
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ జి. సత్యన్ జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రజతం సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సత్యన్–సానిల్ శెట్టి జంట 10–12, 11–9, 10–12, 7–11తో టొబియస్ హిప్లర్–కిలియన్ (జర్మనీ) చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది.
సెమీఫైనల్లో ఈ జోడీ 11–7, 5–11, 11–9, 5–11, 11–3తో భారత్‌కే చెందిన హర్మీత్ దేశాయ్–మానవ్ ఠక్కర్ జంటపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. అంతకుముందు 3–0తో మలేసియా జంటపై; 3–1తో జపాన్ ద్వయంపై నెగ్గి సెమీస్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment