championship
-
పాతబస్తీ కుర్రాడు సైక్లింగ్‌లో ఇంటర్నేషనల్ లెవెల్..!
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్.. అలాగే హైదరాబాద్ చార్మినార్‌లోని పాతబస్తీకి చెందిన ఓ విద్యార్థి పారా సైక్లింగ్‌లో నేషనల్ లెవెల్ దాటుకొని ఇంటర్నేషనల్‌కు చేరాడు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు సమయం దొరికినప్పుడల్లా క్రీడలపై మక్కువ చూపుతుండేవాడు. జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతున్న 13వ ఏషియన్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు శాలిబండ సైక్లింగ్ క్లబ్ విద్యార్థి ఆశీర్వాద్ సక్సేనా.. పాతబస్తీ బేలా కాలనీకి చెందిన ఆశీర్వాద్ సక్సేనా కుటుంబం వ్యాపార రంగంలో ఉండగా చిన్ననాటి నుంచి క్రీడలంటే ఇష్టం ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఎప్పుటికప్పుడు తన కోచ్‌ల ద్వారా మెళకువలు నేర్చుకుంటూ సైక్లింగ్‌లో ప్రతిభ కనబర్చాడు. మెల్బోర్న్లోని డాకిన్ యూనివర్సిటీలో ఎక్సైర్సైజ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్‌లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తూనే సైక్లింగ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో జరిగే సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఓవైపు విద్యాభ్యాసం.. మరోవైపు సైక్లింగ్‌లో పాల్గొంటూ పతకాల వేట కొనసాగిస్తున్నాడు. థాయిలాండ్‌లో కొనసాగుతున్న 13వ ఏషియన్ పారారోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్–2025లో పాల్గొనేందుకు నగరం నుంచి తన కోచ్‌లతో కలిసి వెళ్లాడు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు సాధించిన ఆశీర్వాద్ సక్సేనా థాయిలాండ్‌లో మెడల్ సాధిస్తాడని పలువురు క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38వ జాతీయ ఆటల పోటీలలో..ఉత్తరాఖాండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ పోటీల్లో 120 కిలోమీటర్ల మాస్ స్టార్ట్ రోడ్ రేస్ పోటీలో కాంస్యం గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా.. రాష్ట్రం తరఫున కాంస్యం సాధించిన ఆశీర్వాద్ సక్సేనాను తెలంగాణ స్టేట్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.దత్తాత్రేయ తదితరులు అభినందించారు. ఆశీర్వాద్ సక్సేనాను ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా పిలుస్తున్నామని కె.దత్తాత్రేయ పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక. విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా ఓ వైపు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే.. మరోవైపు ఇష్టమైన సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను అని చెబుతున్నాడు ఆశీర్వాద్ సక్సేనాసాధించిన మెడల్స్..2019లో మహారాష్ట్రలో జరిగిన ఇండియన్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో కాంస్యం 2021లో జైపూర్‌లో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి, కాంస్య పతకాలు 2022లో గౌహతిలో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు వెండి పతకాలతో పాటు రెండు కాంస్య పతకాలు 2022లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా ట్రాక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో మెల్బోర్న్లో అండర్–23 విభాగంలో క్రిటేరియం సైక్లింగ్ రేస్‌లో కాంస్యం 2024లో కర్ణాటకలో జరిగిన నేషనల్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలతో పాటు వెండి పతకం సాధించారు. (చదవండి: భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!) -
ఆటల్లో ఆణిముత్యం..ఐఏఎస్ ఆమె టార్గెట్..!
ఆటల్లో ఆణిముత్యం ఆటకు ప్రతిభ మాత్రమే కాదు సాధన కూడా ముఖ్యమే. తన ప్రతిభకు నిరంతర సాధన జోడించి జంప్ రోప్ నుంచి జోడో వరకు ఎన్నో ఆటల్లో అద్భుత విజయాలు సాధిస్తోంది వనిపెంట శ్రావణి. తాజాగా నేపాల్‌లో నిర్వహించిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్ షిప్ 2025 టోర్నమెంట్లో రెండు బంగారుపతకాలు సాధించి సత్తా చాటింది...శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన వనిపెంట శ్రావణి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కలిగిరిలో చిన్న కూరగాయల దుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. రెండో కుమార్తె శ్రావణి చదువుల్లో ముందుంటూనే క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది.ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు ఆటలపై శ్రావణికి ఉన్న ఆసక్తిని అప్పటి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్, ప్రస్తుత నెల్లూరు జిల్లా జంప్ రోప్ సెక్రటరీ జి.మురళి గుర్తించారు. ఎంతో ప్రోత్సహించారు. మురళి సూచనలు, సలహాలతో శ్రావణి జంప్ రోప్ క్రీడతో పాటు షూటింగ్ బాల్, టార్గెట్ బాల్, జూడోలో ప్రావీణ్యం సాధించింది.శ్రావణి ఏ టోర్నమెంట్లో పాల్గొన్నా పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రతిభ చూపేది. ఇప్పటి వరకు జంప్ రోప్లో జిల్లా స్థాయిలో 10, జాతీయ స్థాయిలో 5 గోల్డ్, ఒక సిల్వర్, అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించింది. 2023లో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ టోర్నమెంట్లో రన్నర్‌గా నిలిచింది. నేపాల్‌లో నిర్వహించిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్ షిప్ 2025 టోర్నమెంట్లో రెండు బంగారు పతకాలు సాధించి సత్తాచాటింది. ఐపీఎస్ కావడమే లక్ష్యంప్రాక్టీస్ చేయడం నుంచి పోటీల్లో పాల్గొనడం వరకు ఆటల్లో ఉండే ఉత్సాహమే వేరు. ఆటలు ఉత్సాహాన్నే కాదు శక్తిని ఇస్తాయి. జీవితంలో లక్ష్యాన్ని ఏర్పర్చుకునేలా చేస్తాయి. ఆటల్లో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు గెలుచుకోవాలనుకుంటున్నాను. బాగా చదివి ఐపీఎస్ సాధించాలని ఉంది. మంచి పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకుంటాను. అమ్మ,నాన్న అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుండడంతో బాగా చదవడం తోపాటు క్రీడల్లో రాణించగలుగుతున్నాను. – రావుల రాజగోపాల్‌రెడ్డి, సాక్షి, కలిగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (చదవండి: లెడ్‌లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..! ) -
క్యారమ్స్ కథ గురించి తెలుసా? ఎక్కడ? ఎపుడు పుట్టింది?
ఏమీ తోచనప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది క్యారమ్స్. ఇద్దరు, నలుగురు కలిసి ఆడే ఈ ఆటంటే అందరికీ ఇష్టం. ఎవరికి ఎక్కువ కాయిన్స్ దక్కుతాయో ఎవరు రెడ్ కాయిన్స్‌ని చేజిక్కించుకుంటారో వారే ఈ ఆటలో విజేతలవుతారు. ఈ క్యారమ్స్ కథేమిటో తెలుసా?క్యారమ్స్ భారతదేశంలోనే పుట్టింది. ఎప్పుడు పుట్టిందనే సరైన లెక్కలు లేకపోయినా వందేళ్ల క్రితమే మన దేశంలోని సంపన్నుల ఇళ్లల్లో కొందరు క్యారమ్స్ ఆడేవారని అంచనా. 1935 నాటికి శ్రీలంక దేశంలో ఈ ఆటకు సంబంధించి పోటీలు ప్రారంభమయ్యాయి. 1958లో శ్రీలంక, భారత్ దేశాలు క్యారమ్స్ ఆటకు అధికారిక ఫెడరేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేశాయి. దీన్నిబట్టి అప్పటికే దేశంలో క్యారమ్స్ పాపులర్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. 1988లో చెన్నైలో తొలిసారి ‘అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య’ (ఐసీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ క్యారమ్స్కి సంబంధించి విధివిధానాలు రూపొందించారు. అనంతరం పలు దేశాల్లో ఫెడరేషన్లు ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో జాతీయ ఛాంపియన్ షిప్స్ నిర్వహించడం మొదలు పెట్టారు. (పుట్టింది కెనడాలో... అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!) క్యారమ్స్ ఆడేందుకు శారీరకంగా ఇబ్బందిపడనక్కర్లేదు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా కలిసి ఆడుకోవచ్చు. దీంతో ఈ క్యారమ్స్ చాలా ప్రసిద్ధి చెందింది. 2000వ సంవత్సరం నాటికి అనేకమంది ఇళ్లల్లోకి క్యారమ్ బోర్డులు రావడం ఇందుకు ఉదాహరణ. 73.5 సెం.మీల ఎత్తు, 74 సెం.మీల వైశాల్యం కలిగిన ఈ బోర్డు ఆడేందుకు కాకుండా చూసేందుకూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పరిమాణాన్ని అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య నిర్దేశించింది. క్యారమ్స్ ఆడేందుకు 19 కాయిన్స్, స్టైకర్ ఉండాలి. ఈ కాయిన్స్ తెలుపు, నలుపు, ఒకే ఒక్కటి మాత్రం ఎరుపురంగులో ఉంటాయి. బోర్డుపై ఆట సౌకర్యవంతంగా ఉండేందుకు బోరిక్ పౌడర్ వాడతారు. చెన్నైకి చెందిన ‘ఆంథోనీ మరియ ఇరుదయం’ అనే వ్యక్తి మన దేశంలో క్యారమ్స్ ఆటకు ప్రసిద్ధి చెందారు. రెండుసార్లు ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ షిప్, తొమ్మిదిసార్లు నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా 1996లో ఆయనకు ‘అర్జున’ పురస్కారం ఇచ్చారు. క్యారమ్స్ కథ విన్నారుగా! ఖాళీ సమయాల్లో ఎంచక్కా ఆడుకోండి మరి! -
జిమ్నాస్టిక్స్‌లో వెలిగిన దీపం
ఆరేళ్ల వయసులోనే ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ వైపు ఆకర్షితురాలైంది. అయితే ఆమె పాదం కింది భాగం చూస్తే సమతలంగా ఉంది. ఈ ఆటకు ఇలాంటి పాదం పనికి రాదని, జంప్ చేసే సమయంలో ఇబ్బంది కలుగుతుందని స్థానిక కోచ్‌లు చెప్పేశారు. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్‌గా ఉన్న బిశ్వేశ్వర్ నంది మాత్రం ఆ అమ్మాయిలో చురుకుదనాన్ని గుర్తించాడు. తాను ఆమె లోపాన్ని ఎలాగైనా సరిదిద్ది మరీ ఆటలో తీర్చిదిద్దుతానని ఆమె తండ్రికి మాటిచ్చాడు. అక్కడి నుంచి మొదలైన ఆ చిన్నారి ప్రస్థానం ఆపై భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచే వరకు సాగింది. ఆ అమ్మాయే దీపా కర్మాకర్. 16 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప.. ఎన్నో అరుదైన రికార్డులను, గతంలో ఎవరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతలను నమోదు చేసింది.ఓడినా విజేతగా నిలిచి..ప్రొడునోవా వాల్ట్.. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన ఈవెంట్. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఐదుగురు మాత్రమే ఈ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. వారిలో దీప కూడా ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఈ విన్యాసాన్ని చేసి చూపించింది. తన సత్తాను చాటింది. అప్పటి వరకు మన దేశం నుంచి.. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో ఎవరూ కనీసం అర్హత కూడా సాధించలేకపోయారు. అది దీపకు మాత్రమే సాధ్యమైంది. ఆపై ఫైనల్‌కు కూడా చేరిన ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కానీ దురదృష్టవశాత్తు 0.15 పాయింట్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. అయితేనేమి.. ఆమె ఘనతను అందరూ గుర్తించారు. అందుకే పతకాలు గెలుచుకున్నవారితో సమానంగా ఆమెకూ అభినందనలు, ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభించాయి. ఒలింపిక్ పతకం గెలవకపోయినా ఆటలో తన 17 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలంతో దీప కన్నీళ్లపర్యంతమైంది. ఈ క్రమంలో సహజంగానే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ.. దీపను వరించాయి. జాతీయ స్థాయిలో..త్రిపుర రాజధాని అగర్తలా దీప స్వస్థలం. తండ్రి ప్రోత్సాహంతో ఆటల వైపు ఆసక్తి చూపించిన ఆమె బిశ్వేశ్వర్ నంది అండగా నిలవడంతో పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్‌పై దృష్టి సారించింది. కఠోర శ్రమ, ప్రాక్టీస్ తర్వాత తన సమతల పాదం లోపాన్నీ అధిగమించిన దీపకు ఆపై ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. స్థానికంగా చిన్న చిన్న టోర్నీల్లో విజయాలు సాధించిన తర్వాత 15 ఏళ్ల వయసులో దీప పేరు తొలిసారి పెద్ద స్థాయికి చేరింది. బెంగాల్‌లోని జల్పాయీగుడీలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తన సాధనకు మరింత పదును పెట్టింది. ఫలితంగా సీనియర్ టీమ్‌లోకి పిలుపు వచ్చింది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో దీపకు చోటు దక్కింది. అయితే పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రం రాలేదు. కానీ తర్వాతి ఏడాది జాతీయ క్రీడల్లో త్రిపుర తరఫున పాల్గొని అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణాలనూ దీప గెలుచుకోవడం విశేషం. విమర్శలను దాటి..అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి దీప ఏం చేసినా అది భారత్ తరఫున మొదటి ఘనతగానే నమోదైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన దీప ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తర్వాతి ఏడాదే ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఐదో స్థానం సాధించింది. ఇదే ఆమెను రియో ఒలింపిక్స్ దిశగా తీసుకెళ్లింది. ‘నా గురించి విమర్శలు వచ్చిన ప్రతిసారి వారికి నా ఆటతోనే సమాధానం ఇచ్చాను. 2014లో ప్రొడునోవా మొదలుపెట్టినప్పుడు నన్ను బఫెలో అంటూ చాలా మంది ఆట పట్టించారు. వెంటనే కామన్వెల్త్ పతకం సాధించి చూపించాను. వయసు అయిపోయింది, ఆటలో దమ్ము లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చూపించాను. ఇలాంటి ముగింపు ఇవ్వాలనే ఇంతకాలం ఆగాను. ఇప్పుడు సంతృప్తిగా ఉంది’ అంటూ దీప తన రిటైర్మెంట్ సమయంలో వెల్లడించింది. వండర్‌ఫుల్‌గా ముగించి..తన ఆత్మకథ స్మాల్ వండర్‌లో ఆమె తన కెరీర్‌లోని పలు మలుపుల గురించి చెప్పుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ హోదా వచ్చినా ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వరుస గాయాలతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. పైగా పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి మద్దతు దక్కకపోవడంతో ట్రయల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచినా పలు సాకులు వెతికి ఆమెను ఆసియా క్రీడలకు పంపకుండా ఫెడరేషన్ నిలిపివేసింది. ఇలాంటి కఠిన సమయాల్లో తాను మానసికంగా మరింత దృఢంగా తయారైంది. విరామం తర్వాత 2018లో రెండు పెద్ద విజయాలతో ఆమె తన సత్తా చాటింది. రెండు వరల్డ్ కప్‌లలో వరుసగా స్వర్ణం, కాంస్యం గెలిచి ఘనంగా పునరాగమనం చేసింది. ఆస్తమా, దగ్గు కోసం వాడే హైజినమైన్ మందును అనుకోకుండా తీసుకొని నిషేధానికి గురైనప్పుడు ఆమెకు ఎక్కడా కనీస మద్దతు లభించలేదు. ఈ ఘటన తర్వాత మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదల ఆమెలో కనిపించింది. 30 ఏళ్లు దాటినా.. అదే జిమ్నాస్టిక్స్ బార్‌పై తీవ్రంగా సాధన చేసింది. 2024 మేలో తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ బరిలోకి దిగి స్వర్ణ పతకంతో మెరిసి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఈ టోర్నీకి ముందు ‘నేను ఇంకా బతికే ఉన్నానని చాటాలనిపించింది. అందుకే పోటీ పడుతున్నా’ అని భావోద్వేగంతో చెప్పిన దీప సగర్వంగా తన కెరీర్‌ను ముగించి భవిష్యత్ తరాలకు జిమ్నాస్టిక్స్‌లో వెలుగుల దారి చూపించింది. -
టీచర్ కాస్త రేసర్‌గా..ఏకంగా నేషనల్ కారు రేసింగ్ ఛాంపియన్షిప్..!
మనకు నచ్చిన అభిరుచి వైపు అకుంఠిత దీక్షతో సాగితే ఉన్నత విజయ శిఖరాలను అందుకోవడం ఖాయం. అలా ఎందరో గొప్ప గొప్ప విజయాలను అందుకుని స్ఫూర్తిగా నిలచారు కూడా. అలాంటి కోవకు చెందిందే డయానా పుండోల్. ఇంతకీ ఎవరీమె? ఏం సాధించిందంటే..పూణేకు చెందిన 28 ఏళ్ల డయానా పుండోల్ పురుషులే ఎక్కువగా ఇష్టపడే రేసింగ్‌ల వైపుకు అడుగులు వేసింది. రేసింగ్ అనేది పురుషాధిక్య కాంపీటీషన్ అనే చెప్పాలి. సాధారణంగా మహిళలు ఇటువైపు రావడం. అదీగాక ఎక్కువగా పురుషులే ఈ కారు రేసింగ్‌లో ఛాంపియన్ షిప్‌లు గెలుచుకుంటారు. ఇంతవరకు వాళ్లే ఈ రంగంలో అధిక్యంలో ఉన్నారు. అలాంటి సాహసకృత్యంతో కూడిన రేసింగ్‌ని డయానా ఎంచుకుంది. పైగా ఆమె తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెబుతుండటం విశేషం. ఎంతో అంకితభావంతో రేసింగ్‌లో శిక్షణ తీసుకుని ఏకంగా నేషల్ కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. అంతేగాదు ఇలాంటి ఘనత సాధించిన తొలి మహిళా రేసర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె టీచర్‌గా పనిచేస్తూ వీకెండ్లలో రేసింగ్ ప్రాక్టీస్ చేసి మరీ విజయం సాధించడం విశేషం. ఇన్నాళ్లుగా మహిళలు సాహస క్రీడల్లో పాల్గొనడం అంటే మాటలు కాదు అనే వాళ్ల నోళ్లు మూయించేలా విజయఢంకా మోగించింది డయానా. మహిళలు తలుచుకుంటే ప్రతి రంగంలో ధైర్యంగా దూసుకుపోగలరని తన గెలుపుతో చాటి చెప్పింది. అంతేగాదు పురుషలకు ఏ విషయంలోనూ మహిళలు తీసిపోరని నర్మగర్భంగా చెప్పింది. కాగా, ఆమె ఇలాంటి పలు ఇతర ప్రతిష్టాత్మకమైన రేసింగ్లలో పాల్గొంది కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రసిద్ధ రేసింగ్ కాంపిటీషన్ అన్నింటిల్లోనూ పాల్గొంది. ముఖ్యంగా దుబాయ్ ఆటోడ్రోమ్, యూరప్, యూఏఈలోని హాకెన్‌హైమ్రింగ్, బెల్జియంలోని F1 సర్క్యూట్ డి స్పా వంటి రేసింగ్లలో కూడా పాల్గొంది. పైగా రానున్న జనరేషన్ ధైర్యంగా ఇలాంటి వాటిల్లోకి వచ్చేలా ప్రేరణగా నిలిచింది. ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నైపుణ్యం తోడైతే ఎలాంటి ఛాలెంజింగ్ క్రీడల్లో అయినా విజయం సాధించొచ్చని డయానాని చూస్తే తెలుస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Diana (@diana.pundole) (చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
రెగట్టాలో మనోళ్ల హవా
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా కొనసాగుతున్న సెయిలింగ్ మాన్సూన్ రెగట్టా పోటీల్లో మరోసారి తెలంగాణ సెయిలర్లు రాణిస్తున్నారు. సాగర్‌లో జరుగుతున్న 15వ మాన్సూన్ రెగట్టాలో బుధవారం అండర్–16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్‌లో ఉద్బవ్ స్కూల్ నుంచి గోవర్ధన్పల్లార, లాహిరి కొమరవెల్లి, దీక్షిత కొమరవెల్లి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. గోవర్ధన్ తన విజయాలతో రెండవ స్థానం కన్నా ముందే ఉన్నప్పటికీ అగ్రస్థానం కోసం మరో 4 రేసులతో నైపుణ్యాలను ప్రదర్శించాలి. సెయిలింగ్ స్టార్ లాహిరికి ఓ ప్రమాదంలో ఎడమ చేయి విరగడంతో మొదటి రెండు రేసులకు అనుమతించలేదు. చివరకు వైద్యుడి పర్యవేక్షణలో అనుమతించడంతో లాహిరి ఒక రేసులో మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ 39 సెయిలర్ ఫ్లీట్‌లో ప్రశంసనీయంగా 19వ స్థానంలో నిలిచింది. ఐఎల్సీఏ 4 బాలుర విభాగంలో టీఎస్సీ మైసూర్‌కు చెందిన కృష్ణ దివాకర్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాథమ్ (3వ స్థానం)ను బీట్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. శశాంక్ బాథమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో సోమ్యా సింగ్, అలియా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ లోకల్స్‌లో తనుజా కామేశ్వర్, వైష్ణవి అగ్రస్థానంలో నిలిచారు. బాలికల హాఫ్ రిగ్ ఫ్లీట్‌లో అఖిల కొప్పుల (13) స్వర్ణం, రెయిన్బో హోమ్స్ ముషీరాబాద్‌కు చెందిన నికిత జీరు (12) రజతం సాధించారు. -
రోహిత్ సూపర్ లుక్.. వింబుల్డన్‌లో హిట్‌మ్యాన్ సందడి (ఫోటోలు)
-
జాతీయ స్థాయి ఇంగ్లిష్ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా విభా, లీప్ ఫార్వార్డ్ సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్రానికి రెండు బహుమతులు సాధించారు. గత నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12న ముంబైలో జరిగిన గ్రాండ్ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి బి.రేవంత్‌కుమార్ రెండో స్థానం, ఐదో తరగతి విద్యార్థి అనిల్‌కుమార్ బాణావత్ మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ దేశంలోనే అతిపెద్ద పోటీ కార్యక్రమం. ఈ పోటీలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనగా, ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి అభినందించారు. ఈఎల్పీ ద్వారా శిక్షణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు 2021లో ప్రభుత్వం ఇంగ్లిష్ లిటరసీ ప్రోగ్రామ్(ఈఎల్పి)ను ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆరీ్టతో విభా, లీప్ ఫార్వర్డ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్ ద్వారా 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో ప్రభుత్వం చేపట్టిన ఈఎల్పీ సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది. -
ఆ క్రీడాకారుడు ధరించిన 'షూ'లు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 66 కోట్లు..
ఓ క్రీడాకారుడు ధరించిన షూ వేలంటో కనివినీ ఎరుగుని రీతీలో ధర పలికాయి. ఆ షూతోనే ఆ క్రీడాకారుడు టైటిళ్లను గెలిచుకున్నాడు. ఆ షూలు ప్రముఖ బ్రాండ్‌వి కావడం ఒక విశేషం అయితే క్రీడాకారుడి గెలుపులో పాత్ర షోషించడం మరో స్పెషల్టీ. దీంతో అవి వేలంలో మంచి క్రేజ్ రావడంతో వేలంలో ఇంతలా ధర పలికి అందర్నీ షాక్ గురి చేసింది. ఎవరా క్రీడాకారుడు? ఏంటా బ్రాండ్ అంటే.. బాస్కెట్ బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ ప్రసిద్ధ బ్రాండ్‌కి చెందిన ఆరు షూల జతను ధరించి ప్రతిష్టాత్మకమైన ఆరు ఎన్బీఏ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నారు. అవి ప్రమఖ ఎయిర్ జోర్డాన్ బ్రాండ్‌కి చెందినవి. సాధారణంగానే ఆ బ్రాండ్ షూలు అత్యంత ఖరీదైనవి. ఇక ఆ క్రీడాకారుడు విజయంలో పాత్ర పోషించిన ఆ షూలకు ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. తొలిసారిగా 1991లో ఎన్బీఏ ఫైనల్స్‌లో పోటీ పడుతున్న సమయంలో మైఖేల్‌ని పీఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ హాలండ్ జట్టు విజయం సాధిస్తే తాను ధరించిన ఎయిర్ జోర్డాన్ బ్రాండ్ షూ జతను తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మైకేల్ విజయం సాధించిన తదనంతరం అతడి కోరికను తీర్చాడు. ఆ షూను హాలండ్‌కు బహుమతిగా ఇచ్చే ముందుకు దానిపై సంతకం చేసి మరీ ఇచ్చాడు. ఇలా ఐదు ఛాంపియన్‌షిప్‌లో అతడు ఆ సంప్రదాయన్ని కొనసాగించాడు. ఇలా చేస్తే గెలుస్తానని మైఖేల్ సెంటిమెంట్‌గా ఫీలయ్యాడో ఏమో గానీ అలా హాలండ్ వద్ద ఆరు జతల షూలు ఉండటం జరిగింది. ఆయన సాధించిన ఆరు చాంపియన్ షిప్‌ల్లో పాత్ర వహించిన ఆ ఆరు ఎయిర్ జోర్డాన్ షూల జతను ప్రముఖ వేలం సంస్థ సోథెబిన్ శుక్రవారం వేలం వేయగా ఆ బ్రాండ్‌కి తగ్గ రేంజ్‌లోనే రికార్డు స్థాయిలో ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ బ్రాండ్‌కి ఎప్పటికీ అత్యంత విలువైందని ఫ్రూవ్ చేసుకుందని పలువురు ప్రశంసించారు. ఇలా మైఖేల్ ధరించిన షూలు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఇలానే ఎయిర్ జోర్డాన్ 13 షూ, అలాగే 1988లో ఎన్బీఏ ఛాంపియన్ గేమ్‌లో విజయాన్ని తెచ్చిన అదే బ్రాండ్‌కి చెందిన మరో రకం షూ వేలంలో రూ 18 కోట్ల ధర పలికింది. అలాగే అక్టోబర్‌లో నవంబర్ 1, 1984లో రూకీ సీజన్లో ఐదవ ఎన్బీఏ చాంఫీయన్ షిప్‌ను గెలుచుకున్నప్పుడూ ధరించిన రెడ్ అండ్ వైట్ ఎయిర్ షూ జత ఏకంగా రూ. 12 కోట్లు పలికింది. ఇప్పుడూ ఏకంగా వాటన్నింటిని తలదన్నేలా ఆ బ్రాండ్‌కి తగ్గట్లుగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 66 కోట్లు పలకడం విశేషం. (చదవండి: అఖండ హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!) -
మొదటిసారి ఈ-రేసింగ్ ఛాంపియన్షిప్ - టీవీఎస్ మోటార్స్
బెంగళూరు: టీవీఎస్ మోటార్స్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు(టీవీఎస్ ఎలక్ట్రిక్ వన్ మేకింగ్ చాంపియన్‌షిప్) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఈ రేస్ మోటార్‌సైకిళ్లతో ఈ పోటీలు జరగనున్నాయి. ఈవీ మోటార్ రేసింగ్ ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించిన మొట్ట మొదటి భారత కంపెనీ తమదేనని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. భారత్‌లో మోటార్స్పోర్ట్స్లను ప్రోత్సహించడం, సుస్థిర రవాణా పరిష్కారాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. -
తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ షురూ
లక్డీకాపూల్: తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోరీ్నలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి జూనియర్ ప్లేయర్లు తనుజ్ రెడ్డి పులి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీతో పాటు పురుషుల, మహిళల టాప్ ర్యాంకర్లు రోహన్ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్ బరిలో ఉన్నారు. బాలుర అండర్–11, అండర్–13, అండర్–15, బాలికల అండర్–13, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పురుషుల 35, 45 వయో విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. శనివారం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగనున్నాయి. రాష్ట్రానికి చెందిన స్క్వాష్ క్రీడాకారులకు గొప్ప వేదిక అయిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్‌ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు టోర్నమెంట్ చైర్మన్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఏజ్ గ్రూప్ పోటీల్లో అగ్ర ఆటగాళ్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి టోర్నమెంట్లో బలమైన పోటీ ఉంటుందన్నారు. -
భారత వాలీబాల్ జట్టుకు నిరాశ
మనామా (బహ్రెయిన్): ప్రపంచ అండర్–21 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు పరాజయం చవిచూసింది. తద్వారా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. పూల్ ‘సి’లో ఉన్న భారత జట్టు తొలి మ్యాచ్‌లో 17–25, 14–25, 25–20, 19–25తో పోలాండ్ చేతిలో... రెండో మ్యాచ్‌లో 19–25, 25–22, 27–29, 13–25తో బల్గేరియా చేతిలో... మూడో మ్యాచ్‌లో 25–18, 27–29, 20–25, 22–25తో కెనడా చేతిలో ఓడిపోయింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన భారత జట్టు తదుపరి 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. -
ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మనవాళ్ల ప్రతిభ అంతంతమాత్రమే. అందునా మహిళల నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌లో బరిలోకి దిగేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎంఎంఏ అనేది సాధారణమైన రెజ్లింగ్ కాదు. పటిష్టమైన దేహదారుడ్యంతో పాటు మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో పాటుగా అటు బాక్సింగ్.. ఇటు రెజ్లింగ్‌ను కలగలిపి ఈ క్రీడను ఆడాల్సి ఉంటుంది. గేమ్‌లో శరీరంలో ఏ భాగంలోనైనా పంచ్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి నడుము కింది భాగంలో దాడి చేయడం నిషేధం. అందుకే మొహాలు, ముక్కులు పగిలి రక్తాలు కారడం చూస్తుంటాం. ఒక్కోసారి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఆటగాళ్లు కోమాలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక మన దేశం నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మహిళల నుంచి వెలుగులోకి వచ్చింది రీతు ఫోగట్ మాత్రమే. మహవీర్ ఫోగట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె తొలుత రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీ పడింది. ఆ తర్వాత ఎంఎంఏ ఫైట్‌పై ఉన్న ఆసక్తి రీతు ఫోగాట్‌ను MMA Star ఫైటర్‌గా మార్చింది. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆడపులి ప్రవేశించింది. ఆమె పేరే పూజా తోమర్. ఎంఎంఏ ఫైటర్‌గా దేశం తరపున స్టార్ హోదా పొందిన ఈమె తాజాగా ఎంఎఫ్ఎన్(Matrix Night Fight) టైటిల్ గెలిచి ఔరా అనిపించింది. జూలై 2న(ఆదివారం) ఇండోర్ వేదికగా జరిగిన MFN12(Matrix Night Fight) టైటిల్ పోరులో పూజా తోమర్ చాంపియన్‌గా నిలిచింది. రష్యాకు చెందిన మాజీ చాంపియన్ అనస్థిషియా ఫెఫనోవాను బౌట్లో ఓడించి స్ట్రావెయిట్ చాంపియన్‌గా అవతరించింది. మొత్తం నాలుగు రౌండ్లలో జరిగిన ఫైట్‌లో ఏ దశలోనూ పూజా తోమర్ తగ్గింది లేదు. ప్రతీ రౌండ్లో తన ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. నాలుగో రౌండ్‌కు వచ్చేసరికి అనస్థిషియా ఇక ఆడలేనంటూ పక్కకు తప్పుకోవడంతో పూజా తోమర్ విజేతగా నిలిచినట్లు రిఫరీ ప్రకటించారు. ఆమె ప్రదర్శనను టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యక్షంగా వీక్షించారు. దిశా పటానీ, టైగర్ ష్రాఫ్, శిఖర్ ధావన్‌లు గేమ్ ముగిసిన అనంతరం ఆమెను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. Hard work pays off😊💪 Thanks to @mfn_mma @ayeshashroff @kishushroff for the opportunity. Thanks to my coach @thefighterscoach for motivating and guiding me. Thanks to my Family and Friends for supporting me. Thanks to my Fans for all their love, support and care. @somafightclub pic.twitter.com/zqfL0WQ9CH — puja tomar (@pujatomar19) July 2, 2023 చదవండి: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #Ben Stokes: స్టోక్స్‌ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా పత్రిక.. ఫోటో వైరల్ -
కాంస్యం నెగ్గిన వ్రితి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో తెలంగాణకు రెండో పతకం లభించింది. గచి్చ»ౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది. వ్రితి 18ని:09.50 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ వ్రితికి కాంస్య పతకం దక్కింది. మహిళల 200 మీటర్ల మెడ్లే విభాగంలో హషిక రామచంద్ర (కర్ణాటక) కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. హషిక 2ని:21.15 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలువడంతోపాటు 2010 నుంచి రిచా మిశ్రా (2ని:23.62 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఆర్యన్ నెహ్రా (గుజరాత్; 8ని:01.81 సెకన్లు), మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో అనన్య నాయక్ (మహారాష్ట్ర; 57.31 సెకన్లు) కూడా స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు కొత్త జాతీయ రికార్డులు సృష్టించారు. -
ఆటోక్రాస్ ఛాంపియన్ షిప్
-
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
మంచి పని కోసం క్రీడలను నిర్వహించడం.. ఇదీ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తలపెట్టిన కార్యక్రమం. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్షిప్ 2023 ను నిర్వహించింది. దీని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్‌లోని కస్టమ్-బిల్ట్ రేస్ ట్రాక్‌లో ఈ మోటార్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ రేసులో ఎంతో మంది టాప్ రేసర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి ఆస్పత్రిలో ఈనిర్మాణం చేపడతారు. దీనికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ విజయవంతం చేసింది రోటరీ క్లబ్. -
సాయి శ్రీ చరణ్ శృతికని ఇమిటేట్ చేస్తుంటే సుధాన్షు శివాని ఇలా పగలబడి నవుతున్నారో చుడండి..
-
సెలెక్షన్ ట్రయల్స్‌కు సైనా దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈరోజు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా మహిళల సింగిల్స్‌లో పీవీ సింధును నేరుగా జట్టులో ఎంపిక చేయగా... రెండో బెర్త్ కోసం సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్‌లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సెలెక్షన్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. అయితే తాము సెలెక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాలేమని సైనా, మాళవిక ‘బాయ్’కు సమాచారం ఇచ్చారు. సైనా, మాళవిక వైదొలిగిన నేపథ్యంలో ఈ ట్రయల్స్‌కు అష్మిత చాలియాను ‘బాయ్’ ఎంపిక చేసింది. అష్మిత, ఆకర్షి మధ్య జరిగే ట్రయల్స్ మ్యాచ్‌లో గెలిచిన వారికి జట్టులో రెండో సింగిల్స్ ప్లేయర్‌గా స్థానం లభిస్తుంది. 32 ఏళ్ల సైనా గత ఏడాది 14 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని ఒక్క దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి 14 మంది బరిలోకి దిగనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలను నేరుగా జట్టులోకి ఎంపిక చేశారు. మిగతా బెర్త్‌ల కోసం నేడు ట్రయల్స్‌ను ఏర్పాటు చేశారు. -
చాంప్ వెర్స్టాపెన్
ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. -
ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా– ఈ చాంపియన్ పోటీలకు భాగ్య నగరం సన్నద్ధమవుతోంది. ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని, సత్తాను చాటే ఈ పోటీల కోసం హెచ్ఎండీఏ ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టింది. నెక్లెస్ రోడ్డులో 2.8 కిలోమీటర్ల ట్రాక్ పనులను ప్రారంభించారు. డిసెంబర్ నాటికల్లా ట్రాక్‌ను సిద్ధం చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లు గంటకు 180 నుంచి 220 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీసేవిధంగా ఈ ట్రాక్‌ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల నిర్వహణపై అధ్యయనం కోసం గత నెలలో హెచ్ఎండీఏ అధికారుల బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్‌ను సందర్శించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్ నేతృత్వంలో హెచ్ఎండీఏ సీనియర్ ఇంజినీర్లు, ప్లానింగ్ అధికారులు ఆగస్టులో సియోల్‌లో పర్యటించారు. ప్రస్తుతం సియోల్ ట్రాక్ తరహాలోనే హైదరాబాద్‌లో ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు పోటీలను నిర్వహించేందుకు తాజాగా పనులు ప్రారంభించారు. ఇదీ రూట్.. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కి.మీ మార్గంలో ట్రాక్ ఏర్పాటు చేస్తారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ఎనీ్టఆర్ గార్డెన్‌లోంచి వెనక వైపు ఉన్న మింట్ కాంపౌండ్ మర్రిచెట్టు నుంచి ఐమాక్స్ థియేటర్, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్ ప్లాన్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన 12 ఆటోమొబైల్ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు అంచనా. ఆ సంస్థలు రూపొందించిన ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని చాటుకొనేందుకు హైదరాబాద్ తొలిసారిగా వేదిక కానుంది. గంటకు 250 కి.మీటర్లకు పైగా వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ నగరంలో 180 కి.మీ వరకే పోటీ ఉండే అవకాశం ఉందని ఓ అధికారి వివరించారు. డిసెంబర్లో డెమో ... ఈ పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఉంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీలకు డిసెంబర్ నాటికి ట్రాక్‌ను పూర్తి చేసి డెమో నిర్వహించే అవకాశం ఉంది. పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు మొత్తం 40 లూప్స్ (రౌండ్స్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ కారు ఎంత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిందనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని చాంపియన్‌షిప్ ఇస్తారు. నగరవాసులు పోటీలను వీక్షించేందుకు వీలుగా ట్రాక్ మార్గంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మంది సందర్శకులు కూర్చొని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. (చదవండి: జవహార్‌నగర్‌లో కర్చీఫ్ లేకుండా తిరగలేం) -
అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!
పనీపాటా లేకుండా తిని, పడుకుంటే డబ్బులొస్తాయా? అంటారు కానీ... నిజంగానే ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్డౌన్ కాంపిటీషన్’. పన్నెండో ఏడాది దిగ్విజయంగా జరిగిన ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహుమతి గెలుచుకున్నాడు జర్కో పెజనోవిక్. నగదుతోపాటు ఇద్దరికి రెస్టారెంట్లో భోజనం, ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్స్టే, రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. యూరప్ దేశమైన మాంటెనెగ్రోలోని నగరం నిక్సిక్లో ఈ వింత పోటీ జరిగింది. ‘ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడమేగా. ఈజీగా చేసేయొచ్చు అనుకున్నాను.. కానీ కష్టమే’ అన్నాడు జర్కో. చూడటానికి కుటుంబసభ్యులెవరైనా వచ్చినప్పుడు కూడా లేవకుండా ఉండగలగడం కష్టమైన విషయమని చెప్పాడు. వంద సంవత్సరాల కిందటి ఓ చెట్టు కింద పోటీ నిర్వహించారు. తొమ్మిది మందితో పోటీ ప్రారంభమైనా.. ఏడుగురు మొదటిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండురోజులు మిగిలిన ఇద్దరి మధ్యే కాంపిటీషన్ జరిగింది. చివరకు జర్కో గెలిచాడు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..:) -
82 ఏళ్లు.. 24 గంటలు.. 125 కిలోమీటర్లు
ఇవేం లెక్కలబ్బా... అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? బార్బరా హంబర్ట్ అనే ఫ్రాన్స్ మహిళ రికార్డులివి. గత నెలాఖరులో జరిగిన ఫ్రెంచ్ చాంపియన్‌షిప్‌లో 24 గంటల్లో 125 కిలోమీటర్లు పరుగెత్తి ప్రపంచరికార్డు సృష్టించింది 82 ఏళ్ల బార్బరా. 24 గంటల్లో 105 కిలోమీటర్లు పరుగెత్తి ఓ జర్మన్ మహిళ నెలకొల్పిన రికార్డును బార్బరా బ్రేక్ చేసింది. ఆ వయసులో అలా పరుగెత్తిందంటే ఆమె జీవితమంతా రన్నింగేనేమో అనుకోకండి. తనకు 43 ఏళ్ల వయసులో అంటే తన కూతురు హైస్కూల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ టైమ్‌లో రన్నింగ్ మొదలుపెట్టారామె. మొదట బౌఫ్మాట్వీధులకే పరిమితమైన బార్బరా పరుగు... తరువాత మారథాన్స్ దాకా వెళ్లింది. ఈ 39 ఏళ్ల కాలంలో పారిస్, న్యూయార్కుల్లో జరిగిన 137 రేసులు, 54 మారథాన్స్‌లో పాల్గొన్నది. ‘మొదట మెడిటేషన్‌లాగా మొదలుపెట్టాను. కానీ వీధుల్లో పరుగెడుతున్నప్పుడు కలిగిన స్వేచ్ఛా భావన నాకో స్పష్టతనిచ్చింది. అప్పటినుంచి పరుగును ఆపలేదు’ అంటుంది బార్బరా. అంతేకాదు.. పరుగు పూర్తయ్యేవరకు దాహం, ఆకలి, నిద్ర అన్నింటినీ మరిచిపోతుంది. ముగింపు లైన్ దాటాకే ఆమెకు అలసట గుర్తొస్తుంది. 14 గంటల రేసులో ఆమెతోపాటు ఉండి... అవసరమైనవల్లా అందించిన ‘మై హస్బెండ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటారు బార్బరా. ఆ వయసులో పరుగు మొదలుపెడితే అడ్డంకులేం ఎదురు కాలేదా? అంటే... చాలా గాయాలయ్యాయి. నొప్పులొచ్చాయి. అయినా ఇవేవీ ఆమె పరుగును ఆపలేకపోయాయి. ఎలాంటి మందులు వేసుకోను, కేవలం ట్రైనింగ్‌నే నమ్ముతానని చెప్పే బార్బరా.. రన్నింగ్‌ను వదిలేస్తే మాత్రం నిరుత్సాహం ఆవహిస్తుందంటారు. -
అలలపై ఆట.. పతకాల వేట..
సాక్షి, విశాఖపట్నం: విశ్వనగరి విశాఖపట్నం.. అరుదైన క్రీడాపోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. సముద్రంలో అలలతో పోటీపడుతూ.. పడవలపై లక్ష్యంవైపు దూసుకెళ్లే జాతీయస్థాయి క్రీడాపోటీలకు వేదికగా మారుతోంది. జూన్ 24 నుంచి 26 వరకు రుషికొండలో జాతీయస్థాయి సీ కయాకింగ్ చాంపియన్‌షిప్–2022 నిర్వహించనున్నారు. ఈ పోటీలను దేశంలో రెండోసారి, రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. సీనియర్ నేషనల్ మెన్స్ అండ్ ఉమెన్ చాంపియన్ షిప్‌ని విశాఖలో నిర్వహించాలని న్యూఢిల్లీకి చెందిన బృందం నిర్ణయించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కయాకింగ్ అండ్ కనోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడల నిర్వహణతో విశాఖ దేశంలోని అగ్రశ్రేణి వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్లలో ఒకటిగా నిలిచిపోనుంది. ప్రపంచం చూపు.. కయాకింగ్ వైపు.. కయాకింగ్, కానోయింగ్ వాటర్‌స్పోర్ట్స్‌కు దాదాపు అన్ని దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ పోటీలు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుంచి పోటీదారులు హాజరవుతుంటారు. సముద్రంలో అలలను చీల్చుకుంటూ.. ప్రత్యేకమైన నావలో గమ్యాన్ని చేరుకునేందుకు డైవర్లు పోటీ పడుతుంటారు. ఇటీవల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద క్రీడల్లో కయాకింగ్ అగ్ర భాగంలో ఉంది. ఇలాంటి క్రీడల్ని నిర్వహించే సామర్థ్యం ఉన్న బీచ్‌లు దేశంలో అతి తక్కువగా ఉన్నా యి. అందులో విశాఖ తీరంలోను పోటీలకు అను వైన వాతావరణం ఉండటంతో రాష్ట్రంలో మొదటి సారి కయాకింగ్ పోటీలు జరగబోతున్నాయి. -
సెంచరీల మీద సెంచరీలు.. గ్యాప్‌లో పాక్ బౌలర్‌కు చుక్కలు
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా తగ్గేదే లే అంటున్న పుజారా మరో సెంచరీతో చెలరేగాడు. ఈ గ్యాప్‌లోనే పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి చుక్కలు చూపించాడు. ఇక ఫామ్ కోల్పోయి టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన పుజారా.. కౌంటీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. టీమిండియా జట్టులోకి తిరిగి రావాలనే కసితో ఆడుతున్న పుజారా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీతో మెరిశాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ఆదివారం పుజారా నాలుగో సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో టామ్ ఆల్సప్(66)తో కలిసి నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించిన పుజారా.. ఆ తర్వాత టామ్ క్లార్క్‌తో(26*) కలిసి 92 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓవరాల్‌గా మూడోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా(149 బంతుల్లో 125 బ్యాటింగ్, 16 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ క్లార్క్(26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుజారా మెరుపులతో ససెక్స్ 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది. కాగా పుజారాకు ఈ సీజన్లో ఇది నాలుగో సెంచరీ కాగా.. ఇంతకముందు 201*(డెర్బీషైర్ జట్టుపై), 109(వోర్సెస్టర్షైర్ జట్టుపై), 203(డర్హమ్ జట్టుపై) సెంచరీలు అందుకున్నాడు. Fourth match, fourth 100+ score. 💯 🤯 It's a privilege to watch, @cheteshwar1. 👏 pic.twitter.com/IF8nLUt9Yg — Sussex Cricket (@SussexCCC) May 7, 2022 గ్యాప్‌లో పాక్ బౌలర్‌కు చుక్కలు.. సెంచరీతో మెరిసిన పుజారా షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ససెక్స్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఓపెనర్ల వికెట్లు ఆరంభంలోనే కోల్పోవడంతో ససెక్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారా, టామ్ ఆల్సప్లు జాగ్రత్తగా ఆడారు. అయితే పుజారా తన ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించాడు. షాహిన్ అఫ్రిది ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతిని బౌన్సర్ వేశాడు. అయితే పుజారా దానిని వదలకుండా బ్యాట్ ఎడ్జ్‌తో అప్పర్ కట్ చేశాడు. దీంతో బంతి బౌండరీ ఫెన్స్ దాటి అవతల పడింది. పుజారా కెరీర్లో అతి తక్కువగా ఆడిన షాట్లలో అప్పర్ కట్ ఒకటి. ఇక పుజారా, అఫ్రిదిలు ఎదురుపడడం ఇదే తొలిసారి. Shaheen Afridi 🆚 Cheteshwar Pujara A battle you don't want to miss. Watch it LIVE 👉 https://t.co/UVQbX7r83y#LVCountyChamp pic.twitter.com/GBHE5CdZzH — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 -
మిస్టర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు సెలెక్ట్ అయిన హైదరాబాద్ యువకుడు
-
టీ పెట్టారు.. రూ.లక్షలు కొట్టారు
మాదాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఆదివారం తెలంగాణ టీ చాంపియన్ షిప్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ఆనరరీ కాన్సుల్, రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా ఫర్ తెలంగాణ, సుచరిండియా ఏపీ సీఈఓ లయన్ కిరమ్, నిలోఫర్ కేఫ్ చైర్మన్ ఎ.బాబురావు, గోద్రేజ్ జెర్సీ సీఈఓ భూపేంద్రసూరి, మల్లారెడ్డి హెల్త్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్గోపాల్లతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలతో టీ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త విధానంతో రకరకాల టీలను పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. పోటీల్లో 104 Ðమంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, ముగ్గురు రన్నరప్‌లకు రూ.25 వేల చొప్పున మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. -
గోల్కొండలో ర‘కూల్’ గోల్ఫ్ (ఫోటోలు)
-
తైవాన్ ఎక్సలెన్స్ గేమింగ్ కప్‌లో భారత్ నుంచి 8 వేల మంది..
తైపీ: విభిన్న రకాల ఆన్లైన్ గేమ్స్‌లో పోటీపడేందుకు రూ.10లక్షల దాకా ప్రైజ్ మనీని పొందేందుకు అవకాశం అందించే ఆన్లైన్ ఆటల సందడి మొదలైంది. అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ గేమింగ్ ప్రియుల ఆదరణ పొందిన తైవాన్ ఎక్స్‌లెన్స్ గేమింగ్ కప్ (టిఇజిసి) క్వాలిఫైర్స్ 2వ రౌండ్ అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టిఇజిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ తైవాన్ ఎక్స్‌లెన్స్ మార్క్ వ్యూ తెలిపారు. గత 16వ తేదీన ప్రారంభమైన ఈ గేమింగ్ సందడి డిసెంబరు 5తో ముగుస్తుందనీ, ఈ స్పోర్ట్స్ ప్రియులు అత్యధిక సంఖ్యలో ఈసారి భారత్ నుంచి పాల్గొన్నారని వివరించారు. ఈ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 8వేల మందిపైగా నమోదు చేసుకున్నారన్నారు. ఈ ఏడాది పలు ప్రాచుర్యం పొందిన కొత్త గేమ్స్ తాము పరిచయం చేశామని, అత్యాధునిక గేమింగ్ టెక్నాలజీని అందిస్తున్నామని తెలిపారు. చదవండి: తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి -
నేషనల్ గట్క పోటీలలో ఏపీకి రజతం.. తొలి ప్రయత్నం లోనే..
సాక్షి, తిరుపతి (చిత్తూరు): 9వ జాతీయస్థాయి గట్క మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలలో తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి సత్తా చాటింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఈ పోటీలు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఇండియన్ గట్క అసోసియేషన్ నిర్వహించింది. ఉత్తమ ప్రతిభ కనరబరచి నవశక్తి సిల్వర్ మెడల్ సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ గట్క అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోత్సా్నదేవి తెలిపారు. అండర్–19 విభాగంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నవశక్తి వరుసగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక క్రీడాకారిణులపై గెలిచి, ఫైనల్స్‌లో పంజాబ్‌తో తలపడి రెండో స్థానంలో నిలిచిందని ఆమె చెప్పారు. ముగింపు రోజున కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాగూర్ చేతుల మీదు గా రజత పతకాన్ని అందుకుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎందరో క్రీడాకారిణులు పాల్గొన్నప్పటికీ నవశక్తి మాత్రమే పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని జ్యోత్సా్నదేవి, రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, జిల్లా గట్క అసోసియేషన్ సెక్రటరీ శివ ఆమెను అభినందించారు. డిసెంబర్లో హర్యానా రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా నేషనల్స్‌కు నవశక్తి ఎంపికైందని తెలిపారు. ప్రయాణం చేస్తూనే..ఆన్లైన్ ఎగ్జామ్‌కు హాజరు! నవశక్తి చిన్నతనం నుంచే క్రీడల్లో విశేషంగా రాణి స్తోంది. పలు రికార్డులు సొంతం చేసుకుంది. రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలు సైతం ఎన్నో అందుకుంది. తొలుత స్విమ్మింగ్, స్కేటింగ్, తర్వాత కరాటే, రెజ్లింగ్, ఇప్పుడు గట్కలో తన సత్తా చాటుతూ క్రీడల్లో తన ప్రత్యేకతను చాటు కుంటోంది. ప్రస్తుతం చెన్నైలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నవశక్తి జాతీయస్థాయి గట్క పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి ట్రైన్లో ఆంధ్రప్రదేశ్ జట్టుతో వెళ్తూనే తనతోపాటు లాప్టాప్ తీసుకెళ్లింది. ప్రయాణిస్తూనే ఆన్లైన్ క్లాసులకు హాజరవడమే కాకుండా ఫైనల్ సెమిస్టర్ పరీక్ష సైతం రాయడం గమనార్హం! -
కుస్తీమే సవాల్..
-
బ్రిటిష్ గడ్డపై తెలుగుబిడ్డ గర్జించిన వేళ...
గతేడాది సింధు ప్రపంచ చాంపియన్. ఈ ఘనతకంటే మూడేళ్ల ముందు రియో ఒలింపిక్స్‌లో రన్నరప్. సింధు కంటే ముందే సైనా నెహ్వాల్ ఒలింపిక్ మెడలిస్ట్. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ రజత పతక విజేత. మరెన్నో సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా ఆమె గెలిచింది. కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సిక్కి రెడ్డి తదితర చాలామంది షట్లర్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇప్పుడు మెరికలు. వీరందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పుల్లెల గోపీచంద్ అకాడమీ ఉంది కాబట్టి విజయాలు లభిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ పాతికేళ్ల క్రితం ఇలాంటి పేరెన్నికగల అకాడమీ ఏదీ మన దేశంలో లేదు. అయినప్పటికీ ఎన్నో ప్రతికూలతల నడుమ స్వయంకృషితో గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయ్యాడు. అది కూడా క్రీడాకారుల కెరీర్‌ను దాదాపు సమాప్తం చేసే మోచిప్ప గాయం నుంచి కోలుకొని అతనీ విజయం సాధించడం గొప్ప విశేషం. పుల్లెల గోపీచంద్ ఆడే రోజుల్లో బెంగళూరులో ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ తప్ప వేరే చోట అకాడమీలు ఏవీ లేవు. ఉన్నంతలో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) లేదంటే చిన్నా చితకా శిక్షణ కేంద్రాలతోనే నెట్టుకురావాలి. అక్కడా అరకొరే సౌకర్యాలే. ఇలాంటి అత్తెసరు శిక్షణతోనే నెట్టుకొని, తట్టుకొని, నెగ్గుకొచ్చిన వారిలో అగ్రగణ్యుడు కచ్చితంగా మన తెలుగు తేజం గోపీచందే! ఎంటెరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) ఇది మోచిప్పకు అయ్యే అరుదైన గాయం. ఇది క్రీడాకారులకు శాపం. దీనికి గురైతే ఆటే కాదు... పూర్వపు నడక కూడా కష్టమే. ఇలాంటి గాయాలకు ఇప్పుడైతే స్పోర్ట్స్ మెడిసిన్, అత్యాధునిక ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) తేలిగ్గా బయట పడింది. మళ్లీ రాకెట్ పట్టింది. అయితే ఆ గాయానికి అప్పట్లో కెరీర్‌నే మూల్యంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. కానీ గోపీచంద్ పట్టుదల ముందు ఏసీఎల్ ఓడింది. అతని అంకితభావానికి ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్ చేరింది. ‘సిడ్నీ’ చెదిరినా... వరుసగా ఐదేళ్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన గోపీచంద్ సిడ్నీ ఒలింపిక్స్–2000 ఆరు నెలలపాటు తీవ్రంగా శ్రమించాడు. కానీ సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు సిమెంట్ కోర్టులపై నిర్వహించడం గోపీచంద్‌కు మైనస్ పాయింట్ అయ్యింది. అప్పటికే మోకాలికి శస్త్ర చికిత్సలు జరిగి ఉండటంతో గోపీచంద్ గాయం తిరగబెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన గోపీచంద్ రెండో రౌండ్లో సుదీర్ఘ పోరులో ఉక్రెయిన్ ప్లేయర్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ తర్వాత గోపీచంద్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. మోకాలిలో వాపు కూడా వచ్చింది. రెండో సీడ్ హెంద్రావాన్ (ఇండోనేసియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వరంతోనే ఆడిన గోపీచంద్ వరుస గేముల్లో ఓడిపోవడంతో అతని ఒలింపిక్ కల చెదిరిపోయింది. ఒక్కో అడ్డంకి దాటుకుంటూ... ఏదైతే తాము కోరుకుంటామో దాని కోసం కష్టపడితే ఆలస్యమైనా మనకు కచ్చితంగా లభిస్తుందని అంటారు. సిడ్నీ ఒలింపిక్స్ వైఫల్యాన్ని తన మదిలో నుంచి తీసేసిన గోపీచంద్ ఏడాది తిరిగేసరికి ఎలాంటి అంచనాలు లేకుండా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీకి వెళ్లాడు. 2001కు ముందు గోపీచంద్ 1997, 1998లలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడినా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. 1999, 2000లలో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగలేకపోయిన గోపీచంద్ ఈసారి ఎవరూ ఊహించని అద్భుతం చేశాడు. సిడ్నీ ఒలింపిక్స్ మాదిరిగానే ఆల్ ఇంగ్లండ్ టోర్నీని కూడా సిమెంట్ కోర్టులపైనే నిర్వహించారు. ఈసారి మాత్రం గోపీచంద్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మోకాలిని సంరక్షించుకుంటూనే ఒక్కో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. మ్యాచ్‌లు కాగానే వెంటనే ఐస్బాత్కు వెళ్లేవాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని ఫిట్నెస్ కాపాడుకుంటూనే ప్రాక్టీస్ చేసేవాడు. చివరకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే విజయతిలకం దిద్దుకున్నాడు. తొలి రౌండ్లో గోపీ 15–11, 15–12తో రొనాల్డ్ సుసీలో (సింగపూర్)ను ఓడించాడు. రెండో రౌండ్లో 15–7, 15–4తో కొలిన్ హాటన్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. మూడోరౌండ్లో గోపీ ప్రత్యర్థిగా సిడ్నీ ఒలింపిక్స్ చాంపియన్ జీ జిన్‌పెంగ్ (చైనా) నిలిచాడు. కానీ గోపీచంద్ దూకుడుకు జిన్‌పెంగ్ చేతులెత్తేశాడు. గోపీ 15–3, 15–9తో జిన్పెంగ్ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో 15–11, 15–7తో ఆండెర్స్ బోసెన్ (డెన్మార్క్)పై గెలిచిన గోపీచంద్... సెమీఫైనల్లో డెన్మార్క్ స్టార్ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ పీటర్ గేడ్పై హోరాçహోరీ పోరులో 17–14, 17–15తో గెలిచాడు. ౖచైనా ప్లేయర్ చెన్ హాంగ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. మార్చి 11న బర్మింగ్హమ్లోని జాతీయ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గోపీచంద్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 15–12, 15–6తో చెన్ హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించాడు. 1980లో ప్రకాశ్ పదుకొనే తర్వాత ఈ టైటిల్‌ను నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా చరిత్రలో స్థానం సంపాదించాడు. గాయాలు వెంటాడినా... కోర్టులో గోపీ రాకెట్‌కు జోరెక్కువ. అతని శరీరానికి దూకుడెక్కువ. ఈ దూకుడైన శైలి అప్పుడప్పుడూ సమస్యలు తెచ్చేది. అయినా సరే గోపీ తన శైలితోనే గాయాలకు ఎదురెళ్లాడు తప్ప ఆటతీరు ఎనాడూ మార్చుకోలేదు. చాలా మంది గోపీచంద్‌ను ఆడేతీరును మార్చుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు కూడా! 1994లో పుణే జాతీయ క్రీడల్లో గోపీచంద్ ఊహించనిరీతిలో గాయపడ్డాడు. టీమ్ విభాగంలో పురుషుల డబుల్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సమన్వయ లోపంతో గోపీచంద్‌ను అతని భాగస్వామి ఢీకొట్టాడు. దాంతో కిందపడ్డ గోపీచంద్ మోకాలికి తీవ్ర గాయమైంది. వైద్యులను సంప్ర దించగా ఆ గాయాన్ని ఎంటెరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్)గా తేల్చారు. మోకాలికి శస్త్ర చికిత్స తప్పదని చెప్పారు. ఢిల్లీలోని డాక్టర్ అశోక్ రాజ్‌గోపాలన్... గోపీచంద్ మోకాలికి ఆపరేషన్ చేశారు. మళ్లీ గాయమైతే శస్త్ర చికిత్స చేసేందుకు నేనున్నానంటూ గోపీచంద్‌కు భరోసా ఇచ్చారు. నీదైన ఆట, నీకున్న సహజశైలినే నమ్ముకొని ఆడాలని చెప్పారు. శస్త్ర చికిత్స తర్వాత గోపీచంద్ వరుసగా ఐదేళ్లపాటు 1996 నుంచి 2000 వరకు జాతీయ సింగిల్స్ చాంపియన్ అయ్యాడు. ఆ మధ్యలో మరో రెండుసార్లు అతని మోకాలికి చిన్నపాటి ఆపరేషన్లు జరిగాయి. తన మాటలతో గోపీచంద్‌లో ధైర్యం నింపిన డాక్టర్ అశోక్ రాజగోపాలన్ మాత్రం ఫీజు రూపంలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్ ఇవ్వాలని గోపీని కోరారు. -
టెన్‌పిన్ బౌలింగ్ విజేతలు కిరణ్, జ్యోతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్‌పిన్ బౌలింగ్ చాంపియన్‌షిప్‌లో కిరణ్, జ్యోతి ఆకట్టుకున్నారు. తెలంగాణ టెన్‌పిన్ సంఘం ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో కిరణ్, నరేశ్... మహిళల కేటగిరీలో జ్యోతి, మమత వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను త్వరలో బెంగళూరు వేదికగా జరుగనున్న జాతీయ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక చేశారు. ఐదు రోజుల పాటు పోటీలు జరగ్గా....100కు పైగా ప్లేయర్లు పాల్గొన్నారు. శుక్రవారం ఫైనల్స్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమానికి విచ్చేసిన ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్‌పిన్ బౌలింగ్ సంఘం కార్యదర్శి రాహుల్ రెడ్డి, సినీ నటుడు శ్రీధర్, రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
యోగా పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీకి ప్రథమస్థానం
సాక్షి, నూజివీడుః కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ యోగా చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ముగిశాయి. మహిళా విభాగంలో నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థినులకు ప్రథమ స్థానం దక్కగా, పురుషుల విభాగంలో చెన్నై అన్నా యూనివర్శిటీ దక్కించుకున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ యోగా విద్యార్థులు మూడు ప్రధాన బహుమతులను గెలుచుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, వీసీ హేమచంద్రారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. -
అట్టహాసంగా ముగిసిన నిడ్జమ్–2019 పోటీలు
-
అట్టహాసంగా నిడ్జమ్ పోటీలు
-
‛స్వర్ణ’ సుందర్
దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జర్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఎఫ్–46 కేటగిరిలో తలపడిన అతను బంగారు పతకం సాధించాడు. దీంతో టోక్యో పారాలింపిక్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అజిత్ సింగ్, రింకూలకూ టోక్యో బెర్త్‌లు లభించాయి. సోమవారం జరిగిన ఈ పోటీలో సుందర్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈటెను 61.22 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. అజిత్ 59.46 మీటర్లతో మూడో స్థానంలో నిలువగా... రింకూకు నాలుగో స్థానం దక్కింది. 23 ఏళ్ల సుందర్ గుర్జర్ తాజా స్వర్ణంతో వరుస ప్రపంచ ఈవెంట్లలో టైటిల్ నెగ్గిన రెండో పారా అథ్లెట్‌గా ఘనతకెక్కాడు. అతను లండన్ (2017) ఈవెంట్లోనూ బంగారం గెలిచాడు. గతంలో దేవేంద్ర జజారియా లియోన్–2013, దోహా–2015 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఎఫ్–56 డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా రజతం గెలిచాడు. అతను డిస్క్‌ను 42.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. -
ధనుశ్, ఆయుష్ పసిడి గురి
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ రజత పతకం గెల్చుకున్నాడు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 17 ఏళ్ల షూటర్... ఫైనల్లో 244.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ 246.5 పాయిం ట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. జావేద్ (ఇరాన్–221.8 పాయింట్లు) కాంస్యం సాధించాడు. మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్లు ధనుశ్ శ్రీకాంత్, ఆయుష్ రుద్రరాజు పసిడి పతకాలతో మెరిశారు. భారత షూటింగ్ జట్టులో ఎంపికైన తొలి బధిర షూటర్‌గా గుర్తింపు పొందిన 16 ఏళ్ల ధనుశ్... శ్రేయ అగర్వాల్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో ధనుశ్–శ్రేయ ద్వయం 16–14తో వాంగ్ జెరు–జియాంగ్ జువాన్లె (చైనా) జంటపై గెలిచింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో ఆయుష్ రుద్రరాజు, గుర్నిహాల్ సింగ్ గర్చా, అభయ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 343 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో గుర్నిహాల్ రజత పతకాన్ని సాధించాడు. -
షూటింగ్లో మరో ‘టోక్యో’ బెర్త్
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల చింకీ యాదవ్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు 11 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. శుక్రవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో చింకీ యాదవ్ 588 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది షూటర్లలో నలుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ ఈవెంట్లో నాలుగు బెర్త్‌లు మిగిలి ఉండటంతో... ఫైనల్లో చింకీ యాదవ్ 116 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచినప్పటికీ తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆమెతోపాటు మరో ముగ్గురు షూటర్లకు (థాయ్‌లాండ్–2, మంగోలియా–1) ‘టోక్యో’ బెర్త్ ఖాయమైంది. మరోవైపు ఇదే టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో తేజస్విని సావంత్, అంజుమ్ మౌద్గిల్, కాజల్ సైని (1864.8 పాయింట్లు) బృందం స్వర్ణం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీమ్ విభాగంలో సంజీవ్ రాజ్‌పుత్, శుభాంకర్, తరుణ్ యాదవ్ (1865.1 పాయింట్లు) బృందం రజతం గెల్చుకుంది. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఉదయ్‌వీర్ సిద్ధూ (577 పాయింట్లు) రజతం సాధించగా... ఉదయ్‌వీర్, విజయ్‌వీర్, గుర్ప్రీత్ సింగ్ బృందం 1710 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. -
సత్తా చాటిన హైదరాబాద్ సెయిలర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణంలో ఆరంభమైన జాతీయ మాన్సూన్ రెగట్టా చాంపియన్‌షిప్ మొదటి రోజు హైదరాబాద్ సెయిలర్స్ సత్తా చాటారు. సోమవారం జరిగిన మెయిన్ ఫ్లీట్ ఈవెంట్లో మాజీ జాతీయ చాంపియన్ విజయ్ కుమార్, ప్రీతి కొంగర, లక్ష్మీ నూకరత్నం మెరిశారు. బెంగుళూరు ఆర్మీ త్రిష్ణ సెయిలింగ్ క్లబ్ తరపున బరిలో దిగిన లోకల్ హీరో విజయ్ కుమార్ మొదటి రేస్‌లో తడబడ్డా... తరువాతి రేస్‌లలో 2వ, 3వ స్థానాల్లో నిలిచాడు. మొత్తం మీద 14 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ చౌను కుమారుకు మొదటి రోజు ఏమాత్రం కలసి రాలేదు. అతను 13వ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో హైదరాబాద్ యాట్ క్లబ్ తరపున బరిలో దిగిన ప్రీతి కొంగర రెండో రేస్‌లో విజేతగా నిలిచింది. రేస్ ఆరంభం నుంచి ముగింపు వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అదే క్లబ్‌కు చెందిన లక్ష్మీ నూకరత్నం బాలికల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన ఉమా చౌహాన్ (ఎన్ఎస్ఎస్ భోపాల్) నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గ్రీన్ ఫ్లీట్‌లో హైదరాబాద్ యాట్ క్లబ్ హవా.. అనంతరం జరిగిన గ్రీన్ ఫ్లీట్ సెయిలింగ్ పోటీల్లో హైదరాబాద్ యాట్ క్లబ్ హవా కనబరిచింది. బాలుర విభాగంలో సునీల్ ముదావత్ (మడ్‌ఫోర్ట్ స్కూల్) మొదటి స్థానంలో నిలవగా.. మల్లేష్ గడ్డం (ఎమ్‌జేపీటీ స్కూల్) రెండో స్థానంలో, ప్రవీణ్ రమావత్ మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సుప్రియ పీరంపల్లి, శ్రీ హర్షిత, వైష్ణవి తాలపల్లి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్ మారియోట్ హోటల్స్ సమర్పణలో ప్రారంభమైన రెగెట్టా సెయిలింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 28 వరకు జరగనున్నాయి. -
రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేద్దాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు అవసరమైన బ్రాండ్ పాలసీని రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. దీనికి సంబంధించి ‘విజన్ డాక్యుమెంట్’ప్రాథమిక నివేదికను 15 రోజుల్లోగా తయారు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో క్రీడల అభివృద్ధిపై గ్రాంట్ థర్టన్ ఇండియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో క్రీడలు, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంకటేశం, పర్యాటక శాఖ కమిషనర్ సునితా ఎం.భగవత్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా 5, 6 క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించడం ద్వారా యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు, హైదరాబాద్ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలు, స్టేడియంలు వినియోగించేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో నిర్వహించబోయే చాంపియన్ షిప్స్, 2023లో వరల్డ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ నిర్వహణ కోసం బిడ్డింగ్ చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడల ఈవెంట్లు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. -
భారత్‌కు ఐదు స్వర్ణాలు
హాంకాంగ్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పోటీల రెండో రోజు శనివారం భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు వచ్చాయి. బాలుర 10 వేల మీటర్ల నడక విభాగంలో విశ్వేంద్ర సింగ్ 44 నిమిషాల 9.75 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం గెలిచాడు. పరమ్‌జీత్ సింగ్ బిష్త్ (44ని:21.96 సెకన్లు) కాంస్యం సాధించాడు. డెకాథ్లాన్‌లో ఉసైద్ ఖాన్ 6952 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అన్సార్ అలీ (5943 పాయింట్లు)కి కాంస్యం లభించింది. బాలికల లాంగ్‌జంప్‌లో థబిత ఫిలిప్ మహేశ్వరన్ (5.86 మీటర్లు) బంగారు పతకాన్ని చేజిక్కించుకోగా... అంబ్రిక నర్జారీకి కాంస్యం దక్కింది. బాలుర 400 మీటర్ల రేసులో అబ్దుల్ రజాక్ (48.17 సెకన్లు)... బాలికల 100 మీటర్ల విభాగంలో అవంతిక నరాలే (11.97 సెకన్లు) స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. బాలుర 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అతుల్ కుమార్ (6ని:00.45 సెకన్లు) రజతం గెలిచాడు. -
ఖమ్మంలో జాతీయ మహిళా టీ20 ఛాపింయన్‌షిప్ టోర్నీ
-
మ్యాచ్‌లో ఓడితే గుండు గీయించాడు
కోల్‌కతా: ఆటల పోటీల్లో గెలుపోటములు సహజం. కానీ ఓడితే ఏకంగా గుండు గీయించిన ఘటన బెంగాల్ హాకీని ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే... అండర్–19 ఆటగాళ్లకు కోచ్ విధించిన ‘గుండు’ శిక్షపై బెంగాల్ హాకీ సంఘం (బీహెచ్ఏ) విచారణకు ఆదేశించింది. నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సోమవారం త్రిసభ్య విచారణ కమిటీని నియమించినట్లు బీహెచ్ఏ కార్యదర్శి స్వపన్ బెనర్జీ తెలిపారు. జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ (బి–డివిజన్)లో భాగంగా జబల్పూర్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ అండర్–19 జట్టు 1–5తో నామ్ధారి ఎలెవన్ చేతిలో ఓడింది. దీంతో ఆగ్రహించిన కోచ్ ఆనంద్ కుమార్ వాళ్లను గుండు చేసుకోమన్నట్లు ఆరోపణలొచ్చాయి. కోచ్ ఆదేశాలతో జట్టులోని 18 మందిలో 16 మంది గుండు చేయించుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీహెచ్ఏ... విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కోచ్ ఆనంద్ మాత్రం గుండు చేయించుకోమని చెప్పలేదన్నారు. ‘మ్యాచ్ సమయంలో నేను వారిపై కేకలు వేశాను. అంతేగానీ ఓడిపోతే గుండు చేసుకోవాలని ఆదేశించలేదు. నేను ముందు ఆటగాళ్లతో మాట్లాడతా. నా భార్య ఆసుపత్రిలో ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం నాకు లేకుండా పోయింది’ అని కోచ్ వివరణ ఇచ్చారు. -
వెటెల్ ఖాతాలో 50వ టైటిల్
మోంట్రియల్: వరుసగా నాలుగు రేసుల్లో టైటిల్‌కు దూరంగా నిలిచిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మళ్లీ విజయాల ట్రాక్‌లోకి వచ్చాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రేసులో వెటెల్ 68 ల్యాప్‌లను గంటా 28 నిమిషాల 31.377 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ కెరీర్లో ఇది 50వ విజయంకాగా, ఈ సీజన్లో మూడోది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. గత మూడేళ్లుగా ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ సాధించడంతోపాటు విజేతగా నిలిచిన హామిల్టన్ (మెర్సిడెస్) ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. 2004 తర్వాత కెనడా గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌కు టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఎస్టెబన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ 14వ స్థానంలో నిలిచారు. మరోవైపు రేసు ముగింపునకు సూచికగా చెకర్డ్ ఫ్లాగ్‌ను చివరిదైన 70 ల్యాప్నకు బదులుగా 68వ ల్యాప్‌లోనే మోడల్ విన్నీ హార్లో ఊపడంతో గందరగోళం చోటు చేసుకుంది. సీజన్లో ఏడు రేసులు ముగిశాక వెటెల్ 121 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పట్టికలో మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 120 పాయింట్లతో హామిల్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
హీట్స్‌లోనే సిద్ధాంత్ నిష్క్రమణ
బర్మింగ్హమ్: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ సిద్ధాంత్ తింగాలయకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పురుషుల 60 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడ్డ సిద్ధాంత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మూడో హీట్‌లో బరిలోకి దిగిన 27 ఏళ్ల సిద్ధాంత్ 7.93 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం నాలుగు హీట్స్ నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు సెమీఫైనల్‌కు అర్హత పొందుతారు. అమెరికాలో శిక్షణ పొందే సిద్ధాంత్ ఎనిమిది మంది పాల్గొన్న తన హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. -
13న సీనియర్ ఉమన్ హాకీ ఎంపికలు
కడప స్పోర్ట్స్: నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో ఈనెల 13న జిల్లాస్థాయి సీనియర్ విభాగం మహిళల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. సుభాన్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 20 వరకు నంద్యాలలో నిర్వహించే అంతర్ జిల్లాల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
నార్త్ అమెరికాలో వెరైటీ పోటీలు
-
కరాటేలో జిల్లాకు పతకాల పంట
భోగాపురం (పెదవేగి రూరల్) : రాష్ట్రస్థాయి కరాటే సుమన్ కప్ –2016 చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాల పంట పండించారు. గత నెల 28న విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ పోటీలు నిర్వహించగా అన్ని విభాగాల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. స్థానిక విజ్ఞాన్ గ్లోబల్ జెన్ విద్యార్థులు ఏడు పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ బీఎస్ఎన్ మణి బుధవారం విలేకరులకు తెలిపారు. తమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జి.వాసుదేవ్, జి.అఖిల్ రాఘవ, కేఎ¯Œæవీవీ హనుమ, ఎ.చాణక్య వివిధ విభాగాలలో 3 బంగారు, 2 రజత, 2 కాంస్య పతకాలు మొత్తం 7 పతకాలు సాధించినట్టు చెప్పారు. ఈ పోటీలలో 10 జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొనగా పశ్చిమగోదావరి నుంచి 80 మంది విద్యార్థులు హాజరైనట్టు చెప్పారు. విద్యార్థులను, శిక్షకులు ఇబ్రహిమ్ బేగ్, లక్ష్మణరావులను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ప్రిన్సిపాల్ బీఎస్ఎన్ మణి, మేనేజర్ బి.అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు. భాష్యం విద్యార్థుల ప్రతిభ కొవ్వూరు : కొవ్వూరు భాష్యం పాఠశాల విద్యార్థులు కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఎం.రసూల్‌ఖాన్ తొమ్మిదేళ్ల విభాగంలో బంగారు పతకం, 14 ఏళ్ల విభాగం కటాలో ఎన్ఎల్ హేమంత్ వెండి పతకం సాధించినట్టు ప్రిన్సిపాల్ జె.సూర్యనారాయణ చెప్పారు. విద్యార్థులను ఆయనతో పాటు జోనల్ ఇన్చార్జ్ జీఎన్ సత్యనారాయణ, లిటిల్ చాంప్స్ ప్రిన్సిపాల్ కె.మల్లేశ్వరి, కరాటే ఇన్స్ట్రక్టర్ మీసాల రాధ తదితరులు అభినందించారు. సత్తాచాటిన ‘ఐడియల్’ విద్యార్థులు జిన్నూరు (పోడూరు) : రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జిన్నూరు ఐడియల్ స్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు పతకాలు సాధించారు. అండర్–12 బాలికల కటా విభాగంలో ఎన్.వైష్ణవి బంగారు, కాంస్య పతకాలు, ఎం.రాజవంశీ 2 వెండి పతకాలు, పి.పవన్‌కార్తీక్, కేఎస్ఎస్ పవన్, వారణాశి వెంకట సూర్య చంద్రమౌళి కాంస్య పతకాలు, డి.దుర్గారామ్‌చరణ్ ప్రశంసాపత్రాన్ని సాధించినట్టు స్కూల్ కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు చెప్పారు. కరాటే శిక్షకులు ధనాని సూర్యప్రకాష్, సీహెచ్.లక్ష్మీనారాయణ, ఎన్.అప్పలస్వామితో పాటు విద్యార్థులను పలువురు అభినందించారు. -
నిత్యకు రెండు స్వర్ణాలు
ఐసీఎస్ఈ-ఐఎస్సీ స్కూల్స్ అథ్లెటిక్స్ హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ- ఐఎస్సీ స్కూల్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జి. నిత్య మెరిసింది. కింగ్‌కోఠి సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఆమె బాలికల 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ ఈవెంట్లలో విజేతగా నిలిచింది. 100 మీటర్ల స్ప్రింట్‌లో నిత్య 12.6 సెకన్లలో పోటీని పూర్తి చేసి బంగారు పతకం గెలుపొందింది. ఈమె సహచర విద్యార్థిని కె.హర్షిత (13.5 సె.) రజతం, గీతాంజలి స్కూల్ ఆత్రే చక్రబర్తి (14.4సె.) కాంస్యం నెగ్గారు. లాంగ్‌జంప్‌లో నిత్య (4.49 మీ.) మరో స్వర్ణం గెలువగా, ఇందులోనూ హర్షిత (4.37 మీ.)రజతం నెగ్గింది. సెయింట్ ఆన్స అమ్మాయి శివిన్ (3.93 మీ.) కాంస్యం గెలుచుకుంది. ఇతర ఫలితాలు బాలికల 800 మీ. పరుగు: 1. సాక్షి జైన్, 2. నిత్యా రెడ్డి, 3. ఐశ్వర్య వడియార్; షాట్‌పుట్: 1. శ్రీవియా గణపతి, 2. విన్నీ, 3. అంకిత పచార్; డిస్కస్ త్రో: 1. తేజస్విని, 2. సలోని, 3. ధాత్రి; బాలుర 800 మీ. పరుగు: 1. ఆదిపవన్ తేజ, 2. కౌషిక్, 3. సారుు చంద్ర; లాంగ్‌జంప్: 1. షణ్ముఖ సాయితేజ, 2. కార్తీక్ సింగ్, 3. రాహుల్. -
సర్వీసెస్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ ప్రారంభం
విశాఖపట్నం : అంతర సర్వీసెస్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌ను తూర్పు నావికా దళం కమాండ్ స్విమ్మింగ్ పూల్‌లో చీఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ ప్రదీప్రాణా మంగళవారం ప్రారంభించారు. స్విమ్మింగ్, వాటర్‌పోలో, స్పింగ్ బోర్డ్, హైబోర్డు డైవ్ అంశాల్లో ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఆర్మీకు చెందిన రెడ్, గ్రీన్ జట్లతో పాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్ జట్లకు చెందిన 170 మంది స్విమ్మర్లు పోటీపడుతున్నారు. తూర్పు నావికా దళ సర్వీసెస్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ సర్కార్స్ నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్ ఈ నెల 20న జరిగే ఫైనల్స్‌తో ముగియనున్నాయి. -
టెన్నికాయిట్ జట్ల ఎంపిక
హైదరాబాద్: సౌత్ జోన్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపికచేశారు. జాతీయ టెన్నికాయిట్ సమాఖ్య కార్యదర్శి లక్ష్మీకాంతం ఈ టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగనుంది. పురుషుల జట్టు ఎన్. రాకేశ్, డి. వెంకటేశ్, ఎస్. సందీప్, ఎన్. ప్రవీణ్, మొహమ్మద్ యాసీన్, బి. చందర్ మహిళల జట్టు బి. ప్రియాంక, కె. శిరీష, ఎం. హేమలత, వి. నర్మద, వై. అర్చన, డి. అనూష -
సెమీస్‌లో గాయత్రి గోపీచంద్
రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గాయత్రి గోపీచంద్ (రంగారెడ్డి) సెమీఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి 21-7, 21-3తో తనుశ్రీ (వరంగల్)ని చిత్తుగా ఓడించింది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మేఘనా రెడ్డి (హైదరాబాద్) 21-12, 18-21తో అభిలాష (హైదరాబాద్)పై, కేయూర 21-15, 21-16తో భార్గవి (రంగారెడ్డి)పై, సామియా ఫరూఖి (రంగారెడ్డి) 21-5, 23-21తో ప్రవళిక (మెదక్)పై గెలుపొందారు. బాలుర సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో శ్రీకృష్ణ (రంగారెడ్డి) 21-10, 21-13తో మహితేజ (హైదరాబాద్)పై, పవన్ కృష్ణ (ఖమ్మం) 21-17, 21-10తో భవధీర్ (హైదరాబాద్)పై, విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) 21-17, 21-14తో రితిన్ (వరంగల్)పై విజయం సాధించారు. -
రాణించిన కేయూర, మేఘన
► రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు కేయూర, మేఘన అండర్-17, అండర్- 19 విభాగాల్లో రాణించారు. గురువారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో కేయూర 15-18, 15-17, 15-12తో అభిలాషపై, మేఘన 15-13, 15-12తో దివ్యపై విజయం సాధించారు. మరో మ్యాచ్‌లో మమత 11-15, 15-12, 15-10తో వన్షికపై గెలుపొందింది. బాలుర సింగిల్స్ తొలిరౌండ్లో లోహిత్ 15- 10, 15-6తో రిషికేశ్పై, అనురాగ్ దాస్ 15-12, 15-6తో ప్రణీత్ రెడ్డిపై, తరుణ్ రెడ్డి 15-5, 15-10తో శ్రేయ్ సింగ్‌పై నెగ్గారు. అండర్-17 బాలికల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో కేయూర 17-15, 15-9తో సుప్రియపై, దివ్య 15-7, 15-9తో రూహిపై, మేఘన 15-6, 15-11తో కావ్యపై, వన్షిక 15-10, 15-9తో ఇషితపై విజయం సాధించారు. బాలుర రెండోరౌండ్ మ్యాచ్‌ల్లో మహితేజ 15-8, 15-12తో తరుణ్ కుమార్‌పై, సుదీశ్ వెంకట్ 15-5, 15-5తో మణిశర్మపై, ప్రేమ్ 8-15, 15-9, 15-10తో ఆదిత్య గుప్తాపై, విఘ్నేశ్ 15-9, 15-10తో ఉదయ్‌పై, ప్రణీత్ 15-13, 15-12తో ప్రమోద్‌పై, సూర్యకిరణ్ 15-10, 15-13తో సాయి పృథ్వీపై, యశ్వంత్ రామ్ 13-15, 15-9తో అనురాగ్ దాస్‌పై, సాకేత్ 10-15, 15-8,15-7తో వినయ్‌పై, తరుణ్ రెడ్డి 15-11, 15-9తో రోహిత్ రెడ్డిపై, శశాంక్ 15-13, 15-12తో శ్రీకర్‌పై, ధనిక్ 15-9, 15-13తో గణేశ్ సాయిపై, భవ ధీర్ 15-10, 15-13తో అబ్దుల్ రహీమ్‌పై గెలుపొందారు. -
ఆధిక్యంలో మెర్విన్ లిమ్
► ఆర్ఎఫ్సీ రేసింగ్ సాక్షి, హైదరాబాద్: రెయిన్ ఫారెస్ట్ చాలెంజ్ (ఆర్ఎఫ్సీ) చాంపియన్‌షిప్‌లో మలేసియా డ్రైవర్ మెర్విన్ లిమ్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. గోవాలోని క్విపెమ్లో బుధవారం జరిగిన టెర్మినేటర్ లెగ్‌లో భారత డ్రైవర్ గుర్మిత్ విర్డీ (కో-డ్రైవర్ కిర్పాల్ సింగ్)ను వెనక్కినెట్టి... మెర్విన్ (కో-డ్రైవర్ అబ్దుల్ హమిద్) అగ్రస్థానం సంపాదించాడు. ఈ లెగ్ ముగిసేసరికి మలేసియన్ రేసర్ 2400 పాయింట్లకు గాను 1937 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. గుర్మిత్ (1897) రెండో స్థానానికి పడిపోయాడు. హైదరాబాద్ రేసర్లలో నూకల అభినవ్ రెడ్డి (కో-డ్రైవర్ లక్ష్మీకాంత్) 1563 పాయింట్లతో ఆరో స్థానంలో, చల్లా చైతన్య (కో-డ్రైవర్ శబరీశ్)1293 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నారు. మిగతా హైదరాబాద్ డ్రైవర్లు జితేందర్ నాథ్ (కో-డ్రైవర్ సయ్యద్ తాజ్) 1182 పాయింట్లతో 11వ స్థానంలో, రాజశేఖర్ (కో-డ్రైవర్ మల్లేశం) 344 పాయింట్లతో 27వ స్థానంలో ఉన్నారు. -
అభిలాష ట్రిపుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఎ.అభిలాష మూడు టైటిళ్లను చేజిక్కించుకుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో ఆమె అండర్-15లో సింగిల్స్, డబుల్స్ టైటిళ్లతో పాటు అండర్-17 సింగిల్స్‌లోనూ విజేతగా నిలిచింది. ఫైనల్లో అభిలాష 15-12, 15-10తో చక్రయుక్తపై గెలిచింది. అండర్-15 సింగిల్స్ తుదిపోరులో ఆమె 16-14, 15-8తో ప్రణవిపై నెగ్గింది. డబుల్స్‌లో ప్రణవితో కలిసి 15-7, 15-8తో శ్రావ్య-పల్లవి జోషి జంటపై గెలిచింది. అండర్-13 బాలుర డబుల్స్‌లో శశాంక్ సాయి-నిక్షిప్త్ శౌర్య 15-11, 15-8తో శ్రీమాన్ ప్రీతమ్-సిద్ధార్థ్లపై నెగ్గారు. సింగిల్స్‌లో ఉన్నిత్ కృష్ణ 15-7, 15-10తో నిక్షిప్త్ శౌర్యపై గెలిచాడు. బాలుర అండర్-17 సింగిల్స్, డబుల్స్‌లో విష్ణువర్ధన్ గౌడ్ సత్తాచాటుకున్నాడు. రెండు విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు. సింగిల్స్‌లో విష్ణువర్ధన్ 16-14, 15-11తో అంకిత్ రెడ్డిని కంగుతినిపించాడు. డబుల్స్‌లో విష్ణువర్ధన్-మొయినుద్దీన్ 15-11, 13-15, 15-9తో సాయి రోహిత్-ఆకాశ్ చంద్రన్లపై గెలుపొందారు. బాలుర అండర్-19 సింగిల్స్ ఫైనల్లో సాయం బొత్రా 15-10, 15-8తో ఆదిత్య గుప్తాపై, అండర్-15 సింగిల్స్‌లో యశ్వంత్ రామ్ 14-16, 16-14, 15-4తో శశాంక్ సాయిపై విజయం సాధించారు. పురుషుల తుదిపోరులో డబుల్స్ తుదిపోరులో వినాయక్-తన్షఖ్ 11-15, 16-14, 15-11తో విజేత-కిషోర్‌లపై గెలిచారు. సింగిల్స్‌లో వెంకట్ 15-10, 15-9తో శ్రీరామ్‌పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను పూజ గెలుచుకుంది. ఆమె 15-12, 15-10తో ప్రణాలి కర్ణిపై నెగ్గింది. డబుల్స్‌లో ప్రణవి-ప్రణాలి కర్ణి 15-10, 15-1తో మౌన్యశ్రీ-క్రాంతిలపై గెలుపొందారు. ఈ టోర్నీలో విజేత, రన్నరప్‌గా నిలిచిన బాలబాలికలను హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టు నేటి (గురువారం) నుంచి వరంగల్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తలపడుతుంది. హైదరాబాద్ జట్టు: విష్ణువర్ధన్ గౌడ్, అంకిత్, మొహమ్మద్ ఖాదిర్, అభిలాష, చక్రయుక్త రెడ్డి, సాయం బోత్రా, ఆదిత్య గుప్తా, సాయి రోహిత్, ఆకాశ్, ప్రణవి రెడ్డి, ప్రణాలి క ర్ణి, కృష్ణా రెడ్డి. -
ఓరేటర్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు ‘కైట్’
తాళ్లరేవు : అంతర్జాతీయ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఓరేటర్ 2016 చాంపియన్‌షిప్‌లో కైట్ విద్యార్థులు సెమీస్‌కు చేరినట్టు చైర్మన్ పి.వి. విశ్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని బాచుపల్లి బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన రెండో రౌండ్ పోటీల్లో 10 మంది సెమీస్‌కు చేరుకున్నారని, ఆగస్టు ఏడోతేదీన ఫైనల్ పోటీలు జరుగుతాయని ఏపీ ఏరియా మేనేజర్ రతన్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ విశ్వం, డైరెక్టర్ జాన్ ఉదయ్‌కుమార్, కోఆర్డినేటర్లు ఎన్.వీరాంజనేయులు, ప్రసన్న అభినందించారు. 2,78,704 క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం : గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి స్వల్పంగా పెరిగింది. మంగళవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ నుంచి 2,78,704 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ గేట్లను 0.60 మీటర్లు మేర పైకి లేపి ఉంచారు. బ్యారేజ్ వద్ద 9.60అడుగులు నీటి మట్టం నెలకొంది. భద్రాచలం వద్ద 25.50 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 2300 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1800 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు నాలుగు వేలు క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. -
స్కేటింగ్ చాంప్ తెలంగాణ
8 స్వర్ణాలు సహా 17 పతకాలతో అగ్రస్థానం జాతీయ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ హైదరాబాద్: జాతీయ వార్షిక ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్లో అర్జున అవార్డీ అనూప్ కుమార్ యమా సారథ్యంలోని రాష్ట్ర జట్టు ఏకంగా 17 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 8 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలున్నాయి. అనూప్ ఒక్కడే నాలుగు బంగారు పతకాలు గెలిచాడు. మిగిలిన వారిలో దుండిగళ్ల వేద, సాయి వేదాంత్ రుద్రాంగిలు చెరో స్వర్ణ, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. భమిడిపాటి వైభవ్, భ్రమేశ్ రమేశ్ పటేల్ చెరో బంగారు పతకం, కైరవి ఫల్గుణి టక్కర్, ఈశాన్, అభిషేక్ మనీశ్, ఏలూరి సాయి రాహుల్, అరుణిమా వీరబెల్లి తలా ఒక రజత పతకం సాధించారు. సాయి పన్షుల్, ఓంకార్, సాయిశ్రీ శ్వేత, హర్షిత రత్వాని ఒక్కో కాంస్యం గెలిచారు. -
'కార్టింగ్' ఛాంపియన్షిప్ పోటీలు
-
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం
-
రియల్ 'రెజ్లింగ్'
-
ప్రత్యూషకు మరో విజయం
కోల్‌కతా: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో విజయాన్ని సాధించింది. అండర్-14 ప్రపంచ చాంపియన్ వైశాలి (తమిళనాడు)తో ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో ప్రత్యూష 43 ఎత్తుల్లో గెలిచింది. ఈ టోర్నీలో ప్రత్యూషకిది ఐదో విజయం. తొమ్మిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 6.5 పాయింట్లతో స్వాతి ఘాటే (ఎల్ఐసీ)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నూతక్కి ప్రియాంక నాలుగో పరాజయాన్ని చవిచూసింది. తొమ్మిదో రౌండ్లో భక్తి కులకర్ణి (గోవా) చేతిలో ప్రియాంక ఓడిపోయింది. ప్రస్తుతం పద్మిని రౌత్ (ఒడిషా) 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. సోమవారం జరిగే 10వ రౌండ్లో భక్తి కులకర్ణితో ప్రత్యూష, సౌమ్య స్వామినాథన్‌తో ప్రియాంక తలపడతారు. -
సెమీస్‌లో పంకజ్ అద్వానీ
హర్గాడా (ఈజిప్టు): అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-0 (70-62, 112-0, 107-14, 83-46, 114-12, 64-27) ఫ్రేమ్‌ల తేడాతో అలెక్స్ బోర్గ్ (మాల్టా)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో లుకాస్ క్లెకెర్స్ (జర్మనీ)తో అద్వానీ తలపడతాడు. ఇప్పటికే 14 సార్లు ప్రపంచ టైటిల్స్‌ను నెగ్గిన అద్వానీ ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. -
మెయిన్ ‘డ్రా’కు షామిని
సుజౌ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి షామిని కుమరేశన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌లో షామిని తన గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె తొలి మ్యాచ్‌లో 11-7, 9-11, 11-3, 13-11, 8-11, 11-8తో గిలియన్ ఎడ్వర్డ్స్ (స్కాట్లాండ్)పై... రెండో మ్యాచ్‌లో 11-7, 11-3, 8-11, 11-3, 7-11, 11-8తో నినో నెరిది (వెనిజులా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన మౌమా దాస్, మణిక బాత్రా తమ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించారు. -
బాల్ బ్యాడ్మింటన్ చాంప్ తెలంగాణ
విజయవాడ స్పోర్ట్స్: చుక్కపల్లి పిచ్చయ్య స్మారక జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ తెలంగాణ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్స్‌లో తెలంగాణ జట్టు 25-29, 29-20, 29-6 తేడాతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మహిళల విభాగంలో తమిళనాడు జట్టు 14-29, 29-25, 29-17 తేడాతో కర్ణాటక జట్టుపై విజయం సాధించింది. -
భారత్‌కే మళ్లీ ప్రపంచ కప్ : సచిన్!
లండన్ : ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్ షిప్‌ను భారత్ గెలుచుకుంటుందని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పారు. చేశారు. స్పిన్నర్లే భారత్‌కు మరో కప్ అందిస్తారని ఆయన శనివారమిక్కడ అన్నారు. పేస్ బౌలర్లుకు సహకరించే ఆస్ట్రేలియా పిచ్‌లపై భారత స్నిన్నర్లు రాణిస్తారని సచిన్ పేర్కొన్నారు. ప్రపంచ కప్ రేసులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఉన్నాయని అన్నారు. టీమిండియా ప్రపంచ కప్ గెలుస్తుందని తనతోపాటు, ప్రజలు విశ్వస్తున్నారని ఆయన తెలిపారు. కాగా ప్రపంచ కప్ 2015 టోర్నీకు మరికొద్ది నెలలు మాత్రమే ఉండటంతో క్రికెట్ జట్లు అన్ని కాంబినేషన్‌పై దృష్టి పెట్టాయి. ప్రపంచ కప్ కోసం పటిష్టమైన జట్టును రెడీ చేయడానికి పోటీ పడుతున్నాయి. మరోవైపు 2015 వరల్డ్ కప్ వన్డే క్రికెట్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఫిబ్రవరి 14న తొలి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో భారత్ ఆడనుంది. ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 28న యూఏఈతో, మార్చి 6న వెస్టిండీస్ తో, మార్చి 10న ఐర్లాండ్ తో, మార్చి 14న జింబాంబ్వేతో భారత్ మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చి 24,26 తేదీల్లో సేమీ ఫైనల్ మ్యాచ్ లు ,మార్చి 29న మెల్ బోర్న్లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
ఓవరాల్ చాంప్ తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడు జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. తమిళనాడు జట్టు మొత్తం 873 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కేరళ 753 పాయింట్లతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కర్ణాటక (417) మూడో స్థానం పొందగా, తెలంగాణ (276), ఆంధ్రప్రదేశ్ (213) జట్లు వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో తమిళనాడు 28 స్వర్ణాలు, 33 రజతాలు, 28 కాంస్యాలు చేజిక్కించుకుంది. తెలంగాణ జట్టు 8 పసిడి పతకాలతో పాటు 10 రజతాలు, 6 కాంస్యాలు గెలుచుకుంది. ఏపీ జట్టు నాలుగేసి చొప్పున స్వర్ణ, రజతాలు, 9 కాంస్య పతకాలు నెగ్గింది. ఓవరాల్ చాంపియన్ తమిళనాడు బృందానికి తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం (టీఏఏ) అధ్యక్షుడు సవ్యసాచి ఘోష్ (ఐఏఎస్) ట్రోఫీని అందజేశారు. ఫలితాలు అండర్-14 బాలురు: 600 మీ. పరుగు: 1. శ్రీకాంత్ (టీజీ), 2. ధనుష్ (తమిళనాడు), 3. నిర్మల్ (తమిళనాడు); లాంగ్‌జంప్: 1. భగ్వాన్ (కర్ణాటక), 2. కన్నారావు (టీజీ), 3. మైకేల్ (తమిళనాడు). అండర్-16 బాలురు: 200 మీ. పరుగు: 1. నవీన్ (తమిళనాడు), 2. నరేశ్ (టీజీ), 3. శివ (ఏపీ); 3000 మీ. పరుగు: 1. అజిత్ (కేరళ), 2. ఆకాశ్ (కేరళ), 3. లక్ష్మణ్ (కర్ణాటక); 5000 మీ. రేస్ వాక్: 1. నితీశ్ (కేరళ), 2. రంజీత్ (తమిళనాడు), 3. విఘ్నేశ్ (తమిళనాడు); లాంగ్‌జంప్: 1. శ్రీశంకర్ (కేరళ), 2. జాన్ (తమిళనాడు), 3. లోకేశ్ (కర్ణాటక). అండర్-18 బాలురు: 200 మీ. పరుగు: 1. జోసెఫ్ జో (కేరళ), 2. జ్యోతి ప్రసాద్ (కేరళ), 3.సాదత్ (కర్ణాటక); 800 మీ. పరుగు: 1. డింపు కరియప్ప (కర్ణాటక), 2. అజిత్ (కేరళ), 3. రాజాదురై (తమిళనాడు); 3000 మీ. పరుగు: 1. బిపిన్ పటేల్ (కర్ణాటక), 2. అభిత్ (కేరళ), 3. సంజయ్ (కేరళ); 400 మీ. హర్డిల్స్: 1. సంతోష్ (తమిళనాడు), 2. బాలకృష్ణన్ (తమిళనాడు), 3. యశ్వంత్ (ఏపీ); ట్రిపుల్ జంప్: 1. ట్విన్స్ (కేరళ), 2. రియాజ్ షరీఫ్ (కేరళ), 3. సందేశ్ (కర్ణాటక). అండర్-20 బాలురు: 200 మీ. పరుగు: 1. సతీశ్ (తమిళనాడు), 2. జితేశ్ (కేరళ), 3. ప్రకాశ్ (తమిళనాడు); 800 మీ. పరుగు: 1. రాజేంద్రసింగ్ (టీజీ), 2. రషీద్ (కేరళ), 3. మిజో చాకో (కర్ణాటక); 400 మీ. హర్డిల్స్: 1. జబీర్ (కేరళ), 2. అరుణ్ (తమిళనాడు), 3. ఫెర్నాండెజ్ (తమిళనాడు); 3000 మీ. స్టీపుల్ చేజ్: 1. షిజో రాజన్ (కేరళ), 2. హర్య (టీజీ), 3. యెల్లప్ప (కర్ణాటక); షాట్‌పుట్: 1. జాసన్ (కర్ణాటక), 2. అకేశ్ కుమార్ (కేరళ), 3. నిర్మల్ (తమిళనాడు). -
స్లొవేకియా ఓపెన్ చాంప్ ఐహిక
న్యూఢిల్లీ: స్లొవేకియా ఓపెన్ గ్లోబర్ జూనియర్ సర్క్యూట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఐహిక ముఖర్జీ విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి సెనెక్‌లో జరిగిన ఫైనల్లో ఐహిక 4-2 (11-6, 9-11, 11-4, 6-11, 13-11, 11-6) లీలా ఇమ్రే (హంగేరి)పై గెలిచింది. 40 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ముఖర్జీకి ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే పోలిష్ జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో ముఖర్జీతో పాటు ఇతర భారత ఆటగాళ్లు పాల్గొననున్నారు. -
ఆంధ్రప్రదేశ్ ఓటమి
న్యూఢిల్లీ: జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు 31-87 తేడాతో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నిహాల్ యాదవ్ 8, బాజిద్ బాషా 6 పాయింట్లతో రాణించినా.. ఏపీ జట్టు నాలుగు క్వార్టర్లనూ కోల్పోయింది. రాజస్థాన్ వరుసగా 21-16, 24-2, 13-4, 29-9 తేడాతో ఆధిక్యం ప్రదర్శించింది. మరో మ్యాచ్‌లో ఇండియన్ రైల్వేస్ జట్టు 80-58 తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మహిళల విభాగంలో మహారాష్ట్ర 60-56 తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై, పంజాబ్ 79-59తో తమిళనాడుపై, కర్ణాటక 75-67తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందాయి. -
పైకా ఆర్చరీ విజేతలు కృష్ణా, విశాఖపట్నం జట్లు
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రెండు రోజులు జరిగిన ఏపీ స్టేట్ పైకా పోటీలు ఆదివారం ముగిశాయి. గ్రామీణ ఆర్చరీ(ఇండియన్ బౌ) పోటీలు బాలికల విభాగంలో కృష్ణా జట్టు టీమ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మహిళా టెన్నిస్ టోర్నీలో టీమ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంది. రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ, కృష్ణా జట్టు చతుర్థస్థానాల్లో నిలిచాయి. పైకా గ్రామీణ ఆర్చరీ(ఇండియన్ బౌ) పోటీల్లో నిజామాబాద్, రంగారెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం జట్టు టీమ్ చాంపియన్‌గా నిలువగా, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా జట్లు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. టెన్నిస్ టీమ్ ఈ వెంట్లో హైదరాబాద్ జట్టు 3-0 తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. ఫైనల్స్‌లో అనూష(హైదరాబాద్) 9-1 తేడాతో సాయినిఖిత(రంగారెడ్డి)పై, అలేఖ్య(హైదరాబాద్) 9-6 తేడాతో శైలజా(రంగారెడ్డి)పై, డబుల్స్‌లో అనూష, సింధు(హైదరాబాద్) జోడీ 9-6 తేడాతో సాయినిఖిత, సహజా(రంగారెడ్డి) జోడీపై విజయం సాధించారు. ఆర్చరీలో టీమ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విశాఖపట్నం జట్టు 1442 పాయింట్లు సాధించింది. ఇందులో వరుసగా 50 మీటర్లు, 30 మీటర్ల డిస్టెన్స్ విభాగంలో ప్రథమ స్థానం పొందిన విశాఖపట్నం జట్టులో ఎస్.రమేష్ 254, 293 పాయింట్లు, ఎ.బాబురావు 201, 260, జి.మహేష్‌బాబు 203, 231, ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్టులో పి.నూతన్‌కుమార్ 231, 236, ఎ.గణేష్ 188, 270, పి.వంశి 185, 200, ఎన్.అశోక్ 85, 125, తృతీయ స్థానం సాధించిన ఖమ్మం జట్టులో పి.నగేష్ 250, 275, కె.నవీన్ 217, 226, టి.కల్యాణ్ 123, 149 పాయింట్లు పొందారు. బాలికల విభాగంలో... టీమ్ చాంపియన్‌షిప్ సాధించిన కృష్ణా జట్టు 955 పాయింట్లు సాధించింది. ఇందులో వరుసగా 50, 30 మీటర్ల డిస్టెన్స్‌లో పి.జయవినీల 91, 244, ఎ.శ్వేత 142, 183, ఎస్.ఎస్.భవాని 77, 218, ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ జట్టులో బి.నవ్యశ్రీ 197, 262, పి.గాయత్రి 161, 158, ఎం.కీర్తన 24, 58, తృతీయ స్థానం పొందిన రంగారెడ్డి జట్టులో బి.కావ్య 158, 159, ఎ.ప్రియాంక 17, 109, ఎస్డీ అఫ్రీన్ 5, 57 పాయింట్లు సాధించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని విజయవాడ సబ్‌కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఏపీ స్టేట్ పైకా మహిళా టెన్నిస్ టోర్నీ, ఆర్చరీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు పైకా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. స్పోర్ట్స్ రీజినల్ డెప్యూటీ డెరైక్టర్ జి.చిన్నయ్య మాట్లాడుతూ, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.పి.రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి ఆయా జిల్లాలకు పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. డీఎస్డీవో పి.రామకృష్ణ, ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కె.పట్టాభిరామయ్య, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆల్ రౌండర్‌గా సాగర్ జట్టు
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: దౌల్తాబాద్ మూడు రోజులుగా జరుగుతున్న ఆరోజోన్ గురుకుల విద్యాలయాల క్రీడలు శనివారం ముగిశాయి. ఈ క్రీడల్లో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని బాలుర గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నాయి. నాగార్జునసాగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యధిక అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. అలాగే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నాగార్జునసాగర్, దౌల్తాబాద్ జట్లకు సంయుక్తంగా లభించింది. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి చేతులమీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన జట్లు, క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన జట్లు.. వాలీబాల్‌లో నాగార్జునసాగర్ ప్రథమ, చిట్యాల్ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఖోఖోలో చిట్యాల్ ప్రథమ, నాగార్జునసాగర్ ద్వితీయ, కబడ్డీలో నాగార్జునసాగర్ ప్రథమ, దౌల్తాబాద్ ద్వితీయ, షటిల్లో కొడంగల్ ప్రథమ, నాగార్జునసాగర్ ద్వి తీయ, టెన్నికైట్‌లో నాగార్జునసాగర్ ప్రథమ, చిట్యాల్ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. చెస్‌లో కౌడిపల్లి విద్యార్థి.. చెస్‌లో కౌడిపల్లికి చెందిన మహేశ్ ప్రథమ, కొడంగల్‌కు చెందిన సందీప్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. వందమీటర్ల పరుగులో మహేశ్(కొడంగల్) ప్రథమ, రవి(దౌల్తాబాద్) ద్వితీ య, 200 మీటర్ల పరుగులో పి.మహేశ్(కొడంగల్) ప్రథమ, బి.మహేశ్(నాగార్జునసాగర్) ద్వితీయ స్థానంలో నిలిచారు. 400 మీటర్ల పరుగులో కృష్ణ(సాగర్) ప్రథమ, భీముడు(చిట్యాల) ద్వితీయ, 800 మీటర్ల పరుగులో బీముడు(చిట్యాల) ప్రథమ, కృపాంజనేయులు(సాగర్) ద్వితీయ, 1,500 మీటర్ల పరుగులో మహేశ్(కొడంగల్) ప్రథమ, రాఘవేందర్(చిట్యాల) ద్వితీయ, షాట్‌పుట్‌లో కృష్ణ(సాగర్) ప్రథమ, అరవింద్(దౌల్తాబాద్) ద్వితీయ, లాంగ్‌జంప్‌లో కె.రంజిత్ (దౌల్తాబాద్) ప్రథమ, మహేశ్(కొడంగల్) ద్వితీయ, హైజంప్‌లో అరవింద్ (దౌల్తాబాద్) ప్రథమ, కృపాంజనేయులు(సాగర్) ద్వితీయ, జావలిన్‌త్రో లో సాగర్‌కు చెందిన పులేందర్ ప్రథ మ, కృష్ణ ద్వితీయ, డిస్కస్‌త్రోలో అరవింద్(దౌల్తాబాద్) ప్రథమ, కృష్ణ(సాగర్) ద్వితీ య స్థానాలను దక్కించుకున్నారు. కార్యక్రమంలో దౌల్తాబాద్, కౌడిపల్లి, కొడంగల్ ప్రిన్సిపాళ్లు జవహర్, నర్సింహారెడ్డి, జోగిరెడ్డి, దౌల్తాబాద్, లింగరాజ్‌పల్లి సర్పంచ్‌లు ఆదివేణుగోపాల్, సరిత, పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
17నుంచి ‘రోబోటిక్స్’ పోటీలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి ఢిల్లీ వారు ఐదేళ్లుగా జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న రోబోటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను ఈ సారి గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్.ఎమ్. అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించ నున్నారు. 17, 18 తేదీల్లో పోటీలు జరుగనున్నాయని సోమవారం నిర్వహించిన పోటీల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.ఎస్.వి.రామాంజనేయులు తెలిపారు. రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌పై ఆసక్తి గల పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోటీలు రెండు దశల్లో జరుగుతాయని తెలిపారు. మార్చిలో ఢిల్లీలో ఫైనల్స్... గుడ్లవల్లేరులో గెలుపొందిన విజేతలకు 2014 మార్చి నెలలో ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీలకు అర్హత ఉంటుందని ప్రిన్సిపాల్ అన్నారు. జోనల్ రౌండ్ రెండు రోజులు జరుగనున్నట్లు పేర్కొన్నారు. రోబోటిక్స్ తయారీ, వినియోగ విధానాలపై రోబోసాపియిన్స్ ఇండియా నిపుణులచే వర్క్‌షాప్ నిర్వహిస్తారని చెప్పారు. ఫైనల్ విన్నర్స్‌కు రూ.లక్ష ... ఫైనల్స్‌లో గెలుపొందిన విన్నర్స్‌కు రూ.లక్ష నగదు బహుమతితో పాటు ఛాంపియన్ షిప్ టైటిల్, ఐ.ఐ.టి ఢిల్లీలో ఘన సన్మానం పొందే అవకాశం ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఆసక్తి గల వారు నలుగురి సభ్యులతో కూడిన టీమ్‌గా ఏర్పడి 12వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రామాం జనేయులు తెలిపారు. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్స్ జి.వి.వి.సత్యనారాయణ (సెల్: 94414 18252), సిహెచ్.శ్రీహరి(సెల్: 7732021425)ను సంప్రదించాలని కోరారు. -
వన్ మైల్ రన్ విజేత క్రాంతి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ గోల్డన్ మైల్ రన్ (వన్ మైల్) చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఎస్. క్రాంతి కిరణ్ (సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజి) విజేతగా నిలిచాడు. పోటీని అతను 4:43.1 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. సయ్యద్ వజీర్ (అవంతి కాలేజి) రజత పతకం గెలుచుకోగా, సయ్యద్ అహ్మదుల్లా (అవంతి కాలేజి) కాంస్యం దక్కించుకున్నాడు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఓయూ మైదానంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. విజేతలకు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్‌రావు పతకాలను అందజేశారు. ఫైనల్ ఫలితాలు: అండర్-16 బాలుర విభాగం: 1.వి. శ్రీనివాస్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. టి.మితిష్ (హెచ్‌పీఎస్, రామంతాపూర్), 3. ఎం.తవస్య(జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలురు: 1.ఎం.గణేష్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. కె.శ్రీధర్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రాజురెడ్డి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-10 బాలురు: 1.చంద్ర నాయక్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 2.సాయి కుమార్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రామ్ గౌడ్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-16 బాలికలు: 1.పి.కోటేశ్వరి (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్), 2. కలైవాణి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. సి.లక్ష్మి (జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలికలు: 1. అనూష (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. పి.మమత. -
వన్ మైల్ రన్ విజేత క్రాంతి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ గోల్డన్ మైల్ రన్ (వన్ మైల్) చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఎస్. క్రాంతి కిరణ్ (సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజి) విజేతగా నిలిచాడు. పోటీని అతను 4:43.1 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. సయ్యద్ వజీర్ (అవంతి కాలేజి) రజత పతకం గెలుచుకోగా, సయ్యద్ అహ్మదుల్లా (అవంతి కాలేజి) కాంస్యం దక్కించుకున్నాడు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఓయూ మైదానంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. విజేతలకు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్‌రావు పతకాలను అందజేశారు. ఫైనల్ ఫలితాలు: అండర్-16 బాలుర విభాగం: 1.వి. శ్రీనివాస్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. టి.మితిష్ (హెచ్‌పీఎస్, రామంతాపూర్), 3. ఎం.తవస్య(జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలురు: 1.ఎం.గణేష్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. కె.శ్రీధర్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రాజురెడ్డి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-10 బాలురు: 1.చంద్ర నాయక్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 2.సాయి కుమార్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రామ్ గౌడ్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-16 బాలికలు: 1.పి.కోటేశ్వరి (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్), 2. కలైవాణి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. సి.లక్ష్మి (జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలికలు: 1. అనూష (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. పి.మమత. -
అండర్-14 చాంప్ హెచ్‌పీఎస్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్ అండర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్-బేగంపేట్) జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో అండర్-14 బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ అథ్లెట్లు అత్యధిక పతకాలను గెలిచి టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన అండర్-14, 16 బాలబాలికలు విభాగాల్లో ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫలితాలు అండర్-14 బాలుర విభాగం: 800 మీ: 1. బి.బాలాజీ (హెచ్‌పీఎస్-బీ), 2. దివాకర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. కె.విష్ణు (హెచ్‌పీఎస్-బీ); 60 మీ: 1.బి.రాజేష్ (హెచ్‌పీఎస్-బీ), 2. కౌశిక్ నాయుడు (బీవీపీ), 3. వంశీకృష్ణ (ఎస్‌టీబీఎస్); 200 మీ: 1. బి.రాజేష్ (హెచ్‌పీఎస్-బీ), 2. వై.రవి ప్రసాద్ (కేవీయూ), 3. వెంకన్న (హెచ్‌పీఎస్-ఆర్); షాట్‌ఫుట్: 1. దివాకర్ (హెచ్‌పీఎస్-బీ), 2. డి.రవి నాయక్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. కె.సందీప్ నాయక్ (హెచ్‌పీఎస్-ఆర్); హైజంప్: 1. హీరాలాల్ (హెచ్‌పీఎస్-బీ), 2. రవీందర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3.దుర్గేశ్ కుమార్ (కేవీబీ పల్లి); లాంగ్‌జంప్: 1. రవీందర్ (హెచ్‌పీఎస్-బీ), 2. పి.మహేందర్(హైదరాబాద్), 3. హీరాలాల్ (హెచ్‌పీఎస్-బీ); బాలికల విభాగం: 60 మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. జి.వెన్నెల (కేవీ-2 ఉప్పల్), 3. డి.భవిక (హెచ్‌పీఎస్-బీ); 200మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. డి.భవిక (హెచ్‌పీఎస్-బీ), 3. రిషితరెడ్డి(సెయింట్ జోసెఫ్); 800 మీ: 1. నిహారిక (సెయింట్ జోసెఫ్), 2. జి.హార్ధికరెడ్డి (జేహెచ్‌పీఎస్), 3. డి.కీర్తి (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1. కె.లాస్య (సెయింట్ ఆండ్రూస్), 2. టి.సుమతి (హెచ్‌పీఎస్-బీ), 3. పి. సాహితి (బీవీపీ); అండ ర్-16 బాలుర విభాగం: 100 మీ: 1. నితిన్ కుమార్ (బీఎస్సీ), 2. మహేందర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3.ఎస్.శుభమ్ (కేవీ-గచ్చిబౌలీ); 400 మీ: 1. ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. నితిన్ కుమార్ (బీఎస్సీ), 3. వి.జయంత్ (ఏఈసీఎస్డబ్ల్యూ); 800 మీ: ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. అనిశ్ కుమార్ (కేవీ నెంబర్-1 గోల్కొండ), 3. టి.నితీష్ (హెచ్‌పీఎస్-ఆర్); 1500 మీ: 1. అనీశ్ కుమార్ (కేవీ-1 గోల్కొండ), 2 .కె.హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3. సి.హెచ్.శ్రవణ్ కుమార్ (జాన్సన్ గ్రామర్ స్కూల్); షాట్‌పుట్: 1. రిచర్డ్ జాషువ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్), 2.ఎం.వెంకటేష్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. రోహన్ (డిఫెన్స్ లాబ్ స్కూల్); జావెలిన్ త్రో: 1. ఆర్.శివ నాయక్ (ఆల్ సెయింట్స్ స్కూల్), 2. హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3. బి.పటేల్ (ఢిఫెన్స్ లాబ్ స్కూల్).అండర్-16 బాలికలు: 100 మీ: 1.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 2. ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 3. శరణ్య (జాన్సన్ గ్రామర్ స్కూల్); 400 మీ: 1.పి.శ్రేయ (జేహెచ్‌పీఎస్), 2. ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 3. రవళి (ఆల్ సెయింట్స్); 800 మీ: 1.పి. కావేరి (కేవీ-2 ఉప్పల్), 2. జి. భావన (ఓబుల్‌రెడ్డి స్కూల్), 3. జె.రవళి (ఆల్ సెయింట్స్); 1500 మీ: 1. జి. భావన (ఓబుల్‌రెడ్డి స్కూల్), 2. సాయి శివాని (హెచ్‌పీఎస్-ఆర్), 3. నమ్రత (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1.ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 2 .ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 3. పి.శ్రేయ (జేహెచ్‌పీఎస్).