మెయిన్ ‘డ్రా’కు షామిని
సుజౌ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి షామిని కుమరేశన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌లో షామిని తన గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఆమె తొలి మ్యాచ్‌లో 11-7, 9-11, 11-3, 13-11, 8-11, 11-8తో గిలియన్ ఎడ్వర్డ్స్ (స్కాట్లాండ్)పై... రెండో మ్యాచ్‌లో 11-7, 11-3, 8-11, 11-3, 7-11, 11-8తో నినో నెరిది (వెనిజులా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన మౌమా దాస్, మణిక బాత్రా తమ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించారు.