finals
-
‘హ్యాట్రిక్’ టైటిల్‌పై సన్‌రైజర్స్ గురి
సెంచూరియన్: భారత్‌కు చెందిన సన్‌రైజర్స్ యాజమాన్యంలోని ఈస్టర్న్ కేప్ జట్టు దక్షిణాఫ్రికా టి20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేసింది. ‘ఎస్ఏ20’ పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో రెండుసార్లు చాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్(Sunrisers Eastern Cape team) వరుసగా మూడోసారి ఫైనల్స్‌కు అర్హత పొందింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ 8 వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ జట్టే టైటిల్స్‌ను గెలుచుకుంది. రెండో క్వాలిఫయర్‌లో మొదట రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మన్ (53 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రిటోరియస్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లు క్రెయిగ్ ఓవర్టన్, జాన్సెన్, ఒటెనీల్, మార్క్రమ్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. టోని డి జొర్జి (49 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మాన్ (48 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టును సులువుగా లక్ష్యానికి చేర్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో జొబర్గ్ సూపర్‌కింగ్స్‌ను ఓడించిన 24 గంటలకే మరో ప్లేఆఫ్స్ మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ నెగ్గి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కు చెందిన ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. తొలి క్వాలిఫయర్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని కేప్‌టౌన్ జట్టు 39 పరుగుల తేడాతో పార్ల్ రాయల్స్‌పై గెలిచింది. -
ఒకటే లక్ష్యం... రెండో ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్ సై
కౌలాలంపూర్: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొట్టమొదటి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు జగజ్జేతగా అవతరించింది. రెండేళ్ల తర్వాత అదే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేందుకు ఈసారి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఫైనల్ సంగ్రామానికి సిద్ధమైంది. అజేయంగా తుది పోరుకు అర్హత సాధించిన నికీ ప్రసాద్ నాయకత్వంలోని భారత అమ్మాయిల జట్టు విజయవంతంగా ‘రెండో ప్రపంచకప్ మిషన్’ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్‌కప్ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో జోరు మీదున్న రెండు అజేయ జట్ల మధ్య నేడు జరిగే అండర్–19 ప్రపంచకప్ టైటిల్ పోరుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారీ భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందా! లేదంటే కొత్త చాంపియన్ ఆవిర్భవిస్తుందా! మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ వనరులతో పూర్తిస్థాయి ఆల్‌రౌండ్ సామర్థ్యంతో ఉన్న టీనేజ్ టీమిండియాను ఎదుర్కోవడమే ఎవరికైనా అతిపెద్ద సవాల్. ఇక అలాంటి అబేధ్యమైన జట్టును ఓడించాలంటే మాత్రం దక్షిణాఫ్రికా మైదానంలో పెద్ద ‘ప్రపంచ’ యుద్ధమే చేయాలనడంలో అతిశయోక్తే లేదు! ఆ ఇద్దరిని కట్టడి చేస్తే... తెలంగాణ స్టార్ బ్యాటర్ గొంగడి త్రిష! మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనను విస్మరించిన ఫ్రాంచైజీల కళ్లకు కట్టుకున్న గంతల్ని తన అసాధారణ బ్యాటింగ్‌తో విప్పేసింది. ఇప్పుడు ‘ఫైనల్ మిషన్’ ముంగిట అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ టోర్నీలో ఓపెనర్ త్రిష ఫామ్, క్రీజులో ఆమె కనబరుస్తున్న పోరాటపటిమ ప్రత్యర్థి బౌలర్లకు కఠిన సవాళ్లు విసురుతున్నాయి. మరో ఓపెనర్ కమలిని, సనిక చాల్కెలతో కూడిన భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా త్రిష, కమలినిలను తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో త్రిష 265 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా... కమలిని 135 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ నుంచి అత్యధిక పరుగులు సనిక చాల్కె (6 మ్యాచ్‌ల్లో 69) చేసింది.భారత బౌలింగ్ విభాగానికొస్తే ఆయుశి శుక్లా, పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మలతో కూడిన స్పిన్ త్రయం విశేషంగా రాణిస్తోంది. సహజంగానే సఫారీలకు స్పిన్ అంటేనే కష్టం. అలాంటి జట్టుపై ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా ప్రభావం చూపిస్తారు. అలాగని ఫైనల్‌కు చేరిన సఫారీ జట్టును తక్కువ అంచనా వేయలేం.కేలా రెనెకి కెప్టెన్సీ లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లో గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌తో చుట్టేసింది. జెమ్మా బోతా, లౌరెన్స్, కరబొ మెసోలతో కూడిన బ్యాటింగ్ లైనప్, ఆష్లే వాన్విక్, ఎన్‌తబిసెంగ్ నిని, శేషిని నాయుడులతో కూడిన బౌలింగ్ దళం కూడా మెరుగ్గా ఉంది.పిచ్, వాతావరణం భారత్‌కు బాగా అలవాటైన పిచ్. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణ వాతావరణమే. వాన ముప్పు దాదాపుగా లేదు. -
టైటిల్ వేటలో...
పుణే: రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)–11వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా... హరియాణా స్టీలర్స్‌తో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ టైటిల్ కోసం తలపడనుంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన హరియాణా స్టీలర్స్... ఇప్పటికే మూడుసార్లు టైటిల్ ముద్దాడిన పట్నా మధ్య రసవత్తర పోరు ఖాయమే. తొలిసారి చాంపియన్‌గా నిలవాలనుకుంటున్న హరియాణా స్టీలర్స్‌కు జైదీప్ సారథ్యం వహిస్తుండగా... మన్‌ప్రీత్ సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నేరుగా సెమీఫైనల్‌కు చేరిన స్టీలర్స్... తుదిపోరులోనూ అదే జోరు కనబర్చాలని కృతనిశ్చయంతో ఉంది. స్టీలర్స్ తరఫున శివమ్ పాతరె, వినయ్, జైదీప్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యూపీ యోధాస్‌తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో కీలక పాయింట్లు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చిన శివమ్, వినయ్ ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని స్టీలర్స్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. డిఫెన్స్‌లో రాహుల్, సంజయ్ కీలకం కానున్నారు. మరోవైపు గతంలో వరుసగా మూడు సార్లు పీకేఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న పట్నా... ఇప్పుడు నాలుగో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. యువ ఆటగాళ్లు దేవాంక్ దలాల్, అయాన్ లోచాబ్ రాణించడంతో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన పైరేట్స్.. అదే జోష్‌లో టైటిల్ పట్టాలని చూస్తోంది. -
విన్నర్ సినెర్
రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ ఇప్పటికే టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకోగా... సెర్బియా స్టార్ జొకోవిచ్ కూడా త్వరలోనే వీరి బాటలో నడిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ ‘ముఖచిత్రం’ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్ దూసుకొచ్చాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్‌లో సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సినెర్... 1986లో ఇవాన్ లెండిల్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇటీవల డోపింగ్ వివాదంతో విమర్శలపాలైనా... ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పిదం చేయలేదని వివరణ ఇచి్చన సినెర్... తాజా విజయంతో సీజన్‌ను చిరస్మరణీయంగా ముగించాడు. ట్యూరిన్: సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ అదరగొట్టాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి విజేతగా అవతరించాడు. అమెరికా ప్లేయర్, యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ తుది సమరంలో సినెర్ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తొలి సర్వీస్ లో 40కుగాను 33 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 16కు 13 పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నెట్ వద్దకు 5 సార్లు దూసుకొచ్చిన ఇటలీ స్టార్ మూడుసార్లు పాయింట్లు నెగ్గాడు. 28 విన్నర్స్ కొట్టిన సినెర్ కేవలం 9 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ 8 ఏస్‌లు సంధించి, 2 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 8 సార్లు దూసుకొచ్చి 7 సార్లు పాయింట్లు నెగ్గిన ఫ్రిట్జ్ 15 అనవసర తప్పిదాలు చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా విజేతగా నిలిచినందుకు సినెర్ 48,81,100 డాలర్ల (రూ. 41 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీ, 1500 ర్యాంకింగ్ పాయింట్లు గెల్చుకున్నాడు. టేలర్ ఫ్రిట్జ్కు 22,47,400 డాలర్ల (రూ. 18 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2006లో జేమ్స్ బ్లేక్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో ఆడిన అమెరికన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ఫ్రిట్జ్ కీలక సమరంలో తడబడ్డాడు. ఒకవేళ ఫ్రిట్జ్ గెలిచి ఉంటే 1999లో సంప్రాస్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందేవాడు. మరోవైపు ఇవాన్ లెండిల్ (1986లో; చెక్ రిపబ్లిక్/అమెరికా) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత వహించాడు. 2024 ఏడాదిని సినెర్ 70 విజయాలు, 6 పరాజయాలతో ముగించాడు. ఆండీ ముర్రే (బ్రిటన్; 2016లో) తర్వాత ఒకే సీజన్ లో 70 విజయాలు సాధించిన ప్లేయర్‌గా సినెర్ నిలిచాడు. 8 ఈ ఏడాదిలో సినెర్ సాధించిన టైటిల్స్ సంఖ్య. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, షాంఘై మాస్టర్స్, ఏటీపీ ఫైనల్స్ టోర్నీలలో సినెర్ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా సినెర్ కెరీర్లో 18 టైటిల్స్ నెగ్గాడు. -
విజయంతో ముగించిన బోపన్న–ఎబ్డెన్ జోడీ
ట్యూరిన్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 2024 సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచింది. ‘బాబ్ బ్రయాన్ గ్రూప్’లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బోపన్న–ఎబ్డెన్ ద్వయం... శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7–5, 6–7 (6/8), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. ఈ క్రమంలో బోపన్న (44 ఏళ్ల 8 నెలలు) ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజయం సాధించిన అతి పెద్ద వయసు్కడిగా రికార్డు నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన క్రావిట్జ్–ప్యూట్జ్ జోడీ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. 2023లో ఎబ్డెన్తో జతకట్టిన బోపన్న ఈ టోరీ్నలో చివరిసారి అతనితో కలసి ఆడాడు. వచ్చే సీజన్లో వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగుతారు. ఓవరాల్‌గా బోపన్న–ఎబ్డెన్ జంట ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌తో కలిపి నాలుగు ఏటీపీ టోరీ్నల్లో టైటిల్స్ గెల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సాధించింది. -
సినెర్ అలవోకగా...
ట్యూరిన్ (ఇటలీ): సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ సూపర్‌స్టార్ యానిక్ సినెర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ వరుసగా రెండో విజయం సాధించాడు. ‘ఇలీ నస్టాసే గ్రూప్’లో భాగంగా టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. ఈ విజయంతో సినెర్‌కు సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైంది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక్కో సెట్లో ఒక్కోసారి ఫ్రిట్జ్ సర్వీస్‌ను సినెర్ బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచాడు. 21 విన్నర్స్ కొట్టిన అతను 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ ఏడు ఏస్‌లతో రాణించినా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. 20 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 31 అనవసర తప్పిదాలు చేశాడు. ‘జాన్ న్యూకోంబ్ గ్రూప్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ తొలి విజయం నమోదు చేసుకున్నాడు. ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–3, 7–6 (10/8)తో గెలుపొందాడు. గంటా 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 10 ఏస్‌లు సంధించాడు. రెండుసార్లు రుబ్లెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ 33 విన్నర్స్‌తో అలరించాడు. బోపన్న జోడీకి మరో ఓటమి ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మ్యాట్ పావిచ్ (క్రొయేíÙయా) జంటతో జరిగిన మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 5–7, 3–6తో ఓడిపోయింది. -
మెద్వెదెవ్ విజయం
ట్యూరిన్ (ఇటలీ): టాప్ టెన్నిస్ స్టార్ల మధ్య జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్లో రష్యా ప్లేయర్ డానిలి మెద్వెదెవ్ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలిచి గట్టెక్కాడు. మంగళవారం జరిగిన పోరులో మెద్వెదెవ్ 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో వరుస సెట్లలో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో కంగుతిన్న రష్యన్ స్టార్ ఈ సారి ఆ పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే తన రాకెట్‌కు పదును పెట్టిన మెద్వెదెవ్ ఆస్ట్రేలియా ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించాడు. ఆసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టాప్–8 ర్యాంకింగ్ ప్లేయర్లను గ్రూపులో నలుగురు చొప్పున విభజించి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ సీజన్ ముగింపు టోర్నీని నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి తొలిరెండు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు. గురువారం జరిగే పోటీల్లో సినెర్‌తో మెద్వెదెవ్, ఫ్రిట్జ్‌తో డి మినార్ తలపడతారు. మరో గ్రూప్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొందాడు. డబుల్స్ పోరులో ఏడో సీడ్ హ్యారి హెలియోవార (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జోడీ 7–6 (8/3), 7–5తో ఆస్ట్రేలియాకు చెందిన ఐదో సీడ్ జోర్డాన్ థాంప్సన్–మ్యాక్స్ పుర్సెల్ జంటపై గెలుపొందింది. -
ఫైనల్లో రుత్విక–రోహన్ జంట
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్‌కు దూసుకెళ్లింది. గచ్చి»ౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో శనివారం రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–16, 21–13తో అమృత–సూర్య (భారత్) జోడీపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్ కాటం తరుణ్ రెడ్డి ఫైనల్లో అడుగు పెట్టాడు.సెమీస్‌లో తరుణ్ 14–21, 21–13, 21–14తో తెలంగాణకే చెందిన రుషీంద్ర తిరుపతిపై గెలిచాడు. మరో సెమీస్‌లో రితి్వక్ సంజీవి సతీశ్ కుమార్ (భారత్) 21–18–21–13తో మైరాబాలువాంగ్ మైస్నమ్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఇషారాణి బారువా (భారత్) 15–21, 21–18, 21–11తో అనుపమా ఉపాధ్యాయ్ (భారత్)పై, రక్షిత శ్రీ సంతోష్ రామరాజ్ (భారత్) 21–11, 21–17తో అన్మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టారు.పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–12, 14–21, 21–18తో సూరజ్–ధ్రువ్ రావత్ (భారత్) జంటపై, పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జోడీ 21–18, 21–19తో హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జంటపై గెలిచి టైటిల్ ఫైట్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రియ–శృతి (భారత్) ద్వయం 21–10, 21–18తో ప్రగతి–విశాఖ (భారత్) జంటపై, ఆరతి సారా–వర్షిణి (భారత్) జోడీ 21–13, 16–21, 21–15తో అమృత–సోనాలీ (భారత్)ద్వయంపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. -
జొకోవిచ్ దూరం
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఈసారి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 10 నుంచి 17 వరకు ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. గాయం కారణంగా తాను ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనడంలేదని ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మంగళవారం ప్రకటించాడు. ‘ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడటంలేదు. నా ఆట చూసేందుకు ప్రణాళికలు చేసుకున్న వారికి క్షమించాలని కోరుతున్నాను. ఈ టోరీ్నలో ఆడబోతున్న ఆటగాళ్లందరికీ నా తరఫున శుభాకాంక్షలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని జొకోవిచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. ఏడుసార్లు విజేతగా... 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను జొకోవిచ్ ఏడుసార్లు (2008, 2012, 2013, 2014, 2015, 2022, 2023) సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (6 సార్లు) పేరిట ఉన్న రికార్డును గత ఏడాది జొకోవిచ్ బద్దలు కొట్టాడు. 37 విజయాలతో ముగింపు... ఇప్పటికే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన జొకోవిచ్ ఈ ఏడాది తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఒలింపిక్స్ వ్యక్తిగత సింగిల్స్ స్వర్ణ పతకాన్ని అతను ‘పారిస్’లో అందుకున్నాడు.వింబుల్డన్ టోర్నీలో, షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది జొకోవిచ్ 37 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 44,21,916 డాలర్ల (రూ. 37 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు. -
సబలెంక శుభారంభం
రియాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫైనల్స్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ అరైనా సబలెంక (బెలారస్) శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్ పోరులో సబలెంక 6–3, 6–4తో చైనా స్టార్, ఏడో సీడ్ జెంగ్ కిన్వెన్ను వరుససెట్లలో ఓడించింది. రెండు సెట్లలోనూ టాప్‌సీడ్ జోరుకు ఎదురే లేకుండాపోయింది. చైనా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంక గంటా 24 నిమిషాల్లో మ్యాచ్ గెలిచింది. నంబర్‌వన్ ప్లేయర్ 3 ఏస్‌లు సంధించి ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేయగా, జెంగ్ కిన్వెన్ 4 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 8 ఏస్‌లు సంధించినప్పటికీ టాప్‌సీడ్ జోరుకు చతికిలబడింది. ఓవరాల్‌గా వీళ్లిద్దరు ముఖాముఖిగా తలపడిన ఐదుసార్లు కూడా బెలారస్ స్టారే విజయం సాధించింది. ఈ ఏడాదే నాలుగుసార్లు చైనా ప్రత్యర్థిని ఓడించింది. ఈ సీజన్లో ఆ్రస్టేలియా ఓపెన్ ఫైనల్లో కిన్వెన్ను ఓడించి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సబలెంక... యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్‌కు ఇంటిదారి చూపింది. ఇటీవల సొంతగడ్డ వూహాన్‌లోనూ కిన్‌వెన్‌కు సబలెంక చేతిలో నిరాశే ఎదురైంది. ఈ గ్రూప్‌లోని తర్వాతి రెండు మ్యాచ్‌లలో జాస్మిన్ పావొలిని, ఎలెనా రైబాకినాలపై గెలిస్తే సబలెంక వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. -
‘డైమండ్’ మెరుపులకు ‘సై’
బ్రసెల్స్ (బెల్జియం): అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అగ్రశ్రేణి అథ్లెట్లంతా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ పతకాలతో మెరిసిన ఆటగాళ్లంతా మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నారు. పోటీ పడేందుకు ఈ ఏడాది మొత్తం 14 డైమండ్ లీగ్ సిరీస్‌లు అందుబాటులో ఉండగా... తాము ఎంచుకున్న సిరీస్‌లలో పాల్గొనడం ద్వారా సాధించిన పాయింట్లతో ఆటగాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి మొత్తం 32 అంశాల్లో పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్), అమెరికా స్ప్రింటర్ ష కారీ రిచర్డ్సన్, స్టార్ హర్డ్లర్ సిడ్నీ మెక్‌లాలిన్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఫెయిత్ కిపైగాన్ లాంటి టాప్ ప్లేయర్లు ఫైనల్లో బరిలోకి దిగుతున్నారు. లెట్సిల్ టె»ొగో (బోట్స్వానా), ర్యాన్ క్రూజర్, యరస్లొవా మహుచుక్ తదితరులు కూడా తుది సమరంలో పోటీ పడుతున్నారు.ఓవరాల్‌గా 18 మంది ఒలింపిక్ విజేతలు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటం విశేషం. 50 వేల సామర్థ్యం గల కింగ్ బౌదిన్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ విజేతగా నిలిచిన వారికి డైమండ్ లీగ్ ట్రోఫీతో 30 వేల డాలర్ల ప్రైజ్‌మనీ, వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. అగ్రశ్రేణి అథ్లెట్ల ఆటతో రెండు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మరింత వినోదం ఖాయం. నేడు సాబ్లే... రేపు నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్స్ పోటీ పడుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో జాతీయ రికార్డు సాధించిన అవినాశ్ సాబ్లే ఈ పోటీల్లో బరిలో నిలిచాడు. నేటి రాత్రి 12.30 గంటలకు అతని ఈవెంట్ మొదలవుతుంది. ఈ ఏడాది పారిస్, సిలేసియాలలో జరిగిన సిరీస్‌లలో పాల్గొన్న సాబ్లే మొత్తం 3 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 12 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. అయితే తనకంటే మెరుగైన స్థానంలో నిలిచిన నలుగురు అథ్లెట్లు తప్పుకోవడంతో సాబ్లేకు చాన్స్ లభించింది. మరోవైపు భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. దోహా, లుసాన్ సిరీస్‌లలో పాల్గొన్న అతను మొత్తం 14 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానం సాధించాడు. గత ఏడాది డైమండ్ లీగ్‌లో చోప్రా రన్నరప్‌గా నిలిచాడు. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి నీరజ్ చోప్రా ఈవెంట్ జరుగుతుంది. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)లో జరిగిన 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా విజేతగా... యూజీన్ (అమెరికా)లో జరిగిన 2023 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ రన్నరప్‌గా నిలిచాడు. -
నేడే ‘ఫైనల్’ కూత...
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. గచ్చిబౌ లి ఇండోర్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ పోరుతో పదో సీజన్‌కు తెర పడనుంది. తొలిసారి తుది సమరానికి చేరుకున్న హరియాణా స్టీలర్స్‌తో గత ఏడాది రన్నరప్ పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ ఫైనల్‌కు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు జరగ్గా... పుణేరి పల్టన్ రెండోసారి... హరియాణా స్టీలర్స్ తొలిసారి ఫైనల్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతిమ సమరంలో ఏ జట్టు గెలిచినా తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడుతుంది. ఈ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు పుణేరి పల్టన్, హరియాణా స్టీలర్స్ జట్లు ముఖాముఖిగా 14 సార్లు తలపడ్డాయి. 8 సార్లు పుణేరి జట్టు... 5 సార్లు హరియాణా జట్టు గెలుపొందాయి. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. తాజా సీజన్లో నిర్ణీత 22 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పుణేరి జట్టు 17 మ్యాచ్‌ల్లో నెగ్గి, రెండింటిలో ఓడి, మూడింటిని ‘టై’ చేసుకొని 96 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచి నేరుగా సెమీఫైనల్ చేరుకుంది. మరోవైపు హరియణా 70 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్–2లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి, సెమీఫైనల్ చేరిన హరియాణా ఈ కీలక పోరులో 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్ ఈ సీజన్లో అత్యధికంగా 117 రెయిండింగ్ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్ విభాగంలో మొహమ్మద్ రెజా 97 ట్యాకిల్ పాయింట్లు సంపాదించాడు. పుణేరి పల్టన్ జట్టు కెపె్టన్ అస్లమ్ ఇనామ్దార్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 164 పాయింట్లతో అదరగొట్టాడు. మరోవైపు హరియాణా స్టీలర్స్ రెయిడర్ వినయ్ ఏకంగా 160 పాయింట్లు కొల్లగొట్టాడు. డిఫెండర్ రాహుల్ 71 పాయింట్లు, కెపె్టన్ జైదీప్ 69 పాయింట్లతో ఆకట్టుకున్నారు. -
ఆనంద ‘ఖేలి’
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్లు టైటిల్ పోరుకు చేరువయ్యాయి. గ్రామ/వార్డు స్థాయి జట్లు ఐదు దశల్లో కొనసాగుతూ చివరిదైన రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. విశాఖ వేదికగా ఈ పోటీలు జరుగుతుండగా 26 జిల్లాల జట్లు తలపడుతున్నాయి. ఒక్క మెన్ క్రికెట్ టైటిల్ పోరు మినహా మిగిలిన వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారం జరగనున్నాయి. మహిళల కేటగిరీలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారమే నిర్వహించనున్నారు. విశాఖలోని ఆరు వేదికల్లో పోటీలు జరుగుతున్నాయి. వైఎస్సార్ బీ గ్రౌండ్‌తో పాటు ఏఎంసీ, స్టీల్ ప్లాంట్ గ్రౌండ్, కేవీకే గ్రౌండ్లలో క్రికెట్ పోటీలు జరుగుతుండగా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలకు ఏయూ, బ్యాడ్మింటన్ పోటీలకు జీవీఎంసీ ఇండోర్ ఎన్క్లేవ్లు వేదికలుగా నిలిచాయి. ఖోఖో పురుష, మహిళా విభాగాల్లో ఆదివారం ప్రీక్వార్టర్ ఫైనల్స్ ముగియగా విజయం సాధించిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన అన్ని పోటీలూ సోమవారం పూర్తికానున్నాయి. మహిళా క్రికెట్లో తొలి సెమీస్ ముగియగా రెండో సెమీస్ జరగనుంది. విజయం సాధించిన జట్లు ఫైనల్స్ సోమవారం ఆడనున్నాయి. పురుషుల క్రికెట్ విభాగంలో రెండు జట్లు సెమీస్‌కు చేరుకోగా మరో రెండు క్వార్టర్‌ఫైనల్స్ జరగాల్సి ఉంది. గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించిన జట్లతో తలపడనున్నాయి. అనంతరం ఫైనల్స్ ఈనెల 13న రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. బ్యాడ్మింటన్ పురుష, మహిళా విభాగాల్లో సెమీస్‌లో విజయం సాధించిన జట్లు సోమవారం ఫైనల్స్ ఆడనున్నాయి. వాలీబాల్ మహిళా, పురుష విభాగాల్లోనూ రెండేసి జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా విజయం సాధించినవి ఫైనల్స్‌లో తలపడనున్నాయి. మొత్తమ్మీద పురుష క్రికెట్ మినహా.. మిగతా అన్ని క్రీడాంశాలను సోమవారంతో ముగించాలని నిర్వాహకులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఐదు క్రీడాంశాల్లో విజేతలతోపాటు రన్నరప్, సెకండ్ రన్నరప్ జట్లు ట్రోఫీలతోపాటు భారీ నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. -
9 నుంచి ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ తుదిఘట్టానికి చేరుకుంది. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఐదుదశల పోటీల్లో దిగ్విజయంగా నాలుగింటిన దాటుకుని ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా విజయగీతిక మోగించనుంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజి్రస్టేషన్లతో ఆడుదాం ఆంధ్రా రికార్డు సృష్టించింది. గ్రామ/వార్డు సచివాలయం, మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. 8 క్రీడా మైదానాల ఎంపిక ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ ఫైనల్స్ కోసం విశాఖలో ఎనిమిది క్రీడా మైదానాలను తాత్కాలికంగా గుర్తించారు. క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం, ఆంధ్ర మెడికల్ కాలేజీ, జీవీఎంసీ ఇందిరాప్రియదర్శిని, డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని గ్రౌండ్–బి, బ్యాడ్మింటన్ పోటీలను జీవీఎంసీ ఇండోర్ స్టేడియం, వాలీబాల్ పోటీలను ఆంధ్ర యూనివర్సిటీ అవుట్డోర్, కబడ్డీని ఏయూ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాల్స్, ఖోఖోను ఏయూ జిమ్నాజియం అవుట్‌డోర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించింది. పారదర్శకంగా నగదు బహుమతుల ప్రదానం 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి కాంపిటీటివ్ క్రీడలతోపాటు నాన్–కాంపిటీటివ్‌లో సంప్రదాయ మారథాన్, టెన్నీకాయిట్, యోగాలోను పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 38,08,741 మంది క్రీడాకారులు (23,81,621 మంది పురుషులు, 14,27,120 మంది మహిళలు) నమోదు చేసుకున్నారు. ఇందులో గ్రామ/వార్డు స్థాయిలో మొత్తం 24,46,538 మంది క్రీడాకారులు (13,92,764 మంది పురుషులు, 10,53,774 మంది మహిళలు) పాల్గొన్నారు. వారిలో మండల స్థాయికి 17,10,456 మంది క్రీడాకారులు (8,55,228 మంది పురుషులు, 8,55,228 మంది మహిళలు) పోటీపడ్డారు. వారిలో 85,842 మంది క్రీడాకారులు (42,921 మంది పురుషులు, 42,921 మంది మహిళలు) నియోజకవర్గస్థాయిలో సత్తాచాటారు. నియోజకవర్గస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన జట్లకు (51,164 మంది క్రీడాకారులు పాల్గొంటే 28,513 మంది విజేతలు) నగదు బహుమతులు పొందారు. జిల్లాస్థాయి పోటీల అనంతరం ఫైనల్స్‌కు 1,482 మంది పురుషులు, 1,482 మంది మహిళలు.. మొత్తం 2,964 మంది అర్హత సాధించారు. ఆయా క్రీడల్లో తొలి మూడుస్థానాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పారదర్శకంగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బహుమతులను జమచేసేందుకు శాప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
ISSF World Cup 2024: ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
భారత షూటర్ దివ్యాంశ్ సింగ్ పన్వర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కైరోలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోరీ్నలో ఆదివారం జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల దివ్యాంశ్ 253.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకం నెగ్గాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో చైనా షూటర్ షెంగ్ లిహాయో 253.3 పాయింట్ల తో నెలకొల్పిన ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. -
జొకోవిచ్ రికార్డు విజయం
టురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా 36 ఏళ్ల జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–3తో నెగ్గి ఈ టోర్నీని రికార్డుస్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్న తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. గతంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు విన్నర్స్ ట్రోఫీతోపాటు 44,11,500 డాలర్ల (రూ. 36 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015, 2022లలో కూడా ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో చాంపియన్ గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడా ది జొకోవిచ్ ఏడు టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, యూఎస్ ఓపెన్, పారిస్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ సాధించాడు. కెరీర్లో 98వ సింగిల్స్ టైటిల్‌తో జొకోవిచ్ టెన్నిస్ చరిత్రలో 400 వారాలు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్‌లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్‌ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరులో భారత్‌తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్‌తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్‌తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్‌కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్‌కతా: ఐదుసార్లు వరల్డ్‌కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్‌వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్‌లోనే భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్‌టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్‌కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్‌తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్‌లోనే వార్నర్ 3 సిక్స్‌లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్‌లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్‌పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్‌ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్‌లో లబుõÙన్ (18), మ్యాక్స్‌వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్‌గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్‌తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్‌వుడ్ 3; బవుమా (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్‌వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్‌వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 1; ఇన్‌గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
‘ఫినిషింగ్ టచ్’ ఎవరిదో?
కాన్కున్ (మెక్సికో): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగిన టోర్నీల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన క్రీడాకారిణులు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించారు. నవంబర్ ఐదో తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి మెక్సికోలోని కాన్కున్ నగరం ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎనిమిదో ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలగడంతో సాకరికి ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ‘బాకలార్ గ్రూప్’లో సబలెంకా, రిబాకినా, పెగూలా, సాకరి... ‘చెటుమల్ గ్రూప్’లో స్వియాటెక్, కోకో గాఫ్, జబర్, వొండ్రుసోవా ఉన్నారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. గత ఏడాది రన్నరప్ సబలెంకా ఈసారి ఫైనల్ చేరితే ఆమె ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తుంది. ఈ సంవత్సరం సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి, యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో, వొండ్రుసోవా వింబుల్డన్ టోర్నీలో, కోకో గాఫ్ యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 90 లక్షల డాలర్లు (రూ. 75 కోట్లు). పార్టిసిపేషన్ ఫీజు రూపంలో ఎనిమిది మందికి 1,98,000 డాలర్ల (రూ. కోటీ 65 లక్షలు) చొప్పున లభిస్తాయి. లీగ్ దశలో ఒక్కో విజయానికి అదనంగా 1,98,000 డాలర్లు (రూ. కోటీ 65 లక్షలు) అందజేస్తారు. ఈ టోర్నీలో అజేయంగా విజేతగా నిలిచిన క్రీడాకారిణి 30,24,000 డాలర్లు (రూ. 25 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంటుంది. -
Asia cup : 11వ సారి ఫైనల్లోకి.. టైటిల్ కోసం టీమిండియాతో పోరు
కొలంబో: ఆసియా కప్ ఫైనల్ మరోసారి భారత్, శ్రీలంక మధ్య జరగనుంది. గురువారం హోరాహోరీగా సాగిన ‘సూపర్–4’ మ్యాచ్‌లో లంక 2 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి ఈ టోర్నీలో 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో చివరకు లంకదే పైచేయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ముందుగా 45 ఓవర్లకు, ఆ తర్వాత 42 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్ (40 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒకదశలో జట్టు స్కోరు 130/5 కాగా... రిజ్వాన్, ఇఫ్తికార్ ఆరో వికెట్‌కు 108 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం లంక లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ ద్వారా 42 ఓవర్లలో 252 పరుగులుగా నిర్దేశించారు. లంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు సాధించి గెలిచింది. కుశాల్ మెండిస్ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), సదీరా సమరవిక్రమ (51 బంతుల్లో 48; 4 ఫోర్లు), అసలంక (47 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో శ్రీలంక నాలుగు పాయింట్లతో ‘సూపర్–4’ దశలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) మదుషన్ (బి) పతిరణ 52; ఫఖర్ (బి) మదుషన్ 4; బాబర్ (స్టంప్డ్) మెండిస్ (బి) వెలలాగె 29; రిజ్వాన్ (నాటౌట్) 86; హారిస్ (సి అండ్ బి) పతిరణ 3; నవాజ్ (బి) తీక్షణ 12; ఇఫ్తికార్ (సి) షనక (బి) పతిరణ 47; షాదాబ్ (సి) మెండిస్ (బి) మదుషన్ 3; షాహిన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (42 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–9, 2–73, 3–100, 4–108, 5–130, 6–238, 7–243. బౌలింగ్: మదుషన్ 7–1–58–2, తీక్షణ 9–0–42–1, షనక 3–0–18–0, వెలలాగె 9–0–40–1, పతిరణ 8–0–65–3, ధనంజయ 6–0–28–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి అండ్ బి) షాదాబ్ 29; పెరీరా (రనౌట్) 17; మెండిస్ (సి) హారిస్ (బి) ఇఫ్తికార్ 91; సమరవిక్రమ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) ఇఫ్తికార్ 48; అసలంక (నాటౌట్) 49 ; షనక (సి) నవాజ్ (బి) ఇఫ్తికార్ 2; ధనంజయ (సి) వసీమ్ (బి) షాహిన్ 5; వెలలాగె (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 0; మదుషన్ (రనౌట్) 1; పతిరణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (42 ఓవర్లలో 8 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–20, 2–77, 3–177, 4–210, 5–222, 6–243, 7–243, 8–246. బౌలింగ్: షాహిన్ 9–0–52–2, జమాన్ 6–1–39–0, వసీమ్ 3–0–25–0, నవాజ్ 7–0–26–0, షాబాద్ 9–0–55–1, ఇఫ్తికార్ 8–0–50–3. -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్‌ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్‌కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
విదిత్ సంచలనం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్, రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్‌ని షితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విదిత్ 4–2తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించగా ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించారు. ఈ రెండింటిలో విదిత్ గెలుపొందడం విశేషం. తొలి గేమ్‌లో 60 ఎత్తుల్లో గెలిచిన విదిత్ రెండో గేమ్‌లో 52 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో విదిత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఈ టోర్నీలో నాలుగో భారత ప్లేయర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ఇప్పటికే ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్ చేరారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌లలో కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో విదిత్; ప్రజ్ఞానందతో అర్జున్; కరువానా (అమెరికా)తో లీనియర్ (అమెరికా) తలపడతారు. హారిక ఓటమి మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో హారిక 3.5–4.5తో అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. వీరిద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌లో గోర్యాచ్కినా, రెండో గేమ్‌లో హారిక గెలిచారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం నిర్వహించిన రెండు గేమ్‌లు ‘డ్రా’ కావడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో గోర్యాచ్కినా 43 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 95 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’
లండన్: రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం నొవాక్ జొకోవిచ్... కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్... ఆదివారం జరిగే వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) గంటా 50 నిమిషాల్లో 6–3, 6–3, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 2 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 7–6 (7/4)తో ఆరో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)పై విజయం సాధించారు. జొకోవిచ్ తన కెరీర్లో 35వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... అల్కరాజ్కిది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుంది. అల్కరాజ్ గత ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సినెర్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 17 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొమ్మిదోసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన జొకోవిచ్ ఏడుసార్లు విజేతగా నిలిచాడు. మెద్వెదెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ నాలుగు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 28 సార్లు పాయింట్లు నెగ్గాడు. తన సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ స్పెయిన్ స్టార్ మెద్వెదెవ్ సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
గుజరాత్ గ్రేట్ చెన్నై తోపు ...
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
చెన్నైVS గుజరాత్
-
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
IPL Final: వాన వచ్చె... వాయిదా పడె
ఐపీఎల్–2023 విజేత ఎవరో తేలేందుకు మరో రోజు వేచి చూడాల్సిందే. ఫైనల్ కోసం మైదానంలో లక్షకు పైగా ఉన్న అభిమాన సందోహం సరిపోదన్నట్లుగా నేనూ ఉన్నానంటూ వరుణ దేవుడు వచ్చేయడంతో అంతా మారిపోయింది. టాస్ సమయానికి అరగంట ముందు మొదలైన వాన నిరంతరాయంగా కురవడంతో ఆటకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఎంత ఎదురు చూసినా వర్షం తెరిపినివ్వలేదు. దాంతో ఆదివారం జరగాల్సిన తుది పోరును సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్ డే అయిన నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కోసం తలపడతాయి. అన్నట్లు సోమవారం కూడా 10 శాతం వర్ష సూచన ఉంది. అయితే ఏమాత్రం వర్షసూచన లేని ఆదివారమే ఇలా జరిగితే సోమవారం ఏం జరుగుతుందనేది ఆసక్తికరం! అహ్మదాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో మొత్తం 73 మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్ వర్షం బారిన పడి రద్దు కాగా, మరో మ్యాచ్‌లో వర్షం ఆటంకం కలిగించినా ఒక్క బంతి కూడా వృథా కాలేదు. కానీ అసలైన అంతిమ సమరం సమయానికి మాత్రం వరుణుడు పూర్తి ప్రతాపం చూపించాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫైనల్ పోరుకు అడ్డుగా నిలిచాడు. మండు వేసవిలో అహ్మదాబాద్‌లో వర్షం అంటే అలా కొద్దిసేపు వచ్చి పోయే చినుకుల్లా అందరూ భావించినా ఆదివారం మాత్రం అలా జరగలేదు. చివరకు ఫైనల్ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. సాయంత్రం 6.30 సమయంలో స్వల్పంగా వాన మొదలైంది. ఆ తర్వాతి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. కవర్లు కప్పడం, తొలగించడం మళ్లీ మళ్లీ జరిగాయి. 9 గంటల సమయంలో మాత్రం వాన పూర్తిగా తగ్గిపోయింది. దాంతో అంపైర్లతో పాటు ఇరుజట్ల ఆటగాళ్లు, కోచ్‌లు మైదానంలోకి వచ్చారు. అంతా పిచ్‌ను, అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించడంతో పాటు వామప్ కూడా మొదలైంది. అయితే ఒక్కసారిగా వాన జోరందుకోవడంతో అంతా పరుగెడుతూ గ్రౌండ్ వీడారు. ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు వేచి చూసినా ఫలితం కనిపించలేదు. రాత్రి 9.30కి ఆట ఆరంభమైతే పూర్తి ఓవర్లు సాగేవి. ఆపై ఓవర్ల కోతతోనైనా మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ప్రయత్నించారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలన్నా అర్ధరాత్రి 12.06కు ఆట ఆరంభం కావాలి. దానికి కనీసం గంట ముందుగా వాన ఆగిపోవాలి. అయితే అనుకున్న సమయానికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఇరు జట్ల కోచ్‌లు స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆశిష్ నెహ్రాల ‘షేక్ హ్యాండ్’తో అధికారికంగా ఖాయమైంది. నేడు వాన కురిస్తే... ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలాగైనా ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. -
‘ఫైనల్’ ధమాకా.. సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఈ ఐపీఎల్‌కు ఎవరు శుభం కార్డు వేస్తారో ఈ రాత్రే తేలుతుంది. ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టిన జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరుగనుండటం ఆసక్తికరం.డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ‘డబుల్ ధమాకా’కు సన్నద్ధం కాగా... నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ‘ఫైవ్ స్టార్’ ముంబై సరసన నిలవాలని ఆశిస్తోంది. రెండూ మేటి జట్లే! ఈ సీజన్ అసాంతం గట్టి పోరాటాలే చేశాయి. ఓపెనర్ల మెరుపులే ఇరు జట్లను శాసిస్తున్నాయి. మరి ఈ ఫైనల్లో ఎవరి మెరుపులు విజయాన్నిస్తాయో ఈ ‘సూపర్ సండే’ రోజు చూసేయండి. అహ్మదాబాద్: తొలి క్వాలిఫయర్ చూశాం కదా... మళ్లీ చూద్దాం ‘ఫైనల్’గా! ఎందుకంటే ఆ మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), గుజరాత్ టైటాన్స్ మధ్యే టైటిల్ పోరు జరుగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ఆల్‌రౌండ్ సమతూకంతో ఉన్న జట్ల మధ్యే అమీతుమీ జరగనుండటం... టాపార్డర్‌లో హిట్టర్లుండటంతో నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల విందు ఖాయం. టైటాన్స్ తమ సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకునేందుకు తహతహలాడుతోంది. శుబ్‌మన్ గిల్ సంచలన శతకాలు, బౌలర్ల వెన్నుదన్ను జట్టును మరో మెట్టుపై నిలబెడుతోంది. అలాగని సూపర్ కింగ్స్‌ను తక్కువ చేయలేం. కీలకమైన మ్యాచ్‌ల్లో ధోని మార్క్ సారథ్యం జట్టుకు అదనపు ‘ఇంపాక్ట్’ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫైనల్ ఫైనలే! ఎవరూ తగ్గేదేలే! ధోని అనుభవం గెలిపిస్తుందా? ధోని... ధోని... ఇప్పుడంతా ఇదే ఫీవర్. వచ్చే సీజన్ ఆడేది లేనిది ఇప్పుడైతే చెప్పలేదు కానీ. ట్రోఫీ గెలిస్తే మాత్రం విజయంతో నిష్క్రమించే అవకాశాలైతే ఉన్నాయి. అందుకేనేమో ఇర్ఫాన్ పఠాన్‌లాంటి గుజరాతీలు సైతం దిగ్గజ కెప్టెన్ ఉన్న సూపర్ కింగ్సే గెలవాలని మనసారా కోరుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేల శుభారంభమిస్తే... దీనికి అజింక్య రహానే, శివమ్ దూబే మెరుపులు తోడయితే చెన్నై భారీస్కోరుకు ఢోకానే ఉండదు. డెత్ ఓవర్లను కాచుకునేందుకు మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో తీక్షణ, పతిరణ తుషార్ దేశ్‌పాండే, దీపక్ చహర్‌లు ధోని నమ్మకాన్ని నిలబెడుతున్నారు. ధోనికిది 11వ ఐపీఎల్ ఫైనల్. (చెన్నై తరఫున పదోది) అయితే చెన్నైకిది మింగుడు పడని వేదిక అహ్మదాబాద్. ఇక్కడ ఆడిన మూడుసార్లూ చెన్నై ఓడిపోయింది. ఇదొక్కటే జట్టుకు మైనస్! అచ్చొచ్చే సొంతగడ్డపై... ప్లే ఆఫ్స్‌లో గుజరాత్... చెన్నైతో వెనుకబడినప్పటికీ రెండో క్వాలిఫయర్‌లో ఐదుసార్లు చాంపియన్ ముంబైని మట్టికరిపించింది. శుబ్‌మన్ గిలే జట్టు బలం. ఈ సీజన్లో మూడు సెంచరీలతో జోరుమీదున్నాడు. కలిసొచ్చే అహ్మదాబాద్ వేదికపై మళ్లీ చెలరేగినా ఆశ్చర్యమైతే లేదు. ఎందుకంటే ఇక్కడే గుజరాత్ తొమ్మిదింట ఆరు మ్యాచుల్లో గెలిచింది. సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిల్లర్లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే... షమీ (28 వికెట్లు), రషీద్ ఖాన్ (27 వికెట్లు), మోహిత్ శర్మ (24 వికెట్లు)లతో బౌలింగ్ దళం కూడా దీటుగా ఉంది. పర్పుల్ క్యాప్ రేసులో ఈ ముగ్గురే ఉన్నారు. 9 ఇప్పటి వరకు జరిగిన 15 ఐపీఎల్ ఫైనల్స్‌లో తొమ్మిదిసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఆరుసార్లు ఛేజింగ్ చేసిన జట్టు చాంపియన్‌గా అవతరించింది. 3 నేటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) జట్ల తర్వాత వరుసగా రెండేళ్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. 0 ఇప్పటి వరకు 15 ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా ఒక్కసారీ ఆలౌట్ కాలేదు. 5 మొత్తం ఐపీఎల్ ఫైనల్స్‌లో ఐదుసార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేశాయి. రూ. 20 కోట్లు ఐపీఎల్ విజేత జట్టుకు లభించే ప్రైజ్‌మనీ. రూ. 13 కోట్లు ఐపీఎల్లో రన్నరప్‌గా నిలిచే జట్టుకు లభించే మొత్తం. తుది జట్లు (అంచనా) గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, మిల్లర్, తెవాటియా, విజయ్ శంకర్/జోష్ లిటిల్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రుతురాజ్, కాన్వే, శివమ్ దూబే/పతిరణ, రహానే, రాయుడు, జడేజా, మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్, తీక్షణ. పిచ్, వాతావరణం ఈ సీజన్లో నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల మోత మోగింది. 8 మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 193. ఇందులో ఐదుసార్లు మొదట బ్యాటింగ్ చేసి జట్లే గెలిచాయి. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. -
ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్.. సింధు కథ ముగిసే
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది. అయితే పురుషుల విభాగంలో మాత్రం స్టార్ షట్లర్ హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం. ఫామ్‌లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్‌ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్‌తో అతడు తలపడనున్నాడు. sportsmanship 👏🏻 hopefully it’s nothing serious ;( have a good recovery cea! pic.twitter.com/sEVL2eP8Di— bobe (@bobeside) May 27, 2023 Former champion Pusarla V. Sindhu 🇮🇳 faces Gregoria Mariska Tunjung 🇮🇩.#BWFWorldTour #MalaysiaMasters2023 pic.twitter.com/sbDIsKZ1lq— BWF (@bwfmedia) May 27, 2023 #BWF | Komentar dan pesan menyentuh dari Prannoy H.S. yang jadi saksi tumbangnya Christian Adinata karena cedera. Prannoy juga yang pertama datang untuk menenangkan CeA setelah terjatuh di lapangan. Respect Prannoy! Good luck for the final!! 🙏🏼❤️ pic.twitter.com/JP2LZSwVwo— SPOTV Indonesia (@SPOTV_Indonesia) May 27, 2023 చదవండి: 'త్వరలో మిమ్మల్ని కలుస్తా'.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ -
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
#MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే!
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్‌ను గెలిచి కానీ వెళ్లలేదు. అత్యధికసార్లు ఫైనల్ చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించినా.. ఆ జట్టు నాలుగుసార్లు ఛాంపియన్‌గా.. ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. కానీ ముంబై అలా కాదు.. నిష్క్రమిస్తే లీగ్ స్టేజీ.. లేదా ప్లేఆఫ్స్‌లో.. కానీ ఒక్కసారి ఫైనల్‌కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా.. ఐపీఎల్లో ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌ది ఒకేరకమైన ఆటతీరు. తొలి రెండు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపని ముంబై 2010లో మాత్రం తొలిసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2011, 2012ల్లో ప్లేఆఫ్స్‌కు పరిమితమైంది. 2013లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్ ఆటతీరు అక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. అలా 2015, 2017, 2019 ఇలా బేసి సంఖ్య విధానంలో నాలుగుసార్లు ఛాంపియన్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్.. ODD Yearsలోనే కప్ కొడుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం కరెక్ట్ కాదని చెబుతూ 2020లో ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్. ఆరంభంలో వరుస ఓటములు.. తర్వాత ఫుంజుకొని ఛాంపియన్‌గా ఏ సీజన్ అయినా ముంబై ఇండియన్స్ తొలి అంచె పోటీల్లో ఎక్కువగా ఓటములను చవిచూస్తూనే వచ్చింది. ఛాంపియన్‌గా నిలిచిన ఐదు సందర్భాల్లో నాలుగుసార్లు సీజన్‌ను ఓటములతోనే ఆరంభించింది. మొదట వరుసగా ఓటములు.. మధ్యలో ఫుంజుకొని విజయాలతో బలంగా తయారవుతుంది. ప్రతీ సీజన్లో ఇదే స్ట్రాటజీతో కనిపించే ముంబై ఇండియన్స్ ఈసారి కూడా అదే ఆటతీరు కనబరిచింది. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్ఆర్హెచ్పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. ప్లేఆఫ్‌కు వస్తే చాలు ఎక్కడలేని బలం.. ప్లేఆఫ్‌కు వచ్చిందంటే ముంబైలో ఎక్కడలేని బలం వస్తోంది. ప్రత్యర్థి జట్టు బలహీనతను ఆసరాగా చేసుకొని వారిని కోలుకోలేని దెబ్బతీసి విజయం సాధించడం ముంబై స్ట్రాటజీ. లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై అదే చేసింది. క్వాలిఫయర్-2లో గుజరాత్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిందో ఆరోసారి టైటిల్ కొట్టేందుకు శతవిధాల ప్రయత్నిచడం ఖాయం. అందుకే ముంబై ఇండియన్స్‌ను క్వాలిఫయర్-2లోనే గుజరాత్ ఆపాలని సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిసింది. A MI-ghty special victory! 😎 The Mumbai Indians win by 81 runs and progress to the #Qualifier2 of #TATAIPL 2023 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/77zW6NmInn — IndianPremierLeague (@IPL) May 24, 2023 📍Next Stop: Ahmedabad ✈#LSGvMI #TATAIPL #IPLonJioCinema #MumbaiIndians | @mipaltan pic.twitter.com/TRp8f0vugT — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్; భలే దొరికాడు కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు! -
ITF Womens Open: ఫైనల్లో అంకితా రైనా
బెంగళూరు: ఐటీఎఫ్ మహిళల ఓపెన్ టోర్నీలో భారత అమ్మాయి, నాలుగో సీడ్ అంకితా రైనా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అంకిత 6–1, 6–1 స్కోరుతో భారత్‌కే చెందిన రుతుజ భోస్లేపై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన టాప్ సీడ్ బ్రెండా ఫ్రుహ్విర్టోవాతో తలపడుతుంది. సెమీస్‌లో 15 ఏళ్ల ఫ్రుహ్విర్టోవా 7–6 (7/2), 6–2 తేడాతో దలీలా జకుపోవిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో భాగంగా ఈ టోర్నమెంట్ జరుగుతోంది. -
Sakshi Premier League 2023: ఫైనల్లో ఎస్ఆర్ఆర్, గౌతమ్ కాలేజీ జట్లు
ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర స్థాయి సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ జూనియర్ విభాగంలో ఎస్ఆర్ఆర్ కాలేజి (మంచిర్యాల), గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. సీనియర్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల), భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫైనల్స్ నేడు జరుగుతాయి. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలోని బాబురావు సాగర్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతోంది. సోమవారం జరిగిన జూనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్ఆర్ కాలేజి తొమ్మిది వికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)పై గెలిచింది. ముందుగా పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం ఎస్ఆర్ఆర్ కాలేజి 7.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసి గెలుపొందింది. ఎస్ఆర్ఆర్ ప్లేయర్ కృష్ణతేజ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి 67 పరుగుల తేడాతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)ను ఓడించింది. ముందుగా గౌతమ్ కాలేజి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 52 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. సీనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో వాగ్దేవి డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజి (ఖమ్మం)పై నెగ్గింది. ముందుగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేయగా... వాగ్దేవి కాలేజి 6 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసి గెలిచింది. సాయి 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. సీనియర్ విభాగం రెండో మ్యాచ్‌లో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి ఐదు వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజిని ఓడించింది. మొదట ఎస్ఆర్బీజీఎన్ఆర్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్ వివేకానంద కాలేజి 6.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి గెలుపొందింది. భవాన్స్ ప్లేయర్ కృతిక్ 17 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. -
రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్
బెంగళూరు: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మాజీ చాంపియన్స్ సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. బెంగళూరులో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును... ఇండోర్‌లో జరిగిన మరో సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌పై గెలుపొందాయి. ఈనెల 16 నుంచి కోల్‌కతాలో జరిగే ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ తలపడతాయి. ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 123/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 234 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌరాష్ట్ర 115 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు బెంగాల్ నిర్దేశించిన 548 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది. -
Novak Djokovic: వరుసగా 27వ విజయం.. పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో
సెర్బియా టెన్నిస్ స్టార్.. వరల్డ్ నెంబర్ ఐదో ర్యాంకర్.. నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కాగా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్స్‌కు వెళ్లడం ఇది పదోసారి. శుక్రవారం అమెరికాకు చెందిన 35వ ర్యాంకర్ టామీ పాల్‌ను 7-5, 6-1,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. తొలి సెట్ నుంచే జొకోవిచ్ బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని జొకోవిచ్ మ్యాచ్ మొత్తంలో ఏడు బ్రేక్ పాయింట్స్ సాధించడం విశేషం. ఇప్పటికే రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్ కొల్లగొట్టిన జొకోవిచ్ 10వ టైటిల్‌పై కన్నేశాడు. అంతేకాదు 21 కెరీర్ గ్రాండ్‌స్లామ్స్‌తో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ప్రతీసారి జొకోవిచ్ టైటిల్ కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌లుగా ఓటమనేదే లేకుండా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో గ్రీక్ టెన్నిస్ స్టార్ సిట్సిపాస్‌తో జొకోవిచ్ అమితుమీ తేల్చుకోనున్నాడు. #AusOpen semifinals: ✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️#AusOpen finals: 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆❓ Will X mark the spot for @DjokerNole on Sunday?@wwos • @espn • @eurosport • @wowowtennis • #AO2023 pic.twitter.com/lcx6Wnm3dT — #AusOpen (@AustralianOpen) January 27, 2023 ఇంటిబాట పట్టిన కచనోవ్.. ఫైనల్‌కు సిట్సిపాస్ అంతకముందు జరిగిన మరో సెమీస్ పోరులో గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెపానోస్ సిట్సిపాస్(ప్రపంచ నాలుగో ర్యాంకర్).. రష్యాకు చెందిన కచనోవ్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో సిట్సిపాస్.. కచనోవ్‌ను 7-6(7-2), 6-4,6-7(8-6), 6-3 తేడాతో మట్టికరిపించాడు. A sizzling semifinal ends in Greek glory 🇬🇷 @steftsitsipas overcomes a valiant Karen Khachanov to reach his first #AusOpen final. It ends 7-6(2) 6-4 6-7(6) 6-3 👏#AO2023 pic.twitter.com/jsik2uaovL — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
‘పసిడి’కి పంచ్ దూరంలో...
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు) పసిడి పతకానికి విజయం దూరంలో నిలిచింది. భోపాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5–0తో శివిందర్ కౌర్ (ఆలిండియా పోలీస్)పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో అనామిక (రైల్వేస్)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం) కూడా ఫైనల్ చేరింది. -
T20 WC 2022: వర్షం కారణంగా సెమీస్ రద్దయితే.. టీమిండియానే విజేత!
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్, ఆ మరుసటి రోజు (నవంబర్ 10) అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్‌లు జరిగే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడితే పరిస్థితి ఏంటన్న డౌట్ అభిమానుల మదిలో మెదలడం ప్రారంభమైంది. దీనికి సమాధానం.. ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిజ్వర్ డే ఉంది. ఒకవేళ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే (సెమీస్) మాత్రం గ్రూప్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అంటే.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో భారత్ ఫైనల్‌కు చేరతాయి. అదే ఫైనల్ విషయానికొస్తే.. టైటిల్ డిసైడర్ మ్యాచ్ షెడ్యూలైన రోజు వర్షం పడితే రిజర్వ్ డేలో, ఆ రోజు కూడా ఆట సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. -
సాత్విక్- చిరాగ్ జోడి సంచలనం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 పురుషుల డబుల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్-చిరాగ్ జంట 21-18, 21-14తో చోయ్ సోల్ గ్యు-కిమ్ వాన్ హో ద్వయం(కొరియా)పై విజయం సాధించింది. 45 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జంట ఆద్యంతం ఆధితప్యం చెలాయించారు. #FrenchOpen2022 #FrenchOpenSuper750 #Badminton Indian pair of Satwiksairaj Rankireddy and Chirag Shetty reaches French Open men's doubles final pic.twitter.com/CZIDpIXM2x — TOI Sports (@toisports) October 29, 2022 కాగా ఈ ఏడాదిలో ఈ జోడికి ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. ఇంతకముందు జనవరిలో ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో ఫైనల్ చేరిన సాత్విక్-చిరాగ్ జోడి టైటిల్ కొల్లగొట్టింది. తాజాగా మరో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌పై కన్నేసింది. కాగా ఈ టోర్నీలో ఎనిమిది మంది భారత షట్లర్లు పాల్గొనగా మిగిలింది ఈ ఒక్క జంట మాత్రమే. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ తో పాటు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యారు. -
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరింది. బెంగళూరులో శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–17, 14–21, 21–16తో షేక్ గౌస్–మనీషా (భారత్) ద్వయంపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో అశ్విని పొన్నప్ప–సాయి ప్రతీక్ (భారత్)లతో సిక్కి–రోహన్ తలపడతారు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో రుత్విక 21–16, 19–21, 21–16తో మాన్సి సింగ్ (భారత్)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో తాన్యా హేమంత్‌తో రుత్విక ఆడుతుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 15–21, 18–21తో చలోంపన్–నాంథకర్న్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
Julius Baer Generation Cup: ఫైనల్లో అర్జున్
న్యూయార్క్: జూలియస్ బేర్ జనరేషన్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ జోరు కొనసాగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. లియెమ్ క్వాంగ్ లీ (వియత్నాం)తో జరిగిన సెమీఫైనల్లో అర్జున్ 4–2తో గెలిచాడు. నిర్ణీత నాలుగు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలువడంతో రెండు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. రెండు టైబ్రేక్ గేముల్లో అర్జున్ విజయం సాధించాడు. టైటిల్ కోసం ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్ (నార్వే)తో అర్జున్ తలపడతాడు. వీరిద్దరి మధ్య రెండు రోజులపాటు నాలుగు గేమ్‌లతో కూడిన రెండు ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
Commonwealth Games 2022: సూపర్ శ్రీజ, శరత్
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్‌లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. -
CWG 2022: అథ్లెటిక్స్ ఫైనల్లో ముగ్గురు...
కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, మొహమ్మద్ అనీస్ యాహియా... మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ శ్రీశంకర్ 8.05 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచాడు. గ్రూప్ ‘బి’లో యాహియా 7.68 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. రెండు గ్రూప్‌ల నుంచి కలిపి టాప్–12లో నిలిచినవారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. షాట్‌పుట్ క్వాలిఫయింగ్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఇనుప గుండును 16.78 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఏడో ర్యాంక్‌తో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఐదో హీట్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 11.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ద్యుతీచంద్ 27వ ర్యాంక్‌లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా!
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్ రేసు ఆదివారం జరగనుంది. కాగా బెంగళూరుకు చెందిన నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన నాలుగో భారత స్విమ్మర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సందీప్ సెజ్వాల్, విరాద్వాల్ కాదేలు ఫైనల్ చేరగా.. 2018లో సాజన్ ప్రకాశ్ ఫైనల్లో అడుగుపెట్టినప్పటికి పతకాలు సాధించలేకపోయారు. మరి ఈసారైనా నటరాజ్ మెరిసి పతకం తెస్తాడని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
HAMBURG OPEN 2022: ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాట్వి మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 6–3, 10–3తో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబాలస్ (అర్జెంటీనా) జంటపై సంచలన విజయం సాధించింది. లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్), టిమ్ పుయెట్జ్ (జర్మనీ)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం తలపడుతుంది. 42 ఏళ్ల బోపన్న తన కెరీర్లో ఇప్పటివరకు 21 డబుల్స్ టైటిల్స్ సాధించగా... ఈ ఏడాది రెండు టోర్నీలలో విజేతగా నిలిచాడు. -
World Athletics Championship: పతకంపై ఆశలు!
యుజీన్ (అమెరికా): 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇప్పటివరకు ఒక్క పతకమే వచ్చింది. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరిగినా భారత్ ఖాతాలో మాత్రం మరో పతకం చేరలేదు. అంతా సవ్యంగా సాగితే ఆదివారం ఉదయం భారత్ ఖాతాలో ఈ మెగా ఈవెంట్ నుంచి మరో పతకం చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత ఆశాకిరణం, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఆశలను రేకెత్తిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశాన్ని ఊపేసిన నీరజ్ చోప్రా ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో తొలి అడ్డంకి దాటాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే జావెలిన్‌ను 83.50 మీటర్ల దూరం విసరాలి లేదంటే ఓవరాల్‌గా టాప్–12లో నిలవాలి. అయితే నీరజ్ తొలి త్రోలోనే 83.50 మీటర్ల లక్ష్య దూరాన్ని అధిగమించాడు. 24 ఏళ్ల నీరజ్ ఈటెను 88.39 మీటర్ల దూరం విసిరి తన కెరీర్లో తొలిసారి ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత పొందాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 13 మంది పాల్గొన్న గ్రూప్ ‘ఎ’లో నీరజ్ అగ్రస్థానాన్ని... ఓవరాల్‌గా రెండో స్థానాన్ని అందుకున్నాడు. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 89.91 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్ జావెలిన్‌ను 80.42 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా 11వ స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది పోటీపడే జావెలిన్ త్రో ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. ట్రిపుల్ జంపర్ పాల్ సంచలనం శుక్రవారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్‌లో 25 ఏళ్ల ఎల్డోజ్ పాల్ 16.68 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్ ‘ఎ’లో ఆరో స్థానంలో, ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ట్రిపుల్ జంపర్‌గా గుర్తింపు పొందాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్ చిత్రావెల్ 17వ స్థానంలో, అబ్దుల్లా అబూబాకర్ 19వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ట్రిపుల్ జంప్ ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు మొదలవుతుంది. సోనీ టెన్–2 చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. ఫైనల్లో నా 100 శాతం ప్రదర్శన ఇస్తా. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి రోజు వేరుగా ఉంటుంది. ఏ రోజు ఎవరు ఎంత దూరం విసురుతారో చెప్పలేం. ఫైనల్‌కు చేరిన 12 మందిలో ఐదారుగురు ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్నారు. – నీరజ్ చోప్రా -
WAC 2022: జావెలిన్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా అథ్లెట్ అన్నూ రాణి శుభారంభం చేసింది. గురువారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ పోటీల్లో అన్నూ రాణి రెండో ప్రయత్నంలో ఈటెను 59.06 మీటర్ల దూరం విసిరి గ్రూఫ్ బిలో 5వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచిన అన్నూ రాణి ఫైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి జావెలిన్ త్రో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో అన్నూ రాణి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. మరి ఈసారైనా పతకం సాధిస్తుందేమో చూడాలి. అంతకముందు ఈటెను తొలి ప్రయత్నంలో 55.32 మీటర్లు విసిరినప్పటికి.. రెండో ప్రయత్నంలో మాత్రం 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక 29 ఏళ్ల అన్నూ రాణి కెరీర్ బెస్ట్ 63.82 మీటర్లుగా ఉంది. జంషెడ్పూర్ వేదికగా ఈ ఏడాది మేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అన్నూ రాణి ఈ ప్రదర్శనను నమోదు చేసింది. ఇక జపాన్‌కు చెందిన హరుకాకిటాగుచి ఈటెను 64.32 మీటర్ల దూరం విసిరి సీజన్ బెస్ట్‌తో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చెందిన షియింగ్ లిహూ(63.86 మీటర్లు), లిథువేనియాకు చెందిన లివేట జాసియునైట్(63.80 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా గ్రూఫ్ ఏ, గ్రూఫ్ బి నుంచి కలిపి 12 మంది ఫైనల్లో పోటీ పడనున్నారు. మహిళల జావెలిన్ త్రో ఫైనల్ జూలై 22న ఉదయం 5 గంటలకు జరగనుంది. చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది' -
Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు అర్జున్ బబూటా, పార్థ్ మఖీజా ఫైనల్లోకి దూసుకెళ్లి పతకాలపై గురి పెట్టారు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. 53 మంది షూటర్ల మధ్య ఆదివారం నిర్వహించిన క్వాలిఫయింగ్‌లో అర్జున్ 630.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో, పార్థ్ 628.4 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారి మధ్య నేడు ఫైనల్ జరగనుంది. -
Wimbledon 2022: నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
ఈసారి వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ అవతరించనుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) నేడు జరిగే ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడనున్నారు. వీరిద్దరికిదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం
పాయింట్ పాయింట్‌కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్లు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్‌ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్కు రెండో సెట్లోనూ ఒక్కో పాయింట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్‌లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్‌ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు. పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్‌ను 7–6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్ నాదల్కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్‌కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్లలో నాదల్కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్‌లో జ్వెరెవ్ తన సర్వీస్‌ను కాపాడుకోగా... 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా) సా. గం. 6:30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు. ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
French Open 2022: తిరుగు లేని స్వియాటెక్
పారిస్: జోరుమీదున్న పోలాండ్ ‘టాప్’స్టార్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లోనూ ఆమె రాకెట్‌కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆమె జైత్రయాత్రలో వరుసగా 34వ విజయం చేరింది. గురువారం జరిగిన పోరులో స్వియాటెక్ వరుస సెట్లలో 6–2, 6–1తో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. రోలాండ్ గారోస్‌లో 2020లో టైటిల్ సాధించిన స్వియాటెక్ తాజాగా మరో ట్రోఫీపై కన్నేసింది. రెండో సెమీస్‌లో అమెరికాకు చెందిన 18వ సీడ్ కోకో గౌఫ్ 6–3, 6–1తో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసాన్ను ఓడించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గౌఫ్‌తో స్వియాటెక్ తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్ దెబ్బకు... టాప్ సీడ్ స్వియాటెక్ ధాటికి రష్యన్ ప్రత్యర్థి నిలువలేకపోయింది. తొలిసెట్ ఆరంభంలో 18 నిమిషాలు మాత్రమే 2–2తో దీటు సాగిన మ్యాచ్ క్షణాల వ్యవధిలోనే ఏకపక్షంగా మారింది. వరుసగా రెండు గేముల్ని గెలిచిన స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో ఆమె సర్వీస్‌ను బ్రేక్ చేసి కసత్కినా షాకిచ్చింది. నాలుగో గేమ్‌ను నిలబెట్టుకుంది. తర్వాత ప్రపంచ నంబర్‌వన్ దూకుడు పెంచింది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురులేని ఆధిక్యాన్ని సాధించింది. వరుసగా నాలుగు గేముల్ని నిమిషాల వ్యవధిలోనే ముగించింది. తొలిసెట్ గెలిచేందుకు 38 నిమిషాలు పట్టగా... రెండో సెట్లో స్వియాటెక్ జోరుకు 26 నిమిషాలే సరిపోయాయి. ఇందులో రష్యన్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రమే తన సర్వీస్‌ను నిలబెట్టుకుంటే... వరుసగా ఐదు గేముల్ని స్వియాటెక్ చకాచకా ముగించింది. 22 విన్నర్లు కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది. 10 విన్నర్స్కే పరిమితమైన కసత్కినా 24 అనవసర తప్పిదాలు చేసింది. తొలిసారి సెమీస్‌లో సిలిచ్ మారిన్ సిలిచ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 33 ఏళ్ల వయసులో ఎర్రమట్టి నేలలో అతని రాకెట్ గర్జించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ క్రొయేషియా ఆటగాడు ఏకంగా 33 ఏస్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ సమరంలో సిలిచ్ 5–7, 6–3, 6–4, 3–6, 7–6 (10/2)తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. 16 ఏళ్లుగా రోలండ్ గారోస్ బరిలోకి దిగుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా క్వార్టర్స్ (2017, 2018) దశనే దాటలేకపోయాడు. ఎనిమిదేళ్ల క్రితం 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన సిలిచ్ మధ్యలో 2017లో వింబుల్డన్, 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచాడు. ఈ రెండు మినహా గ్రాండ్‌స్లామ్ సహా పలు మేజర్ టోర్నీల్లో సీడెడ్ ప్లేయర్‌గా దిగి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. పోరాడి ఓడిన బోపన్న జోడీ పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది. అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. నేడు పురుషుల సెమీ ఫైనల్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) X అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కాస్పర్ రూడ్ (నార్వే) Xమారిన్ సిలిచ్ (క్రొయేషియా) సా. గం. 6.15నుంచి సోనీలో ప్రత్యక్ష ప్రసారం -
బధిరుల ఒలింపిక్స్ గోల్ఫ్ ఫైనల్లో దీక్ష
బ్రెజిల్లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్ దీక్ష డాగర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గత క్రీడల్లో (2017)లో రజతం గెలిచిన ఆమె ఈ సారి స్వర్ణ పతకంపై గురి పెట్టింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్ (నార్వే)పై విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో భారత గోల్ఫర్ అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్ జాన్సన్‌తో తలపడుతుంది. -
వారెవా వ్యాట్... సిక్సర్ సోఫీ..!
క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్ జట్టు మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లలో ఓడి ఒక దశలో లీగ్ స్థాయిలోనే నిష్క్రమించేలా కనిపించిన టీమ్...మ్యాచ్ మ్యాచ్‌కు పదునైన ఆటను ప్రదర్శిస్తూ ఆరో సారి మెగా టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్యానీ వ్యాట్ (125 బంతుల్లో 129; 12 ఫోర్లు) శతకంతో చెలరేగగా, సోఫీ డన్‌క్లీ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. డు ప్రీజ్ (30)దే అత్యధిక స్కోరు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (6/36) ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. శతక భాగస్వామ్యం... ఓపెనర్ బీమాంట్ (7), కెప్టెన్ హీతర్ నైట్ (1), సివర్ (15) విఫలం కాగా, ఎమీ జోన్స్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. అయితే వ్యాట్, డన్‌క్లీ కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరిని నిలువరించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా వ్యాట్ ఇచ్చిన ఐదు క్యాచ్‌లు వదిలేసి (22, 36, 77, 116, 117 పరుగుల వద్ద) సఫారీ టీమ్ ప్రత్యర్థికి మేలు చేసింది! ఈ క్రమంలో 98 బంతుల్లోనే వ్యాట్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు పార్ట్నర్షిప్ వంద పరుగులు దాటిన తర్వాత 45వ ఓవర్లో వ్యాట్ వెనుదిరిగింది. చివరి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 75 పరుగులు చేసింది. టపటపా... 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ చేతిలో సెమీస్‌లోనే ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారీ అదే తరహాలో వెనుదిరిగింది. ఛేదనలో ఆ జట్టు ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. టోర్నీలో టాప్ స్కోరర్ అయిన లౌరా వాల్వార్ట్ (0) డకౌట్‌తో దక్షిణాఫ్రికా పతనం మొదలు కాగా, ఆ తర్వాత ఒక్కరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దలేకపోయారు. 67/4 తర్వాత ఎకెల్‌స్టోన్ జోరు మొదలైంది. తర్వాతి ఆరు వికెట్లూ ఆమె ఖాతాలోనే చేరడం విశేషం. -
ఎదురులేని నాదల్.. వరుసగా 14వ విజయం
ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వరుసగా 14వ విజయం నమోదు చేశాడు. అకాపుల్కోలో జరుగుతున్న మెక్సికో ఓపెన్‌లో నాదల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–3తో టాప్ సీడ్, కాబోయే కొత్త ప్రపంచ నంబర్‌వన్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో నోరీ (బ్రిటన్)తో నాదల్ తలపడతాడు. -
శభాష్ శ్రీకాంత్...
ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విశ్వకిరీటాన్ని అందుకునేందుకు విజయం దూరంలో నిలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం అద్వితీయ ఆటతీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ సమరంలో తుదకు అనుభవజ్ఞుడైన శ్రీకాంత్‌దే పైచేయిగా నిలిచింది. లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్రకాశ్ పదుకొనే (1983), సాయిప్రణీత్ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. హుఎల్వా (స్పెయిన్): ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ అందర్నీ అలరించింది. 69 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 21–14, 21–17తో భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఘనత వహించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడా లోటును తీర్చుకోవడానికి అతడు కేవలం విజయం దూరంలో నిలిచాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యె (సింగపూర్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్ ఫైనల్ నేటి సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే అవకాశముంది. అన్ని విభాగాల ఫైనల్స్‌ను స్టార్ స్పోర్ట్స్–3, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హోరాహోరీగా... అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి శ్రీకాంత్, లక్ష్య సేన్ తలపడగా... ప్రతీ పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా శ్రీకాంత్ కళ్లు చెదిరే రీతిలో స్మాష్‌లు సంధించాడు. అయితే శ్రీకాంత్ సంధించిన స్మాష్‌లకు అంతే చాణక్యంగా లక్ష్య సేన్ తిప్పి కొట్టాడు. 17 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతోనే లక్ష్య సేన్ ఖాతాలో ఎక్కువ పాయింట్లు చేరాయి. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ అలసిపోయినట్లు కనిపించాడు. రెండో గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 6–9తో వెనుకబడినా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. డ్రాప్ షాట్లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన శ్రీకాంత్ 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ రెండో గేమ్‌ను 21 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. తుదకు ఈ సుదీర్ఘ ర్యాలీలకు కళ్లు చెదిరే షాట్లతో ముగింపు ఇస్తూ వీరిద్దరు తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. చివరి గేమ్‌లో రెండుసార్లు శ్రీకాంత్ వెనుకంజ వేసినా వెంటనే తేరుకొని స్కోర్లను సమం చేశాడు. స్కోరు 16–16 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఒత్తిడికి లోనైన లక్ష్య సేన్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీకాంత్ రిటర్న్ షాట్‌ను లక్ష్య సేన్ నెట్‌కు కొట్టడంతో గేమ్‌తోపాటు మ్యాచ్ శ్రీకాంత్ వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన మూడో భారతీయ ప్లేయర్ శ్రీకాంత్. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడుసార్లు (2017, 2018–రన్నరప్; 2019–విన్నర్), సైనా నెహ్వాల్ ఒకసారి (2015–రన్నరప్) ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు. -
భారత్‌కు రజతం
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు రజతం లభించింది. 2007లో ఈ మెగా ఈవెంట్ మొదలయ్యాక భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. గోర్యాక్ చినా, కొస్టెనిక్, కాటరీనా లాగ్నో (గ్రాండ్ మాస్టర్లు), షువలోవా, కషిలిన్‌స్కాయాలతో కూడిన రష్యా జట్టు తో శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత జట్టు 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌ను భారత్ 1.5–2.5తో చేజా ర్చుకోగా... రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓటమి చవిచూసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ గోర్యాక్‌చినాతో జరిగిన తొలి గేమ్‌లో హారిక 47 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
స్ప్రింట్ ఫైనల్లో నిత్య, నరేశ్
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ స్ప్రింట్‌లో తెలంగాణ అమ్మాయి గంధి నిత్య స్ప్రింట్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా నిర్మించిన సింథటిక్ ట్రాక్‌పై బుధవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎక్కువగా పలు ఈవెంట్లకు సంబంధించి క్వాలిఫయింగ్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా మహిళల 100 మీ. పరుగు పందెం హీట్స్‌లో నిత్య నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల వంద మీటర్ల స్ప్రింట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె. నరేశ్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్స్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ ఫైనల్స్‌కు అర్హత పొందింది. హీట్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు రైల్వేస్ అథ్లెట్ల హవా నడిచింది. మొదటి రోజు మూడు మెడల్ ఈవెంట్లలో నలుగురు రైల్వేస్ అథ్లెట్లు పతకాలు గెలుపొందారు. 5000 మీటర్ల పరుగు పందెంలో పురుషుల కేటగిరీలో అభిõÙక్ పాల్, మహిళల ఈవెంట్లో పారుల్ చౌదరీ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో అభిõÙక్ (రైల్వేస్) పోటీని అందరికంటే ముందుగా 14 నిమిషాల 16.35 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గాడు. సర్వీసెస్‌కు చెందిన ధర్మేందర్ (14ని.17.20 సె.), అజయ్ కుమార్ (14 ని.20.98 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి 15 ని.59.69 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం గెలిచింది. ఇందులో మహారాష్ట్ర అమ్మాయిలు కోమల్ జగ్దలే (16ని. 01.43 సె.), సంజీవని బాబర్ (16 ని.19.18 సె.) రజతం, కాంస్యం గెలుపొందారు. మహిళల పోల్‌వాల్ట్ ఫైనల్లో పవిత్ర (తమిళనాడు; 3.90 మీ.) బంగారు పతకం సాధించింది. మరియా (రైల్వేస్; 3.80 మీ.) రజతం, కృష్ణ రచన్ (రైల్వేస్ 3.60 మీ.) కాంస్యం నెగ్గారు. మంత్రి చేతుల మీదుగా... మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక ఓరుగల్లులో జాతీయ క్రీడా పోటీలు జరుగుతుండడం గొప్ప విశేషం అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జాతీయస్థాయి పోటీలకు హనుమకొండ నోచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యూఎస్ ఓపెన్ : మహిళల సింగిల్స్‌లో బ్రిటిష్ యువకెరటం ఎమ్మారెడుకాను చరిత్ర సృష్టించింది
-
చరిత్రకు చేరువగా...
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏడోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ జొకోవిచ్ 2 గంటల 44 నిమిషాల్లో 7–6 (7/3), 7–5, 7–5తో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండటం విశేషం. అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ (31 సార్లు) తర్వాత జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇటలీ ప్లేయర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటినితో జొకోవిచ్ తలపడతాడు. షపోవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన షపోవలోవ్ కీలకదశలో తడబడి పాయి ంట్లు కోల్పోయాడు. మరోవైపు కెరీర్లో 50వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ కీలకదశలో పైచేయి సాధించాడు. ఏడు ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. షపోవలోవ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ సర్వీస్‌ను 11సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా అతను ఒక్కసారి మాత్రమే సఫలమయ్యాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ గెలిచిన జొకోవిచ్ ఆదివారం విజేతగా నిలిస్తే ... అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ప్రస్తుతం సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున) సరసన ఈ సెర్బియా స్టార్ కూడా చేరుతాడు. 1976 తర్వాత... తొలి సెమీఫైనల్లో ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ) 6–3, 6–0, 6–7 (3/7), 6–4తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తద్వారా అడ్రియానో పనట్టా (1976–ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇటలీ ప్లేయర్‌గా, వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది సార్లు చాంపియన్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన హుబర్ట్ సెమీఫైనల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బెరెటిని కచ్చితమైన సర్వీస్‌లు, బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగి హుబర్ట్ ఆట కట్టించాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బెరెటిని 22 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్దకు 25సార్లు దూసుకొచ్చి 16సార్లు పాయింట్లు గెలిచాడు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన హుబర్ట్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. -
‘ఫ్రెంచ్’ రాణి ఎవరో?
అంచనాలకు అందనిరీతిలో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అన్‌సీడెడ్ బర్బోర క్రిచికోవా (చెక్ రిపబ్లిక్), 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరుకున్నారు. నేడు జరిగే ఫైనల్లో గెలిచిన వారు తమ కెరీర్లో తొలిసారి సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తారు. 29 ఏళ్ల పావ్లుచెంకోవా 51 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడాక తొలిసారి ‘గ్రాండ్’ ఫైనల్లోకి అడుగుపెట్టగా... ‘డబుల్స్ స్పెషలిస్ట్’ అయిన 25 ఏళ్ల క్రిచికోవా తన ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరింది. క్రిచికోవాకు అరుదైన ‘డబుల్’ సాధించే అవకాశం కూడా ఉంది. ఆమె మహిళల డబుల్స్ విభాగంలోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో క్రిచికోవా–కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6–1, 6–2తో మాగ్దా లినెట్టి (పోలాండ్)–బెర్నార్డా పెరా (అమెరికా) జోడీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో బెథానీ మాటెక్ (అమెరికా)– స్వియాటెక్ (పోలాండ్) జోడీతో క్రిచికోవా–సినియకోవా ద్వయం ఆడతుంది. 2000లో మేరీ పియర్స్ మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఏడాది మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించింది. -
Amit Panghal, Shiva Thapa: అమిత్, శివ జోరు
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), మాజీ విజేత శివ థాపా (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో అమిత్ 5–0తో బిబోసినోవ్ (కజకిస్తాన్)పై... శివ 4–0తో బఖోదుర్ ఉస్మనోవ్ (తజికిస్తాన్)పై ఘనవిజయం సాధించారు. అమిత్ 2019లో స్వర్ణం నెగ్గగా... శివ థాపా 2013లో పసిడి పతకం సాధించి, ఆ తర్వాత 2017లో రజతం... 2015, 2019లో కాంస్యాలు గెలిచాడు. మరోవైపు భారత్‌కే చెందిన వరీందర్ (60 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. వరీందర్ 2–3తో షాబ„Š (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. బతురోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన బౌట్లో వికాస్ కంటి గాయం తిరగబెట్టడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి బతురోవ్ను విజేతగా ప్రకటించారు. మహిళల విభాగంలో సాక్షి (54 కేజీలు)–దీనా (కజకిస్తాన్) సెమీఫైనల్ బౌట్ ఫలితాన్ని మార్చారు. గురువారం రాత్రి జరిగిన బౌట్లో సాక్షి 3–2తో దీనాను ఓడించింది. అయితే ఈ ఫలితంపై కజకిస్తాన్ బాక్సర్ సమీక్ష కోరగా... రీప్లేలు పరిశీలించిన జ్యూరీ కజకిస్తాన్ బాక్సర్ గెలిచినట్లు ప్రకటించింది. దాంతో సాక్షికి కాంస్యం ఖాయమైంది. -
ఫైనల్లో మేరీ కోమ్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ 4–1తో లుస్తాయ్‌ఖాన్ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్ సీడ్ దినా జోలామన్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. మరో భారత బాక్సర్ లాల్ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్ బౌట్‌ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో, జాస్మిన్ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్) చేతిలో, సిమ్రన్‌జిత్ 0–5తో వోలోస్సెన్ (కజకిస్తాన్) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్బఖోర్ ఖామ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
టైటిల్ పోరుకు విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ జంట
పారిస్: తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ ద్వయం 21–17, 21–17తో కాలమ్ హెమ్మింగ్–స్టీవెన్ స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బెన్ లేన్–సీన్ క్యాండీ (ఇంగ్లండ్) జంటతో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం ఆడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సైనా 17–21, 17–21తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 18–21, 9–21తో టాప్ సీడ్ జాంగ్‌కోల్ఫాన్–రవింద ప్రజోగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో అశ్విని పొన్నప్ప–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 9–21, 23–21, 7–21తో నోర్ నిక్లాస్–అమేలియా (డెన్మార్క్) జోడి చేతిలో పరాజయం పాలైంది. -
23 ఏళ్ల పీటీ ఉష రికార్డు బద్దలు
పాటియాలా: ఫెడరేషన్ కప్ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దాంతో 1998లో ఇదే మీట్లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది. రెండు రోజుల కిందట 100 మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌కు షాక్ ఇస్తూ స్వర్ణం నెగ్గిన ధనలక్ష్మి... 200 మీటర్ల సెమీస్ హీట్‌లోనూ మరో స్టార్ స్ప్రింటర్ హిమదాస్ (24.39 సెకన్లు) కంటే మెరుగైన టైమింగ్‌ను నమోదు చేసింది. -
ఫైనల్లో సౌజన్య జంట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య బవిశెట్టి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సౌజన్య–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ 7–6 (9/7), 3–6, 10–8తో యువరాణి బెనర్జీ–వైదేహి చౌదరీ (భారత్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పియా లవ్రిచ్ (స్లొవేనియా)–అడ్రియెన్ నాగీ (హంగేరి)లతో సౌజన్య–ప్రార్థన తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. హుమేరా 4–6, 6–4, 3–6తో జీల్ దేశాయ్ (భారత్) చేతిలో ఓడిపోయింది. -
మహిళల సింగిల్స్ తుది పోరు నేడే
ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల సింగిల్స్ విజేత ఎవరో నేడు తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్, జపాన్ స్టార్ నయోమి ఒసాకాతో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) తలపడుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఒసాకా స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే చాలు... ఫైనల్‌ను లాంఛనంగా ముగించేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019లో ఇక్కడ టైటిల్ గెలిచిన ఒసాకా గతేడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. ఇక ఈ టోర్నీలో అయితే కఠినమైన ప్రత్యర్థుల్ని, దిగ్గజాన్ని ఓడించి మరీ తుదిపోరుకు చేరుకుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన జపాన్ స్టార్... సెమీస్‌లో అమెరికా దిగ్గజం సెరెనాకు చెక్ పెట్టింది. నేటి మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఒసాకానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు బ్రాడీ ఓడించిందంతా అనామక క్రీడాకారిణిలనే. 25 ఏళ్ల అమెరికన్‌కు అసలు ఫైనల్ చేరిన అనుభవమే లేదు. -
ముంబై వేట.. ఆరో సారి ఫైనల్‌కు
డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ వేటలో పడితే ఆ ఆట రూటే వేరని మరోసారి నిరూపించింది. తొలి క్వాలిఫయర్‌లో రోహిత్ సేన ఢిల్లీని ఒక ఆటాడుకుంది. కసిదీరా బ్యాట్‌తో, బంతితో వెంటాడింది. విజయంతో ఫైనల్‌కు బాట వేసుకుంది. 13 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఆరోసారి ముంబై ఫైనల్లోకి ప్రవేశించింది. రోహిత్ సేన బ్యాటింగ్‌కు చెల్లాచెదురైన ఢిల్లీ బౌలింగ్... ప్రత్యర్థి బౌలింగ్ మొదలుకాగానే విలవిలలాడింది. అయ్యర్ సేన ఇప్పుడు ఫైనల్ కోసం మరో పోరాటం చేయాల్సి వుంది. దుబాయ్: ముంబై క్వాలిటీ‘ఫైట్’ ముందు ఢిల్లీ భీతిల్లింది. ఐపీఎల్లో అత్యధిక టైటిళ్ల విజేత ముంబై ఇండియన్సే మరో ఫైనల్స్‌కు సిద్ధమైంది. తొలి క్వాలిఫయర్‌లో ఎదురు పడిన ఢిల్లీని చితగ్గొట్టి, పడగొట్టి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు) విధ్వంస రచన చేశాడు. వీరి ప్రతాపానికి అశ్విన్ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. డికాక్ ధనాధన్‌తో మొదలై... టాస్ నెగ్గిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఆట ధాటిగా మొదలైంది. ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన డికాక్ తొలి ఓవర్లో 3 బౌండరీలు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ (0) డకౌటయ్యాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్ వేగంగా పరుగులు జతచేశాడు. నోర్జే, రబడా బౌలింగ్‌లను ఇద్దరు అవలీలగా ఎదుర్కొన్నారు. ఫోర్లు, సిక్సర్లతో రన్‌రేట్‌ను అమాంతం పెంచేశారు. సగటున ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సాగిపోతున్న ముంబైకి మళ్లీ అశ్వినే షాకిచ్చాడు. డికాక్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్)ను పెవిలియన్ చేర్చాడు. సూర్య, ఇషాన్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ఆ తర్వాత కూడా 10 ఓవర్ల దాకా ముంబై 93/2 స్కోరుతో పటిష్టంగా ఉంది. కానీ తర్వాత ఓవర్లలో వేగం మారి వికెట్ల పతనం ముంబై జోరును కిందకు దించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో అర్ధసెంచరీ (36 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తి చేసుకున్నాడు. నోర్జే వేసిన ఈ ఓవర్లో తను మరో షాట్‌కు ప్రయత్నించి లాంగ్ లెగ్‌లో సామ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 100 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. ఆ తర్వాతి ఓవర్లో అశ్విన్ మరో దెబ్బ తీశాడు. ప్రమాదకర బ్యాట్స్‌మన్ పొలార్డ్ (0)ను కూడా ఖాతా తెరవనీయలేదు. వచ్చీ రాగానే షాట్ ఆడిన ఈ హిట్టర్... లాంగాన్‌లో రబడ క్యాచ్ పట్టడంతో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రన్‌రేట్ పూర్తిగా మందగించింది. 11వ ఓవర్ నుంచి 14వ ఓవర్ వరకు ముంబై చేసింది 15 పరుగులే కాగా... విలువైన 2 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ బ్యాట్ ఝళిపించడంతో ముంబై ఇన్నింగ్స్ రాకెట్ వేగం అందుకుంది. రబడా వేసిన 15వ ఓవర్ వరుస బంతుల్లో ఇషాన్ మిడ్‌వికెట్ దిశగా బౌండరీ, డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. నోర్జే వేసిన మరుసటి ఓవర్లో ఇషాన్ 2 ఫోర్లు, కృనాల్ పాండ్యా సిక్సర్ బాదాడు. దీంతో ముంబై ఈ రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టింది. హార్దిక్ సిక్సర్లు కాసేపటికే కృనాల్ (13)ను స్టొయినిస్ ఔట్ చేసినా... సోదరుడు హార్దిక్ పాండ్యా ఆలస్యం చేయకుండానే ఇషాన్ కిషన్‌ను అనుసరించాడు. సామ్స్ 18వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులొచ్చాయి. రబడా 18వ ఓవర్‌ను హార్దిక్ చితగ్గొట్టాడు. తొలి బంతిని లాంగాన్‌లో భారీ సిక్సర్ బాదిన అతను మిడ్‌వికెట్ మీదుగా ఫ్లాట్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లోనూ 18 పరుగులు రావడంతో ముంబై స్కోరు 180కి చేరింది. పాండ్యా ఆఖరి ఓవర్లో నోర్జేను ఆడుకున్నాడు. అతను 2 సిక్సర్లు కొడితే ఇషాన్ కిషన్ మరో సిక్సర్ బాదాడు. దీంతో 20 పరుగులు రావడంతో ముంబై స్కోరు 200 పరుగులకు చేరింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 92 పరుగులు సాధించడం విశేషం. ఢిల్లీ 0, 0, 0... కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ బ్యాటింగ్ మొదలు పెట్టగానే కుదేలైంది. ఓపెనర్లు, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఇలా టాపార్డర్ ఖాతానే తెరువకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన బౌల్ట్ రెండో బంతికి పృథ్వీ షా(0)ను, ఐదో బంతికి రహానే (0)ను డకౌట్ చేశాడు. 0కే 2 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌ను బుమ్రా మరో దెబ్బ తీశాడు. ధావన్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. పరుగు చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఒక్కసారిగా సాగిలపడిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (12) కూడా ఎక్కువసేపు నిలువకుండా బుమ్రానే పెవిలియన్ చేర్చాడు. రిషబ్ పంత్ (3)ను కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో ఢిల్లీ 41 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. స్టొయినిస్ అర్ధసెంచరీ ఇక చేయాల్సిన లక్ష్యానికి జట్టు దూరమైన సమయంలో స్టొయినిస్, అక్షర్ పటేల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు. ఇద్దరు క్రీజులో నిలిచాక ధాటిగా ఆడటం మొదలుపెట్టారు. అక్షర్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను తలపించేలా ఆడగా... స్టొయినిస్ తన సహజసిద్ధమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతను 36 బంతుల్లో ఫిఫ్టీ (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటక బుమ్రా... స్టొయినిస్ ఆట కట్టించాడు. అద్భుతమైన డెలివరీతో అతని బౌల్డ్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలోనే సామ్స్ (0)ను కూడా కీపర్ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. దీంతో అక్షర్ పటేల్ మెరుపులు 20 ఓవర్ల కోటా పూర్తిచేసేందుకు పనికొచ్చాయి. బుమ్రాకు దీటుగా చక్కని స్పెల్ వేసిన బౌల్ట్ (2–1–9– 2) గాయంతో తన కోటా పూర్తిచేయలేకపోయాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ధావన్ (బి) అశ్విన్ 40; రోహిత్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; సూర్య కుమార్ (సి) స్యామ్స్ (బి) నోర్జే 51; ఇషాన్ కిషన్ (నాటౌట్) 55; పొలార్డ్ (సి) రబడ (బి) అశ్విన్ 0; కృనాల్ (సి) స్యామ్స్ (బి) స్టొయినిస్ 13; హార్దిక్ (నాటౌట్) 37; ఎక్స్ట్రా లు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–16, 2–78, 3–100, 4–101, 5–140. బౌలింగ్: స్యామ్స్ 4–0–44–0, అశ్విన్ 4–0–29–3, రబడ 4–0–42–0, అక్షర్ 3–0–27–0, నోర్జే 4–0–50–1, స్టొయినిస్ 1–0–5–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డికాక్ (బి) బౌల్ట్ 0; ధావన్ (బి) బుమ్రా 0; రహానే (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; శ్రేయస్ (సి) రోహిత్ శర్మ (బి) బుమ్రా 12; స్టొయినిస్ (బి) బుమ్రా 65; పంత్ (సి) సూర్య కుమార్ (బి) కృనాల్ 3; అక్షర్ (సి) చహర్ (బి) పొలార్డ్ 42; స్యామ్స్ (సి) డికాక్ (బి) బుమ్రా 0; రబడ (నాటౌట్) 15; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–0, 4–20, 5–41, 6–112, 7–112, 8–141. బౌలింగ్: బౌల్ట్ 2–1–9–2, బుమ్రా 4–1–14–4, కృనాల్ 4–0–22–1, కూల్టర్‌నైల్ 4–0–27–0, పొలార్డ్ 4–0–36–1, రాహుల్ చహర్ 2–0–35–0. -
ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్
టరూబా (ట్రినిడాడ్ అండ్ టొబాగో): కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీ తాజా సీజన్లో లీగ్ దశను అజేయంగా దాటిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సెమీఫైనల్లోనూ అదే దూకుడును కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నైట్‌రైడర్స్ 9 వికెట్లతో జమైకా తలవాస్‌పై గెలుపొందింది. దాంతో సీపీఎల్ టైటిల్ పోరుకు మూడోసారి అర్హత సాధించింది. బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, జూహీ చావ్లాలకు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు గతంలో 2017, 2018 సీజన్లో ఫైనల్ చేరి చాంపియన్‌గా నిలిచింది. నైట్‌రైడర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలుత జమైకా 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. అకీల్ హుసీన్ (3/14), క్యారీ పియరీ (2/29) ప్రత్యర్థిని కుదురుకునే ప్రయత్నం చేయలేదు. బోనర్ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు), రోవ్మాన్ పొవెల్ (35 బంతుల్లో 33; 1 ఫోరు, 1 సిక్స్) తలవాస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోయి 111 చేసి గెలుపొందింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ అజేయ అర్ధ సెంచరీ (44 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రాణించాడు. అతడికి టియాన్ వెబ్‌స్టర్ (43 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు. వీరు అభేద్యమైన రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో నైట్‌రైడర్స్ తలపడుతుంది. -
13 ఏళ్ల తర్వాత... రంజీ ఫైనల్లో బెంగాల్
కోల్‌కతా: 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... బెంగాల్ క్రికెట్ జట్టు దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కర్ణాటకతో మంగళవారం ముగిసిన సెమీఫైనల్లో ఆతిథ్య బెంగాల్ జట్టు 174 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2007 తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ తుది పోరుకు అర్హత సాధించింది. 352 పరుగుల విజయలక్ష్యంతో... ఓవర్‌నైట్ స్కోరు 98/3తో నాలుగో రోజు ఛేదన కొనసాగించిన కర్ణాటక 55.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ బౌలర్ ముకేశ్ కుమార్ (6/61) కర్ణాటక బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. చివరి రోజు కర్ణాటక కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు ముకేశ్ దక్కించుకోవడం విశేషం. రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్రతో జరుగుతోన్న మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌కు 327 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. ఓవర్‌నైట్ స్కోరు 66/5తో ఆటను కొనసాగించిన సౌరాష్ట్రను అర్పిత్ (139; 16 ఫోర్లు, సిక్స్) సెంచరీతో ఆదుకోవడంతో... తమ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. ఆట ముగిసే సమయానికి గుజరాత్ వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. -
6న సాక్షి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ (ఎస్పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లను విజయవంతంగా ముగించుకున్న ఎస్పీఎల్ ఫైనల్ సమరానికి సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఈ టైటిల్ పోరు బహుమతి ప్రదాన కార్యక్రమం సైనిక్‌పురిలోని భవన్స్ క్రికెట్ అకాడమీలో అట్టహాసంగా జరుగనుంది. ఈ వేడుకకు నగరంలోని అన్ని కాలేజీల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఆసక్తి గల వారు తమ కాలేజి ఐడీ కార్డులతో రావాల్సిందిగా నిర్వాహకులు పేర్కొన్నారు. -
టీటీ ఫైనల్లో స్నేహిత్
మరోవైపు అండర్–21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 6–11, 8–11, 11–4, 11–4, 14–16, 12–10, 11–5తో జీత్ చంద్ర (హరియాణా)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో స్నేహిత్ 10–12, 11–4, 11–5, 12–14, 11–5, 11–7తో రాజేశ్ (మహారాష్ట్ర)ను ఓడించాడు. అండర్–17 ఆర్చరీ బాలుర కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుందేరు వెంకటాద్రి కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతక పోరులో వెంకటాద్రి 148–142తో యశ్ దూబేపై విజయం సాధించాడు. -
‘ఆసియా’ ఫైనల్లో తస్నిమ్, తార
సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల అండర్–15 సింగి ల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ లభించడం ఖాయమైంది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన ఇద్దరు క్రీడాకారిణులు తస్నిమ్ మీర్, తారా షా భారత్‌కే చెందిన వారు కావడం విశేషం. శనివారం జరిగిన అండర్–15 బాలికల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో తస్నిమ్ 21–16, 21–11తో సోరా ఇషియోకా (జపాన్)పై... తారా షా 21–18, 21–14తో కజునె ఇవాటో (జపాన్)పై విజయం సాధించారు. చరిత్రకు విజయం దూరంలో... గ్వాంగ్జౌ (చైనా): మరో విజయం సాధిస్తే జపాన్ స్టార్ కెంటో మొమోటా... బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మొమోటా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మొమోటా 21–17, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) 21–15, 21–15తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో జిన్‌టింగ్‌తో మొమోటా తలపడతాడు. -
అందం..అరవిందం
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు పలు చోట్ల ఆడిషన్స్ జరిగిన 5వ మిస్ ఆసియా గ్లోబల్ అందాల పోటీల ఫైనల్స్ శుక్రవారం (నవంబర్ 1న) జరగనున్నాయని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న గోకులమ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయని, దీనిలో ప్రపంచవ్యాప్తంగా 26మంది ఫైనలిస్ట్‌లు పోటీ పడుతున్నారని వివరించారు. మలేషియా పర్యాటక మంత్రి ఈ ఈవెంట్‌కి అతిథిగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. -
డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట
పారిస్ (ఫ్రాన్స్): ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ జంటను...క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్ జోడీని బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోనూ గొప్ప విజయం సాధించారు. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–11, 25–23తో ఐదో సీడ్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది. గతంలో ఈ జపాన్ జోడీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సాత్విక్–చిరాగ్ మూడో ప్రయత్నంలో మాత్రం గెలుపు రుచి చూశారు. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–6తో వెనుకబడి ఉంది. షెడ్యూల్ ప్రకారం పురుషుల డబుల్స్ ఫైనల్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత జరిగే అవకాశముంది. మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వరుసగా 11 పాయింట్లు గెలిచి... పురుషుల సింగిల్స్ విభాగంలో ఇండోనేసియా ప్లేయర్ జొనాథన్ క్రిస్టీ అత్యద్భుత విజయం సాధించాడు. ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో 7–21, 22–20, 21–19తో గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణాయక చివరి గేమ్‌లో ఒకదశలో క్రిస్టీ 10–19తో వెనుకంజలో నిలిచి ఓటమి అంచుల్లో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా విజృంభించిన క్రిస్టీ వరుసగా 11 పాయింట్లు సాధించి చివరి గేమ్‌ను 21–19తో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. -
సింధు స్వర్ణ ప్రపంచం
నిరీక్షణ ముగిసింది. పసిడి స్వప్నం సాకారమైంది. స్విట్జర్లాండ్‌లో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. బ్యాడ్మింటన్‌లో అందని ద్రాక్షగా ఉన్న విశ్వకిరీటం మన సొంతమైంది. గత రెండు పర్యాయాల్లో పసిడి మెట్టుపై బోల్తా పడిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మూడో ప్రయత్నంలో తన బంగారు కలను నిజం చేసుకుంది. రెండేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన విశ్వ సమరంలో తనను ఓడించిన జపాన్ అమ్మాయి ఒకుహారాను ఈసారి సింధు చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో భారత్ తరఫున తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఘనతను సాధించింది. బాసెల్ (స్విట్జర్లాండ్): ఎట్టకేలకు తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ పసిడి కల నిజమైంది. ప్రత్యర్థిపై చిరుతలా విరుచుకుపడిన సింధు అనుకున్నది సాధించింది. ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఆహా... ఏమి ఆట... తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో సింధు తొలి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు దూకుడుగానే ఆడింది. ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ను 22 షాట్ల ర్యాలీలో కోల్పోయిన సింధు ఆ తర్వాత విశ్వరూపమే చూపించింది. వరుసగా 8 పాయింట్లు గెల్చుకొని 8–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎనిమిది పాయింట్లలో ఆరు సింధు ధాటికి ఒకుహారా చేసిన అనవసర తప్పిదాలతోనే వచ్చాయి. మిగతా రెండు పాయింట్లను సింధు విన్నర్స్‌తో సాధించింది. ఆ తర్వాత ఒకుహారా ఒక పాయింట్ గెలిచినా... సింధు మళ్లీ చెలరేగింది. ఈసారీ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సింధు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లో దక్కించుకుంది. ఎక్కడా తగ్గలేదు... తొలి గేమ్ గెల్చుకున్న సింధు రెండో గేమ్‌లోనూ హడలెత్తించింది. ఒకుహారా ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసినట్లు కనిపించిన ఈ హైదరాబాదీ ఆటలో వైవిధ్యం కనబరిచింది. సింధు జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఏదశలోనూ ఒకుహారాకు అంతుచిక్కలేదు. నేరుగా ఒకుహారా శరీరంపై సింధు సంధించిన కొన్ని స్మాష్ షాట్లకు జపాన్ క్రీడాకారిణి వద్ద సమాధానమే లేకపోయింది. సింధు కొట్టిన స్మాష్‌లకు ఒకుహారా రిటర్న్ చేసినా ఆ స్మాష్‌ల వేగానికి కొన్నిసార్లు షటిల్స్ బయటకు వెళ్లిపోయాయి. ఫలితంగా రెండో గేమ్‌లో విరామానికి సింధు 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా సింధు ఆధిపత్యం కొనసాగించి క్రమం తప్పకుండా పాయింట్లు సాధించగా... ఒకుహారా పూర్తిగా డీలా పడిపోయింది. స్కోరు 20–7 వద్ద సింధు కొట్టిన స్మాష్ షాట్‌ను ఒకుçహారా రిటర్న్ చేయలేకపోవడంతో పాయింట్, గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ భారత స్టార్ కైవసం చేసుకుంది. 2006లో 21 పాయింట్ల విధానం ప్రవేశ పెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకపక్షంగా ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్ ఇదే కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మొమోటా 21–9, 21–3తో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. బాయ్ నజరానా రూ. 20 లక్షలు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాయిప్రణీత్‌కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఆ పిలుపు... చెప్పలేని ఆనందం నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా సాక్షితో సింధు భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన సింధు... తనపై ఇప్పటివరకు వచ్చిన అన్ని విమర్శలకు రాకెట్‌తో సమాధానమిచ్చింది. ‘గొప్ప టోర్నీలు ఆడగలదు కానీ ఫైనల్స్ గెలవలేదు’ అని ధ్వజమెత్తిన విమర్శకుల నోళ్లన్నీ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణంతో మూగబోయేలా చేసింది. ఇక నుంచి పట్టిందల్లా బంగారమే అనే స్థాయిలో బరిలో దిగుతానంటూ, గెలవాలనే స్ఫూర్తి తనలో నిరంతరం రగులుతూనే ఉంటుందంటూ స్విట్జర్లాండ్ నుంచి ‘సాక్షి క్రీడా ప్రతినిధి’తో ఫోన్లో తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే... ఈ విజయం ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నా అనుభూతి చెప్పడానికి మాటలు రావట్లేదు. ఈ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. చివరికి ‘ప్రపంచ చాంపియన్’ అనే హోదా దక్కింది. రజతాలు, కాంస్యాలు ఎన్ని సాధించినా ... ‘సింధు ప్రపంచ చాంపియన్’ అనే పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. దీన్నిమించిన ఒలింపిక్స్ పతకమే ఉందిగా? ఈ విజయాన్ని ఒలింపిక్స్ పతకంతో పోల్చవద్దు. ఒలింపిక్స్ అత్యున్నత స్థాయి టోర్నీ అయినప్పటికీ ప్రపంచ ఈవెంట్ కూడా దీనికి తక్కువేమీ కాదు. నా దృష్టిలో రెండూ వేర్వేరు. దేని విలువ దానిదే. ఈ టోర్నీ కోసం ఎలా సన్నద్ధమయ్యారు? కోచ్‌లు గోపీ సర్‌తో పాటు కిమ్ జి హ్యూన్ టోర్నీ కోసం నన్ను చాలా బాగా సిద్ధం చేశారు. వ్యూహాల్ని పక్కాగా అమలు చేశా. కొత్త ట్రెయినర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నా ఫిట్నెస్ మరో స్థాయికి చేరింది. గతంలో ర్యాలీలు ఆడాల్సినప్పుడు చాలా అలసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొంటున్నా. తదుపరి లక్ష్యం? టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి. నేనెప్పుడు ఇక చాల్లే అని అనుకోలేదు. ఇంకా గెలవాలి, బాగా ఆడాలనే అనుకుంటా. ప్రతీ గెలుపు మరింత బాగా ఆడాలనే స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ హోదా వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. నాపై అంచనాలు పెరుగుతాయి. కాబట్టి మరింత బాగా ఆడాలి. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కూడా సాధించాల్సి ఉంది. ప్రశంసల వెల్లువ.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన సింధుకు అభినందనలు. యావత్ దేశం గర్వించదగ్గ క్షణాలివి. ఈ మీ విజయం లక్షలాది మందికి ప్రేరణగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. –రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి నీ ప్రదర్శనతో దేశం మొత్తం మళ్లీ గర్వపడేలా చేశావ్. ఆటపట్ల ఉన్న అంకితభావం, గెలవాలన్న కసి భావితరాల క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రపంచ చాంపియన్ షిప్లో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌కు కూడా శుభాకాంక్షలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం సింధుకు శుభాకాంక్షలు. నీ విజయం దేశానికే గర్వకారణం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. –కేసీఆర్, తెలంగాణ సీఎం సింధు... నీ చారిత్రక విజయంతో దేశం మొత్తం గర్విస్తోంది. – నరసింహన్, తెలంగాణ గవర్నర్ సింధుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాంపియన్స్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది. – కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో విజయం సాధించిన తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలి. –విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్ గొప్ప ప్రదర్శన. ప్రపంచ చాంపియన్ అయినందుకు అభినందనలు. మరోసారి దేశం గర్వపడేలా చేశావ్. –సచిన్ టెండూల్కర్ సింధు అభినందనలు. అత్యద్భుత ప్రదర్శన చేశావ్. నీ ప్రదర్శన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. – కేటీఆర్, తెలంగాణ, బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు 2.0 ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు ఖాతాలో ఉన్నాయి. అంతకుమించి మూడేళ్ల క్రితమే ఒలింపిక్స్ రజత మాల తన మెడలో పడింది. ఇక సూపర్ సిరీస్ టోర్నీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవార్డులు, రివార్డులు... ఆర్జనలో మేటి అని ‘ఫోర్బ్స్’ అంకెలు అగ్ర తాంబూలమిస్తున్నాయి. 24 ఏళ్ల వయసులో ఇన్ని ఘనతల తర్వాత మరో ప్లేయర్ అయితే తాము సాధించినదానితో సంతృప్తి పడిపోయేవారేమో... కొత్తగా స్ఫూర్తి పొందడానికి వారికి ఏమీ ఉండకపోయేదేమో. కానీ మన సింధు అలా అనుకోలేదు. ప్రపంచ వేదికపై ఆమె స్వర్ణదాహం తీరలేదు. అందుకే ఈసారి బంగారం పట్టాలని పట్టుదలగా బరిలోకి దిగింది. తై జు యింగ్‌పై క్వార్టర్స్‌లో అద్భుత విజయం తర్వాత ‘ఇంకా నా ఆట పూర్తి కాలేదు’ అంటూ సవాల్ విసిరిన సింధు మరో రెండు మ్యాచ్‌లలో అదే జోరు ప్రదర్శించింది. అందకుండా ఊరిస్తున్న పసిడిని తన ఖాతాలో వేసుకొని షటిల్ శిఖరాన నిలిచింది. ‘వరల్డ్’ అరంగేట్రంలోనే అదుర్స్... 2013లో సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఇద్దరు చైనా స్టార్లపై సాధించిన రెండు విజయాలు సింధు భవిష్యత్తును చూపించాయి. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ వాంగ్ యిహాన్‌ను, క్వార్టర్ ఫైనల్లో వాంగ్ షిజియాన్లను ఆమె అలవోకగా ఓడించింది. తర్వాతి ఏడాది కూడా షిజియాన్‌ను చిత్తు చేసి అప్పటి నుంచి చైనా మనకు ఏమాత్రం అడ్డుగోడ కాదని సింధు నిరూపించింది. టీనేజీ దాటకుండానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలుచుకున్న సింధు తర్వాతి లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోయింది. 2015 కొంత నిరాశపర్చినా... తర్వాతి ఏడాది సింధు గర్జన ‘రియో’లో వినిపించింది. 2016 ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత ఈ తెలుగు తేజం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు ఆమె విశ్వ సమరంలో పతకం గెలవకపోతే ఆశ్చర్యపడాలి కానీ గెలిస్తే అందులో విశేషం ఏమీ లేని స్థితికి చేరుకుంది! ఇలాంటి లెక్కలను సింధు నిజం చేసి చూపించింది. వరుసగా రెండేళ్లు 2017, 2018లలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు సత్తా వెండి వెన్నెల కురిపించింది. లోపాలపై దృష్టి పెట్టి... సహజంగానే సింధు ఈసారి స్వర్ణానికి గురి పెట్టింది. చెట్టు చిటారు కొమ్మన నిలిచిన పక్షిని కొడితే రజతంతో ఆగిపోవాల్సి వస్తోంది తప్ప బంగారం మెరుపు దక్కడం లేదు. అందుకే ఇప్పుడు పక్షి కన్నుపైకే గెలుపు బాణాన్ని సంధించింది. అందు కోసం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేకంగా తన లోపాలపై దృష్టి పెట్టి సాధన చేసింది. క్వార్టర్స్‌లో తై జుతో జరిగిన మ్యాచ్‌లో ఇది కనిపించింది. తొలి గేమ్‌ను చిత్తుగా కోల్పోయినా... తర్వాత చెలరేగింది. మ్యాచ్ ఆసాంతం చూస్తే ప్రత్యర్థి శరీరంపైకి స్మాష్‌లను సంధించడం సింధు ఆటలో కొత్త కోణం. చివర్లో ఒత్తిడిలో పడే సమస్య రాకుండా ఆరంభం నుంచే దూకుడుకు ప్రాధాన్యతనిచ్చింది. తన ఎత్తు కారణంగా డ్రాప్ షాట్లను రిటర్న్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందిని కూడా అధిగమించింది. తనకు స్మాష్ కొట్టే అవకాశం వచ్చే వరకు ప్రత్యర్థిని సాధ్యమైనంతగా ర్యాలీలతోనే ఆడించే ప్రయత్నం చేయడం ఫలితాన్నిచ్చింది. 360 డిగ్రీల కోణంలో చురుకైన కదలికలతో కోర్టు మొత్తాన్ని కవర్ చేస్తూ ఈ మెగా టోర్నీలో సింధు ఆడిన ఆట నిజంగా సూపర్బ్. తదుపరి స్వర్ణ గురి ‘టోక్యోలో’... నిజానికి 2019లో సింధుకు గొప్ప ఫలితాలు ఏమీ రాలేదు. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌లో ఓడగా, ఆల్ ఇంగ్లండ్‌లో తొలి రౌండ్లోనే ఓడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఇండియా ఓపెన్‌లో, సింగపూర్ ఓపెన్‌లోనూ సెమీస్‌కే పరిమితం కాగా, మలేసియా ఓపెన్‌లో కనీసం క్వార్ట ర్స్ ఆనందం కూడా దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియన్ ఓపెన్దీ అదే కథ. ఇండోనేసియాలో రన్నరప్‌గా నిలవడంతో కొంత సంతృప్తి దక్కగా, తర్వాతి వారమే జపాన్‌లో ఆనందం ఆవిరైంది. వరల్డ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం థాయిలాండ్ ఓపెన్‌కు దూరమైన ఈ హైదరాబాదీ చివరకు తన లక్ష్యాన్ని చేరింది. తాజా ఫామ్, సర్క్యూట్లో ఉన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే మరో ఒలింపిక్ పతకం సింధు కోసం ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తోంది. బ్రెజిల్ గడ్డపై చేజారిన కనకపు హారాన్ని టోక్యోలో వరిస్తే భారత అభిమానులకు కావాల్సిందేముంది! చాలా గర్వంగా ఉంది సింధు ఫైనల్స్‌లోనూ గెలవగలదని నిరూపించింది. ప్రపంచ చాంపియన్ స్వర్ణం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ క్షణంలో తనతో ఉండటం చాలా గర్వంగా ఉంది. సింధు టోర్నీ కోసం చాలా కష్టపడింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. – పీవీ రమణ (సింధు తండ్రి) అమ్మకు అంకితం... హైదరాబాద్‌కు వచ్చాకే సంబరాలు చేసుకుంటా. ప్రస్తుతం టీమ్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్తున్నా. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. నేడు (ఆదివారం) ఆమె పుట్టినరోజు. తనకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. చివరకు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని ఆమెకు ఇస్తున్నా. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. –పీవీ సింధు –సాక్షి క్రీడావిభాగం -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడి
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది. సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించింది. హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా భారత టైటిల్ ఆశలను తమ భుజాలపై మోస్తూ వచ్చిన సాయిరాజ్ జోడి మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో ప్రపంచ 16వ ర్యాంక్ సాయిరాజ్ జోడి 22–20, 22–24, 21–9తో 19వ ర్యాంక్ కో సుంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) జంటను చిత్తుచేసింది. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిరాజ్ జంట టైటిల్ కోసం జరిగే తుది పోరుకు అర్హత సాధించింది. -
ఫైనల్లో లార్డ్స్, కేంద్రీయ విద్యాలయ
సాక్షి, హైదరాబాద్: కేబీడీ జూనియర్స్ కబడ్డీ లీగ్‌లో లార్డ్స్ హైస్కూల్, కేంద్రీయ విద్యాలయ (గోల్కొండ) జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. హైదరాబాద్ అంచె పోటీల్లో భాగంగా నగరానికి చెందిన ఎనిమిది జట్లు ఇందులో పాల్గొన్నాయి. పలు లీగ్ మ్యాచ్‌ల అనంతరం లార్డ్స్, ప్రభుత్వ స్కూల్ (బోడుప్పల్), ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. తొలి సెమీఫైనల్లో లార్డ్స్ హైస్కూల్ 20–14 స్కోరుతో ప్రభుత్వ స్కూల్ (బోడుప్పల్)పై విజయం సాధించింది. రైడింగ్‌లో తరుణ్ కుమార్ (లార్డ్స్) 9 పాయింట్లతో అదరగొట్టగా, డిఫెండర్ సంతోష్ (లార్డ్స్) 2 పాయింట్లు చేశాడు. రెండో సెమీఫైనల్లో కేంద్రీయ విద్యాలయ (గోల్కొండ; కేవీ–2) జట్టు 26–12తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై ఘనవిజయం సాధించింది. కేంద్రీయ విద్యాలయ ఆటగాళ్లు ఎడ్వర్డ్ లివ్‌స్టాన్ రైడింగ్‌లో 14 పాయింట్లు సాధించగా, డిఫెండర్ సుమన్‌దీప్ ప్రసాద్ 3 పాయింట్లు చేశాడు. రేపు లార్డ్స్, కేంద్రీయ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. -
వరల్డ్‌కప్ ఫైనల్‌కి దూసుకెళ్లిన ఇంగ్లాండ్
-
చాంపియన్ భారత్
హిరోషిమా: మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ చాంపియన్‌గా భారత్ అవతరించింది. ఇప్పటికే ఫైనల్స్ చేరడం ద్వారా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన భారత్ హిరోషిమాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తుది పోరులో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత్ జపాన్ను మట్టికరిపించింది. భారత్ తరపున మరోసారి రాణించిన గుర్జిత్ కౌర్ రెండు గోల్స్(45వ, 60వ నిమిషంలో) సాధించి విజయంలో కీలకపాత్ర పోషించింది. రాణి రాంపాల్(3వ నిమిషంలో) మరో గోల్ నమోదు చేసింది. జపాన్ తరపున నమోదైన ఏకైక గోల్‌ను మోరి కనోన్(11వ నిమిషంలో) సాధించింది. మ్యాచ్ మొత్తంలో భారత్ 26 సార్లు జపాన్ రక్షణ వలయంలోకి ప్రవేశించగా, జపాన్ కేవలం 13 సార్లు మాత్రమే భారత్ రక్షణ వలయంలోకి ప్రవేశించింది. మ్యాచ్‌లో భారత్‌కు 8 పెనాల్టీ కార్నర్స్ లభించగా జపాన్‌కు కేవలం 2 మాత్రమే లభించాయి. భారత్ సాధించిన మూడు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలో రావడం విశేషం. టోర్నీలో అపజయం ఎరుగని భారత్ మొత్తం 27 గోల్స్ చేయగా కేవలం 4 గోల్స్‌ను మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకుంది. భారత కెప్టెన్ రాణి రాంపాల్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవగా, గుర్జీత్ కౌర్ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిలీ 3–1తో పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3 గోల్స్‌తో సమంగా ఉండటంతో షూటౌట్లో విజేతను నిర్ణయించారు. -
భారత్ రెండో విజయం
హిరోషిమా (జపాన్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెం ట్లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. శనివారం ఉరుగ్వేపై ప్రదర్శించిన జోరును పోలాండ్‌పైనా చూపింది. ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో 5–0తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (28వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జ్యోతి (21వ నిమిషంలో), వందనా కటారియా (26వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో రష్యా 6–0తో మెక్సికోపై, చిలీ 3–1తో జపాన్‌పై, ఉరుగ్వే 4–0తో ఫిజీపై గెలుపొందాయి. భారత్ గ్రూప్‌లోని తన చివరి మ్యాచ్‌ను మంగళవారం ఫిజీతో ఆడనుంది.