వెస్ట్‌బ్యాంక్‌–జోర్డాన్‌ సరిహద్దుల్లో కాల్పులు ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి | Shooting attack at the West Bank-Jordan border crossing | Sakshi
Sakshi News home page

వెస్ట్‌బ్యాంక్‌–జోర్డాన్‌ సరిహద్దుల్లో కాల్పులు ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి

Published Mon, Sep 9 2024 5:11 AM | Last Updated on Mon, Sep 9 2024 5:11 AM

Shooting attack at the West Bank-Jordan border crossing

గాజాలో ఐదుగురు పాలస్తీనియన్లు కూడా..

అల్లెన్‌బీ క్రాసింగ్‌: వెస్ట్‌బ్యాంక్‌–జోర్డాన్‌ సరిహద్దుల్లోని అల్లెన్‌ బీ క్రాసింగ్‌ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోయారు. జోర్డాన్‌ వైపు నుంచి ట్రక్‌లో క్రాసింగ్‌ వద్దకు చేరుకున్న సాయుధులు భద్రతా బలగాల వైపు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 

బలగాల ఎదురుకాల్పుల్లో ఆగంతకుడు చనిపోయాడని ఆర్మీ తెలిపింది. ఘటనపై జోర్డాన్‌ దర్యాప్తు చేపట్టింది. జోర్డాన్‌ నదిపై ఈ మార్గాన్ని ఎక్కువగా పాలస్తీనియన్లు, విదేశీ టూరిస్టులు, సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. తాజా ఘటన నేపథ్యంలో ఈ క్రాసింగ్‌ను అధికారులు మూసివేశారు. అమెరికా, పశ్చిమదేశాలకు అనుకూలంగా పేరున్న జోర్డాన్‌ 1994లో ఇజ్రాయెల్‌లో శాంతి ఒప్పందం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement