మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో తెలుగుతేజం పీవీ సింధు కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది.
అయితే పురుషుల విభాగంలో మాత్రం స్టార్ షట్లర్ హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం.
ఫామ్‌లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు.
దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్‌ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్‌తో అతడు తలపడనున్నాడు.
sportsmanship 👏🏻 hopefully it’s nothing serious ;( have a good recovery cea! pic.twitter.com/sEVL2eP8Di
— bobe (@bobeside) May 27, 2023
Former champion Pusarla V. Sindhu 🇮🇳 faces Gregoria Mariska Tunjung 🇮🇩.#BWFWorldTour #MalaysiaMasters2023 pic.twitter.com/sbDIsKZ1lq
— BWF (@bwfmedia) May 27, 2023
#BWF | Komentar dan pesan menyentuh dari Prannoy H.S. yang jadi saksi tumbangnya Christian Adinata karena cedera. Prannoy juga yang pertama datang untuk menenangkan CeA setelah terjatuh di lapangan.
— SPOTV Indonesia (@SPOTV_Indonesia) May 27, 2023
Respect Prannoy! Good luck for the final!! 🙏🏼❤️ pic.twitter.com/JP2LZSwVwo
Comments
Please login to add a commentAdd a comment