సెమీస్‌లో గాయత్రి గోపీచంద్ | junior badminton champion gayatri gopichand | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో గాయత్రి గోపీచంద్

Published Sun, Jul 31 2016 9:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

junior badminton champion gayatri gopichand

రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గాయత్రి గోపీచంద్ (రంగారెడ్డి) సెమీఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి 21-7, 21-3తో తనుశ్రీ (వరంగల్)ని చిత్తుగా ఓడించింది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మేఘనా రెడ్డి (హైదరాబాద్) 21-12, 18-21తో అభిలాష (హైదరాబాద్)పై, కేయూర 21-15, 21-16తో భార్గవి (రంగారెడ్డి)పై, సామియా ఫరూఖి (రంగారెడ్డి) 21-5, 23-21తో ప్రవళిక (మెదక్)పై గెలుపొందారు.

బాలుర సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో శ్రీకృష్ణ (రంగారెడ్డి) 21-10, 21-13తో మహితేజ (హైదరాబాద్)పై, పవన్ కృష్ణ (ఖమ్మం) 21-17, 21-10తో భవధీర్ (హైదరాబాద్)పై, విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) 21-17, 21-14తో రితిన్ (వరంగల్)పై విజయం సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement