Jordan
-
భారత్ శుభారంభం
షార్జా: ‘పింక్ లేడీస్ కప్–2025’లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తమ తొలి పోరులో స్వీటీ దేవీ సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్ తేడాతో జోర్డాన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున ప్రియాంక దేవి (23వ నిమిషంలో), మనీషా (54వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కనబర్చింది. తొలి అర్ధభాగంలో వచ్చిన అవకాశాన్ని ప్రియాంక దేవి సద్వినియోగ పర్చుకుంటూ... జోర్డాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి భారత్ ఖాతా తెరిచింది. కాసేపటికే స్కోరు పెంచే అవకాశం వచ్చినా... దాన్ని మనీషా సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. ద్వితీయార్థంలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా మనీషా గోల్ కొట్టి జట్టుకు విజయం ఖాయం చేసింది.క్రిస్పిన్ ఛెత్రి భారత మహిళల కోచ్‌గా ఎంపికైన అనంతరం మన జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. జోర్డాన్ పదే పదే ప్రతి దాడులకు ప్రయత్నించినా... స్వీటీ దేవి, పుర్ణిమ కస్తూరితో కూడిన రక్షణ శ్రేణి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. తెలంగాణ అమ్మాయి గుగులోతు సౌమ్య ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత యంగ్‌ప్లేయర్ లిషమ్ బబీనా దేవి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. తదుపరి పోరులో ఆదివారం రష్యాతో భారత్ తలపడుతుంది. -
పాలస్తీనియన్లకు ఆశ్రయం కోసం జోర్డాన్‌పై ట్రంప్ ఒత్తిడి
వాషింగ్టన్: గాజా స్ట్రిప్ స్వాదీనం ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత వేగవంతం చేశారు. గాజా స్ట్రిప్ నుంచి పంపేయడంతో శాశ్వతంగా నిర్వాసితులయ్యే పాలస్తీనియన్లకు మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని జోర్డాన్ రాజు అబ్దుల్లాపై ట్రంప్ ఒత్తిడి పెంచారు. మంగళవారం శ్వేతసౌధంలో అబ్దుల్లాతో ట్రంప్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. నివాసితు లను తరలించడంతోపాటు యుద్ధంతో దెబ్బతిన్న గాజాను పశ్చిమాసియాలో అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న తన ఆలోచనను వదలుకోబోనని ట్రంప్ సంకేతం ఇచ్చారు. గాజాను కొనడం లేదని, ఏకంగా స్వా«దీనం చేసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘గాజా స్ట్రిప్‌ను తీసుకుంటాం. పశి్చమాసియాలో ప్రజలకు చాలా ఉద్యోగాలు కల్పించబోతున్నాం’’అని ట్రంప్ పేర్కొన్నారు. గాజా నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి జోర్డాన్, ఈజిప్ట్ లు అంగీకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘జోర్డాన్‌లో మాకు కొంత భూమి ఉంటుందని నేను నమ్ముతున్నాను. చర్చలు పూర్తయిన అనంతరం పాలస్తీనియన్లు సంతోషంగా, సురక్షితంగా జీవించడానికి చోటు లభిస్తుందని అనుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికాపై జోర్డాన్, ఈజిప్ట్ ఆధారపడటమే ట్రంప్ అంత బలంగా చెప్పడానికి కారణం. అయితే... జోర్డాన్‌కు సహాయాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ అన్నారు. మద్దతు ఇస్తున్నామన్న వంకతో ఈ దేశాలను బెదిరించాలని భావించట్లేమని చెప్పారు. ‘‘మేము జోర్డాన్‌కు, ఈజిప్టుకు సహాయాన్ని అందిస్తాం. ఆ సాకుతో బెదిరించాల్సిన అవసరం లేదు. మేం అలాంటి భావజాలానికి అతీతులం అనే అనుకుంటున్నాం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పాలస్తీనియన్లను తమ భూభాగంలోకి తరలించే ప్రక్రియకు రాజు అబ్దుల్లా సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. ట్రంప్ ప్రణాళికను సమరి్థంచకుండా, వ్యతిరేకించకుండా అసౌకర్యంగా కనిపించారు. తన దేశానికి ఏది మంచిదో అది చేస్తానని అబ్దుల్లా అన్నారు. గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2,000 మంది చిన్నారులను మాత్రం చికిత్సచేయించేందుకు జోర్డాన్‌కు తీసుకెళ్తామని రాజు చెప్పారు. రాజు నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పాలస్తీనియన్లను నిర్వాసితులను చేసే ప్రయత్నాలను తాను వ్యతిరేకినని రాజు అబ్దుల్లా గతంలోనూ వ్యాఖ్యానించారు. ‘‘ఇది ఏకీకృత అరబ్ వైఖరి’’అని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘‘పాలస్తీనియన్లను ఇంకెక్కడికీ పంపేయకుండానే గాజా స్ట్రిప్‌ను పునర్ నిర్మించాలి. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి’’అని ఆయన అన్నారు. గాజా అంశంలో అమెరికా కొత్త అధ్యక్షుడు తన ప్రణాళికలను వెల్లడించాక అగ్రరాజ్య అధ్యక్షుడితో భేటీ అయిన తొలి అరబ్ నేత అబ్దుల్లా కావడం గమనార్హం. ఇరువురు నాయకులు ఇతరత్రా అంశాల్లో ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెలిగారు. అయితే గాజా గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజు అబ్దుల్లాను ఇబ్బందికర స్థితిలోకి నెట్టాయి. డోలాయమానంలో కాల్పుల విరమణ ట్రంప్ గాజా ప్రతిపాదన ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపులో కొత్త సమస్యను తీసుకొచ్చింది. గాజాపై దాడులను నిలిపివేసే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, తదుపరి నోటీసు వచ్చే వరకు బందీలను విడుదల చేయడం నిలిపివేస్తున్నట్లు హమాస్ సోమవారం తెలిపింది. బందీలందరినీ శనివారం మధ్యాహ్నంలోగా విడుదల చేయకపోతే మీ అంతు చూస్తానని ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమాస్ ఏ విధంగా స్పందిస్తుంది, దానికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?. అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు ఏమిటనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. సర్వత్రా వ్యతిరేకత గాజా స్వా«దీనం, పాలస్తీనియన్లను తిరిగి గాజాకు అనుమతించబోమంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజాను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి 9 తేదీలలో రాయిటర్స్/ఇప్సోస్ అమెరికాలో ఒక సర్వే నిర్వహించింది. గాజాను అమెరికా స్వా«దీనం చేసుకుని అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్లను తరలించే ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు చెప్పారు. అంటే.. 74 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం ఇదే. ఈ అంశంపై రిపబ్లికన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాజా స్వా«దీన ప్రకటనను 55 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. 43 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
ఉమాన్: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పలువురు దుండగులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనంతరం దుండగులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగాముగ్గురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది.కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామని,ఎంబసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. ఎంబసీ సమీపంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ప్రాంతంలో పలుమార్లు నిరసనలు జరిగాయని పోలీసులు తెలిపారు.2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చొరబడి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను హత్య చేయడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 44 వేల మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా చెబుతోంది. కాగా మరోవైపు ఇజ్రాయెల్,లెబనాన్ మధ్య కాల్పుల విరమణ కోసం కొద్ది కాలంగా చర్చలు జరుగుతున్నాయి.ఇదీ చదవండి: భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్ ఆసక్తికర ట్వీట్ -
ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్‌లపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.తమపై(ఇరాన్) దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌కు సాయం చేయవ ద్దని హెచ్చరించింది. అలా కాదని అరబ్ దేశాలు వారి భూబాగాలు, గగనతలాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరికను పంపింది. అయితే ఇవన్నీ యూఎస్ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ పెద్దతప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇరాన్‌లోని అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథయంలోనే ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఎలాంటి దాడులు జరగకూడదని,అలా జరిగితే ప్రతీకార దాడులకు పాల్పడతామని అరబ్ దేశాలను హెచ్చరించింది. -
వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లో కాల్పులు ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి
అల్లెన్బీ క్రాసింగ్: వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లోని అల్లెన్ బీ క్రాసింగ్ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోయారు. జోర్డాన్ వైపు నుంచి ట్రక్‌లో క్రాసింగ్ వద్దకు చేరుకున్న సాయుధులు భద్రతా బలగాల వైపు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బలగాల ఎదురుకాల్పుల్లో ఆగంతకుడు చనిపోయాడని ఆర్మీ తెలిపింది. ఘటనపై జోర్డాన్ దర్యాప్తు చేపట్టింది. జోర్డాన్ నదిపై ఈ మార్గాన్ని ఎక్కువగా పాలస్తీనియన్లు, విదేశీ టూరిస్టులు, సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. తాజా ఘటన నేపథ్యంలో ఈ క్రాసింగ్‌ను అధికారులు మూసివేశారు. అమెరికా, పశ్చిమదేశాలకు అనుకూలంగా పేరున్న జోర్డాన్ 1994లో ఇజ్రాయెల్‌లో శాంతి ఒప్పందం చేసుకుంది. -
యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి!
జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతిగా యూఎస్ మిలటరీ ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియా స్థావరాలపై బాంబు దాడి చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సిరియాలో జరిగిన యూఎస్ వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మరణించారు. వారిలో ముగ్గురు నాన్ సిరియన్లు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతు కలిగిన 85 మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించిందని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సైనిక వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ దళాలు 125కు మించిన యుద్ధ సామగ్రితో 85కు మించిన లక్ష్యాలపై దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందారని, చాలామంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. It is bring reported that the #US has began air strikes on #Iraq Earlier we saw 5 B1 lancers flying from US towards Middle East region pic.twitter.com/bjGntkKz9I — Free Pakistan 🇺🇦 🇷🇺 🇮🇱 🇵🇸 🇺🇸 (@ukr69h) February 3, 2024 ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని అన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. శుక్రవారం డోవర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. గత వారంలో జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులు మృతిచెందారు. ఈఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు ప్రారంభించారు. ARE WE AT WAR😳😳😳 The United States has begun a wave of airstrikes in Iraq and Syria. This is retaliation for a fatal drone attack that killed three soldiers. pic.twitter.com/JmJsM5Gpe3 — Graham Allen (@GrahamAllen_1) February 2, 2024 -
Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది!
జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం టవర్ 22పై మిలిటెంట్ గ్రూప్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండే అమెరికా డ్రోన్ దాడిని అడ్డుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాపు చేసిన అమెరికా సైనిక అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. మిలిటెంట్ దళాలు డ్రోన్ దాడులు చేసిన సమయంలో అమెరికాకు సంబంధించిన ఒక డ్రోన్ ఆర్మీ పోస్ట్‌కు వస్తుందని సైనిక శిబిరం భావించింది. తక్కువ ఎత్తులో సైనిక స్థావరం వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను అప్పటికే షెడ్యూల్ చేసిన తమ డ్రోన్‌గా భావించించారు సైనిక అధికారులు. తమ స్థావరం వైపు వస్తున్న డ్రోన్ తమదే అనుకొని పొరపాటు పడ్డారు. దానివల్లనే మిలిటెంట్ల డ్రోన్ దాడిని తాము అడ్డుకోలేకపోయామని సైనిక అధికారులు పేర్కొన్నారు. మిలిటెంట్లు ప్రయోగించిన డ్రోన్ సైనిక శిబిరంపై పడినట్లు పేర్కొంది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా.. 40 మంది సైనికులు గాయపడ్డారు. ఇక్కడ సుమారు 350 మంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ డ్రోన్ దాడి మధ్యప్రాచ్యలో అమెరికా స్థావరం జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. ఇరాన్ దేశానికి చెందిన ఇస్లామిక్ రెసిస్టాన్స్ మిలిటెంట్ గ్రూప్ డ్రోన్ దాడికి పాల్పడినట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్పందిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ‘జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ ఇరాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూప్ పని. సమయం వచ్చిప్పుడు తాము అంతే స్థాయిలో స్పందిస్తాం’ అని అన్నారు. అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ మిలిటెంట్‌కు గ్రూప్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఎవరికీ డ్రోన్ దాడులకు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని ఇరాన్ పేర్కొంది. -
బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన.. షాకిచ్చిన మూడు దేశాలు
అమ్మాన్: గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు.. యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం పర్యటించనున్నారు. #WATCH | Joint Base Andrews, Maryland: US President Joe Biden departs for Israel. (Source: Reuters) pic.twitter.com/lp2A0PHErf — ANI (@ANI) October 17, 2023 గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో బైడెన్ చర్చలు జరుపనున్నారు. గాజాకు సాయం అందించేందుకు ఓ ప్రణాళికను రూపొదించేందుకు ఇజ్రాయెల్, అమెరికా మధ్య అంగీకారం కుదిరినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. జో బైడెన్‌కు జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా దేశాలు షాక్ ఇచ్చాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వస్తున్న బైడెన్‌తో తాము భేటీ అయ్యేది లేదని వెల్లడించాయి. అయితే, గాజా యుద్ధాన్ని ఆపే లక్ష్యంతో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లతో తమ దేశ రాజధాని అమ్మాన్ వేదికగా బుధవారం సదస్సును నిర్వహించాలని జోర్డాన్ భావించింది. ఈ సమావేశానికి హాజరవుతానని బైడెన్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. Arab Leaders' Meeting With Biden Cancelled Over Gaza Hospital Attack Jordan's Foreign Minister Ayman Safadi announced that Biden's summit in Amman scheduled to take place on Wednesday with Jordan's King Abdullah, Egypt's President Abdel Fattah El-Sissi and Palestinian Authority pic.twitter.com/Y0oob96eDd — BBC NEWS RSVK (@Raavivamsi49218) October 18, 2023 మంగళవారం అర్ధరాత్రి గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో వందలాది మంది రోగులు చనిపోవడంతో.. జోర్డాన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించిన జోర్డాన్ రాజు అబ్దుల్లా ఈ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ సమాచారాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. ఇక, జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాది కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టర్కీలోని నాటో కార్యాలయం దగ్గర కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గాజాకు సాయం అందించాలని ప్రజలు టర్కీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Jordanian protesters raise their shoes in the capital Amman, refusing to accept US President Joe Biden. pic.twitter.com/cOwsgHbzrh — Iran Observer (@IranObserver0) October 17, 2023 People are now attacking the US embassy in Lebanon. Thanks Joe Biden. pic.twitter.com/VwvDUbGG1E — Gunther Eagleman™ (@GuntherEagleman) October 17, 2023 -
తీరు మార్చుకోని ట్రూడో.. మరోసారి కవ్వింపు చర్యలు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు మారలేదు. మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జోర్డాన్ రాజుతో భారత్ సంబంధాలపై చర్చించారు. కెనడా-భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులపై జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్-హుస్సేన్‌తో ఫొన్లో మాట్లాడారు. దౌత్య సంబంధాలలో వియన్నా కన్వెన్షన్‌ను గౌరవించడంపై చర్చించినట్లు ట్రూడో ఓ ప్రకటనలో తెలిపారు. On the phone today, His Highness @MohamedBinZayed and I spoke about the current situation in Israel. We expressed our deep concern and discussed the need to protect civilian life. We also spoke about India and the importance of upholding – and respecting – the rule of law. — Justin Trudeau (@JustinTrudeau) October 8, 2023 ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇటీవలే యూఏఈ అధ్యక్షునితో కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడారు. భారత్‌తో సంబంధాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయనియమాలపై మాట్లాడినట్లు స్పష్టం చేశారు. అటు.. కొన్ని రోజుల ముందే యూకే ప్రధాని రిషి సునాక్‌తోనూ జస్టిన్ ట్రూడో మాట్లాడారు. భారత్‌తో కెనడాకు ఉన్న అంతర్జాతీయ సంబంధాలపై చర్చించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. అటు.. నిజ్జర్ హత్య కేసులో భారత్ సహకరించాలని కెనడా కోరుతోంది. సమస్యల పరిష్కారానికి ఇరుదేశాలు సమన్వయంతో పనిచేయాలని అమెరికా కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
ఆ రెస్టారెంట్లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు..
అమ్మాన్: జోర్డాన్‌లోని ఒక రెస్టారెంట్లో తిన్న తర్వాత హాయిగా పడుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ చక్కగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ఆ హోటల్లో అక్కడి ఫేమస్ డిష్ తిన్నవారు కచ్చితంగా పడుకునే తీరాలని చెబుతోంది సదరు రెస్టారెంట్ యాజమాన్యం. కడుపునిండా భోజనం చేసిన తర్వాత ఎవ్వరికైనా కాసేపు నడుము వాల్చాలనిపించడం సహజం. తిన్న తర్వాత కొద్దిసేపు కునుకు తీస్తే మనసుకి, శరీరానికి కలిగే ఆ హాయి మాటల్లో చెప్పలేనిది. ఇంటిలో అయితే తిన్న తర్వాత పడుకున్నా పర్వాలేదు కానీ రెస్టారెంట్లో ఆ రేంజిలో తిన్న తర్వాత పడుకోవడం కుదరదు కదా. కానీ జోర్డాన్ రాజధాని అమ్మాన్ లోని ఒక రెస్టారెంట్లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు. అందుకోసం అక్కడ ఏసీ గదులను కూడా ఏర్పాటు చేసింది ఆ రెస్టారెంట్ యాజమాన్యం. కాకపోతే ఆ రెస్టారెంట్ ఫేమస్ డిష్, జోర్దాన్ జాతీయ వంటకం అయిన "మన్సాఫ్" తిన్నవారికి మాత్రమే ఆ అవకాశముంటుంది. పులిసిన పెరుగుతో, స్వచ్ఛమైన నెయ్యితో ప్రత్యేకంగా తయారుచేసే మన్సాఫ్ తిన్న తర్వాత ఎంతటి వారికైనా కుంభకర్ణుడిలా నిద్ర తన్నుకొస్తుందట. అలా రాలేదంటే ఆ మన్సాఫ్ లో ఎదో లోపముండి ఉంటుందంటున్నారు ఆ రెస్టారెంట్‌కు విచ్చేసిన ఓ అతిధి. ఇక ఆ హోటల్ సహ యజమాని ఒమర్ బైడీన్ మాట్లాడుతూ మన్సాఫ్ కోసం వాడే పదార్ధాలను తిన్న తర్వాత నిద్ర రావడం సహజమే. మొదట్లో దీన్ని జోక్ గా తీసుకున్నాము. కానీ ఈరోజు అదే ఈ హోటల్ ప్రత్యేకతను చాటింది. అందుకే నిద్రపోవడానికి సౌకర్యం కల్పించాలని ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ హోటల్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. Have you ever needed to take a nap after a great meal 🤤? This restaurant in Jordan lets you enjoy the country’s national dish, mansaf, and afterward take a nap in its sleeping area. pic.twitter.com/Qdru4yFjFt — NowThis (@nowthisnews) July 21, 2023 జోర్డాన్ వెళ్ళినప్పుడు కచ్చితంగా ఈ హోటల్‌కి వెళ్లి తీరతామని కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి హోటల్ మా ఊర్లో కూడా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. అంత దూరం వెళ్లలేమని భావించిన వారు మాత్రం మాన్సాఫ్ ఎలా తయారు చెయ్యాలో రెసిపీ తెలపమని కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్ -
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
విషవాయువు లీక్.. 12 మంది మృతి, 199 మందికి అస్వస్థత
విషపూరిత వాయువు లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోర్డాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జోర్డాన్ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది. క్లోరిన్ గ్యాస్ ఉన్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు కిందిపడిపోవడంలో భారీ పేలుడు సంభవించింది. పసుపు రంగు క్లోరిన్ విష వాయువు ఆ ప్రాంతంలో విస్తరించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 199 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విష వాయువు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఓడరేవుకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాబా నగర ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. At least 10 people have died and more than 250 injured after a toxic gas leak at Aqaba Port in Jordan. pic.twitter.com/kjTDaPkelw — Suzanne (@suzanneb315) June 27, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం.. 42 మంది మృతి -
అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది: సురేఖ వాణి కూతురు
-
హవ్వా! మహిళా ఎంపీలు చూస్తుండగానే..
Jordan Maps Brawl In Parliament Viral: చట్ట సభలకు గౌరవం ఇవ్వడం మాట అటుంచి.. నేతలు దాడులకు తెగబడుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే పశ్చిమ ఆసియా దేశం జోర్డాన్‌లో చోటు చేసుకుంది. మంగళవారం జోర్డాన్ పార్లమెంట్లో ‘సమాన హక్కు’కు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం మీద చర్చ జరిగింది. ఆ సమయంలో విపక్ష ఎంపీ ఒకరు చట్టం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని అధికార పక్షం పట్టుబడింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. గల్లా గల్లా పట్టుకుని కొట్టుకునేంతదాకా వెళ్లారు. Several deputies engaged in a fight inside Jordan’s parliament on Tuesday. Live footage on state media showed several MPs punching each other in chaotic scenes that lasted a few minutes https://t.co/4WVq2L1Div pic.twitter.com/Z4wBA59NgE — Reuters (@Reuters) December 28, 2021 మహిళా సభ్యులు పక్కనే ఉన్నా పట్టనట్లు ఒకరినొకరు బండబూతులు తిట్టుకుంటూ తోసేసుకున్నారు. ఈ క్రమంలో సభ్యులు కిందపడగా.. కాసేపటికి సిబ్బంది వచ్చి వాళ్లను బయటకు తీసుకెళ్లారు. ఎవరికీ గాయాలు కాలేదు. పార్లమెంట్లో జరిగిన ఈ ఘటన దేశానికే అవమానమని, ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు పోయిందంటూ ఎంపీ ఖలీల్ అతియేహ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. #MiddleEast It is #Jordan time. Scuffles among #parliamentarians during the discussion on the amendment of the #Constitution . What a show! pic.twitter.com/ixJLRBVAoM — Donato Yaakov Secchi (@doyaksec) December 28, 2021 -
మృత వలయం చుట్టూ నగ్నప్రదర్శన
Spencer Tunick Dead Sea Naked Photo Shoot Viral: వందల మంది. ఆడా మగా తేడా లేకుండా అంతా నగ్నంగా మారిపోయారు. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం వైట్ పెయింట్‌తో ఎక్కడి నుంచో వస్తున్న ఆదేశాల్ని పాటిస్తూ.. ముందుకు నడుస్తున్నారు. ఆ ఆదేశాలు ఇస్తున్న వ్యక్తి పేరు స్పెన్సర్ ట్యూనిక్. అమెరికన్ ఫొటోగ్రఫీ ఆర్టిస్ట్ అయిన ట్యూనిక్ పేరు, ఆ ఫొటోలు గత రెండోరోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అయితే అలా వాళ్లతో నగ్న ప్రదర్శన చేయించడానికి ఓ ప్రత్యేకమైన కారణం అంటూ ఉంది కూడా.. ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంక్ మధ్యనున్న డెడ్‌సీ(మృత సముద్రం) ఏడాదికి మూడున్నర అడుగుల చొప్పున కుచించుకుపోతోంది. గత రెండు దశాబ్దాల్లో 30 శాతం ఎండిపోయిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అట్లాస్) తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్ సీ పూర్తిగా కాలగర్భంలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా డెడ్‌సీ సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలనే స్పెన్సర్ ట్యూనిక్ అలా 200 మందితో నగ్నంగా ఫొటోషూట్ చేయించాడు. అఫ్కోర్స్.. ఈ ఫొటోషూట్‌పై ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కూడా. కానీ, ఆయనకు వివాదాలు-విమర్శలు కొత్తేం కాదు. 1992 నుంచి కెమెరా పట్టిన ట్యూనిక్.. పర్యావరణహితం కోసం ఎంతదాకా అయినా తెగిస్తూ వస్తున్నాడు. నగ్నత్వాన్ని.. దానికి ఓ మంచి పనికోసం ఉపయోగించడాన్ని గౌరవంగా భావిస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన్ని బహిష్కరించాలనే పిలుపు కూడా చట్టసభ్యుల నుంచి వినిపిస్తోంది. డెడ్‌సీ గురించి.. భూగోళంపై అత్యంత దిగువన, అంటే సముద్రమట్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఉంది డెడ్‌సీ. డెడ్‌సీ అంటే ఓ సరస్సు. ఈ సరస్సు నీటిలో 34 శాతం ఉప్పు ఉండటం వల్ల ఇందులో మనుషులు మునగరు.. తేలుతారు. మామూలు సముద్రాల్లో ఉండే ఉప్పుకన్నా 9.6 శాతం ఈ నీటిలో ఎక్కువ. ఈ నీటిని నోట్లో పోసుకుంటే ఉప్పులాగా కాకుండా విషంలా ఉంటుంది. ఈ సరస్సు చుట్టుపక్కల చెట్లు, జంతువులేవీ బతకవు కనుక దీనికి డెడ్‌సీ అని పేరు వచ్చింది. అయితే ఎన్నో ఔషధగుణాలు ఉండడంతో ఇది ప్రపంచ యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందులో జలకాలాడితే శరీరంలోని జబ్బులన్నీ పోతాయన్నది వారి నమ్మకం. ఒడ్డున బురదను ఒంటికి రాసుకుని మర్దనా చేసుకుంటారు. డెడ్‌సీ చేసే బిజినెస్ కూడా భారీగానే ఉంటోంది. కాస్మోటిక్స్‌లో, ఆయుర్వేద ఔషధాల్లో ఈ జలాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎరువుల్లో ఉపయోగించే పొటాష్ కూడా ఈ జలాల నుంచి తయారుచేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగా ఇప్పుడు అది చావుకు దగ్గరవుతోంది. సమస్య ఏంటంటే.. ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా దేశాల మూకుమ్మడి చేష్టల వల్లే డెడ్‌సీకి ఈ పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఈ సరస్సు తరిగిపోవడానికి ప్రధాన బాధ్యత జోర్డాన్ దేశానిదని చెప్పొచ్చు. డెడ్‌సీ సరస్సుకు నీరు వచ్చి చేరేది ఎక్కువగా జోర్డాన్ రివర్ నుంచే!. అయితే కొన్నేళ్ల క్రితం ఆ దేశ ప్రజల మంచినీటి అవసరాల కోసం జోర్డాన్ నది నుంచి పైప్‌లైన్ వేసి నీటిని మళ్లించడం వల్ల ఆ నది నుంచి డెడ్‌సీకి నీరొచ్చే మార్గం నిలిచిపోయింది. దానికితోడు మధ్యప్రాచ్యంలో ఉండే వేడి, పొడి వాతావరణం కూడా నీరు ఎక్కువగా ఆవిరై పోవడానికి కారణం అవుతోంది. దీన్ని పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాల మధ్య 1994లోనే 90 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పనులు ఎంతదూరం వచ్చి ఆగిపోయాయో ప్రపంచ దేశాలకు తెలియదు. ఇక పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య జగడం కూడా మృత సముద్రం.. మృత్యువు ఒడిలోకి జారడానికి మరో కారణంగా చెప్పొచ్చు. చదవండి: అవాక్కయేలా చేద్దాం అనుకుంటే.. అదిరిపోయే ట్విస్ట్! -
ప్రజల ఎదుట ప్రిన్స్ హమ్జా ప్రత్యక్షం
జెరూసలేం: జోర్డాన్ రాజు అబ్దుల్లా–2 సవతి సోదరుడు ప్రిన్స్ హమ్జా ఆదివారం ఒక కార్యక్రమంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నాడన్న ఆరోపణలతో ఏప్రిల్ 3న ఆయనను గృహనిర్బంధంలోకి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రజలకు కనిపించడం ఇదే మొదటిసారి. కింగ్ అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా ఒకే వేదికను పంచుకోవడం గమనార్హం. అయితే, వారి మధ్య విభేదాలు సమసిపోయాయా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. రాజధాని అమన్ నగరంలో కింగ్ తలాల్ సమాధి వద్ద అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా, క్రౌన్ ప్రిన్స్ ముస్సేన్, ఇతర కుటుం సభ్యులు కలిసి ఉన్న ఒక ఫొటో, వీడియోను రాయల్ ప్యాలెస్ విడుదల చేసింది. -
జోర్డాన్‌లో సంక్షోభం
చెదురు మదురుగా ఎప్పుడైనా జరిగే నిరసన ప్రదర్శనలు తప్ప ఇతర అరబ్ దేశాలతో పోలిస్తే గత అయిదు దశాబ్దాలుగా ప్రశాంతంగా, సుస్థిరంగా వుంటున్న జోర్డాన్‌లో ముసలం పుట్టింది. మాజీ యువరాజు హమ్జా బిన్ హుసేన్ ‘విదేశీ శక్తుల’తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారని, దాన్ని సకాలంలో గుర్తించి అడ్డుకున్నామని జోర్డాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశామని తెలిపింది. అయితే మాజీ యువరాజు అందులో లేరని ప్రభుత్వం అంటుండగా, తనను గృహ నిర్బంధంలో వుంచారని హమ్జా ఆరోపిస్తున్నాడు. జోర్డాన్‌లో హఠాత్తుగా సమస్యలు పుట్టుకురావటం... అది కూడా అంతఃపుర కుట్ర కావటం అమెరికాను కల వరపెట్టింది. దాంతోపాటు జోర్డాన్‌కు సన్నిహితంగా వుండే ఈజిప్టు, సౌదీ అరేబియాలు ఆందోళన పడుతున్నాయి. ఇజ్రాయెల్‌కు సైతం జోర్డాన్ పరిణామాలు ఇబ్బందికరంగానే వున్నాయి. అమెరి కాకు జోర్డాన్ మొదటినుంచీ మిత్ర దేశం. అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ ఆవిర్భావం తర్వాత దాన్ని మొట్టమొదటగా గుర్తించింది జోర్డానే. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య చెలిమి కుదర్చటంలో అది ఎంతో దోహదపడింది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల్లో సృష్టించిన బీభత్సాన్ని ఎదుర్కొనడానికి, మొత్తంగా అరబ్ దేశాల్లో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు జోర్డాన్నుంచే అమెరికా అంతా చక్కబెట్టింది. పైగా జోర్డాన్‌లో దానికి కీలకమైన సైనిక స్థావరం వుంది. కనుక అక్కడ యధాతథ స్థితి కొనసాగకపోతే అమెరికా సహజంగానే కలవరపడుతుంది. ప్రశాంతంగా ఉండే జోర్డాన్‌లో చిచ్చు ఎందుకు రగిలింది? కరోనా మహమ్మారి చుట్టుముట్టాక ఈ పరిస్థితి ఏర్పడింది. దాన్నుంచి బయటపడటానికి లాక్‌డౌన్‌తోసహా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వివిధ వర్గాల్లో అసంతృప్తిని రగిల్చాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల సమ్మె ఒక సవాలుగా మారింది. లాక్డౌన్ వంకన జీతాలకు కోత పెడుతున్నారని, నిరసనకు కూడా చోటీయడం లేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారంటూ విపక్షాలు విరు చుకుపడ్డాయి. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ యువత రోడ్డెక్కారు. జీతాలు కోత పెట్టడం విరమించుకోవాలని, అధిక ధరలను నియంత్రించాలని ఉద్యమాలు బయల్దేరాయి. జోర్డాన్‌కు ఇదంతా కొత్త. దశాబ్దం క్రితం అరబ్ దేశాలను ప్రజాస్వామిక ఉద్యమాలు ఊపిరాడ నీయకుండా చేసినప్పుడు ఆ దేశం చెక్కుచెదరలేదు. ఇతర దేశాల మాదిరిగా రాజు అబ్దుల్లా వ్యవహరించక పోవటమే ఇందుకు కారణం. ఆ సమయంలో ఆయన తన అవసరార్థం విశాల దృక్పథాన్ని ప్రద ర్శించారు. నిరసనలు తమ దేశం తాకకముందే పాలనాపరమైన సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రక టించారు. రాజ్యాంగంలో అనేక మార్పులు తీసుకురావటం మొదలుపెట్టారు. భిన్న తెగలకు పార్లమెంటులో వారి జనాభా నిష్పత్తి ప్రకారం స్థానాలు కేటాయించి 2016లో ఎన్నికలు నిర్వహిం చారు. అప్పటికే పొరుగునున్న సిరియాలో ప్రజాస్వామిక ఉద్యమంపై అక్కడి ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో ఆ దేశం నుంచి 14 లక్షలమంది శరణార్థులు వచ్చిపడ్డారు. ఆ వెంటనే ఐఎస్ ఉగ్రవాదుల బెడద మొదలైంది. ఇన్నిటిమధ్యనే కొత్త పార్లమెంటుకు సజావుగా ఎన్నికలు నిర్వహిం చగలిగారు. అయితే కరోనా జోర్డాన్‌ను ఆర్థికంగా కుంగదీసింది. పర్యవసానంగా అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్నంతటినీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మాజీ యువరాజు హమ్జా ప్రయత్నించటమే తాజా పరిణా మాలకు మూలం. అవినీతిపై నిలదీసినందుకే తనను గృహ నిర్బంధంలో వుంచారని హమ్జా ఒక వీడియో సందేశం ద్వారా తెలిపారు. ఈ సందేశం నిజానికి జోర్డాన్ ప్రజల కోసం కాదు... అమెరికానుద్దేశించి రూపొందించిందే. జోర్డాన్‌కు సహజ వనరులు అతి స్వల్పం. ఆఖరికి మంచినీరు సైతం అది కొనుక్కోవాల్సిందే. అయితే అత్యంత విశ్వసనీయమైన దేశం గనుక దానికి అమెరికా నిధులు పోటెత్తుతాయి. అమెరికా విదేశీ సాయంకింద భారీగా సొమ్ము పొందే దేశాల్లో జోర్డాన్ ఒకటి. నిరుడు 190 కోట్ల డాలర్ల సాయం అందిందని ఒక అంచనా. సైన్యానికి ఆయుధాలు సమకూర్చటం, శిక్షణ అందించటం... నిధులు ఇవ్వటం అమెరికాకు రివాజు. అక్కడున్న తన సైనిక స్థావరంలో అరబ్ దేశాల సైన్యానికి అది ఏడాది పొడవునా శిక్షణనిస్తుంది. ఒకపక్క రాచరికం, వంశపారంపర్య పాలన సాగిస్తూనే దానికి ప్రజాస్వామ్యం ముసు గేయటం... జనం మౌలిక సమస్యల పరిష్కారంలో వైఫల్యం ఇప్పుడు జోర్డాన్‌ను పీడిస్తున్నాయి. ప్రస్తుత రాజు అబ్దుల్లా 1999లో స్వయంగా తన సవతి సోదరుడు హమ్జాను యువరాజుగా ప్రకటించారు. కానీ 2004లో దాన్ని రద్దుచేసి, తన కుమారుడు హుస్సేనీకి కట్టబెట్టారు. అప్పటి నుంచీ హమ్జా సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. కరోనా అనంతర సంక్షోభం అతనికి అందివచ్చింది. ప్రజాస్వామిక హక్కులు సాధారణ ప్రజానీకానికి ఎప్పుడూ పెద్దగా ఉపయోగ పడింది లేదుగానీ... రాజకుటుంబంలో ప్రస్తుత ఆధిపత్య పోరుకు అవి తోడ్పడ్డాయి. జోర్డాన్ రాజకుటుంబంలో విభేదాలు పెరిగితే అక్కడ అసమ్మతి, ఉగ్రవాదం మరింత ముదురుతాయని, అరబ్ ప్రపంచంలో అది కొత్త సమస్యలకు దారితీయొచ్చని అమెరికా ఆందోళన. ప్రజలకు ప్రాతి నిధ్యం వహించాల్సిన ప్రభుత్వం అగ్రరాజ్యం చేతిలో కీలుబొమ్మగా వుండటం, ప్రజాస్వామ్యం అడు గంటడం పర్యవసానాలు ఇలాగే వుంటాయి. -
2 నెలల తర్వాత ఇండియాకు పృథ్వీరాజ్
కొచ్చి : ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఆదు జీవితం చిత్ర బృందం ఎట్టకేలకు కేరళ చేరుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా జోర్డాన్‌లో చిక్కుకున్న వీరు శుక్రవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ మీనన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ప్రస్తుతం క్వారంటైన్‌కు తరలించారు. కాగా, ఆదుజీవితం చిత్రం షూటింగ్ కోసం పృథ్వీరాజ్, దర్శకుడు బ్లెసీతోపాటు 58 మంది సభ్యులతో కూడిన చిత్రబృందం జోర్డాన్‌కి వెళ్లింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా జోర్డాన్‌లో మార్చి 16న లాక్డౌన్ విధించారు. దీంతో చిత్రబృందం ఇండియాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తమను ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా చిత్ర దర్శకుడు కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ చాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ పరిస్థితి అంతగా బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా విమానంలో వీరు ఢిల్లీ మీదుగా కొచ్చి చేరుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత స్వదేశంలో కాలుమోపారు. ‘దాదాపు మూడు నెలల తర్వాత పృథ్వీరాజ్, ఆదుజీవితం బృందం కేరళకు చేరుకుంది. నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్‌కు తరలించారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత చివరకు వారు స్వస్థలాలకు చేరుకున్నారు. ఇందుకు సహకరించిన అధికారులక కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థించిన అభిమానులకు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు. తన నాన్న వచ్చాడని ఆలీ సంతోషపడుతోంది. రెండు వారాల క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత నాన్నను కలవబోతుంది’ అని సుప్రియ పేర్కొన్నారు. -
‘ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ రోజు(శనివారం) తొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సందర్భంగా భార్య సుప్రీయ మీనన్‌కు పృథ్వీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పృథ్వీరాజ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ‘ఆదుజీవితం’’ సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన ఆయన లాక్డౌన్ కారణంగా చిత్ర యూనిట్‌తో సహా అక్కడే చిక్కుకుపోయారు. ఈ ప్రత్యేక రోజున పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... ‘9 సంవత్సరాలు. ఇప్పుడే కాదు. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’ అంటూ భార్య మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. (లాక్డౌన్.. 9.30 గంటలు బెడ్‌పైనే స్టార్ హీరో) View this post on Instagram 9 years ❤️ Apart for now..together forever! #LoveInTheTimeOfCorona A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on Apr 24, 2020 at 11:43am PDT అలాగే సుప్రియ కూడా భర్త పృథ్వీకి పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ‘9వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ తొమ్మిదేళ్లలో మొదటిసారి మనం పెళ్లి రోజున వేరువేరుగా ఉన్నాం. త్వరగా వచ్చి విషెస్ చెబుతారని మీ కోసం ఎదురు చూస్తున్నాను’. అంటూ పెళ్లినాటి ఫోటోను షేర్ చేశారు. కాగా పృథ్వీరాజ్ తొమ్మిదేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌లో సుప్రీయను వివాహం చేసుకున్నారు. వీరికి 2014 సెప్టెంబర్ 8న కూతురు అలంకృత జన్మించింది. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ? ) View this post on Instagram Happy 9th Anniversary @therealprithvi! First time in 9 years that we are spending the day apart! But what do?! Waiting for you to come back soon and make this up to me! #LoveInTheTimesOfCorona#9DoneForeverToGo 🧿 A post shared by Supriya Menon Prithviraj (@supriyamenonprithviraj) on Apr 24, 2020 at 11:51am PDT -
జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న టాప్ హీరో
ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు అన్ని రంగాల వారు మద్దతు తెలిపారు. సినిమా రంగం సైతం వాటి షూటింగ్‌లను, రిలీజ్‌లను వాయిదా వేసుకుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలోనూ ఓ హీరో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ సాహసానికి పూనుకున్నాడు. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "ఆడు జీవితం" సినిమాలో మలయాళ టాప్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా జోర్డాన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో షూటింగ్ ఆపేయాలని అధికారులు కోరారు. అయితే వెనక్కి వచ్చి, తిరిగి మళ్లీ చిత్రీకరణ జరుపుకోవాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న ఉద్దేశ్యంతోనే సినిమా యూనిట్ ఆ ఆలోచనను విరమించుకుంది. (బాలీవుడ్ సింగర్‌ను వదలని కరోనా) మరోవైపు సినిమా యూనిట్ ఏప్రిల్ 10 వరకు చిత్రీకరణ కోసం అక్కడి అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంది. తొలుత దీనికి అక్కడి అధికారులు అంగీకరించినప్పటికీ పరిస్థితి విషమిస్తున్నందున తమ నిర్ణయాన్ని విరమించుకున్నారు. దీంతో ఆడు జీవితం టీమ్ సభ్యులు 58 మంది జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. అన్నపానీయాలు సైతం అందుబాటులో ఉండట్లేదని, కేరళకు తిరిగి వద్దామన్నా విమానాల రాకపోకలు స్థంభించిపోయాయని పేర్కొన్నాడు. ప్రభుత్వ సాయం లేనిదే కేరళకు రావడం దాదాపు అసాధ్యమని వాపోయాడు. మా సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని లేఖలో అభ్యర్థించాడు. (కరోనాపై తొలి విజయం) -
ప్రజల నిరసనలతో దిగొచ్చిన కింగ్
అమ్మాన్: దేశంలో ఇంధన, విద్యుత్ ధరలు పెంచుదాం అనుకున్న జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II కి ఊహించని షాక్ తగిలింది. ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంధన ధరల పెరుగుల నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని, అసమర్థ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని దేశ ప్రజలు గతరెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రోడ్లను స్తంభింపజేశారు. టైర్లు కాలపెడుతు రోడ్లను దిగ్బందం చేయడంతో ప్రభుత్వం ధరల పెరుగుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కింగ్ అబ్దుల్లా తెలిపారు. కోటి జనాభా గత జోర్డాన్‌లో వనరుల కొరత, పేదరికం, నిరుద్యోగంతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ జనాభాలో 19 శాతం నిరుద్యోగులు, 20శాతం పేదరికంలో మగ్గుతున్నట్లు ఆ దేశ గణాంకాలు చెప్తున్నాయి. 2016లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి తీసుకున్న 723 మిలియన్లు రుణాన్ని చెల్లించి భవిషత్తుల్లో మరిన్ని రుణాలు పొందే విధంగా ఆర్థిక సంస్కరణ చేపట్టింది. దానిలో రాయితీలు తగ్గించి ట్యాక్స్‌లు పెంచాలని ప్రభుత్వం భావించింది. ఒక్కసారిగా ఇంధనంపై 5.5 శాతం, విద్యుత్‌పై 19 శాతం ధరలు పెంచడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైయాయి. -
ఖురాన్, కంప్యూటర్ పట్టుకోండి
న్యూఢిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్యలు ఏ మతానికో వ్యతిరేకంగా చేస్తున్నవి కాదని, అమాయకులపై అకృత్యాలకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న ఆలోచనా విధానాన్ని తిప్పికొట్టేందుకేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకున్నప్పుడే పూర్తిస్థాయి సంక్షేమం, సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ‘ఇస్లామిక్ సంస్కృతి: అవగాహన పెంపొందించుట, సంయమనం’ అంశంపై నిర్వహించిన సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో కలిసి మోదీ ప్రసంగించారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేవారు.. ఏ మతం కోసమైతే పనిచేస్తున్నారో దానికి నష్టం కలిగిస్తున్నారన్న విషయం గ్రహించడం లేదని ప్రధాని చెప్పారు. తీవ్రవాదానికి చెక్ పెట్టేందుకు జోర్డాన్‌లో రాజు అబ్దుల్లా చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసిస్తూ.. తీవ్రవాదుల అరాచకాల్ని అరికట్టేందుకు ఆ విధానాలు ప్రయోజనకరంగా నిలుస్తాయన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలను సంరక్షిస్తున్న దేశం భారత్ అని, దేశంలోని ప్రాచీన బహుళత్వపు విలువలకు అనుసరణీయ మార్గమే ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలు మానవతా విలువల్నే చాటిచెపుతున్నాయని, ఇస్లాంలోని మానవతా విలువలతో యువత అనుసంధానం కావాలని ఆకాంక్షించారు. మత విశ్వాసం, మానవత్వం కలిసికట్టుగా సాగాలి: అబ్దుల్లా జోర్డాన్ రాజు అబ్దుల్లా ప్రసంగిస్తూ.. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై కొనసాగుతున్న యుద్ధం రెండు మతాల మధ్య పోరుగా భావించకూడదన్నారు. అన్ని మత విశ్వాసాలు, సమాజాలకు చెందిన మితవాదులకు.. విద్వేషం, హింసను ప్రేరేపిస్తున్న అతివాదులకు మధ్య పోరుగా ఆయన అభివర్ణించారు. మతం పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. మత విశ్వాసం, మానవత్వం కలిసికట్టుగా ముందుకు సాగాలని అభిలషించారు. ‘ఇస్లాం, లేదా ఏ మత ప్రచారంలోనైనా తప్పుడు ప్రచారం చేసే గ్రూపుల్ని గుర్తించి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరముంది. విద్వేషాన్ని ప్రచారం చేసేవారికి సమాచార వ్యవస్థ, ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేయాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్లా సోదరుడు ప్రిన్స్ ఘాజీ బిన్ ముహమ్మద్ తలాల్ రచించిన ‘ఏ థింకింగ్ పర్సన్స్ గైడ్ టు ఇస్లాం’ అనే పుస్తకం ఉర్దూ కాపీని జోర్డాన్ రాజుకు ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించారు. జోర్డాన్ రాజుతో మోదీ చర్చలు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై జోర్డాన్ రాజుతో మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ చర్చల వివరాలు వెల్లడిస్తూ.. ‘ఎప్పటినుంచో కొనసాగుతున్న సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలకు ఈ చర్చలు కొత్త ఊపునిచ్చాయి’ అని చెప్పారు. వైద్యం, మెడిసిన్, రాక్ ఫాస్పేట్, ఎరువుల దీర్ఘకాలిక సరఫరా, కస్టమ్స్ అంశంలో పరస్పర సహకారం తదితర ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. -
'ఈ యుద్ధం ముస్లింలపై కాదు.. '
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై ప్రపంచం చేస్తున్న పోరాటం హింసపై, ద్వేషంపై చేస్తున్న పోరాటం మాత్రమే తప్ప ఏ ఒక్క మతంపైనో లేక ముస్లిం వర్గంపైనో కాదని జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 అన్నారు. మహ్మద్ ప్రవక్త ప్రపంచమంతా మానవత్వం, దయ, జాలివంటివి వెల్లి విరియాలని ప్రచారం చేశారే తప్ప హింసకు పాల్పడాలని ఎక్కడా చెప్పలేదని అన్నారు. 'ఇది నా విశ్వాసం.. ఈ విశ్వాసం నేను నా బిడ్డలకు చెబుతాను. ఇదే విశ్వాసాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1.8బిలియన్ల ముస్లింలు పంచుకోండి' అని అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ వారసత్వం : అవగాహన, ఆధునికత అనే అంశంపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఓ పక్క భారత్, జోర్డాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగ్రవాదం, జాతి విధ్వేషంపై పోరాటానికి శంఖం పూరించిన సందర్భంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'ఉగ్రవాదంపై పోరాటం ఏ మతంపైనా కాదు.. అంతకంటే ముస్లింలపైనా కాదు.. విద్వేషం, హింసవంటి అంశాలపైనే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. కొన్ని వర్గాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి' అని అబ్దుల్లా అన్నారు. -
పశ్చిమాసియాతో బంధం కీలకం
న్యూఢిల్లీ/రమల్లా/ అమాన్: నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమాన్‌లో మోదీకి ఆ దేశ ప్రధాని హని అల్– ముల్కి ఘన స్వాగతం పలికి, ఆయన్ని రాజప్రాసాదానికి తీసుకెళ్లారు. అక్కడ మోదీకి రాజు అబ్దుల్లా–2 సాదర స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. రాజు అబ్దుల్లా–2తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని తర్వాత మోదీ అన్నారు. భారత విదేశీ సంబంధాల్లో పశ్చిమాసియాకు కీలక స్థానం ఉందని తెలిపారు. శనివారం పాలస్తీనా వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని మహ్మద్ అబ్బాస్‌తో భేటీ అవుతారు. భారత్ ప్రధాని ఒకరు పాలస్తీనాలో పర్యటించటం ఇదే ప్రథమం. అక్కడి నుంచి యూఏఈ వెళతారు. ఆ దేశ పాలకుడు, ప్రధానితోపాటు, అక్కడి భారతీయ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ఇంధన భద్రత, మౌలికరంగాల్లో యూఏఈ సుమారు 11 మిలియన్ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దుబాయ్‌లో నిర్మించిన హిందూ దేవాలయం ప్రారంభోత్సవంలో ఆదివారం పాల్గొన్న అనంతరం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తారు. అక్కడి నుంచి పర్యటనలో చివరిగా ఒమన్ చేరుకుంటారు. ఒమన్ సుల్తాన్‌తోపాటు ముఖ్యనేతలతో పాటు అక్కడి ముఖ్య వ్యాపారవేత్తలతో భేటీ అయి పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటారు. భారత్ పాత్ర కీలకం: అబ్బాస్ పశ్చిమాసియా శాంతి చర్చల్లో భారత్ కీలకపాత్ర పోషించాలని పాలస్తీనా ప్రధాని మహ్మద్ అబ్బాస్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ చారిత్రక పర్యటన సందర్భంగా ఈ విషయమై చర్చిస్తామని వివరించారు. ఇజ్రాయెల్‌తో తుది ఒప్పందం కుదిరేలా అన్ని వర్గాలతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపైనా మోదీతో మాట్లాడుతానన్నారు. బడ్జెట్‌ను ప్రజలకు వివరించండి! కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పేదలు, రైతుల అనుకూల సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. క్షేత్రస్థాయిలో ఈ పథకాలను వివరించటంలో ఎంపీలు ప్రయత్నంపైనే వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ఆధారపడి ఉంటుందన్నారు. శుక్రవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలనుద్దేశించి మోదీ మాట్లాడారు. బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించాలని.. వీటిని మరింత విస్తృతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీలకు సూచించారు. -
వివక్షలో మనమే టాప్!!
జోర్డాన్ తర్వాత భారత్‌లోనే జాతి వివక్ష అధికం - 43.5 శాతం మంది వేరే జాతి వారిని పొరుగు వారిగా సహించరు - అభివృద్ధి చెందుతున్న దేశాల సమాజాల్లో జాతి వివక్ష అధికం - అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో వివక్ష తక్కువ, సహనం ఎక్కువ - ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ వాల్యూ సర్వే’ అధ్యయనంలో వెల్లడి ► 6.20 కోట్ల మంది: జాతివివక్ష, వర్ణవివక్ష, జాతీయవాదం, సామ్రాజ్యవాదం, కుల వ్యవస్థల కారణంగా గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పాయిన మనుషుల సంఖ్య. ► 2.2 కోట్ల మంది: జాతి వివక్ష యుద్ధాలు, సంక్షోభాల కారణంగా ప్రాణభయంతో తమ ఇళ్లు వదిలి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరణార్థులుగా బతుకీడుస్తున్న మనుషుల సంఖ్య. ‘మనిషి విలువ అతడి తక్షణ గుర్తింపుకు కుచించుకుపోయింది’ అని రోహిత్ వేముల తన ఆత్మహత్య లేఖలో ప్రకటించాడు. అవును.. మనుషులు సాటి మనిషిని మనిషిగా గుర్తించడం చాలా అరుదైన విషయం అయిపోయింది. తోటి మనిషి జాతి, కులం, మతం, ప్రాంతం, లింగం, వర్ణాలను బట్టి విలువ నిర్ణయం షరా మామూలు విషయమైపోయింది. ఒక జాతిని మరొక జాతి.. ఒక కులాన్ని వేరొక కులం.. ఒక తెగను ఇంకొక తెగ.. ఒక మతాన్ని మరొక మతం.. ద్వేషించే వివక్ష ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచమంతా వర్ధిల్లుతోంది. కాకపోతే ఆ వివక్ష స్థాయిలో తేడాలున్నాయంతే. కానీ.. ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశంలోనే ఈ వివక్ష అధికంగా ఉందని ఇటీవల అంతర్జాతీయంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మనకన్నా జోర్డాన్‌లో ఇంకొంచెం ఎక్కువగా వివక్ష రాజ్యమేలుతోంది. ‘మీ పొరుగింట్లో వేరే జాతి వారు ఉండటానికి ఇష్టపడతారా?’ అన్న ప్రశ్నతో నిర్వహించిన ఆ సర్వే వివరాలు సంక్షిప్తంగా... అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే వేరే జాతుల వారి పట్ల అసహనం, జాతి వివక్షలు అత్యధికంగా ఉన్నాయని ప్రపంచ సామాజిక వైఖరుల అధ్యయనం చెప్తోంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో జోర్డాన్ ఉంటే.. రెండో స్థానంలో ఇండియా ఉంది. జోర్డాన్‌లో 51.4 శాతం మంది వేరే జాతి ప్రజల పొరుగున నివసించడానికి విముఖత వ్యక్తంచేశారు. ఆ తర్వాత భారతదేశంలో 43.5 శాతం మంది వేరే జాతి వారిని తమ పొరుగు వారిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ జాతి వివక్ష తక్కువగా ఉందని, వేరే జాతీయులను అంగీకరించే వైఖరి అక్కడ ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఇక.. వివక్షాపూరిత విధానాలతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికాలో.. వేరే జాతి వారిని తమ పొరుగు వారిగా అంగీకరించలేమన్న వారి సంఖ్య అత్యల్పంగా 3.8 శాతం మంది మాత్రమే ఉండటం విశేషం. అలాగే.. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రజల్లోనూ ఐదు శాతం కన్నా తక్కువ మంది ఇలాంటి వారు ఉన్నారు. అవి ఎక్కువ సహనశీల సమాజాలుగా తేలాయి. ‘వరల్డ్ వాల్యూ సర్వే’ పేరుతో మూడు దశాబ్దాల పాటు 80 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం వివరాలను 2013లో వెల్లడించగా.. దానిని 2016లో మళ్లీ తాజాపరిచారు. వరల్డ్ వాల్యూ సర్వే అధ్యయనం ప్రకారం ఏఏ దేశాల్లో వివక్ష శాతం ఎలా ఉందో ఈ మ్యాప్ చెప్తోంది... ► 0% నుంచి 4.9% వరకూ: అమెరికా, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, గ్వాటెమలా, బ్రిటన్, స్వీడన్, నార్వే, లాత్వియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ► 5% నుంచి 9.9% వరకూ: చిలీ, పెరూ, మెక్సికో, స్పెయిన్, జర్మనీ, బెల్జియం, బెలారస్, క్రొయేషియా, జపాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ► 10% నుంచి 14.9% వరకూ: ఫిన్లాండ్, పోలండ్, ఉక్రెయిన్, ఇటలీ, గ్రీస్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా ► 15% నుంచి 19.9% వరకూ: వెనిజువెలా, హంగరీ, సెర్బియా, రొమేనియా, మాసిడోనియా, ఇథియోపియా, ఉగాండా, టాంజానియా, రష్యా, చైనా ► 20% నుంచి 29.9% వరకూ: వరకూ: ఫ్రాన్స్ టర్కీ, బల్గేరియా, అల్జీరియా, మొరాకో, మాలి, జాంబియా, థాయ్‌లాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్ ► 30% నుంచి 39.9% వరకూ: ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, వియత్నాం, ఇండొనేసియా, దక్షిణ కొరియా ► 40% నుంచి ఆపైన: జోర్డాన్, ఇండియా (మార్చి 21వ తేదీ.. ‘జాతి వివక్షను రూపుమాపడానికి అంతర్జాతీయ దినోత్సవం’ సందర్భంగా) (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
7 వేల ఏళ్ల కిందటే నది కలుషితం
టొరాంటో: ప్రపంచంలోనే తొలిసారిగా కలుషితమైన నదిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది దాదాపు 7 వేల ఏళ్ల కిందట నియోలిథిక్ యుగానికి చెందిన మానవులు రాగి లోహాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఈ నది కలుషితమైందని భావిస్తున్నారు. దక్షిణ జోర్డాన్‌లో వడీ ఫేనాన్ ప్రాంతంలో ప్రస్తుతం ఎండిపోయిన నదీ భూతలంలో ఇది చోటు చేసుకుందని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రస్సెల్ ఆడమ్స్ పరిశోధనల్లో తేలింది. రాగిని విచక్షణారహితంగా కరిగించడం వల్ల నదీ వ్యవస్థ కలుషితమైందని ఆయన చెబుతున్నారు. రాతి యుగం చివరి దశ లేదా కాంస్య యుగం తొలి దశల్లో ఆదిమ మానవులు పనిముట్లను తయారు చేసినట్లు ఈ పరిశోధనలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ‘అప్పటి మానవులు నిప్పు, కుండలు, గనుల నుంచి తవ్వి తీసిన ముడి రాగి ద్వారా తొలిసారిగా రాగి లోహాన్ని తయారు చేశారు’ అని ఆడమ్స్ పేర్కొన్నారు. -
కళ్లజోళ్లు, బూట్లతో కుక్కలు..!
లండన్: బ్రిటీష్ ఆర్మీకి చెందిన కుక్కలకు ఇక రక్షణ కవచాలు రానున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, కళ్లజోళ్లు, బూట్లు, చెవి ప్రొటెక్టర్లను ధరించనున్నాయి. ప్రమాదకర వాతావరణంలో పనిచేసే సంరక్షణ కల్పించేందుకు మిలటరీ వర్కింగ్ డాగ్ స్వ్కాడ్రన్(ఎమ్డబ్ల్యూడీఎస్) 105 కుక్కలకు ఈ పరికరాలను అమర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జోర్డాన్‌లో జరుగుతున్న ఈ దశాబ్దంలోనే అతిపెద్ద మిలటరీ వ్యాయామాల్లో జాగీలాలకు బాడీ ఆర్మర్లను అమర్చి శిక్షణనిస్తున్నారు. పెద్ద పేలుళ్లు సంభవించినపుడు శబ్దాన్ని తట్టుకునే విధంగా ఉండేందుకు ఇయర్ ప్రొటెక్టర్లను, హెలికాప్టర్ ల్యాండింగ్స్, ఇసుక తుఫానుల్లో కళ్లను కాపాడేందుకు కళ్లజోడు, ప్రమాదకరమైన పదార్ధాల మీద, వంకరటింకర దారుల్లో నడవడానికి సైనికుల లాగా ఉండే బూట్లను జాగిలాలకు అందుబాటులోకి తెచ్చారు. మిడిల్ ఈస్ట్ నుంచి తీసుకున్న ఈ జాగిలాలను ప్రపంచంలోని అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. మొత్తం 75 రోజుల శిక్షణలో 35 కుక్కలకు సగటున 600 గ్రాముల ఆహారాన్ని అందిస్తారు. శిక్షణ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మిలటరీలో పనిచేసే జాగిలాలన్నీ శిబిరాలకు అలవాటు పడిపోతాయని వాటి సంరక్షకుడు హుడ్ చెప్పారు. ఇప్పటివరకు బ్రిటీష్ మిలటరీకు చెందిన జాగిలాలు ఉత్తర ఐర్లాండ్, బోస్నియా, కొసోవో, ఇరాక్, ఆప్ఘనిస్తాన్లలో పని చేశాయి. పేలుడు పదార్ధాలు, మారణ ఆయుధాలు, శత్రువులు సమీపిస్తున్న విషయాలను సైనికులకు అందించాయి. -
బస్సు బోల్తా : 14 మంది యాత్రికులు మృతి
అమ్మాన్ : దక్షిణ జోర్డాన్‌లో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది యాత్రికులు మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు. ఈ మేరకు మీడియా సంస్త పెట్రా గురువారం వెల్లడించింది. బుధవారం అర్థరాత్రి జోర్డాన్ నగరం మాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. అధిక వేగంతో వెళ్తున్న బస్సు వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మీడియా చెప్పింది. వీరంతా బస్సులో మక్కా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. మృతులంతా పాలస్తీనీయన్లని తెలిపింది. -
జోర్డాన్‌లో మహాత్ముడి పేరిట వీధి
అమ్మన్: ప్రపంచానికి అహింస, సత్యాగ్రహమనే గొప్ప అస్త్రాలను అందించిన మహాత్మాగాంధీ సేవలను స్మరిస్తూ జోర్డాన్ రాజధాని అమ్మన్లో ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. జోర్డాన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ఈ వీధిని ఆవిష్కరించారు. ఈజిప్షియన్ ఉద్యమ నాయకుడు సద్జగ్లౌల్ స్ట్రీట్‌లోని కొంత భాగానికి గాంధీ స్ట్రీట్‌గా నామకరణం చేశారు. భారత్‌లో శాంతి కోసం జరిగిన పోరాటానికి, ఈ వీధికి చారిత్రక సంబంధముందని, అందుకే ఈ స్ట్రీట్‌కు గాంధీ పేరును పెట్టామని అమ్మన్ మేయర్ అఖెల్ బెల్ తాగి తెలిపారు. సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా భారత్‌లో గాంధీ ఉద్యమించే సమయంలోనే, ఇక్కడ సద్జాగ్లౌల్ కూడా పోరాడారని, భారత్ కన్నా ఒక సంవత్సరం ముందే 1946లో జోర్డాన్ కు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తుచేశారు. -
‘రేప్ సర్వైవర్’ జోర్డాన్ మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా గర్జించి మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నులో దడ పుట్టించిన సుజెట్టే జోర్డాన్ గళం మూగబోయింది. ‘పార్క్ స్ట్రీట్ రేప్ విక్టమ్’గా ముద్రపడిన 40 ఏళ్ల జోర్డాన్ మూడు రోజుల క్రితం అనారోగ్యం వల్ల నగరంలోని ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం ఉదయం ఆమె మరణించినట్టు నగర జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) పల్లబ్ కాంతి ఘోష్ తెలియజేశారు. ఆమె శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినడం వల్ల ఆమె చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అంతకుమించి వివరాలు వారు వెల్లడించలేదు. 2012, ఫిబ్రవరి ఆరో తేదీన జోర్డాన్‌ను ఐదుగురు మృగాలు తుపాకీతో బెదిరించి కారులో ఎక్కించుకొని నడుస్తున్న కారులోనే ఆమెపై అత్యాచారం జరపడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్క్ స్ట్రీట్‌లో ఆమెపై అత్యాచారం జరిగినందున ‘పార్క్ స్ట్రీట్ రేప్ విక్టిమ్’గా ఆమెకు ముద్రపడింది. ఆమెపై జరిగిన అత్యాచార సంఘటన పట్ల అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగగా, ‘అదంతా ఓ కట్టుకథ’ అంటూ మమతా బెనర్జీ కొట్టివేశారు. ఓ వేశ్య, విటుల మధ్య జరిగిన గొడవ కారణంగా రేప్ జరిగిందంటూ తృణమూల్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మహిళా, మానవ హక్కుల సంఘాల కార్యకర్తలను ఉద్యమబాట పట్టించాయి. దాంతో సమగ్ర దర్యాప్తునకు మమతా బెనర్జీ దిగిరాక తప్పలేదు. ఆ కేసులో ఐదుగురు నిందితులకుగాను ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సహా మరో నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఆ తర్వాత కూడా బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై రేప్‌లు కొనసాగడంతో 2013లో సుజెట్టే జోర్డాన్ మీడియా ముందుకు వచ్చి తన పేరు వివరాలను బయటబెట్టారు. ఇద్దరు పిల్లలు కలిగిన ఆమె రేప్ జరిగినప్పటి నుంచి ఉద్యోగం కోసం ఏడాదిపాటు ఎన్ని కష్టాలు అనుభవించింది వివరించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ఎన్జీవో సంస్థలతో కలిసి ఎన్నో ఆందోళనలు చేశారు. రేప్ బాధితుల కోసం ఓ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేసి జరిగిన సంఘటనకు కృంగిపోకుండా సమాజాన్ని ఎదురించి ఎలా బతకాలో కౌన్సిలింగ్ చేస్తూ వచ్చారు. ‘రేప్ విక్తిమ్’గా సంబోధిస్తే ఆమె అంగీకరించేవారు కాదు. ‘రేప్ సర్వైవర్’గా పిలవాలని సూచించేవారు. -
ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్
అమ్మన్: తమ దేశ పైలట్‌ను సజీవంగా దహనం చేసిన ఐఎస్ ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం ఉదయం ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. వీరిలో ఇరాక్‌కు చెందిన మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు సాజిద అల్ రిషావి(44), అల్‌ఖైదా సభ్యుడు జియాద్ అల్ కర్బోలి ఉన్నారు. రాజధాని అమ్మన్‌కు దక్షిణంగా ఉన్న స్వాకా జైలులో ఇస్లామిక్ న్యాయ అధికారి ఆధ్వర్యంలో ఉరిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2005లో అమ్మన్లో చోటుచేసుకున్న ఘోర దాడుల్లో భాగస్వామ్యం ఉండటంతో రిషావికి, ఉగ్రవాద ఆరోపణలతో పాటు ఇరాక్‌లో ఓ జోర్డాన్ జాతీయుడిని చంపినందుకు 2007లో కర్బోలికి మరణ శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పైలట్‌ను సజీవ దహనం చేయడాన్ని అమెరికా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. ఈ చర్య ఐఎస్ఐఎస్ క్రూరత్వానికి నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. -
ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్
అమన్: ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ ఆధీనంలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. అంతే కాకుండా తీవ్రవాదానికి సంబంధించిన ఏ అంశంలోనైనా పట్టుబడ్డ వారిని ఉరి తీస్తామని జోర్డాన్ ప్రభుత్వం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీచేసింది. 2013 డిసెంబర్లో సిరియాలోని రక్కా సమీపంలో నిర్బంధించిన జోర్డాన్ పైలట్ మోజ్ అల్ - కసస్ బెహ్ను ను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా చంపారు. ఒక బోనులో నిలబెట్టి మంటలు అంటించి సజీవదహనం చేశారు. ఇస్లామిక్ స్టేట్ మంగళవారం ఈ వీడియో దృశ్యాలను విడుదల చేసింది. కాగా పైలట్‌ను విడిపించేందుకు తమ వద్ద బందీగా ఉన్న ఐఎస్ఐఎస్ మహిళా నేతను విడుదల చేస్తామని జోర్డాన్ చెప్పినా కూడా ఉగ్రవాదులు పైలట్‌ను పొట్టన పెట్టుకున్నారు. -
జోర్డాన్
నైసర్గిక స్వరూపం ఖండం: ఆసియా, వైశాల్యం: 89,342 చదరపు కిలోమీటర్లు, జనాభా: 66,55,000 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: అమ్మాన్, ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, కరెన్సీ: దీనార్, భాషలు: అరబ్బీ, ఇంగ్లిష్, మతం: 98 శాతం ముస్లిములు, ఒక శాతం క్రైస్తవులు, ఒక శాతం అమెరికన్స్, వాతావరణం: జనవరి ప్రాంతంలో 4 నుండి 12 డిగ్రీలు, ఆగస్ట్ ప్రాంతంలో 18 నుండి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, సరిహద్దులు: సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాక్, స్వాతంత్య్ర దినోత్సవం: 1946, మే 25. పరిపాలనా పద్ధతి- ప్రజలు జోర్డాన్ దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 12 భాగాలుగా విభజించారు. ఈ భాగాలను గవర్నరేట్లు అని అంటారు. అవి ఇర్బిడ్,అజ్లేన్, జెరాంశ్, మఫ్రాక్, బల్కా, అమ్మాన్, జర్కా, మడాబా, కరక్, తఫిలా, మాన్, అఖాబా, స్థానిక జోర్డానియన్లు గ్రామాల్లో ఉంటారు. వారిని బెడోయిన్లు అంటారు. వీళ్లు దేశ తూర్పు భాగంలో అధికంగా ఉంటారు. వీరు దేశమంతటా తిరుగుతూ ఉంటారు. మగవాళ్లు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. సాధారణంగా మగవాళ్లే పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటికే పరిమితమై ఉంటారు. ఇప్పుడు యువతులు కాలేజీ చదువులకు వెళ్లడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలో మత దూషణలు ఉండవు. అన్ని మతాలూ కలసికట్టుగా ఉంటాయి. ముస్లిములు విధిగా రోజుకు అయిదుసార్లు మసీదుల్లో ప్రార్థన చేస్తారు. రంజాన్ మాసంలో పగలు అసలు హోటళ్లే తెరిచి ఉంచరు. చరిత్ర ఈ ప్రాంతాన్ని క్రీస్తుపూర్వం 1300 నుండి టర్కీ దేశపు ఓట్టోమాన్ రాజవంశం పరిపాలిస్తూ వచ్చింది. దేశంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం కావడం వల్ల అప్పటి రాజులు ఆ ఎడారిలోని రాతి గుట్టలు, పర్వతాలను చెక్కి భవనాలను నిర్మించారు. ప్రస్తుత పెట్రా ప్రాంతంలో రాతిని తొలచి భవంతులు కట్టిన అప్పటి శిథిలాలు నేటికీ చెక్కుచెదరని రీతిలో కనిపిస్తాయి. భూగర్భంలో విశాలమైన భవన సముదాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశాలు విదేశీ పర్యాటకులకు, గత చరిత్ర ఆధారంగా తీసే అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లకు చక్కని ప్రదేశంగా మారిపోయింది. 1923లో జోర్డాన్ దేశం ఏర్పడి, 1946 దాకా ఆంగ్లేయుల సంరక్షణలో ఉండింది. 1946లో పూర్తి స్వాతంత్య్రం పొంది జోర్డాన్ రాజ్యంగా ఆవిర్భవించింది. దాదాపు 30 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ‘కింగ్ హుస్సేన్’ ఆధ్వర్యంలో ఈ దేశం ఆధునిక జోర్డాన్‌గా రూపొందింది. పంటలు- పరిశ్రమలు: జోర్డాన్‌లో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. ముఖ్యంగా టమోటా, గుమ్మడి, నిమ్మ, అరటిపళ్లు అధికంగా పండిస్తారు. దేశంలో పొటాష్, ఫాస్పేట్ గనులు ప్రముఖమైనవి. వీటిని తవ్వి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. దేశ ఆదాయంలో 26 శాతం ఆదాయం ఈ ఎగుమతుల ద్వారా లభిస్తుంది. మందుల తయారీ, సిమెంటు, వస్త్రపరిశ్రమ, ఎరువుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. మఫ్రాక్ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. అయితే నీరు, విద్యుచ్ఛక్తి కొరత తీవ్రంగా ఉండడం వల్ల సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కావడం లేదు. సంస్కృతి-వస్త్రధారణ: జోర్డాన్ ముస్లిం దేశం. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ మిగతా దేశాల్లో ఉన్న ముస్లిముల మాదిరిగానే ఉంటుంది. బిగుతుగా ఉండే దుస్తులు, స్లీవ్‌లెస్, కురచ దుస్తులు ధరించడం నిషేధం. మహిళలు చీరలు, పంజాబీ డ్రస్సులు తొడిగినా పై నుండి కింది వరకు లిబిస్ లేదా జిల్బాబ్ అనే పేరున్న పొడవాటి పై తొడుగు వేసుకుంటారు. వెంట్రుకలు, తల కనబడకుండా స్కార్ఫ్ ధరిస్తారు. మగవాళ్ళు షర్టు, ప్యాంటు ధరిస్తారు. నమాజు వేళల్లో తలకు టోపీ ధరించడం తప్పనిసరి. తలపాగా చుట్టుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. మగవాళ్ళు తలకు ధరించే వస్త్రాన్ని కఫియ్యే అంటారు. ఆహారం: జోర్డానియన్లు తినే భోజనాన్ని మెజ్జె అంటారు. ఆహారంలో బ్రెడ్డు, సలాడ్ తప్పనిసరిగా తీసుకుంటారు. అలాగే పేస్ట్రీలు ఎక్కువగా తింటారు. దేశీయ భోజనాన్ని మస్సాఫ్ అంటారు. ఇది గొర్రెమాంసం, యోగర్ట్‌తో కూడి ఉంటుంది. కోడిమాంసం బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు కలిపి తయారుచేసే పదార్థాన్ని సనియత్ దజాజ్ అంటారు. బియ్యం, కూరగాయలు, మాంసంతో కాసరోత్ తయారు చేస్తారు. దీనిని మక్లుబా అంటారు. మొక్కజొన్న పిండితో కరదీశ్ అనే బ్రెడ్ తయారుచేస్తారు. దేశంలో మద్యపానం నిషేధం కాబట్టి ఇక్కడి ప్రజలు సాధారణంగా పాలు, కాఫీ, నిమ్మరసం, ఆప్రికాట్ రసం వంటి పానీయాలు తీసుకుంటారు. చూడాల్సిన ప్రదేశాలు 1. అమ్మాన్: ఏడు వేల సంవత్సరాల చరిత్ర గల ఈ నగరం ఏడుకొండల మీద నిర్మితమైంది. ఇక్కడ పూర్వం రాజభవనాలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే బైజాంటియన్బ్రాసిలికా అనే నిర్మాణం ఉంది. దీనిని 6వ శతాబ్దంలో నిర్మించారని అంచనా. ఆ కాలంలో ప్రజలకు ఇది హెర్క్యులస్ దేవుని మందిరం. ఇప్పుడు దీనిని గ్రేట్ టెంపుల్ ఆఫ్ అమ్మాన్ అంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే జోర్డాన్ పురాతన మ్యూజియం ఉంది. ఇక్కడికి కొద్దిదూరంలో రోమన్ ఆంఫిథియేటర్ (ఆరుబయలు రంగస్థలం) ఉంది. దీనిని ఒకటవ శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరంలోనే 1924లో నిర్మించినకింగ్హుస్సేన్ మసీదు ఉంది. అమ్మాన్ నగరానికి సమీపంలో సాల్ట్ అనే పురాతన నగరం ఉంది. ఇక్కడికి సమీపంలో బానిసల భవనాలు, శిథిలమైన రాజ గృహాలు ఉన్నాయి. 2. జోర్డాన్ వ్యాలీ: జోర్డాన్లోయ దేశంలోనే ఎంతో ప్రముఖమైంది. ఇది దేశానికి పశ్చిమభాగంలో ఉంది. గ్రేట్ రిఫ్ట్వ్యాలీలో ఇదొక భాగం. ఈ ప్రదేశంలో ఒక భాగాన్ని ఘోర్ అని అంటారు. ఇక్కడే జోర్డాన్ నది ప్రవహిస్తోంది. ఈ నది సిచేరియస్ సరస్సులో కలుస్తుంది. సముద్ర మట్టానికి 212 మీటర్ల దిగువన ఉండే ఈ సరస్సు మృతసముద్రం (ఈ్ఛ్చఛీ ్ఛ్చ)లో కలుస్తుంది. పదివేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 తర్వాత ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇదే వెస్ట్బ్యాంక్గా రూపాంతరం చెందింది. జీసస్ క్రీస్తు ఈ జోర్డాన్ నదీతీరంలో బెతాని అనే ప్రాంతంలోనే బాప్టిజమ్ తీసుకున్నాడని బైబిల్ చెబుతోంది. ప్రత్యేక సంరక్షణలో ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటకులు చూడవచ్చు. ఇక్కడ ఉన్న మృతసముద్రం 75 కిలోమీటర్ల పొడవు, 6 నుండి 16 కిలోమీటర్లు వెడల్పు ఉంది. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉండడం వల్ల వస్తువులు మునగవు, మనుషులు మునిగిపోరు. 3. మడాబా: మడాబా ఒక పురాతన నగరం. ఇది రాజధాని అమ్మాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం గురించి బైబిల్లో వర్ణన ఉంది. ఆ కాలంలో దీనిని మెడాబా అనేవారు. బైజాంటియన్ రాజుల కాలంలో గొప్ప నిర్మాణాలు చేశారు. ముస్లిం, క్రైస్తవ మత సంబంధమైన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. పాలరాతి పలకలు ఇప్పటికీ నగరంలో అక్కడక్కడా దర్శనమిస్తాయి. క్రీస్తుశకం 747లో వచ్చిన భూకంపం కారణంగా ప్రజలంతా ఇతర ప్రదేశాలకు వలస పోయారు. ఇక్కడి సెయింట్ జార్జ్ చర్చి నగరం మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మడాబా మ్యూజియం ఈ చర్చ్ సమీపంలో ఉంది. చర్చ్ ఆఫ్ అపోసిల్స్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో మౌంట్నెబో ఉంది. బైబిల్ గ్రంథంలో దీనిపేరు పిస్గాత. ఈ పర్వతానికి రెండు శిఖరాలు ఉన్నాయి. ఒకదానిని సియాగా అని, రెండోదానిని ముఖాయట్ అంటారు. ఇక్కడి భవనాల ముందుభాగంలో ఉన్న సర్పిలాకార శిలువ ప్రత్యేక అకర్షణగా నిలుస్తుంది. 4. పెట్రా: మొత్తం దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం పెట్రా. మృత సముద్రానికి దక్షిణ ప్రాంతంలో నిర్మితమైన ఈ రాతినగరం ఇప్పటికీ నిర్మాణపరంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు నెబాటియన్లకు-అరబ్బులకు ఇది రాజధాని నగరం. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ రాతినగరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం ఒక గొప్ప విషయం. రాతి కొండలను తొలిచి భవనాలుగా మలిచిన తీరు ప్రశంసనీయం. ఈ భవనాలు దాదాపు 200 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఇటీవలి కాలం వరకూ ఈ రాతి భవనాలను బెడోయిన్లు నివాస భవనాలుగా ఉపయోగించుకున్నారు. ఇవి రాజధానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్రా చుట్టుపక్కల ఓ బలిస్క్ టోంచ్, అల్ఖజ్నే, రోమన్ల ఆంఫిథియేటర్, రాయల్ టోంచ్లు, టెమెనస్ గేట్ వే పెట్రాచర్చ్, అల్ దీర్, సిక్ అల్ బారెద్ ఇలా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. 1812లో ఈ ప్రాంతాన్ని జోహన్ లుడ్విగ్ అనే చరిత్రకారుడు నవీన ప్రపంచానికి పరిచయం చేశాడు. -
చావు సీను షూటింగ్ లో చనిపోయిన నటుడు
జోర్డాన్ కి చెందిన ఒక నటుడు చావు సీనులో నటిస్తూ నటిస్తూ చనిపోయాడు. తోటి నటులందరూ 'ఈయన నటనలో జీవించేస్తున్నాడురోయ్' అనుకున్నారే కానీ ఆయన నటనలో మరణిస్తున్నాడని గుర్తించలేకపోయారు. ఒక టీవీ సీరియల్ షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. జోర్డాన్ లో చాలా పాపులర్ టీవీ నటుడిగా పేరొందిన మహ్మూద్ అల్ సవాల్కా శుక్రవారం చావు సీను షూటింగ్ లో పాల్గొన్నాడు. చివరికి ఆ సీన్ లో ఆయన చనిపోవాలి. ఆఖరి సీన్ లో ఆయన నిజంగానే ఒరిగిపోయాడు. అందరూ అది నటనే అనుకున్నారు. కానీ కాసేపయ్యాక కానీ ఆయన ఆఖరి శ్వాస వదిలేశాడన్న విషయం వారికి అర్థం కాలేదు. దాంతో వారంతా షాక్ కి గురయ్యారు. అతని ఎదురుగా నిలుచుని ఇంకో పాత్రను పోషిస్తున్న ముంధీర్ రిహానె అనే నటుడు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. సవాల్కా చివరి డైలాగు 'నేను చనిపోతాను. నన్ను నీ చేతుల తోనే పాతిపెట్టు.' ఆయన మరణానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
చర్చకని పిలిస్తే.. ఇలా రచ్చ చేశారు..!
-
చర్చ కాస్తా రచ్చగా మారిందిలా..!