ఉమాన్: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పలువురు దుండగులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనంతరం దుండగులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగాముగ్గురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది.
కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామని,ఎంబసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. ఎంబసీ సమీపంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ప్రాంతంలో పలుమార్లు నిరసనలు జరిగాయని పోలీసులు తెలిపారు.
2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చొరబడి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను హత్య చేయడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 44 వేల మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా చెబుతోంది. కాగా మరోవైపు ఇజ్రాయెల్,లెబనాన్ మధ్య కాల్పుల విరమణ కోసం కొద్ది కాలంగా చర్చలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్ ఆసక్తికర ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment