Israel attacks
-
గాజా మృతులు 50 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి బలైన వారి సంఖ్య 50 వేలు దాటింది! ఆదివారం గాజా ఆరోగ్య విభాగం ఈ మేరకు ప్రకటించింది. ‘‘మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులే. 1.13 లక్షల మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా జనాభాలో 90 శాతం మంది నిలువనీడ కోల్పోయారు’’ అని ఆవేదన వెలిబుచ్చింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన తాజా వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ విభాగం సీనియర్ నేత సహా 23 మంది చనిపోయారు. ఖాన్‌యూనిస్ సమీపంలో దాడుల్లో పాలస్తీనా పార్లమెంట్ సభ్యుడు, తమ రాజకీయ విభాగం సభ్యుడు సలాహ్ బర్దావిల్, ఆయన భార్య చనిపోయినట్లు హమాస్ వర్గాలు ప్రకటించాయి. టెంట్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వీరిపై దాడి జరిగిందని పేర్కొన్నాయి. హమాస్ రాజకీయ వ్యవహారాలపై తరచూ మీడియాకు బర్దావిల్ ఇంటర్వ్యూలిస్తుంటారు. ఖాన్ యూనిస్‌పై జరిగిన దాడిలో దంపతులతో పాటు వారి ఐదుగురు సంతానం చనిపోయారు. మరో దాడిలో దంపతులు, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయినట్టు యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో దాడిలో చనిపోయిన మహిళ, చిన్నారి మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కువైటీ ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు.మారణహోమమే హమాస్ సాయుధులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి 1,200 మందిని చంపడం, 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది. ఆ ప్రాంతాన్ని శ్మశానసదృశంగా మార్చేసింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ రెండు నెలల ముచ్చటే అయింది. వారం రోజులుగా మళ్లీ గాజాపై దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
పాలస్తీనా శరణార్థులను అక్కున చేర్చుకోండి
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా మారిన పాలస్తీనా పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. జోర్డాన్, ఈజిప్టుతోపాటు ఇతర అరబ్ దేశాలు వారికి ఆశ్రయ మివ్వాలని సూచించారు. వారి బాగోగులు చూసుకోవాలన్నారు. ఇజ్రాయెల్‌కు 2 వేల పౌండ్ల బరువైన బాంబుల సరఫరాను నిలిపివేస్తూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశానని వెల్లడించారు. వాటిని శనివారమే ఇజ్రాయెల్‌కు అందజేశామని చెప్పారు.గాజాను శుభ్రం చేయాలి గాజా పూర్తిగా విధ్వంసానికి గురైన ప్రాంతమని, శిథిలాలను తొలగించి, శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కనుక ఎక్కువ మంది ప్రజలు బయటకు వెళితే కార్యాచరణ తేలికవుతుందన్నారు. గాజా పౌరులకు మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తే, అక్కడ వారు శాంతియుతంగా జీవనం సాగించగలరన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ కార్యాలయం ఇంకా స్పందించలేదు. మరోవైపు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన బందిలందరినీ విడుదల చేయకపోతే హమాస్‌పై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. అసలు వ్యూహం అదేనా? పాలస్తీనా శరణార్థులు అరబ్ దేశాలు అనుమతించాలనడం, ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేయడం వెనుక మరో వ్యూహం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బందీల విడుదల పూర్తయిన తర్వాత గాజా నుంచి పాలస్తీనా పౌరులను బయటకు తరలించి, హమాస్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయా లన్నదే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం కావొచ్చని తెలుస్తోంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆ రెండు దేశాలు యోచిస్తున్నాయి. -
జెనిన్లో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్
జెనిన్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. 35 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జెనిన్లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ విస్సామ్ బకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు వెళ్లడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు. ఇజ్రాయెల్ దళాలు పౌరులపై కాల్పులు జరిపాయని, దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాబ్ తెలిపారు. జెనిన్లో ఒక టీనేజర్సహా 9 మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. టియానిక్ గ్రామంలోనూ ఇజ్రాయెల్ దళాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత, వెస్ట్‌బ్యాంక్‌లో దాడులు జరగడం గమనార్హం. ‘‘వెస్ట్ బ్యాంక్‌లో భద్రతను బలోపేతానికి, మా లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగుగా జెనిన్ ఆపరేషన్ చేపట్టాం. లెబనాన్, సిరియా, యెమెన్, వెస్ట్ బ్యాంక్‌లలో ఇరాన్ ఏ ప్రాంతంపై ప్రభావం చూపించాలనుకున్నా మేం దానిని అడ్డుకుంటాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, నిధులను అందిస్తోందని ఆరోపించారు. ‘‘ ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాల మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడం ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం’’ అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. -
హమాస్‌తో డీల్.. నెతన్యాహు వ్యాఖ్యల అర్థమేంటి?
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. అనూహ్యంగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో నిర్బంధించబడిన ఇజ్రాయెల్ బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి వీలు కలుగుతుంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.ఇక, అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయలయ్యారు. -
ఇజ్రాయెల్ ప్లాన్ సక్సెస్.. హమాస్‌కు కోలుకులేని ఎదురుదెబ్బ
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నేతల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా పోలీస్ చీఫ్ టార్గెట్‌గా జరిగిన దాడుల్లో కీలక నేత సహ 68 మంది మృతి చెందారు. ఈ మేరకు వైమానిక దాడులను ఇజ్రాయెల్ సైతం ధృవీకరించింది.గాజా సిటీపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 68 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో హమాస్ పోలీస్ చీఫ్ హసామ్ షాహ్వాన్‌తో పాటు.. మరో కీలక హమాస్ నేత మహమ్మద్ సలాహ్ కూడా ఉన్నారు. షాహ్వాన్ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. పోలీస్ చీఫ్ హసామ్ మృతి కారణంగా హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కీలక నేతగా ఉన్నారు. తాజా దాడిలో మరణించిన వారిలో పౌరులే ఎక్కువ మంది ఉన్నారు.అయితే, ఇజ్రాయెల్ పౌరులు ఆశ్రయం ఉంటున్న అల్-మవాసి జిల్లాను మానవతా జోన్‌గా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ కారణంగానే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, కొత్త ఏడాదిలో రెండు రోజులు ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.ఇదిలా ఉండగా.. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధంలో 45,500 మందికి పైగా పాలస్తీనియన్లను మరణించారు. గాజాలోని 2.3 మిలియన్ల మంది ప్రజలు సిటీని విడిచివెళ్లిపోయారు. ఇదే సమయంలో హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరో 251 మంది ఇజ్రాయెల్ పౌరులను గాజా వద్ద బంధీలుగా ఉన్నారు. -
రివైండ్ 2024: చేదెక్కువ... తీపి తక్కువ!
2024 ఏడాది మన స్మృతి పథం నుంచి మరలిపోతూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు గుర్తులుగా మిగిల్చిపోతోంది. దశాబ్దాల బషర్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు తిరుగుబాటుదారులు స్వేచ్ఛ కల్పిస్తే అగ్రరాజ్యం అమెరికాలో ఓటర్లు దుందుడుకు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి పాలనా పగ్గాలు అప్పజెప్పారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థుల చేసిన ఉద్యమం ధాటికి షేక్ హసీనాను అధికార పీఠం నుంచి దిగిపోయి భారత్‌కు పలాయనం చిత్తగించారు. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం మరకలను భారత్‌కు పూసేందుకు కెనడా బరితెగించింది. అందుకు దీటుగా దౌత్యవేత్తలను బహిష్కరించి, భారత్ తీవ్ర నిరసన తెలపడంతో బాగా క్షీణించిన ఇరు దేశాల సత్సంబంధాలు వంటి ఎన్నో ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీపికబుర్లనూ 2024 మోసుకొచ్చింది. ప్లాస్టిక్‌భూతం భూమండలాన్ని చుట్టేస్తున్న వేళ పర్యావరణహిత ప్లాస్టిక్‌ను జపాన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్ వలలో చిక్కుకున్న చిన్నారులను దాని నుంచి బయటపడేసేందుకు ఆ్రస్టేలియా వంటి పలు దేశాలు టీనేజర్ల ‘సోషల్’వినియోగంపై ఆంక్షలు విధించాయి. అసాధ్యమనుకున్న రాకెట్ టెక్నాలజీని స్పేస్ఎక్స్ సాధించి చూపింది. ప్రయోగించాక తిరిగొస్తున్న రాకెట్ సూపర్హెవీ బూస్టర్‌ను ప్రయోగవేదిక భారీ రోబోటిక్ చేతితో తిరిగి ఒడిసిపట్టి ఔరా అనిపించింది. 2024 ప్రపంచపుస్తకంలోని కొన్ని ముఖ్య పేజీలను తరచిచూస్తే...ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఏప్రిల్‌లో సిరియాలోని తమ దౌత్యకార్యాలయంపైకి ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఇరాన్ వీరావేశంతో ఇజ్రాయెల్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు రంగంలోకి దూకింది. నెలల తరబడి గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌పైకి బాంబులేసి కొత్తగా ఇరాన్ యుద్ధంలో తలదూర్చింది. దీంతో హమాస్ నుంచి ఇజ్రాయెల్ తన దృష్టినంతా ఇరాన్‌పై నిలిపింది. దాని పర్యవసానాలను ఇరాన్ తీవ్రంగా చవిచూసింది. ఇజ్రాయెల్ భీకర దాడులను తట్టుకోలేక ఇరాన్ దాదాపు చేతులెత్తేసింది. తూర్పు అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతంలో డొక్కు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ చనిపోయారు. కీలక నేత మరణంతో ఇజ్రాయెల్‌తో పోరులో అంతర్జాతీయంగా సైనికసాయం సాధించడంలోనూ ఇరాన్ విఫలమైంది. పేజర్లు, వాకీటాకీల ఢమాల్ ఢమాల్ యుద్ధవ్యూహాల చరిత్రలో ఎన్నడూలేనంత వినూత్న శైలిలో శత్రువుల పీచమణచడంలో తమది అందవేసిన చేయి అని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించుకున్న సంఘటన ఇది. హమాస్‌కు మద్దతుపలుకుతున్న హెజ్»ొల్లా ఉగ్రమూలాలను ఇజ్రాయెల్ భారీగా దెబ్బకొట్టింది. తామే సృష్టించిన ఒక డొల్ల కంపెనీ ద్వారా వేలాదిగా పేజర్లు, వాకీటాకీలను హెజ్»ొల్లాతో కొనిపించి, అవి డెలివరీ అయ్యేలోపే వాటిల్లో సూక్ష్మస్థాయిలో ప్లాస్టిక్ బాంబును అమర్చి హెజ్»ొల్లా మిలిటెంట్లను ఇజ్రాయెల్ చావుదెబ్బతీసింది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఏకకాలంలో వేలాది పేజర్లు, వాకీటాకీలను పేల్చేసింది. దీంతో దాదాపు 4,000 మంది రక్తసిక్తమయ్యారు. డజన్ల మంది చనిపోయారు. ఈ దాడి దెబ్బకు లెబనాన్‌లో సామాన్యులు సైతం ఏసీలు, రేడియోలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడేందుకు వణికిపోయారు.కయ్యానికి కాలుదువ్విన కెనడా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత ప్రమేయం ఉందంటూ అక్కడి భారత హైకమిషన్కే నోటీసులిచ్చి విచారణ జరిపేందుకు కెనడా సాహసించి భారతదేశ ఆగ్రహానికి గురైంది. వెంటనే ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలు, ఎంబసీలు, కాన్సులేట్ల సిబ్బందిని వెనక్కి పంపేసి, సొంత దౌత్యాధికారులను వెనక్కి రప్పించి భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసింది. కెనడా సైతం అలాంటి దుందుడుకు చర్యకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య దౌత్య సత్సంబంధాలు దారుణంగా క్షీణించాయి. బంగ్లాదేశ్‌లో కూలిన హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ విమోచనోద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు, ప్రవేశాల్లో రిజర్వేషన్లపై విద్యార్థి లోకం కన్నెర్రజేయడంతో ప్రధాని షేక్ హసీనా కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. హుటాహుటిన ఢాకాను వదిలి ఢిల్లీకి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, హిందూ మైనారిటీలపై దాడులతో బంగ్లాదేశ్ ప్రభ అంతర్జాతీయంగా ఒక్కసారిగా మసకబారింది. పరిస్థితిని కాస్తంత చక్కబెడతానంటూ తాత్కాలికంగా పగ్గాలు చేపట్టిన యూనుస్ కూటమి ఇప్పుడేం చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యమాలను అణచేస్తూ వేలమంది మరణాలకు బాధ్యురాలైన హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరడం, భారత్ స్పందించకపోవడం చూస్తుంటే పొరుగుదేశంలో భారత్‌కు సఖ్యత చెడే విపరిణామాలే కనుచూపుమేరలో కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యంపై రిపబ్లికన్ జెండా రెపరెపలు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో దూసుకొచ్చి అలవోకగా అగ్రరాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్న రిపబ్లికన్ల అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 2025 ఏడాదికి హాట్‌టాపిక్ వ్యక్తిగా మారారు. ముఖాముఖి చర్చలో బైడెన్‌ను మట్టికరిపించి తన గెలుపును దాదాపు ఖాయం చేసుకున్న ట్రంప్ ఆతర్వాత రేసులో దిగిన కమలా హారిస్‌పై వ్యక్తిగత, విధానపర నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసి నెగ్గుకురావడం విశేషం. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపేస్తానన్న ప్రతిజ్ఞను ట్రంప్ ఏమేరకు నెరవేరుస్తారో వేచిచూడాలి. తమపై ఎక్కువ పన్ను వేసే భారత్‌పై అధిక పన్నులు మోపుతానని, తమకు భారంగా మారిన కెనడాపై అధిక ట్యాక్స్ వేస్తానని ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారులను కట్టకట్టి బయటకు పంపేస్తానన్నారు. నైతిక నిష్టలేని వ్యక్తులను కీలక పదవులకు నామినేట్ చేస్తూ ట్రంప్ తన ఏకపక్ష ధోరణిని ఇప్పటికే బయటపెట్టుకున్నారు. సిరియాలో బషర్‌కు బైబై తండ్రి నుంచి వారసత్వంగా పాలన మాత్రమే కాదు నిరంకుశ లక్షణాలను పుణికిపుచ్చుకున్న బసర్ అల్ అసద్‌కు తిరుగుబాటుదారులు ఎట్టకేలకు చరమగీతం పాడారు. తిరుగుబాటుదారుల మెరుపు దాడులతో అసద్ హుటాహుటిన రష్యాకు పారిపోయారు. దీంతో సిరియన్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాసనలు కొట్టే తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఇకపై సిరియా ఏపాటి అభివృద్ధి ఫలాలను అందుకుంటుందోనని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎవరికి వారు కొంత ప్రాంతాలను పాలిస్తున్న వేర్పాటువాదులను ఏకం చేసి ఐక్యంగా దేశాన్ని పాలించాల్సిన బాధ్యత ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్షామ్ అధినేత అబూ మొహమ్మద్ అల్ జులానీ మీద పడింది. రష్యా నేలపైకి ఉక్రెయిన్ సేనలు నెలల తరబడి జరుగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో 2014లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆగస్ట్ ఆరున రష్యాలోని కురస్క్ ఒబ్లాస్ట్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సేనలు ఆక్రమించాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని మరో దేశం ఆక్రమించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ సేనల దూకుడుకు కళ్లెం వేసేందుకు రష్యా భూతల, గగనతల దాడులకు తెగబడింది. మళ్లీ దాదాపు సగంభూభాగాన్ని వశంచేసుకోగల్గింది. ఇంకా అక్కడ రోజూ భీకర పోరు కొనసాగుతోంది. మరోవైపు రష్యా తరఫున పోరాడుతూ ఉత్తరకొరియా సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పశి్చమదేశాల నుంచి అందుతున్న దీర్ఘశ్రేణి మిస్సైళ్లతో ఉక్రెయిన్ వచ్చే ఏడాది యుద్ధాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందోమరి.దక్షిణకొరియాలో ఎమర్జెన్సీ పార్లమెంట్లో మెజారిటీలేక, తెచి్చన బిల్లులు ఆమోదం పొందక తీవ్ర అసహనంలో ఉన్న దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ డిసెంబర్ మూడోతేదీన మార్షల్ లా ప్రకటించారు. దీంతో చిర్రెత్తుకొచి్చన విపక్షపారీ్టల సభ్యులు పార్లమెంట్ గోడలు దూకివచి్చమరీ మెరుపువేగంతో పార్లమెంట్‌ను సమావేశపరచి మార్షల్ లాను రద్దుచేస్తూ సంబంధిత తీర్మానంపై ఓటింగ్ చేపట్టి నెగ్గించుకున్నారు. దీంతో కేవలం ఆరు గంటల్లోనే ఎమర్జెన్సీని ఎత్తేశారు. మార్షల్ లాను ప్రయోగించి దేశంలో అస్థిరతకు యతి్నంచారంటూ అధ్యక్షుడిపై విపక్షాలు అభిశంసన తీర్మానం తెచ్చాయి. తొలి తీర్మానం అధికార పార్టీ సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. జూలైలో విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను మైక్రోసాఫ్ట్ పరిష్కరించింది.పర్యావరణహిత ప్లాస్టిక్! మనం వాడే ప్లాస్టిక్ తొలుత మురుగు నీటితో ఆ తర్వాత నదీజలాల్లో చివరకు సముద్రాల్లో కలుస్తోంది. ప్రపంచముప్పుగా మారిన ప్లాస్టిక్‌కు చెక్ పెట్టేందుకు జపాన్ శాస్త్రజ్ఞులు పర్యావరణహిత ప్లాస్టిక్‌ను సృష్టించారు. సముద్రజలాలకు చేరగానే కేవలం 10 గంటల్లో నాశనమయ్యే ప్లాస్టిక్ అణువులను వీళ్లు తయారుచేశారు. నేలలో కలిస్తే కేవలం 10 రోజుల్లో ఇది విచి్ఛన్నమవుతుంది. సింగ్ యూజ్ ప్లాస్టిక్‌ల బదులు ఈ కొత్తతరహా ప్లాస్టిక్ త్వరలోనే వాణిజ్యస్థాయిలో ఉత్పత్తయి ప్రపంచదేశాలకు అందుబాటులోకి రావాలని అంతా ఆశిస్తున్నారు.రోబోటిక్ చేయి అద్భుతం అంతరిక్ష ప్రయోగాలకు వ్యోమనౌకలు, కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు ఉపయోగించే వందల కోట్ల ఖరీదైన రాకెట్ బూస్టర్లను మళ్లీ వినియోగించుకునేలా తయారుచేసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అందర్నీ ఔరా అనిపించింది. ఇటీవల చేసిన ప్రయోగంలో నింగిలోకి దూసుకెళ్లి తిరిగి యథాస్థానానికి చేరుకుంటున్న భారీ రాకెట్బూస్టర్ను ప్రయోగవేదికపై అమర్చిన రోబోటిక్ చేయి జాగ్రత్తగా పట్టుకుని శెభాష్ అనిపించుకుంది. బూస్టర్ల పునరి్వనియోగంతో ఎంతో డబ్బు ఆదాతోపాటు బూస్టర్ తయారీలో వాడే ఖరీదైన అరుదైన ఖనిజ వనరుల వృథాను తగ్గించుకోవచ్చు. కృత్రిమ మేధ హవా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దిగ్గజా లు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు భౌతికశాస్త్ర నోబెల్‌ను బహూకరించిన నోబెల్ కమిటీ సైతం ఈ ఏడాది కృత్రిమ మేధ ఆవశ్యకతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. ఏఐ చాట్బాట్లు దైనందిన జీవితంలో భాగ మైపోయాయి. లక్షల రెట్ల వేగంతో పనిచేస్తూ పురోగమిస్తున్న ఏఐ రంగం ఇప్పుడు మానవ మేధస్సుకు సవాల్ విసురుతోంది. డిజిటల్ దురి్వనియోగం బారినపడకుండా ఏఐను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రపంచదేశాలు ఇటీవల హెచ్చరించాయి. అత్యుష్ణ ఏడాదిగా దుష్కీర్తి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, పారిశ్రామికీకరణతో భూగోళం ఈ ఏడాది గతంలో ఎన్నడూలేనంతగా వేడెక్కింది. పారిశ్రామికవిప్లవం ముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోకుండా కాచుకోవాల్సిన జనం ఈ ఏడాదే అది మించిపోయేలా చేశారు. చరిత్రలో తొలిసారిగా ఒక్క ఏడాదిలోనే భూతాపంలో ఉన్నతి 1.5 డిగ్రీ సెల్సియస్‌ను దాటింది. ఎల్‌నినో కన్నా వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల వల్లే అత్యుష్ణ ఏడాదిగా 2024 చెడ్డపేరు తెచ్చుకుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సూర్యుడి ముంగిట పార్కర్ సందడి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’వ్యోమనౌక నూతన చరిత్ర లిఖించింది. భగభగ మండే భానుడికి అత్యంత దగ్గరగా వెళ్లింది. తర్వాత అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు నెలకొల్పింది. పార్కర్‌ను 2018లో ప్రయోగించారు. అంతరిక్ష వాతావరణం, సౌర తుపానులపై లోతైన అవగాహన కోసం దీనిని తయారుచేశారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన, మళ్లీ జూన్ 19వ తేదీన సైతం భానుడి చేరువగా వెళ్లనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారని ఎన్క్లేవ్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సెంట్రల్ గాజాలోని నుసిరత్‌లో ఉన్న అల్-అవ్దా ఆసుపత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారు. వీరంతా అల్-ఖుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పాలస్తీనా మీడియా కథనాల ప్రకారం.. జర్నలిస్టులు ఆసుపత్రి లోపల నుంచి వస్తున్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో, వారు చనిపోయారు అని తెలిపింది. ఇక, మరణించిన జర్నలిస్టులను ఫాది హస్సౌనా, ఇబ్రహీం అల్-షేక్ అలీ, మహ్మద్ అల్-లదా, ఫైసల్ అబూ అల్-కుమ్సన్, అయ్మాన్ అల్-జాదీగా గుర్తించినట్లు అల్ జజీరా నివేదించింది.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. గాజా నగరంలోని జైటౌన్ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి సందర్భంగా వీరంతా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.Overnight, the IAF conducted an airstrike on a vehicle belonging to the TV news channel "Al Quds Today" in the Nuseirat refugee camp near the Al Awda hospital in central Gaza. The IDF later released a statement claiming that it targeted a Palestinian Islamic Jihad (PIJ)… pic.twitter.com/M7BIA8BTz0— AMK Mapping 🇺🇦🇳🇿 (@AMK_Mapping_) December 26, 2024 -
వీళ్లు వ్యాక్సిన్ వేశారు.. వాళ్లు బాంబులు వేశారు!
గాజాలోని.. ఓ ఆస్పత్రి. 22 నెలల వయసున్న చెల్లెలు మిస్క్ తో కలిసి నాలుగు నెలలుగా ఆస్పత్రిలోనే ఉంటోంది మూడేళ్ల హనన్. ‘అమ్మేది?’, ‘కాళ్లెక్కడికి పోయాయి’పదే పదే అడిగే ఈ ప్రశ్న తప్ప వారి నోటినుంచి మరో మాటలేదు. ‘నాలుగు నెలలుగా మనమో పీడకలలో ఉన్నాం’అని చెబుతోంది పక్కనే ఉన్న వారి అత్త. బాంబు దాడిలో అమ్మ చనిపోయిందని, ఆ దాడిలోనే ఇద్దరి కాళ్లూ పోయాయని వాళ్లకు చెప్పలేక కుమిలిపోతోంది. ఇది గాజాలోని ఆస్పత్రుల్లో కనిపించే నిత్య దృశ్యం. మనుషులు వేరు.. అడిగే ప్రశ్నలు వేరు.. కానీ ఎవ్వరి దగ్గరా సమాధానాలు ఉండవు. తమ ప్రమేయం ఏమాత్రం లేకపోయినా.. జరుగుతున్న మారణహోమంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులు వేలమంది. వైకల్యం పాలైనవారి లెక్కలు లేనేలేవు.గాజాలో తొలి పోలియో కేసు నమోదు కావడంతో ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు యుద్ధానికి విరామం ప్రకటించాలని సూచించింది. ఇజ్రాయెల్, గాజా రెండూ ఈ విరామాన్ని అంగీకరించాయి. సెపె్టంబర్ 2న కార్యక్రమం మొదలైంది. డేర్ ఎల్ బలాహ్‌లో ఉంటున్న షైమా అల్ దఖీ... ఉదయాన్నే లేచి తన ఇద్దరు కుమార్తెలు హనన్, మిస్్కను తీసుకెళ్లి టీకా ఇప్పించింది. మరుసటి రోజు కుటుంబం భోజనం చేసింది.. నిద్రించడానికి ఉపక్రమిస్తుండగా.. వాళ్ల ఇంటిపై బాంబు దాడి. ఈ ఘటనలో షైమా ప్రాణాలు కోల్పోయింది. భర్త మహ్మద్ అల్ దఖీతో సహా ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. హనన్ రెండు కాళ్ళను కోల్పోయింది. ఆమె శరీరమంతా గాయాలే. చిన్నారి మిస్క్ ఎడమ కాలు కోల్పోయింది. తలలో తీవ్ర రక్తస్రావమవ్వడంతో మహమ్మద్ రెండు వారాలపాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. భయానకంగా భవిష్యత్... మహమ్మద్ సోదరి షెఫా.. ఇద్దరు అమ్మాయిలను ఓదార్చడానికి ప్రయతి్నస్తోంది. ఇద్దరూ భయంతో వణికిపోతూ అత్తను పట్టుకునే ఉంటున్నారు. ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి వారిని ఊరడిస్తోంది. కానీ.. భవిష్యత్‌లో పిల్లల పరిస్థితి ఏమిటి? తమ వయసులోని ఇతర పిల్లలను చూసి వీళ్లేమనుకుంటారు. లోకమంటే తెలియని మిస్్కకు అంత కష్టం కాకపోయినా.. తన కుటుంబానికి ఏం జరిగిందో కొంచెం అర్థమైన హనన్‌కు మాత్రం ఇది కష్టంగా ఉంది. పెరుగుతున్న బాధితులతో చికిత్స అందించడానికే సమయం సరిపోని వైద్యులకు చిన్నారులకు మానసికంగా మద్దతు ఇచ్చే అవకాశం అసలే లేదు. షెఫాతోపాటు షైమా తల్లిదండ్రులు, షెమా సోదరుడు అహ్మద్ పిల్లలను చూసుకుంటున్నారు. పిల్లలు బొమ్మలు కావాలంటున్నారు.. కానీ రొట్టెముక్క విలాసంగా మారిన చోట బొమ్మలు దొరకడం అసాధ్యం కదా! ఏచిన్న అవకాశం దొరికినా పిల్లలను సంతోషంగా ఉంచేందుకు కానుకలు తెస్తున్నారు. ఇతర పిల్లల కాళ్ల వైపు చూస్తూ.. ‘‘గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే షైమా బిడ్డల గురించి భయపడింది. వారికి పోషకాహారం అందించడానికి ఎంతో శ్రమించింది. వారితోనే సమయం గడిపింది. వాళ్లు కావాలన్నది ఇవ్వడానికి ప్రయతి్నంచింది. పోలియో వ్యాక్సిన్ల ప్రకటన రాగానే.. పోలియో నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్స్ తన పిల్లలకు వేయించడమే కాదు.. బంధువులందరినీ ప్రోత్సహించింది. కానీ ఏం జరిగింది. పోలియో నుంచి రక్షణ లభించింది కానీ.. ఇజ్రాయెల్ వైమానిక దాడి వారి కాళ్లను తీసుకుంది. షైమాను పొట్టన పెట్టుకుంది. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. హనన్ది నా కూతురు హలాది ఒకే వయసు. హలాను ఆస్పత్రికి తీసుకొచి్చనప్పుడు.. హనన్ భావాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలా కాళ్ల వైపు చూస్తూ, ఆ తర్వాత తన కాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. బాంబు దాడికి ముందు వాళ్లిద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఆసుపత్రి మంచంపై ఆడుకుంటున్నారు’’అంటూ కన్నీటి పర్యంతమవుతోంది షెఫా. వైద్యం కోసం ఎదురుచూపులు బాంబుదాడులతో గాజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది. చిన్నారులిద్దరూ పూర్తిగా కోలుకోవాలంటే గాజాలో ఇచ్చే చికిత్స సరిపోదు. వాళ్లకు కేవలం ప్రోస్థెటిక్స్ అమరిస్తే సరిపోదు. పిల్లలిద్దరిదీ ఎదిగే వయసు. వయసుతో పాటు ఎముక పెరుగుదల కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే నిరంతర పర్యవేక్షణ, శస్త్రచికిత్సలు అవసరం. చికిత్స కోసం గాజాను విడిచిపెట్టాల్సిన వ్యక్తుల జాబితాలో వాళ్ల పేర్లను చేర్చారు. ఇజ్రాయెల్ ఆమోదిస్తే తప్ప వారిని విడిచిపెట్టలేరు. ఆమోదం కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘నేను బూట్లెలా వేసుకోవాలి?’, ‘నేను ఆడుకోవడానికి పార్క్‌కు వెళ్లొద్దా?’అంటూ పిల్లలడిగే ప్రశ్నలకు బదులెవరు చెప్తారు? గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని నిశ్శబ్దంగా చూస్తున్న ప్రపంచాన్ని భవిష్యత్‌లో ఆ చిన్నారులు ఎలా చూస్తారు? అంతటా సమాధానం లేని ప్రశ్నలే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్‌కు నెతన్యాహూ ఫోన్
జెరుసలేం: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. హమాస్‌పై యుద్ధంలో విజయం సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సిరియా పరిస్థితులపై తన వైఖరిని ట్రంప్‌తో పంచుకున్నారు. సంభాషణలోని కీలకాంశాలను వివరిస్తూ నెతన్యాహు ఓ వీడియో ప్రకటన షేర్ చేశారు. ‘‘శనివారం సాయంత్రం జరిగిన సంభాషణలో ఇరువురం పలు అంశాలపై చర్చించాం. సంభాషణ చాలా స్నేహపూర్వకంగా సాగింది. ఇజ్రాయెల్ విజయాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాం. బందీల విడుదలకు మేం చేస్తున్న ప్రయత్నాల గురించి సుదీర్ఘంగా చర్చించాం. బందీలతో పాటు మృతులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ అహర్నిశలు కృషి చేస్తుంది’’ అని చెప్పారు. אמרתי שנשנה את המזרח התיכון וזה מה שקורה. סוריה היא לא אותה סוריה. לבנון היא לא אותה לבנון. עזה היא לא אותה עזה. איראן היא לא אותה איראן. pic.twitter.com/IFVso1czkH— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) December 15, 2024సిరియాతో ఘర్షణ ఇప్పట్లో లేదుసిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు కూలదోశాక అక్కడి పరిస్థితిని నెతన్యాహు ప్రస్తావించారు. ‘‘సిరియాతో ఘర్షణపై మా దేశానికి ఏ ఆసక్తీ లేదు. పరిస్థితులను బట్టి స్పందిస్తాం’’ అన్నారు. హెజ్బొల్లాకు సిరియా గుండా ఆయుధాల రవాణాకు అనుమతించడాన్ని ఖండించారు. -
ఒకవైపు లెబనాన్‌లో సంబురాలు.. మరొకవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడులు
జెరూసలేం: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ వాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడుల కారణంగా దాదాపు 12 లఓల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం.అగ్ర రాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనపిస్తోంది. దాడులు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా దఓిణ లెబనాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. దీంతో, కొంత మంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 44వేల మంది చనిపోయారు. -
సిరియా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు.. భారీగా ప్రాణ నష్టం
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 15 మంది చనిపోయినట్టు సిరియా స్టేట్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రధాన కార్యాలయాలు, సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా రాజధానికి పశ్చిమాన ఉన్న మజ్జే, ఖుద్సాయా శివారులో ఉన్న భవనాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 15 మంది మరణించినట్టు స్థానిక మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా సిరియాలో ఇరాన్ సంబంధిత లక్ష్యాలపై దాడులు చేస్తోంది. అయితే, గాజా యుద్ధానికి దారితీసిన ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గత ఏడాది అక్టోబర్ 7 దాడి చేసినప్పటి నుండి డెమాస్కస్‌లో దాడులను వేగవంతం చేసింది. హిజ్బొల్లాకు చెందిన కమాండర్లు, రివల్యూషనరీ గార్డ్లు మజ్జేలో నివసిస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. 🔶 Reports: The IDF attacked the Almazehh neighborhood in Damascus - shortly after a senior Iranian adviser landed in the cityAccording to reports, in the last few minutes the Air Force carried out an airstrike in the Almazzeh neighborhood .. pic.twitter.com/hMnhuiAJzq— Monika (@Monika_is_His) November 14, 2024 ఇదిలా ఉండగా.. హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 🇮🇱🇸🇾 Israel wipes out an entire neighborhood in Damascus, Syria pic.twitter.com/TarWpmw8We— HOT SPOT (@HotSpotHotSpot) November 14, 2024 -
కన్నీటి వీలునామా
సెప్టెంబర్ 30న గాజాలో ఒక ఇంటి మీద ఇజ్రాయిల్ బాంబు వేసింది. ఆ ఇంటిలోని 10 ఏళ్ల పాప, ఆమె 11 ఏళ్ల సోదరుడు మరణించారు. తల్లిదండ్రులు వారిని అంతిమంగా సాగనంపి పాప నోట్‌బుక్ తెరిస్తే ఈ మరణాన్ని, ఇలాంటి మరణాన్ని ఊహించి, గాజాలో కొంతకాలంగా మరణించిన16,700 మంది పిల్లలతో పాటు తానూ చేరక తప్పదని తెలిసి ఆ పాప నోట్‌బుక్‌లో వీలునామా రాసి వెళ్లింది. ఆ వీలునామాలో తొలి వాక్యం ‘నేను చనిపోతే ఏడ్వొద్దు’ అని.గాజా పసిపిల్లలు జీవించి ఉన్నారంటే వారు చిరంజీవులయ్యారని కాదు. వారి ఊపిరి కాలం పొడిగింప బడిందనే అర్థం. ఇక్కడ చూడండి... జూన్ 10న గాజాలోని ఒక ఇంటి మీద బాంబు జారవిడిచింది ఇజ్రాయిల్. ఆ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఇరుగూ పొరుగూ కలిసి లోపల ఉన్న భార్యాభర్తల్ని వారి కుమారుడు 11 ఏళ్ల అహ్మద్‌ని కూతురు 10 ఏళ్ల రాషాను బయటకు తీసుకొచ్చారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఇజ్రాయిల్ ఆ ఇంటి మీద బాంబు ఎందుకు వేసింది? కారణం ఏమీ లేదు. మొన్నటి సెప్టెంబర్ 30 వరకూ కూడా ఆ కుటుంబం ఆకలిదప్పులతో వేదనలతో బతికింది. అయితే ఇజ్రాయిల్ తిరిగి సెప్టెంబర్ 30న మరో బాంబు అదే ఇంటి మీద వేసింది. కారణం ఏమిటి? ఏమీ లేదు. కాని దురదృష్టం.. ఈసారి రాషా, ఆమె సోదరుడు అహ్మద్ మృతి చెందారు. (ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు)తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో వారిని సాగనంపి తిరిగి వచ్చాక రాషా నోట్ పుస్తకంలో రాసిన తన వీలునామా కనిపించింది. అప్పటి వరకూ వారికి ఆ చిన్నారి అలాంటి వీలునామా రాసి ఉంటుందని తెలియదు. ఆ పాప అప్పటికే ఎందరో చిన్నపిల్లల మరణాలని చూసింది గాజాలో. మాట్లాడుకుంటుంటే వినింది. కనుక తాను కూడా చనిపోతానని భావించిందో ఏమో నోట్‌బుక్‌లో వీలునామా ఇలా రాసింది.రాషా రాసిన ఈ వీలునామాను ఆమె మేనమామ అసిమ్ అలనబి లోకానికి చూపించాడు. రాషా ఎందుకనో తాను మరణించి తన సోదరుడు బతుకుతాడని ఆశించింది. ఆమె సోదరుడు అహ్మద్ గడుగ్గాయి. అల్లరి చేసినా అందరూ వాణ్ణి ప్రేమించేవారట. గదమాయిస్తూనే దగ్గరికి తీసుకునేవారట. కాని ఆమెతో పాటు ఆ ముద్దుల సోదరుడు కూడా మరణించాడు. గాజాలో రోజూ వందలాది మంది పిల్లలు చనిపోతున్నారు. గాజాలో పిల్లల గుండెల్లో ఎన్ని మూగబాధలు చెలరేగుతున్నాయో దూరంగా నిశ్చింతగా ఉంటూ తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు.ఏ యుద్ధమైనా, ఎటువంటి ద్వేషమైనా, ఏ విషబీజాలైనా, ఎటువంటి వివక్ష అయినా అంతిమంగా ముందు పిల్లల్ని బాధిస్తుంది. పిల్లల్లో ఉండే కరుణను పెద్దలు ఎప్పటికైనా అందుకోగలరా?‘నేను చనిపోతే నా కోసం ఎవరూ ఏడ్వద్దు. ఎందుకంటే మీ కన్నీళ్లు నాకు నొప్పి కలిగిస్తాయి. నా దుస్తులు అవసరమైనవారికి ఇస్తారని భావిస్తాను. నా అలంకార వస్తువులు రాహా, సరా, జూడీ, బతుల్, లానాల మధ్య సమానంగా పంచాలి. నా పూసల పెట్టె ఇకపై పూర్తిగా అహ్మద్, రాహల సొంతం. నాకు నెలవారీ అలవెన్సుగా వచ్చే 50 షెకెల్స్ (ఒక షెకెల్ 22 రూపాయలకు సమానం) సగం రాహాకు, సగం అహ్మద్‌కు ఇవ్వండి. నా కథలు, నోట్ పుస్తకాలు రాహావి. నా బొమ్మలు బతూల్వి. మరోటి, మా అన్న అహ్మద్‌ను గదమాయించొద్దు. ఈ కోరికలు నెరవేర్చండి’... -
యుద్ధం వేళ ఇజ్రాయెల్ నెతన్యాహు సంచలన నిర్ణయం
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్న కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం అవసరం. మొదట్లో అలాంటి నమ్మకమే ఉండేది. దాడుల్లో సందర్బంగా ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది జరగడం లేదు. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి. విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో గాలంట్ స్థానంలో తన విశ్వాసపాత్రుడు, విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌ను నియమించనున్నారు. విదేశాంగశాఖను గిడియాన్ సార్‌కు అప్పగించారు. తన మాజీ ప్రత్యర్థి అయిన గిడియాన్‌కు నెతన్యాహు ఇటీవలే తన కేబినెట్లో చోటిచ్చారు. అయితే, గాలంట్‌పై నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇదిలా ఉండగా.. గత ఏడాది మార్చిలోనూ ఒకసారి గాలంట్‌ను తొలగించేందుకు యత్నించగా.. నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరిగాయి. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్ గాలంట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా వారి మధ్య వైరం మొదలైనట్టు సమాచారం. -
అధ్యక్ష ఎన్నికల వేళ.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో మారణహోమం జరుగుతోంది. వందల, వేల సంఖ్యలో ప్రజల బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇక, గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఇటీవల కూడా ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నవంబర్ ఐదో తేదీన అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. ఇక, ఇజ్రాయెల్ విషయంలో కమలా హారీస్ కూడా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
దాడులను తట్టుకోలేరు.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్
జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడి చేయాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ దాడులపై తాజాగా ఇజ్రాయెల్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెర్జి హలేవీ స్పందించారు. ఈ సందర్బంగా హలేవీ మాట్లాడుతూ..‘ఇరాన్ ప్రతిదాడి చేస్తే మా దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుంది. ఇరాన్‌ను ఎలా చేరుకోవాలో మాకు తెలుసు. మరోసారి దాడి చేస్తే ఇరాన్‌ను ఎలా గట్టిగా దెబ్బ కొట్టాలో మా దగ్గర ప్లాన్ ఉంది. ప్రస్తుతం కావాలనే కొన్ని లక్ష్యాలను పక్కన పెట్టాము. వాటిపై మరో సందర్భంలో గురిపెడతాము. ఆ సమయంలో ఇజ్రాయెల్ దాడులను తట్టుకోలేరు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇదే సమయంలో హమాస్ చీఫ్ హసన్ నస్రల్లా స్థానంలో డిప్యూటీ హెడ్ నయీమ్ ఖాసీమ్‌ను ఎంపిక చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హిజ్జుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ఈ సందర్బంగా గల్లంట్ మాట్లాడుతూ.. నయీమ్ ఖాస్సెమ్ నియామకం తాత్కాలికం మాత్రమే. అతను ఎక్కువ కాలం ఉండలేడు. అతడికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది అని చెప్పారు. గత నెలలో దక్షిణ బీరుట్లో ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా చనిపోయిన విషయం తెలిసిందే.మరోవైపు.. గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది మంది మృతి చెందారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా వ్యాప్తంగా 143 మంది, లెబనాన్‌లో 77 మందికి పైగా మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక, లెబనాన్‌లో భూతల దాడులకు వెళ్లి 33 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.🎥 Video is in Hebrew 🇮🇱Chief of the General Staff, LTG Herzi Halevi, visited the "Ramon" Airbase today and met with pilots and the ground crews who were involved in the recent strikes against.Halevi warned, "If Iran makes the mistake of launching another missile barrage at… pic.twitter.com/bH61AwMQX5— 🇮🇱 Am Yisrael Chai 🇮🇱 (@AmYisraelChai_X) October 30, 2024 -
భయానక వీడియో.. ఇజ్రాయెల్ భీకర దాడులు
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులకు సంబంధించిన భీకర వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భయానక బాంబు దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇక, తాజాగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా నేతలను టార్గెట్ చేసి దాడులు చేసింది. బాంబు దాడిలో అక్కడున్న నివాసాలు అన్ని ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహారం మరియు కమ్యూనికేషన్ పరికరాల ఉన్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు.. జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాల మీదుగా దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. It's mind-boggling how obsessed the Zionists are with destruction and death. Israel's Channel 12 publishes the massive explosion in south Lebanon that triggered an earthquake alert in the north yesterday morning pic.twitter.com/zmOfZcx2Ec— Abier (@abierkhatib) October 27, 2024 -
ఇరాన్‌పై నిప్పుల వర్షం
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్‌ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్‌కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్‌పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్‌పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది. రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు. తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే.. ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి. 25 రోజుల తర్వాత ప్రతిదాడి ఇరాన్‌పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించింది. -
గాజన్లే కవచాలు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. యుద్ధ సమయంలో ఇళ్లు, సొరంగాల్లోకి ప్రవేశించడానికి పాలస్తీనా పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ‘మస్కిటో ప్రోటోకాల్’గా పిలిచే ఈ పద్ధతిని గాజాలోని ఇజ్రాయెల్ యూనిట్లన్నీ అవలంబిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనికుడే ఈ మేరకు వెల్లడించడం విశేషం. ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు దీన్ని ధ్రువీకరించారు. ఉత్తర గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా... ఇలా గాజా అంతటా ఇదే పద్ధతిని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. – జెరూసలెంనిషేధం బేఖాతరుసైనిక కార్యకలాపాలలో పౌరులను ఇలా అనైతికంగా, అనుమాషంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధం. వెస్ట్ బ్యాంక్‌లో అనుమానిత మిలిటెంట్ల తలుపులను తట్టడానికి ఇజ్రాయల్ సైన్యం పాలస్తీనా పౌరులను ఉపయోగిస్తోందని హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2005లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. దీన్ని క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా అభివర్ణించింది. దాంతో ఈ విధానాలను మానుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ దాన్ని ఇంకా అమలు చేస్తున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం మానవ కవచాలుగా ఉపయోగిస్తున్న మూడు ఫోటోలను ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఉత్తర గాజాలో విధ్వంసకర పరిస్థితుల్లో ఇద్దరు సైనికులు ఓ పౌరుడిని ముందుకు తీసుకువెళుతున్న భయానక దృశ్యం ఒక ఫొటోలో ఉంది. మరో దాంట్లో మానవ కవచాలుగా ఉపయోగించే పౌరుల కళ్లకు గంతలున్నాయి. మూడో ఫొటోలో ఒక సైనికుడు బంధించిన పౌరుడిని కాపలా కాస్తున్నాడు.వెనుక నుంచి కాల్చారు..గాజాలో ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు కూడా దీన్ని ధ్రువీకరించారు. 20 ఏళ్ల మహ్మద్ సాద్ఇజ్రాయెల్ సైన్యం దాడుల తర్వాత ఉత్తర గాజా వీడి ఖాన్ యూనిస్ సమీపంలో తాత్కాలిక శిబిరంలో ఉంటున్నాడు. తనకు, తమ్ముళ్లకు ఆహారం కోసం బయటికొస్తే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ‘‘మమ్మల్ని జీపులో తీసుకెళ్లారు. 47 రోజుల పాటు రఫా సైనిక శిబిరంలో నిర్బంధించారు. నిఘా చర్యలకు ఉపయోగించారు. మాకు మిలటరీ యూనిఫాం ఇచ్చారు. తలపై కెమెరా పెట్టారు. మెటల్ కట్టర్ ఇచ్చారు. సొరంగాల్లో వెదికేటప్పుడు సాయానికి మమ్మల్ని వాడుకున్నారు. మెట్ల కింద వీడియోలు తీయాలని, ఏదైనా దొరికితే బయటికి తేవాలని చెప్పేవారు. ఒక మిషన్ కోసం పౌర దుస్తుల్లో తీసుకెళ్లారు. సైన్యం వదిలివెళ్లిన ట్యాంకును వీడియో తీయమన్నారు. నేను భయపడితే వీపుపై తుపాకీతో కొట్టారు. నేను ట్యాంకు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి కాల్చారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా’’ అంటూ వీపుపై తూటా గాయాలు చూపించాడు. 17 ఏళ్ల మొహమ్మద్ షబ్బీర్దీ ఇదే కథ. ఖాన్ యూనిస్‌లోని అతని ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. తండ్రి, సోదరిని చంపి అతన్ని బందీగా పట్టుకుంది. ‘‘నన్ను మానవ కవచంగా వాడుకున్నారు. కూల్చేసిన ఇళ్లలోకి, ప్రమాదకరమైన, మందుపాతరలున్న ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు’’ అని షబ్బీర్ చెప్పుకొచ్చాడు.ఏమిటీ మస్కిటో ప్రోటోకాల్శత్రువులున్న చోటికి కుక్కను పంపడం, ట్యాంక్ షెల్ లేదా సాయుధ బుల్డోజర్తో దాడి వంటివి చేస్తారు. కానీ ఈ పద్ధతిలో తాము దాడి చేయాలనుకున్న చోటికి బందీలనో, శత్రు దేశ పౌరులనో ముందుగా పంపిస్తారు. అక్కడ పేలుడు పదార్థాలున్నా, శత్రువులు పొంచి కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డా ముందుగా వెళ్లినవారు చనిపోతారు. ఆ ముప్పు తొలగాక సైన్యం ప్రవేశిస్తుంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఈ పద్ధతిని ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తోంది.డాక్టర్‌నూ వదల్లేదు...59 ఏళ్ల డాక్టర్ యాహ్యా ఖలీల్ అల్ కయాలీ ఓ వైద్యుడు. గాజాలో అతి పెద్ద వైద్య సముదాయమైన అల్ షిఫా ఆస్పత్రిలో వేలాది మంది శరణార్థులతో కలిసి ఉండేవారు. గత మార్చిలో ఇజ్రాయెల్ సైన్యం రెండు వారాల దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. అప్పుడే కయాలీని సైన్యం పట్టుకుంది. ‘‘నాతో అపార్ట్మెంట్ భవనాలను, ప్రతి గదినీ తనిఖీ చేయించారు. అదృష్టవశాత్తూ వేటిలోనూ హమాస్ ఫైటర్లు లేరు. అలా 80 అపార్ట్మెంట్లను తనిఖీ చేశాక నన్ను వదిలేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.మన ప్రాణాలు ముఖ్యమన్నారు.. ఉత్తర గాజాలో తమ యూనిట్ ఓ అనుమానాస్పద భవనంలోకి ప్రవేశించే ముందు ఇద్దరు పాలస్తీనా ఖైదీలను ముందుగా పంపినట్టు ఇజ్రాయెల్ సైనికుడే వెల్లడించాడు. ‘‘వారిలో ఒకరు 16 ఏళ్ల బాలుడు. మరొకరు 20 ఏళ్ల యువకుడు. ఇదేంటని ప్రశ్నిస్తే మన సైనికుల కంటే పాలస్తీనా యువకులు చనిపోవడం మంచిది కదా అని మా సీనియర్ కమాండర్ బదులిచ్చారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొని అలసిపోయాక పెద్దగా ఆలోచించడానికి కుదరదు. అయినా ఈ పద్ధతిని అనుసరించడానికి కొందరు సైనికులం నిరాకరించాం. ‘అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించొద్దు. ముందు మన ప్రాణాలు ముఖ్యం’ అని కమాండర్ చెప్పారు’’ అన్నాడు. చివరికి ఇద్దరు పాలస్తీనియన్లను వదిలేశారని చెప్పుకొచ్చాడు. -
ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు జర్నలిస్టులు మృతి
బీరుట్/ఖాన్ యూనిస్: గాజాతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పనిచేసేత అరబ్ టీవీ అల్ మయాదీన్ కెమెరామ్యాన్ ఘస్సన్ నాజర్, టెక్నీషియన్ మహ్మద్ రిడా, హెజ్బొల్లా గ్రూపునకు చెందిన అల్ మనార్ టీవీ కెమెరామ్యాన్ విస్సమ్ కస్సిమ్‌గా గుర్తించారు. ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్ చర్యను ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్ అనే స్టిక్కర్‌తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్ జజీరా ఇంగ్లిష్ చానెల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఒకే కుటుంబంలోని 36 మంది మృతిగాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. -
సంధి దిశగా ఇజ్రాయెల్, హమాస్.. యుద్ధానికి ముగిసినట్టేనా?
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మృతిచెందిన వారిలో హమాస్ కమాండర్ ఉన్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నాయి. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు.. ఒప్పందం జరిగే సూచనలు కన్పిస్తే పోరాటం ఆపేస్తామని హమాస్ వర్గాలు వెల్లడించాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి ఒక ఒప్పందానికి దారి తీయగలదని అమెరికా కొద్ది రోజుల క్రితమే ఆశాభావం వ్యక్తం చేసింది.దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. హమాస్ పోరాటాన్ని ఆపడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. యుద్ధం నేపథ్యంలో గాజా నుంచి వెళ్లిపోయిన ప్రజలను తిరిగి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయం అందాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.ఇక, బంధీలను విడుదల చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. కైరో సమావేశం అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఖతార్‌కు వెళ్లాలని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పాలస్తీనా పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. తాజాగా ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 17 మంది మృతిచెందారు. నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 11 నెలల శిశువుతో సహా ఎక్కువగా మహిళలు, పిల్లలు మరణించారని 42 మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. మృతుల్లో 13 మంది 18 ఏళ్లలోపు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పేర్కొంది.గాజాపై దాడుల్లో మరో హమాస్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. చనిపోయిన కమాండర్ ఐక్యరాజ్యసమితి సహాయ ఏజెన్సీ కోసం కూడా పని చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. యూఎన్ ఏజెన్సీలోని సభ్యులు హమాస్, ఇతర సాయుధ బృందాల్లో పనిచేస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న 9 మందిని గతంలోనే యూఎన్ తొలగించింది. -
అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం!
దెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ దళాల చేతిలో ఇటీవల హత్యకు గురైన యాహ్యా సిన్వర్ స్థానంలో చీఫ్‌గా ప్రస్తుతానికి ఎవరినీ నియమించరాదని హమాస్ నిర్ణయించింది. ఇకపై ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు ఐదుగురు సభ్యుల కమిటీ నాయకత్వం వహించనుంది. ఈ కమిటీ దోహా కేంద్రంగా పని చేస్తుంది. అగ్ర నేతలందరినీ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో 2025 మార్చిలో జరిగే గ్రూప్ తదుపరి ఎన్నికల దాకా చీఫ్‌గా ఎవరినీ నియమించరాదని హమాస్ నాయకత్వం భావించినట్టు తెలుస్తోంది.యాహ్యా సిన్వర్ మరణానికి ఏడాది ముందునుంచే అజ్ఞాతంలోకి గడుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా కీలక నిర్ణయాలను ఈ కమిటీయే తీసుకుంటూ వస్తోంది. ఇందులో గాజాకు ఖలీల్ అల్ హయా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబారిన్, విదేశాల్లోని పాలస్తీనియన్లకు ఖలీద్ మషాల్ ప్రతినిధులుగా ఉన్నారు. నాలుగో సభ్యుడు హమాస్ షూరా అడ్వైజరీ కౌన్సిల్ అధిపతి మహ్మద్ దర్వీష్.ఐదో సభ్యుడైన హమాస్ పొలిటికల్ బ్యూరో కార్యదర్శి పేరును భద్రతా కారణాల రీత్యా బయట పెట్టడం లేదని సంస్థ పేర్కొంది. వీరంతా ప్రస్తుతం ఖతర్‌లో ఉన్నారు. యుద్ధ సమయంలో ఉద్యమాన్ని, అసాధారణ పరిస్థితులను, భవిష్యత్ ప్రణాళికలను నియంత్రించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా దీనికి ఉంది.ఇరాక్‌లో ఐఎస్ గ్రూప్ కమాండర్ హతం బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్ లీడర్, మరో ఎనిమిది మంది సీనియర్ నేతలను తమ బలగాలు చంపేశాయని ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్–సుడానీ మంగళవారం ప్రకటించారు. సలాహుద్దీన్ ప్రావిన్స్‌లోని హమ్రిన్ కొండప్రాంతంలో బలగాలు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో జస్సిమ్ అల్–మజ్రౌయి అబూ అబ్దుల్ ఖాదర్ అనే ఐఎస్ గ్రూప్ కమాండర్ హతమయ్యాడన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మిగతా వారి వివరాలను ప్రకటిస్తామన్నారు. అంతర్జాతీయ సంకీర్ణ బలగాలిచ్చిన సమాచారం, మద్దతు తో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ తెలిపింది. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, సామగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించింది.చదవండి: హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి -
ఉత్తర గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్ఎఫ్ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు. రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తుఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి. సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్ ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది. -
అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. ఇజ్రాయెల్ వీడియో
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతిచెందాడు. అయితే, గతేదాడి అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు ముందు సిన్వర్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ ఆరో తేదీన సిన్వర్ సొరంగంలోకి వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇజ్రాయెల్ వీడియో ప్రకారం.. సిన్వర్, అతడి కుటుంబ సభ్యులు కొన్ని వస్తువులతో సొరంగంలోకి వెళ్లడం కనిపిస్తుంది. ఇదే సమయంలో వారికి కావాల్సిన సామాగ్రిని సొరంగంలోకి తీసుకెళ్లినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సిన్వర్ సొరంగంలో దాక్కున్నట్టు స్పష్టం చేసింది. అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేసినట్టు ఆరోపించింది.మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ మేరకు హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు ఆసుపత్రులను ముట్టడించి బాధితులకు అందాల్సిన వైద్యం, ఆహార సామగ్రిని అడ్డుకుంటున్నాయని అక్కడి నివాసితులు, వైద్యాధికారులు ఆరోపించారు.🎥DECLASSIFIED FOOTAGE:Sinwar hours before the October 7 massacre: taking down his TV into his tunnel, hiding underneath his civilians, and preparing to watch his terrorists murder, kindap and rape. pic.twitter.com/wTAF9xAPLU— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 19, 2024 -
హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి..
జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం చేతిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందాడు. ఈ క్రమంలో సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సిన్వర్ తలపై బుల్లెట్ గాయం, ఎడమ చేతికి ఒక వేలును కట్ చేసినట్టు రిపోర్టులో వెల్లడించారు. బుల్లెట్ గాయంతోనే సిన్వర్ చనిపోయినట్టు నిర్ధారించారు.ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా హమాస్ అధినేత సిన్వర్ మృతదేహానికి డాకట్ర్ చెన్ కుగేల్ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో తలపై బుల్లెట్ గాయం ఉందని, దాని కారణంగానే అతడు మరణించి ఉంటాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా సిన్వర్ ఎడమ చేతికి ఐదు వేళ్లలో ఒక వేలు లేదని తెలిపారు. దీంతో, రిపోర్టు సంచలనంగా మారింది.అయితే, దాడుల్లో చనిపోయిన వ్యక్తి సిన్వర్ అవునా.. కాదా? అని నిర్ధారించుకునేందుకే అతడి వేలిని ఇజ్రాయెల్ సైన్యం కత్తిరించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యే వరకు సిన్వర్ రెండు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రొఫైల్‌తో డీఎన్ఏ నిర్ధారణ కోసం అతని వేలును కత్తిరించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. అతడి దంతాలను కూడా కత్తిరించినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. Live Updates: Autopsy Shows Hamas Leader Was Killed by a Gunshot to the HeadYahya Sinwar was earlier hit in the arm during a firefight with Israeli soldiers, according to the Israeli doctor who oversaw the autopsy.The leader of Hamas, Yahya Sinwar, was killed by a gunshot wound…— Brent Erickson (@BErickson_BIO) October 18, 2024 ఇదిలా ఉండగా.. హమాస్ చీఫ్ సిన్వర్ చనిపోవడానికి ముందు అతడు ఉన్న పరిస్థితిని ఇజ్రాయెల్ సైన్యం ఓ డ్రోన్ ద్వారా రికార్డు చేసింది. మరణానికి ముందు సిన్వర్ ఓ శిథిల భవనంలో సోఫా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల నుంచి రక్తం కారుతోంది. కూర్చున్న చోటు నుంచి లేవలేని నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. శరీరమంతా దుమ్ము కప్పేసి ఉంది. అలాంటి పరిస్థితిలో.. తనవైపుగా వస్తున్న డ్రోన్‌పైకి కర్రలాంటి ఓ వస్తువును విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🇵🇸 Incredible footage: Yahya Sinwar, covered in dust, all his comrades just killed, arm amputated and close to death, hurls a projectile at an Israeli drone in a final act of defianceIsraelis are ridiculing this as a pathetic end, but I'm not sure the world will see it that way pic.twitter.com/I0gdAQhQ0L— Keith Woods (@KeithWoodsYT) October 17, 2024 -
యుద్ధం రేపే ముగియవచ్చు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్ధ హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనేతను ఎట్టకేలకు హతమార్చడంతో.. ఏడాది కాలంగా సదరు మిలిటెంట్ సంస్థతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ విజయం లభించినట్లైంది..యహ్య సిన్వార్ మృతి అనంతరం గాజా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి, బంధీలను విడిచిపెట్టినట్లైతే రేపటిలోగా యుద్ధం ముగుస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు.చదవండి: ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలాయహ్యా సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ధైర్య సైనికులు అన్ని రఫాలో మట్టుబెట్టారు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కాదు. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది. గాజా ప్రజలకు నాదొక చిన్న సందేశం.. హమాస్ తన ఆయుధాలను వదిలి ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగిస్తే ఈ యుద్ధం ముగియవచ్చు. మా పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తాం’ అని హెచ్చరించారు. కాగా హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందాని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024 గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మారణకాండకు యహ్యా సిన్వర్నే మాస్టర్‌మైండ్. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ హతమార్చింది. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దీనిపై హమాస్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలా..
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన డ్రోన్.. సిన్వర్ కదలికలను వీడియో తీసింది.ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న సమయంలో సిన్వర్ ఓ భవనంలో కూర్చుని ఉన్నాడు. బాంబు దాడుల తర్వాత భవనం పూర్తిగా శిథిలమైపోయింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో సిన్వర్ తుదిశ్వాస విడిచే ముందు ఓ కూర్చిలో అచేతనంగా కూర్చుండిపోయాడు. సిన్వర్ కూర్చుని ఉండగా.. ఇజ్రాయెల్ డ్రోన్ అతడి వద్దకు వెళ్లింది. దాన్ని గమనించిన అతడు ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉండగా.. సిన్వర్ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నెతన్యాహు మాట్లాడుతూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. ఇది అతిపెద్ద విజయంగా నేను భావిస్తున్నా. ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు. హమాస్ ఆయుధాలను వదిలి.. బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగిస్తుంది. ఇజ్రాయెల్ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తామని హెచ్చరించారు.🇵🇸The final moments of the resistance leader Yahya Sinwar who fought bravely on the front lines, refusing to surrender even after sustaining severe injuries from heavy attacks. He continued to fight with honor until he was ultimately martyred defending his land and people. pic.twitter.com/4Bn4Jnprbo— Syria Truths (@TruthsSyria) October 18, 2024 ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే.. -
హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే..
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇది ఎంతో శుభసూచకం. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది అంటూ కామెంట్స్ చేశారు.ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి కాంట్జ్ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని చెప్పుకొచ్చారు.Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024మరోవైపు, సిన్వర్ మృతిపై జో బైడెన్ స్పందిస్తూ.. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభదినం. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్, డీఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించింది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్ -
హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): వరుసబెట్టి అగ్రనేతలకు కోల్పోతున్న హమాస్‌కు గురువారం మరో శరాఘాతం తగిలింది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ తమ దాడుల్లో మృతి చెందాడని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. సిన్వర్‌ను అంతమొందించామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడికి సూత్రధారి సిన్వర్. ఈ దాడిలో 1,200 ఇజ్రాయెల్ దేశస్తులు చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటినుంచి సిన్వర్.. ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా మారారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో అగ్రభాగాన ఉన్నారు. మిలటరీ వ్యూహకర్త సిన్వర్ మరణం హమాస్‌కు కోలుకోలేదని దెబ్బని చెప్పొచ్చు. అయితే సిన్వర్ మరణాన్ని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది జూలైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో ఇజ్రాయెల్ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. హనియా మరణం తర్వాత సిన్వర్ హమాస్ పగ్గాలు చేపట్టారు. ‘సిన్వర్‌ను మట్టుబెట్టడం ఇజ్రాయెల్ సైనిక, నైతిక విజయమని విదేశాంగ మంత్రి కట్జ్ అభివరి్ణంచారు. కాగా గాజాలో జబాలియాలోని స్కూలులో నిర్వహిస్తునున్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 28 మంది మరణించారు. శరణార్థి శిబిరం నుంచి... యాహ్యా సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో పుట్టారు. 1987లో హమాస్ ఏర్పడ్డప్పటి తొలినాటి సభ్యుల్లో ఒకరు. సంస్థ సాయుధ విభాగాన్ని చూసుకునేవారు. 1980ల్లోనే ఆయనను ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులను హత్య చేసిన నేరంలో నాలుగు జీవిత ఖైదులు విధించింది. జైల్లో పరిస్థితుల మెరుగుదల కోసం ఉద్యమం లేవదీసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 2011లో ఒక్క ఇజ్రాయెలీ సైనికునికి ప్రతిగా విడుదల చేసిన వేలాది మంది పాలస్తీనా ఖైదీల్లో భాగంగా విముక్తి పొందారు. గాజాకు తిరిగొచ్చి హమాస్ అగ్రనేతగా ఎదిగారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాల్లేని తీరుతో ‘ఖాన్ యూసిస్ బుచర్’గా పేరుపొందారు. 2023 అక్టోబర్ 7న 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను పొట్టన పెట్టుకున్న హమాస్ మెరుపుదాడి వెనక సంస్థ సాయుధ విభాగం చీఫ్ మొహమ్మద్ దెయిఫ్తో పాటు సిన్వర్ కీలకంగా వ్యవహరించారంటారు. -
ఇజ్రాయెల్‌కు కొత్త టెన్షన్!.. హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు
జెరూసలేం: ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వర్గాలు దాడులతో చెలరేగిపోతున్నాయి. ఈ క్రమంలో హెజ్బొల్లా వద్ద రష్యాకు చెందిన ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చెప్పడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, హెజ్బొల్లాకు రష్యా సహకరిస్తోందన్న అనుమానాలను నెతన్యాహు వ్యక్తం చేశారు.హెజ్బొల్లాపై యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ దళాలు వారి సొరంగాలను కనుగొన్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో సొరంగాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆ సొరంగాల్లో రష్యాకు చెందిన ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా ఆయుధాలపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మాట్లాడుతూ..‘దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నాం. లిటాని నదికి దక్షిణాన లెబనాన్ ఆర్మీకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అనుమతి ఉందని 2006లో యూఎన్ భద్రతామండలి తీర్మానించింది. అయినప్పటికీ హెజ్బొల్లా ఆ ప్రాంతాల్లో వందలాది సొరంగాలను తవ్వి.. స్థావరాలుగా మార్చుకుంది. అక్కడే రష్యాకు చెందిన ఆయుధాలు లభించాయి. ఒకరిని రెచ్చగొట్టడం మా లక్ష్యం కాదు. లెబనాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదు. లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. గత నెలలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లోని హెజ్బొల్లాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యా, చైనాకు సంబంధించిన ఆయుధాలు కనుగొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు ఉన్నాయని నిరూపితమైంది. 🔴 Netanyahu has said that the Israeli military found "state-of-the-art" Russian weapons during a search of Hezbollah bases in Lebanon.- The Times of Israel pic.twitter.com/ohuvH48zLr— war observer (@drmubashir599) October 17, 2024 -
బీరుట్‌పై దాడులు.. 22కు చేరిన మృతులు
బీరుట్/న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరుట్‌పై గురువారం రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో మరణాల సంఖ్య 22కు చేరుకుంది. తాజా ఘటనలో 117 మంది క్షతగాత్రులుగా మారారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. బాధితుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. సెంట్రల్ బీరుట్‌లోని రస్ అల్–నబా, బుర్జ్ అబి హైదర్లపై ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో ఒక చోట ఎనిమిదంతస్తుల భవనం నేలమట్టం కాగా, మరో చోట ఓ భవన సముదాయంలోని దిగువ అంతస్తులు ధ్వంసమయ్యాయి. తమ ముఖ్య అధికారి వఫిక్ సఫాను చంపేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని హెజ్బొల్లాకు చెందిన అల్ మనార్ టీవీ అనంతరం పేర్కొంది. దాడులు జరిగిన సమయంలో వఫిక్ ఆ రెండు భవనాల్లోనూ లేరని స్పష్టం చేసింది. తాజా దాడి, 2006 తర్వాత బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత తీవ్రమైందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన భీకర దాడుల్లో హెజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లా సహా పలువురు కమాండర్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. హెజ్బొల్లా గురు వారం ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మరో వైపు, భూతల, వైమానిక, క్షిపణి దాడులతో హెజ్బొల్లా లక్ష్యాలపై ఇప్పటికే విరుచు కుపడు తున్న ఇజ్రాయెల్ సముద్రంపై నుంచి కూడా దాడులకు పాల్పడుతుందని సమాచారం. ఇద్దరు లెబనాన్ సైనికులు మృతిలెబనాన్లోని బింట్ జబెయిల్ ప్రావిన్స్ కఫ్రాలోని ఆర్మీ చెక్ పాయింట్‌లోని భవనంపై శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు సైనికులు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. ఐరాస బలగాలపై మళ్లీ కాల్పులులెబనాన్లో ఐరాస శాంతి పరిరక్షక దళాల (యూఎన్ఐఎఫ్ఐఎల్)పై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడ్డాయి. నఖౌరా పట్టణంలోని యూఎన్ఐఎఫ్ఐఎల్ ప్రధాన కార్యాలయం అబ్జర్వేషన్ పోస్ట్‌పై జరిగిన కాల్పుల్లో ఇద్దరు సభ్యులు గాయపడ్డారు. ఒకరు టైర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐరాస తెలిపింది. అదేవిధంగా, దక్షిణ లెబనాన్‌లో ఐరాస గుర్తించిన 120 కిలోమీటర్ల బ్లూలైన్‌ను దాటి ఇజ్రాయెల్ ఆర్మీ బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు చొచ్చుకువచ్చాయని ఐరాస శుక్రవారం తెలిపింది. -
స్కూలు, క్లినిక్‌లపై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్/బీరుట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక స్కూలు, క్లినిక్‌లపై జరిగిన దాడుల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. శరణార్థులు తలదాచుకుంటున్న డెయిర్ అల్– బలాహ్లోని స్కూలు భవనంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 28 మంది చనిపోగా, 54 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి, ఏడుగురు మహిళలున్నట్లు అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరణార్థులకు సాయం అందించే విషయమై ఓ సంస్థ ప్రతినిధులు శిబిరం నిర్వాహకులతో చర్చిస్తున్న సమయంలో భవనంపై దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఉదయం 11.20 గంటల సమయంలో ఘటన జరిగినప్పుడు స్కూలు భవనంలో సుమారు 3 వేల మంది ఉన్నట్లు పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ హిషామ్ అబూ హోలీ తెలిపారు. దాడి తీవ్రతకు మృతదేహాలు ముక్కముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయాయన్నారు. ఛిద్రంగా మారిన శరీర భాగాలనే ఏరి ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి భయానక పరిస్థితిని హిషామ్ వివరించారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారన్నారు. మొత్తం మూడంతస్తులకు గాను ఒకటో ఫ్లోర్లో శిబిరం పరిపాలన సిబ్బంది ఉండగా, మిగతా రెండంతస్తుల్లోనూ శరణార్థులే తలదాచుకుంటున్నారన్నారు. మొదటి అంతస్తు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. కానీ, దాడి తీవ్రతకు రెండు, మూడు అంతస్తులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వివరించారు. మరో ఘటనలో..గాజా నగరం పశి్చమాన ఉన్న అల్–రిమల్ క్లినిక్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన లక్షిత దాడిలో ఆరుగురు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారని గాజాలోని అంబులెన్స్ సరీ్వస్ ప్రతినిధి పరేస్ అవాద్ తెలిపారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి: 11 మంది మృతి బీరుట్: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ గురువారం చేసిన రెండు వేర్వేరు దాడుల్లో 11 మంది మృతి చెందారని, 48 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రస్ అల్–నబాలో ఓ ఎనిమిది అంతస్తుల భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా.. అపార్ట్మెంట్ కిందిభాగం దెబ్బతింది. -
యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ...పరస్పర దాడులు
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి. రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మేం విఫలమైన రోజు ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు. -
Israel-Hamas war: గాజా మసీదుపై బాంబుల వర్షం
డెయిర్ అల్–బలాహ్: పశ్చిమాసియాలోఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ సంస్థల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేస్తోంది. సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్ పట్టణంలో పాలస్తీనా పౌరులు ఆశ్రయం పొందుతున్న అల్–అక్సా అమరవీరుల మసీదుపై ఆదివారం ఉదయం బాంబుల వర్షం కురిపించింది. దాంతో కనీసం 19 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. డెయిర్ అల్–బలాహ్ సమీపంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై దాడుల్లో నలుగురు మృతిచెందారు. మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని మసీదు, పాఠశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. జబాలియా దిగ్బంధం ఉత్తర గాజాలోని జబాలియా టౌన్‌ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులను హెచ్చరించింది. జబాలియాపై వైమానిక, భూతల దాడులకు సన్నాహాలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు జబాలియా వైపు కదులున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. జబాలియాలో అతి పెద్ద శరణార్థుల శిబిరం ఉంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ‘యుద్ధంలో మరో దశలోకి ప్రవేశించాం’ అంటూ కరపత్రాలను జబాలియాలో జారవిడిచారు. ఉత్తర గాజాలో ఆదివారం భారీగా దాడులు జరిగినట్టు స్థానిక అధికారులు చెప్పారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. జబాలియాలో తమ ఇంటిపై వైమానిక దాడి జరిగిందని, తన తల్లిదండ్రులతోపాటు మొత్తం 12 మంది కుటుంబ సభ్యులు మరణించారని ఇమాద్ అలారాబిద్ అనేది వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇజ్రాయెల్ దాడుల్లో హసన్ హమద్, అనస్ అల్–షరీఫ్ అనే జర్నలిస్టులు మృతిచెందారు. ఉత్తర గాజాలో 3 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారందరినీ దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. బీరుట్లో ఆరుగురి మృతి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ దద్దరిల్లిపోతోంది. నగర దక్షిణ శివారు ప్రాంతమైన దాహియేపై సైన్యం విరుచుకుపడుతోంది. హెజ్»ొల్లా స్థావరాలే లక్ష్యంగా శనివారం రాత్రి నుంచి వైమానిక దాడులు సాగిస్తోంది. 30కిపైగా క్షిపణి దాడులు జరిగాయని, భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. సెపె్టంబర్ 23 తర్వాత ఇవే అతిపెద్ద దాడులని పేర్కొంది. గ్యాస్ స్టేషన్, ఔషధాల గోదాముతోపాటు ఒక ఆయుధాగారంపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులు ప్రయోగించిందని వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. హెజ్»ొల్లా కూడా వెనక్కు తగ్గకుండా ఉత్తర ఇజ్రాయెల్‌లో సైనిక శిబిరాలపై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 30 రాకెట్లను మధ్యలోనే కూల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో గత రెండు వారాల్లో 1,400 మంది మృతిచెందారు. 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. 3.75 లక్షల మంది లెబనీయులు సిరియా చేరుకున్నారు. శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించారని, 93 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రకటించింది. -
నస్రల్లా వారసుడూ మృతి?
జెరుసలేం/బీరూట్/టెహ్రాన్: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇటీవలే సారథి హసన్ నస్రల్లాతో పాటు పలువురు అగ్ర నేతలను కోల్పోయిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నస్రల్లా స్థానంలో సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు హషీం షఫియుద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు బలైనట్టు చెబుతున్నారు. దీన్ని అటు హెజ్బొల్లా గానీ, ఇటు ఇజ్రాయెల్ గానీ ధ్రువీకరించడం లేదు.అయితే శుక్రవారం బీరుట్ శివార్లలోని దాహియేపై ఇజ్రాయెల్ వైమానిక దళం చేసిన లక్షిత దాడుల అనంతరం ఆయన ఆచూకీ లేకుండా పోయినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అక్కడి బంకర్లలో హెజ్బొల్లా అగ్ర నేతలతో హషీం సమావేశమై ఉండగా పక్కా సమాచారం మేరకు ఇజ్రాయెల్ భారీగా బాంబుల వర్షం కురిపించిందని తెలిపాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న దాడుల వల్ల సహాయక బృందాలేవీ ఆ ప్రాంతానికి చేరలేకపోతున్నట్టు వివరించాయి. ఈ దాడుల్లో హషీం తీవ్రంగా గాయపడ్డట్టు హెజ్బొల్లా వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. మరోవైపు లెబనాన్‌పై దాడులను శనివారం ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేసింది.దక్షిణం వైపునుంచి మొదలుపెట్టిన భూతల దాడులను కొనసాగిస్తూనే ఉత్తరాది నగరం ట్రిపోలీని కూడా వైమానిక దాడులకు లక్ష్యంగా చేసుకుంది. ట్రిపోలీలోని బెడ్డావీ పాలస్తీనా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో హమాస్ సాయుధ విభాగమైన అల్ ఖసాం బ్రిగేడ్స్ చీఫ్ సయీద్ అతల్లాతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా మరణించారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. వెస్ట్‌బ్యాంక్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో చనిపోయిన 18 మందిలో తమ కమాండర్ తుల్కరెమ్ కూడా ఉన్నట్టు పేర్కొంది. దక్షిణాన ఒడైసే నగరాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందని హెజ్బొల్లా ఆరోపించింది. ఇప్ప టిదాకా 2,000 మందికి పైగా సామాన్యులు దాడులకు బలయ్యారని పేర్కొంది.లెబనాన్–సిరియా సరిహద్దుపై బాంబుల వర్షంలెబనాన్, సిరియాలను కలిపే కీలకమైన మస్నా బార్డర్ క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులతో విరుచుకుపడి నేలమట్టం చేశాయి. దారి పొడవునా ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. దాంతో రెండు దేశాల మధ్య రవాణా, రాకపోకలతో పాటు సర్వం స్తంభించిపోయింది. దాంతో దాడుల నుంచి తప్పించుకునేందుకు పొట్ట చేతపట్టుకుని సిరియాకు వెళ్తున్న లక్షలాది మంది లెబనీస్ పౌరులు సరిహద్దుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రాసింగ్ గుండా గత 10 రోజుల్లో కనీసం మూడున్నర లక్షల మంది సిరియాకు తరలినట్టు సమాచారం. ఇక్కడి రెండు మైళ్ల పొడవైన సొరంగం గుండా ఇరాన్ నుంచి హెజ్బొల్లాకు భారీగా ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే దాడులు చేసినట్టు వివరించింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు? తనపై వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎప్పుడు, ఎలా దాడి చేయనుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై మాత్రం దాడులను సమర్థించబోమని ఆయన స్పష్టం చేయడం తెలిసిందే. కానీ వాటినే లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతేగాక ఇరాన్ చమురు క్షేత్రాలపైనా బాంబుల వర్షం కురిపించే అంశాన్ని ఆయన తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే పశి్చమాసియాలోని దేశాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయని, యుద్ధం ఊహాతీతంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
యుద్ధ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 168 పాయింట్లు తగ్గి 25,628కు చేరింది. సెన్సెక్స్ 549 పాయింట్లు నష్టపోయి 83,712 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.64 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.78 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.01 శాతం లాభపడింది. నాస్డాక్ 0.08 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీపశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్ తదితర దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కల్లోల పరిస్థితుల్లో, పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి ఎగుమతులు 63.5 శాతం తగ్గిపోయాయని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. జోర్డాన్‌కు 38.5 శాతం క్షీణించాయని తెలిపాయి. లెబనాన్‌కు సైతం 6.8 శాతం తగ్గాయని చెప్పాయి. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలు కాగా, అది ఇప్పుడు లెబనాన్, సిరియాకు విస్తరించిందని.. ప్రత్యక్షంగా జోర్డాన్, ఇరాన్‌పైనా ప్రభావం చూపిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఎయిర్‌లైన్స్ చర్యలు చేపట్టాయి. ఈమేరకు పలు విమాన సర్వీసుల సమయంలో మార్పలు, మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎతిహాద్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఈమేరకు ప్రకటన విడుదల చేశాయి.మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితుల కారణంగా బుధవారం విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 2, 3 తేదీల్లో ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్, జోర్డాన్లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాక్, ఇరాన్‌లకు ప్రయాణించే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్‌లకు అక్టోబర్ 2, 3 తేదీలకు ప్రయాణాలు సాగించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ పేర్కొంది. కువైట్ ఎయిర్వేస్ విమాన సమయాల్లోనూ మార్పులు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది. -
లెబనాన్ నిరాశ్రయులు.. పది లక్షలు!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. సిరియాకే ఎందుకు? నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. యూకేకు సంపన్నులులెబనాన్లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు. -
Israel Hezbollah War: హెజ్బొల్లా అగ్రనేత హతం
జెరూసలేం: లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం దాడిలో సంస్థ సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం వెల్లడించింది. కౌక్ మృతిని హెజ్బొల్లా ధ్రువీకరించింది. దీంతో గత వారం రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా ముఖ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది! హెచ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా శుక్రవారం ఇజ్రాయెల్ భీకర బాంబు దాడిలో మృతిచెందడం తెలిసిందే. ఆయనతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌక్ 1980ల నుంచి హెజ్బొల్లాలో చురుగ్గా పని చేస్తూ అగ్ర నేతగా ఎదిగారు. 2006లో దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హెజ్బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాలో తరచుగా కనిపిస్తూ రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై అభిప్రాయాలు వెల్లడించేవారు. హెజ్బొల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హషీం సైఫుద్దీన్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం.జోర్డాన్‌పై మిస్సైల్ దాడి! మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జోర్డాన్‌పైనా క్షిపణి దాడి జరిగింది. భారీ క్షిపణి ఒకటి బహిరంగ ప్రదేశంలో పడిపోయినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇది లెబనాన్ నుంచి దూసుకొచి్చనట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇరాన్ గూఢచారి ఇచ్చిన పక్కా సమాచారంతోనే...! లెబనాన్ రాజధాని బీరుట్లో ఓ భవనం కింద భారీ నేలమాళిగలో దాక్కున్న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడం తెలిసిందే. ఇరాన్ గూఢచారి ఇచి్చన కచి్చతమైన సమాచారంతోనే నస్రల్లా జాడను గుర్తించినట్లు ఫ్రెంచ్ పత్రిక లీ పారిసీన్ వెల్లడించింది. అండర్‌గ్రౌండ్‌లో హెజ్బొల్లా సీనియర్ సభ్యులతో నస్రల్లా సమావేశం కాబోతున్నట్లు సదరు గూఢచారి ఇజ్రాయెల్‌కు ఉప్పందించాడని తెలిపింది. నస్రల్లా మృతిపై ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జనం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు తప్పదంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. 1980వ దశకం నుంచి హెజ్బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సిరియాపై అమెరికా దాడులు... 37 మంది మిలిటెంట్లు హతం బీరుట్: సిరియాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఆదివారం 2 దఫాలుగా దాడులకు దిగింది. వీటిలో తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూపు, అల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 37 మంది మిలిటెంట్లు హతమైనట్టు ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు ఉన్నారని వెల్లడించింది. అల్ ఖైదా అనుబంధ హుర్రాస్ అల్ దీన్ గ్రూప్‌కు చెందిన సీనియర్ మిలిటెంట్‌తో పాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వాయవ్య సిరియాపై దాడి చేసినట్లు అమెరికా æ తెలిపింది. సెంట్రల్ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్ శిక్షణా శిబిరంపై ఈ నెల 16న పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు సిరియా నేతలతో సహా 28 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అమెరికా ప్రయోజనాలతో పాటు తమ మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్ సామర్థ్యాన్ని ఈ వైమానిక దాడి దెబ్బతీస్తుందని సైన్యం పేర్కొంది. 2014లో ఇరాక్, సిరియాలను చుట్టుముట్టి, పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అతివాద ఐఎస్ గ్రూపు తిరిగి రాకుండా నిరోధించడానికి సిరియాలో సుమారు 900 మంది అమెరికా దళాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపులున్న వ్యూహాత్మక ప్రాంతాలకు కొద్ది దూరంలోనే ఉన్నాయి. దాడుల్లో 69 మంది మృతి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పుల్‌స్టాప్ పడటం లేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఆదివారం చేసిన దాడులతో 69 మంది చనిపోగా 76 మంది గాయపడినట్లు లెబనాన్ తెలిపింది. ఒక్క బెకా లోయపై దాడుల్లో 21 మంది మరణించగా 50 మంది వరకు గాయపడ్డారని, అయిన్ అల్ డెల్బ్ గ్రామంపై జరిగిన దాడిలో 24 మంది చనిపోయారు. -
Hassan Nasrallah: అరబ్బుల హీరో
హెజ్బొల్లా గ్రూప్‌నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్ హసన్ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్‌లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం. అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్‌లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్–హ్యాండ్ బుక్ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్–సదర్‌ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు 1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్‌కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్‌లోని నజఫ్ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్‌కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్ అయిన అమల్ మూవ్మెంట్లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పీఎల్ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్‌వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్వాదులతో హెజ్బొల్లా గ్రూప్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్ అబ్బాస్ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 1992లో ఇజ్రాయెల్ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్ సైన్యం కంటే హెజ్బొల్లా పవర్ఫుల్ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్బొల్లాకు ఇరాన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్‌తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్‌పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలను తరిమికొట్టారు. అరబ్ ప్రపంచానికి ఒక ఐకాన్‌గా మారారు. 1997లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్‌పై హెచ్‌బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెబనాన్‌లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఉండేవారు. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్‌ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హిజ్బుల్లాపై దాడుల్ని ఆపలేం.. ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
జెరూసలేం: ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య 21 రోజుల కాల్పుల విరమణపై తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నేతన్యాహు పరోక్షంగా 21 రోజుల కాల్పుల విరమణకు తాము ఒప్పుకోవడం లేదనే సంకేతాలిచ్చినట్లయ్యింది.హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకు పడుతుండడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఈ తరుణంలో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా కాల్పులు విరమించాలని అమెరికా,ఫ్రాన్స్‌తో పాటు యురోపియన్ యూనియన్ దేశాలు విజ్ఞప్తి చేశాయి. అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కార్యాలయం అధికారింగా ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనానలు చెబుతున్ననాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రధాని నేతన్యాహు అంగీకరించడం లేదు. మొత్తం సైన్యాన్ని మోహరించి దాడులు విస్తృతం చేయాలని నేతన్యాహు ఆదేశాలు జారీ చేశారని ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.భూతల దాడులకు సిద్దమైన ఇజ్రాయెల్బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి సైనికులకు కీలక ఆదేశాలు జారీచేశారు. హిజ్బుల్లాపై సాధ్యమైనంత మేరకు భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో అగ్రరాజ్యం అమెరికా తోపాటు, ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలు ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెచ్చాయి. ఆ ప్రతిపాదనని ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతి!
హమాస్‌ను ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్ హత మార్చింది. ఇక, తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కూడా మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహకర్త అయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థపై భీకర దాడులు చేసింది. సొరంగాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి హమాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అయితే, ఈ సొరంగాల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. Israel claims to have killed Yahya Sinwar in the Gaza StripBut nothing has been confirmed yet, as soon as it is confirmed, we will inform you pic.twitter.com/5xWYZpWJ69— Mustafa Gujjar (@MGujjar94) September 22, 2024అయితే, ఈ మధ్య కాలంలో అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా బలగాలు సిన్వార్ చనిపోయినట్టు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఐడీఎఫ్ కూడా అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అని నిర్ధారించుకోలేకపోతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. ఇజ్రాయెల్ చెబుతున్నట్టు ఒకవేళ సిన్వార్ కనుక మరణించి ఉంటే మాత్రం హమాస్‌కు కోలుకులేని దెబ్బ తగలినట్టే అవుతుంది.Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f— Israel Defense Forces (@IDF) February 13, 2024 #Breaking Reports that Israel is investigating whether Hamas chief Yahya Sinwar was killed in IDF strikes in Gaza. There is no clear intelligence to support the claim. Discussions are taking place as to whether Sinwar's communications have been cut off or he has been ki||ed. pic.twitter.com/Jkif0b9HmH— GLOBAL BREAKING NEWS (@tararnews) September 23, 2024ఇది కూడా చదవండి: ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు -
గాజాలో 22 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: గాజాలోని జైటూన్ ప్రాంతంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం జరిపిన దాడిలో కనీసం 22 మంది చనిపోగా మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలున్నారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ స్కూల్లో హమాస్ కమాండ్ సెంటర్ నడుస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. రఫాపై దాడిలో మరో నలుగురు చనిపోయారని హమాస్ పేర్కొంది. -
లెబనాన్ ఉక్కిరిబిక్కిరి.. ఇజ్రాయెల్ మెరుపు దాడులు
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడులకు దిగింది. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడింది. మరోవైపు.. హిజ్బుల్లా నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌లో భయాకన వాతావరణం నెలకొంది. ఏ సమయంలో ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా గురువారం టెలివిజన్‌లో ప్రసంగించారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్ హద్దు మీరిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడటం గమనార్హం. వందల సంఖ్యలో వార్‌హెడ్స్, రాకెట్లు హిజ్బుల్లా స్థావరాలపైకి దూసుకెళ్లాయి. తాజా దాడిలో గాయపడిన, చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, అంతకుముందు హిజ్బుల్లా డ్రోన్ దాడులు చేసింది. ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. Israel is bombarding Hezbollah targets in Lebanon right now, in the most extensive wave of attacks since the war started. That's what you do when thousands of Hezbollah terrorists are incapacitated due to injuries 📟pic.twitter.com/wry0WodZxf— Dr. Eli David (@DrEliDavid) September 19, 2024 పేజర్లు, వాకీటాకీలపై నిషేధంపేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది. ఇక, లెబనాన్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. దాదాపు మూడు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 287 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.Hezbollah had prepared 100s of rockets launchers, 1000 plus barrels in #Lebanon for attack on Israeli military & civilian targets.Just minutes before the launch, #Israel discovered the plot, struck, & successfully destroyed all the Hizb launch sites in massive IAF Air strikes pic.twitter.com/7ZNmp2BDDq— Megh Updates 🚨™ (@MeghUpdates) September 20, 2024ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ రూటే వేరు.. ఆధారాలుండవ్.. అంతా సినీ ఫక్కీలో..! -
ఆధారాలుండవ్.. అంతా సినీ ఫక్కీలోనే!
హీరో/విలన్.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా రిమోట్ బటన్ నొక్కి.. తాను అనుకున్న వ్యక్తిని మట్టుపెడతాడు. హాలీవుడ్లో జేమ్స్ బాండ్ చిత్రాల్లోనే కాదు.. మన దగ్గరా ‘జై చిరంజీవ’లో ఈ తరహా సీన్ ఒకటి ఉంటుంది. అతిశయోక్తిగా అనిపించినప్పటికీ.. వాస్తవ ప్రపంచంలోనూ సినిమాలను తలదన్నే అలాంటి ఘటనలే ఇప్పుడు మనం చూడాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ గూఢచర్య సామర్థ్యం తెలుసు కాబట్టే.. కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలావరకు పరిమితులను పెట్టుకుంటున్నాయి చుట్టుపక్కల ప్రత్యర్థి దేశాలు. అయినా కూడా దాడులు ఆగడం లేదా?. నిన్న పేజర్లు.. నేడు వాకీటాకీలు, ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ గాడ్జెట్లు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. అటు డివైజ్ కంపెనీలేమో.. ఆ పేలుళ్లకు తమకు సంబంధం లేదంటున్నాయి. ఈ ఆరోపణలు ఇలా ఉండగానే.. గతంలో ఇజ్రాయెల్ తమ చేతులకు మట్టి అంటకుండా జరిపిన కొన్ని దాడుల గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.నెక్ పాయిజన్1997 హమాస్ వరుస ఆత్మాహుతి దాడులు ఇజ్రాయెల్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పుడే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బెంజమిన్ నెతన్యాహూ.. వీటికి చెక్ పెట్టాలనుకున్నారు. ఇందులో భాగంగా.. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఖలేద్ మెషాల్‌ను హత్య చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. మారు వేషంలో ఇద్దరు మోసాద్ ఏజెంట్లు.. మెషాల్ మెడ భాగం నుంచి పాయిజన్ పంపించేందుకు యత్నించారు. అయితే సకాలంలో ఆయన భద్రతా సిబ్బంది ఆ యత్నాన్ని గుర్తించారు. జోర్డాన్ పోలీసులు ఆ ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకోగా, మెషాల్‌కు విరుగుడు ఇచ్చాకే అక్కడి నుంచి తరలించారు.ఫోన్‌కాల్‌తో.. ఇజ్రాయెల్ మరో దర్యాప్తు సంస్థ.. షిన్‌బెట్ 1996 గాజాలో హమాస్ మాస్టర్ బాంబ్ మేకర్ యాహ్యా అయ్యాష్‌ను సెల్‌ఫోన్ బాంబ్‌తో చంపింది. తన తండ్రిలో ఫోన్లో మాట్లాడుతున్న ఒక్కసారిగా ఫోన్ పేలిపోయి తలకు గాయమై అయ్యాష్ చనిపోయాడు. రిమోట్ ద్వారా సెల్ఫోన్లో అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాల ద్వారా మట్టు పెట్టగలిగారు.ఫేక్ టూరిస్ట్లుహమాస్కు ఆయుధాలు సరఫరా చేసే అంతర్జాతీయ వెపన్ డీలర్ మహమౌద్ అల్ మబౌ 2010లో దుబాయ్‌లోని ఓ హోటల్లో అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. ఎమిరేట్స్ అధికారులు తొలుత అది సహజ మరణంగానే ప్రకటించి కేసు మూసేశారు. అయితే.. హమాస్ అనుమానాలు లేవనెత్తడంతో కేసును రీ ఓపెన్ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. టూరిస్టుల పేరిట ఫేక్ పాస్ట్‌పోర్టులు తయారు చేయించుకుని మోస్సాద్ ఏజెంట్స్ ఆ హోటల్లో దిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఇక.. మబౌహ్ శవపరీక్షలో విషప్రయోగం జరిగినట్లు తేలింది.ట్రాఫిక్ బ్లాస్ట్2010-20 మధ్య ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. చాలావరకు సిగ్నల్స్లోనే జరగడం గమనార్హం. వాహనాలు ఆగి ఉన్న టైంలో పక్కనే మరో వాహనంతో వచ్చి కాల్పులు జరపడం లేదంటే పేలుడు జరపడం లాంటివి చేశారు. ఇవి.. ఇజ్రాయెల్ దాడులేనని ఇరాన్ బహిరంగంగానే ఆరోపణలు చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం అది తమ పని కాదు.. బహుశా తమ ఏజెంట్లకు ఇరాన్ మధ్య జరిగే షాడో వార్ అయి ఉండొచ్చని వ్యాఖ్యానించింది.AI సాయంతో జరిగిన తొలి హత్య!ఇరాన్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్ మోహ్సెన్ ఫక్రిజదెహ్ మమబది హత్య. టెక్నాలజీకి కాసుల వర్షం కురిపిస్తున్న ఏఐ లాంటి టెక్నాలజీ సాయంతో ఈ హత్య చేయించారనే కథనాలు.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. 2020 నవంబర్ 27న భార్యతో కలిసి విహారయాత్రను ముగించుకుని.. ఎస్కార్ట్ నడుమ ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆటానమస్ శాటిలైట్ ఆపరేటెడ్ గన్ సాయంతో ఆయన్ని హత్య చేశారు. మెహ్‌సెన్ భార్యకిగానీ, భద్రతా సిబ్బంది ఎవరికీగానీ చిన్నగాయం కూడా కాలేదు. పూర్తిగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగించి.. చుట్టుపక్కల ఎవరికీ ఏం కాకుండా ఈ హత్యకుట్రను అమలు చేయడం విశేషం. ప్రపంచంలో ఈ తరహాలో హత్యకు గురైన మొదటి వ్యక్తి మోహ్సెన్. టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్ఎన్ ఏంఏజీ మెషిన్ గన్ను దాడికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఎక్కడో బయటి దేశం నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా శాటిలైట్ లింక్ సాయంతో మోహ్సెన్ మీద కాల్పులు జరిపారు. కారు వేగం.. కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్ గన్.. అరవై సెకన్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి టార్గెట్‌ను పూర్తి చేశారు. అంతా అనుకున్నట్లు ఇది ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కాదు. అమెరికా-ఇజ్రాయెల్ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఈ కథనాల సారాంశం. గూఢాచర్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది ఈ దాడి అని ఆ కథనాలు పేర్కొన్నాయి. -
హెజ్బొల్లా క్షిపణి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
మస్యాఫ్: సిరియాలోని హెజ్బొల్లా క్షిపణి తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు దాడి చేశాయి. లెబనాన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉన్న మస్యాఫ్ నగర సమీపంలో సోమవారం చేపట్టిన ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. దాడి చిత్రాలను అమెరికా మీడియా బయట పెట్టడంతో వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలోని ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. వైమానిక దళానికి చెందిన ఎలైట్ షాల్డాగ్ యూనిట్ బలగాలు హెలికాప్టర్ల నుంచి దిగి, ఇరాన్ నిర్మించిన కేంద్రంలో పేలుడు పదార్థాలను అమర్చాయి. ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లాకు క్షిపణుల సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అపరేషన్పై ముందుగానే అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. -
అల్ మవాసీ మానవతా జోన్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్ బలాహ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడుల పర్వం ఆగడం లేదు. దక్షిణ గాజాలో వలసదారులకు ఆశ్రయం కలి్పస్తున్న మానవతా జోన్‌పై ఇజ్రాయెల్ దళాలు సోమవారం జరిపిన దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారులు ప్రకటించారు. ఖాన్ యూనిస్ పరిధిలోని అల్–మవాసీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. అయితే 40 మంది చనిపోయినట్లు తొలుత వార్తలొచ్చాయి. మానవతా జోన్లలో రహస్యంగా పనిచేస్తున్న హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉగ్రవాదులపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. క్షిపణి దాడుల్లో 20 గుడారాలు దగ్ధమయ్యాయని, పేలుడు ధాటికి 30 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్న గాజా సివిల్ డిఫెన్స్ సభ్యులు ఇసుకను తవ్వుతున్న దృశ్యాలను హమాస్ మీడియా సంస్థ అల్ అక్సా టీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘200 పై చిలుకు నిర్వాసితుల గుడారాల్లో 20 ధ్వంసమయ్యాయి. వాటిలో ఉంటున్న కుటుంబాలు అదృశ్యమయ్యాయి’’ అని గాజా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి మహమూద్ బస్సాల్ చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇప్పటికీ దాడులు ఆపడం లేదని శరణార్థులు వాపోయారు. దాడి జరిగిన చోట తమ వాళ్లెవరూ లేరని హమాస్ పేర్కొంది. -
Israel-Hamas war: గాజాలో 89 మంది మృత్యువాత
గాజా: గాజాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బలగాలు 48 గంటల వ్యవధిలో జరిపిన దాడుల్లో 89 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో శనివారం ఒక్క రోజే 48 మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపైనా దాడికి దిగిందని, ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు వివరించింది. రోగులు, వారి సంబంధీకులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్ ఆర్మీ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో శనివారం గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ఖాన్ యూనిస్ ఆస్పత్రిలో 10 మంది శిశువులకు టీకా వేశారని అధికారులు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ చుట్టుముట్టింది. నాలుగు రోజులుగా ఇక్కడ దాడులు జరుపుతున్న ఆర్మీ నగరాన్ని మిగతా ప్రపంచంతో సంబంధాలు లేకుండా తెంచేసింది. మిలటరీ జీపులు, సాయుధ బలగాల వాహనాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ధ్వంసమైన కాంక్రీట్ గోడలు, శిథిల భవనాలు దర్శనమిస్తున్నాయి. -
Israel-Hamas war: గాజాకు 3 రోజుల ఊరట
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మూడు దశల్లో డ్రైవ్... గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యూఎన్ఆర్డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది. గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది. -
Israel-Hamas war: వెస్ట్‌బ్యాంక్‌పై భీకర దాడి
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
Israel-Hamas war: రక్తమోడుతున్న గాజా
డెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది. -
బెడ్రూంలో బాంబు
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది. అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది. టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్‌పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.వామ్మో ఇజ్రాయెల్! హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్‌తో బాంబు పేల్చారు. పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel Hamas War: హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ దీఫ్ హతం
జెరూసలేం: హమాస్ మి లటరీ విభాగం ‘ఖ స్సం బ్రిగేడ్స్’ అధి నేత మొహమ్మద్ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేలి్చచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. నిఘావర్గాల సమాచారం మేరకు తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇరాన్ సవాలు.. ఇజ్రాయెల్ సమాధానం
కేవలం 12 గంటలు. అంత స్వల్ప వ్యవధిలో ఇటు హిజ్బొల్లాను, అటు హమాస్‌ను ఇజ్రాయెల్ చావుదెబ్బ తీసింది. రెండు ఉగ్ర సంస్థల్లోనూ అత్యున్నత స్థాయి నేతలను అత్యంత కచి్చతత్వంతో కూడిన వైమానిక దాడుల ద్వారా అడ్డు తొలగించుకుంది. మంగళవారం రాత్రి హిజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్‌ను లెబనాన్ రాజధాని బీరూట్‌లో అంతమొందించింది. తెల్లవారుజామున తన ఆగర్భ శత్రువైన ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డులో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఆయ న సొంతింట్లోనే హత్య చేసింది. తద్వారా ఎక్కడైనా, ఎవరినైనా, ఎప్పుడైనా లక్ష్యం చేసుకోగల సత్తా తనకుందని మరోసారి నిరూపించుకుంది. గాజా యుద్ధంతో ఇప్పటికే అట్టుడుకుతున్న పశి్చమాసియాలో ఇజ్రాయెల్ తాజా చర్యలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హనియే హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిజ్బొల్లా కూడా షుక్ర్ మృతిని ధ్రువీకరించింది. ‘ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పద’ని పేర్కొంది. గాజాలో కాల్పుల విరమణకు ఇక దారులు మూసుకుపోయినట్టేనని భావిస్తున్నారు...టెహ్రాన్/బీరూట్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్ గట్టిగా జవాబిచి్చంది. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే ప్రాణాంతక వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు. హెచ్చరించినట్టుగానే... గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.ఇజ్రాయెల్‌కు మరణశాసనమే: ఖమేనీ అల్టిమేటంహనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ ఆధ్యాతి్మక నేత, సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.షుక్ర్‌ను మట్టుపెట్టాం: ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.శరణార్థి నుంచి హమాస్ చీఫ్ దాకా... ఇస్మాయిల్ హనియే గాజా సమీపంలో శరణార్థి శిబిరంలో 1962లో జని్మంచారు. 1987లో మొదటి పాలస్తీనా యుద్ధ సమయంలో పుట్టుకొచి్చన హమాస్‌లో ఆయన వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు, తొలి చీఫ్ అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించాక హమాస్‌లో కీలకంగా మారారు. ఉర్రూతలూగించే ప్రసంగాలకు పెట్టింది పేరు. 2006లో పాలస్తీనా ప్రధానిగా గాజా పాలన చేపట్టారు. ఏడాదికే పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. నాటినుంచి గాజాలో ఫతా–హమాస్ మధ్య పోరు సాగుతోంది. అబ్బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హనియే గాజా ప్రధానిగా కొనసాగుతున్నారు. 2017లో హమాస్ చీఫ్ అయ్యారు. -
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియోహ్ హతం
జెరూసలేం: హమాస్‌పై ఇజ్రాయెల్ దాడుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ మృతిచెందాడు. జియోనిస్ట్ దాడిలో ఇస్మాయిల్ మృతిచెందినట్టు పాలస్తీనా గ్రూప్ ప్రకటించింది. ఇక, ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని బృందం తెలిపింది.కాగా, ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ మృతిచెందాడు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా టెహ్రాన్‌లోని అతని నివాసంపై జియోనిస్ట్‌లు దాడి చేయడంతో ఆయన మృతిచెందినట్టు పాలస్తీనా గ్రూప్ తెలిపింది. ఈ దాడిలో ఇస్మాయిల్‌తో పాటు అతడి బాడీగార్డ్ కూడా మరణించినట్టు చెప్పుకొచ్చింది.కాగా, ఇస్మాయిల్ ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇస్మాయిల్ కుమారులు మృతిచెందారు. BREAKING | The Iranian Revolutionary Guard announces the death of Ismail Haniyeh, head of the political bureau of the resistance in an lsraeli raid executed in Tehran. pic.twitter.com/wqq1fYQr5n— TIMES OF GAZA (@Timesofgaza) July 31, 2024 -
ఇజ్రాయెల్ అటాక్ సక్సెస్.. హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం
జెరూసలేం: గాజాలోని హిజ్బుల్లా మిలిటరీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బులా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను హతమారిచ్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కింది. కాగా, ఆక్రమిత గోలన్ హైట్స్‌పై రాకెట్ దాడికి ఫువాద్ కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇజ్రాయెల్ మిలటరీ తెలిపిన వివరాల ప్రకారం..హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ మృతిచెందాడు. బీరుట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అతడు మరణించాడు అని తెలిపింది. ఇక, ఇటీవల సాకర్ మైదానంలో దాడుల్లో 12 మంది చిన్నారుల మరణాలకు కారకుడు ఫువాద్ అని ఇజ్రాయెల్ పేర్కొంది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు షుక్ర్ నాయకత్వం వహించాడని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అడ్మిరల్ డేనియల్ హగారీ మాట్లాడుతూ.. ఫువాద్ షుక్ర్ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్ వ్యక్తి. అతడి నేతృత్వంలోనే హిజ్బుల్లా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్‌లో అనేక మంది మరణాలకు అతడే కారణం. హిజ్బుల్లాకు సంబంధించి గైడెడ్ క్షిపణులు, క్రూయిల్ క్షిపణులు, యాంటీ-షిప్ రాకెట్స్, అధునాతన ఆయుధాలు అతడి ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు.ఫువాద్ షుక్ర్‌పై అమెరికా రివార్డు..లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా షుక్ర్ పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్‌పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్ర్ గురించి సమాచారం అందించిన వారికి అయిదు మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది. Fuad Shukr: the man who killed 12 children in a soccer field on Saturday and is responsible of 30 years of Hezbollah terrorist attacks. pic.twitter.com/RuHO0W2py6— Israel Defense Forces (@IDF) July 30, 2024ఇదిలా ఉండగా.. లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడికి ప్రతిగా హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. మరిన్ని దాడులు ఉంటాయని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తు చర్యలపై ఇజ్రాయెల్ చర్చలు రాకెట్ దాడికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. -
ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. టర్కీ సంచలన నిర్ణయం!
అంకారా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. గాజాపై r/ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తామని ఎర్డోగాన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.కాగా, తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్.. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ అండగా నిలుస్తుందన్నారు. అలాగే, టర్కీ గతంలో లిబియా నాగోర్నో-కరాబాఖ్‌లలో ప్రవేశించినట్టుగా ఇజ్రాయెల్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. కాగా 2020లో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది.ఇదిలా ఉండగా.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. -
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...!
గాజా నగరం. జనవరి మాసం. రాత్రి 10 గంటలు. ఎముకలు కొరికే చలి. ఇజ్రాయేల్ దాడులతో బాంబుల మోత మోగిపోతోంది. 34 ఏళ్ల ఆలా అల్ నిమర్. అప్పటికే నిండు గర్భిణి. నడిరోడ్డు మీద పురిటినొప్పులు పడుతోంది. నేపథ్యంలో దూరంగా బాంబుల మోతలు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి నెట్వర్క్ లేదు. ట్యాక్సీ కోసం వెళ్లిన భర్త అబ్దుల్లా ఇంకా తిరిగి రాలేదు. ‘ఎలాగైనా నేను ఆస్పత్రికి చేరుకున్నాకే ప్రసవించేలా చూడు తండ్రీ’ అన్న ఆలా వేడుకోళ్లు ఫలించలేదు. దాంతో నిస్సహాయురాలిగా రోడ్డు మీదే ప్రసవించింది. ట్యాక్సీ దొరక్క వెనక్కి పరుగెత్తుకొచ్చిన భర్త నెత్తుటి కూనను చేతుల్లోకి తీసుకున్నాడు. బొడ్డుతాడు కత్తిరించేందుకు కూడా ఏమీ లేదు. సోదరుడు తెచి్చన మెడికల్ కిట్‌లో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కత్తిరించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎట్టకేలకు ఓ కారు దొరికినా పెట్రోల్ అయిపోవడంతో అదీ ఆగిపోయింది. భర్త, సోదరుడు మొబైల్ ఫ్లాష్ లైట్‌తో దారి చూపుతుంటే పసికందును స్వెటర్లో చుట్టుకుని రక్తమోడుతూ గంటసేపు నడిచిందా పచ్చి బాలింత. దారంతా ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూనే ఉన్నారంతా. ఎట్టకేలకు ఓ మినీ బస్సు వారిని ఆస్పత్రి చేర్చింది. అప్పటికీ విపరీతమైన ని్రస్తాణతో ఆలా కళ్లు మూతలు పడ్డాయి. తెల్లవారి గానీ స్పృహలోకి రాలేదు. వెంటనే బిడ్డ కోసం తడుముకుంది. పాపాయి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పాక గానీ కుదుట పడలేదు. యుద్ధం మొదలయ్యాక అదే ఆమెకు అత్యంత సంతోషాన్నిచి్చన ఉదయం. పది నెలలు.. పదకొండు దాడులు... ఇది ఒక ఘటన మాత్రమే. గత అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన నాటినుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు. తల్లిదండ్రులను పోగొట్టు్టకుని అనాథలైన పిల్లలు. కళ్లముందే పిల్లలు మరణిస్తుంటే నిస్సహాయంగా చూసిన వృద్ధులు. తను ప్రసవించే నాటికన్నా యుద్ధం ఆగిపోవాలనిదేవుడుని వేడుకుంది ఆలా. అలా జరగకపోయినా నడి రోడ్డుపైనే ఈ లోకంలోకి వచి్చన తన చిన్నారి నిమాకు మాత్రం ఇప్పుడు ఆర్నెల్లు నిండాయి. నిమా ఆమెకు మూడో సంతానం. ముగ్గురు పిల్లలకు సరైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాననే బాధ ఆలాను వెంటాడుతోంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక్క రొట్టె దొరకడమే గగనంగా ఉంది. పూటకు పావు రొట్టెతో సరిపుచ్చుకుని అర్ధాకలితోనే పడుకుంటున్నారు. యుద్ధం మొదలవగానే గాజాలోని జైటౌన్లో ఉన్న ఆలా ఇంటిపై తొలి దాడి జరిగింది. దాంతో బంధువుల ఇంటికి వెళ్లారు. అదీ బాంబు దాడులకు బలవడంతో పొరుగు వాళ్ల ఇళ్లకు. అలా ఈ పది నెలల్లో ఆలా కుటుంబం ఏకంగా పదకొండు బాంబుదాడులు తప్పించుకుంది. కాకపోతే అన్నిసార్లూ నిరాశ్రయమవుతూ వచి్చంది. ఆలా ఎనిమిది నెలల గర్భవతిగా ఉండగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు వారుంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆలా కుటుంబంతో పాటు 25 మంది దాకా ఇంట్లో ఉన్నారు. కేవలం దైవకృప వల్లే ఆ దాడి నుంచి బతికి బట్ట కట్టామని గుర్తు చేసుకున్నారామె. నెలకే మరో బాంబుదాడి ఆమె 26 ఏళ్ల సోదరుడిని పొట్టన పెట్టుకుంది. ‘చీకటి రోజుల్లో మాత్రం ఆశల గానాలు ఉండవా!? ఉంటాయి. కాకపోతే చీకటిరోజుల గురించే ఉంటాయి’ అన్నారో ఫ్రెంచ్ నాటకకర్త. ఇంతటి యుద్ధ మధ్యంలో, అంతులేని విషాదాల పరంపరలో ఆలా కుటుంబాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్కటి.. చిన్నారి నిమా బోసినవ్వులు... 39,324 మంది మృతి... గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 39,324 మంది మరణించారు. 90,830 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 66 మంది మృతి చెందారు. 241 మంది గాయపడ్డారు. అక్టోబ రు 7న హమాస్ నేతృత్వంలోని దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,139 మంది మరణించడం, అది యుద్ధానికి దారితీయడం తెలిసిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Hamas war: 90 మంది దుర్మరణం
జెరుసలేం: గాజాలోని దక్షిణ ప్రాంత నగరం ఖాన్ యూనిస్‌పై శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 90 మంది మృతి చెందగా కనీసం 300 మంది పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారు. హమాస్ మిలటరీ విభాగం అధిపతి మహ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మరో ముఖ్య నేత రఫా సలామాను కూడా ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో వీరిద్దరూ చనిపోయిందీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఫెన్సింగ్‌తో ఉన్న హమాస్ స్థావరంపై జరిపిన దాడిలో కొందరు మిలిటెంట్లు కూడా హతమైనట్లు ప్రకటించింది. అయితే, ఉత్తర రఫా– ఖాన్ యూనిస్ మధ్యలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన మువాసిలోనే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా పాలస్తీనియన్లు తలదాచుకున్న మువాసిపైకి కనీసం ఏడు క్షిపణులు వచ్చి పడ్డాయని అంటున్నారు. ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, కాలిపోయిన కార్లు, టెంట్లు, నల్లగా మసిబారిన గృహోపకరణాలు నిండిపోయి ఉన్నాయి. దాడి తీవ్రతకు చిన్నారుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, తమ చేతులతోనే వాటిని ఏరుకోవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి రోదిస్తూ తెలిపాడు. బాధితుల్ని కార్లు, గాడిదల బండ్లు, దుప్పట్లలో వేసుకుని సమీపంలోని నాసర్ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటనను హమాస్ ఖండించింది. అక్కడ డెయిఫ్ సహా తమ నేతలెవరూ లేరని స్పష్టం చేసింది. భయంకరమైన ఊచకోతను కప్పిపుచ్చుకునేందుకే ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ చెబుతున్నదే నిజమైతే గత తొమ్మిది నెలల యుద్ధంలో సాధించిన కీలక విజయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలకు తాజా ఘటన అవరోధంగా మారుతుందని చెబుతున్నారు.ఎవరీ డెయిఫ్..?ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో హమాస్ మిలటరీ వి భాగం చీఫ్‌గా వ్యవహ రిస్తున్న డెయిఫ్ది మొదటి పేరు. గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయె ల్ నిఘా విభాగాలు పలుమార్లు చేసిన హత్యాయత్నాల నుంచి డెయిఫ్ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో గాయపడిన ఇతడు పక్షవాతం బారినపడుతున్నట్లుగా భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై జరిపిన మెరుపుదాడికి సూత్రధారి డెయిఫే అని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 30 ఏళ్ల వయస్సులో ఇతడి ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఆధారం ఇజ్రాయెల్ ఆర్మీ వద్ద లేదు. -
హమాస్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ దాడుల్లో 71 మరణాలు
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హమాస్ కీలక నేతలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 71 మంది మృతిచెందారు. మరో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది.కాగా, హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్, మరో కీలక కమాండర్ రఫా సలామాలే లక్ష్యంగా తాజాగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 71 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇదే సమయంలో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. అయితే, ఈ దాడిలో హమాస్ నేతల ప్రస్తుత పరిస్థితి మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి. Gotcha!#Hamas military commander & architect of the Oct7 atrocities, Mohammed Deif, is no longer a problem. pic.twitter.com/JhXFVy7Lne— ✡Israel and Stuff✡🎗️ (@IsraelandStufff) July 13, 2024 ఇదిలా ఉండగా.. ఉత్తర రఫా నుంచి ఖాన్ యూనిస్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం వేలాదిమంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రాంతంపైనే ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యమే గతంలో ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా గుర్తించి, నిరాశ్రయులు అక్కడే ఆశ్రయం పొందాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి. -
హమాస్, లెబనాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం!
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న వేళ ఇజ్రాయెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మిలటరీలో పని చేస్తున్న ప్రతీ పురుషుడు మూడేళ్ల పాటు పని చేయాలన్న నిబంధనను తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు వార్త సంస్థ వైనెట్ కథనంలో తెలిపింది.కాగా, ఓ వైపు హమాస్, మరోవైపు లెబనాన్ దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు ప్రతీ పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని మూడేళ్లకు పెంచినట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక, తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్ సమావేశంలో ఓటింగ్‌కు పెట్టనున్నారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్.. హమాస్, లెబనాన్‌పై ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే మిలటరీ ఎక్కువ సంఖ్యలో ఉండాలన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ పూర్తి మద్దతు ఉంది. వారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా భారీ సంఖ్యలో సైన్యం ఉండాలి. అందుకే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. హమాస్‌తో యుద్ధంలో తాము దాదాపుగా విజయానికి చేరువైనట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. -
Israel-Hamas war: ఆగని దారుణ దాడులు
డెయిర్ అల్ బాలాహ్: గాజా భూతలంపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ఆగట్లేవు. వరసగా రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున సైతం సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బాలాహ్ పట్టణంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించిన ‘సేఫ్ జోన్’లో తలదాచుకుంటున్న వారిపైనా దాడులు చేసింది. దీంతో ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలుసహా 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ శరణార్థి శిబిరంపై దాడిలో ఐదుగురు చిన్నారులుసహా 12 మంది చనిపోయారని అల్–అల్సా స్మారక ఆస్పత్రి ప్రకటించింది. డెయిర్ అల్ బాలాహ్ పట్టణంలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఇళ్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన ‘మానవతా రక్షిత ప్రాంతం’లో ఉండటం గమనార్హం. దోహాలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తులు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు కోసం సంధి ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సిటీని ఖాళీచేయాలంటూ బుధవారం ఇజ్రాయెల్ ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లింది. హమాస్ మిలిటెంట్లు మళ్లీ గాజాసిటీలో ఎక్కువవడంతో వారి నిర్మూలనే లక్ష్యంగా సాధారణ ప్రజలు నగరాన్ని ఖాళీచేసి దక్షిణంవైపు తరలిపోవాలని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. -
ఖాన్ యూనిస్‌ను వెంటనే ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్ యూనిస్‌లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం. ఈ మేరకు ఖాన్ యూనిస్‌లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గతవారం ఉత్తర గాజాలోని షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి చెందాడు.హమాస్‌ను అంతం చేసే దశలో ఇజ్రాయెల్ పురోగతి సాధింస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్‌లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు దక్షిణ గాజా నగరమైన రఫాకు తరలివెళ్లారు.అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హామాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.చదవండి: ట్రంప్ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్ -
ఇజ్రాయెల్ Vs హమాస్.. నెతన్యాహు సంచలన ప్రకటన!
టెల్ అవీవ్: హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందన్నారు.కాగా, నెతన్యాహు తాజాగా ఇజ్రాయెల్ ఓ మీడియా ఛానెల్లో మాట్లాడుతూ.. గాజాలో శాశ్వత యుద్ధాన్ని నివారించే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోము. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదనలో భాగంగా బందీలు విడుదలకు ప్రతిగా పాక్షిక కాల్పులు విరమణ ఒప్పందానికి మాత్రమే కట్టుబడి ఉన్నాం. During a speech at the Knesset, Prime Minister Benjamin Netanyahu said that Israel is “committed to the Israeli proposal that President Biden endorsed” on Monday. pic.twitter.com/NGoVdercZw— Middle East Eye (@MiddleEastEye) June 25, 2024 హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు చేరుకుంది. త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌వాసులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు. అలాగే, గాజాలో పరిపాలనను కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోయేది లేదు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఇకపై తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి. వాణిజ్యనౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు. దీంతో వారిపై ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. -
Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం
ఖాన్ యూనిస్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. షతీ శరణార్థుల శిబిరం, పొరుగునున్న తుఫాపై శుక్ర, శనివారాల్లో జరిగిన దాడుల్లో కనీసం 42 మంది దుర్మరణం పాలైనట్టు పాలస్తీనా మీడియా విభాగం పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచి గాజాలో మృతుల సంఖ్య 37,500 దాటింది. దాదాపు లక్ష మంది దాకా గాయపడ్డారు’’ అని వివరించింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు పశ్చిమ రఫాలోకి మరింతగా చొచ్చుకొస్తున్నాయి. పైనుంచి యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు, గత అక్టోబర్ నుంచి నిరంతరాయంగా జరుగుతున్న దాడుల దెబ్బకు గాజాలో ఆరోగ్య వ్యవస్థ నేలమట్టమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రకటించింది. ‘‘ఇప్పటిదాకా కనీసం 9,300 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకుంది. వారితో అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోంది’’ అని పాలస్తీనా శనివారం ఆరోపించింది. -
గాజాలో భీకర పోరు.. 210 మందికి పైగా మృతి!
జెరూసలెం/గాజా: సెంట్రల్ గాజాలో నుసెయిరత్‌లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్ అల్ బలాహ్లోని అల్–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్ మెయిర్ జాన్(21), ఆండ్రీ కొజ్లోవ్(27), ష్లోమి జివ్(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్.. శనివారం ఐడీఎఫ్ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్ కేన్సర్ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు. -
Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ దాడులు... 18 మంది దుర్మరణం
డెయిర్ అల్ బలాహ్(గాజా): సెంట్రల్ గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. నుసెయిరత్‌లో ఐరాస శరణార్థి శిబిరం నడుస్తున్న స్కూలుపై గురువారం జరిపిన దాడిలో 33 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఇజ్రాయెల్ సైన్యం డెయిర్ అల్ బలాహ్, జవాయిడా పట్టణాల్లోనిసెయిరత్, మఘాజి శరణార్థి శిబిరాలపై శుక్రవారం రాత్రి జరిపిన దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నట్లు అల్–హక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, గురువారం నుసెయిరత్‌లోని స్కూల్‌పై జరిపిన దాడిని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. స్కూల్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో జరిగిన లక్షిత దాడుల్లో మృతి చెందిన వారిలో 9 మంది మిలిటెంట్లు ఉన్నట్లు వివరించింది. రెండు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మిలిటెంట్ల సొరంగాలను, మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఆర్మీ తెలిపింది. -
Hamas: గాజాలో దాడులు ఆపితే.. ఒప్పందానికి రెడీ
ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా రఫాపై దాడులకు తెగబడుతోంది.గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై దాడులు ఆపేస్తే.. ఇజ్రాయెల్‌తో తాము పూర్తి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ మలిటెంట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సైతం వెంటనే వదిలేస్తామని తెలిపారు.‘‘ గాజాపై ఇజ్రాయెల్ ఇలానే దాడలు, మారణహోనం కొనసాగిస్తే.. హమాస్, పాలస్తీనా వర్గాలు ఎట్టిపరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరించవు. అందుకే మేము మధ్యవర్తులకు తెలిపుతున్నాం. గాజా పౌరులపై దాడులు ఆపితే.. ఇజ్రాయెల్‌తో పూర్తి ఒప్పందం చేసుకోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్ బంధీలను వెంటనే వదిలేస్తాం’’ అని హమాస్ పేర్కొందిఅంతర్జాతీయ న్యాయ స్థానం.. గాజాలో దాడులు ఆపాలన్నా ఇజ్రాయెల్ దక్షిణ గాజాలోని రఫా నగరంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రఫా నగరంలో తల దాచుకుంటున్న అమాయక పాలస్తీనా పౌరులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హమాస్ వెనక్కి తగ్గి ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.ఇక.. గతంలో కూడా కాల్పుల విరమణ హమాస్ ముందుకు ఇచ్చినా ఇజ్రాయెల్ తిరస్కరిచిన విషయం తెలిసిందే.తమ దేశానికి ముప్పుగా ఉన్న హమాస్‌ను పూర్తిగా అంతం చేసేవరకు తమ దాడులు కొనసాగిస్తామని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,171 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి
గాజా: ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దాడులతో 24 గంటల వ్యవధిలో గాజాలో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇద్దరు పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన పారా మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని వివరించింది. టాల్ అస్–సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబుదాడిలో బాధితులకు సాయం అందించేందుకు వెళ్లగా వీరు గాయపడినట్లు వెల్లడించింది. తాజా మరణాలతో గతేడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కనీసం 36,224 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 81,777 మంది క్షతగాత్రులైనట్లు అంచనా. ఇలా ఉండగా, ఈజిప్టుతో సరిహద్దులు పంచుకుంటున్న గాజా ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం తెలిపింది. -
‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ వైరల్ ఫొటోపై ఇజ్రాయెల్ కౌంటర్
హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం.. రఫాలో పాలస్తీనా పౌరులు తల దాచుకుంటున్న శిబిరాలపై భీకర వైమానిక దాడులకు తెగపడింది. ఈ దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు రెండువేల మంది గాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమైంది.All eyes on #Rafah 🇵🇸 pic.twitter.com/bg3bAtl3dQ— The Palestinian (@InsiderWorld_1) May 27, 2024 ‘ఆల్ ఐస్ ఆన్ రఫా (అందరి దృష్టి రఫా పైన)’అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు షేర్ చేసి పాలస్తీనా పౌరులకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. మరికొంత మంది నెటిజన్లు.. పాలస్తీనా పౌరులపై దాడులు ఆపేయాలని కోరారు.ALL EYES ON RAFAH pic.twitter.com/2dstfq7rWt— The Saviour (@stairwayto3dom) May 30, 2024 అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం,వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ‘‘ మేము అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడులను మాట్లాడటం మానుకోము. అదేవిధంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆపము ’’ అని ‘వేర్ వర్ యువర్ ఐస్’అని చిన్నపిల్లాడి ముందు హమాస్ మిలిటెంట్ తుపాకి పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది.We will NEVER stop talking about October 7th. We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM— Israel ישראל (@Israel) May 29, 2024‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ ఫొటో హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్ల మంది షేర్ చేశారు. భారతీయ సినీ సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రియాంకా చోప్రా జోనస్, అలియా బట్, కరీనా కపూర్ ఖాన్, మధూరి దీక్షిత్, వరుణ్ దావన్, సమంత్ రుత్ ప్రభు తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,050 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు 81,026 మంది గాయపడ్డారు. -
రఫాలో మారణహోమం.. అసలు జరిగింది ఇది అంటున్న ఇజ్రాయెల్!
హమాన్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించడంతో రఫాలో 37 మంది మృతిచెందారు. కాగా, వీరి మృతిపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. వారి మరణాలకు తాము కారణంకాదని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.కాగా, రఫాలో జరిగిన దాడులపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఇజ్రాయెల్ మంగళవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..‘రఫాలో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. రఫాలో ఇద్దరు సీనియర్ హమాస్ కమాండర్లు యాసిన్ రబియా, ఖలీద్ నజ్జర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు జరిగాయి. ఈ దాడి కోసం చాలా చిన్న ఆయుధాలు ఉపయోగించడం జరిగింది.అయితే, ఈ క్రమంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్బంగా హమాస్ నేతలు దాచిన మందుగుండు సామాగ్రి పేలిన కారణంగానే పెద్ద ప్రమాదం జరిగి గుడారాల్లోని ప్రజలు చనిపోయారు. అంతేకానీ, మేము చేసిన దాడుల కారణంగా కాదు. ఇజ్రాయెల్ దాడులు కేవలం హమాస్ నేతల కోసమేనని.. గాజా ప్రజల కోసం కాదు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. గాజాపై మే నెలలో ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైనప్పటి నుండి ఒక మిలియన్ మంది ప్రజలు రఫా నుండి పారిపోయారు. ఇక, అమెరికా, ఇతర మిత్రదేశాలు రఫాపై పూర్తి స్థాయి దాడికి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరించాయి. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. మరోవైపు.. రఫాపై దాడిని ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్‌ను కోరింది. -
Israel–Hamas war: రఫాపై దాడుల్లో 45 మంది మృతి
టెల్అవీవ్: గాజా ప్రాంత నగరం రఫాపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో 45 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులేనని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. తమ దాడుల్లో హమాస్ స్థావరం ధ్వంసం కాగా ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈ ఘటనను పొరపాటున జరిగిన విషాదంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. రాత్రి వేళ జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తామని పార్లమెంట్లో ప్రకటించారు. -
రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అర్ధరాత్రి ఆర్తనాదాలు..
ఇజ్రాయెల్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ తాజాగా దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రఫా నగరంపై బాంబు దాడులకు తెగబడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది చనిపోయినట్టు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. ఇక, అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడుల జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.మరోవైపు.. రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పుకొచ్చింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్ తెలిపింది. قطعت رؤوس الأطفال وحرقت الأجساد 😭😭جنون اسرائيل لن ينتهي الا باقتلاعه من الجذورونهايتهم قريب باذن الله#رفح_الان #Rafah #ابو_عبيدة pic.twitter.com/BjbNdA9aRF— حماة الأقصى في بلاد الحرمين (@aqsa_saudi3n) May 27, 2024 ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తాజాగా మరోసారి బాంబు దాడులకు తెగబడింది. Israel commits a massacre in #Rafah this evening, dropping several 2,000 pound bombs on civilian tents and #UN compounds, murdering dozens of civilians seeking shelter. This was Israel’s response to the @CIJ_ICJ ruling Friday that it must halt its offensive on Rafah. pic.twitter.com/vS1ouUU8Oj— Husam Zomlot (@hzomlot) May 26, 2024 ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారాంతంలో ఇజ్రాయెల్, యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ మధ్య జరిగే సమావేశాల తర్వాత కాల్పుల విరమణ చర్చపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
హమాస్ చెరలో ఇజ్రాయెల్ మహిళా సైనికులు! వీడియో విడుదల
హమాస్ మిలిటెంట్లు గతేడాడి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. హమాస్ మిలిటెంట్లు 250 ఇజ్రాయల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు సరిహద్దులో ఉన్న ఐదుగురు ఇజ్రాయల్ మహిళా సైనికులను బంధీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘బంధీల కుటుంబ ఫోరం’ విడుదల చేసింది.ఆ వీడియోలో నహల్ ఓజ్ బేస్ వద్ద విధలు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ మహిళా సైనికులు.. లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగామ్ బెర్గర్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ తెలుస్తోంది. మహిళా సైనికులు గాయాలతో, వారి చేతులు కట్టేసి ఉండటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అందులో ఒక హమాస్ మిలిటెంట్.. ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉద్దేశిస్తూ మీరంతా అమ్మాయిలు, మహిళలు. మీరు గర్భవతులు అవుతారు’అని అన్నాడు. మరో మిలిటెంట్ ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’అని అన్నాడు."No You're NOT beautiful" Hamas taunts female IDF terrorists. Here's the part of the video Israel miss-translate to claim he said she was "So beautiful" God their desperation is CRINGE. pic.twitter.com/Iv3U1W3Jbi— Syrian Girl 🇸🇾 (@Partisangirl) May 23, 2024 అందులో ఓ సైనికురాలు మాట్లాడుతూ.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’అని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఓ మిలిటెంట్.. ‘ మా సోదరులు ప్రాణాలు కోల్పోడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము కాల్చేస్తాం’అని అన్నాడు. ఈ వీడియోను విడుదల చేసిన ‘బంధీల కుటుంబ ఫోరం’ హమాస్ చెరలో ఉన్న బంధీలను వెంటెనే విడిపించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్ మహిళా సైనికులు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిలో చెరలో ఉన్న బంధీలను స్వదేశానికి రప్పించటంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవండని ప్రభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సెర్ అన్నారు. ఇక.. ఈ వీడియోపై హమాస్ మిలిటెంట్లు స్పందించారు. ‘ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో నిజం కాదు. ఇజ్రాయెల్ కల్పిత కథనాల ప్రచారం. మహిళా సైనికులతో తప్పుగా ప్రవర్తించలేదు’అని వివరణ ఇచ్చారు. -
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. ‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్‌ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్‌పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు. -
Israel-Hamas war: వర్సిటీల్లో 2,300 దాటిన అరెస్టులు
న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో 133 మందిని అరెస్ట్‌చేశారు. -
ఇజ్రాయెల్‌కు షాక్.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు ఆగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్‌కు గట్టిపట్టున్న రఫాలో వారిని అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు పెట్రో రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
Israel-Hamas war: అమెరికా వర్సిటీల్లో నిరసనల హోరు
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోరి్నయా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికిపైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెలెస్–కాలిఫోర్నియా(యూసీఎల్ఏ)లో ఇజ్రాయెల్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తాజాగా ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అధికారులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పారు. -
Israel-Hamas war: రఫాపై ఇజ్రాయెల్ దాడులు 22 మంది మృతి
రఫా: గాజా ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లకు పట్టున్న రఫాలోకి తమ సైన్యం త్వరలో ప్రవేశించనుందంటూ హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులకు దిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆరు నెలలకు పైగా భీకర దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉండగా, కాల్పుల విరమణకు ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. -
ఇజ్రాయెల్ కొత్త ప్లాన్.. ఈజిప్ట్ స్ట్రాంగ్ వార్నింగ్
దక్షిణ గాజాలోని కీలకమైన రఫా నగరంలో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఆ దిశగా తమ సైన్యం హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా ముందుకు కదులుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా గాజాలో మానవత సాయం అందించాలని ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా ఇజ్రాయెల్ మాత్రం పట్టువిడవకుండా తమ సైన్యాన్ని కీలకమైన రఫా నగరంలో దాడుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏ సమయంలో దాడులను ఉధృతం చేస్తారనే కచ్చితమైన సమాచారాన్ని మాత్రం ఇజ్రాయెల్ ఇంకా వెల్లడించలేదు.సుమారు 40,000 మిలిటరీ టెంట్లలను ఇజ్రాయెల్ సైన్యం సిద్ధం చేసుకుంది. ఒక్కో టెంట్లో సుమారు 10 నుంచి 12 మంది సైనికులు ఉంటారని ఓ ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ఈ టెంట్లను రఫా నగరానికి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రఫా నగరం ఈజిప్టు సరిహద్దును ఆనుకొని ఉంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య చెలరేగిన యుద్ధ ప్రారంభం నుంచి గాజా వదిలి వెళ్లిన మిలియన్ పాలస్తీనియన్ల అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.మరోవైపు.. రఫా నగరంపై దాడి విషయంలో ఈజిప్ట్ ఇజ్రాయెల్‌ను తీవ్రంగా హెచ్చరించింది. రఫా నగరంలో ఎటువంటి దాడులు చేసి.. అక్కడి పౌరుల పరిస్థితులు, ప్రాతీయ శాంతి, భద్రతకు దాడుల ద్వారా భంగం కలిగిస్తే.. ఇజ్రాయెల్ విపత్కర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్‌సీసీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈజిప్ట్ హెచ్చరికలను సైతం పక్కన పెట్టిన ఇజ్రాయెల్ రఫాలో దాడులు కొనసాగుతాయని, తమ సైన్యం కూడా ముందుకు కదులుతోందని పేర్కొంది. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు రాఫా నగరంపై దాడిని నివారించడానికి కాల్పుల విరమణ పొడగింపునకు మధ్యవర్తిత్వం వహించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో దాదాపు 34 వేల మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. -
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
‘దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తాం’
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోసారి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్‌న హెచ్చరించారు. మూడు రోజుల పాకిస్తాన్ పర్యటనలో ఉన్న రైసీ మంగళవారం మాట్లాడుతూ.. ఇరాన్ భూభాగంపై దాడి తీవ్రమైన మార్పులకు దారి తీస్తుందన్నారు. ఇజ్రాయెల్ దాడులకు తెగపడితే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు రైసీ.‘పవిత్రమైన ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులకు దిగి తప్పు చేస్తే.. పరిస్థితి చేయిదాటి చాలా తీవ్ర అవుతుంది. ఇజ్రాయెల్‌లో ఏమైనా మిగులుతుందా అనేదిపై కూడా స్పష్టంగా ఉండదు’ అని రైసీ అన్నారు. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ 13న దాడి చేసిందన్నారు. ఇది అంతర్జాతీయ చట్టలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలను ఇరాన్, పాకిస్తాన్ దేశాలు రక్షిస్తాయన్నారు. అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు రక్షణ చర్యలు కొనిసాగుతాయని రైసీ స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొసాగిస్తున్న దాడులు మానవహక్కుల ఉల్లంఘన అని తీవ్రంగా మండిపడ్డారు రైసీ. ఇప్పటివరకు దాదాపు 34 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నదాడులను వ్యతిరేకిస్తు యూఎస్‌లో పలు ప్రతిష్టాత్మకమై విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడి
జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిప ణులు ఈ ఇరాన్ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ సైనిక స్థావరం దెబ్బతింది. బెడోయిన్ అరబ్ పట్టణంలో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు వినిపించాయి. జనం భయంతో వణికిపో యారు. అండగా ఉంటామన్న అమెరికా ఇరాన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ‘‘ ఉక్కుకవచంలా ఇజ్రా యెల్‌కు రక్షణగా నిలుస్తాం. అన్నివిధాలుగా అండగా ఉంటాం’ అని అన్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచి వివరాలు అడిగి తెల్సుకు న్నారు. అమెరికా స్పందనపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ ఘాటుగా స్పందించింది. ‘‘ మా దాడికి ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు దారు ణంగా ఉంటాయి. ఈ సమస్య పశ్చిమాసి యాకే పరిమితం. ఉగ్ర అమెరికా ఇందులో తలదూర్చొద్దు’’ అని హెచ్చరించింది. ఇంతటితో మా ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ హుస్సేన్ బఘేరీ ప్రకటించారు. ‘‘దాడిని మేం అడ్డుకున్నాం. మిత్రదేశాల సాయంతో విజయం సాధించాం’ అని దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఖండించిన ప్రపంచదేశాలు ఇరాన్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘‘ ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇరాన్ సైనికచర్యను తప్పుబట్టాయి. పౌరుల భద్రతపై భారత్ ఆందోళన ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్ చేసుకోండి. శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
ఇజ్రాయెల్‌లో మనోళ్లు సేఫ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పశ్చిమాసియాలో ని ఇజ్రాయెల్–ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లిన తెలంగాణవాసులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇజ్రాయెల్‌లో పనిచేస్తు న్న నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్లు చేసి తమ క్షేమసమాచారాన్ని అందించారు. అయినప్పటికీ వరుసగా చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడున్న వారిలో ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఆదివారం ఇరాన్ 185 డ్రోన్లు, 110 బాలిస్టిక్ మిస్సైల్స్, 36 క్రూయీజ్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. మధ్యధరా సముద్రంలోని యూఎస్, యూకే, ఫ్రాన్స్, జోర్డాన్ దళాలు అడ్డుకుంటున్నాయి. అదేవిధంగా ఐరన్ డోమ్, ఐరన్ బీమ్(లేజర్ టెక్నాలజీ)లతో ఆయా మిసైల్స్‌ను ఇజ్రాయెల్ తమ భూ భాగంలో పడకుండా అడ్డుకుంటోంది. దాదాపు 95 శాతం మిసైల్స్‌ను ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసింది. అయితే శనివారం 17 మంది భారతీయులు ఉన్న సౌకను ఇరాన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో అలజడి నెలకొంది. ఇజ్రాయెల్‌లో సుమారు 25వేల మంది భారతీయులు ఉండగా, వెయ్యి మంది వరకు తెలంగాణ వారున్నారు. వీరిలో ఎక్కువగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలవారున్నారు. టెల్అవీవ్ నగరంలో మనవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటికే అక్కడి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇక భారత ప్రభు త్వం సైతం ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లొద్దని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి యుద్ధం ఆగినట్లు, యుద్ధ వాతావరరణం సమసిపోయినట్లు వార్తలు వస్తున్నా యి. ఇప్పటివరకు మనవాళ్లు సేఫ్‌గా ఉన్నారు. దీంతో ఇక్కడున్న వారి కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ కొంతమేర తగ్గింది. -
అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితులు, దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు ఇటీవలకాలంలో ఎక్కువ అవుతున్నాయి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దాంతో రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా దాడికి దిగవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఇరుదేశాలతో వాణిజ్య సంబంధాలున్న ఇండియన్ కంపెనీలు భారీగానే ప్రభావం చెందాయి. తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఆ దేశాలతో వాణిజ్యభాగస్వామ్యం ఉన్న మరిన్ని సంస్థలు ప్రభావితం చెందే పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి-దిగుమతులు ఇలా.. భారత్ ఇరాన్‌ను ఎగుమతి చేస్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి రైస్, టీ ఉత్పత్తులు, షుగర్, పండ్లు, మందులు, ఫార్మసీ ఉత్పత్తులు, సాఫ్ట్‌డ్రింక్స్, పప్పులు, బోన్‌లెస్ మాంసం.. వంటివి ఉన్నాయి. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిలో స్పెషాలిటీ కెమికల్స్ తయారీకి అవసమయ్యే మిథనాల్, పెట్రోలియం బిట్యూమెన్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్, యాపిల్.. వంటివి ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం చెలరేగితే మాత్రం భారత్ నుంచి ఇరాన్‌కు ఎగుమతి చేసే వస్తువులపై ప్రభావం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆదేశం నుంచి ముడిసరుకులు దిగుమతులు చేసుకుంటున్న భారత కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం పడనుందని అంచనా వేస్తున్నారు. ఫార్మా కంపెనీలపై ప్రభావం.. ప్రధానంగా ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలపై ఈ యుద్ధ ప్రభావం మరింత పడనుంది. ఇప్పటికే ఫార్మారంగంలోని స్టాక్స్‌లో పెద్దగా ర్యాలీ కనిపించడంలేదు. చాలా కంపెనీలు కొవిడ్ సమయంలో పోస్ట్ చేసిన లాభాలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేస్తున్న ఫలితాలు మదుపరులను నిరాశపరుస్తున్నాయి. దానికితోడు తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాల నేపథ్యంలో ఈ స్టాక్స్ మరింత ప్రభావానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇండియా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు 3.38 బిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసేది. దాన్ని క్రమంగా తగ్గించుకుంటూ 2022-23 ఏడాదికిగాను 1.66 బిలియన్ డాలర్లకు తీసుకొచ్చింది. అదే సమయంలో దిగుమతులు 2019-20లో 1.39 బిలియన్ డాలర్లుగా ఉండేవి. దాన్ని 2022-23 నాటికి 0.67 బిలియన్ డాలర్లకు తీసుకొచ్చింది. తరలిపోనున్న ఐటీ కంపెనీలు.. ఇజ్రాయెల్‌కు ఏటా ఐటీ రంగం ద్వారా 14 శాతం ఆదాయం లభిస్తోంది. ఆ దేశ ఆర్థివ్యవస్థలో ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, విప్రో, టీసీఎస్ సహా 500కు పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మొత్తంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన పలు కీలక ప్రాజెక్ట్‌లను ఇజ్రాయెల్‌లోని ఐటీ సంస్థలు చేపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో కంపెనీ నిర్వహణ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఆయా కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్ట్‌లను భారత్ సహా యూరప్‌లోని దేశాలకు తరలించాలని నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రభుత్వానికి, సంస్థలకు భారం తప్పదా..! ఆయుధ సంపత్తిలో సహకారం.. 1962లో చైనాతో, 1965, 1971 సంవత్సరాల్లో పాకిస్థాన్‌తో యుద్ధ ఏర్పడినపుడు భారత్‌కు ఇజ్రాయెల్ కీలకమైన ఆయుధాలు సమకూర్చింది. ఇజ్రాయెల్ తయారుచేసే అత్యాధునిక తుపాకులు, డ్రోన్లు, క్షిపణులను ఎక్కువగా కొంటున్నది ఇండియానే. ఆ దేశ మొత్తం రక్షణ ఎగుమతుల్లో అధికభాగం భారత్‌కే చేరుతున్నాయి. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్వహణపరంగా అపారమైన అనుభవముంది. భారత్ వద్ద అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయి. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఈ సామర్థ్యాలన్నింటినీ జతచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఆ దిశగా భారత్, ఇజ్రాయెల్ రక్షణ సంస్థలు సంయుక్తంగా ఇండియాలో ఆయుధాలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిసింది. -
Wall Street Journal: ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమైన ఇరాన్!
వాషింగ్టన్: సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఎంబసీపై దాడిలో ఆర్మీ జనరళ్లు, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతొల్లా అలీ ఖమేనీ చెబుతున్నాసరే ఆ దేశం తన నిర్ణయంపై వెనకడుగు వేసే పరిస్థితి లేదని కథనం వెల్లడించింది. నిజంగా దాడి జరిగితే పశి్చమాసియాలో యుద్ధజ్వాలలు ఊహించనంతగా ఎగసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. యుద్ధ సంసిద్దతపై వార్ కేబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్‌తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్.. ఇరాన్‌తోనూ కయ్యానికి కాలు దువ్వడంపై పశి్చమదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డమాస్కస్‌పై దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ చెబుతుండగా ఇంతవరకూ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏప్రిల్ ఒకటోతేదీ నాటి ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్సంభాషణలో కోరారు. ఇరాన్ విషయంలో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి పౌరులకు భారత సర్కార్ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కారి్మకులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్ శుక్రవారం స్పష్టంచేసింది. -
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ఇజ్రాయిల్, ఇరాన్ మద్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. దీనికి తోడు ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడంతో ఇంకా ప్రమాదకరంగా మారాయి. ఇజ్రాయెల్‌పై ప్రతి దాడికి సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ అమెరికాకు ఓ వార్నింగ్ ఇచ్చింది. తాము ఇజ్రాయిల్‌పై యుద్ధానికి దిగబోతున్నామని.. ఇందుకు యూస్ దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఉచ్చులో యూఎస్ చిక్కుకోవద్దని సూచించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సందేశం పంపింది. యుద్ధం నుంచి యూఎస్ పక్కకు తప్పుకోవాలని.. అప్పుడే మీరు(అమెరికా) సురక్షితంగా ఉండగలరని తెలిపింది. కాగా ఇందుకు అమెరికా స్పందిచినట్లు.. తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయరాదని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల అధఙకారి మొహమ్మద్ జంషిది తెలిపారు. అయితే యూఎస్ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం స్పందించలేదు. కాగా సిరియా రాజధానిలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇటీవలవైమానిక దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు చేసింది ఇజ్రాయిలే అంటూ ఇరాన్ ఆరోపిస్తుంది. ఈ ఘటనలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు మిలిటరీ కమాండర్లతోపాటు పాటు 13 మంది మరణించారు. మరోవైపు ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు. ఇరాన్ దాడులకు దిగుతుందనే భయంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. జీపీఎస్ నావిగేషన్‌ను నిలిపివేసింది. తమ సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రక్షణ సామర్ధ్యాన్ని విస్తరించింది. తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్తగా అన్నిచోట్ల బాంబు షెల్టర్లను తెరిచింది. -
గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్
ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. -
ఇజ్రాయెల్ దాడి సక్సెస్.. హమాస్ టాప్ కమాండర్ హతం!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ మర్వాన్ ఇస్సా మృతిచెందాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ప్రకటించారు. ఈ అంశంపై జేక్ సలివన్ తాజాగా మాట్లాడుతూ..‘హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లపై దాడులు చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేలమంది ఫైటర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. గతవారం ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ గ్రూప్ మూడో ర్యాంక్ కమాండర్ మార్వాన్ ఇస్సా మృతిచెందాడు. మిగతా టాప్ కమాండర్లు టన్నెల్స్‌లో దాక్కున్నారు’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల వేల సంఖ్యలో పౌరులు, హమాస్ నేతలు మృత్యువాడపడ్డారు. కాగా, సెంట్రల్ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. దీంతో, ఇస్సా మృతి ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయంగా వారు భావిస్తున్నారు. U.S. National Security Advisor, Jake Sullivan has announced that according to recent Intelligence an Israeli Airstrike on March 11th resulted in the Successful Elimination of Marwan Issa, the Deputy Commander of Hamas’s Al-Qassam Brigades and Right-Hand Man to Mohammed Deif. pic.twitter.com/4w2Tg65ias — Narendra Maurya (@narendra483) March 19, 2024 అయితే, హమాస్ మిలిటరీ అధిపతి మహమ్మద్ దీఫ్ డిప్యూటీగా ఇస్సాను పేర్కొంటారు. మిలిటరీ కార్యకలాపాల్లో ఇస్సా చాలా చురుకుగా ఉండేవాడని, అక్టోబర్ 7 నాటి మారణకాండలో కీలకపాత్ర పోషించాడని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు.. ఈ దాడుల్లో మృతిచెందింది ఇస్సానా? కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియేల్ హగరీ పేర్కొన్నారు. “Hamas’ number three, Marwan Issa, was killed in an Israeli operation last week,” Jake Sullivan, President Biden’s national security adviser at a White House briefing 3/18/2024 4:20 PM PDT pic.twitter.com/pPtJSyltfi — Boaz Guttman בועז גוטמן (@boazgu1) March 18, 2024 -
‘వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం’
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు సంబంధించి ప్రపంచ దేశాల ఒత్తిడిని ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు తోసిపుచ్చారు. ఆదివారం ఆయన కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లు తలొగ్గి మేము యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలో ఆపలేము. హమాస్‌ను అంతం చేయటం, బంధీలను విడిపించుకోవటం, గాజాలోని హమాస్‌కు వ్యతిరేకంగా పోరాటం విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. రఫా నుంచి దాడులు కొనసాగిస్తాం. మరికొన్ని వారాల పాటు దాడులు జరుపుతాం’ అని అన్నారు. ప్రపంచ దేశాల ఒత్తిడిపై కూడా బెంజమిన్ నెతాన్యహు స్పందించారు. ‘మీకు జ్ఞపకశక్తి తక్కువగా ఉందా? అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భీకరమైన దాడులు అంత త్వరగా మర్చిపోయారా? హమాస్ వ్యతిరేకంగా పోరాడుతున్న ఇజ్రాయెల్‌ను ఇంత త్వరగా వ్యతిరేకిస్తారా?’ అని తీవ్రంగా మండిపడ్డారు. దాడుల సమయంలో రఫా నగరం నుంచి పౌరులను ఖాళీ చేయాలనే ప్రణాళికతో ఉన్నామని తెలిపారు. అయితే ఈ విషయంలో మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై సందేహం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడిలో 31,600 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన మెరుపుదాడిలో 1200 మంది ఇజ్రాయెల్పౌరులు మృతి చెందారు. 253 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బలగాలు బంధీలుగా తరలించుకుపోయిన విషయం తెలిసిందే. -
యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని
ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని నియమితులయ్యారు. మొహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. ముస్తఫా చాలాకాలంగా అధ్యక్షుడు అబ్బాస్ వద్ద సలహాదారునిగా పని చేస్తుండడం గమనార్హం. అయితే.. ఈ ఎంపికపై పాలస్తీనాలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం.. ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అబ్బాసే ప్రధాని పేషీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నమ్మకస్తుడు ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలోనే ఈ నియామకం చేపట్టినట్లు అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. అయితే.. అమెరికా ఒత్తిళ్లతోనే అధ్యక్షుడు ఈ నియామకం చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్తఫా నేపథ్యానికి వస్తే.. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్థికవేత్తగా.. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. 2014లో గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత పునర్నిర్మాణ పనుల్లో ముస్తఫా భాగం కావడం గమనార్హం. అయితే.. కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది. గాజాలోని పరిస్థితుల్ని అమెరికా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నది తెలిసిందే. ఇక గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణకాండలో 1,200 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 250 మందిని మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ భీకర దాడుల్లో పాలస్తీనా భూభాగంలో 31,000పైగా ప్రజలు మృతి చెందారు. -
ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ఇద్దరి మృతి
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్‌కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది. -
తక్షణమే కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్ అన్నారు. ‘హమాస్ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ బాయ్‌కాట్ చేయటం గమనార్హం. -
Israel-Hamas war: గాజాకు అమెరికా మానవతా సాయం
వాషింగ్టన్: ఒకవైపు ఇజ్రాయెల్ భీకర దాడులు.. మరోవైపు ఆహారం దొరక్క ఆకలి కేకలు.. గాజాలో లక్షలాది మంది పాలస్తీనియన్ల దుస్థితి ఇది. వారికి సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచి్చంది. బాధితులకు మానవతా సాయం పంపిణీని ప్రారంభించింది. ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా సైన్యానికి చెందిన సి–130 సరుకు రవాణా విమానాల ద్వారా శనివారం ఉదయం గాజాలో 38 వేల ఆహార ప్యాకెట్లను జారవిడిచారు. 66 పెద్ద బండిళ్లలో ఈ ప్యాకెట్లను భద్రపర్చి, బాధితులకు చేరేలా కిందికి జారవిడిచారు. ఇందుకోసం జోర్డాన్ సహకారంతో మూడు విమానాలను ఉపయోగించినట్లు అమెరికా సైనికాధికారులు తెలిపారు. గాజాలో విమానం ద్వారా ఆహార పదార్థాలు అందించిన అనుభవం జోర్డాన్‌కు ఉంది. -
Israel-Hamas war: తిండి కోసం ఎగబడ్డ వారిపై కాల్పులు.. గాజాలో ఘోరం
రఫా: యుద్ధంలో సర్వం కోల్పోయి ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి లేక అంతర్జాతీయ సాయం కోసం పొట్టచేతబట్టుకుని అర్ధిస్తున్న అభాగ్యులపైకి ఇజ్రాయెల్ తుపాకీ గుళ్ల వర్షం కురిపింది. గురువారం పశ్చిమ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఈ అమానవీయ దారుణ దాడి ఘటనలో 100 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 66 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 760కిపైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మానవత్వాన్ని కాలరాస్తూ హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తీరును తాజా ఘటన మరోసారి కళ్లకు కట్టింది. పశ్చిమ గాజాలోని షేక్ అజ్లీన్ ప్రాంతంలోని హరౌన్ అల్ రషీద్వీధి ఈ రక్తపుటేళ్లకు సాక్షీభూతమైంది. తాజాగా దాడితో ఇప్పటివరకు ఇజ్రాయెల్ భూతల, గగనతల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 30,000 దాటింది. క్షతగాత్రుల సంఖ్య 70,457 దాటేసింది. Gaza: l'esercito israeliano spara sulla popolazione che cercava un pezzo di pane Oltre cento i morti.. Basta mentire Basta assassinare la popolazione civile che chiede cibo e acqua. Una sola parola :" assassini#GazaMassacare#GazaHoloucast #Gazaagenocide #Gaza Le Nazioni Unite… pic.twitter.com/aECgoHaU7S — Rete Italiana Antifascista (@Italiantifa) February 29, 2024 మృతదేహాలు గాడిదలపై.. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. రోజుల తరబడి సరైన తిండిలేక అలమటించిపోతున్న పాలస్తీనియన్లకు పంచేందుకు ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు అల్ రషీద్ వీధికొచ్చాయి. అప్పటికే వందలాదిగా అక్కడ వేచి ఉన్న పాలస్తీనియన్లు ట్రక్కుల చుట్టూ గుమికూడారు. ఇజ్రాయెల్ సైన్యం పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ జరగాల్సి ఉంది. అయితే క్యూ వరసల్లో నిల్చున్న వ్యక్తులను కాదని చాలా మంది ట్రక్కులపైకి ఎగబడి గోధుమ పిండి, క్యాన్లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని లూటీ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది. తోపులాట, తొక్కిసలాట జరిగాయి. వారించబోయిన ఇజ్రాయెల్ సైనికులపై వారు దాడికి పాల్పడ్డారని వార్తలొచ్చాయి. ‘‘ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనియన్లపైకి తుపాకీ గుళ్లవర్షం కురిపించాయి. జనం పిట్టల్లా రాలి పడ్డారు. ఎక్కడ చూసినా మృతదేహాలే. మృతదేహాలు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సరిపడా అంబులెన్సులు మా దగ్గర లేవు. విధిలేక గాడిదలపై, గాడిద బండ్లపై మృతదేహాలు, గాయపడిన వారిని తరలించాం’’ అని కమల్ అద్వాన్ ఆస్పత్రిలో అంబులెన్స్ సేవల అధికారి ఫరేస్ అఫానా చెప్పారు. లూటీ నుంచి తప్పించుకునేందుకు ట్రక్కులు ముందుకు కదలడంతో వాటి కింద పడి కొందరు మరణించారని వార్తలొచ్చాయి. మళ్లీ మళ్లీ కాల్పులు ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షి, క్షతగాత్రుడు కమెల్ అబూ నహేల్ చెప్పారు. ‘ రెండు నెలలుగా పశుగ్రాసం తిని బతుకుతున్నాం. రాత్రిపూట ఆ వీధిలో ఆహారం పంచుతున్నారంటే వెళ్లాం. వందల మందిపై కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు కార్ల కింద దాక్కున్నాం. కాల్పులు ఆగిపోయాక మళ్లీ ట్రక్కుల దగ్గరకు పరుగెత్తాం. ఇజ్రాయెల్ సైనికులు మళ్లీ కాల్పులు జరిపారు. నా కాలికి బుల్లెట్ తగలడంతో కింద పడ్డా. అప్పటికే ముందుకు కదలిన ట్రక్కు నా కాలిని ఛిద్రంచేసింది’ అని నహేల్ చెప్పారు. చదవండి: ఇజ్రాయెల్ కీలక ప్రకటన -
Israel-Hamas war: గాజాలో ఆకలి కేకలు
గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు. 80 శాతం మంది గాజావాసులు ఇజ్రాయెల్ దాడులకు తాళలేక, దాని బెదిరింపులకు తలొగ్గి ఇప్పటికే ఇల్లూ వాకిలీ వదిలేశారు. కొద్ది నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎలాంటి సహాయక సామగ్రినీ ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో అన్నమో రామచంద్రా అంటూ అంతా అలమటిస్తున్నారు. వారిలోనూ కనీసం 5 లక్షల మంది అత్యంత తీవ్రమైన కరువు బారిన పడ్డారని ఐరాస ఆవేదన వెలిబుచ్చింది. తాళలేని ఆకలిబాధతో దుర్భర వేదన అనుభవిస్తున్నారని ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) తాజా నివేదికలో వెల్లడించింది. వారికి తక్షణ సాయం అందకపోతే అతి త్వరలోనే గాజా ఆకలిచావులకు ఆలవాలంగా మారడం ఖాయమని హెచ్చరించింది... నరకానికి నకళ్లు... గత ఆదివారం గాజా శరణార్థి శిబిరంలో ఓ రెణ్నెల్ల పసివాడు ఆకలికి తాళలేక మృత్యువాత పడ్డాడు. గాజాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చని ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు అక్కడ పదులు, వందలు, వేలల్లో, అంతకుమించి ఆకలి చావులు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నాయి. ప్రతీకారేచ్ఛతో పాలస్తీనాపై నాలుగున్నర నెలలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆ క్రమంలో గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేయడమే ఇందుకు కారణం. గాజాకు ఆహారం, నిత్యావసరాల సరఫరాను కూడా ఇజ్రాయెల్ వీలైనంతగా అడ్డుకుంటూ వస్తోంది. చివరికి ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కూడా అనుమతించడం లేదు. దాంతో గాజావాసులు అల్లాడిపోతున్నారు. శరణార్థి శిబిరాలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. కొన్నాళ్లుగా ఆకలి కేకలతో ప్రతిధ్వనిస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలినాళ్లలో గాజాలోకి రోజుకు 500 పై చిలుకు వాహనాల్లో సహాయ సామగ్రి వచ్చేది. క్రమంగా 50 వాహనాలు రావడమే గగనమైపోయింది. ఇప్పుడవి 10కి దాటడం లేదు! ఉత్తర గాజాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతానికి ఎలాంటి మానవతా సాయమూ అందక ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. యూఎన్ఆర్డబ్ల్యూఏ కూడా చివరిసారిగా జనవరి 23 అక్కడికి సహాయ సామగ్రిని పంపింది. నాటినుంచి ఇజ్రాయెల్ ఆంక్షలు తీవ్రతరం కావడంతో చేతులెత్తేసినట్టు సంస్థ చీఫ్ ఫిలిప్ లాజరిని స్వయంగా అంగీకరించారు! గాజా ఆకలి కేకలను పూర్తిగా మానవ కలి్పత సంక్షోభంగా ఆయన అభివరి్ణంచారు. ‘‘సహాయ సామగ్రితో కూడిన వాహనాలేవీ గాజాకు చేరకుండా చాలా రోజులుగా ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకుంటోంది. కనీసం ఆహార పదార్థాలనైనా అనుమతించాలని కోరినా పెడచెవిన పెడుతోంది’’ అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. కలుపు మొక్కలే మహాప్రసాదం ఆకలికి తట్టుకోలేక గాజావాసులు చివరికి కలుపు మొక్కలు తింటున్నారు! ఔషధంగా వాడాల్సిన ఈ మొక్కలను ఆహారంగా తీసుకుంటే ప్రమాదమని తెలిసి కూడా మరో దారి లేక వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మాలో అని పిలిచే ఈ మొక్కలను కట్టకింత అని రేటు పెట్టి మరీ అమ్ముకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకలికి తాళలేక గుర్రాల కళేబరాలనూ తింటున్నారు! మాటలకందని విషాదం... యూఎన్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఓసీహెచ్ఏ) గణాంకాల మేరకు గాజాలోని మొత్తం 23 లక్షల మందినీ తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. వారిలోనూ ► లక్షల మందికి పైగా తీవ్రమైన కరువు పరిస్థితుల బారిన పడ్డారు. ఇజ్రాయెల్ వైఖరే ఇందుకు ప్రధాన కారణం... ► గాజాలోకి సహాయ సామ్రగి కోసం ఇజ్రాయెల్ కేవలం ఒకే ఒక ఎంట్రీ పాయింట్‌ను తెరిచి ఉంచింది. ► ఆ మార్గంలోనూ దారిపొడవునా లెక్కలేనన్ని చెక్ పాయింట్లు పెట్టి ఒక్కో వాహనాన్ని రోజుల తరబడి తనిఖీ చేస్తోంది. ► దీనికి తోడు అతివాద ఇజ్రాయెలీ నిరసనకారులు పాలస్తీనా వాసులకు సాయమూ అందడానికి వీల్లేదంటూ భీష్మించుకున్నారు. ► దక్షిణ గాజా ఎంట్రీ పాయింట్‌ను కొన్నాళ్లుగా వారు పూర్తిగా దిగ్బంధించారు. ► సహాయక వాహనాలకు భద్రత కలి్పస్తున్న స్థానిక పోలీసుల్లో 8 మంది ఇటీవల ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు. అప్పట్నుంచీ ఎస్కార్టుగా వచ్చే వారే కరువయ్యారు. ► దాంతో గాజాలో సహాయక వాహనం కనిపిస్తే చాలు, జనమంతా ఎగబడే పరిస్థితి నెలకొని ఉంది! వాహన సిబ్బందిని చితగ్గొట్టి చేతికందినన్ని సరుకులు లాక్కెళ్తున్నారు. ► మరోవైపు దీన్ని సాకుగా చూపి ఇజ్రాయెల్ సహాయ వాహనాలను అడ్డుకుంటోంది. ► గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి వందల మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. యుద్ధానికి కారణంగా నిలిచిన ఈ దాడిలో ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) సిబ్బంది పాత్రా ఉందని ఇటీవల తేలడంతో ఆ సంస్థ గాజా నుంచి దాదాపుగా వైదొలగింది. సహాయక సామగ్రి చేరవేతలో ఇన్నాళ్లూ వ్యవహరించిన ఆ సంస్థ నిష్క్రమణతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది మృతి
రఫా: గాజాలోని దక్షిణ, మధ్య ప్రాంతాలపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రఫాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, సెంట్రల్ గాజాలో 14 మంది చిన్నారులు, 8 మంది మహిళలు సహా మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రఫా చుట్టుపక్కల జరిగిన వైమానిక దాడుల్లో అల్ ఫరూక్ మసీదు నేలమట్టం అయింది. మరోవైపు, వెస్ట్‌బ్యాంక్ జాతీయరహదారిపై గురువారం ఉదయం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక ఇజ్రాయెల్ యువకుడు చనిపోగా మరో అయిదుగురు గాయప డ్డారు. ఇజ్రాయెల్ పోలీసుల కాల్పుల్లో ఇద్ద రు దుండగులు చనిపోయారు. మూడో వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ కాల్పులకు కారణమని ఎవరూ ప్రకటించుకోనప్పటికీ హమాస్ సాయుధబలగాలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆగి, స్వతంత్ర పాలస్తీనా అవతరించేదాకా ఇటువంటి మరిన్ని దాడులకు దిగాలని పిలుపునిచ్చారు. -
టన్నెల్లో హమాస్ అగ్రనేత! ఐడీఎఫ్ వీడియో విడుదల
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని హమాస్ దళాలపై దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) మంగళవారం ఓ వీడియోను విడుదల చేసింది. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడిచేసిన చేసినప్పటి నుంచి హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్ దొరకకుండా ఇజ్రాయెల్ సైన్యానికి తలనొప్పిగా మారాడు. అయితే తాజాగా ఐడీఎఫ్ విడుదల వీడియోలో.. గాజాలోని ఓ టన్నెల్ యాహ్యా సిన్వార్ తన కుటుంబసభ్యులతో కనిపించాడు. ఐడీఎఫ్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఓ టన్నెల్లో యాహ్యా సిన్వార్‌ను, తన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడు ఇబ్రహీంతో కనిపించారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తాము యాహ్యా సిన్వార్‌ను టన్నెల్‌లోని వీడియోలో గుర్తించామని ఐడీఎఫ్ పేర్కొంది. ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక వీడియోలో హమాస్నేను చూసింది ఏమాత్రం పెద్ద విషయం కాదు. మేము.. హమాస్ నేతలు, వారి చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల వద్దకు చేరుకోవటమే చాలా ముఖ్యమైన విషయం. మేము హమాస్ నేతలు, సిన్వార్‌ను పట్టుకునే వరకు ఈ యుద్ధం ఆపము. అతను చనిపోయి ఉన్నా? సజీవంగా ఉన్నా? అతన్ని పట్టుకోవటమే మా లక్ష్యం’ అని డేనియల్ తెలిపారు. Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f — Israel Defense Forces (@IDF) February 13, 2024 61 ఏళ్ల యాహ్యా సిన్వార్.. హమాస్ మాజీ ఎజ్డైన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌కు కమాండర్‌గా పనిచేశారు. 2017లో పాలస్తీనాలోని హమాస్ గ్రూపు చీఫ్‌గా ఎన్నికయ్యారు. అతను 2011లో విడుదలకు ముందు ఇజ్రాయెల్ జైళ్లలో 23 ఏళ్లు యుద్ధ ఖైదీగా ఉన్నారు. హమాస్ చేత బందీగా ఉన్న ఫ్రెంచ్-ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ అనే యుద్ధ ఖైదీ మార్పిడిలో సిన్వార్ విడుదల అయ్యారు. చదవండి: ఇజ్రాయెల్ అరాచకం.. హమాస్ అగ్రనేత కుమారుడు మృతి! -
ఇజ్రాయెల్ అరాచకం.. హమాస్ అగ్రనేత కుమారుడు మృతి!
గాజా: గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఇక, తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే(22) కూడా మృతి చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు తీవ్రతరం చేసింది. హమాస్ నేతలే టార్గెట్ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ అగ్రనేత కుమారుడు హజెం హనియే (22) మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో అతడు చనిపోయాడని స్థానిక మీడియాతో పాటు ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, హజెం హనియే ప్రస్తుతం ఓ కాలేజీలో విద్యార్థిగా ఉన్నట్టు సమాచారం. 🚨🇵🇸 BREAKING: SON OF #HAMAS LEADER KILLED IN AN IDF STRIKE Unconfirmed reports indicate The son of Ismail Haniyeh, 22-year-old Hazim Haniyeh, head of Hamas’s political bureau, has reportedly been killed by a succession of Israeli air strikes. pic.twitter.com/WCqLTxsKmu — Geopolitical Kid (@Geopoliticalkid) February 11, 2024 మరోవైపు.. రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడింది. తాజాగా ఇజ్రాయెల్ దాడిలో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. ఈ నగరంలో 14 లక్షల మంది జీవిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు ప్రారంభమయ్యాయి. ఇక, గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. తాజాగా అక్కడ కూడా దాడులు ప్రారంభం కావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. రఫాపై ఇజ్రాయెల్ దాడులను అమెరికా సహా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామలు ఉంటాయని సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. Missiles fired into Israel from Lebanon. All of them rebuffed by the Iron Dome system. Israel is under constant attack and yet is demonised for defending itself by liberals safely in the West. The double standards are galling. pic.twitter.com/Azgb43Bnah — Bella Wallersteiner 🇺🇦 (@BellaWallerstei) February 10, 2024 -
Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 174 మంది మృతి
గాజా: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రజల మరణాలను, విధ్వంసాన్ని నివారించడంతోపాటు జన హనన చర్యలను మానుకోవాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించి రోజైనా గడవక మునుపే గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులు ప్రారంభించింది. 24 గంటల వ్యవధిలో 174 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 310 మంది గాయపడినట్లు శనివారం గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం ఉదయం రఫాలో ఓ నివాసంపై జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. -
మారణ హోమానికి పాల్పడొద్దు.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం
ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు చేస్తూ విరుచుకుపడుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమో తమ లక్ష్యంగా బాంబు దాడులకు తెగపడుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ‘మారణ హోమం’ జరుగుతోందని ఆరోపిస్తూ సౌతాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విచారణ జరిపింది. గాజాలో మారణ హోమానికి దారి తీసే ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఐసీజే ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని మాత్రం ఆపేయమని కానీ, కాల్పుల విరమణకు సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన చెయకపోవటం గమనార్హం. ‘గాజా ప్రాంతంలో జరుగుతున్న మానవీయ విషాదం తీవ్రత సంబంధించి మాకు తెలుసు. యుద్ధంలో పోతున్న ప్రాణాలు, ప్రజలు పడుతున్న కష్టాల పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది’ అని అంతర్జాతీయ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దక్షిణాఫ్రికా కోరినట్లు కోర్టు కాల్పుల విరమణ సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోర్టు ఉత్తర్వులను అనుసరించి తీసుకున్న చర్యలపై నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దక్షిణాఫ్రికా ఆరోపణలను ఇజ్రాయెల్ మరోసారి తీవ్రంగా ఖండించింది. దక్షిణాఫ్రికా దేశం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని.. మొత్తంగా వక్రీకరించబడిన మాటలని మండిపడింది. గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 26000మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపు దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మృతి చెందారు. -
పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో నిరసన
ఇటలీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అభరణాల ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఇజ్రాయెల్ ఎగ్జిబిటర్లకు నిరసన సెగ తగిలింది. ఇజ్రాయెల్ వ్యతిరేక వాదులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇటలీలోని విసెంజాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ దిగారు. స్మోక్ బాంబులు అంటించి గందరగోళం సృష్టించారు. పోలీసులు నిరసనకారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ‘పాలస్తీనాను వదిలేయండి.. గాజాపై బాంబుల దాడి ఆపేయండి’ అని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 40 దేశాల నుంచి సుమారు1300 మంది ఎగ్జిబీటర్లు విసెంజాలో జరుగుతున్న అభరణాల ప్రదర్శన వచ్చారని ఎగ్జిబిషన్ నిర్వాకులు తెలిపారు. నిరసన కూడా ఎగ్జిబిషన్‌కు చాలా దూరంలో జరిగిందని.. నిరసన ప్రభావం ఎగ్జిబిషన్‌పై పడలేదని అన్నారు. ఎగ్జిబిషన్లో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎగ్జిబిటర్లు ఉన్నారా అన్న విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. 🚨 ITALY TODAY: Pro-Hamas Protestors & Police Clash🚨 ⚠️ WATCH: Don’t miss the ending! Violence erupts at an anti-Israel protest during Italy’s jewelry fair. Pro-Hamas demonstrators face a harsh reality check in the streets. 👍 Like and share if Italy’s approach inspires you… pic.twitter.com/jdxP4iS2HB — Shirion Collective (@ShirionOrg) January 20, 2024 ఈ నిరసనలను విసెంజా మేయర్ గియాకోమో పోస్సామై తీవ్రంగా ఖండించారు. హింస చెలరేగే విధంగా నిరసన తెలపటాన్ని పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లుగా సమర్థించలేమన్నారు. శాంతి, కాల్పుల విరమణ కోసం నిరసనల ద్వారా హింసను ప్రేరేపించటం సరి కాదన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న చేసిన మెరుపుదాడుల్లో 1140 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇంకా 132 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్నారు. అక్టోబర్ 7 అనంతరం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బీకరంగా దాడుల ప్రారంభించింది. ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో 24,973 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు. చదవండి: Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి -
జో బైడెన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హమాస్
Israel-Hamas War: హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తునే ఉంది. గాజాపై దాడులును నిలిపివేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహును కోరిన విషయం తెలిసిందే. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫొన్లో మాట్లాడారు. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ సంభాషణ అనంతరం నెతాన్యహు పాలస్తీనాను స్వంతత్ర దేశంగా అంగీకరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఇజ్జత్ అల్-రిష్క్ స్పందించారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయల్ ప్రధానిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్జత్ తోసిపుచ్చారు. గాజాలో జరుగుతున్న మారణహోమం వెనుక ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందని మండిపడ్డారు. ఇక పాలస్తీనా ప్రజలకు ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన బైడెన్‌పై సదభిప్రాయం కలిగి ఉండరని చెప్పారు. బైడెన్ మాటలతో తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం పాలస్తీనా ప్రజల్లో లేదని పేర్కొన్నారు. బైడెన్.. నెతన్యహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండు దేశాల విధానం ద్వారా చాలా దేశాలు ఉన్నాయని.. అటువంటి దేశాలు కూడా యూఎన్‌ఏలో భాగమై ఉన్నాయని తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించమని తేల్చి చెప్పారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా ఇచ్చినా హమాస్ వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తప్పదని అన్నారు. ఇక హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపమని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 24, 927 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందారు. చదవండి: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం -
ఇజ్రాయెల్‌కు ఖతర్ ప్రధాని హెచ్చరికలు
హమాస్ సాయుధులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తీరుపై ఖతర్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ మండిపడ్డారు. గాజాలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తిరస్కరించిన విషయం తెలిసిందే. దావోస్‌లోని మంగళవారం ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో తీవ్రమైన విధ్వంసం జరుగుతోందని.. అందుకే దాడులు ఆపేయాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌పై చేస్తున్న దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం, అంతర్జాతీయ సమాజంపై యాన విమర్శలు చేశారు. గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి ఇరుదేశాల మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసరమని తెలిపారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు గాజాలో తిరిగి మళ్లీ మునుపటి పరిస్థితి తీసుకురావటం కష్టమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రస్తుతం గాజా అనేది లేకుండా పోయిందన్నారు. అంటే గాజాలో ఏం లేదని.. పలు చోట్ల ఇజ్రాయెల్ చేసిన భారీదాడులకు గాజా తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. వెస్ట్‌బ్యాంక్‌లో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతత నేపథ్యంలో పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో దాడులు ఆపేయాలని ఇజ్రాయెల్ కోరారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, రాజకీయ నేతల సహకారం లేకుండా ప్రస్తున్న నెలకొన్న ఇజ్రాయెల్, గాజాల సమస్యకు పరిష్కారం లభించదని అన్నారు. అదే విధంగా ఇప్పడు జరుగుతున్న దాడులకు ముగింపు కూడా పలకలేమని తెలిపారు. ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై యెమెన్‌లోని హౌతీ దళాలు చేస్తున్న దాడులపై ఆయన మండిపడ్డారు. చదవండి: చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు.. చిక్కుకుపోయిన వందల మంది -
వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్‌కు గాజా ప్రజల విన్నపం!
టెల్ అవివ్: గాజాలో ఇజ్రాయెల్ సేనలు దాడులు కొనసాగిస్తునే ఉన్నారు. గాజా- ఇజ్రాయెల్ మధ్య దాడులు మొదలై 100 వంద రోజులు పూర్తి అయింది. అయినా ఇజ్రాయెల్ గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తునే ఉంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశ అర్మీ.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో.. హమాస్ మిలిటెంట్లపై పాలస్తీనియా ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘హమాస్ నేతలు కుక్కలతో సమానం. వారిని అల్లా క్షమించడు. హమాస్ నేతల వల్లనే తమకు ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని వారు 100 ఏళ్ల వెనక్కి నెట్టారు. సాయుధ బలంతో హమాస్ నేతలు విర్రవీగుతున్నారు. Gazan civilians on Hamas leaders: “Hamas’ people are abroad, outside of Palestine…They ruined us, they took us back 100 years.” Listen to the conversations between Gazan civilians and IDF officers. pic.twitter.com/TsmjAtIc6k — Israel Defense Forces (@IDF) January 14, 2024 హమాస్ నేతలు గాజాలో లేరు. వారంతా పాలస్తీనా విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. కావాలంటే హమాస్ బలగాలను పాలస్తీనా వెలుపల చంపండి. కానీ, గాజాలోని పాలస్తీనా ప్రజలపై దాడులు చేయకండి’’ అని గాజాలోని పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ సైనిక అధికారులతో మొర పెట్టుకున్నారు. ఇప్పటివరకు 23,968 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ సాయుధులు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 1200 మంది మృతి చెందారు. హమాస్ నేతల చేతిలో ఇంకా 136 మంది ఇజ్రాయెల్ బంధీలు ఉన్న విషమం తెలిసిందే. తమ బంధీలు, హమాస్ బలగాలకు సంబంధిచిన నేతల జాడ తెలిస్తే చెప్పాలని పాలస్తీనా ప్రజలను ఐడీఎఫ్ కోరుతోంది. హమాస్ నేతల జాడ తెలియజేసిన వారికి 4 లక్షల అమెరికన్ డాలర్లను రివార్డుగా అందిస్తామని ఐడీఎఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఏలియన్ మమ్మీల గుట్టు రట్టు.. అసలు కథేంటంటే.. -
ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలోని యెమన్ హౌతీ రెబల్స్ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హౌతీ రెబల్స్ 18 డ్రోన్ దాడులకు తెగపడిందని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ నివేదికలో పేర్కొంది. మొత్తంగా గడిచిన ఏడు వారాల్లో హౌతీ రెబల్స్ సాయుధు దళాలు ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ వాణిజ్య చానెల్స్‌పై మొత్తం 26 సార్లు దాడులకు పాల్పడినట్లు తెలిపింది. అదేవిధంగా రెండు యాంటి షిప్ క్రూయిస్ మిసైల్స్, ఒక యాంటి బాలిస్టిక్ మిసైల్‌ను కూడా హౌతీ సాయుధ దళాలు ప్రయోగించినట్లు సీఈఎన్‌టీసీఓఎం వెల్లడించింది. సీఈఎన్‌టీసీఓఎం అనేది యూకే దేశ సహకారంతో నడిచే అమెరికా ఫోర్స్. ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు కొనసాగించే హౌతీ రెబల్స్ ఇరాన్లో తయారైన మానవ రహిత ఏరియల్ వెహికిల్స్(యూఏవీ)తో పాటు యాంటి షిప్ క్రూయిజ్ మిసైల్స్, యాంటి షిప్ బాలిస్టిక్ మిసైల్స్‌తో దక్షిణ ఎర్ర సముద్రంలో దాడులు చేసిందని బుధవారం సీఈఎన్‌టీసీఓఎం ప్రకటించింది. ఎర్ర సముద్రంలోని పలు షిప్పింగ్ చానెల్స్‌పై హౌతీ రెబల్స్ దళాలు ఇప్పటివరకు మొత్తంగా 26 దాడులు చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ భాగస్వామ్య హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో అలజడి సృష్టిస్తూ.. డ్రోన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గాజాపై తీవ్రంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌పై ప్రతీకారంగానే ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు చేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌పై దాడులు ఆపేవరకు తమ దాడులు కొనసాగిస్తామని హౌతీ రెబల్స్ హెచ్చరిస్తోంది. యెమన్ హౌతీ రెబల్స్ ఇప్పటికే ఇజ్రాయెల్‌పై కూడా డ్రోన్, మిసైల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే హమాస్ దళాలు అక్టోబర్ 7 చేసిన మెరుపు దాడలకు ప్రతిగా ఇజ్రాయెల్.. గాజాపై దాడులతో విరుచుకుపడుతోంది. గాజాలో హమాస్ సాయుధులను అంతం చేసేంతవరకు తమ దాడులు కొనసాగిస్తాని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రిపబ్లికన్ అభ్యర్థులకు మంచు టెన్షన్ -
ఇజ్రాయెల్-గాజా యుద్ధం: హౌతీ నేత కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-గాజా యుద్ధం కొనసాగుతోంది. గాజాలోని హమాస్ సాయుధులను అంతం చేసేవరకు తమ దాడులు ఆపమని ఇజ్రాయెల్ దళాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో యెమెన్ హౌతీ ఉద్యమ నేత మహమ్మద్ అలీ అల్ హౌతీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- గాజా యుద్ధంలో తమ ప్రమేయాన్ని సమర్థించుకున్నారు. అయితే తాము పాలస్తీనాకు బహిరంగంగా ఎప్పుడూ మద్దతు తెలపలేదని అన్నారు. కానీ, పాలస్తీనియన్లు వాళ్ల పని వారు చేస్తూ వెళ్తారని చెప్పారు. మైళ్ల దూరంలో తనకు ఈ యుద్ధంలో ప్రమేయముందా అని అడిగినప్పడూ.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. నెతన్యాహుకు పొరుగువాడా?, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒకే అంతస్తులో నివసిస్తున్నాడా? బ్రిటన్ ప్రధాని ఒకే భవనంలో ఉంటున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దాడులతో తాము ఏం సాధించలేదని, అటువంటి సమయంలో అమెరికా తమని ఎందుకు వ్యతిరేక కూటమిగా భావిస్తోందని మండిపడ్డారు. ఇజ్రాయెల్ పోర్టుల్లో ఏం జరుగుతుందో వారే స్వయంగా చెబుతున్నారని అన్నారు. దీంతో తమ చర్యలు ఎంత ప్రభావితంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ఎవరు ఏం చేసినా తమ ప్రాభల్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నామని అన్నారు. తమకు చట్టబద్దత లేదని ఎవరు అన్నా పట్టించుకోమని తెలిపారు. నిజంగానే తమకు చట్టబద్దత లేకపోతే బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, యుఎఇతో సహా 17 దేశాలను ఎదుర్కోలేమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమకు యెమెన్ ప్రజలే అండగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా తాము ఇజ్రాయెల్ హింసాత్మాక దాడులను ఎదుర్కొగలమని తెలిపారు. యెమెన్‌లోని ఇరాన్ అనుబంధ హౌతి సాయుధ గ్రూపు నవంబర్ 19 నుంచి సుమారు 20 కంటే ఎక్కువ నౌకలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఈ దాడులకు తెగపడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Israel-Hamas War: ఫౌదా సిరీస్ నటుడికి తీవ్ర గాయాలు -
ఇజ్రాయెల్- హమాస్ యుద్దం.. ఆంటోని బ్లింకెన్ హెచ్చరికలు
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఆదివారం దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ బలగాలు దాడులతో విరుచుకుపడ్డాయి. అయితే ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం ఖతర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై బ్లింకెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ఇలాగే కొనసాగితే.. గాజాతో మరిన్ని ప్రాంతాలకు యుద్ధ తీవ్రత విస్తరించనుందని తెలిపారు. దీని వల్ల మధ్య ప్రాచ్యంలో భద్రతకు ముప్పు ఉండనుందని అన్నారు. గాజా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెరుగతాయిని అన్నారు. హమాస్- ఇజ్రాయెల్ ఘర్షణలు ఇలాగానే కొనసాగితే.. ఇక్కడ ప్రజలు అభద్రతతో మరిన్ని బాధలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తీవ్రత తగ్గిన అనంతరం వలస వెళ్లిన ప్రజలు మళ్లీ తిరిగి రావాలన్నారు. ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్7న నుంచి హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో వేల మంది పాలస్తీనియన్లు పలు దేశాలు వలస వెళ్లారు. ఇక.. గాజాలో హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విచురుకుపడుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 22,722 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి -
ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి
రఫా: గాజా్రస్టిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో అల్–జజీరా సీనియర్ కరస్పాండెంట్ వాయిల్ దాహ్‌దౌ కుమారుడు హమ్జా దాహ్‌దౌ కూడా ఉన్నాడు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో వాయిల్ దాహ్‌దౌ కుటుంబంలో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు ఇప్పటికే చనిపోగా, ఆదివారం మరో కుమారుడు బలయ్యాడు. దాహ్‌దౌ సైతం గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ తన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాడు. గాజాలో అసలేం జరుగుతోందో ప్రపంచం తెలుసుకోవాలని, అందుకోసం తన ప్రాణాలైనా ధారపోస్తానని వాయిల్ దాహ్‌దౌ చెప్పాడు. తన కుటుంబం మొత్తం బలైపోయినా తన సంకల్పం సడలిపోదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 22,800 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరమైన దాడులు చేస్తోంది. ఖాన్ యూనిస్ పట్టణంలోని దక్షిణ భాగంలో తమ దాడుల తీవ్రతను పెంచడానికి ఇజ్రయెల్ సేనలు సిద్ధమవుతున్నాయ. ఇజ్రాయెల్ సైన్యం యుద్ధ ట్యాంక్‌లతో విరుచుకుపడుతోంది. వైమానిక బాంబు దాడులకు పాల్పడుతోంది. హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులల్లో శుక్రవారం రాత్రి వరకు సుమారు 24 గంటల్లో 200 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సేనలు హమాస్ కమాండ్ సెంటర్ల, ఆయుధ డిపోల వద్దకు చేరుకున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తెలిపారు. గాజా సిటీలో ఉన్న హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్ ఇంటి లోపల ఉన్న ఓ సొరంగాన్ని ధ్వంసం చేశామని తెలిపారు. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో ఉన్న నుసిరత్ క్యాంప్ సమీపంలోని ఓ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడిలో స్థానిక అల్-ఖుద్స్ టీవీ పనిచేస్తున్న పాలస్తీనా జర్నలిస్టు, అతని కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా.. 240 మంది వారి చేతిలో బంధీలు ఉన్నారు. గాజాలో పూర్తిగా హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రత పెంచుతోంది. చదవండి: గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు! -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు.. 2021నాటి పేలుళ్లతో లింక్
ఢిల్లీ: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన 2021నాటి పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2021లో అదే ప్రదేశంలో ఐఈడీ పేలుళ్లకు ప్రస్తుత దాడికి పోలికలు ఉన్నాయని సమాచారం. పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఇండియా గేట్ వైపు ఆటో రిక్షాను తీసుకెళ్తున్నట్లు పసిగట్టారు. చివరికి జామియా ప్రాంతంలో అనుమానితులను గుర్తించారు. 2021లో ఇదే ప్రదేశంలో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ కేసులోనూ నిందితులు జామియా వైపే వెళ్లారు. వారికోసం ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. ఈ రెండు పేలుళ్లలోనూ ఘటనాస్థలంలో టైప్ చేసిన అక్షరాలతో కూడిన లేఖ లభ్యమైంది. రెండు కేసుల్లోనూ ఆటోనే ఉపయోగించారు. జామియా వైపే వెళ్లారు. రెండు పేలుళ్ల ఘటనలకు పోలికలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సహా ఇతర భారత ఉగ్రవాద నిరోధక సంస్థలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. పేలుడు నేపథ్యంలో ఇండియాలో ఉన్న తమ దేశస్తులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద డిసెంబర్ 26న బాంబు పేలుడు సంభవించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆక్షేపిస్తూ ఓ లేఖ కూడా ఘటనాస్థలంలో లభ్యమైంది. బాంబు పేలుడు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కానీ ఎంబసీపై దాడిగానే ఇజ్రాయెల్ అధికారులు పరిగణించారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
గాజాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం రక్తపుటేరులు పారిస్తోంది. గురువారం బీట్ లాహియా, ఖాన్ యూనిస్, అల్–మఘాజీ ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒకేరోజు 50 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లాతోపాటు ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,320 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 55,603 మంది గాయపడ్డారు. -
హమాస్ టన్నెల్లో మృతదేహాలు.. బయటకు తీసిన ఐడీఎఫ్
హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం. ఆదివారం హమాస్ చేతిలో బంధించబడి చంపబడిన ఐదు ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) పేర్కొంది. హమాస్ ఏర్పాటు చేసుకున్న సొరంగాల నుంచి ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను ఐడీఎఫ్ సేనలు వెలికి తీశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ ఎక్స్( ట్వీటర్)లో పోస్ట్ చేసింది. ‘ఇంటలిజెన్స్ సాయంతో ఐడీఎఫ్ బలగాలు ఆక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లిన ఐదుగురు ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను హమాస్ సొరంగం నుంచి బయటకు తీశామని’ అని ఐడీఎఫ్ వెల్లడించింది. బయటకు తీసిన మృతదేహాలు.. జివ్ దాడో, ఎస్జీటీ రాన్ షెర్మాన్, సీపీఎల్ నిక్ బీజర్,ఈడెన్ జకారియా, ఎలియా తోలెడానోగా ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. జివ్ దాదో(36) ఇజ్రాయెల్ సైనికుడని, ఈడెన్ జకారియా(27) సౌత్ ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన ప్రేక్షుడని తెలిపారు. In a centralized intelligence effort, IDF troops located and recovered the bodies of 5 hostages—abducted during the October 7 Massacre—and brought them back to Israel: 🕯️WO Ziv Dado 🕯️SGT Ron Sherman 🕯️CPL Nik Beizer 🕯️Eden Zacharia 🕯️Elia Toledano May their memory be a… pic.twitter.com/tq1UlLo8Z2 — Israel Defense Forces (@IDF) December 24, 2023 శుక్రవారం, శనివారం హమాస్ మిలిటెంట్ల ఎదురుదాడిలో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు మృతిచెందిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 153కు చేరింది. -
Israel-Hamas war: కుటుంబాన్ని కూల్చేశారు
రఫా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా మెల్లగా దాడులు మొదలెట్టిన ఇజ్రాయెల్ రోజురోజుకూ రెచి్చపోతోంది. అ మాయక పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటోంది. శనివారం ఇజ్రాయెల్ సేనల నిర్దయ దాడులకు ఒక ఉమ్మడి కుటుంబం నిట్టనిలువునా కుప్పకూలింది. గాజా సిటీలో జరిపిన దాడుల్లో ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఉద్యోగి ‘అల్–మగ్రాబీ’ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 76 మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ పట్టణ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలో స్థానిక టీవీ పాత్రికేయుడు మొహమ్మద్ ఖలీఫా ఉమ్మడి కుటుంబం బలైంది. ఈ దాడిలో 14 మంది కుటుంబసభ్యులు మరణించారు. మొత్తం దాడుల్లో 90 మందికిపైగా మరణించారని గాజా పౌరరక్షణ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. -
ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఇవాంకా ట్రంప్
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. హమాస్‌ను పూర్తిగా అంతం చేయాడమే లక్ష్యంగా కాల్పుల విరమణకు కూడా అంగీకరించకుండా ముందుకు సాగుతున్నాయి ఇజ్రాయెల్ సేనలు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జార్డ్ కుష్నర్ ఇజ్రాయెల్ పర్యటించారు. అక్టోబర్ 7ను ఇజ్రాయెల్ దాడులు చేసి.. తమ వెంట ఇజ్రాయెల్ బంధీలుగా తీసుకెళ్లిన పౌరుల బాధిత కుటుంబాలను వారు పరామర్శించారు. ‘నేను ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టగానే తీవ్రమైన దుఖంతో కూడిన భావోద్వేగానికి లోనయ్యా. అక్టోబర్ 7న జరిగిన దాడుల పరిణామాల్లో బాధితుల కుటుంబ సభ్యుల హృదయవిదారకమైన బాధలు విన్నా. ఇలాంటి కఠికనమైన సమయాల్లో ఆశ, మంచితనం ఎప్పటికీ మన వెంటే ఉంటాయని గుర్తు చేస్తాయి. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. As I depart from Israel, my heart fills with a mix of sorrow and hope. Witnessing the aftermath of the October 7th terrorist attack, I heard heart-wrenching stories from victims, families, soldiers, and first responders. Their strength amid the despair was profoundly moving and… pic.twitter.com/fI73Zpfuq8 — Ivanka Trump (@IvankaTrump) December 21, 2023 ‘హమాస్ అనాగిరిక చర్యల వల్ల బాధితులుగా మారినవారి పరిస్థితును స్వయంగా మన కళ్లతో చూడటం చాలా ముఖ్యం’ అని జార్డ్ కుష్నర్ ఎక్స్( ట్విటర్)లో పోస్టు చేశారు. ‘హమాస్ చేత కిడ్నాప్ చేయబడిన వారి కుటుంబ సభ్యులు కలిశాము. ఇంకా కొంత మంది గాజాలోని హమాస్ చెరలోనే ఉన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపే పలు రాజకీయ నాయకులను కూడా కలుసుకున్నాం. సంకల్పం, విశ్వాసం, నమ్మకం, గతంలో ఊహించలేనిది కూడా పొందవచ్చు’ అని జార్డ్ తెలిపారు. యూదులైన జార్డ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్.. గత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన పదవులను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2024 అమెరికా ఎన్నికల ప్రచారం మాత్రం వీరు పాల్గొనపోవడం గమనార్హం. Today I visited Kibbutz Kfar Aza with @IvankaTrump & @jaredkushner so that they could bear witness to the crimes against humanity committed by Hamas on 7 October. Thank you for coming to Israel and for standing by our side 🇮🇱🇺🇸 (📹: Natan Weill | Knesset Press Office) pic.twitter.com/wZbqqNBXj8 — Amir Ohana - אמיר אוחנה (@AmirOhana) December 21, 2023 గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు, సుమారు 20 వేల మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందినట్లు ఇరు దేశాల అధికారలు వెల్లడించారు. హమాస్ చేసిన దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులను భీకరస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసినప్పుడు.. ఇజ్రాయెల్ దేశ నాయకత్వంపై విమర్శలు గుప్పించిన ట్రంప్ అనంతరం తన వైఖరి మార్చుకొని మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చదవండి: 'లొంగిపోవడం లేదా చావడం'.. హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం -
Hezbollah: ఇజ్రాయెల్ సైన్యానికి హెచ్చరిక
హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకరమైన దాడులను కొనసాగిస్తోంది. అయితే మరోవైపు లెబనాన్‌లోని పాలస్తీనా గ్రూప్‌లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. గత అక్టోబర్ 7 నుంచి హమాస్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హిజ్బుల్లా సంస్థ, ఇజ్రాయెల్‌కు మధ్య కూడా కాల్పులు జరుగుతున్నాయి. సోమవారం ఇజ్రాయెల్ సైన్యాన్ని హిజ్బుల్ సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. సామాన్య ప్రజలపై దాడికి చేస్తే.. అంతకంతకు భారీ మూల్యం చెల్లించుకుంటారని తెలిపింది. అంత్యక్రియల సమయంలో సామన్య ప్రజలపై దాడులు చేస్తే పర్యావసానాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని మండిపడింది. సోమవారం ఓ ఫైటర్ అంత్యక్రియలను హిజ్బుల్లా సంస్థ నిర్వహించింది. అయితే ఈ అంత్యక్రియల్లో పాల్గొనే సామాన్య జనాలే లక్ష్యంగా సమీపంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఇటువంటి సమయంలో సామాన్య ప్రజలపై దాడులకు దిగితే.. తాము కూడా అదే స్థాయిలో ప్రతికారం తీర్చుకుంటామని హిజ్బుల్లా సంస్థ.. ఇజ్రాయెల్ సైన్యాన్ని హెచ్చరించింది. చదవండి: Israel-Hamas war: 24 గంటల్లో 110 మంది దుర్మరణం -
Israel-Hamas war: 24 గంటల్లో 110 మంది దుర్మరణం
జబాలియా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడి తర్వాత నిరంతరాయంగా కొనసాగిస్తున్న భీకరదాడులను ఇజ్రాయెల్ మరింత పెంచింది. ఉత్తర గాజాలోని జబాలియా పట్టణంలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. డజన్ల మంది గాయాలపాలయ్యారు. ‘‘శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. నా బంధువుల పిల్లలు ముగ్గురు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 110 మృతదేహాలను దగ్గర్లోని అల్–ఫలూజా శ్మశానవాటికకు తరలించలేని పరిస్థితి. అక్కడ ఆగకుండా బాంబుల వర్షం కురుస్తోంది. దిక్కులేక దగ్గర్లోని నిరుపయోగంగా ఉన్న పాత శ్మశానవాటికలో పూడ్చిపెట్టాం’ అని గాజా ప్రాంత ఆరోగ్య విభాగ డైరెక్టర్ జనరల్ మునీర్ చెప్పారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై బైడెన్ అసంతృప్తి!
వాషింగ్టన్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్ దేశాలూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులే చెబుతున్నారు. అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఈ వారమే ఇజ్రాయెల్‌లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్‌లో యుద్ధానికి దిగింది. అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్ కోల్పోతుంది’’ అని బైడెన్ హెచ్చరించారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్‌లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్ వ్యాఖ్యానించారు. -
గాజా.. గజ గజ
గాజాలో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. బందీల విడుదల సమయంలో యుద్ధానికి చిన్న బ్రేక్ ఇచ్చారు. దీంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ బాంబుల మోత మొదలవ్వడంతో గాజా గజగజ వణుకుతోంది. గాజా ఒక నెత్తుటి నగరంలా మారిపోయింది. దాడులతో దద్దరిల్లుతోంది. ఆసుపత్రుల్లోనూ హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఒక యుద్ధం వేలాది మంది అమాయకులను బలి తీసుకుంటోంది. ఎక్కడ చూసినా రక్తం ఏరులై పారుతోంది. ఎక్కడ విన్నా బాంబుల మోతలే వినిపిస్తున్నాయి. గాజా నగరం ఒక శ్మశానాన్ని తలపిస్తోంది. ప్రాణాలు కాపాడుకునే దారి లేదు. సరిహద్దులు దాటే అవకాశం లేదు. గాజా నగరం పరిస్థితి.. యుద్ధానికి ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా మారింది. అసలు ఈ మారణకాండకు ముగింపు పడేది ఎప్పుడు ? గాజా భవిష్యత్తు ఏంటి ? యుద్ధం ఏదైనా.. యుద్ధం ఎక్కడైనా.. యుద్ధం ఏ రెండు దేశాల మధ్యనైనా.. ఎక్కువగా బలైపోయేది అమాయకులే..! యుద్ధానికి కారణం ఏదైనా కావొచ్చు.. ఒకరిది యుద్ధ దాహం కావొచ్చు.. మరొకరిది దేశ రక్షణ కోణం కావొచ్చు.. రీజన్ ఏదైనా.. ఆ యుద్ధంలో ఎక్కువగా బలయ్యేది సామాన్యులే..! ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ అదే జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా దద్దరిల్లుతోంది. హమాస్ జరిపిన మెరుపు దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తోంది. ఈ యుద్ధానికి కారణం ఎవరన్నది పక్కన పెడితే.. ఎక్కువగా బలైపోతున్నది మాత్రం అమాయకులే..! గాజా ప్రజలు పడుతున్న కష్టాల గురించి చెప్పేందుకు మానవీయ సంక్షోభం అనే మాటలు కూడా సరిపోవడం లేదు. అంత దారుణాతి దారుణంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. Violent and successive attacks in the city of Khan Yunis and Deir al-Balah 💔 #casefireNow #CopaAmerica #Isreal_The_Occupier_has_No_right_of_self_defense #IsrealiWarCrimes pic.twitter.com/X5cpGKVlQT — آلاء ALAA - 𓂆🔻 (@iilid_97) December 8, 2023 యుద్ధం కారణంగా ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురు అవుతున్నారు. కళ్ల ముందే భవనాలు పేక మేడల్లా కుప్ప కూలుతున్నాయి. శిథిలాల కింద కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మొత్తంగా గాజా ఇక శ్మశాన వాటికను తలపిస్తోంది. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి. కేవలం హమాస్‌ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయడం లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమాస్ బలంగా చెబుతోంది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. గాజాలో రక్తం ఏరులై పారుతోంది. అయితే ఏడు రోజుల కాల్పుల విరామంలో హమాస్ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయిల్ జైళ్లల్లో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయిల్ దాడులకు దిగింది. ఇంకా హమాస్ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లల్లో ఉన్నారు. గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారన్నది ఓ అంచనా..! అలాగే ఈ దాడుల్లో దాదాపు 50 వేల మందికి పైగా గాయపడ్డారు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమాస్, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయిల్ ప్రకటించాయి. ఇక హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. The Israel Forces continue operations in the Gaza Strip and claim to be making progress in the city of Khan Yunis. H@mas' armed wing has destroyed 135 Israeli military vehicles in whole or in part in the past three days across the Gaza Strip, a H@mas spokesman said. pic.twitter.com/whVvL3X4Fo — Sprinter (@Sprinter00001) December 8, 2023 ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 43 మంది మరణించారని హమాస్ వెల్లడించింది. సాధారణ జనావాసాలపై దాడులు చేయలేదని, హమాస్ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇలాంటి ప్రకటనల సంగతి ఎలా ఉన్నా.. ఇరువైపుల జరుగుతున్న దాడుల్లో సామాన్య ప్రజలు భారీగానే బలవుతున్నారు. గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతం అంటూ ఏదీ లేకుండాపోయింది. దీంతో అక్కడి ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునే దారి కనిపించడం లేదు. అక్కడ పరిస్థితి ప్రతి గంట గంటకూ దారుణంగా దిగజారుతోంది. ఇక గాజాలో హమాస్ మిలిటెంట్లు బలమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. అక్కడే వారి ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కలుగుల్లో దాక్కొని ఇజ్రాయెల్ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. అందుకే ఆ సొరంగాలను ధ్వంసం చేయడానికి , వాటిని సముద్రపు నీటితో నింపేయాలని ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నవంబర్లోనే అల్–షాతీ శరణార్థి శిబిరానికి మైలు దూరంలో 5 భారీ పంపులను ఏర్పాటు చేసింది. దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్‌యూనిస్ పట్టణాన్ని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ చూస్తోంది. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే అలర్ట్ చేశారు.మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలి. అటు తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది. ఉత్తర గాజాతో పోల్చుకుంటే ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా దక్షిణ గాజాలో దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నా..అక్కడ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. ఖాన్ యూనిస్ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయిలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి. Israelis just destroyed a 700 year old Mosque in Gaza! Israel = ISIS pic.twitter.com/dWDiQG73V3 — The Barracks (@thebarrackslive) December 8, 2023 ఇక మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కూడా పశ్చిమాసియాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నా రు. ఆయా దేశాలు హమాస్ చర్యలను ఖండిస్తున్న నేపథ్యంలో పాలస్తీనా అథారిటీని పునరుద్ధరించి, పరిపాలన బాధ్యతలను వెస్ట్‌బ్యాంక్‌కు అప్పగించేలా చర్చలు జరుగుతున్నాయి. దీనికి అర్థం ఏంటంటే హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలనే ఇజ్రాయెల్ శపథాన్ని నెరవేరుస్తూనే గాజా భూభాగంపై ఇజ్రాయెల్ ఎలాంటి నియంత్రణ చేపట్టకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాయి. అయితే ఒకవేళ వెస్ట్‌బ్యాంక్‌ను పాలస్తీనా అథారిటీగా గుర్తిస్తే.. ఇంతకాలం వ్యతిరేకిస్తూ వస్తున్న పాలస్తీనా అంశాన్ని ప్రపంచం అధికారికంగా గుర్తించే ప్రమాదం ఉంది. ఇది ఇజ్రాయెల్ కు ఏమాత్రం మింగుడు పడని అంశం. ఈ అంతర్జాతీయ రాజకీయాలు గురించి కాసేపు పక్కన పెడితే.. గాజాలో అమాయకుల పరిస్థితే దారుణంగా మారింది. పూర్తి స్థాయిలో గాజా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే..! ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆకాశం నుంచి మృత్యువు ఎప్పుడు వచ్చి పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్షణ బతికుండా చాలు అనుకుని ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గాజా ప్రజలు బతుకీడిస్తున్నారు. -
దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ గురి
ఖాన్ యూనిస్: శనివారం దక్షిణ గాజాలోని నిర్దేశిత లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లో హెలికాప్టర్ల ద్వారా మొట్టమొదటిసారిగా మ్యాప్ ముద్రించిన కరపత్రాలను విడిచిపెట్టింది. అందులో, దాడుల నుంచి రక్షణ పొందేందుకు తాముంటున్న చోటు నుంచి సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలిపే వివరాలున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజాలోని ఆరోగ్య శాఖ తెలిపింది. -
Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం
ఖాన్ యూనిస్ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్‌తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నడుపుతున్న అల్ ఫలా స్కూల్‌పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్ ఫకూరా స్కూల్‌పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ అల్ జాతర్ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది. దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే. ఇంధన సరఫరా తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది. గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి. నోవా ఫెస్ట్ మృతులు 364 మంది ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ను హమాస్ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్‌లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది. పులి మీద పుట్రలా... ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. -
Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో అతి పెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. పెద్ద సంఖ్యలో రోగులు కన్ను మూస్తున్నారు. రోగులు, క్షతగాత్రులతోపాటు 7,000 మందికిపైగా సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడ ఉందన్న వాదనతో ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. నిత్యం తనిఖీలు చేస్తోంది. బయట నుంచి ఆహారం, నీరు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధనం, విద్యుత్ సరఫరా కాకుండా నిలిపివేసింది. గత ఐదారు రోజులుగా ఇక్కడ చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఐసీయూలోని రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి 22 మంది మరణించారని అల్–షిఫా డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాలి్మయా చెప్పారు. గత మూడు రోజుల వ్యవధిలో ఇక్కడి 50 మందికిపైగా రోగులు మరణించినట్లు సమాచారం. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ స్థావరాలనే కాదు, శరణార్థి శిబిరాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం ఉపేక్షించడం లేదు. తాజాగా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 18 మంది పాలస్తీనా శరణార్థులు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరం సమీపంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 14 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు ఎంతమంది మృత్యువాత పడ్డారన్నది తెలియరావడం లేదు. గత కొన్ని రోజులుగా మృతుల, క్షతగాత్రుల గణాంకాలను గాజా ఆరోగ్య శాఖ విడుదల చేయడం లేదు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రభుత్వ అధికార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలమే ఇందుకు కారణం. బందీలను హత్య చేస్తున్న హమాస్! అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. ఇప్పటిదాకా నలుగురు బందీలను విడుదల చేశారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేయడంతో ప్రతిస్పందనగా బందీలను మిలిటెంట్లు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వద్ద బందీగా ఉన్న 19 ఏళ్ల నోవా మర్సియానో అనే ఇజ్రాయెల్ మహిళా జవానును ఇప్పటికే హత్య చేశారు. ఆమె మృతదేహం అల్–షిఫా వద్ద లభ్యమైంది. అలాగే 65 ఏళ్ల మరో మహిళా బందీ సైతం హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని అల్–షిఫా వద్ద గుర్తించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆగని దాడులు.. అందని సాయం గాజాపై ఇజ్రాయెల్ సేనలు భీకరస్థాయిలో విరుచుకుపడుతుండడంతో పాలస్తీనియన్లకు మానవతా సాయం అందడం లేదు. దాడులకు విరామం ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆహారం, ఔషధాలు, నిత్యావసరాను గాజాకు చేరవేయలేకపోతున్నామని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆకలి చావులు ప్రారంభం కావడం తథ్యమని తేలి్చచెప్పింది. మరోవైపు గాజాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఊహించినదాని కంటే వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, సాధారణ జనావాసాలతోపాటు ఆసుపత్రుల్లోనూ జనం రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఇతర దేశాల నుంచి ఇంధనం వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో జనరేటర్లు పనిచేయడంలేదు. విద్యుత్ లేక మొబైల్ ఫోన్ల సేవలు సైతం నిలిచిపోయాయి. గాజాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గాజాను ఆక్రమించొద్దు: బ్లింకెన్ హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత గాజా పరిస్థితి ఏమిటి అన్నదానిపై చర్చ ప్రారంభమైంది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకొని, అక్కడ తన కీలు»ొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరోసారి ఇజ్రాయెల్‌కు సూచించారు. ఆఖరి గౌరవానికీ దూరం ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో మెజార్టీ ప్రజలు ముస్లిం మతçస్తులే. దాడుల్లో నిత్యం పదుల సంఖ్యలో జనం మరణిస్తున్నారు. భవనాలు నేటమట్టమవుతున్నాయి. కాంక్రీట్ దిబ్బలుగా మారుతున్నాయి. చాలామంది వాటికింద చిక్కుకొని తుదిశ్వాస విడుస్తున్నారు. గాజాలో చాలా ప్రాంతాలు శ్మశనాలను తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై 5 వారాలు దాటింది. గాజాలో ఇప్పటివరకు 1,500 మంది చిన్నారులు సహా 2,700 మంది కనిపించకుండాపోయారు. వారంతా శిథిలాల కింద విగతజీవులైనట్లు తెలుస్తోంది. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం.. మృతులకు సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తిచేయాలి. మృతదేహాలను సబ్బుతో శుభ్రం చేసి, కొత్త వస్త్రాలు చుట్టి, పన్నీరు చల్లి 24 గంటల్లోగా ఖననం చేయాల్సి ఉంటుంది. గాజాలో వేలాది మంది ఈ ఆఖరి గౌరవానికి నోచుకోవడం లేదు. బయటకు తీసేవారు లేక శిథిలాల కింద శవాలు కుళ్లిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోతున్నాయి కరెంటు, డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో గాజాలో సహాయక చర్యలు ఎప్పుడో నిలిచిపోయాయి. భవనాల శిథిలాలను తొలగించేవారే లేరు. కనిపించకుండాపోయిన తమ బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం జనం గాలిస్తున్నారు. శవం కనిపించినా ఎవరిదో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిగో హమాస్ సొరంగం.. అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో సొరంగంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న తన వాదనకు బలం చేకూర్చేలా వీడియోను, కొన్ని ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో గుహ లాంటి ప్రదేశం కనిపిస్తోంది. ఇది నిజంగా హమాస్ సొరంగమేనా? అనేది నిర్ధారించాల్సి ఉంది. అల్–షిఫా హాస్పిటల్లో హమాస్ ఆయుధాల వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అల్ షిఫా ఆస్పత్రి ఐసీయూ వార్డు (ఫైల్ ఫొటో) -
అల్-షిఫా ఆస్పత్రి ఎమ్ఆర్ఐ సెంటర్లో హమాస్ ఆయుధాలు!
గాజా: అల్ షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు తమ స్థావరంగా మార్చుకున్నారని గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అందుకు తగిన ఆధారాలను కూడా బయటపెట్టింది. తాజాగా అల్-షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సేనలు హమాస్ దాచిన ఆయుధాలను బయటపెట్టారు. ఆస్పత్రి ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్లో హమాస్ కమాండ్ కేంద్రాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారు. Watch as LTC (res.) Jonathan Conricus exposes the countless Hamas weapons IDF troops have uncovered in the Shifa Hospital's MRI building: pic.twitter.com/5qssP8z1XQ — Israel Defense Forces (@IDF) November 15, 2023 ఎమ్ఆర్ఐ స్కానింగ్ కేంద్రంలో హమాస్ ఆయుధాలకు సంబంధించిన బ్యాగులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ స్వయంగా వెల్లడించారు. ఆ బ్యాగుల్లో ఏకే-47 వంటి భారీ స్థాయి తుపాకులు, మందుగుండు సామగ్రి కనిపించాయని ఆయన వీడియోలో చూపించారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాద కేంద్రంగా మార్చిందని ఆయన ఆరోపించారు. అల్-షిఫా ఆస్పత్రిని హమాస్ స్థావరంగా మార్చుకుందని ఇజ్రాయెల్ సేనలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి అంతర్భాగంలో సొరంగాలు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి ఆస్పత్రికి నేరుగా సొరంగ మార్గాలను కనుగొన్నామని సైన్యం వెల్లడించింది. అల్-షిఫా ఆస్పత్రి పరిసరాల్లో కొద్ది రోజుల పాటు హమాస్-ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఆస్పత్రికి కొద్ది రోజులుగా నీరు, ఆహారం, ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులతో సహా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట! -
Israel-Hamas War: రణరంగం అల్–షిఫా
ఖాన్ యూనిస్: గాజాలో నెల రోజులకుపైగా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరుకుంది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలోకి బుధవారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు ప్రవేశించాయి. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడే భూగర్భంలో ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆసుపత్రి కింది భాగంలో సొరంగాల్లో హమాస్ నాయకులు మాటు వేశారని చెబుతోంది. మిలిటెంట్లపై కచి్చతమైన, లక్షిత ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించింది. అల్–షిఫా హాస్పిటల్ ఇప్పుడు రణభూమిగా మారిపోయింది. ఇజ్రాయెల్ సైనికులు ప్రతి గదినీ అణువణువూ గాలిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా ప్రశి్నస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అన్ని డిపార్టుమెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు సైతం అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్లో ఇజ్రాయెల్ సైనికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు, ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. పురుషులను నగ్నంగా మార్చి, కళ్లకు గంతలు కట్టి నిర్బంధిస్తున్నారని తెలిపారు. తరచుగా తుపాకీ మోతలు వినిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వార్డుల్లో 180కి పైగా మృతదేహాలు పడి ఉన్నాయని, బయటకు తరలించేవారు లేక కుళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉందన్నారు. 16 నుంచి 40 ఏళ్ల లోపు పురుషులంతా ఆసుపత్రి గదుల నుంచి బయటకు వెళ్లాలని, బయట అందరూ ఒకేచోటుకు చేరుకోవాలని లౌడ్స్పీకర్లో అరబిక్ భాషలో ఇజ్రాయెల్ సైనికులు హెచ్చరికలు జారీ చేశారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. పురుషులను బట్టలు విప్పించి ప్రశి్నస్తున్నారని పేర్కొన్నారు. 200 మందిని దూరంగా తీసుకెళ్లారని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైనికులు అదుపులోకి తీసుకున్నారని, ఇతర భవనాలతో కాంటాక్ట్ లేకుండాపోయిందని ప్రధాన భవనంలోని డాక్టర్లు చెప్పారు. ఇజ్రాయెల్ వాదనకు అమెరికా మద్దతు అల్–షిఫా హాస్పిటల్ కింద సొరంగాల్లో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న ఇజ్రాయెల్ వాదనకు అమెరికా మద్దతు పలికింది. కమాండ్ సెంటర్‌ను తమ నిఘా వర్గాలు గుర్తించాయని వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్, అమెరికా ప్రకటనలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆందోళన అల్–షిపా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ సేనల తనిఖీలను ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఖండించారు. ఇజ్రాయెల్ చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు బుధవారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్లు తెలిసింది. అల్–షిఫా ఎందుకంత ముఖ్యం? అల్–షిఫా అంటే స్వస్థత కేంద్రం అని అర్థం. గాజాలోనే అతిపెద్దదైన ఈ ఆసుప్రతిని 1946లో అప్పటి బ్రిటిష్ పాలనలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. దీన్ని గాజా గుండెచప్పుడు, ఆరోగ్య ప్రదాయినిగా పరిగణిస్తుంటారు. వైద్య సేవల విషయంలో ఇదొ వెన్నుముక లాంటింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడల్లా అల్–షిఫా హాస్పిటల్‌పై దాడులు జరగడం పరిపాటిగా మారింది. 2008–2009లోనూ ఒక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2014లో జరిగిన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ సమయంలో అల్–షిఫా హాస్పిటల్లో 9 రోజులపాటు వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ మిలిటెంట్లు ఈ ఆసుపత్రిని ప్రధాన స్థావరంగా మార్చుకున్నారని ఇజ్రాయెల్ గత కొన్ని దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. -
Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
దెయిర్ అల్‌బలాహ్ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు. షిఫా.. శిథిల చిత్రం అల్ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్ మాట మార్చింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్ అహిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పడకేసిన వైద్యం గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. -
Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర
ఖాన్ యూనిస్: హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం మరో మలుపు తిరిగింది. గాజా్రస్టిప్‌లో అతిపెద్ద నగరమైన గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. 100కుపైగా హమాస్ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతోపాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్–షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేలి్చచెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలోనే మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గాజాలోని అల్–ఖుద్స్ హాస్పిటల్‌పైనా సైన్యం దృష్టి పెట్టింది. ఇక్కడ వంద మందికిపైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హమాస్ మిలిటెంట్లు అల్–ఖుద్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మకాం వేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. క్షతగాత్రుల ముసుగులో తప్పించుకుంటున్నారని చెబుతోంది. ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. వెస్ట్‌బ్యాంక్‌పై దాడి.. 11 మంది మృతి గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య గురువారం 10,812కు చేరుకుంది. మరో 2,300 మంది శిథిలాల కిందే ఉండిపోయారు. వారు మరణించి ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింసాకాండ కొనసాగుతోంది. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ ఫొటో జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని చిత్రీకరించిన ఫొటో జర్నలిస్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ గురువారం డిమాండ్ చేసింది. గాజాకు చెందిన ఈ జర్నలిస్టులు అంతర్జాతీయ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్నారు. హమాస్ దాడిని కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. మీడియాకు విడుదల చేశారు. హమాస్ దాడి గురించి వారికి ముందే సమాచారం ఉందని, అందుకే కెమెరాలతో సర్వసన్నద్ధమై ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. మానవత్వంపై జరిగిన నేరంలో వారి పాత్ర ఉందని మండిపడింది. వారి వ్యవహార శైలి పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధమని ఆక్షేపించింది. సదరు ఫొటోజర్నలిస్టులు పనిచేస్తున్న మీడియా సంస్థకు ఇజ్రాయెల్ లేఖలు రాసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు.. ఉత్తర గాజా–దక్షిణ గాజాను కలిపే ప్రధాన రహదారిని ఇజ్రాయెల్ సైన్యం వరుసగా ఐదో రోజు తెరిచి ఉంచింది. నిత్యం వేలాది మంది జనం ఉత్తర గాజా నుంచి వేలాది మంది దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. పిల్లా పాపలతో కాలినడకనే తరలి వెళ్తున్నారు. కొందరు కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారు. ఉత్తర గాజాలో హమాస్ స్థావరాలపై దాడులు ఉధృతం చేస్తామని, సాధారణ ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాలో జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి, మానవతా సాయం అందించడానికి వీలుగా ప్రతిరోజూ 4 గంటలపాటు దాడులకు విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలియజేశారు. -
Israel-Hamas war: స్కూళ్లు, ఆస్పత్రులపై దాడులు
టెల్అవీవ్: గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు మరింతగా చొచ్చుకుపోతున్నాయి. శనివారం మరిన్ని ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసినట్టు సైన్యం ప్రకటించింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో జరిగిన బాంబు, క్షిపణి దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆంబులెన్సులో పారిపోతున్న ఉగ్రవాదులను ఏరేయడానికి దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతోపాటు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలో ఓ స్కూలుపై జరిగిన క్షిపణి దాడిలో మరో 15 మంది దాకా మరణించారు. దాడులు ఉత్తర గాజాలోని ఐరాస శరణార్థి శిబిరాలకు కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇజ్రాయెల్ హెచ్చరిక మేరకు భారీ సంఖ్యలో దక్షిణాదికి వలస వెళ్లిన వారు పోగా ఇంకా 3 లక్షల మంది దాకా ఉత్తర గాజాలోనే చిక్కుబడ్డారు. వీరంతా ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పోరులో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 9,500 దాటినట్టు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, హమాస్ చీఫ్ నివాసంపై కూడా క్షిపణి దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. సాయం... తక్షణావసరం గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లకు అత్యవసరాలు కూడా అందని దుస్థితి అలాగే కొనసాగుతోంది. అతి త్వరలో లక్షలాది మంది ఆకలి చావుల బారిన పడే ప్రమాదముందని అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస తదితర అంతర్జాతీయ సంస్థల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజావాసులకు మానవీయ సాయం అందేలా చూడాలని అమెరికా, యూరప్‌తో సహా అంతర్జాతీయ సమాజమంతా ముక్త కంఠంతో ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే స్పందించాలని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కాకపోతే యుద్ధక్షేత్రంలో చిక్కుబడ్డ పౌరులు దక్షిణాదికి పారిపోయేందుకు వీలుగా శనివారం మూడు గంటలపాటు దాడుల తీవ్రతను తగ్గించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనావాసులకు అత్యవసర సాయం అందేలా చూసే మార్గాంతరాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. రోజుకు ఆరు నుంచి 12 గంటల పాటు కాల్పుల విరామ ప్రకటించి మానవీయ సాయం అందేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు వీలు కలి్పంచాలని ఈజిప్ట్, ఖతర్ కోరుతున్నాయి. అలాగే బందీల విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనియన్లలో వృద్ధులు, మహిళలను వదిలేయాలని ప్రతిపాదిస్తున్నాయి. వీటిపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా స్పందించలేదు. రోజుకు రెండే బ్రెడ్డు ముక్కలు గాజావాసులు సగటున రోజుకు కేవలం రెండు బ్రెడ్డు ముక్కలు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నట్టు అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస సంస్థల డైరెక్టర్ థామస్ వైట్ వాపోయారు. అవి కూడా ఐరాస సేకరించిన పిండి నిల్వల నుంచే వారికి అందుతున్నట్టు చెప్పారు. గాజాలో ఒక్క ప్రాంతం కూడా సురక్షితమని చెప్పడానికి వీల్లేకుండా ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవీయ చట్టాలను గౌరవిస్తూ పాలస్తీనావాసులకు సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కానీ మానవీయ సాయం నిమిత్తం దాడులకు కాస్త విరామమివ్వాలన్న అంతర్జాతీయ విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. తమ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దాడులను తగ్గించేది లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ కూడా సమ్మతం కాదన్నారు. మరోవైపు ద్వంద్వ పౌరసత్వాలున్న 380 మందికి పైగా పాలస్తీనియన్లు శుక్రవారం ఈజిప్టు చేరుకున్నారు. తామిక ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్టేనని హెజ్బొల్లా నేత సయ్యద్‌హసన్ నస్రల్లా ప్రకటించారు. -
Israel-Hamas war: ఓటింగ్‌కు దూరం సరికాదు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ పోరుపై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చెప్పారు. ‘‘హమాస్ దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. కానీ ప్రతీకారం పేరుతో నిస్సహాయులైన ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వినాశనానికే దారి తీస్తున్నాయి. పాలస్తీనా ఒక స్వతంత్ర దేశంగా శాంతియుతంగా సహజీవనం చేసేలా నేరుగా ద్వైపాక్షిక చర్చలు జరగాలన్నదే ఈ సమస్యపై కాంగ్రెస్ వైఖరి అని సోనియా గుర్తు చేశారు. సోమవారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. గాజాను అన్నివైపుల నుంచీ ఇజ్రాయెల్ చెరబట్టిన తీరు ఆ ప్రాంతాన్ని ఓపెన్ జైలుగా మార్చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. -
Israel-Hamas war: హమాస్ స్థావరాలే లక్ష్యం
గాజాస్ట్రిప్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. మరోవైపు వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 450 హమాస్ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మిలిటెంట్ల కమాండ్ సెంటర్లు, అబ్జర్వేషన్ పోస్టులు, యాంటీ–ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలియజేసింది. గాజాలోకి మరిన్ని పదాతి దళాలు అడుగుపెట్టబోతున్నాయని పేర్కొంది. ఖాన్ యూనిస్ సిటీలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. వీరిలో 10 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. హమాస్ కమాండ్ పోస్టు ఉందని భావిస్తున్న షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. గాజా సిటీలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందలాది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది బలయ్యారన్నది తెలియరాలేదు. హమాస్‌పై రెండో దశ యుద్ధం కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో శత్రువులపై భీకర పోరు తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లు సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పైకి అప్పుడప్పుడు రాకెట్లు ప్రయోగిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో తరచుగా సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. మూడు వారాలు దాటిన ఘర్షణ ఇజ్రాయెల్ దాడుల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 3,300 మంది మైనర్లు, 2,000 మందికిపైగా మహిళలు ఉన్నారని ప్రకటించింది. శిథిలాల కింద మరో 1,700 మంది చిక్కుకుపోయినట్లు అంచనా. వారు ఎంతమంది బతికి ఉన్నారో చెప్పలేని పరిస్థితి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌దాడులు తీవ్రతరం కావడం పాలస్తీనియన్లలో గుబు లు పుట్టిస్తోంది. ఇలాంటి భీకర దాడులను తామెప్పుడూ చూడలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీకి నెతన్యాహూ క్షమాపణ ఇజ్రాయెల్ భద్రతా దళాలకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ క్షమాపణ చెప్పారు. ఈ నెల 7న జరిగిన హమాస్ దాడిని ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైందంటూ ఆయ న తొలుత ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాడికి సంబంధించి భద్రతా దళాల అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని తప్పుపట్టారు. నెతన్యాహు పోస్టుపై ఆయన సహచర మంత్రులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భద్రతా సిబ్బంది ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం ఏమిటని పలువురు మండిపడ్డారు. దీంతో బెంజమిన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. భద్రతా బలగా లకు క్షమాపణ చెప్పారు. వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. పశి్చమాసియాలో శాంతి నెలకొనాలి: మోదీ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పశి్చమాసియాలో ఉద్రిక్తత పెరిగిపోతుండడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీతో ఫోన్లో మాట్లాడారు. పశి్చమాసియా పరిణామాలపై చర్చించారు. గాజాలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సాధారణ ప్రజలు మరణిస్తుండడం తీవ్ర విచాకరమని మోదీ పేర్కొన్నారు. పశి్చమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని, ఇందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు మోదీ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గాజాకు మానవతా సాయం అందిస్తామన్నారు. గోదాములు లూటీ మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల 23 లక్షల మంది గాజా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చల్లారని ఆకలి మంటలు వారిని లూటీలకు పురికొల్పుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూఎన్ఆర్డబ్ల్యూఏ సంస్థ గోదాముల్లో భద్రపరుస్తోంది. ప్రజలకు పంపిణీ చేస్తోంది. అయితే, ఆకలికి తాళలేని జనం గోదాములను లూటీ చేస్తున్నారని, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాలు, పరిశుభ్రతకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్నారని వెల్లడించింది. గాజాలో ‘సివిల్ ఆర్డర్’ గతి తప్పుతోందని పేర్కొంది. పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారతోందని, ఆవేశంలో ఉన్న ప్రజలను నియంత్రించలేకపోతున్నామని తెలియజేసింది. రణభూమిగా మారిన గాజాలో ఉండలేక, ఇతర దేశాలకు వలస వెళ్లే మార్గం కనిపించక జనం నిరాశలో మునిగిపోతున్నారని, అంతిమంగా వారిలో హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని స్పష్టం చేసింది. ‘ద్విదేశ’ విధానమే పరిష్కారం: బైడెన్ ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, అరబ్ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని అన్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో మరో దారుణం ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లోని నబ్లూస్లో ఓ యూదు సెటిలర్ జరిపిన కాల్పుల్లో బిలాల్ సాలెహ్ అనే పాలస్తీనియన్ రైతు మరణించాడు. ఈ రైతు ఆలివ్ తోటలు సాగుచేస్తుంటాడు. వెస్ట్‌బ్యాంక్‌లో గత 23 రోజుల్లో యూదు సెటిలర్ల దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇక్కడ 110 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. -
గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై దాడులు తీవ్రతరం చేస్తున్న ఇజ్రాయెల్..ఇంకా ఇతర అప్డేట్స్
-
Israel-Hamas war: గాజాలో నరకయాతన
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. 9 వేలు దాటిన మృతుల సంఖ్య మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది. ఇంధనాన్ని అనుమతించేది లేదు సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది. మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు. బందీల్లో 30 మంది పిల్లలు! ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది. బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది. సిరియాలో అమెరికా దాడులు వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది. -
మనవాళ్ళకి ఎందుకంత ఆందోళన?
ప్రస్తుతం ఇజ్రాయెల్– పాలస్తీనియన్ల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం స్వయం ప్రకటిత మేధావులమని చెప్పుకునే మనదేశంలోని కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒకటే గోల! హమాస్ చర్యలను ప్రామాణీకరిస్తూ సంఘీభావ ర్యాలీలు తీయడం, హమాస్ దాడుల తరహాలో భారతదేశంలో కూడా దాడులు చేయాలంటూ దేశ సమగ్రతకు సవాలు విసిరే విధంగా వీడియోల పోస్టింగులు!! భారతదేశం భద్రతను దృష్టిలో ఉంచుకున్న భారత ప్రభుత్వం హమాస్ తీవ్రవాద చర్యలను నిర్ద్వంద్వంగా ఖండించింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన సంఘీభావాన్ని కూడా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా బలి అవుతున్న సామాన్య ప్రజల మృత్యు ఘోషకు తీవ్ర సంతాపం కూడా తెలియజేసింది. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా అందిస్తోంది. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న జిహాదీ ఉగ్రవాదాన్నీ, రక్షణ పరంగా ఇజ్రాయెల్‌కు మనకు ఉండే ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని, మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ హితాన్ని కోరే వాళ్ళందరూ స్వాగతించారు. కానీ కొందరు వ్యతి రేకిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ హమాస్ చర్యలను సమర్థిస్తోంది. దీని వెనుక ఈ దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించే ప్రయోజనం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే 1948కు ముందు ఇజ్రాయెల్ అనే పేరుతో ఒక భూ భాగమే లేదనేది అక్షర సత్యం. 1947 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ప్రపంచ పటంలో లేవు అనేది కూడా సత్యమే కదా? వాటి మునుగడను భారతదేశం కాదంటుందా? ఇజ్రాయెల్ మను గడను ప్రశ్నించే వారికి ఈ సమాధానం సరిపోదా? పెట్టుబడిదారీ పశ్చిమ దేశాలు మధ్య ఆసియాలో తమ రాజకీయ అవసరాల కోసమే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్ దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ను సృష్టించాయి. ‘జెరూసలేం’ ప్రాంతం తమ ఆధ్యాత్మిక, మత, సాంస్కృతిక భావాలకు కేంద్రం అని రెండువేల ఏళ్లుగా యూదు జాతీయులు చెప్పుకొంటు న్నారు. యూదులపై దయతో పశ్చిమ దేశాలు వారికి ఒక భూభాగాన్ని కేటాయించాయని చెప్తే సత్య దూరమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ దేశాలు 60 లక్షల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా మట్టుబెట్టాయనేది చరిత్ర చెప్పే చెరపలేని సాక్ష్యం. ఇక పాలస్తీనా ఒక స్వతంత్ర భూభా గమనీ, దానిని దురహంకార పూరితమైన ఇజ్రాయెల్ దేశం ఆక్రమించిందనీ మన దేశంలోని చారిత్రిక పరిజ్ఞానం లేని కొంతమంది మూర్ఖపు వాదనలు చేస్తూ, దేశ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం పాలస్తీనా భూభాగాలుగా చెప్పుకొనే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలు 1967 వరకు వరుసగా ఈజిప్టు, జోర్డాన్ దేశాలలో భాగాలు. జోర్డాన్ నదికి పడమర వైపున ఉండే ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నారనేది గమనార్హం. ఇస్లాం మతస్థులకు ‘జెరూసలేం’ పవిత్ర స్థలం కూడా. అందుకే ఇజ్రాయెల్ ఏర్పాటును ముస్లిం దేశాలన్నీ వ్యతిరేకించాయి. ఇక క్రైస్తవులకు ‘జెరూసలేం’, ‘బెత్లె హేము’ పవిత్ర స్థలాలు. క్రైస్తవుల ప్రాబల్యం నిలుపుకోవాలంటే అక్కడ పశ్చిమ దేశాలకు తమకు అనుకూలమైన దేశం ఒకటి ఉండాలి. ఇజ్రాయెల్ ఏర్పాటు వెనుక ఉన్న సూత్రం ఇదే! అరబ్ – ఇజ్రాయెల్ ఐదు యుద్ధాల్లో ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ మట్టి కరిపించడం వెనక దాగి ఉన్న రహస్యం కూడా ఇదే! పశ్చిమ దేశాలన్నీ కూడా ఇజ్రాయెలీలకు ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది వాస్తవం. ఇక హమాస్ చర్యలు పాలస్తీనియన్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి వేస్తాయనేది కాదనలేని సత్యం. గాజా స్ట్రిప్‌లోని ఇంటర్నల్ బంకర్లను ధ్వంసం చేసేంతవరకూ ఇజ్రాయెల్ ఆగదు. ఇదే జరిగితే అనేకమంది సామాన్య ప్రజలు బలి అవుతారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై దృష్టిని సారించి, హమాస్ తీవ్రవాదుల చెరలో బందీ లుగా ఉన్న యూదులను విడిపించే ఏర్పాట్లు చేయాలి. అదే విధంగా ఇజ్రాయెల్ దుందు డుకు చర్యలకు అడ్డుకట్ట కూడా వేయాలి. - వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
చిన్నారులే సమిధలు.. గాజాలో ప్రతి 15 నిమిషాలకు..
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపువారే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనియన్ స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని తెలియజేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాలో 3,400 మందికిపైగా జనం మరణించారు. వీరిలో 1,000 మందికిపైగా బాలలు ఉన్నట్లు అంచనా. అంటే ప్రతి ముగ్గురు మృతుల్లో ఒకరు చిన్నపిల్లలే కావడం గమనార్హం. గాజాలో అచ్చంగా నరమేధమే సాగుతోందని డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్–పాలస్తీనా(డీసీఐపీ) అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం తక్కువ. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1,400 మంది మృతిచెందగా, వీరిలో 14 మంది బాలలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ► గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించింది. ఆహారం, నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు చెబుతున్నా అవి చాలామందికి అందడం లేదు. ► తగినంత ఆహారం, నీరు లేక గాజాలో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. పారిశుధ్య వసతులు లేకపోవడంతో డయేరియా వంటి వ్యాధులు ప్రబులుతున్నాయని పేర్కొంటున్నారు. ► యుద్ధం కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక అధికారులు చెప్పారు. అకారణంగా భయపడడం, రోదించడం వంటివి చేస్తున్నారని తెలియజేశారు. ► రణక్షేత్రంలో దాడులు, ప్రతిదాడులు చూస్తూ పెరిగిన పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరుగుతుందని, భవిష్యత్తులో వారు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. ► యుద్ధాల సమయంలో బాలలకు హక్కులుంటాయి. వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇరుపక్షాలకూ ఉంటుంది. ► చిన్నారుల ప్రాణాలను రక్షించాలంటూ 1949లో జెనీవాలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని 1951లో ఇజ్రాయెల్ ఆమోదించింది. -
Israel-Hamas War: గాజా కింద మరో గాజా!
సరిహద్దులు దాటి మెరుపు దాడులతో భయోత్పాతం సృష్టించిన హమాస్ పనిపట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి గాజాస్ట్రిప్‌పై భారీ వైమానిక దాడులతో వందలాదిగా భవనాలను ఇజ్రాయెల్ ఆర్మీ నేలమట్టం చేస్తూ పోతోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దాని దృష్టంతా ఇప్పుడు హమాస్ శ్రేణులపైనే ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ అత్యాధునిక సాంకేతికత, ఆయుధ బలంతో హమాస్ ఏమాత్రం సరితూగదు. అయితే, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ పని అనుకున్నంత సులువు కాదన్నది నిపుణుల మాట. ఏళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్వర్క్ హమాస్‌కు పెట్టని కోటగా మారింది. గత వారం నరమేథం సృష్టించిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు సముద్ర, భూ, ఆకాశ మార్గాలతోపాటు ఈ సొరంగమార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయి. శత్రుదుర్బేధ్యమైన టన్నెల్ నెట్ వర్క్ ఎలా, ఎక్కడుందన్నది ఇజ్రాయెల్ ఆర్మీకి అంతుచిక్కడం లేదు. ఈ టన్నెళ్లలోనే హమాస్ ఆయుధ సామగ్రి, నెట్వర్క్ అంతా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ బందీలను అండర్‌గ్రౌండ్‌లోనే దాచినట్లు ఆర్మీ అంటోంది. ఇజ్రాయెల్ 2014 నుంచి గాజా స్ట్రిప్‌తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు ఆవలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను సైతం గుర్తించేందుకు ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్‌కు క్షిపణి దాడులను అడ్డుకునే ఐరన్ డోమ్‌ను సమకూర్చాయి. ఐరన్వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఇవి సాంకేతికతలను అభివృద్ధి పరిచాయి. అయితే, అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి. ‘గాజా స్ట్రిప్‌లో రెండు లేయర్లున్నాయి. ఒకటి పౌరులది కాగా, రెండోది హమాస్‌ది. హమాస్ నిర్మించుకున్న ఆ రెండో లేయర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్ కొన్రికస్ చెప్పారు. అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఛేదించడం అంత సులువు కాదు. గతంలోనూ ఇజ్రాయెల్ అనేక మార్లు ప్రయత్నించి భంగపడింది. 2021లో గాజాపై భారీ చేపట్టిన బాంబు దాడులతో 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, తమకు 500 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ నెట్వర్క్ ఉన్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటించుకోవడం గమనార్హం. భూగర్భ మార్గాలు ప్రమాదకరమా? సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినప్పటికీ భూతల పోరాటంలో ఆధిపత్యం సాధించిన వారిని అక్షరాలా అణగదొక్కేందుకు టన్నెలింగ్ అత్యంత ప్రభావ వంతమైన మార్గంగా మారిపోయిందని స్కాట్ సవిట్జ్ అనే మిలటరీ నిపుణుడు అంటున్నారు. సొరంగాలు ఉన్నా యా, ఉంటే ఎన్ని ఉన్నాయి? అవి ఎక్కడ ఉ న్నాయి? అనేది వాటిని నిర్మించిన వారికే తప్ప ప్రత్యర్థికి తెలిసే అవకా శాలు చాలా తక్కువని ఆయన చెబుతు న్నారు. సైనిక పరమైన నష్టాన్ని తగ్గించేందుకు రోబోట్లను పంపి సంక్లిష్టమైన సొరంగాలను కనిపెట్టొచ్చు. అయితే, లోపల జాగా తక్కువగా ఉండటం, బూబీ ట్రాప్‌లు, ఇతర ఆత్మరక్షణ ఏర్పాట్లను మిలిటెంట్లు ఏర్పాట్లు చేసుకొని ఉండే ఉంటారు. భూగర్భ టన్నెళ్ల వాతావరణం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ బలగాలు అందులోకి ప్రవేశించి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవాల్సి రావచ్చు’అని సవిట్జ్ హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటున్న హమాస్ ‘అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో హమాస్ ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటోంది. ఆయుధాలు, కమాండ్ వ్యవస్థలు, ఫైటర్లను వాటిలోనే దాచిపెడుతోంది. వాటిలోకి వెంటిలేషన్ మార్గాలు, విద్యుత్ తదితర సౌకర్యాలను సైతం సమకూర్చుకుంది. కొన్ని టన్నెళ్లయితే 35 మీటర్ల లోతులో కూడా ఉన్నాయి. రైల్ రోడ్ మార్గాలు, కమ్యూనికేషన్ గదులూ ఉన్నాయి. వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయి’అని నిపుణులు అంటున్నారు. మొదట్లో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించేందుకు వాడారు. సరిహద్దుల అవతల దాడులు జరిపేందుకు సైతం వీటిని ఉపయోగించుకున్నారు. 2006లో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయెల్ జవానును మిలిటెంట్లు సొరంగం ద్వారా దాడి చేసి, ఎత్తుకుపోయారు. అయిదేళ్ల తర్వాత వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాక అతడిని వదిలిపెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel Hamas war: యాపిల్ వాచ్ ద్వారా కూతురి మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా మరణించిన ఓ యువతి మృతదేహాన్ని ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో, మరోవైపు తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వాల్డ్‌మాన్ కుమార్తె డేనియల్ మరణించారు. స్నేహితుడితో కలిసి ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వెళ్లిన డేనియల్ హమాస్ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వాల్డమన్ ఫోన్‌కు అత్యవసర కాల్ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు. అయితే కుమార్తెను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా లోకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్ ఆపిల్ వాచ్ నుంచి సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారిద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వాల్డమన్ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ ఐఫోన్లో క్రాష్ డిటెక్షన్ కాల్ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్ వచ్చినట్లు వాల్డమన్ వెల్లడించారు. ఆ కాల్ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. (బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!) యాపిల్ ఐఫోన్, వాచ్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అందించిన ఫోన్ నంబర్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. -
‘మహిళలపై అత్యాచారాలు, చిన్నారుల హత్యలు.. అయినా ఇజ్రాయెల్ వెళ్తాం’
‘హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భయంకరమైనది, క్రూరమైనది. దీనిని మేము ఊహించలేదు. హమాస్ బాంబ్ దాడికి ఇజ్రాయెల్‌లోని మా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లో మ్యూజిక్ఫెస్టివల్కు హాజరైన 260 మందిని చంపడం బాధాకరం. ఉగ్రవాదులు మహిళలపై అత్యాచారం చేశారు. పిల్లలను కిరాతకంగా చంపుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల్లో మా వాళ్ల భద్రతపై ఆందోళనగా ఉంది.’ ఈ మాటలు భారత్‌లోని ఇజ్రాయెల్ పౌరులు చెబుతున్నవి. ఇండియాలో తాము సురక్షితంగానే ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వెళ్లి విపత్కర సమయంలో శుత్రవులతో పోరాడాలనుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. 3 వేల మంది మృతి ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి మారణహోమం సృష్టిస్తోంది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై రాకెట్లతో దాడికి పాల్పడుతోంది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల దాడిలో ఇప్పటి వరకు పౌరులతో సహా 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్ గ్రూపు పేర్కొంది. ఇటు హమాజ్ దాడిలో 1300 మంది బలవ్వగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. తమ వారి క్షేమంపై ఆందోళన గత ఆరురోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా మిలిటెంట్ల భీకరపోరు ప్రభావం కేవలం ఇజ్రాయెల్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ దేశ పౌరులపై కూడా చూపుతోంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో యుద్ధ ప్రభావిత పాంత్రంలోని తమ సొంతవారి భద్రతపై ఇతర దేశాల్లో నివసించే పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Israelis from around the world have travelled home to join their army units. This was the scene at 2am in Israel’s airport. Citizens came to welcome them home.pic.twitter.com/AgtPv4KeR0 — Aviva Klompas (@AvivaKlompas) October 11, 2023 దేశ సైన్యానికి సాయం చేస్తా.. హమాస్ అకస్మిక దాడిపై భారత్‌లోని ఇజ్రాయిల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ పౌరుల్లో కొంతమంది చాలాకాలంగా ఇక్కడే నివిస్తున్నవారు ఉండగా మరికొంతమంది పర్యటనల కోసం ఇండియాకు వచ్చినవారు ఉన్నారు. అయితే వీలైనంత త్వరగా టూరిస్టులు తమ దేశానికి వెళ్లాలని భావిస్తున్నారు. కులులోని ఇజ్రాయెల్ టూరిస్ట్ అయిన షీరా.. తిరిగి స్వదేశానికి వెళ్లి హమాస్ ఉగ్రవాదుతో పోరాడుతున్న తమ దేశ సైన్యానికి సాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. ఇజ్రాయెల్కుభారత్ మద్దతుగా ఉండటంపై కృతజ్ఞత తెలియజేస్తూ.. ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యం తమ పౌరులను రక్షించుకోవడమేనని, ఇతరులకు హాని చేయడం కాదని పేర్కొంది. ‘మా తమ్ముడు ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్నాడు. అతనితో టచ్‌లో ఉన్నాను. అయినా నాకు భయంగా ఉంది. మా అత్తయ్య దక్షిణ ఇజ్రాయెల్‌లో నివిసిస్తుంది. ఆమె ఇల్లు కూడా పాలస్తీనా ఉగ్రవాదుల బాంబ్ దాడిలో కూలిపోయింది. మా బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. భారత్‌లో మేము సురక్షితంగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. ఇజ్రాయెల్‌లో ఉన్న నా కుటుంబంపై ఆందోళనగా ఉంది. నాకు ఇజ్రాయెల్ వెళ్లేందుకు భయంగా ఉంది. ఇప్పటి వరకు నా దేశానికి తిరిగి వెళ్లడానికి నేను ఎప్పుడూ భయపడలేదు.’ అని హిమాచల్ ప్రదేశ్ఓని కులు జిల్లాలో నివసిస్తున్న కెనెరియత్ తెలిపారు. These young Israelis going back to defend their country should put those celebrating Hamas’ atrocities safely in the West to shame. pic.twitter.com/BNduZhVxEl — Bella Wallersteiner 🇺🇦 (@BellaWallerstei) October 11, 2023 యుద్ధ భూమిలో పోరాడుతా.. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఇజ్రాయెల్ పర్యాటకుడైన అమత్ తన దేశానికి తిరిగి వెళ్లి ఇజ్రాయెల్ రక్షణ దళాలతో కలిసి యుద్ధభూమిలోకి దిగాలనుకుంటున్నట్లు తెలిపాడు.మహిళలు, పిల్లలు, సైనికులపై హమాస్ వికృత దాడుల కారణంగా తాను సైన్యంలోచేరి పోరాడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అక్టోబరు 15న ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పాడు. మినీ ఇజ్రాయెల్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మెక్లియోడ్గంజ్లోని ధరమ్‌కోట్ గ్రామాన్ని 'మినీ ఇజ్రాయెల్' అని కూడా పిలుస్తారు, అక్కడ ఇజ్రాయెల్‌ల జనసాంద్రత ఎక్కుగవగా ఉండటం కారణంగా అలా పిలుస్తారు. ఇజ్రాయెల్‌లోని తమ బంధువుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందదని భావిస్తూ అక్కడి కెమెరాల ముందుకు రావడం లేదు. ఈ సంక్షోభ సమయంలో తమ దేశానికి సేవ చేసేందుకు ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. -
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి : విచారంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్!
ఇజ్రాయెల్‌పై హామాస్ ఉగ్రదాడిపై ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో స్థానిక గూగుల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అండగా నిలుస్తామంటూ ఓ మెసేజ్‌ను షేర్ చేశారు. ఇజ్రాయెల్ - హమాస్ ఉద్రిక్తతలపై సుందార్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. గూగుల్‌కు చెందిన రెండు ఆఫీసుల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్రికతల నేపథ్యంలో వారి అనుభవాలు ఎలా ఉన్నాయో ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఉద్యోగులు భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Deeply saddened by the terrorist attacks in Israel this weekend and the escalating conflict underway. Google has 2 offices and over 2,000 employees in Israel. It’s unimaginable what they’re experiencing. Our immediate focus since Saturday has been on employee safety. We’ve now… https://t.co/VCiboq9oN8 — Sundar Pichai (@sundarpichai) October 10, 2023 స్థానికంగా ఉన్న మా ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి కంపెనీ అండగా నిలుస్తుంది. అదే విధంగా ఇజ్రాయెల్‌లో సహాయక చర్యలు చేపట్టే బృందాలకు మా వంతు సాయం అందిస్తాం’ అని సుందర్ పిచాయ్ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్‌లో ఎట్లున్నరో..?
నిర్మల్ ఖిల్లా: గడిచిన నాలుగు రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా(హమాస్) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశానికి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు ఎలా ఉన్నారో అని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాకెట్లు, లాంచర్ల దాడిలో వందలాది మంది మృతి చెందుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుండడంతో ప్రవాస భారతీయ కుటుంబీకుల్లో అలజడి చెలరేగుతోంది. భారతదేశానికి మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్‌లో నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిర్మల్, భైంసా తదితర ప్రాంతాల నుంచి వెళ్లిన దాదాపు 150 మంది యువకులు ఉన్నట్లు సమాచారం. దాడులు జరుగుతున్న ప్రాంతంలో వీరు పనులు నిర్వర్తిస్తున్నారు. సాక్షితో మాట్లాడిన బాధితులు.. ఉపాధి నిమిత్తం వెళ్లిన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన ఇజ్రాయెల్ తెలంగాణ ప్రవాసీ అసోసియేషన్ సభ్యుడైన బిక్కునూరు రాజు ’సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. తామంతా ఇప్పటి వరకు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. హమాస్ ఆకస్మికంగా జరుపుతున్న దాడులతో బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లా నుంచి తమ 20 మంది సభ్యుల బృందం యుద్ధ సైరన్ మోగగానే బంకర్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. దాడులు జరుగుతున్న సమీప ప్రాంతాలలో ఉమ్మడి జి ల్లావాసులు స్వల్పసంఖ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏదైనా యుద్ధ రాకెట్, మిస్సైల్ వంటివి దూసుకొ స్తున్న కొద్దీ నిమిషాల ముందు సైరన్ మోగుతుందన్నారు. వెంటనే అక్కడి సమీప ప్రాంతాల్లోని ప్రజ లందరూ అప్రమత్తం కావాల్సి ఉంటుందని తెలిపా రు. తాము నివసించే ప్రతి అపార్ట్మెంట్లో బంకర్ సదుపాయం ఉందని పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్ సూపర్ నోవా ఫెస్టివల్‌పై హమాస్ దాడి.. అసలేం వేడుకిది..?
జెరూసలెం: ఇజ్రాయెల్‌లో సూపర్ నోవాగా పేరుగాంచిన బహిరంగ మ్యూజికల్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. వందలాది మంది సాధారణ ప్రజలు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. ఆనందంగా జరగాల్సిన మ్యూజిక్ ఈవెంట్లో క్షతగాత్రుల ఆర్తనాదాలతో మరణమృదంగం వినిపించింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉన్న వివాదంతో హమాస్ దాడులు చేయగా.. ఇరువైపుల దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ సూపర్ నోవా ఫెస్టివల్ అంటే ఏమిటి..? ఎందుకు దాన్నే టార్కెట్‌గా ఉగ్రదాడులు జరిగాయి..? సూపర్ నోవాను యూనివర్సల్ పారలెల్లో ఫెస్టివల్ అని కూడా అంటారు. గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీమ్‌లో జరిగింది. సూపర్ నోవా పండుగను యూదులు వారంపాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ 29, 2023 నుంచి అక్టెబర్ 6, 2023 వరకు జరిగే వేడుక. పంట సేకరణను ఉద్దేశించి జరుపుకునే వేడుక ఇది. పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ ఐక్యమత్యం, ప్రేమలకు గుర్తుగా మనసుకు హత్తుకునే అంశాలతో కూడుకుని ఉంటుంది. గత శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అయింది. పండుగ సందర్భంగా వేలాది మంది యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాత్రిపూట గాజా సరిహద్దును దాటుకుని వందిలాది రాకెట్ దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గన్లతో దాదాపు 3500 మంది ఇజ్రాయెల్ యువతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వేడుకలో చాలా మంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా.. బైక్‌లపై వచ్చిన దుండగులు ఏకే-47 వంటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. భయంతో పరుగులు తీస్తున్న జనం, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.. పూర్తి దిగ్బంధంలో గాజా..
పాలస్తీనా మిలిలెంట్లు హమాస్, ఇజ్రాయెల్ మధ్య మూడు రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ పోరులో ఇప్పటి వరకు 1100 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఇజ్రాయెల్‌లోనే 44 మంది సైనికులతోపాటు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లో చొరబడి దాడులు మొదలు పెట్టింది హమాజ్ అయినా.. ఇజ్రాయెల్ సైన్యం సైతం గాజాపై విరుచుకుపడుతోంది. రాకెట్లు, మిస్సైల్స్‌తో దాడులు జరుపుతోంది. హమాస్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది.హమాస్ అధీనంలో ఉన్న గాజాను సైతం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరలైన కరెంట్, ఆహారం, ఇంధనంను నిలిపివేసింది. కాగా శనివారం ఉదయం హమాజ్ దాడి మొదలైనప్పటి నుంచి.. ఇజ్రాయెల్ గాజాకు విద్యుత్‌ను కట్ చేయంతో అంధకారాన్ని ఎదుర్కొంటుంది. దీనిపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవో గల్లాంట్ మాట్లాడుతూ.. గాజాను పూర్తిగా దిగ్భంధించమని ఆదేశించినట్లు తెలిపారు. ఇక అక్కడ విద్యుత్, ఆహారం, నీరు, అందదని తెలిపారు. తాము మానవ మృగాలతో పోరాడుతున్నామని, దానికి తగ్గట్లే తమ పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2007లో పాలస్తీనా బలగాల నుంచి హమాస్ అధికారాన్ని చేజిక్కించుకునన్నప్పటిన ఉంచి గాజాపై ఇజ్రాయెల్, ఈజిప్టు వివిధ స్థాయిలో దిగ్భంధనాలు విధించాయి. గాజా.. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంతో వారంతా బిక్కుబిక్కుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సము ద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు. -
ఇజ్రాయెల్‌పై దాడులు.. నిర్ఘాంతపోయిన గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం
తెనాలి: ఇజ్రాయెల్‌పై దాడులతో గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డిపాలెంలోని యూదు సమాజం నిర్ఘాంతపోయింది. అతి ముఖ్యమైన పండగ సంబరాలను రద్దు చేసుకుంది. కేవలం ఇజ్రాయెల్‌లో శాంతిని కాంక్షిస్తూ ధర్మశాస్త్రాన్ని ప్రార్థించడంతో సరిపెట్టుకున్నారు. అక్కడి మృతులకు నివాళి అర్పించారు. పురాతన సునగోగు.. ఆంధ్రప్రదేశ్‌లోని యూదుల పురాతన ప్రార్థన మందిరం ‘బెనె యాకోబు సునగోగు’. జిల్లాలోని చేబ్రోలు మండల గ్రామం కొత్తరెడ్డిపాలెంలో ఉంది. వందల ఏళ్లుగా తెలుగు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఇజ్రాయెల్ మూలాల యూదుల్లో మాతృభాష, ఆచార వ్యవహారాల పరిరక్షణ ఈ సమాజ మందిరం కేంద్రంగా కొనసాగుతోంది. మందిరం నిర్వాహకుడు, ఏడుగురు పెద్దల నాయకత్వంలో అక్కడ 40 కుటుంబాలు తమ మూలాలను కాపాడుకుంటూ వస్తున్నాయి. వీరంతా యూదు జాతి సంతతిలోని ఎఫ్రాయిమ్ గోత్రికులు. ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన వారున్నారు. అందరికీ యూదు పేరు, హిందూ పేరు ఉంటాయి. స్వయంగా రక్తాన్ని చిందించిన మాంసాన్నే (కౌషర్) ముడతారు. దేవుడి పేరును వీరు ఉచ్ఛరించరు. ప్రతి శనివారం విశ్రాంతి దినం ‘సబ్బాత్’. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ గడుపుతారు. ఆదివారం తమ మాతృభాష అయిన హిబ్రూ స్కూలును నడుపుతూ భాషను ముందుతరాలకు అందిస్తున్నారు. హిబ్రూ క్యాలెండరు ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ఇది 5784 సంవత్సరం. ముఖ్యమైన ఏడు పండుగలను జరుపుకొంటారు. సృష్టి పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ఏటా ‘తిష్రి’ నెల సెప్టెంబరు ఒకటో తేదీన వస్తుంది. మరో పదిరోజులకు ప్రాయశ్చిత్త పండుగ (యోమె కిఫ్ఫూర్), తర్వాత పర్ణశాలల పండుగ (సుక్కోత్)ను ఏడురోజులు జరుపుకొంటారు. 8వ రోజున ‘ధర్మశాస్త్రం నందు ఆనందించటం’ (సింహత్వర) చేస్తారు. సింహత్వర సంబరాలు రద్దు.. కొత్తరెడ్డిపాలెం యూదులు 5784 సంవత్సరం పర్ణశాలల పండుగను చేసుకున్నారు. ఆదివారం 8వ రోజైన ‘సింహత్వర’ను జరుపుకోవాల్సి ఉంది. ఇందుకు కొన్ని గంటల ముందుగానే ఇజ్రాయెల్‌లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి వేల రాకెట్లు ప్రయోగించటం, ఈ దాడుల్లో ఇజ్రాయెలీలు పలువురు మరణించిన సమాచారం తెలియటంతో ఇక్కడి యూదులు కలవరం చెందారు. పండుగల సంబరాలతో ఆరంభం కావాల్సిన రోజు ‘బెనె యాకోబి సునగోగు’ విచారంలో మునిగింది. వాస్తవానికి ఈ రోజు, భద్రపరిచిన ‘ధర్మశాస్త్రం’ను వెలుపలికి తీసి, సంఘీయులంతా కలిసి మందిరం చుట్టూ ఏడు ప్రదక్షిణ చేస్తారు. ‘ఇజ్రాయెల్లోనైతే వీధుల్లో ఊరేగిస్తారు...ఇక్కడ ఇతర కులాలు, మతాలు ఉంటున్నందున కేవలం మందిరం చుట్టూనే తిప్పుతాం’ అని మందిర నిర్వాహకుడు సాదోక్ యాకొబి చెప్పారు. డ్రమ్స్ వాయిద్యాల హోరులో పాటలు, నృత్యాలతో అంతా ప్రదక్షిణలో పాల్గొంటారు. ధర్మశాస్త్రం ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటారు. విందు చేస్తారు. యూదులకే ధర్మశాస్త్రం సొంతం అంటారు వీరు. ఇందులో 613 ఆజ్ఞలు ఉంటాయి. మిగిలినవారికి ఏడు ఆజ్ఞలు మాత్రమే ఉంటాయి. అందుకే ఆ ప్రత్యేకతను ‘సింహత్వర’గా సంబరం చేసుకుంటాం’ అని అని సాదోక్ యాకొబి వివరించారు. శాంతి కోసం ప్రార్థనలు.. ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ల దాడులతో కలత చెందిన వీరంతా సింహత్వర పండుగను రద్దుచేసుకున్నారు. మందిరంలోని ధర్మశాస్త్రాన్ని భక్తిశ్రద్ధలతో బయటకు తీశారు. అంతా కలిసి ప్రార్థనలు శారు. ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొనాలని కోరుకున్నారు. దాడులకు పాల్పడినవారికి తగిన తీర్పు జరుగుతుందని ఆకాంక్షించారు. చివరగా మృతులకు నివాళులర్పించారు. సాదిక్ యాకోబి ఆధ్వర్యలో షమూయేల్ యాకోబి, దావీదు, విజయసింహ, మిరియం విక్టోరియా, ఆనందపాల్ తదితరులు పాల్గొన్నారు. 2004లోనే వీరి ఉనికి వెల్లడి... క్రీస్తుపూర్వం 772, 445ల్లో టర్కీ, బబులోన్ దాడులతో చెల్లాచెదరైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్‌కు చేరుకున్నారు. మరికొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. బ్రిటిష్ హయాంలో ఒకరికి ఉద్యోగం రావటంతో మకాం కొత్తరెడ్డిపాలెంకు మారింది. 1909లో పూరిపాకలో ఆరంభించిన సమాజ మందిరాన్ని 1991లో పునర్నిర్మించారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం, లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. రాష్ట్రంలో మొత్తం 125 యూదు కుటుంబాలు ఉంటున్నాయని అంచనా. -
పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి
బీరుట్: సిడాన్ దక్షిణ పోర్టు నగరంలో పాలస్తీనా శరణార్ధులున్న శిబిరంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగాయి. ఇస్లాం ఉగ్రవాది మహమ్మద్ ఖలీల్‌ను హతమార్చే క్రమంలో అతని అనుచరుడిని చంపడంతో అల్లర్లు చెలరేగాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుండి వలస వచ్చిన 55,000 మంది పాలస్తీనీయులు ఉంటున్న ఈ శరణార్థుల శిబిరంలో ఒక్కసారిగా తుపాకులతోను, గ్రెనేడ్లతోనూ కాల్పులు జరిగాయి. మిలిటెంట్లకు మిలటరీ సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడ్డారని అధికారులు అన్నారు. చనిపోయినవారిలో ఐక్యరాజ్యసమితి తరపున శరణార్ధుల యోగక్షేమాలు చూడటానికి వచ్చిన యూఎన్ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులు, ఫతాహ్ గ్రూపుకు చెందిన పాలస్తీనా మిలటరీ జనెరల్ తోపాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: ట్విట్టర్ పేరు మార్పు నా చావుకొచ్చింది.. ఆ రోజు నుండి నిద్ర లేదు.. -
పాలస్తీనా ఉగ్రవాదుల ఏరివేత.. ఇజ్రాయెల్ భారీ సైనిక ఆపరేషన్
జెనిన్: శరణార్థుల శిబిరాల్లో మాటు వేసిన పాలస్తీనా ఉగ్రవాదులను ఏరివేయడం, వారి ఆయుధాలను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల క్యాంప్‌లో సోమవారం నుంచి విస్తృతంగా సోదాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సైతం దాడులు కొనసాగాయి. దీంతో వేలాది మంది పాలస్తీనా శరణార్థులు సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. దాదాపు 4,000 మంది పాలస్తీనా శరణార్థులు బయటకు వెళ్లిపోయారని జెనిన్ నగర మేయర్ నిడాల్ అల్–ఒబిడీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. వారంతా ఉగ్రవాదులేనని ఇజ్రాయెన్ సైన్యం చెబుతున్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని, జెనిన్ క్యాంప్‌లో మసీదు కింద ఉన్న సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. జెనిన్ క్యాంప్‌లో ఈ స్థాయిలో సైనిక ఆపరేషన్ జరుగుతుండడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ వాసులపై ఇటీవలి కాలంలో దాడులు జరుగుతున్నాయి. గతనెలలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అంతేకాకుండా పాలస్తీనా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. తమ పౌరులకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులను ఏరివేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ వెస్ట్‌బ్యాంక్‌లు పాలస్తీనా పౌరులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జెనిన్ సిటీపై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులకు గట్టిపట్టుంది. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్‌ను 1967లో జరిగిన యుద్ధంలో పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ స్వా«దీనం చేసుకుంది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ సైనిక వాహనం వద్ద బాంబు పేలుడు దృశ్యం -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు..ఐదుగురు మృతి
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజధానిలోని నివాస భవనసముదాయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని ప్రభుత్వ వార్తా సంస్థ సనా పేర్కొంది. వందల ఏళ్లనాటి కోట, ఒక కళాశాల ధ్వంసమయ్యాయని వివరించింది. ఇరాన్ అనుకూల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 15 మంది చనిపోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. -
4 వారాల కనిష్టం
ఇరాక్ మిలటెంట్లపై వైమానిక దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సైన్యానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా ఆందోళనలు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు వంటి అంశాలు సైతం దీనికి జత కలిశాయి. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షల నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి ఆహార సరుకుల దిగుమతులను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తాజాగా నిషేధించడం ప్రపంచ ఇన్వెస్టర్లలో భయాలు రేపింది. వెరసి ఇండియాసహా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు క్షీణించి 25,329 వద్ద ముగిసింది. ఇది నాలుగు వారాల కనిష్టంకాగా, నిఫ్టీ సైతం 81 పాయింట్లు పతనమై 7,569 వద్ద స్థిరపడింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 579 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మరిన్ని సంగతులివీ... బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ రంగాలు 4-1.5% మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడగా భారతీ ఎయిర్టెల్ 2% ఎగసింది. ఇతర దిగ్గజాలలో సెసా స్టెరిలైట్ దాదాపు 6% దిగజారింది. ఈ బాటలో టాటా పవర్, భెల్, టాటా స్టీల్, హిందాల్కో, ఎల్అండ్టీ, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4-2% మధ్య క్షీణించాయి. బీఎస్ఈ-500లో పుర్వంకారా 15% పడిపోగా, భూషణ్ స్టీల్, సి.మహీంద్రా, వర్ధమాన్, బాంబే డయింగ్, జిందాల్ స్టెయిన్లెస్, రేమండ్, హెచ్‌సీసీ, ధనలక్ష్మీ బ్యాంక్, బీజీఆర్ 10-6% మధ్య పతనమయ్యాయి. -
అమెరికాపై నిఘా పెట్టిన ఇజ్రాయిల్!
బెర్లిన్: ప్రపంచ దేశాలపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టే అమెరికాపైనే ఇజ్రాయెల్ నిఘాపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరిగిన శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీపై ఇజ్రాయెల్ గూఢచారులు, మరో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు నిఘాపెట్టినట్లు జర్మనీకి చెందిన వారపత్రిక దెర్ స్పీగెల్ ఆదివారం కథనాన్ని ప్రచురించింది. పశ్చిమాసియా దేశాలకు చెందిన ఉన్నతాధికారులతో కెర్రీ జరిపిన ఫోన్ సంభాషణలను ఇజ్రాయెల్ గూఢచారులు ట్యాప్ చేసినట్లు పేర్కొంది. అప్పుడు కెర్రీ ట్యాపింగ్‌కు గురయ్యే శాటిలైట్ కనెక్షన్లుగల సాధారణ ఫోన్లనే వాడినట్లు వివరించింది. పశ్చిమాసియా దేశాలతో దౌత్య పరిష్కార చర్చల్లో ఈ నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం వాడుకుందని పత్రిక తెలిపింది. అప్పట్లో కెర్రీ జరిపిన ఇజ్రాయిల్ -పాలస్తీనాల శాంతి దౌత్యం ఫలించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే జూలై 8వ తేదీన గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ 1,650 మంది పాలస్తీనియన్లు మరణించగా, 65 మంది ఇజ్రాయిల్ వాసులు అసువులు బాసారు. -
గాజాపై దాడులను విస్తృతం చేసిన ఇజ్రాయిల్
గాజా: గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత విస్తృతం చేసింది. కాల్పుల విరమణ అమలులోఉన్నా లేకున్నా, దాడులు కొనసాగుతాయని, గాజాలో హమాస్ మిలిటెంట్ల సొరంగ మార్గాల వ్యవస్థను ధ్వంసంచేసి తీరుతామని ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది. 24రోజుల సైనిక దాడులను మరింత విస్తృతం చేసేందుకు అదనంగా 16వేలమందితో కూడిన రిజర్వ్ సైనిక బలగాన్ని సమీకరించింది. దీనితో దాడుల్లో పాల్గొంటున్న రిజర్వ్ బలగాల సంఖ్య 86వేలకు చేరింది. ఇక ఇజ్రాయెల్ ఇప్పటివరకూ జరిపిన దాడుల్లో 1,374మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజానుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడేందుకు హమాస్ నిర్మించిన సొరంగమార్గాలన్నింటినీ ధ్వంసంచేసేందుకు ఇజ్రాయెల్ కృతనిశ్చయంతోఉందని, తమ సైన్యం ఈ పనిలోనే ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. -
మేమంతా ఇక్కడి వారమే...
* పాకిస్థానీయులు అనడం సరైంది కాదు * గాజాపై ఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టాలి * హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్: ‘మేమంతా ఇక్కడి వారమే... మమ్మల్ని పాకిస్థానీయులు అనడం సరైంది కాదు... అసద్ పాకిస్థాన్‌కు వెళ్లూ అంటున్నారు బీజేపీ వారు... మా తాత ముత్తాతలు ఇక్కడి వారే... నేనెందుకు పాకిస్థాన్‌కు వెళ్తాను... ఈ దేశం బీజేపీ వారి జాగీరా... హమారా బాప్, దాదేకా జాగీర్ హై... అప్పట్లో పాకిస్థాన్‌కు వెళ్లిన వారు వెళ్లిపోయారు... ఉన్న వాళ్లంతా ఇక్కడి వారే... ముస్లింలపై కామెంట్ చేస్తున్న బీజేపీ ఎంపీలందరికి ట్రైనింగ్ ఇవ్వూ ప్రధాని నరేంద్ర మోడీ’... అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ, శివసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలోని ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని మక్కా మసీదులో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో యౌముల్ ఖురాన్ పఠన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ... పార్లమెంటులో తానెప్పుడు లేచి మాట్లాడానికి ప్రయత్నించినా బీజేపీ ఎంపీలు అడ్డుకొని ఏ పాకిస్థానీ బైఠో...(ఓ పాకిస్థానీ కూర్చో) అంటూ వెటకారం చేస్తారని... అందుకే వారికి కనువిప్పు కలిగే విధంగా జవాబు ఇస్తానన్నారు. అమెరికా ప్రోద్బలంతోనే ఇజ్రాయిల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోందని... దీనిని ప్రతి ముస్లిం ఖండించాల్సిన అవసరముందన్నారు. -
గాజాపై భీకర దాడులు
గాజా/జెరూసలెం: హమాస్ ప్రాబల్యం ఉన్న గాజాలో పలు ప్రాంతాలపై మంగళవారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. గాజాలోని అనేక మసీదులు, ఆసుపత్రి, స్టేడియంపై కూడా ఇజ్రాయెల్ బాంబులవర్షం కురిపించింది. దాడుల్లో పలు మసీదులు, ఆసుపత్రి, స్టేడియం ధ్వంసమయ్యాయి. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు, గాజా ప్రాంతంలోని 190 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకూ 604 మంది పాలస్తీనియన్లు, 29మంది ఇజ్రాయెలీలు మరణించారు. ఇరుపక్షాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సంస్థల యత్నాలు ఫలించటం లేదు. హింసాకాండకు స్వస్తిచెప్పాలంటూ అమెరికా, ఐక్యరాజ్యసమితి ఉభయపక్షాలకు విజ్ఞప్తిచేశాయి.