BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్‌కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 17వ ర్యాంక్‌లో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం
మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించింది.
Comments
Please login to add a commentAdd a comment