9 మంది పాలస్తీనియన్లు మృతి
ఇక ‘అతిపెద్ద’ ఆపరేషన్!
ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది.
వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.
ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment