World table tennis
-
హర్మీత్ ‘డబుల్’ ధమాకా
కరాకస్ (వెనిజులా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ కరాకస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ హర్మీత్ దేశాయ్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గడంతోపాటు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తన భార్య కృత్విక రాయ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 90వ స్థానంలో ఉన్న హర్మీత్ ఫైనల్లో 11–7, 11–8, 11–6తో జో సీఫ్రయిడ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 22 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హర్మీత్ తన సర్వీస్‌లో 14 పాయింట్లు, ప్రత్యర్థి సర్విస్‌లో 19 పాయింట్లు సంపాదించాడు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో హర్మీత్–కృత్విక రాయ్ ద్వయం 8–11, 11–9, 11–8, 9–11, 11–5తో జార్జి కాంపోస్–డానియెలా ఫొన్సెకా కరాజానా (క్యూబా) జోడీపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో స్నేహిత్
బీరుట్ (లెబనాన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సూరావజ్జుల స్నేహిత్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో స్నేహిత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... మహిళల సింగిల్స్‌లో శ్రీజ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్ స్నేహిత్ 11–7, 11–8, 11–13, 15–13తో ప్రపంచ 58వ ర్యాంకర్ అహ్మద్ సలెహ్ (ఈజిప్ట్)ను బోల్తా కొట్టించాడు. శ్రీజ 10–12, 9–11, 11–2, 9–11తో భారత్‌కే చెందిన ఐహిక ముఖర్జీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–దియా చిటాలె (భారత్) ద్వయం 9–11, 8–11, 5–11తో చాంటల్ మాంట్జ్ (జర్మనీ)–ఇజాబెలా లుపులెస్కు (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో స్నేహిత్–శ్రీజ (భారత్) జోడీ తొలి రౌండ్లో 4–11, 4–11, 8–11తో జియా లియాన్ ని–లుకా మ్లాడెనోవిచ్ (లక్సెంబర్గ్) జంట చేతిలో ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన మానవ్ ఠక్కర్–అర్చన కామత్... మనుష్ షా–దియా చిటాలె జోడీలు మిక్స్డ్ విభాగం ఫైనల్లోకి దూసుకెళ్లాయి. -
భారత్‌ను గెలిపించిన మనిక
బుసాన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టుకు తొలి విజయం లభించింది. హంగేరితో ఆదివారం జరిగిన గ్రూప్–1 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో గెలిచింది. భారత నంబర్‌వన్ మనిక బత్రా తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు భారత పురుషుల జట్టు గ్రూప్–3లో భాగంగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–3తో ఓడిపోయింది. -
సింగిల్స్ చాంపియన్ శ్రీజ
టెక్సస్ (అమెరికా): రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తన కెరీర్లో తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం ముగిసిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ టోర్నీలో 25 ఏళ్ల శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో శ్రీజ 11–6, 18–16, 11–5తో ప్రపంచ 46వ ర్యాంకర్ లిలీ జాంగ్ (అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన ప్రపంచ 94వ ర్యాంకర్ శ్రీజకు 650 డాలర్ల (రూ. 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచిన క్రమంలో శ్రీజ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ అమీ వాంగ్ (అమెరికా)పై 11–9, 9–11, 11–1, 6–11, 11–9తో గెలుపొందడం విశేషం. ‘చాలా సంతోషంగా ఉన్నా. నా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. అంతర్జాతీయస్థాయిలో నాకిదే తొలి టైటిల్. నాకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించి విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉంది’ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ వ్యాఖ్యానించింది. -
Singapore Smash 2023: క్వార్టర్ ఫైనల్లో మనిక జోడీ
ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగపూర్‌లో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక–సత్యన్ ద్వయం 11–7, 12–10, 9–11, 11–3తో జెంగ్ జియాన్–క్లారెన్స్ చ్యూ (సింగపూర్) జోడీపై గెలిచింది. మనిక–సత్యన్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన హరిమోతో–హినా హయాటా ద్వయంతో మనిక–సత్యన్ ఆడతారు. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీజ
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ మస్కట్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ మ్యాచ్‌లో శ్రీజ 3–11, 11–7, 12–10, 9–11, 12–10తో హుయ్ జింగ్ యాంగ్ (చైనా)పై గెలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగి అయిన 23 ఏళ్ల శ్రీజ తొలి రౌండ్లో 11–4, 11–6, 11–8తో జాంగ్ వాన్లింగ్ (సింగపూర్) పై, రెండో రౌండ్లో 11–6, 11–4, 11–5తో ఇవా జుర్కోవా (స్లొవేకియా)పై నెగ్గింది. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ జట్టులో హార్దిక్ పాండ్యా.. స్టార్ బౌలర్‌కు నో ఛాన్స్! -
మనిక–సత్యన్ జోడీకి టైటిల్
బుడాపెస్ట్ (హంగేరి): టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ నుంచి భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్ త్వరగానే బయటపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో జోడీ కట్టిన మనిక–సత్యన్ మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ చేజిక్కించుకున్నా. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై గెలుపొందింది. సింగిల్స్ సెమీస్‌లో అవుట్ మిక్స్డ్ డబుల్స్‌లో విజయవంతమైన మనిక సింగిల్స్‌లో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 60వ ర్యాంకర్ మనిక బాత్రా 0–4 (10–12, 9–11, 10–12, 8–11)తో ఎలిజబెత్ అబ్రామియెన్ (రష్యా) చేతిలో కంగుతిన్నది. ఏకంగా 415వ ర్యాంకర్ చేతిలో అది కూడా ఒక్క గేమ్ కూడా గెలవకుండా మనిక పరాజయం చవిచూడటం గమనార్హం. పురుషుల సింగిల్స్‌లో సత్యన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. -
మూడో రౌండ్లో శరత్
సుజౌ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ దూసుకెళుతున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 44వ ర్యాంకర్ శరత్ కమల్ 11-4, 11-5, 11-7, 6-11, 11-8 తేడాతో 35వ ర్యాంకర్ సైమన్ గాజీ (ఫ్రాన్స్)ని మట్టికరిపించాడు. గతంలోనూ తను ఈ మెగా టోర్నీలో మూడో రౌండ్ వరకు చేరాడు. అలాగే జి.సత్యన్ సంచలన ప్రదర్శన రెండో రౌండ్లో ముగిసింది. అతను 1-4తో చైనాకు చెందిన ఫాంగ్ బో చేతిలో ఓడిపోయాడు. అటు సౌమ్యజిత్ ఘోష్ కూడా రెండో రౌండ్లో 1-4తో అలెగ్జాండర్ (రష్యా) చేతిలో ఓడాడు. -
సత్యన్ సంచలనం
ఘసుజో (చైనా) : ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువ ఆటగాడు జి.సత్యన్ సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 188వ ర్యాంకర్ సత్యన్ 4-1 గేమ్‌ల తేడాతో ప్రపంచ 64వ ర్యాంకర్ గెరెల్ పార్ (స్వీడన్)ను బోల్తా కొట్టించాడు. అంతకుముందు జరిగిన అర్హత రౌండ్ చివరి మ్యాచ్‌లో సత్యన్ 11-7, 11-8, 11-8, 11-4 తేడాతో చిలీకి చెందిన ఫెలిప్ ఒలివర్స్ను ఓడించాడు. మరోవైపు భారత ప్రధాన ఆటగాడు ఆచంట శరత్ కమల్ తొలి రౌండ్లో 4-2తో పార్క్ సిన్ హ్యోక్ (ఉత్తర కొరియా)పై గెలుపొందగా... సౌమ్యజిత్ ఘోష్ 4-1తో ఖాద్రి (నైజీరియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత పొందాడు. -
మెయిన్ ‘డ్రా’కు షామిని
సుజౌ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి షామిని కుమరేశన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌లో షామిని తన గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె తొలి మ్యాచ్‌లో 11-7, 9-11, 11-3, 13-11, 8-11, 11-8తో గిలియన్ ఎడ్వర్డ్స్ (స్కాట్లాండ్)పై... రెండో మ్యాచ్‌లో 11-7, 11-3, 8-11, 11-3, 7-11, 11-8తో నినో నెరిది (వెనిజులా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన మౌమా దాస్, మణిక బాత్రా తమ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించారు.