ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు.
హైదరాబాద్: ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. మహాత్మాగాంధీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు నుంచి ప్రారంభమౌతుందని యూనియన్ అధ్యక్షుడు మహ్మద్ ఇబ్రహీం అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోలకు ఈ- చలాన్ల నుంచి మినహాయింపు కల్పించాలని, లెసైన్సు లేని ఆటో డ్రైవర్ల కోసం మేళా, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆరోగ్య కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త ఆటోల కొనుగోలుకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని తమ డిమాండ్లుగా పేర్కొన్నారు.
(రాంగోపాల్‌పేట్)