ఆధిక్యంలో మెర్విన్ లిమ్ | mervin lim lead at rain forest challenge championship | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో మెర్విన్ లిమ్

Published Thu, Jul 28 2016 9:40 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

mervin lim lead at rain forest challenge championship

ఆర్‌ఎఫ్‌సీ రేసింగ్
సాక్షి, హైదరాబాద్: రెయిన్ ఫారెస్ట్ చాలెంజ్ (ఆర్‌ఎఫ్‌సీ) చాంపియన్‌షిప్‌లో మలేసియా డ్రైవర్ మెర్విన్ లిమ్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. గోవాలోని క్విపెమ్‌లో బుధవారం జరిగిన టెర్మినేటర్ లెగ్‌లో భారత డ్రైవర్ గుర్మిత్ విర్డీ (కో-డ్రైవర్ కిర్పాల్ సింగ్)ను వెనక్కినెట్టి... మెర్విన్ (కో-డ్రైవర్ అబ్దుల్ హమిద్) అగ్రస్థానం సంపాదించాడు. ఈ లెగ్ ముగిసేసరికి మలేసియన్ రేసర్ 2400 పాయింట్లకు గాను 1937 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు.

గుర్మిత్ (1897) రెండో స్థానానికి పడిపోయాడు. హైదరాబాద్ రేసర్లలో నూకల అభినవ్ రెడ్డి (కో-డ్రైవర్ లక్ష్మీకాంత్) 1563 పాయింట్లతో ఆరో స్థానంలో, చల్లా చైతన్య (కో-డ్రైవర్ శబరీశ్)1293 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నారు. మిగతా హైదరాబాద్ డ్రైవర్లు జితేందర్ నాథ్ (కో-డ్రైవర్ సయ్యద్ తాజ్) 1182 పాయింట్లతో 11వ స్థానంలో, రాజశేఖర్ (కో-డ్రైవర్ మల్లేశం) 344 పాయింట్లతో 27వ స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement