ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది.
కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్‌కు చేరుకోవడంతో ఫామ్‌లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్‌లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్‌తో తలపడనుంది.
ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్‌లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్‌ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
ఇక భారత్‌కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్‌పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌తో తలపడనున్నాడు.
చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో?
Comments
Please login to add a commentAdd a comment