Sathiyan
-
క్వార్టర్ ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ ఓటమి, ముగిసిన భారత పోరాటం
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోరీ్నలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ 9–11, 9–11, 11–8, 11–5, 7–11తో హినా హయాటా–టొమొకాజు హరిమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జోడీ 2–11, 6–11, 15–13, 12–10, 6–11తో మెంగ్ చెన్–యిది వాంగ్ (చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
Singapore Smash 2023: క్వార్టర్ ఫైనల్లో మనిక జోడీ
ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగపూర్‌లో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక–సత్యన్ ద్వయం 11–7, 12–10, 9–11, 11–3తో జెంగ్ జియాన్–క్లారెన్స్ చ్యూ (సింగపూర్) జోడీపై గెలిచింది. మనిక–సత్యన్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన హరిమోతో–హినా హయాటా ద్వయంతో మనిక–సత్యన్ ఆడతారు. -
Commonwealth Games 2022: సూపర్ శ్రీజ, శరత్
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్‌లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. -
సత్యన్ సంచలనం
చెంగ్డూ (చైనా): పురుషుల ప్రపంచకప్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్ అద్భుతం చేశాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మెగా ఈవెంట్లో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గ్రూప్ ‘డి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ తనకంటే మెరుగైన ర్యాంకు ఉన్న ఆటగాళ్లను కంగుతినిపించాడు. తొలి ప్రపంచకప్ ఆడుతున్న ప్రపంచ 30వ ర్యాంకర్ సత్యన్ తొలి మ్యాచ్‌లో 4–3 (11–13, 9–11, 11–8, 14–12, 7–11, 11–5, 11–8)తో 22వ ర్యాంకర్ సైమన్ గాజీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. అనంతరం రెండో మ్యాచ్‌లో 26 ఏళ్ల ఈ చెన్నై ప్లేయర్ 4–2 (11–3, 12–10, 7–11, 16–14, 8–11, 11–8)తో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 24వ ర్యాంకర్ గ్రోత్ జొనథన్‌ను ఇంటిదారి పట్టించాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, గత రెండు ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన టిమో బోల్ (జర్మనీ)తో సత్యన్ తలపడతాడు. -
సత్యన్–అమల్‌రాజ్ జంటకు కాంస్యం
గీలాంగ్ (మెల్బోర్న్): ఆస్ట్రేలియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సత్యన్– అమల్ రాజ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సత్యన్–అమల్‌రాజ్ జంట 12–14, 9– 11, 8–11తో టాప్ సీడ్ యంగ్సిక్– లీ సంగ్సు (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత జంటకు కాంస్య పతకం ఖాయమైంది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జంట 11–7, 11–3, 11–8తో డేవిడ్–టౌన్సెండ్ (ఆస్ట్రేలియా) ద్వయంపై, క్వార్టర్స్‌లో 5–11, 11–6, 14–12, 11–8తో జాంగ్ వూజిన్–జాంగ్‌హూన్ (కొరియా) జోడీపై గెలుపొందింది. -
సత్యన్... కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో టాప్–25లో చోటు సంపాదించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్ సత్యన్ గుర్తింపు పొందాడు. సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో చెన్నైకు చెందిన సత్యన్ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. హంగేరిలో గత వారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్యన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ‘నా ప్రదర్శనతో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈ ఏడాది చివరికల్లా టాప్–15లోకి చేరడమే నా లక్ష్యం’ అని సత్యన్ అన్నాడు. -
సత్యన్ జంటకు రజతం
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ జి. సత్యన్ జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో రజతం సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సత్యన్–సానిల్ శెట్టి జంట 10–12, 11–9, 10–12, 7–11తో టొబియస్ హిప్లర్–కిలియన్ (జర్మనీ) చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్లో ఈ జోడీ 11–7, 5–11, 11–9, 5–11, 11–3తో భారత్‌కే చెందిన హర్మీత్ దేశాయ్–మానవ్ ఠక్కర్ జంటపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. అంతకుముందు 3–0తో మలేసియా జంటపై; 3–1తో జపాన్ ద్వయంపై నెగ్గి సెమీస్‌కు చేరింది. -
సత్యన్ సంచలనం
బెల్జియం ఓపెన్ టీటీ టైటిల్ సొంతం న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువ క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) బెల్జియం ఓపెన్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సత్యన్ సొంతం చేసుకున్నాడు. బెల్జియంలోని డీ హాన్ నగరంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సత్యన్ 4-0 (15-13, 11-6, 11-2, 17-15)తో సెడ్రిక్ న్యుటింక్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2010లో ఆచంట శరత్ కమల్ ఈజిప్టు ఓపెన్ గెలిచాక...భారత్ నుంచి ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడు సత్యనే కావడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్‌సలో 152వ స్థానంలో ఉన్న సత్యన్ ఈ టోర్నీలో నెగ్గిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లపై ఉండటం విశేషం. విజేత సత్యన్‌కు 4 వేల డాలర్ల (రూ. 2 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ‘టైటిల్ గెలుస్తానని ఊహించలేదు. నా కెరీర్లోనే గొప్ప విజయమిది’ అని సత్యన్ అన్నాడు.