RFC
-
‘మోటార్‌స్పోర్ట్’కు హైదరాబాద్ నుంచి ఏడుగురు
సాక్షి, హైదరాబాద్: అత్యంత ధైర్యసాహసాలతో మిళితమైన క్రీడ మోటార్‌స్పోర్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘ఆర్ఎఫ్సీ ఇండియా–2018 అంతర్జాతీయ ఆఫ్‌రోడ్ మోటార్‌స్పోర్ట్’లో భాగ్యనగరానికి చెందిన ఏడు జట్లు పాల్గొననున్నాయి. ఈ పోటీల్లో నగరానికి చెందిన ఎన్. అభినవ్ రెడ్డి, చల్లా చైతన్య, వంగల క్రాంతి కుమార్, రాజశేఖర ప్రభు, వెంకట్ దేవినేని, టి. సంతోష్‌గౌడ్, వి. సుఖేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. గోవా వేదికగా ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీల్లో 41 జట్లు తలపడుతున్నాయి. ఈ రేసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 26 స్టేజ్‌లను అందరికన్నా ముందుగా పూర్తిచేసిన వారికి ప్రైజ్‌మనీగా 10వేల అమెరికా డాలర్లు (రూ. 68.54 లక్షలు) అందుతాయి. దీనితో పాటు ఈ ఏడాది చివర్లో మలేసియాలో జరిగే ఆర్ఎఫ్సీ మోటార్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు. -
రేసింగ్ చాంపియన్ భారతీయుడు
► ఫోర్స్ గుర్కా ఆర్ఎఫ్సీ ఇండియా రేసింగ్ హైదరాబాద్: రెయిన్ ఫారెస్ట్ చాలెంజ్ (ఆర్ఎఫ్సీ) చాంపియన్‌షిప్‌లో భారత డ్రైవర్ గుర్మిత్ విర్డీ (కో డ్రైవర్ కిర్పాల్ సింగ్) విజేతగా నిలిచాడు. గెరారీ ఆఫ్రోడర్స్ చండీ గఢ్‌కు చెందిన గుర్మిత్ మొత్తం 2700 పాయింట్లకు గాను 2177 పాయింట్లు సాధించి తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. ఈ ఫైనల్ రేసులో 2166 పాయింట్లు సాధించిన ఫోర్స్ మోటార్స్‌కు చెందిన మలేసియన్ డ్రైవర్ మెర్విన్ లిమ్ (కో డ్రైవర్ అబ్దుల్ హమీద్) రెండోస్థానాన్ని, మరో మలేసియన్ రేసర్ త్యాన్ ఇంగ్ జూ 2111 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ రేసింగ్‌లో భారత డ్రైవర్‌కు టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
ఆధిక్యంలో మెర్విన్ లిమ్
► ఆర్ఎఫ్సీ రేసింగ్ సాక్షి, హైదరాబాద్: రెయిన్ ఫారెస్ట్ చాలెంజ్ (ఆర్ఎఫ్సీ) చాంపియన్‌షిప్‌లో మలేసియా డ్రైవర్ మెర్విన్ లిమ్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. గోవాలోని క్విపెమ్లో బుధవారం జరిగిన టెర్మినేటర్ లెగ్‌లో భారత డ్రైవర్ గుర్మిత్ విర్డీ (కో-డ్రైవర్ కిర్పాల్ సింగ్)ను వెనక్కినెట్టి... మెర్విన్ (కో-డ్రైవర్ అబ్దుల్ హమిద్) అగ్రస్థానం సంపాదించాడు. ఈ లెగ్ ముగిసేసరికి మలేసియన్ రేసర్ 2400 పాయింట్లకు గాను 1937 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. గుర్మిత్ (1897) రెండో స్థానానికి పడిపోయాడు. హైదరాబాద్ రేసర్లలో నూకల అభినవ్ రెడ్డి (కో-డ్రైవర్ లక్ష్మీకాంత్) 1563 పాయింట్లతో ఆరో స్థానంలో, చల్లా చైతన్య (కో-డ్రైవర్ శబరీశ్)1293 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నారు. మిగతా హైదరాబాద్ డ్రైవర్లు జితేందర్ నాథ్ (కో-డ్రైవర్ సయ్యద్ తాజ్) 1182 పాయింట్లతో 11వ స్థానంలో, రాజశేఖర్ (కో-డ్రైవర్ మల్లేశం) 344 పాయింట్లతో 27వ స్థానంలో ఉన్నారు. -
జీహెచ్ఎంసీ న్యూస్ !
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి ఫలితాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేం దుకు టీవీ చానల్‌ను వేదికగా చేసుకోవాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతి ఆదివారం రాత్రి ‘జీహెచ్ఎంసీ న్యూస్’ పేరిట ఒక బులెటిన్‌ను రన్ చేయాలని, ఇందుకు ఆయా న్యూస్ చానళ్ల నుంచి ఆర్‌ఎఫ్‌సీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో జరిగే కార్యక్రమాల సమాహారం‘రౌండప్’లా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విశ్వనగరం దిశగా హైదరాబాద్ అనే థీమ్‌తో దీని ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8 గం టల నడుమ దీనిని నిర్వహిస్తే ఎక్కువమంది వీక్షించగలరని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యక్రమాలను వివిధ న్యూస్ చానళ్లు ప్రముఖంగానే ప్రసారం చేస్తున్నప్పటికీ, తాము చెప్పదలచుకున్నది మరింత స్పష్టంగా ప్రజ లకు చేరవేసేందుకు ఈ జీహెచ్ఎంసీ న్యూస్ బులెటిన్ ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ బులెటిన్ మధ్య విరామం లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు వినియోగించరాదని భావిస్తున్నారు. వాటి బదుల పర్యావరణం, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై ప్ర జలకు అవగాహన కలిగించే, పౌరస్పృహను పెంచే కార్యక్రమాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ‘జీహెచ్ఎంసీ న్యూస్’ ఆలోచన ఉన్నప్పటికీ అమలుకు ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పలేమని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. -
‘ఐటీఐఆర్’కు మాస్టర్‌ప్లాన్
ఆర్ఎఫ్పీ తయారీపై ముమ్మర కసరత్తు బిడ్స్ ఆహ్వానించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు 2016 నాటికి ప్రణాళిక అందుబాటులోకి.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో ఐటీ రంగానికి సంబంధించి సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్’ను రూపొందించే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించింది. గ్రేటర్లో ప్రస్తుతం అమల్లో ఉన్న హుడా, హడా, సీడీఏ తదితర మాస్టర్ప్లాన్లను అవసరమైన మేరకు మార్పులు చేసి ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అనుగుణంగా సవరించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదిక రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ మేరకు తగిన అర్హతలున్న కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు అధికారులు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’(ఆర్ఎఫ్పీ)ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. 2016 నాటికి ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్‌ను అమల్లోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పరిశ్రమిస్తున్నారు. బిడ్స్‌కు ఆహ్వానం.. ప్రైవేటు కన్సల్టెన్సీ నియామకానికి బిడ్స్ ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు. బిడ్స్‌ను పరిశీలించి అన్ని అర్హతలున్న కన్సల్టెన్సీని ఎంపిక చేసే బాధ్యతను ఉన్నతాధికారులతో కూడిన స్క్రూట్నీ కమిటీ నిర్వర్తిస్తుంది. అనంతరం ఎంపికైన సంస్థతో ఒప్పందం చేసుకొని 6-8 నెలల వ్యవధిలో పక్కా నివేదికను రూపొందించేలా లక్ష్యాన్ని నిర్దేశిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మార్పులు, చేర్పులు.. ప్రైవేటు కన్సల్టెన్సీ రూపొందించిన డ్రాఫ్టు ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణకు పెట్టి వారి అభ్యంతరాల మేరకు మార్పులు, చేర్పులు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నగరం నలువైపులా ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడెక్కడ వస్తోంది? వాటి సరిహద్దులు, సర్వే నంబర్లను గుర్తించాల్సి ఉంటుంది. అక్కడి భూములు ప్రభుత్వానివా...? లేక ప్రైవేటు వ్యక్తులవా..? అన్నది అధ్యయన సంస్థ గుర్తించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులన్నీ ఒక్క మహేశ్వరం మండలంలో తప్ప మిగతావన్నీ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నాయి. ఇవన్నీ పాత మాస్టర్ ప్లాన్ పరిధిలోవే గనుక మార్పులు చేయడం పెద్ద ఇబ్బందేమీ కాదని హెచ్ఎండీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మార్పుల అనంతరం ప్రభుత్వం పరిశీలించి అనుమతించాక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఐటీఐఆర్‌లకు అనుగుణంగా సవరించిన మాస్టర్ ప్లాన్‌ను అమల్లోకి వస్తుందంటున్నారు. -
అదిరిపోయింది!
సూపర్‌స్టార్ సూపర్ స్టయిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయి కన్నులతో ‘లింగ’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. చిత్రీకరణ నుంచే అంచనాలు అంబరాన్ని తాకిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్‌తో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి ‘రాక్‌లైన్’ వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నాను అనే ఫీలింగే చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. రజనీ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన ముత్తు, నరసింహా చిత్రాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ‘లింగ’ ఫస్ట్‌లుక్‌ని వినాయకచవితి కానుకగా విడుదల చేశాం. దీపావళి కానుకగా మరో లుక్ విడుదల చేశాం. స్పందన అదిరిపోయింది. ఇటీవలే హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో మూడున్నర కోట్ల భారీ వ్యయంతో రజనీ, సోనాక్షి, 200 మంది డాన్సర్లతో ఓ పాట చిత్రీకరించాం. సూపర్‌స్టార్ అభిమానులు థియేటర్లో విజిల్స్ వేసేలా ఈ పాట ఉంటుంది. ప్రస్తుతం దుబాయ్, మోకా, అబుదాబీల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అబ్రాడ్‌లోనే కొన్ని సాంగ్స్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నాం. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్. దేశంలోని ఉన్నతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రం పాటలను నవంబర్ రెండో వారం విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.