరం లేక.. సరైన పర్యవేక్షణ లేక అస్తవ్యస్తంగా తయారైన ఆర్టీసీలో అధికారులు గత్యంతరం లేక ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి అనుభవం లేని వారికి బస్సులప్పగించేస్తున్నారు. ట్రిప్పులు రద్దు చేయ టమా లేదా ప్రైవేటు డ్రైవర్లకు బస్సు అప్పగించటమా అన్న పరిస్థితిలో వారికి బస్సులు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా ఏ బస్సు ఎక్కడ ఏ ప్రమాదానికి గురవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇటీవల గోదావరిఖని నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వంతెన పైనుంచి 20 అడుగుల లోతుకు పల్టీలు కొట్టింది. వంతెన దాటే సమయంలో డ్రైవర్ గుట్కా ప్యాకెట్ చింపేందుకు యత్నించగా బస్సు అదుపు తప్పిందని ప్రయాణికుల వాదన. మరి నిబంధనలకు విరుద్ధంగా డ్రైవర్ బస్సు నడుపుతూ గుట్కా ఎలా తిన్నాడు? తనిఖీ సిబ్బంది వాసన పసిగట్టడం ద్వారా అతడు గుట్కా తింటున్నాడని గుర్తించే వీలుంటుంది. అయినా డ్రైవర్ ఖాతరు చేయలేదు. తనను తనిఖీ చేయరులే అన్న ధీమానే దానికి కారణం. ఎందుకీ దుస్థితి.. ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటికేటికీ వివిధ కారణాల వల్ల డ్రైవర్ల సంఖ్య భారీగా తగ్గుతోంది. ఏడేళ్లుగా వారి నియామకాలు లేకపోవటమే దీనికి కారణం. కొత్త ప్రాంతాలకు బస్సులను నడపాలంటే ఇప్పుడు ఆర్టీసీకి సొంత డ్రైవర్లు లేని పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు నిధుల్లేక చాలాకాలంగా ఆర్టీసీ బస్సులను సమకూర్చుకోలేకపోతోంది. గతంలో ఈ అద్దె బస్సులు మొత్తం బస్సుల సంఖ్యలో 18 శాతానికి మించొద్దన్న నిబంధన ఉండేది. 2015లో నాటి ఎండీ వీటి సంఖ్యను 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాటి సంఖ్య ప్రస్తుతం 2,800 వరకు చేరుకుంది. తక్కువ జీతం.. అద్దె బస్సులు పెరగటం వల్ల ప్రయాణికులకు నేరుగా జరిగే నష్టం లేదు. కానీ వాటికి కనీస శిక్షణ, అనుభవం లేని వారు డ్రైవర్లుగా రావటమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఆర్టీసీ సొంత డ్రైవర్ల సగటు వేతనం రూ.40 వేలు. ఒక బస్సుకు సగటున 2.6 మంది డ్రైవర్లను నియమించాలనేది ఆర్టీసీ నిబంధన. ఒక డ్రైవర్ డ్యూటీ ముగించుకోగానే మరో డ్రైవర్ బస్సు తీసుకోవాల్సి ఉంటుంది. వారి ప్రస్తుత సగటు వేతనం ప్రకారం ఒక బస్సుకు దాదాపు లక్షకు పైగా వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ అద్దె బస్సులకు చెల్లించే మొత్తంలో డ్రైవర్ వేతనం కేవ లం రూ.13 వేలు మాత్రమే. వాటి నిర్వాహకులు ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను నియమిస్తారు. అంటే 26 వేలు చెల్లిస్తున్నారు. ఇంత తక్కువ వేతనంతో పని చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపట్లేదు. మంచి నైపుణ్యం ఉన్న డ్రైవర్లు ఎవరూ అద్దె బస్సులు నడిపేందుకు రావ ట్లేదు. దీంతో తక్కువ వేతనం కోసం వచ్చేవారిని నియమించుకుంటున్నారు. ఈ జాబితాలో ఆటో డ్రైవర్లు, లారీల డ్రైవర్లు, లారీల క్లీనర్లు ఎక్కువగా వస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటే చాలట.. బస్సు నడిపేందుకు హెవీ మోటార్ వెహికిల్ లైసెన్సు, ఆర్టీసీ ఆసుపత్రి జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటే చాలన్నట్లు వారి నియామకానికి అంగీకరిస్తున్నారు. ఈ రెండు సులభంగానే లభిస్తున్నాయి. కానీ కీలకమైన శిక్షణ, అనుభవం మాత్రం వారికి ఉండట్లేదు. అద్దె బస్సు యజమాని సూచించే పేర్లకు అధికారులు టిక్ పెట్టేస్తున్నారు. డ్యూటీలో చేరిన తర్వాత వారిని ఓసారి హకీంపేటలోని జోనల్ డ్రైవింగ్ కళాశాలకు పంపి వాహనం నడిపేతీరును చూసి ఓకే చేసి పంపుతున్నారు. వీరిలో చాలామందికి మద్యం తాగే అలవాటు ఉంటోందని, గుట్కాలు నములుతున్నారని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్లో మాట్లాడుతున్నారని ఫిర్యా దులున్నాయి. సొంత డ్రైవర్లపై నిఘా ఉంచుతున్నట్టుగా అద్దె బస్సు డ్రైవర్లపై ఉండట్లేదు. వారు తరచూ వేతనం సరిపోవట్లేదంటూ విధులకు రావట్లేదు. దీంతో వాటి యజమానులు సూచించిన జాబితాలోని వేరే డ్రైవర్లను అప్పటికప్పుడు పిలిపించి బస్సు అప్పగిస్తున్నారు. వారి డ్రైవింగ్ తీరుపై అవగాహన లేకున్నా, బస్సు నిలిచిపోవద్దన్న ఉద్దేశంతో వారికి బస్సు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం అద్దె బస్సు డ్రైవర్లకు వేతనాలు పెంచితే మంచి నైపుణ్యం ఉన్న డ్రైవర్లు వచ్చే అవకాశం ఉంది. కానీ అందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకపోతుండటంతో... ప్రమాదాలు జరుగుతున్నా తప్పక అద్దె బస్సులను ఇలాగే నడిపించాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటుండటం విశేషం. -
ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లింది.. ఆటోడ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: గౌలిగూడ బస్టాండ్ నుంచి కుషాయిగూడకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తుకుపోయింది అన్నదమ్ములైన ఆటోడ్రైవర్లుగా తేలింది. గతంలో పలు చోరీలు చేసిన ఈ ద్వయం తన సమీప బంధువు ఇచ్చిన ‘సలహా’తో ఈ బస్సు దొంగతనం చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించామని, 8మందిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శనివారం తెలిపారు. చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు ఆలస్యంగా అందిందని చెప్పారు. తూర్పు మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఎం.రమేశ్‌తో కలసి తన కార్యాలయంలో మీడియాకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. తీరు మార్చుకోమంటే పంథా మార్చుకుని... నగరంలోని చిలకలగూడకు చెందిన అన్నదమ్ములు సయ్యద్ అబేద్, సయ్యద్ జహీద్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్లు. ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందక చోరీల బాటపట్టారు. అబేద్ ఒంటరిగా 2015 నుంచి 2018 వరకు గోపాలపురం, పంజగుట్ట, నల్లకుంట, ఎల్బీనగర్, మీర్‌చౌక్, మలక్‌పేటల్లో 9 చోరీలు చేశాడు. గత ఏడాది జహీద్ కూడా ఇతడికి తోడయ్యాడు. దీంతో ఇద్దరూ కలసి మలక్‌పేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, మారేడ్‌పల్లి, మీర్పేట్, ఉప్పల్‌లో 7 నేరాలు చేశారు. ఇలా పదేపదే నేరాలు చేస్తూ జైలుకు వెళ్తున్న వీరిపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉండే సమీప బంధువు మహ్మద్ నవీద్ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటారని, అక్కడకు వెళ్లి ఆయనతో కలసి పని చేసుకుని బతకాలని సూచించింది. దీంతో వారం క్రితం వీరు నాందేడ్ వెళ్లి అతడిని కలిశారు. వాస్తవానికి ఓ మరమ్మతుల దుకాణంలో చేరాలని భావించారు. నవీద్ ఓ సందర్భంలో ఏవైనా పాత భారీ వాహనాలు ఉంటే తీసుకురావాలని, తాను ఖరీదు చేస్తానని వీరికి చెప్పాడు. దీనికి ఇద్దరూ అంగీకరించి రూ.లక్షకు ఒప్పందం చేసుకుని రూ.60 వేలు అడ్వాన్స్ తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి లారీ లేదా బస్సు చోరీ చేయాలని భావించారు. నవీద్‌కు నాందేడ్‌లో నేరచరిత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. భారీ వాహనాలు నడపడంలో అబేద్ దిట్ట... దుబాయ్‌లో ఉండి వచ్చిన అబేద్ భారీ వాహనాలను వేగంగా నడపడంలో దిట్ట. బుధవారం నగరానికి చేరుకున్న వీరు భారీ వాహనం చోరీకి అనువైన ప్రాంతం కోసం వెతికారు. వీరు ఆటోడ్రైవర్లుగా గౌలిగూడ బస్టాండ్ పరిసరాల్లో ఎక్కువగా సంచరించారు. రాత్రివేళ అక్కడ బస్సులు ఆపి ఉంచడాన్ని వీరు గమనించారు. దీంతో నేరుగా అక్కడకు వెళ్లిన వీరు కుషాయిగూడ డిపోకు చెందిన 3డీ రూట్ బస్సును సెల్ఫ్‌స్టార్ట్‌తో స్టార్ట్ చేశారు. బస్సును ఎంట్రీ గేటు నుంచి రాత్రి 12 గంటలకు తీసుకుని బయటకు వచ్చారు. అక్కడ నుంచి తూప్రాన్, నిర్మల్, బోకరోల మీదుగా నాందేడ్ వెళ్లారు. బస్సు 2009 మోడల్‌ది కావడం, 480 కి.మీ. ఆపకుండా వేగంగా నడపడంతో నాందేడ్‌కు 35 కి.మీ. దూరంలో యాక్సిల్ రాడ్ విరిగిపోయింది. దీంతో ఓ క్రేన్ మాట్లాడుకుని నాందేడ్‌కు 10 కి.మీ. దూరంలోని తాత్కాలిక షెడ్‌కు చేరుకున్నారు. గ్యాస్ కట్టర్‌తో తుక్కుగా... బస్సు చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి పోలీసులకు ఫిర్యాదు ఆలస్యంగా అందింది. గురువారం ఉద యం 5.30 గంటలకు డ్రైవర్ జె.వెంకటేశం బస్సు చోరీ అయినట్లు గుర్తించారు. విష యం పోలీసులకు చేరే వరకు ఉదయం 10 గంటలైంది. అప్పటికే అబేద్, జహీ బస్సును తాత్కాలిక షెడ్‌కు తరలించేశారు. అక్కడ నవీద్, అతడి భాగస్వామి ఫారూఖ్ వద్ద పని చేసే గ్యాస్ కటింగ్ వర్కర్లు మహ్మద్ జుబేర్, మహ్మద్ ఒమర్, సయ్యద్ సల్మాన్, మహ్మద్ షఫీఖ్, మహ్మద్ కలీం సిద్ధంగా ఉన్నారు. గ్యాస్ కట్టర్లతో ఇంజన్, చాసిస్ మినహా మొత్తం తుక్కుగా మార్చేశారు. అఫ్జల్‌గంజ్ ఏసీపీ దేవేందర్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరాల ఫీడ్‌తో పాటు వివిధ మార్గాల్లో అన్వేషిస్తూ బస్సును తుక్కుగా మారుస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న ఫారూఖ్ మినహా 8 మందిని పట్టుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకోవడం మరికాస్త ఆలస్యమైనా బస్సు పూర్తిగా అదృశ్యమైపోయేదే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబేద్‌పై గతంలో మలక్‌పేట పోలీసులు పీడీ యాక్ట్ సైతం ప్రయోగించారు. ఈ బస్సు చోరీ నేపథ్యంలో గౌలిగూడ బస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చక్కదిద్దడం కోసం సుల్తాన్‌బజార్ శాంతిభద్రతల విభాగం ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం వారితో కూడిన బృందం శనివారం ఆ ప్రాంతంలో సెక్యూరిటి ఆడిట్ నిర్వహించింది. దీనిపై త్వరలో ఓ నివేదిక రూపొందించనుంది. -
బతుకు బండికి భరోసా
అంతంత మాత్రం బతుకులు, నిబంధనల పేరుతో అడుగడుగునా పోలీసుల వేధింపులు.. ఆపై జరిమానాలు.. పెట్రోలు మంటలు.. నెల తిరిగే సరికి అప్పుల వారి ఒత్తిళ్లు.. ఇవీ ఆటో డ్రైవర్ల కష్టాలు. పాలకులు మారుతున్నా ఆటో డ్రైవర్ల తలరాతలు మారడం లేదు. వారి సంక్షేమాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆటో కార్మికులకు ఏటా రూ.10 ఆర్థిక సాయం చేస్తామని ఇటీవల ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఆటో కార్మికులు, వారి కుటుంబాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, కాకినాడ సిటీ: కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో రెండు మండలాలు, 50 డివిజన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 32కి పైగా ఆటో స్టాండ్లు ఉండి దాదాపు 14,500 మంది ఆటో డ్రైవింగ్‌పైనే జీవనాధారం పొందుతున్నారు. కొందరు అప్పు చేసి, మరికొందరు వాయిదాలు చెల్లించి ఆటోలు కొనుగోలు చేసి జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా బండి నడుపుతూ బతుకు బండిని లాగుతున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నారు. ఇందులోనే పెట్రోల్, డీజిల్, ఆటో మరమ్మతు ఖర్చులు భరించాలి. సొంత ఆటో ఐతే ఇబ్బంది లేదు. అదే అద్దె ఆటో అయితే సంపాదనలో రూ.300 వరకు అద్దె చెల్లించాలి. ఫైనాన్స్‌లో ఆటో తీసుకుంటే ఒకటి రెండు వాయిదాలు కట్టకపోతే వ్యాపారులు వాహనాన్ని తీసుకెళ్లిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రకటించిన రూ.10వేలు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు ఆటోడ్రైవర్లు. ప్రమాదాలతో నష్టం ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్లపై తీవ్ర భారం పడుతోంది. కోలుకునేందుకు ఏళ్ల వ్యవధి పడుతోంది. దీనికితోడు సీబుక్, ఎఫ్‌సీ, లైసెన్సులు చూపించకపోతే రవాణా, పోలీసు శాఖ అధికారుల దాడులు తప్పడం లేదు. కేసులతో పాటు జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల మార్కెట్ ఆశీలు చెల్లించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి. ఈఎంఐలు చెల్లించకపోతే ఓవర్ డ్యూ చార్జీలు, సర్వీసింగ్ చార్జీలు, సర్వీసింగ్ చార్జీలు.. ఇలా వాహనం నడుపుతున్న కొద్దీ నష్టాలే తప్ప లాభం అంటూ ఉండదు. రుణాలివ్వని బ్యాంకులు ఇంటర్మీడియట్, డిగ్రీలు చదివిన వారు ఉద్యోగాలు రాక ఆటోలు కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఆటోలు కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. దీంతో నిరుద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. డబ్బు సకాలంలో చెల్లించని పక్షంలో దాడులకు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు అవుతున్నా, ఇవి పచ్చ చొక్కాలకే పరిమితం కావడంతో నిరుద్యోగులు, ఆటో కార్మికులకు స్వయం ఉపాధి లభించడంలేదు. జగనన్నతోనే ఆటో కార్మికుల సంక్షేమం కష్టాలతో సహజీవనం చేస్తున్న ఆటో కార్మికులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆటోలు నడుపుకుంటూ కార్మికులు ఒక్కో సమయంలో ఇంటికి సరుకులు కూడా తీసుకెళ్లలేని పరిస్థితులున్నాయి. అలాంటి మాకు ఏటా రూ.10 వేలు ఇస్తానని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆటో కార్మికులందరం కలిసికట్టుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. – నురుకుర్తి వెంకటరమణ, ఆటోడ్రైవర్, ఇంద్రపాలెం మేలు జరుగుతుంది ఆటో నడపడం వల్ల ఏటా ట్యాక్స్. ఇతర పత్రాల కోసం రూ.10 వేల వరకు ఖర్చు అవుతోంది. జగన్మోహన్రెడ్డి రూ.10 వేలు అందిస్తే సహాయం చేసినట్టు అవుతుంది. ఆటోలు అప్పు చేసి కొనుగోలు చేశాం. వడ్డీలు, అసలు కట్టాలంటే అందుకు తగ్గ బేరాలు లేవు. రోజుకు రూ.500 సంపాదించాలన్నా కష్టమే. – బోడిశెట్టి సత్యనారాయణ, ఆటోడ్రైవర్, కాకినాడ ఆనందంగా ఉంది ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకుని రూ.10 వేలు సహాయం చేస్తామని జగన్మోహన్రెడ్డి ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇది అమలు చేయాలి. అప్పుడే సార్థకత చేకూరుతుంది. జగన్ మాట ఇస్తే అమలు చేస్తారు. కాబట్టి ఇది ఆటో కార్మికులకు ఎంతో మేలు చేసినట్టే. ఇలాంటి నిర్ణయాలు సాహసోపేతం. అందరూ ప్రకటించలేరు. – కొక్కిరి విజయకుమార్, ఆటోడ్రైవర్, కాకినాడ రుణపడి ఉంటాం ఆటో డ్రైవర్లపై ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ కేసులు నమోదు చేయడం తప్పితే వరాలు ఇచ్చిన వారు ఎవరూ లేరు. అలాంటిది జగనన్న మా కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా బాధను అర్థం చేసుకున్నందుకు జగన్‌కు రుణపడి ఉంటాం. – ఆర్తి రాజు, ఆటోడ్రైవర్, కాకినాడ రూ.10 వేలు ఆసరాగా ఉంటుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఇది మాలాంటి పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటుంది. ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు వైఎస్ జగన్. ఆయనకు ఆటో డ్రైవర్లు రుణపడి ఉంటారు. –కె.చిన్నా, కాకినాడ ఏటా ఇన్సూరెన్స్ కట్టుకుంటాను ఆటోలకు ఏటా రూ.8 వేల వరకు ఇన్సూరెన్స్ కట్టాల్సి వస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్టు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందితే ఇన్సూరెన్స్ కట్టినా ఇంకా రూ.2 వేలు వరకు ఆటో డ్రైవర్లకు మిగులుతుంది. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లను ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్రెడ్డి సీఎం కావాలి. ఆయన ప్రకటించిన హామీలు అమలు కావాలి. –ఎస్కే జిలానీ, కాకినాడ జగనన్న నిర్ణయం హర్షణీయం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటో కార్మికులకు ఏటా రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషదాయకం. ఈ హామీపై ఆటో కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే బాధలు తీరుతాయని ఆశిస్తున్నాం. – గొట్టుముక్కల రాజు, కాకినాడ -
ఆటోవాలాల మానవత్వం
ముంబై: రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితేనే పట్టించుకోని రోజులివి. ముంబైలో మాత్రం కొందరు ఆటోవాలాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వానరాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిపోయిన కోతిని తీసుకెళ్లి వెటర్నరి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడితో వదిలేయకుండా వారం రోజులుగా వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ముంబైలోని మన్‌కుర్ద్ ప్రాంతంలో ఆటో స్టాండ్ ఉంది. స్టాండ్ సమీపంలో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఏం జరిగిందోనని కంగారుపడిన ఆటోవాలాలు.. ఆ చుట్టు పక్కల వెతికి చూశారు. కొద్దిసేపటి తర్వాత శరీరమంతా కాలిన గాయాలతో ఓ వానరం వారి కంటపడింది. కదలలేని స్థితిలో అక్కడే కూలబడిపోయి ఉంది. ఆ కోతి పరిస్థితి చూసి చలించిపోయిన ఆటోవాలాలు.. దాన్ని అక్కున చేర్చుకున్నారు. ఆ వానరాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆటోవాలాలకు అర్థం కాలేదు. వెటర్నరి ఆస్పత్రి కోసం గాలించినా లాభం లేకుండా పోయింది. చివరికి ఓ చోట ఆస్పత్రి ఉందని తెలుసుకొని అక్కడికి తీసుకెళ్లారు. ఆ వానరం వైద్యానికి అయ్యే ఖర్చును వారు రోజువారీ సంపాదనలో నుంచి తలా కొంచెం భరిస్తున్నారు. గాయాల నుంచి వానరం కూడా వేగంగా కోలుకుంటోంది. -
కర్నూలు జిల్లాలో ఆటో డ్రైవర్లపై రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
‘ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 10వేల ఆర్థిక సాయం’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం.. పాదయాత్ర కవిటికి చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లు జననేతను కలిసి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఇన్సురెన్స్, ఫైన్లు, ఫిట్నెస్ ఫీజులను ప్రభుత్వం పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు.. వాటిని తగ్గించాలని వైఎస్ జగన్‌ను కోరారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తాం నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కవిటి మండలంలో వందల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైద్యం కోసం ప్రతి నెలకు 5 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. వారి సమస్యలపై స్పందించిన జననేత.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు.. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన రైల్వేజోన్ సాధన సమితి సభ్యులు.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఉత్తరాంధ్ర రైల్వే జోన్ సాధన సమితి సభ్యులు కలిశారు. రైల్వే జోన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని వారు జననేతకు వివరించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఏకోడూరు ఆటో డ్రైవర్లు
-
ఆటో మిత్తి.. మెడపై కత్తి
సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాస్. నాచారం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్. అద్దె ఆటో నడుపుతూ కొంతకాలం ఉపాధి పొందిన అతడు.. మూడేళ్ల క్రితం సెకెండ్‌హ్యాండ్ ఆటో కొనుక్కొనేందుకు ఖైరతాబాద్‌లోని ఓ ఫైనాన్స్ వ్యాపారిని ఆశ్రయించాడు. రూ.1.35 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించాడు. దీనికి నెలకు రూ.6,624 చొప్పున వాయిదా చెల్లించాలని షరతు విధించాడు. మూడేళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి వడ్డీతో సహా బాకీ చెల్లించాడు. కానీ ఒకేఒక్క వాయిదా చెల్లించలేకపోయాడు. ఈ మొత్తాన్ని ఫైనాన్షియర్ నుంచి మినహాయింపు కోరాలని భావించాడు. కానీ రూ.6,624 నెల వాయిదాకు ఏడాది వ్యవధిలో రూ.47,500 చెల్లించాలంటూ ఫైనాన్షియర్ తాఖీదు ఇవ్వడంతో శ్రీనివాస్ గుండె గుభేల్మంది. అంటే ఈ మొత్తం బాకీపై వడ్డీ విధించి.. ప్రతినెలా అసలు, వడ్డీకి మళ్లీ చక్రవడ్డీ విధించి వసూలు చేశాడు. ఆటోరిక్షా ఫైనాన్షియర్ల దా‘రుణ’మైన దోపిడీకి ఇదో పరాకాష్ట. శ్రీనివాస్ లాంటివారుగ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 90 వేల మంది ఫైనాన్షియర్ల కబందహస్తాల్లో నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఆటోరిక్షాలపై వడ్డీ వ్యాపారం చేస్తున్న 500 మంది, వాళ్లకు అనుబంధంగా పనిచేసే దళారీ వ్యవస్థ నగరంలో ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారాన్ని సాగిస్తోంది. ఒకసారి ఫైనాన్షియర్ వద్ద అప్పు తీసుకున్న ఆటోడ్రైవర్ జీవితకాల రుణగ్రస్తుడుగా మారిపోవాల్సి వస్తోంది. లేదా ఏ ఒకటి, రెండు నెలల వాయిదాలు చెల్లించకుంటే ఏకంగా ఆటోనే వదులకోవాల్సిన పరిస్థితి. అయితే, ఈ ఫైనాన్షియర్ల అక్రమ వ్యాపారానికి ఆర్బీఐ నిబంధనలు వర్తించవు. రవాణా, పోలీసు చట్టాలకు వీరు అతీతం. చివరకు ఆర్థికశాఖ పరిధిలోని ‘మానీ లాండరింగ్ చట్టం’ కూడా ఈ దోపిడీని అరికట్టలేకపోతోంది. దీంతో వేలాది మంది ఆటోడ్రైర్లు వీరి కబంధ హస్తాల్లో చిక్కుకుని అప్పుల పాలవుతున్నారు. కేన్సర్ బాధితుడినీ వదల్లేదు.. ఆటోడ్రైవర్ల పాలిట శాపంలా మారిన ఫైనాన్షియర్లు చివరకు ఓ కేన్సర్ వ్యాధిగ్రస్తుడినీ వదలకుండా పీల్చిపిప్పి చేశారు. బోడుప్పల్‌కు చెందిన దేవేందర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఒక ఫైనాన్షియర్ వద్ద రూ.1.5 లక్షల అప్పు తీసుకొని ఆటో కొన్నాడు. మూడేళ్లలో రూ.2 లక్షలకు పైగా అసలు, వడ్డీ చెల్లించాడు. కానీ మరో రూ.10 వేలు బాకీ ఉండిపోయింది. కొద్ది రోజులకే అతని భార్య అనారోగ్యంతో చనిపోయింది. దురదృష్టవశాత్తు అతడు కేన్సర్ బారిన పడ్డాడు. దీంతో కొడుకు చదువు ఇంటర్ మధ్యలోనే ఆగిపోయింది. ఒకరకంగా ఆ కుటుబం మరిన్ని కష్టాలపాలైంది. కానీ ఆ కష్టాలు ఫైనాన్షియర్‌ను కదిలించలేదు. రూ.10 వేల అప్పు కింద ఉపాధిని ఇస్తున్న ఏకైక ఆధారం ఆటోను జప్తు చేశాడు. చివరకు ఆటో సంఘాల జోక్యంతో మరో నాలుగు నెలల్లో రూ.10 వేల అసలుతో పాటు వడ్డీ చెల్లిస్తేనే ఆటో డాక్యుమెంట్లు ఇస్తానన్నాడు. ‘బాకీలు కట్టీ కట్టీ సర్వం కోల్పోయిన. ఇక నా వల్ల కాదు. కొడుకు చదువాగిపోయింది. భార్య చనిపోయింది. ఆ ఫైనాన్షియర్‌కు ఏ మాత్రం కనికరం లేదు’.. ఇది దేవయ్య ఆవేదన మాత్రమే కాదు. నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తూ బడుగుల బతుకులపై కేన్సర్ కంటే ప్రమాదకరంగా మారిన ఫైనాన్షియర్ల బారిన పడ్డ ఎంతోమందిది ఇదే పరిస్థితి. ♦ ఫైనాన్స్ వాయిదా చెల్లించడం లేదనే నెపంతో నాలుగు రోజుల క్రితం ఒక వ్యాపారి ఎర్రగడ్డకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అజారుల్లా ఇంటికి తాళం వేశాడు. ఆటోడ్రైవర్ల ఇళ్లపైన, వాహనాలపైన దాడులు చేసేందుకు ప్రతి ఫైనాన్షియర్ కొంతమంది రౌడీషీటర్లతో ‘సీజర్స్ వ్యవస్థ’ను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఏ నిబంధనలూ వర్తించవా..! కనీసం రూ.5 లక్షల పైన జరిగే లావాదేవీలకు మాత్రమే ఆర్బీఐ నిబంధనలు వర్తిస్తాయి. ఉదాహరణకు కార్ల విక్రయాల్లో నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు ఉంటాయి. కానీ ఆటోరిక్షా ఫైనాన్షియర్లు కేవలం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకే వడ్డీకి అప్పు ఇస్తున్నారు. దీంతో వారికి ఆర్బీఐ నిబంధనలు వర్తించడం లేదు. ఇష్టారాజ్యంగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. రూ.1.5 లక్షల అప్పు తీసుకున్న ఆటోడ్రైవర్ మూడేళ్లలో వడ్డీతో సహా రూ.2 లక్షలకు పైగా చెల్లించినా అప్పు తీరడం లేదు. మధ్యలో ఏ ఒకటి, రెండు నెలలు వాయిదాలు చెల్లించకున్నా ఆటోలను జప్తు చేస్తారు. లేదా భారీగా వడ్డీ విధిస్తారు. నగరంలో బాగా పేరు మోసిన పది, పదిహేను ఫైనాన్స్ సంస్థలు తమ కింద సబ్ ఫైనాన్షియర్లను డీలర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ డీలర్ల సాయంతో అక్రమ వడ్డీ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని కోరుతూ ఆటోకార్మిక సంఘాలు అనేకసార్లు ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి తమ కష్టాలను చెప్పుకొన్నారు. డీజీపీకి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆటో సంఘాల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలింది. దోపిడీ క్రమం సాగుతుందిలా.. ♦ సుమారు 500 మంది చిన్న, పెద్ద ఫైనాన్షియర్లు 30 ఏళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 90 వేల ఆటోలు వారి చేతుల్లోనే ఉన్నాయి. ♦ ఆటోడ్రైవర్లు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల కోసం వీరిని ఆశ్రయిస్తున్నారు. దీనిపై 1.5 శాతం నుంచి 2 శాతం వరకు వడ్డీ విధిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.6500 వరకు ఆటోడ్రైవర్ వాయిదాల పద్ధతిలో చెల్లిస్తాడు. కానీ 30 నెలల వ్యవధిలో ఏ నెల చెల్లించకపోయినా వడ్డీ మొత్తం పెంచేస్తారు. ♦ ఉదాహరణకు రూ.లక్ష అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీరే నాటికి ఫైనాన్సర్‌కు రూ.1,59,990 వరకు చెల్లిస్తున్నాడు. ఇందుకోసం ఎలాంటి తేడాలు రాకుండా ఉండేందుకు, ఏ క్షణమైనా ఆటోను స్వాధీనం చేసుకొనేందుకు తెల్ల బాండ్ పేపర్లపై ఆటోడ్రైవర్‌తో సంతకాలు చేయిస్తారు. ఈ చెల్లింపుల్లో ఒక్క నెలా అప్పు కట్టలేకపోయినా ఆటోను స్వాధీనం చేసుకుంటారు. ♦ 2,3 నెలల పాటు అప్పు కట్టలేని ఆటోడ్రైవర్లపై వడ్డీని 2 నుంచి 5 శాతానికి పెంచుతారు. స్వాధీనం చేసుకున్న ఆటోలు తమ వద్ద ఉంచుకున్నందుకు పార్కింగ్ ఫీజు పేరిట నెలకు మరో రూ.1000 చొప్పున వసూలు చేస్తారు. మొత్తంగా ఆటోడ్రైవర్‌ను శాశ్వత రుణగ్రస్తుడిగా మార్చేస్తున్నారు. ♦ గ్రేటర్లో ఏటా రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు ఈ వడ్డీ వ్యాపారం సాగుతోంది. -
ఆటో డ్రైవర్లకు వైఎస్ జగన్ భరోసా
-
ఎమ్మెల్యే ఆటోడ్రైవర్ అయ్యారు!
పూతలపట్టు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటోవాలాలను ఆదుకుంటారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం పూతలపట్టు మండలంలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి పి.కొత్తకోటలోని ఆటోస్టాండ్ వద్ద ఆయన ఆటోడ్రైవర్లతో మాట్లాడారు. అనంతరం తామంతా జగనన్నకు అండగా ఉంటామంటూ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకు ఖాకీ చొక్కా తొడిగారు. ఎమ్మెల్యే ఆటోలో డ్రైవర్లను ఎక్కించుకుని కొంతసేపు చక్కర్లు కొట్టడంతో పలువురు ఆసక్తిగా చూశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఆటో డ్రైవర్లు
-
వైఎస్ జగన్ ప్రకటనకు మద్దతుగా ఆటోడ్రైవర్ల ర్యాలీ
-
యూనిఫాం వేసుకొని ఆటో నడిపిన జగన్
సాక్షి, ఏలూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్ల మద్దతు ఉంటుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్ జగన్ ఆటో యూనిఫాం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అవును ఆయన అందరివాడు.. ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే అన్నలా హామీలు ఇస్తున్నారు. అలానే..14వ తేదీని ఏలూరు సభలో జగన్ ఆలో వాళ్లకు ఓ హామీ ఇచ్చారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ..ఏడాదికి 10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆటోవాళ్లకు అండగా ఉంటానని చెప్పారు. దీంతో ఆటోవాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వైఎస్ జగన్ ను తమ గుండెలాంటి ఆటో ఎక్కించి సంతోషించారు. పశ్చిమ గోదావరి జిల్లా మేదినరావుపాలెం క్రాస్ దగ్గర ఆటో ఎక్కారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆనందంతో పొంగిపోయారు. కాగా ఈ నెల 14న ఏలూరులో బహిరంగ సభ సాక్షిగా వైఎస్ జగన్ ...ఆటో డ్రైవర్లుకు హామీ ఇచ్చిన విషయం విదితమే. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆటో కొనుగోలు చేసేవారికి పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తుందని ఆయన ప్రకటన చేశారు. దీంతో వైఎస్ జగన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. -
ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ.10 వేలు
సాక్షి, ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్లను ఆర్థికంగా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీయిచ్చారు. రవాణా శాఖ నిబంధనలను అనుసరించి పలు రకాల పత్రాలు చేయించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. 161వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఏలూరు పాతబస్‌స్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.... అన్ని జిల్లాల్లోని ఆటోడ్రైవర్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘‘వెళ్లిన ప్రతిచోటా ఆటోడ్రైవర్లు నన్ను కలుస్తున్నారు. రోజంతా కష్టపడితే మూడు నుంచి ఐదొందలు వస్తాయని, అందులో నుంచి రోజూ 50 రూపాయలు లేదా వంద రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటున్నదని చెప్పారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోకు ఫిట్నెస్, ఇన్సురెన్స్, రోడ్ టాక్స్ పత్రాలు లేనందున పోలీసులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు డ్రైవర్లు చెప్పారు. ఆ పత్రాలు చేయించుకోవాలంటే అదనంగా కనీసం 10వేల రూపాయలన్నా ఖర్చవుతుందని రోజూ ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో.. రాబోయే ప్రజాప్రభుత్వంలో ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇస్తున్నా. సొంత ఆటోను నడుపుకొనే డ్రైవర్లకు ఆటో ఫిట్నెస్, ఇన్సురెన్స్, రోడ్ టాక్స్ పత్రాలు చేయించుకోవడానికి అవసరమైన డబ్బును ప్రభుత్వమే ఇస్తుంది. తద్వారా ప్రమాద బీమా కూడా లభిస్తుంది. డ్రైవర్లు, ప్రయాణికులు అందరికీ ఊరట కలిగించే అంశమిది..’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ.10 వేలు ఆర్థిక సాయం
-
రోజు రూ.1000 లేదా ఫుల్ బాటిల్ మందు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు లంచాల కోసం తమని వేధిస్తున్నారంటూ మలక్‌పేట ఆటో డ్రైవర్లు ఆదివారం ధర్నాకు దిగారు. ట్రాఫిక్ పోలీసులు రోజు వారి మామూళ్ల పేరుతో తమని నిత్యం వేధిస్తున్నారని అంబర్ పేట-దిల్షుక్నగర్ రూట్‌కు చెందిన ఆటో డ్రైవర్లు ఆరోపించారు. మామూళ్ల కింద ప్రతిరోజు ఒక మద్యం ఫుల్ బాటిల్ లేదా రూ.1000 ఇవ్వాలంటూ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వేధిస్తున్నారంటూ ఆటో డ్రైవర్లు ఆరోపించారు. ఈ విషయంపై మలక్‌పేట ట్రాఫిక్ సీఐ వెంకట్‌రెడ్డిని ఆశ్రయించామని ఆయన సైతం మీకు దిక్కున్న చోటు చెప్పుకోండంటూ కానిస్టేబుళ్లకే వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమను లంచగొండి అధికారుల నుంచి కాపాడాలంటూ సాక్షాత్తు హోంమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఇక చేసేది లేక ఆటో డ్రైవర్లు తమను ట్రాఫిక్ సీఐ, కానిస్టేబుల్ పోలీసులు లంచాల కోసం వేధిస్తున్న సన్నివేశాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా అవినీతి అధికారులను తప్పించాలంటూ మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
నేడు యాదాద్రి బంద్..
యాదాద్రి: ఆటో డ్రైవర్లకు మద్దతుగా యాదాద్రి బంద్ కొనసాగుతుంది. యాదగిరి గుట్టపైకి ఆర్టీసీ బస్సులు నడపవద్దని రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్లు రాస్తారోక జరిపారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు కూడా. ఈ సందర్భంగా పోలీసులు ఆటో కార్మికులను చెదరగొట్టి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు యాదగిరి గుట్ట బంద్‌కు పిలుపునిచ్చారు. దుకాణదారులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. -
ఆటో డ్రైవర్ల ఉదారత
గట్టు : గట్టు నుంచి మద్దెలబండ వరకు ఉన్న పంచాయతీ రాజ్ తారు రోడ్డుపై ఏర్పడి గుంతలను ఆదివారం ఆటో నడుపుతున్న ఆరగిద్ద డ్రైవర్లు పూడ్చి వేశారు. ఎవరో వస్తారని... ఏదో చేస్తారని... ఎదురు చూసి మోస పోకుమా... నీకు నీవే సహాయ పడుమా... అంటూ ఓ కవి అన్న మాటలను ఆరగిద్ద గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు నిజమని నిరూపించారు. గట్టు, ఆరగిద్ద స్టేజీ, మద్దెలబండ, మల్దకల్ వరకు ఉన్న తారు రోడ్డుపై ఏర్పడ్డ గుంతను పూడ్చి వేయాలని పంచాయతీ రాజ్ అధికారులకు అనేక పర్యాయాలు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని గట్టు, ఆరగిద్ద, పెంచికలపాడు గ్రామాలకు చెందిన వారు ఆరోపించారు. ఈ రోడ్లుపై నిత్యం తిరిగే వాహాన దారులు అధికారులను తిట్టుకోని రోజంటూ ఉండదూ. అంతగా ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. గట్టు నుంచి మల్దకల్ చేరుకునే సరికి వాహానానికి ఏది ఉంటుందో... ఏదీ ఊడుతుందో తెలియని పరిస్థితి. అంతగా ఈ రోడ్డు అడుగడుగునా గుంతల మయంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ఏవరి ఇష్టం వచ్చినట్లు వారు రోడ్డును తవ్వేశారు. పోని తవ్విన చోట పిడికెడు మట్టి కూడా వేయకుండా వదిలేశారు. ఈ నేపద్యంలో ఈ రూట్లో ప్రయాణం వాహాన దారులకు నరకాన్ని తలిపిస్తుంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేపట్టలేక పోయారు. రోడ్డు మరమ్మత్తుల గురించి కాలం వెల్లదీస్తున్న తరుణంలో ఆరగిద్ద గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు స్వంత ఖర్చులతో రోడ్డుపై అక్కడక్కడ ఏర్పడ్డ గుంతను పూడ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఆటో డ్రైవర్లు రాజు,వీరేష్, .రాము, వీరాచారి. ఉరుకుందు తదితరులు ఆరగిద్ద గ్రామం నుంచి పెంకలపాడు, మద్దెలబండ వరకు రోడ్డుపై ఏర్పడ్డ గుంతను స్వచ్చందంగా మట్టితో పూడ్చి వేశారు. ఈ గుంత కారణంగా వాహానాలు తరచు మరమ్మత్తులకు వస్తున్నాయని, వీటిని గురించి ఏ అధికారి కూడా పట్టించుకోక పోవడంతో ఇక చేసేదేదమి లేదని తామే గుంతలున్న చోట మట్టిని వేసి తత్కాలికంగా రోడ్డు మనమ్మత్తులను చేపట్టినట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. వీరు చేసిన పనులను వాహాన దారులు మెచ్చుకున్నారు. -
ఐదుగురు ఈవ్ టీజర్లు ఆత్మహత్యాయత్నం!
అనంతపురం: ఓ యువతిని ఐదుగురు ఆటో ద్రైవర్లు గత కొంత కాలం నుంచి ఎంతగానో వేధిస్తున్నారు. చివరికి పోలీసుల చేతికి చిక్కేసరికి కేసుల భయంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక చంద్రబాబు నగర్‌కు చెందిన ఓ యువతిని ఐదుగురు ఆటోడ్రైవర్లు కొంతకాలం నుంచి వేధింపులకు గురిచేస్తున్నారు. బాధిత యువతి ఈవ టీజింగ్ చేసిన ఐదుగురిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆ యువతిని ఆటో డ్రైవర్లు ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇదివరకే యువతి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఐదుగురినీ గత మూడు రోజులుగా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసుల భయంతో వారు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బతుకు బండిపై గుదిబండ
వాహనాల చలానాలు, లైసెన్స్ ఫీజులు భారీగా పెంపు సొంత ఉపాధికీ ఎసరు పెట్టిన సర్కారు ఆందోళనలో ఆటోవాలాలు, ఇతర వాహనాల యజమానులు 894 జీవో రద్దు చేయాలంటూ ఆందోళనలు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు సరికదా ఉన్న ఉపాధిని సైతం దూరం చేస్తోంది. ఉద్యోగాలు లేక ఆటోలు, ఇతర వాహనాలు నడుపుకుంటూ బతుకుబండిని లాగిస్తున్న యువతపై 894 జీవో పెను ప్రభావం చూపనుంది. రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, చలానాలు, ఫిట్నెస్ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది. ఆటోలు, ఇతర వాహనాలు నడుపుకుంటూ జీవిస్తున్న వారు రోడ్డెక్కి ఆందోళనల బాట పట్టారు. ఏలూరు (సెంట్రల్)/తణుకు : రవాణాశాఖలో ఫీజుల మోత మోగింది. చలానాలు, ఫిటెనెస్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు అధిక మొత్తంలో పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 29న జీవో 894ను జారీ చేసింది. ఈ జీవోను దేశంలో మిగిలిన రాష్ట్రాలు అమలులోకి తీసుకురాకపోయినా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నూతన రవాణా ఛార్జీలను అమలులోకి తెచ్చింది. దీంతో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా ఉపాధి పొందుతున్న వారిపై పెనుభారం పడింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆటో కార్మికులు, ప్రైవేట్ వాహనాల యజమానులు రెడ్డెక్కి ఆందోళనబాట పట్టారు. పెంచిన ఛార్జీలతో ముఖ్యంగా ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఛార్జీలను అనుసరించి ఫిట్‌నెస్‌కు ఆలస్య రుసుం కింద రోజుకు రూ.50 చెల్లించాలని చెబుతుండటంతో ఎప్పుడు ఫిట్నెస్ చేయించుకున్నా డిసెంబర్ 29 నుంచి పరిగణనలోకి తీసుకుంటున్నారు. జిల్లాలో లక్ష వాహనాలు జిల్లాలో దాదాపు 90 వేల ఆటోలు నడుస్తున్నాయి. వీరిలో చదువుకుని ఉద్యోగాలు రాక ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న వారే ఎక్కువ. ఆటోలతో పాటు టాటా మేజిక్ వంటి లైట్ వెహికల్స్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో మరో 10 వేల కార్లు, లారీల వంటి ఇతర వాహనాలు ఉన్నాయి. వాహనాలు కాకుండా రవాణా రంగంపై ఆధారపడి మెకానిక్‌లు, వ్యాపారులు, కూలీలు దాదాపు 4 లక్షల మంది వరకు జీవిస్తున్నారు. ఇప్పటికే ప్రతి 15 రోజులకు ఒకసారి డీజిల్ ధరలను పెంచుతుండటంతో పాటు ఇన్సూరెన్స్, వాహనాల విడిభాగాలు, టైర్లపై పన్నులు పెంచడంతో రవాణారంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రెట్టింపైన ఛార్జీలు గతంతో పోల్చితే ఈసారి ఛార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లులు పడనున్నాయి. జిల్లావ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఫిట్నెస్లతో పాటు ఇతర సేవల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పోల్చితే రవాణాశాఖకు ఆదాయం పెరుగుతుంది. ఛార్జీలు పెరగకముందు నెలకు రూ.20 లక్షలు ఆదాయం ఉంటే ప్రస్తుతం పెరిగిన ఛార్జీలతో మరో రూ.10 లక్షలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, చిరునామా మార్పు, ఓనర్షిప్ మార్పు ఇలా అనేక సేవల్లో గడువులోగా మార్చుకోనట్టయితే వాహనదారులు రవాణాశాఖకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్ర«ధాన కేటగిరీల్లో లైసెన్సుల ఫీజులు భారీగానే పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఇలా.. వాహనాలు ప్రస్తుతం పెరిగిన ఫీజు ద్విచక్రవాహన రిజిస్ట్రేషన్ రూ.395 రూ.685 కార్లు రిజిస్ట్రేషన్ రూ. 590 రూ.1,135 క్యాబ్ రిజిస్ట్రేషన్ రూ.600 రూ.1,150 మీడియం గూడ్స్ రిజిస్ట్రేషన్ రూ.800 రూ.1,300 హెవీ గూడ్స్ రిజిస్ట్రేషన్ రూ.800 రూ.1,800 ఇంపోర్టెడ్ మోటార్ సైకిల్ రూ.1,200 రూ.2,885 ద్విచక్రవాహనం బదిలీ రూ. 330 రూ.535 ఫిట్నెస్ కోసం లైట్ మోటార్ వెహికల్స్ రూ.360 రూ.720 మీడియం+హెవీ గూడ్స్ వెహికల్స్ రూ.500 రూ. 920 లెర్నింగ్ లైసెన్స్ లెర్నింగ్ లైసెన్స్ సింగిల్ క్లాస్ రూ.60 రూ.260 (ఒక్కో కేటగిరికి రూ.150 అదనం) డ్రైవింగ్ లైసెన్స్ సింగిల్ క్లాస్ రూ.440 రూ.960 (ఒక్కో కేటగిరీకి రూ.300 అదనం) ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రూ.850 రూ.1,350 ఛార్జీలు తగ్గించాలి ప్రభుత్వాలు రవాణా శాఖ ద్వారా చెల్లించే ఛార్జీలను పెంచడం దారుణం. ఇప్పటికే డీజిల్ ధరలు తరచూ పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆటోలకు ఫైనాన్స్ కట్టలేక అవస్థలు పడుతున్నాం. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలి. కె.ఉదయ్‌భాస్కర్, ఆటో కార్మికుడు ఉపాధికి ఎసరు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నియంత్రణ లేకపోవడంతో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఛార్జీలతో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. డీఎన్‌వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి -
ఆటోవాలా.. ఇలాగైతే దివాళా
సర్కారు తీరుపై ఆటోవాలాలు సమర శంఖం పూరించారు. ఆటో కార్మికుల్ని సంక్షోభంలోకి నెట్టివేసే 894 జీవో రద్దు కోరుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఆందోళనలకు దిగారు. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. కదం తొక్కిన ఆటో కార్మికులు తణుకు అర్బన్: ఆటో కార్మిక రంగాన్ని కుదేలుచేసే 894 జీవో రద్దుకోరుతూ తణుకులో ఆటో కార్మికులు కదం తొక్కారు. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్వోబీ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా రవాణా శాఖ కార్యాలయం వద్దకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ముజుఫర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాని విమర్శించారు. ఇటీవల ఆటో వాహనాలపై విపరీతంగా ఫీజులు పెంచడంతో పాటు ఫిట్నెస్ చేయించుకోని ఆటోలపై రోజుకు రూ.50 అపరాధ రుసుం విధించేలా జీవోను తీసుకురావడం దారుణమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోగా వారిని అప్పులపాలుచేసేలా జీవోలు తేవడం సరికాదన్నారు. ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పంగం రాంబాబు మాట్లాడుతూ జీవోల పేరుతో అధికారులు కార్మికులను వేధిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ తణుకు ఏరియా నాయకులు బొద్దాని నాగరాజు, వైస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు పీవీ ప్రతాప్, కేతా గోపాలన్, సబ్బిత లాజర్, పైబోయిన సత్యనారాయణ తదితరులు మట్లాడారు. అనంతరం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ నెక్కంటి శ్రీనివాస్‌కు నాయకులు, కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. తణుకు, తణుకు మండలం, ఉండ్రాజవరం, అత్తిలి, ఇరగవరం, పెరవలి, పెనుమంట్ర మండలాల నుంచి 30 యూనియన్లకు చెందిన ఆటో కార్మికులు భారీగా తరలివచ్చారు. -
ఆటో డ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే
ముంబై: మహారాష్ట్రలో ఆటో డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరిగా రావల్సిందేనని శుక్రవారం ఇచ్చిన తీర్పులో హై కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో స్థానిక భాష రాకపోవడంవల్ల ప్రయాణికుల సూచనలు, వారు చెబుతున్నది డ్రైవర్‌కు అర్థం కాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో మరాఠీ భాష రావల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. ఆటో డ్రైవర్లకు మరాఠీ తప్పని రావల్సిందేనని ఆంక్షలు విధిస్తూ స్థానిక ఆర్టీవో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. మరాఠీ రాని డ్రైవర్లకు ఆటో పర్మిట్లు జారీచేయకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. దీన్ని సవాలుచేస్తూ మీరా-భాయిందర్ రిపబ్లికన్ ఆటో డ్రైవర్, యజమానుల సంఘం హై కోర్టును ఆశ్రయించింది. ఈ నోటిఫికేషన్ వల్ల అనేక మంది ఆటోలు నడపలేకపోతున్నారు. దీంతో వారు ఉపాధి కోల్పోయి పస్తులుండే పరిస్థితి వచ్చింది. మరాఠీ భాషను కచ్చితం చేయరాదని, ఈ నోటిఫికేషన్ చట్ట విరుద్దంగా ఉందని, దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన హై కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. -
ఆటో కార్మికుల సంక్షేమానికి పోరాటం
సిరిసిల్ల టౌన్ : ఆటో కార్మికుల సంక్షేమానికి తాము పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ఈనెల 17న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఆదివారం స్థానిక గాంధీచౌక్‌లో ముట్టడి ప్రచార కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పంతం రవి, నాయకులు ఇటిక్యాల అశోక్, పిట్ల బాలయ్య, పున్న దేవయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్స్ సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ వికారాబాద్ రూరల్: అసంఘటిత కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కార్మికుల బతుకులు దయనీయ స్థితిలో కొనసాగుతున్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆటో డ్రైవర్స్ కార్మికల సమస్యలపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యమత్యమై సమస్యల సాధన కోసం పోరాడాలన్నారు. పెరిగిపోతున్న జనాభా అవసరాలు తీర్చడంలో ఆటో కార్మికులు సమాజంలో కీలకమన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అగ్రభాగాన ఉంటుందన్నారు. ప్రస్తుత ఆటో కార్మికుల ఆటో అడ్డాల సమస్యలు, పోలీసుల అక్రమ చలాన్లు, జరిమానాలు, కోర్టు ఫైన్లు, ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం పెంచుతున్నారన్నారు. ఆటో కార్మికులు లైసెన్సు కోసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి నిబంధనలతో చదువురాని కార్మికులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆర్టీఏ అధికారులు, పోలీసుల వేధింపులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు పి.అశోక్, పి.మల్లేశం, ఆటో డ్రైవర్లు ప్రసాద్, శ్యామ్, అంబయ్య, జంగయ్య, అశోక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
10 దాటితే..20 ఇవ్వాల్సిందే
ఆటోవాలాల దోపిడీ బైపాస్ రైడర్లతో ప్రయాణికులకు ఇక్కట్లు ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉన్న ఆత్మకూరుకు చేరుకునేందుకు రాత్రి 10 గంటలు దాటితే రూ.20 చెల్లించాల్సిందేనని, ఆటోవాలాలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆత్మకూరుకు రావడానికి నెల్లూరు నుంచి రాత్రి 8 గంటల తర్వాత బస్సు లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరై అనంతపురం, కర్నూలు, కడప, పొద్దుటూరు, బళ్లారి తదితర బైపాస్ రైడర్ల బస్సు సర్వీసుల్లో ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. లేకుంటే చెన్నై–ఆత్మకూరు బస్సు కోసం రాత్రి 10.30 గంటల వరకు నెల్లూరులో ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో విధి లేక అధిక చార్జీ అయినా చెల్లించి బైపాస్ బస్సు సర్వీసుల్లో ఆత్మకూరుకు చేరుకునేందుకు ప్రయాణిస్తున్నారు. 2 కిలోమీటర్లకు రూ.20 నెల్లూరు నుంచి నెల్లూరుపాళెం వరకు మాములుగా చార్జీ రూ.35లు ఉండగా ఈ బస్సుల్లో రూ.65 వసూలు చేస్తున్నారు. అయితే ఈ బస్సులు నెల్లూరుపాళెంసెంటర్ నుంచి పట్టణంలోకి రాకపోవడంతో ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీంతో ఆటోవాలాలు ఇదే అదునుగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరానికి రూ.20 వసూలు చేయడం దారుణమని ప్రయాణికులు వాపోతున్నారు. ఆటో ఎక్కి దిగితే రూ.20 ఇవ్వాల్సిందేనని ఆటోవాలాలు పట్టుబడుతున్నారు. మంగళవారం రాత్రి ఆటోచార్జీ విషయమై ప్రయాణికులకు ఓ ఆటోవాలాకు తీవ్ర వాదోపవాదాలు జరిగినా చివరకు ఆటోవాలా డిమాండ్ మేరకు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. గత కొన్నేళ్లుగా దూర ప్రాంత బస్సులను ఆత్మకూరు పట్టణంలోకి కనీసం ఆర్టీసీ డిపో వరకైనా నడపాలని ప్రజలు కోరుతున్నా నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చడం లేదు. ప్రయాణికులను దోచుకుంటున్న ఆటోవాలాలను కట్టడి చేయాల్సిన ఆర్టీఏ, పోలీసు తదితర శాఖల అధికారుల నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రయాణికుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కిమ్మనక ఆటోవాలాలు అడిగిన మేరకు ఇవ్వక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. బైపాస్రైడర్ల, ఆటోవాలాల దోపిడీని ఎవరు అరికడతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
చోరీ కేసులో ఆటోడ్రైవర్ల అరెస్టు
మచిలీపట్నం (కోనేరుసెంటర్) : బంగారు ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు ఆటో డ్రైవర్లను ఇనగుదురుపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 46 గ్రాముల ఆభరణాలను స్వా«ధీనం చేసుకున్నారు. ఇనగుదురుపేట సీఐ సాయిప్రసాద్ స్థానిక స్టేషన్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని నవీన్‌మిట్టల్‌కాలనీ, జవ్వారుపేట, మగ్గాలకాలనీకి చెందిన తోకాడ పవన్, ఎండి.షరీబుద్దీన్, అంతటి దుర్గారావు స్నేహితులు. వారంతా ఆటో డ్రైవర్లు. మే 15వ తేదీన రాజుపేటకు చెందిన రిటైర్డు ఉద్యోగి దేవిశెట్టి వెంకటేశ్వరరావు కుటుంబం సభ్యులతో మేడపై నిద్రిస్తుండగా దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి 46 గ్రాముల బంగారు ఆభరణాలు, కెమేరా అపహరించారు. నిద్రిస్తున్న వెంకటేశ్వరరావు వద్ద ఉన్న సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం వెంకటేశ్వరరావు ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీ సులు దర్యాప్తుచేపట్టారు. ఈ నెల 18న షరీబుద్దీన్, దుర్గారావు, పవన్ మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్లో అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వెంకటేశ్వరరావు ఇంట్లో చోరీకి పాల్పడింది తామేనని ముగ్గురు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి రెండు పేటల బంగారు నానుతాడు, రెండు ఉంగరాలు, సెల్‌ఫోన్, కెమేరా, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ డి.దుర్గామహేశ్వరరావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించొద్దు..
♦ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి ♦ ఇసుక అక్రమ రవాణా చేస్తే చోరీ కేసులు ♦ జిల్లాలో ఎస్పీ విస్తృత పర్యటన జిల్లాలో శుక్రవారం ఎస్పీ విశ్వప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. బోధన్, బాన్సువాడ, మద్నూర్, బిచ్కుంద, నిజాంసాగర్ పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులు, క్రైం రిపోర్టులు పరిశీలించారు. ఆటోడ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించొద్దని, ఇసుకను అక్రమంగా తరలించొద్దని సూచించారు. బాన్సువాడ : ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వప్రసాద్ హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో తరలించవద్దని సూచించారు. శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే వారిపై చోరీ కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఇసుక ప్రభుత్వ ఆస్తి అని, దానిని కొల్లగొట్టడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవమని హెచ్చరించారు. అనుమతి లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో రవాణా చేసిన వారిపై 379 ఐపీసీ ప్రచారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా దారులతో పోలీసు అధికారులు కానీ సిబ్బంది మిలాఖాత్ అయితే శాఖాపరమైన చర్య లు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మహారాష్ట్ర ముఠాకు చెందిన దొంగలు దోపిడీలకు పాల్పడేందుకు యత్నిస్తున్నాయని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. సమావేశంలో బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్సై సంపత్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో నేర నియంత్రణకు చర్యలు బోధన్ రూరల్ : జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎస్పీ పి.విశ్వప్రసాద్ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లోని సాలూ ర, సలాబాత్పూర్లలో పోలీసు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు. బోధన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తూ క్రైం రేటును తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదాలు ఎక్కువ జరిగే రోడ్లను కేటగిరీల వారీగా బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తామన్నారు. హైవేలపై ప్రమాదాల నియంత్రణకు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. త్వరలో కిందిస్ధాయి బదిలీలు చేపడతామన్నారు. ఆయన వెంట సీఐలు వెంకన్న, శ్రీనివాసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి నిజాంసాగర్ : జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. ఆర్అండ్బీ, ఆర్టీవో, రెవెన్యూ శాఖల సహకారంతో రోడ్డు ప్రమాదాలను నివారిస్తామన్నారు. మూలమలుపులు, బ్రిడ్జిలు, ప్రధాన చౌరస్తాల వద్ద స్పీడ్‌బ్రేకర్లు, సిగ్నల్స్ ఏర్పాటు కోసం రోడ్లను సర్వే చేస్తున్నామన్నారు. నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసులకు క్వార్టర్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎస్పీ తెలిపారు. బోధన్ డివిజన్ పరిధిలోని 2 సర్కిల్ కార్యాలయాలతో పాటు మద్నూర్, రెంజల్ పోలీస్స్టేషన్లల్లో క్వార్టర్స్ నిర్మాణానికి నిధులు వచ్చాయని చెప్పారు. ఆయన వెంట బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి, ఏఎస్సై గాంధీగౌడ్ ఉన్నారు. మద్నూర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ మద్నూర్ : ఎస్పీ విశ్వప్రతాప్ శుక్రవారం మద్నూర్ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్లో క్రైం రిపోర్టును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ఆరాతీశారు. మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఎస్సై కాశీనాథ్‌కు సూచించారు. ఆయన వెంట బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సర్ధార్‌సింగ్ ఉన్నారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్.. బిచ్కుంద : ఎస్పీ విశ్వ ప్రసాద్ శుక్రవారం బిచ్కుంద పొలీస్ స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు, పొలీస్ స్టేషన్, పొలీసుల సమస్యలను సీఐ సర్దార్‌సింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, దొంగతనాలు నివారించడానికి నిత్యం గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. -
ఆటోడ్రైవర్లకు వైద్యం.. అందని వైనం!
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లకు కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన ఈఎస్ఐ వైద్య సౌకర్యానికి అతీగతీ లేదు. ఈ పథకం ప్రారంభించి ఐదునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై కేంద్ర కార్మికశాఖ నుంచి నోటిఫికేషన్ ఇంకా రాలేదని చెబుతూ అధికారులు మొహం చాటేస్తున్నారు. ఆటోడ్రైవర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు.. ఇలా అసంఘటిత రంగ కార్మికులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఏడాదికాలంగా పదే పదే ప్రకటిస్తున్నారు. మొదటగా ఆటోడ్రైవర్లకు ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామంటూ ఈ ఏడాది జనవరి మొదటివారంలో హైదరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కొంతమందికి ఈఎస్ఐ కార్డులను కూడా పంపిణీ చేశారు. ఆటోడ్రైవర్లకు కల్పించిన ఈఎస్ఐ మెడికల్ స్కీం కింద కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, అందుకోసం ఒక్కో ఆటోడ్రైవర్ తన వాటాగా ఆరు నెలలకోసారి రూ.1500 చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. ఈఎస్ఐ బ్రాంచ్‌లలో డబ్బులు చెల్లించి కార్డులు తీసుకోవాలని, ఈ కార్డు ద్వారా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అన్ని వైద్యసేవలతోపాటు మందులను కూడా ఉచితంగా పొందవచ్చని తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఆటోడ్రైవర్ల నుంచి ఒక్క దరఖాస్తును కూడా స్వీకరించలేదు. దీంతో హైదరాబాద్‌లోని దాదాపు 1.5 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఈఎస్ఐ వైద్యసేవల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆటోడ్రైవర్లు నిత్యం ఈఎస్ఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశగా వెనుదిరుగుతున్నారు.