Australian Open 2023 Highlights: Priyanshu Rajawat And Prannoy Reach Semi Finals, See Details - Sakshi
Sakshi News home page

Australian Open 2023 Highlights: ప్రణయ్‌ అద్భుత పోరాటం.. టాప్‌ సీడ్‌ షట్లర్‌కు షాక్‌ 

Published Fri, Aug 4 2023 6:15 PM | Last Updated on Fri, Aug 4 2023 7:41 PM

Australian Open 2023: Priyanshu, Prannoy Reach Semis - Sakshi

ఆస్ట్రేలియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, ప్రియాన్షు రజావత్‌ సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇవాళ (ఆగస్ట్‌ 4) జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ప్రణయ్‌.. టాప్‌ సీడ్‌ ఆంథోని సినిసుకను, యువ షట్లర్‌ ప్రియాన్షు.. మాజీ వరల్డ్‌ నంబర్‌ 1, భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌ను మట్టికరిపించారు.

ఇటీవలి కాలంలో సూపర్‌ టచ్‌లో ఉన్న వరల్డ్‌ నంబర్‌ 9 ప్లేయర్‌ ప్రణయ్‌.. తొలి సెట్‌ కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 16-21, 21-17, 21-14తో ప్రత్యర్ధి ఆట కట్టించాడు. మరో క్వార్టర్స్‌లో ఓర్లీయాన్స్‌ మాస్టర్స్‌ విజేత ప్రియాన్షు.. కిదాంబి శ్రీకాంత్‌ను వరుస సెట్లలో (21-13, 21-8) ఓడించాడు.క్వార్టర్స్‌లో తమ కంటే మెరుగైన ప్రత్యర్ధులపై విజయాలు సాధించిన ప్రణయ్‌, ప్రియాన్షులు సెమీస్‌లో ఎదురెదురుపడనున్నారు.

ఇదే టోర్నీలో మహిళల విభాగానికి వస్తే.. భారత ఏస్‌ షట్లర్‌, ఐదో సీడ్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. అమెరికన్‌ షట్లర్‌ బెయివెన్‌ జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు వరుస సెట్లలో (21-12, 21-17) ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. జాంగ్‌ చేతితో సింధుకు ఇది ఐదో ఓటమి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement