
కొనసాగుతున్న సింధు హవా
కౌలూన్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు హవా కోనసాగుతోంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో చుంగ్ గాన్ యితో తలపడిన సింధు.. 21-14, 21-16 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చుంగ్ గాన్ యి చేతిలోనే మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. చుంగ్ గాన్ యి పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధూ.. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.
కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సింధు గత వారం చైనా ఓపెన్ సూపర్ సరీస్‌లో విజయం సాధించి.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్స్లో తొమ్మిదో ర్యాంక్‌కు చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పురుషుల విభాగంలో భారత ఆటగాడు సమీర్ వర్మ సైతం ఫైనల్లోకి ప్రవేశించాడు.