Badminton rankings
-
తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం..
BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్‌కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 17వ ర్యాంక్‌లో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించింది. -
PV Sindhu: వరుస ఓటములు.. టాప్-10 నుంచి ఔట్
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 2016 నవంబర్ తర్వాత తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో చోటు కోల్పోయింది. గతవారం ముగిసిన స్విస్ ఓపెన్‌లో సింధు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ఈ ఫలితం ఆమె ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు మహిళల సింగిల్స్ విభాగంలో రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ ఏడాది సింధు నాలుగు టోర్నీలలో పాల్గొని మూడింటిలో తొలి రౌండ్లో ఓడిపోయి, మరో టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించింది. ప్రస్తుతం మాడ్రిడ్‌లో జరుగుతున్న స్పెయిన్ మాస్టర్స్ టోరీ్నలో సింధు బరిలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహా్వల్ ఒక స్థానం ఎగబాకి 31వ ర్యాంక్‌లో నిలిచింది. జనవరిలో ఇండోనేసియా ఓపెన్ తర్వాత సైనా మరో టోరీ్నలో ఆడలేదు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ తొమ్మిదో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా... కిడాంబి శ్రీకాంత్ 21వ ర్యాంక్‌లో, లక్ష్య సేన్ 25వ ర్యాంక్‌లో నిలిచారు. -
BWF Rankings: ఎనిమిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం
World Badminton Rankings 2022: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కొంత కాలంగా చక్కటి ఫామ్‌లో ఉన్న ప్రణయ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఇతర భారత షట్లర్లలో లక్ష్యసేన్ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా, కిడాంబి శ్రీకాంత్ 12వ స్థానానికి దిగజారాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన పీవీ సింధు కూడా ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది. ఇది కూడా చదవండి: అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఇరిగేశి అర్జున్ మంగళవారం జరిగిన నాలుగు రౌండ్లలో రెండు గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్లో ఓటమి పాలయ్యాడు. 9 రౌండ్లు ముగిసిన అనంతరం అర్జున్ 6.5 పాయింట్లతో మరో ఆరుగురి తో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల ర్యాపిడ్ చెస్‌లో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి భారత క్రీడాకారిణి సవితశ్రీ (6.5) మరో ఇద్దరితో కలిసి ఆధిక్యంలో ఉంది. -
పీవీ సింధు కెరీర్లో తొలిసారి..
హైదరాబాద్: కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న తెలుగుతేజం పీవీ సింధు మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సింధు తొలిసారి ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌ను దాటి మెరుగైన స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ జాబితాలో సింధు తొమ్మిదో స్థానం సాధించింది. కాగా సైనా టాప్-10లో చోటు కోల్పోయి 11వ ర్యాంకుకు పడిపోయింది. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌లో సైనా, సింధు తలపడే అవకాశముంది. సింధు ఇప్పటికే సెమీస్ చేరగా, సైనా క్వార్టర్స్ ప్రత్యర్థిపై గెలవాల్సివుంది. -
టాప్ కు చేరిన సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: గతేడాది చివర్లో జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రజత పతకం సాధించిన సిరిల్ వర్మ.. పురుషుల జూనియర్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సిరిల్ వర్మ 11 స్థానాలు ఎగబాకి టాప్ కు చేరాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ లో రన్నరప్‌గా నిలవడంతో సిరిల్ తన పాయింట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుని ప్రథమ స్థానాన్ని సాధించాడు. ఇదిలా ఉండగా, మరో జూనియర్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చిరాగ్ సేన్ కు మూడో స్థానానికి చేజిక్కించుకోగా, ఫ్రాన్స్ కు చెందిన తోమా పావోవ్ కు రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన రెండో ర్యాంకును కాపాడుకోగా, పివి సింధు 12వ ర్యాంకును నిలుపుకుంది. కాగా, స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ అగ్రస్థానంలో , చైనాకు చెందిన లీ జురియ్ మూడో స్థానంలో నిలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కు ఒక్కడికే టాప్ -10 లో స్థానం దక్కింది. శ్రీకాంత్ 9వ ర్యాంకును కైవసం చేసుకోగా,పారుపల్లి కశ్యప్ 15వ స్థానం, ప్రణయ్ 20, అజయ్ జయరామ్ 21 వ స్థానాల్లో నిలిచారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీకాంత్
న్యూఢిల్లీ: చైనా ఓపెన్ టైటిల్ కైవశం చేసుకుని రికార్డు సృష్టించిన భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్ పరుషుల సింగిల్స్ విభాగంలో 10వ ర్యాంకులో నిలిచాడు. 6 స్థానాలు మెరుగుపరుచుకుని అతడు టాప్ టెన్ లోకి దూసుకొచ్చాడు. పారుపల్లి కశ్యప్ 17వ ర్యాంకులో ఉన్నాడు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 4వ ర్యాంకులో నిలిచింది. పీవీ సింధు 10వ స్థానంలో కొనసాగుతోంది. డబుల్స్ లో గుత్తా జ్వాల, అశ్విని పొనప్ప 19వ ర్యాంకు దక్కించుకున్నారు.