West Bank
-
మీడియా సంస్థకు ఇజ్రాయెల్ సైనికుల వార్నింగ్
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్ రమల్లాలోని ఖతార్ బ్రాడ్‌కాస్టర్ అల్ జజీరా ఆఫీసులో ఆదివారం సోదాలు చేశారు ఇజ్రాయెల్ సైనికులు. ఒక్కసారిగా ముసుగులు ధరించిన ఇజ్రాయెల్ సైనికులు అల్ జజీరా భవనంలోకి ప్రవేశించారు. సిబ్బంది ఆఫీసులో ఉన్న కెమెరాలు తీసుకొని త్వరగా అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఛానెల్ ఆఫీసును మూసివేయాలని అల్ జజీరా నెట్వర్క్ వెస్ట్‌బ్యాంక్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమారీను ఆదేశించారు. ఛానెల్ ప్రసారాలను 45 రోజుల్లో పూర్తిగా నిలిపివేయాలని సైనికులు చెప్పగా.. ఆయన లైవ్‌లోనే చదివినట్లు స్థానిక మీడియా పేర్కొంది.HAPPENING NOW:Israeli soldiers are raiding Al Jazeera’s office in Ramallah and forcing it to stop broadcasting in the West Bank for 45 days.Israel is planning something terrifying across the West Bank, and doesn’t want the world to see. pic.twitter.com/mVr07W6A6M— sarah (@sahouraxo) September 22, 2024ఇక.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ అల్ జజీరా కార్యకలాపాలను ఇజ్రాయెల్‌లో ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మేలో నెలలో అల్ జజీరా.. తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న జెరూసలేం హోటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆదివారం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.బలవంతంగా 45 రోజుల్లో ప్రసారాలు పూర్తిగా నిలిపివేయాలని నిషేధం విధించడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కులు, సమాచారాన్ని పొందే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే నేరపూరిత చర్య అని అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ మీడియాపై కొనసాగిస్తున్న అణచివేత అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.చదవండి: లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం -
వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లో కాల్పులు ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి
అల్లెన్బీ క్రాసింగ్: వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లోని అల్లెన్ బీ క్రాసింగ్ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోయారు. జోర్డాన్ వైపు నుంచి ట్రక్‌లో క్రాసింగ్ వద్దకు చేరుకున్న సాయుధులు భద్రతా బలగాల వైపు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బలగాల ఎదురుకాల్పుల్లో ఆగంతకుడు చనిపోయాడని ఆర్మీ తెలిపింది. ఘటనపై జోర్డాన్ దర్యాప్తు చేపట్టింది. జోర్డాన్ నదిపై ఈ మార్గాన్ని ఎక్కువగా పాలస్తీనియన్లు, విదేశీ టూరిస్టులు, సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. తాజా ఘటన నేపథ్యంలో ఈ క్రాసింగ్‌ను అధికారులు మూసివేశారు. అమెరికా, పశ్చిమదేశాలకు అనుకూలంగా పేరున్న జోర్డాన్ 1994లో ఇజ్రాయెల్‌లో శాంతి ఒప్పందం చేసుకుంది. -
Israel-Hamas war: గాజాలో 89 మంది మృత్యువాత
గాజా: గాజాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బలగాలు 48 గంటల వ్యవధిలో జరిపిన దాడుల్లో 89 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో శనివారం ఒక్క రోజే 48 మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపైనా దాడికి దిగిందని, ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు వివరించింది. రోగులు, వారి సంబంధీకులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్ ఆర్మీ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో శనివారం గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ఖాన్ యూనిస్ ఆస్పత్రిలో 10 మంది శిశువులకు టీకా వేశారని అధికారులు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ చుట్టుముట్టింది. నాలుగు రోజులుగా ఇక్కడ దాడులు జరుపుతున్న ఆర్మీ నగరాన్ని మిగతా ప్రపంచంతో సంబంధాలు లేకుండా తెంచేసింది. మిలటరీ జీపులు, సాయుధ బలగాల వాహనాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ధ్వంసమైన కాంక్రీట్ గోడలు, శిథిల భవనాలు దర్శనమిస్తున్నాయి. -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి పాలస్తీనా ఉగ్రవాదుల మృతి
గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులను కొనసాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు.. స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంటోంది. తాజాగా తమ సైన్యం చేతిలో ఐదుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని ఓ మసీదులో దాక్కుకొని ఉన్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపినట్లు పేర్కొంది. ఈ ఐదుగురిలో ఒక స్థానిక కమాండర్ మహ్మద్ జాబర్ అలియాస్ అబూ షుజా ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చేసిన పలు దాడుల్లో అబూ షుజా హస్తం ఉన్నట్లు ఆర్మీ పేర్కొంది. జూన్‌లో జరిపిన భారీ కాల్పులకు అబూ షుజా ప్లాన్ చేసినట్టు తెలిపింది.అబూ షుజా గతంలోనే మృతి చెందినట్లు పలు నివేదికలు వెల్లండించాయి. అయితే పలువురు మిలిటెంట్ల అంత్యక్రియల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలోని ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ మహ్మద్ జాబర్ మృతిపై పాలస్తీనా ఇంకా ధృవీకరించకపోవటం గమనార్హం. బుధవారం నుంచి పాలస్తీనాపై చేస్తున్న ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది ఫైటర్లు మృతి చెందినట్లు హమాస్ మలిటెంట్ సంస్థ పేర్కొంది. -
Israel-Hamas war: వెస్ట్‌బ్యాంక్‌పై భీకర దాడి
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
గాజా, సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Israel-Hamas war: హమాస్‌పై ముప్పేట దాడి
రఫా(గాజా్రస్టిప్)/జెరూసలేం/న్యూఢిల్లీ/టెల్ అవీవ్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇజ్రాయెల్ భీకర యుద్ధం ప్రారంభించింది. ఇప్పటిదాకా గాజాలో వైమానిక దాడులు నిర్వహించగా, ఇక సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్ స్థావరాలపైనా దృష్టి పెట్టింది. గాజాతోపాటు సిరియాలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుపై క్షిపణులు ప్రయోగించింది. శనివారం రాత్రి మొదలైన ఈ దాడుల ఆదివారం కూడా కొనసాగాయి. మూడు ప్రాంతాల్లోని టార్గెట్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్ మసీదును హమాస్ మిలిటెంట్లు అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నారని, అందుకే ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సిరియా ఎయిర్‌పోర్టులపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. రన్వేలు దెబ్బతిన్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దళాలు సైతం ప్రతిదాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైన్యం సన్నద్ధతపై నెతన్యాహూ సమీక్ష ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఇప్పటివరకు గాజాలో 4,385 మంది జనం మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించారు. గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ శనివారం రాత్రి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో సైన్యం సన్నద్ధతపై ఈ భేటీలో సమీక్ష సమాచారం. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో వేలాదిగా ఇజ్రాయెల్ సైనికులు మోహరించారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే 7 లక్షల మంది జనం దక్షిణ గాజాకు వెళ్లిపోయినట్లు అంచనా. అనూహ్య స్థాయిలో ‘తదుపరి దాడి’ గాజాపై జరుగుతున్న వైమానిక దాడులు ‘యుద్ధంలో తదుపరి దశ’కు రంగం సిద్ధం చేయడానికేనని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు. తదుపరి దాడి అనూహ్య స్థాయిలో ఉంటుందని అన్నారు. తమ పదాతి దళాలు గాజా భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీలుగా సానుకూల పరిస్థితులు సృష్టించడానికి వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడే తదుపరి దశ యుద్ధంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని అన్నారు. హమాస్‌ను అంతం చేయడానికి గాజాలో అడుగుపెడతామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవీ చెప్పారు. మిలిటెంట్ల సన్నద్ధతను తక్కువ అంచనా వేయొద్దని తమ సైన్యానికి సూచించారు. ఆయన తాజాగా ఇజ్రాయెల్ సైనికాధికారుతో సమావేశయ్యారు. గాజాలో ప్రవేశించిన తర్వాత ఊహించని పరిణామాలకు సైతం సిద్ధంగా ఉండాలని అన్నారు. కిక్కిరిసిన జనాభాతో గాజా స్ట్రిప్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. శత్రువులు మన కోసం అక్కడ ఎన్నో యుద్ధ రీతులను సిద్ధం చేసి పెట్టారని, మన ప్రతిస్పందన అత్యంత చురుగ్గా, వేగంగా ఉండాలని సూచించారు. ఇజ్రాయెల్ తాజా హెచ్చరిక గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణం గాజాకు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. అలా వెళ్లనివారిని హమాస్ మిలిటెంట్ల సానుభూతిపరులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే మొబైల్ ఫోన్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు చేరవేశారు. ‘‘ఉత్తర గాజాలో మీకు ముప్పు పొంచి ఉంది. దక్షిణ గాజాకు వెళ్లకుండా ఉత్తర గాజాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నవారిని హమాస్ సానుభూతిపరులుగా పరిగణిస్తాం’’ అని అందులో పేర్కొన్నారు. పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం గాజాలోని పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. 6.5 టన్నుల ఔషధాలు, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని పంపించింది. ఔషధాలు, సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానం ఆదివారం భారత్ నుంచి నుంచి బయలుదేరింది. ఇది ఈజిప్టులోని ఎల్–అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. మానవతా సాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో గాజాకు చేరవేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అత్యవసర ప్రాణ రక్షక ఔషధాలు, సర్జికల్ సామగ్రి, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్టు, శానిటరీ వస్తువులు, నీటి శుద్ధి మాత్రలు తదితర సామగ్రిని గాజాకు పంపించినట్లు తెలియజేశారు. పాలస్తీనియన్లకు మరింత సాయం పంపిస్తామని వెల్లడించారు. గాజాలో సామన్య ప్రజల మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొమమ్మద్కు అబ్బాస్‌కు ఫోన్ చేసి, సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు నుంచి గాజాకు రెండో షిప్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడులతో అల్లాడిపోతున్న గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం ఇప్పుడిప్పుడే చేరుతోంది. నిత్యావసరాలు, ఇతర సహాయక సామగ్రితో కూడిన 17 వాహనాలు ఆదివారం ఈజిప్టు నుంచి గాజాలో అడుగుపెట్టాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో షిప్మెంట్. శనివారం 20 వాహనాలు ఈజిప్టు నుంచి గాజాకు చేరుకున్నాయి. -
వెస్ట్‌బ్యాంక్‌లో ముగిసిన సైనిక ఆపరేషన్
వెస్ట్‌బ్యాంక్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ బుధవారం ముగిసింది. ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి వెళ్లిపోయాయి. సోమవారం, మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది పాలస్తీనావాసులు, ఒక ఇజ్రాయెలీ జవాను మృతిచెందారు. తాము నిర్వహించిన డ్రోన్ దాడుల్లో చనిపోయినవారంతా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. జెనిన్ శరణార్థుల శిబిరంలో భయం ఇంకా తొలగిపోలేదు. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నారు. ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా తిరిగివస్తున్నారు. క్యాంప్‌లో ఎక్కడ చూసినా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా పునరుద్ధరించలేదు. ఇంటర్నెట్ సేవలు సైతం ఆగిపోయాయి. డ్రోన్ దాడ్రుల్లో మిలిటెంట్ ముఠాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్ నుంచి ఉగ్రవాదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సైనిక ఆపరేషన్లు పునరావృతం కావడం తథ్యమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. జెనిన్ శివారులోని ఓ సైనిక స్థావరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. -
అక్కడంతా మృత్యుభయం! మురికివాడలో శరణార్ధుల గోస
ఇజ్రాయెల్ ఆక్రమిత ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల శిబిరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి వచి్చంది. జెనిన్ క్యాంప్‌లో ఉగ్రవాదులను ఎరివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది. జెనిన్ రెఫ్యూజీ క్యాంప్‌నకు దాదాపు ఏడు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌ల మధ్య ఘర్షణలకు ఈ ప్రాంతం వేదికగా మారుతుండడంతో శరణార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చెల్లాచెదురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ వల్ల గత 3 రోజుల్లో వేలాది మంది జెనిన్ క్యాంప్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాంప్ ఎందుకు ఏర్పాటయ్యిందో, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకుందాం.. శరణార్థుల గడ్డ.. మిలిటెంట్ల అడ్డా అమెరికాతోపాటు పశి్చమ దేశాల అండతో 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. విస్తీర్ణంలో చిన్నదైనా తన చుట్టుపక్కల దేశాల భూభాగాలను బలప్రయోగంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతాలన్నీ యూదు రాజ్యంలో అంతర్భాగమేనని వాదించింది. అలా పొరుగు దేశమైన పాలస్తీనాపై కన్నేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులను తట్టుకోలేక పాలస్తీనా పౌరులు సొంత ఊళ్లు వదిలేసి శరణార్థులుగా మారి వలసబాట పట్టారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం 1950వ దశకంలో పాలస్తీనా శరణార్థుల కోసం వెస్ట్‌బ్యాంక్‌లో పలు శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్. నిజానికి ఇదొక మురికివాడ అని చెప్పొచ్చు. పేదరికానికి, ఆకలి చావులకు మారుపేరు. పాలస్తీనా మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం జెనిన్‌ను అడ్డాగా మార్చుకున్నారు. తరచుగా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ల చర్య స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సాయుధ తిరుగుబాటు అని పాలస్తీనా సానుభూతిపరులు చెబుతుండగా, అది ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పాలస్తీనియన్ మిలిటెంట్ కమాండ్ సెంటర్లు జెనిన్లో ఉన్నాయని అంటోంది. వేలాది మందికి ఆవాసం జెనిన్ క్యాంప్ పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 18,000 మంది నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అసలైన లెక్క ఎంతన్నది తెలియదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం 14,000 మంది ఉంటున్నారు. 2020 నాటి పాలస్తీనా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 12,000 మంది శరణార్థులు నివసిస్తున్నారు. యుద్ధానికి దారితీసిన ఆత్మాహుతి దాడి జెనిన్ క్యాంప్‌లో 2002లో జరిగిన ఘర్షణలో 50 మందికిపైగా పాలస్తీనా జాతీయులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు బలయ్యారు. యూదు సెలవు దినం సందర్భంగా మతపరమైన వేడుక కోసం గుమికూడిన యూదు జాతీయులపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది యూదు జాతీయులు మరణించారు. దాంతో మిలిటెంట్ల భరతం పట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌పై విరుచుకుపడింది. పాలస్తీనాలోకి సైతం సైన్యం అడుగుపెట్టింది. రమల్లా నగరంలో అప్పటి పాలస్తీనా అధినేత యాసర్ ఆరాఫత్ ఇంటిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సైనికులు, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ కొన్ని రోజులపాటు హోరాహోరీగా యుద్ధంకొనసాగింది. ఇరువైపులా ప్రాణనష్టంతో యుద్ధం ముగిసింది. జెనిన్ క్యాంప్ అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. దీనివెనుక పలు కారణాలు కనిపిస్తున్నారు. మిలిటెంట్ల దుశ్చర్యపై ఆగ్రహావేశాలు రెండు వారాల క్రితం జెనిన్ క్యాంప్‌లో మిలిటెంట్లు రెచి్చపోయారు. జెనిన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ ప్రయోగించారు. దీంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఏడుగురు ఇజ్రాయెల్ జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిలిటెంట్ల దుశ్చర్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనంలోనే ఉగ్రవాదులు రెచి్చపోతున్నారంటూ ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెరిగింది. దానికితోడు వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిలర్స్‌లో ఎక్కువమంది నెతన్యాహూ మద్దతుదారులే ఉన్నారు. మిలిటెంట్లను కఠినంగా అణచివేయాలంటూ వారు సైతం ఒత్తిడి తెచ్చారు. దాంతో జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు నెతన్యాహూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. జెనిన్లో శరణార్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముష్కరుల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా? ఇటీవలి కాలంలో బెంజమిన్ నెతన్యాహూ రాజకీయంగా కొంత బలహీనపడ్డారు. ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్‌బ్యాంక్‌లో జెనిన్తోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ ముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఆయనకు ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షి, నేషనల్ డెస్క్ -
పాలస్తీనా ఉగ్రవాదుల ఏరివేత.. ఇజ్రాయెల్ భారీ సైనిక ఆపరేషన్
జెనిన్: శరణార్థుల శిబిరాల్లో మాటు వేసిన పాలస్తీనా ఉగ్రవాదులను ఏరివేయడం, వారి ఆయుధాలను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల క్యాంప్‌లో సోమవారం నుంచి విస్తృతంగా సోదాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సైతం దాడులు కొనసాగాయి. దీంతో వేలాది మంది పాలస్తీనా శరణార్థులు సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. దాదాపు 4,000 మంది పాలస్తీనా శరణార్థులు బయటకు వెళ్లిపోయారని జెనిన్ నగర మేయర్ నిడాల్ అల్–ఒబిడీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. వారంతా ఉగ్రవాదులేనని ఇజ్రాయెన్ సైన్యం చెబుతున్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని, జెనిన్ క్యాంప్‌లో మసీదు కింద ఉన్న సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. జెనిన్ క్యాంప్‌లో ఈ స్థాయిలో సైనిక ఆపరేషన్ జరుగుతుండడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ వాసులపై ఇటీవలి కాలంలో దాడులు జరుగుతున్నాయి. గతనెలలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అంతేకాకుండా పాలస్తీనా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. తమ పౌరులకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులను ఏరివేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ వెస్ట్‌బ్యాంక్‌లు పాలస్తీనా పౌరులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జెనిన్ సిటీపై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులకు గట్టిపట్టుంది. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్‌ను 1967లో జరిగిన యుద్ధంలో పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ స్వా«దీనం చేసుకుంది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ సైనిక వాహనం వద్ద బాంబు పేలుడు దృశ్యం -
ఆగని ఇజ్రాయెల్ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు మృతి
జెరూసలేం: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం నబ్లాస్ సిటీపై జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. 40 మంది స్థానికులు గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో మూడ్రోజుల కాల్పుల విరమణ ముగిసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలినాళ్లలో వెస్ట్‌బ్యాంక్‌లో వరుస దాడులకు కారకుడైన అల్–అక్సా సాయుధ దళం నేత ఇబ్రహీం అల్–నబుల్సీను ఆయన ఇంట్లోనే హతమార్చామని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నబుల్సీ, మరో ఇద్దరు సాయుధులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత మూడ్రోజుల గాజా దాడులు, ప్రతిదాడుల ఘటనల్లో మొత్తంగా 46 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 311 మంది గాయపడ్డారు. పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఉగ్ర సంఘర్షణలో నబుల్సీ మరణం ఒక మేలిమి ముందడుగు అని ఇజ్రాయెల్ ఆపద్ధర్మ ప్రధాని యాయిర్ లాపిద్ వ్యాఖ్యానించారు. 1967 నాటి మధ్యప్రాశ్చ్య యుద్ధానంతరం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ వశమైంది. ఆనాటి నుంచి దశాబ్దాలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ సంఘర్షణ కొనసాగుతోంది. చదవండి: (భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త) -
ఇజ్రాయెల్–పాలస్తీనా శాంతికి కృషి
బెత్లెహం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో శుక్రవారం పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని, తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి యత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం క్రితమే సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత, పాలస్తీనాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. లక్షలాది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతంత్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని, పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా నడుమ శాంతి ప్రక్రియ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. శాంతి ప్రయత్నాలకు కార్యక్షేత్రం ఇంకా సిద్ధం కానప్పటికీ రెండు దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. పాలస్తీనాకు 300 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని బైడెన్ ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో ఇజ్రాయెల్ కాలనీల విస్తరణపై స్పందించలేదు. -
కత్తితో వెళ్లిన ఆ విద్యార్థిని సంకెళ్లు వీడాయి
వెస్ట్ బ్యాంక్: తమ దేశ పౌరులను పొడిచి చంపేందుకు ప్రణాళిక రచించిందన్న కారణంతో అరెస్టు చేసి జైళ్లో పెట్టిన పన్నేండేళ్ల పాలస్తీన బాలికను ఎట్టకేలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విడిచిపెట్టింది. దాదాపు రెండున్నర నెలలు జైలులో ఉంచి అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు తుకారెం పాయింట్ వద్ద వద్ద ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించింది. ఈ సమయంలో ఆ బాలికకు తమ పట్టణం వెస్ట్ బ్యాంక్‌లోకి ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవించిన అతి పిన్న పాలస్తీనా వాసి ఈ బాలికే. యూదుల ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ పట్టణం ప్రవేశం వద్ద పాలస్తీనాకు చెందిన దిమా అల్ వావి అనే పన్నేండేళ్ల బాలిక ఈ ఏడాది 9న తన స్కూల్ యూనిఫాం షర్ట్ చాటున ఓ కత్తిపట్టుకొని వచ్చింది. అప్పటికే ఈ ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కత్తితో, బాంబులతో, కార్లతో సరిహద్దు ప్రాంతాల వద్ద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ వాసులు ఆక్రమిత ప్రాంతానికి ఈ బాలిక కత్తితో రావడం గుర్తించిన ఆ పోలీసులు ఆ బాలికను అరెస్టు చేశారు. అయితే, పద్నాలుగేళ్ల లోపు ఉన్న బాలికకు సుదీర్ఘకాలంపాటు జైలు శిక్ష విధించడానికి యూదుల చట్టం అంగీకరించనందున ఆ బాలికకు కేవలం నాలుగున్నర నెలలు మాత్రమే జైలు శిక్ష విధించారు. ఇటీవల బాలిక తరుపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో నాలుగు వారాల ముందే ఆ బాలికను విడుదల చేసి తిరిగి పాలస్తీనా అధికారులకు అప్పగించగా వారు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. -
బాంబులతో పూలతోట పెంచారు
- పాలస్తీనాలో అరుదైన దృశ్యం - వెస్ట్ బ్యాంక్ లో ఆకట్టుకుంటోన్న బాంబ్ గాడ్డెన్ వెస్ట్ బ్యాంక్ : వివాదాస్పద నేల పాలస్తీనా లోని ఓ ప్లవర్ గార్డెన్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షింస్తోంది. ఎడారిలో పూలు పెంచడం వింత కాదు.. పూల తోటకు ఉపయోగించిన వస్తువులే వెరైటీ. వెస్ట్ బ్యాంక్ ముఖ్య పట్టణం రామల్లాలో కి దగ్గరలోని బిలిన్ గ్రామం నెటిజన్ల మనసు దోచుకుంది. వివాదాస్పద వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని రామల్లాలో సిటీకి దగ్గరలో ఈ బిలిన్ గ్రామం ఉంది. ఇజ్రాయిల్ దురాక్రమణ కింద ఉన్న ఈ గ్రామాన్ని.. రెండేళ్ల క్రిందట పాలస్తీనా తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే..బిలిన్ గ్రామంలో బాంబు దాడులు, పేలుడు శబ్దాలు, రాకెట్ లాంచర్లు కొత్త కాదు. సరిహద్దు వివాదం కారణంగా అటు ఇజ్రాయిల్, ఇటు పాలస్తీనా ఉగ్రవాదులు ప్రతి నిత్యం పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉంటారు. 2014 మేలో అందుకు భిన్నంగా ప్రజలపై దాడి జరిగింది. శాతియుతంగా ప్రదర్శన చేస్తున్న పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ టియర్ గ్యాస్ గోళాలు, రబ్బర్ బుల్లెట్లతో విరుచుకు పడింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు గ్రామస్తులు. అంతే.. ఇజ్రాయిల్.. పాలస్తీనా ప్రజలపై పేల్చిన టియర్ గ్యాస్ గోళాలను సేకరించడం మొదలు పెట్టారు. ఇజ్రాయిల్ అక్రమంగా కంచె నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతంలో పూల తోట పెంచడం స్టార్ట్ చేశారు. త్వరలోనే.. గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మొదలైంది. బాంబ్ షెల్ గార్డెన్ పెరిగి పోయింది. ఒక నాటికి యుద్దం ముగుస్తుంది.. 'మరణం నుంచి వసంతం చిగురిస్తుంది' అంటూ గ్రామస్తులు తమ పూదోట గురించి గర్వంగా చెబుతారు.