
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్‌హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి.
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్‌వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్‌లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది.