Malaysia Masters
-
ప్రిక్వార్టర్స్‌లో సింధు
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ విజేత పీవీ సింధు మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 21–17, 21–16తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన అషి్మత చాలిహా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సిక్కి–సుమీత్ 21–15, 12–21, 21–17తో లుయి చుర్ వే– ఫు చి యాన్ (హాంకాంగ్)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిరణ్ జార్జి (భారత్) 21–16, 21–17తో టకూమా ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు. -
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 21–10తో హువాంగ్ యు సున్–లియాంగ్ టింగ్ యు (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో నలుగురు భారత ప్లేయర్లు సతీశ్ కుమార్, ఆయూశ్ శెట్టి, శంకర్ ముత్తుస్వామి, కార్తికేయ గుల్షన్ కుమార్ పోటీపడ్డా ఒక్కరు కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. నేడు జరిగే మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో పీవీ సింధు తలపడుతుంది. -
ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్.. సింధు కథ ముగిసే
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది. అయితే పురుషుల విభాగంలో మాత్రం స్టార్ షట్లర్ హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం. ఫామ్‌లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్‌ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్‌తో అతడు తలపడనున్నాడు. sportsmanship 👏🏻 hopefully it’s nothing serious ;( have a good recovery cea! pic.twitter.com/sEVL2eP8Di— bobe (@bobeside) May 27, 2023 Former champion Pusarla V. Sindhu 🇮🇳 faces Gregoria Mariska Tunjung 🇮🇩.#BWFWorldTour #MalaysiaMasters2023 pic.twitter.com/sbDIsKZ1lq— BWF (@bwfmedia) May 27, 2023 #BWF | Komentar dan pesan menyentuh dari Prannoy H.S. yang jadi saksi tumbangnya Christian Adinata karena cedera. Prannoy juga yang pertama datang untuk menenangkan CeA setelah terjatuh di lapangan. Respect Prannoy! Good luck for the final!! 🙏🏼❤️ pic.twitter.com/JP2LZSwVwo— SPOTV Indonesia (@SPOTV_Indonesia) May 27, 2023 చదవండి: 'త్వరలో మిమ్మల్ని కలుస్తా'.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ -
Malaysia Masters: సెమీస్‌లో సింధు, ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్
కౌలాలంపూర్: తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 74 నిమిషాల్లో 21–16, 13–21, 22–20తో యి మన్ జాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రణయ్ 91 నిమిషాల్లో 25–23, 18–21, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించాడు. అయితే భారత మరో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. 57 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–16, 16–21, 11–21తో ప్రపంచ 57వ ర్యాంకర్ క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో గ్రెగోరియా టున్‌జంగ్ (ఇండోనేసియా)తో సింధు; అడినాటాతో ప్రణయ్ తలపడతారు. -
Malaysia Masters: ప్రపంచ ఐదో ర్యాంకర్‌కు షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్
కౌలాలంపూర్: వ్యక్తిగత విదేశీ కోచ్‌ను నియమించుకున్న తర్వాత భారత స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆటతీరులో మార్పు కనిపిస్తోంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 5వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–19, 21–19తో అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకున్నాడు. కున్లావుత్‌పై శ్రీకాంత్‌కిదే తొలి గెలుపు కావడం విశేషం. గతంలో కున్లావుత్‌తో ఆడిన మూడుసార్లూ శ్రీకాంత్ వరుస గేముల్లో ఓడిపోవడం గమనార్హం. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌పై నెగ్గిన ప్రణయ్ భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ను ఓడించిన ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 11వ ర్యాంకర్ షి ఫెంగ్ లీని బోల్తా కొట్టించాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–16, 21–11తో షి ఫెంగ్ లీపై గెలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 7–5తో వద్ద ప్రణయ్ వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 16–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్ 14–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు వరుసగా 13వసారి... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ సింధు 21–16, 21–11తో ప్రపంచ 28వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. తొలి గేమ్‌లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. రెండో గేమ్‌లోనూ ఆమెదే పైచేయిగా నిలిచింది. ఒహోరిపై సింధుకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో జాంగ్ యి మాన్ (చైనా)తో సింధు; నిషిమోటో (జపాన్)తో ప్రణయ్; క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా)తో శ్రీకాంత్ తలపడతారు. -
Malaysia Masters: లక్ష్య సేన్, ప్రణయ్ సంచలనం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ సంచలన విజయాలతో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 21–14, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై... ప్రపంచ 23వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–10, 16–21, 21–9తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత లో కీన్ యె (సింగపూర్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 21–16తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–13, 17–21, 21–18తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై కష్టపడి విజయం సాధించింది. భారత్‌కే చెందిన అషి్మత 17–21, 7–21తో యు హాన్ (చైనా) చేతిలో, ఆకర్షి 17–21, 12–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో, మాళవిక బన్సోద్ 11–21 13–21తో జి యి వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. -
Malaysia Masters: అదరగొట్టిన సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–10తో ప్రపంచ 32వ ర్యాంకర్ జంగ్ యి మన్ (చైనా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పురుషుల ఈవెంట్లో ప్రణయ్ 21–19, 21–16తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 14–21, 17–21తో లి షె ఫెంగ్ (చైనా) చేతిలో, కశ్యప్ 10–21, 15–21తో ఆరో సీడ్ ఆంథోని సినిసుక (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింధు... రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో, ప్రణయ్... జపాన్‌కు చెందిన సునెయామతో తలపడతారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
Malaysia Masters Badminton Tourney: భారత్‌కు నిరాశాజనక ఫలితాలు
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 14–21, 14–21తో పియర్లీ టాన్–తినా (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన అశ్విని–శిఖా; దండు పూజ–ఆరతి జోడీలు కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక 10–21, 17–21తో గో జిన్ వె (మలేసియా) చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
కౌలాలంపూర్ (మలేసియా): భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో సైనా నెహ్వాల్ 21-14, 21-16 తేడాతో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. కేవలం 39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం పైచేయి సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా, రెండో గేమ్‌లో మాత్రం కాస్త పోరాడి గెలిచారు. శుక్రవారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఒకుహారా(జపాన్)తో సైనా తలపడతారు. ఇరువురి మధ్య ముఖాముఖి రికార్డులో సైనా 8-4తోముందంజలో ఉన్నారు. గతేడాది జరిగిన రెండు వరుస టోర్నమెంట్లలో(డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఒకుహారాపై సైనా విజయం సాధించారు. -
ప్రిక్వార్టర్స్‌లో సైనా, జయరామ్
సారావక్ (మలేసియా): ఈ ఏడాది ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా 21–9, 21–8తో చాసిని కొరెపాప్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సైనాకు పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో సైనా ఒకసారి వరుసగా ఏడు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. రెండో గేమ్‌లోనూ సైనా పూర్తి ఆధిపత్యం చలాయించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో హనా రమాదిని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ (భారత్) ఒకే రోజు రెండు మ్యాచ్‌లు గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్లో జయరామ్ 21–10, 17–21, 21–14తో క్వాలిఫయర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)పై, రెండో రౌండ్లో 21–9, 21–12తో సపుత్ర విక్కీ (ఇండోనేసియా)పై గెలిచాడు. సుమిత్ జంట ముందంజ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 15–21, 21–13, 21–18తో జియా హువో చెన్–చున్ కాంగ్ షియా (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 11–21, 15–21, 24–26తో చీ తీన్ తాన్–వీ జీన్ తాన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల–మనూ అత్రి (భారత్) జంట 21–19, 21–18తో లుఖి నుగ్రోహో–రిరిన్ అమెలియా (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.