► రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు కేయూర, మేఘన అండర్-17, అండర్- 19 విభాగాల్లో రాణించారు. గురువారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ రెండో రౌండ్‌లో కేయూర 15-18, 15-17, 15-12తో అభిలాషపై, మేఘన 15-13, 15-12తో దివ్యపై విజయం సాధించారు. మరో మ్యాచ్‌లో మమత 11-15, 15-12, 15-10తో వన్షికపై గెలుపొందింది. బాలుర సింగిల్స్ తొలిరౌండ్‌లో లోహిత్ 15- 10, 15-6తో రిషికేశ్‌పై, అనురాగ్ దాస్ 15-12, 15-6తో ప్రణీత్ రెడ్డిపై, తరుణ్ రెడ్డి 15-5, 15-10తో శ్రేయ్ సింగ్‌పై నెగ్గారు.
అండర్-17 బాలికల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో కేయూర 17-15, 15-9తో సుప్రియపై, దివ్య 15-7, 15-9తో రూహిపై, మేఘన 15-6, 15-11తో కావ్యపై, వన్షిక 15-10, 15-9తో ఇషితపై విజయం సాధించారు. బాలుర రెండోరౌండ్ మ్యాచ్‌ల్లో మహితేజ 15-8, 15-12తో తరుణ్ కుమార్‌పై, సుదీశ్ వెంకట్ 15-5, 15-5తో మణిశర్మపై, ప్రేమ్ 8-15, 15-9, 15-10తో ఆదిత్య గుప్తాపై, విఘ్నేశ్ 15-9, 15-10తో ఉదయ్‌పై, ప్రణీత్ 15-13, 15-12తో ప్రమోద్‌పై, సూర్యకిరణ్ 15-10, 15-13తో సాయి పృథ్వీపై, యశ్వంత్ రామ్ 13-15, 15-9తో అనురాగ్ దాస్‌పై, సాకేత్ 10-15, 15-8,15-7తో వినయ్‌పై, తరుణ్ రెడ్డి 15-11, 15-9తో రోహిత్ రెడ్డిపై, శశాంక్ 15-13, 15-12తో శ్రీకర్‌పై, ధనిక్ 15-9, 15-13తో గణేశ్ సాయిపై, భవ ధీర్ 15-10, 15-13తో అబ్దుల్ రహీమ్‌పై గెలుపొందారు.
రాణించిన కేయూర, మేఘన
Published Fri, Jul 29 2016 9:25 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement
Advertisement