
గీలాంగ్ (మెల్‌బోర్న్): ఆస్ట్రేలియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సత్యన్– అమల్ రాజ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సత్యన్–అమల్‌రాజ్ జంట 12–14, 9– 11, 8–11తో టాప్ సీడ్ యంగ్‌సిక్– లీ సంగ్సు (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత జంటకు కాంస్య పతకం ఖాయమైంది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జంట 11–7, 11–3, 11–8తో డేవిడ్–టౌన్‌సెండ్ (ఆస్ట్రేలియా) ద్వయంపై, క్వార్టర్స్‌లో 5–11, 11–6, 14–12, 11–8తో జాంగ్ వూజిన్–జాంగ్‌హూన్ (కొరియా) జోడీపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment