రేప్ క్యాపిటల్ లో ఈ సారి జర్మన్ నిర్భయ! | German student molested in Delhi | Sakshi
Sakshi News home page

రేప్ క్యాపిటల్ లో ఈ సారి జర్మన్ నిర్భయ!

Published Fri, Mar 14 2014 4:18 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

రేప్ క్యాపిటల్ లో ఈ సారి జర్మన్ నిర్భయ! - Sakshi

రేప్ క్యాపిటల్ లో ఈ సారి జర్మన్ నిర్భయ!

రేప్ క్యాపిటల్ ఢిల్లీ మరోసారి వార్తకెక్కింది. ఇండియన్ నిర్భయ తరువాత ఈ సారి జర్మన్ నిర్భయ అత్యాచారినికి గురైంది. అప్పుడు బస్సు సిబ్బంది రేప్ చేస్తే ఇప్పుడు ఆటోవాలాలు అదే పని చేశారు.


ఢిల్లీలో చదువుకుంటున్న 23 ఏళ్ల జర్మన్ యువతి మార్చి 8 న లాజపత్ నగర్ వెళ్లేందుకు జనపథ్ వద్ద ఒక ఆటో ఎక్కింది. మార్గమధ్యంలోనే ఆటో డ్రైవర్ తన మిత్రులకు ఫోన్లు చేసి పిలుచుకున్నాడు. ఒక నిర్జన ప్రదేశం చేరుకోగానే ఆటో డ్రైవర్ ఆమె వస్తువులను దోచుకుని, ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలో అతని మిత్రులు కూడా తోడయ్యారు. వారంతా కలిసి మహిళతో దుర్వ్యవహారం జరిపారు. తరువాత వారు ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు.


ఆ యువతి లాజ పత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే రేప్ క్యాపిటల్ పోలీసులు 'రేపు రా' అనడానికి అలవాటు పడ్డారు. మొదట పోలీసులు ఆమెను కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ కు పంపించారు. అక్కడి పోలీసులు కూడా ఆమెతో ఖో ఖో ఆట ఆడుకున్నారు. ఆమెను బారాఖంబా పోలీస్ స్టేషన్ వెళ్లమన్నారు. చివరికి బారాఖంబా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు.
ఇప్పుడు పోలీసులు జనపథ్ రోడ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరీక్షించి, ఆటో డ్రైవర్లను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement