Hyderabad: నడిరోడ్డుపై హంగామా | Two Auto drivers Hall chall in hyderbaad | Sakshi
Sakshi News home page

Hyderabad: నడిరోడ్డుపై హంగామా

Published Mon, Nov 18 2024 10:55 AM | Last Updated on Mon, Nov 18 2024 10:55 AM

Two Auto drivers Hall chall in hyderbaad

గంజాయి మత్తులో తన్నుకున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు  

చార్మినార్‌ : చార్మినార్‌ ఆర్టీసి బస్టాప్‌ రోడ్డులో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆదివారం సాయంత్రం హంగామా చేశారు. గంజాయి మత్తులో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎవరు.. ఎవరిని.. ఎందుకు.. కొడుతున్నారో వారికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.  రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొంత మంది వాహన దారులు  సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిని సైతం నెట్టివేస్తు దుర్భాషలాడారు.   

కనిపించని పోలీసులు... 
ఇంత జరుగుతున్నా...సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడం గమనార్హం. అసలే వీకెండ్‌ అయిన ఆదివారం కావడంతో సహజంగానే సాధారణ రోజుల కన్నా..ఆదివారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. గతంలో తొలగించిన చారి్మనార్‌ ఆర్టీసి బస్టాండ్‌ భవనం ఎదురుగా ఉన్న ప్యారిస్‌ కేఫ్‌ రోడ్డులో ఈ గలాటా జరిగింది. ఇక్కడ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు సైతం విధినిర్వాహణలో కనిపించ లేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చారి్మనార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసు స్టేషన్ల సరిహద్దులో జరిగింది. అయితే సంఘటన జరిగిన ప్రదేశం మొఘల్‌పురా పోలీసు స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement