Australian open badminton
-
ప్రణయ్ అద్భుత పోరాటం.. టాప్ సీడ్ షట్లర్‌కు షాక్
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రణయ్.. టాప్ సీడ్ ఆంథోని సినిసుకను, యువ షట్లర్ ప్రియాన్షు.. మాజీ వరల్డ్ నంబర్ 1, భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌ను మట్టికరిపించారు. ఇటీవలి కాలంలో సూపర్ టచ్‌లో ఉన్న వరల్డ్ నంబర్ 9 ప్లేయర్ ప్రణయ్.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 16-21, 21-17, 21-14తో ప్రత్యర్ధి ఆట కట్టించాడు. మరో క్వార్టర్స్‌లో ఓర్లీయాన్స్ మాస్టర్స్ విజేత ప్రియాన్షు.. కిదాంబి శ్రీకాంత్‌ను వరుస సెట్లలో (21-13, 21-8) ఓడించాడు.క్వార్టర్స్‌లో తమ కంటే మెరుగైన ప్రత్యర్ధులపై విజయాలు సాధించిన ప్రణయ్, ప్రియాన్షులు సెమీస్‌లో ఎదురెదురుపడనున్నారు. ఇదే టోర్నీలో మహిళల విభాగానికి వస్తే.. భారత ఏస్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. అమెరికన్ షట్లర్ బెయివెన్ జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు వరుస సెట్లలో (21-12, 21-17) ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. జాంగ్ చేతితో సింధుకు ఇది ఐదో ఓటమి. -
39 నిమిషాల్లో సింధు కథ ముగిసే.. క్వార్టర్స్‌లో ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత టాప్ మహిళా షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. ఈ సీజన్లో నాలుగోసారి సెమీస్‌లో అడుగుపెట్టాలనుకున్న సింధు ఆశలకు బీవెన్ జాంగ్ బ్రేక్ వేసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17తో ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే సింధు తన గేమ్‌ను ప్రత్యర్థి చేతిలో పెట్టి ఓటమిని అంగీకరించింది. గతంలో జాంగ్‌తో జరిగిన 10 మ్యాచుల్లో ఆరు సార్లు సింధునే గెలిచింది. కానీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో 33 ఏళ్ల చైనా అమెరికన్ ప్లేయర్ చేతిలో పరాభవం తప్పలేదు. 2019 వరల్డ్ చాంపియన్ అయిన సింధు.. ఇటీవల గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగింది. అయితే ఈ ఏడాది జరిగిన 12 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఏడింటిలో ఆమె ఒక్కదాంట్లో కూడా ఫైనల్‌కు చేరలేదు. పీవీ సింధు ప్రస్తుతం 17వ ర్యాంక్‌లో ఉంది. ఆగస్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు సింధు ఇలా పేలవ ప్రదర్శన ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2003లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయిన మహమ్మద్ హఫీజ్ హసీమ్ వద్ద ప్రస్తుతం సింధు శిక్షణ తీసుకుంటోంది. Pusarla V. Sindhu 🇮🇳 and Beiwen Zhang 🇺🇸 take to the court in Sydney.#BWFWorldTour #AustralianOpen2023 pic.twitter.com/8y5zAWagGU — BWF (@bwfmedia) August 4, 2023 Well played champ 🙌 📸: @badmintonphoto #AustraliaOpen2023#Badminton pic.twitter.com/zxOi6wOs8e — BAI Media (@BAI_Media) August 4, 2023 చదవండి: Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. -
క్వార్టర్స్‌లో పీవీ సింధు.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్‌కు చేరుకోవడంతో ఫామ్‌లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్‌లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్‌తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్‌ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక భారత్‌కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్‌పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌తో తలపడనున్నాడు. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో? -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసిన భారత షట్లర్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు మొదటి రౌండ్లో విజయం సాధించారు. జపాన్ ఓపెన్‌లో విఫలమైన ప్రణయ్ హాంకాంగ్‌కు చెందిన చెక్ యూను చిత్తు చేశాడు. మూడు సెట్లలో జోరుగా ఆడిన భారత షట్లర్ 21-18, 16-21, 21-15తో గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ శ్రీకాంత్ జపాన్ ఆటగాడైన కెంటా నిషిమొటోపై 21-18, 21-7తో అవలీలగా గెలుపొందాడు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌కు చేరింది. 47వ ర్యాంకర్ అష్మితా చాలిహపై 21-18, 21-13తో సింధు విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె భారత్‌కే చెందిన ఆకర్షి కష్యప్‌ను ఢీ కొట్టనుంది. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్, రుత్విక
సిడ్నీ: గాయం నుంచి తేరుకొని మళ్లీ రాకెట్ పట్టిన భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్, యువతారలు సిరిల్ వర్మ, గద్దె రుత్విక శివాని... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఈ ముగ్గురూ అజేయంగా నిలిచారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో కశ్యప్ 21–15, 21–18తో జావో జున్‌పెంగ్ (చైనా), రెండో రౌండ్లో 21–5, 21–16తో ఇండోనేసియా ఓపెన్ రన్నరప్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. సిరిల్ వర్మ తొలి రౌండ్లో 21–9, 21–9తో ఫ్రిట్జ్ మైనకి (ఇండోనేసియా)పై, రెండో రౌండ్లో 21–16, 21–15తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో రుత్విక 21–15, 21–15తో సిల్వినా కుర్నియావాన్ (ఆస్ట్రేలియా)పై, రెండో రౌండ్లో 21–9, 21–7తో రువింది సెరెసింఘే (ఆస్ట్రేలియా)పై గెలిచింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్ కాన్ చావో యు (చైనీస్ తైపీ)తో కిడాంబి శ్రీకాంత్; ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో అజయ్ జయరామ్; ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; విటింగస్ (డెన్మార్క్)తో సిరిల్ వర్మ; యూరోపియన్ చాంపియన్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో ప్రణయ్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా నెహ్వాల్; ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు; చెన్ జియోజిన్ (చైనా)తో రుత్విక శివాని ఆడతారు. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: గత టోర్నీల్లో కనీసం తొలిరౌండ్‌ను కూడా దాటలేకపోయిన భారత షట్లర్ శ్రీకాంత్... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-19, 21-12తో సోని ద్వికుంకురో (ఇండోనేిసియా)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాద్ కుర్రాడు తొలి గేమ్‌లో 4-6, 13-15తో వెనుకబడి పుంజుకున్నాడు. రెండో గేమ్‌లో 3-3తో స్కోరు సమమైన తర్వాత శ్రీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21-11, 7-21, 19-21తో సిన్సుకా జింటింగ్ (ఇండోనేిసియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడోసీడ్ సైనా 21-12, 21-14తో జిన్ వీ గోపై గెలిచి క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో సైనా కాస్త అలసత్వం ప్రదర్శించింది. దీంతో జిన్ 4-1, 9-7 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో హైదరాబాదీ వరుసగా ఆరుపాయింట్లు నెగ్గి 13-9తో పైచేయి సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సైనా 5-2తో ఆధిక్యంలో ఉన్నా.. జిన్ 9-9తో స్కోరు సమం చేసింది. కానీ నెట్ వద్ద మెరుగైన ప్రదర్శన చూపెట్టిన సైనా గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్‌లో తన్వీలాడ్ 18-21, 6-21తో నాలుగోసీడ్ వాంగ్ యిహాన్ (చైనా) చేతిలో కంగుతింది. -
సైనాకు చుక్కెదురు
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. ప్రపంచ ఆరో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, రెండో సీడ్ సైనా 15-21, 13-21తో ఓడిపోయింది. 41 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏదశలోనూ తన ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. సైనాతో 12వ సారి ఆడుతోన్న షిజియాన్‌కు సైనా బలాబలాలపై అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. గతేడాది ఇదే టోర్నీలో సైనా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సైనా, షిజియాన్ 6-6తో సమంగా ఉన్నారు. ఈ ఓటమితో సైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ మరోసారి చేజారే అవకాశముంది. -
ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ
సిడ్నీ: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 15-21, 13-21తేడాతో ఐదోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా ఏ దశలోనూ ఆకట్టులేకపోయింది. తొలి గేమ్ లో ఐదు పాయింట్లు వరకూ నువ్వా-నేనా అన్నట్లు సైనా తలపడినా.. ఆ తరువాత మాత్రం పేలవమైన ఆటను ప్రదర్శించింది. వరుస సెట్లను చేజార్చుకుని ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి భారంగా వైదొలిగింది. మాజీ వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి షిజియాన్ కేవలం 42 నిమిషాల్లోని సైనా ఆటకట్టించింది. -
క్వార్టర్స్‌లో సైనా
♦ శ్రీకాంత్ ఓటమి ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మినహా.. మిగతా వారు నిరాశపర్చారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ సైనా 21-19, 19-21, 21-14తో సన్ యు (చైనా)పై నెగ్గి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ శ్రీకాంత్ 21-18, 17-21, 13-21తో టియాన్ హోవోయి (చైనా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ లో జ్వాలా-అశ్విని జోడి 14-21, 10-21తో నాలుగోసీడ్ ఇండోనేసియా జంట నిత్య క్రిషిందా మహేశ్వరి-గ్రేసియా పోలీ చేతిలో పరాజయం చవిచూసింది. సన్ యుతో గంటా 18 నిమిషాల పాటు జరిగిన పోరాటంలో సైనాకు గట్టి ప్రతిఘటనే ఎదురైంది. తొలి గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన హైదరాబాదీ 5-5, 11-6తో ఆధిక్యాన్ని సాధించింది. ఈ దశలో సన్ పుంజుకొని 18-18తో స్కోరును సమం చేసినా సైనా ధాటికి నిలువలేకపోయింది. రెండో గేమ్‌లో ఆరంభంలో సైనా జోరు కనబర్చినా.. చివర్లో సన్ కట్టడి చేసింది. ఓ దశలో భారత అమ్మాయి 13-7 ఆధిక్యంలో నిలిచినా... సన్ వీరోచితంగా పోరాడుతూ 13-13తో స్కోరును సమం చేసింది. తర్వాత సైనా 18-15 ఆధిక్యాన్ని సంపాదించినా సన్ ధాటికి వరుసగా పాయింట్లు కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడినా సైనా 12-4 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు సన్ చేసిన ప్రయత్నాలను సమర్థంగా తిప్పికొట్టిన హైదరాబాదీ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ఐదోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా తలపడుతుంది. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: వరుసగా రెండు అలవోక విజయాలతో హైదరాబాద్ ప్లేయర్ ఆర్‌ఎంవీ గురుసాయిదత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-13, 21-9తో అయ్ వీ జియాన్ (మలేసియా)పై నెగ్గి... రెండో రౌండ్లో 21-15, 21-8తో కజుమాసా సకాయ్ (జపాన్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అశ్విని పొన్నప్ప (భారత్) జంట కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. తొలి రౌండ్లో ప్రణవ్-అశ్విని 21-19, 21-17తో మార్క్ లామ్స్‌ఫస్-ఇసాబెల్ హెర్ట్రిచ్ (జర్మనీ)పై, రెండో రౌండ్లో 21-4, 21-6తో చామ్ చెన్-సుసాన్ వాంగ్ (ఆస్ట్రేలియా)లపై విజయం సాధించారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో కశ్యప్; విటింగస్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో గురుసాయిదత్; లిడియా యి యు (మలేసియా)తో సైనా నెహ్వాల్, ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు తలపడతారు. -
సెమీస్‌లో సైనా సింధుకు నిరాశ
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ సెమీస్‌కు చేరుకోగా... ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధుకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ఆరో సీడ్ సైనా 21-18, 21-19తో ఎరికో హీరోస్ (జపాన్)పై విజయం సాధిస్తే.... ఎనిమిదోసీడ్ సింధు 17-21, 17-21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో పోరాడి ఓడింది. హీరోస్తో 47 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా ఆధిపత్యం కనబర్చింది. 4-0తో తొలి గేమ్‌ను ఆరంభించిన హైదరాబాద్ అమ్మాయి తర్వాత 8-2తో ఆధిక్యంలో నిలిచింది. అయితే హీరోస్ పోరాడి స్కోరు 10-10, 18-18తో సమం చేసినా చివర్లో సైనా మూడు వరుస పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో హీరోస్ 2-3తో దగ్గరకొచ్చినా తర్వాత ఏ దశలోనూ భారత ప్లేయర్‌ను అందుకోలేకపోయింది. మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు గట్టిపోటీ ఇచ్చింది. తొలి గేమ్‌లో తరచు ఆధిక్యం చేతులు మారడంతో స్కోరు 17-17తో సమమైంది. కానీ నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించిన మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు దూకుడుగా ఆడటంతో ఓ దశలో ఇద్దరు క్రీడాకారిణులు 7-7 వద్ద సమంగా నిలిచారు. అయితే ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచడంలో విఫలమైన సింధు 15-20తో వెనుకబడింది. ఈ దశలో మారిన్ సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా క్రమంగా వెనుకబడిపోయింది. శనివారం జరిగే సెమీస్‌లో సైనా... ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్‌తో తలపడుతుంది. వాంగ్‌తో ముఖాముఖి రికార్డు 4-3 ఉన్నా.. ఇటీవల తలపడిన రెండుసార్లు సైనా ఓడింది.