సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రార్థనా స్థలాల అంశంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని కోర్టును ఒవైసీ కోరారు. దీంతో, ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని పిటిషన్లపై వచ్చే నెల 17న విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతర, అన్ని పిటిషన్లపై ఫిబ్రవరి 17న విచారణ జరుపుతామని సంజీవ్ ఖన్నా ధర్మాసనం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment