ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత టాప్ మహిళా షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. ఈ సీజన్‌లో నాలుగోసారి సెమీస్‌లో అడుగుపెట్టాలనుకున్న సింధు ఆశలకు బీవెన్ జాంగ్ బ్రేక్ వేసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17తో ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే సింధు తన గేమ్‌ను ప్రత్యర్థి చేతిలో పెట్టి ఓటమిని అంగీకరించింది.
గతంలో జాంగ్‌తో జరిగిన 10 మ్యాచుల్లో ఆరు సార్లు సింధునే గెలిచింది. కానీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో 33 ఏళ్ల చైనా అమెరికన్ ప్లేయర్ చేతిలో పరాభవం తప్పలేదు. 2019 వరల్డ్ చాంపియన్ అయిన సింధు.. ఇటీవల గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగింది. అయితే ఈ ఏడాది జరిగిన 12 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఏడింటిలో ఆమె ఒక్కదాంట్లో కూడా ఫైనల్‌కు చేరలేదు.
పీవీ సింధు ప్రస్తుతం 17వ ర్యాంక్‌లో ఉంది. ఆగస్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్‌హెగన్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు సింధు ఇలా పేలవ ప్రదర్శన ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2003లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయిన మహమ్మద్ హఫీజ్ హసీమ్ వద్ద ప్రస్తుతం సింధు శిక్షణ తీసుకుంటోంది.
Pusarla V. Sindhu 🇮🇳 and Beiwen Zhang 🇺🇸 take to the court in Sydney.#BWFWorldTour #AustralianOpen2023 pic.twitter.com/8y5zAWagGU
— BWF (@bwfmedia) August 4, 2023
Well played champ 🙌
— BAI Media (@BAI_Media) August 4, 2023
📸: @badmintonphoto #AustraliaOpen2023#Badminton pic.twitter.com/zxOi6wOs8e
చదవండి: Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
Comments
Please login to add a commentAdd a comment