
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్.. అలాగే హైదరాబాద్ చార్మినార్‌లోని పాతబస్తీకి చెందిన ఓ విద్యార్థి పారా సైక్లింగ్‌లో నేషనల్ లెవెల్ దాటుకొని ఇంటర్నేషనల్‌కు చేరాడు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు సమయం దొరికినప్పుడల్లా క్రీడలపై మక్కువ చూపుతుండేవాడు. జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతున్న 13వ ఏషియన్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు శాలిబండ సైక్లింగ్ క్లబ్ విద్యార్థి ఆశీర్వాద్ సక్సేనా..
పాతబస్తీ బేలా కాలనీకి చెందిన ఆశీర్వాద్ సక్సేనా కుటుంబం వ్యాపార రంగంలో ఉండగా చిన్ననాటి నుంచి క్రీడలంటే ఇష్టం ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఎప్పుటికప్పుడు తన కోచ్‌ల ద్వారా మెళకువలు నేర్చుకుంటూ సైక్లింగ్‌లో ప్రతిభ కనబర్చాడు.
మెల్‌బోర్న్‌లోని డాకిన్ యూనివర్సిటీలో ఎక్సైర్‌సైజ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్‌లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తూనే సైక్లింగ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో జరిగే సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఓవైపు విద్యాభ్యాసం.. మరోవైపు సైక్లింగ్‌లో పాల్గొంటూ పతకాల వేట కొనసాగిస్తున్నాడు. థాయిలాండ్‌లో కొనసాగుతున్న 13వ ఏషియన్ పారా
రోడ్ సైక్లింగ్
ఛాంపియన్‌షిప్–2025లో పాల్గొనేందుకు నగరం నుంచి తన కోచ్‌లతో కలిసి వెళ్లాడు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు సాధించిన ఆశీర్వాద్ సక్సేనా థాయిలాండ్‌లో మెడల్ సాధిస్తాడని పలువురు క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
38వ జాతీయ ఆటల పోటీలలో..
ఉత్తరాఖాండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ పోటీల్లో 120 కిలోమీటర్ల మాస్ స్టార్ట్ రోడ్ రేస్ పోటీలో కాంస్యం గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా.. రాష్ట్రం తరఫున కాంస్యం సాధించిన ఆశీర్వాద్ సక్సేనాను తెలంగాణ స్టేట్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.దత్తాత్రేయ తదితరులు అభినందించారు. ఆశీర్వాద్ సక్సేనాను ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా పిలుస్తున్నామని కె.దత్తాత్రేయ పేర్కొన్నారు.
యువ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా..
అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక. విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా ఓ వైపు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే.. మరోవైపు ఇష్టమైన సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను అని చెబుతున్నాడు ఆశీర్వాద్ సక్సేనా
సాధించిన మెడల్స్..
2019లో మహారాష్ట్రలో జరిగిన ఇండియన్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలో కాంస్యం
2021లో జైపూర్‌లో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి, కాంస్య పతకాలు
2022లో గౌహతిలో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు వెండి పతకాలతో పాటు రెండు కాంస్య పతకాలు
2022లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా ట్రాక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం
2024లో మెల్‌బోర్న్‌లో అండర్–23 విభాగంలో క్రిటేరియం సైక్లింగ్ రేస్‌లో కాంస్యం
2024లో కర్ణాటకలో జరిగిన నేషనల్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం
2024లో చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలతో పాటు వెండి పతకం సాధించారు.
(చదవండి: భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!)
Comments
Please login to add a commentAdd a comment