
ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగపూర్‌లో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక–సత్యన్ ద్వయం 11–7, 12–10, 9–11, 11–3తో జెంగ్ జియాన్–క్లారెన్స్ చ్యూ (సింగపూర్) జోడీపై గెలిచింది.
మనిక–సత్యన్ జోడీకి తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన హరిమోతో–హినా హయాటా ద్వయంతో మనిక–సత్యన్ ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment