sawalqa
-
ఇలాంటి ఇళ్లు చూపిస్తే రాజీనామా చేస్తా
రామచంద్రాపురం (పటాన్చెరు): సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పేదల కోసం ఇలాంటి ఆధునిక ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా తానే తీసుకెళ్లి ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను చూపించానని తలసాని చెప్పారు. కానీ ఈ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదన్నట్లు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వివేకానికే వదిలేశానని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నరేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముం టే హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌నేత రాహుల్‌గాందీకి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్‌గాంధీ పెద్దపెద్ద ప్రకటనలు చేయడం కాదని, బరిలోకి దిగి తనతో తలపడాలని ఒవైసీ సూచించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ దారుసలాం మైదానంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీమసీదు కూల్చివేశారని, పునరుద్ధరణ జరగలేదని, అదే తెలంగాణ సచివాలయంలో మసీదు కూలి్చవేసినా, తిరిగి పునరుద్ధరించారని గుర్తు చేశారు. లోక్‌సభలో బీఎస్పీకి చెందిన ఓ ముస్లిం ఎంపీని బీజేపీ ఎంపీ మతపరంగా అవమానపర్చేవిధంగా దూషణలు చేశారని, పార్లమెంటులో ముస్లిం సభ్యుల హత్యలకు పాల్పడేరోజు ఎంతో దూరంలో లేనట్టు కనిపిస్తోందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సబ్‌కాసాత్..సబ్కావికాస్ ఎక్కడ ఉందని, ఆయన ఒక్కమాట కూడా మాట్లాడరని విమర్శించారు. మజ్లిస్ మహిళాబిల్లుకు వ్యతిరేకం కాదని, అందులో వెనుకబడిన తరగతుల మహిళల రిజర్వేషన్ కోసమే వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు. బరిలో లేని స్థానాల్లో బీఆర్ఎస్కు మద్దతు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్కు సహకరించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఏ మాత్రం సహకరించొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో అల్లర్లు జరిగాయని, అలాంటి ఘటనలు ప్రస్తుత బీఆర్ఎస్ పాలనలో లేవన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. -
చావు సీను షూటింగ్ లో చనిపోయిన నటుడు
జోర్డాన్ కి చెందిన ఒక నటుడు చావు సీనులో నటిస్తూ నటిస్తూ చనిపోయాడు. తోటి నటులందరూ 'ఈయన నటనలో జీవించేస్తున్నాడురోయ్' అనుకున్నారే కానీ ఆయన నటనలో మరణిస్తున్నాడని గుర్తించలేకపోయారు. ఒక టీవీ సీరియల్ షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. జోర్డాన్ లో చాలా పాపులర్ టీవీ నటుడిగా పేరొందిన మహ్మూద్ అల్ సవాల్కా శుక్రవారం చావు సీను షూటింగ్ లో పాల్గొన్నాడు. చివరికి ఆ సీన్ లో ఆయన చనిపోవాలి. ఆఖరి సీన్ లో ఆయన నిజంగానే ఒరిగిపోయాడు. అందరూ అది నటనే అనుకున్నారు. కానీ కాసేపయ్యాక కానీ ఆయన ఆఖరి శ్వాస వదిలేశాడన్న విషయం వారికి అర్థం కాలేదు. దాంతో వారంతా షాక్ కి గురయ్యారు. అతని ఎదురుగా నిలుచుని ఇంకో పాత్రను పోషిస్తున్న ముంధీర్ రిహానె అనే నటుడు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. సవాల్కా చివరి డైలాగు 'నేను చనిపోతాను. నన్ను నీ చేతుల తోనే పాతిపెట్టు.' ఆయన మరణానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.