
రేసింగ్ చాంపియన్ భారతీయుడు
► ఫోర్స్ గుర్కా ఆర్‌ఎఫ్‌సీ ఇండియా రేసింగ్
హైదరాబాద్: రెయిన్ ఫారెస్ట్ చాలెంజ్ (ఆర్‌ఎఫ్‌సీ) చాంపియన్‌షిప్‌లో భారత డ్రైవర్ గుర్మిత్ విర్డీ (కో డ్రైవర్ కిర్పాల్ సింగ్) విజేతగా నిలిచాడు. గెరారీ ఆఫ్‌రోడర్స్ చండీ గఢ్‌కు చెందిన గుర్మిత్ మొత్తం 2700 పాయింట్లకు గాను 2177 పాయింట్లు సాధించి తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు.
ఈ ఫైనల్ రేసులో 2166 పాయింట్లు సాధించిన ఫోర్స్ మోటార్స్‌కు చెందిన మలేసియన్ డ్రైవర్ మెర్విన్ లిమ్ (కో డ్రైవర్ అబ్దుల్ హమీద్) రెండోస్థానాన్ని, మరో మలేసియన్ రేసర్ త్యాన్ ఇంగ్ జూ 2111 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ రేసింగ్‌లో భారత డ్రైవర్‌కు టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.