కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 21–10తో హువాంగ్ యు సున్–లియాంగ్ టింగ్ యు (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో నలుగురు భారత ప్లేయర్లు సతీశ్ కుమార్, ఆయూశ్ శెట్టి, శంకర్ ముత్తుస్వామి, కార్తికేయ గుల్షన్ కుమార్ పోటీపడ్డా ఒక్కరు కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. నేడు జరిగే మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో పీవీ సింధు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment