కౌలాలంపూర్: తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 74 నిమిషాల్లో 21–16, 13–21, 22–20తో యి మన్ జాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రణయ్ 91 నిమిషాల్లో 25–23, 18–21, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించాడు.
అయితే భారత మరో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. 57 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–16, 16–21, 11–21తో ప్రపంచ 57వ ర్యాంకర్ క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో గ్రెగోరియా టున్‌జంగ్ (ఇండోనేసియా)తో సింధు; అడినాటాతో ప్రణయ్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment