జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నేతల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా పోలీస్ చీఫ్ టార్గెట్‌గా జరిగిన దాడుల్లో కీలక నేత సహ 68 మంది మృతి చెందారు. ఈ మేరకు వైమానిక దాడులను ఇజ్రాయెల్ సైతం ధృవీకరించింది.
గాజా సిటీపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 68 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో హమాస్ పోలీస్ చీఫ్ హసామ్ షాహ్వాన్‌తో పాటు.. మరో కీలక హమాస్ నేత మహమ్మద్ సలాహ్ కూడా ఉన్నారు. షాహ్వాన్ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. పోలీస్ చీఫ్ హసామ్ మృతి కారణంగా హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కీలక నేతగా ఉన్నారు. తాజా దాడిలో మరణించిన వారిలో పౌరులే ఎక్కువ మంది ఉన్నారు.
అయితే, ఇజ్రాయెల్ పౌరులు ఆశ్రయం ఉంటున్న అల్-మవాసి జిల్లాను మానవతా జోన్‌గా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ కారణంగానే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, కొత్త ఏడాదిలో రెండు రోజులు ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
ఇదిలా ఉండగా.. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధంలో 45,500 మందికి పైగా పాలస్తీనియన్లను మరణించారు. గాజాలోని 2.3 మిలియన్ల మంది ప్రజలు సిటీని విడిచివెళ్లిపోయారు. ఇదే సమయంలో హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరో 251 మంది ఇజ్రాయెల్ పౌరులను గాజా వద్ద బంధీలుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment