చావు సీను షూటింగ్ లో చనిపోయిన నటుడు | Actor dies while enacting death scene | Sakshi
Sakshi News home page

చావు సీను షూటింగ్ లో చనిపోయిన నటుడు

Published Fri, May 9 2014 4:54 PM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

చావు సీను షూటింగ్ లో చనిపోయిన నటుడు - Sakshi

చావు సీను షూటింగ్ లో చనిపోయిన నటుడు

జోర్డాన్ కి చెందిన ఒక నటుడు చావు సీనులో నటిస్తూ నటిస్తూ చనిపోయాడు. తోటి నటులందరూ 'ఈయన నటనలో జీవించేస్తున్నాడురోయ్' అనుకున్నారే కానీ ఆయన నటనలో మరణిస్తున్నాడని గుర్తించలేకపోయారు.  ఒక టీవీ సీరియల్ షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. 
 
జోర్డాన్ లో చాలా పాపులర్ టీవీ నటుడిగా పేరొందిన మహ్మూద్ అల్ సవాల్కా శుక్రవారం చావు సీను షూటింగ్ లో పాల్గొన్నాడు. చివరికి ఆ సీన్ లో ఆయన చనిపోవాలి. ఆఖరి సీన్ లో ఆయన నిజంగానే ఒరిగిపోయాడు. అందరూ అది నటనే అనుకున్నారు. కానీ కాసేపయ్యాక కానీ ఆయన ఆఖరి శ్వాస వదిలేశాడన్న విషయం వారికి అర్థం కాలేదు. దాంతో వారంతా షాక్ కి గురయ్యారు. అతని ఎదురుగా నిలుచుని ఇంకో పాత్రను పోషిస్తున్న ముంధీర్ రిహానె అనే నటుడు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. సవాల్కా చివరి డైలాగు 'నేను చనిపోతాను. నన్ను నీ చేతుల తోనే పాతిపెట్టు.' ఆయన మరణానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement