ఇజ్రాయెల్‌ విధ్వంసం.. హమాస్‌ చీఫ్‌ మృతి! | Israel Claims Hamas Yahya Sinwar Dead In Gaza Strip | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ విధ్వంసం.. హమాస్‌ చీఫ్‌ మృతి!

Published Mon, Sep 23 2024 11:32 AM | Last Updated on Mon, Sep 23 2024 11:32 AM

Israel Claims Hamas Yahya Sinwar Dead In Gaza Strip

హమాస్‌ను ఇజ్రాయెల్‌ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్‌ హత మార్చింది. ఇక, తాజాగా హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ కూడా మరణించినట్టు ఇజ్రాయెల్‌ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.

గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహకర్త అయిన హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్‌ ఇటీవల కాలంలో హమాస్‌ సొరంగాల వ్యవస్థపై భీకర దాడులు చేసింది. సొరంగాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి హమాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అయితే, ఈ సొరంగాల్లో సిన్వార్‌ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో ఉన్నాయి. 

అ​యితే, ఈ మధ్య కాలంలో అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా బలగాలు సిన్వార్‌ చనిపోయినట్టు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఐడీఎఫ్‌ కూడా  అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అని నిర్ధారించుకోలేకపోతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్‌ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ కూడా ఒకవేళ సిన్వార్‌ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. ఇజ్రాయెల్‌ చెబుతున్నట్టు ఒకవేళ సిన్వార్‌ కనుక మరణించి ఉంటే మాత్రం హమాస్‌కు కోలుకులేని దెబ్బ తగలినట్టే అవుతుంది.


 

ఇది కూడా చదవండి: ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement